Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ అష్టాదశాధిక త్రిశతతమో7ధ్యాయః

అథ గణపూజా

ఈశ్వర ఉవాచ :

విశ్వరూపం తముద్ధృత్య తేజస్యుపరి సంస్థితమ్‌ | నరసింహం తతో7ధస్తాత్కృతాన్తం తదధోన్యసేత్‌. 1

ప్రణవం తదధః కృత్వా ఊహకం తదధః పునః | ఆంశుమాన్విశ్వ మూర్తిస్థం కంఠోష్ఠ ప్రణవాదికమ్‌. 2

నమో7న్తః స్యాచ్చతుర్వర్ణో విశ్వరూపంచ కారణమ్‌ |

సూర్యమాత్రాహతం బ్రహ్మణ్యంగానీహతుపూర్వవత్‌. 3

ఉద్ధరేత్ర్పణవం పూర్వం ప్రస్పురద్ద్వయ ముచ్చరేత్‌ | ఘోర ఘోరతరం పశ్చాత్తత్ర రూపమతఃస్మరేత్‌. 4

చట శబ్దం ద్విధా కృత్వా తతః ప్రణవ ముచ్చరేత్‌ | దహేతి చ ద్విధాకార్యం వమేతి చ ద్విధామతమ్‌. 5

ఘాతయేతి ద్విధాకృత్యహూం ఫడన్తం సముచ్చరేత్‌ |

అఘోరాస్త్రంతు నేత్రం స్యాద్గాయత్రీ చోచ్యతే7ధునా. 6

తన్మ హేశాయ విద్మ హే మహాదేవాయ ధీమహి | తన్న ః శివః ప్రచోధయాద్గాయత్రీ సర్వసాధనీ. 7

ఈశ్వరుడు పలికెను. పైన తేజస్సు (ర) కల విశ్వరూపమును (హు) ఉధృతము చేసి నరసింహము (క్షు) కింద కృతాంతము (య్‌) వుంచవలెను. దానిచివవ్రణవమ్ము చేర్చవలెను. రిహ్‌ క్ష్‌మోం ఏర్పడినది. దీని పిమ్మట ఊహకము (ఊ) అంశమత్‌ను (ం) విశ్వమును (హ) కలుపవలెను. (హూం) ఇవి రెండును వరసగ అంతస్థము కంఠ్యోష్టము చెప్పబడును. దీని అంతమున నమః చేర్చుటచే రెండు మంత్రములన నాలుగు అక్షరము కలవపును. విశ్వరూపము కారణమని చెప్పబడినది. దానిని పండ్రెండ్రు మాత్రలచే గుణితము చేయవలయును. ఈ పండ్రెండులో ఐదు హ్రస్వబీజములతో ఈశానాది పంచ బ్రహ్మమూర్తులను పూజించి దీర్ఘాత్మకములగు ఆరు బీజములతో వెనుకటి వలెనే అంగన్యాసము చేయవలెను. హ్రీం వ్రాసి పిదప స్ఫురస్ఫుర వ్రాయవలెను. పిదప ఆరెండింటికిని ప్రచేర్చవలెను. పిదప ఆరెండింటికిని ప్రచేర్చవలెను. పిదప ''కః'' వమ'' ''బంధ'' ఈ మూడు పదములను రెండేసి పర్యాయములు వ్రాసి పిదప ఘాతయ యనునది వ్రాసి అంతమున హుంఫట్‌ చేర్చవలెను. ఇది అఘోరాస్త్ర మంత్రము. ఇపుడు శివగాయత్రి చెప్పబడుచున్నది. ''మహేశాయ విద్మహే మహాదేవాయ ధీమహితన్నః శివః ప్రచోదయాత్‌'' ఈ శివగాయత్రి సకల ఫలప్రదము.

యాత్రాయాం విజయాదౌచ యజేత్పుర్వంగణంశ్రియే | తుర్యాంశే తుపురాక్షేత్రే సమంతాదర్కభాజితే. 8

చతుష్పదం త్రికోణతు త్రిదలం కమలం లిఖేత్‌ | తత్పృష్ఠే పదికావీథీ భాగిత్రిదళమశ్వయుక్‌. 9

వసుదేవ సుతైః సాబ్జైస్త్రిదలైః పాదపట్టికాః | తదూర్ద్వే వేదికాదేయా భాగమాత్ర ప్రమాణతః. 10

ద్వారం పద్మమితం కోష్ఠాదుపద్వారం వివర్ణితమ్‌ | ద్వారోపద్వార రచితం మండలం విఘ్నసూదనమ్‌. 11

అరక్తం కమలం మధ్యే బాహ్య పద్మాని తద్బహిః | సితాతు వీథికాకార్యా ద్వారాణితు యథేచ్ఛయా. 12

కర్ణికాపీతవర్ణాస్యాత్కే సరాణి తథాపునః | మండలం విఘ్నమర్ధాఖ్యం మధ్యే గణపతిం యజేత్‌. 13

నామాద్యం సవరాకం స్యాద్ధేవాచ్ఛక్ర సమన్వితమ్‌ |

శిరోహతం తత్పురుషేణ ఓమాద్యంచ నమో7న్తకమ్‌. 14

గజాస్యం గజశీర్షంచ గాంగేయం గణనాయకమ్‌ | త్రిరావర్తం గగనగం గోపతిం పూర్వపంక్తిగమ్‌. 15

యాత్రయందును, విజయాది కార్యములందు శ్రీలాభము నిమిత్తమై ముందు గణపూజ చేయవలెను. చతురస్ర క్షేత్రమును అన్నివైపుల పండ్రెడేసి కోష్టములలో విభజించవలెను. మధ్యనున్న నాలుగు పదములలో త్రికోణము రచించి దాని మధ్య త్రిదళకమలము వ్రాయవలెను. దాని పృష్ఠమున పథిక వీథి భాగములందు మూడు దళములతో అశ్వయుక్తకమలము ఏర్పరుపవలయును. పిదప వసుదేవ పుత్రులతో (వాసుదేవ సంకర్షణ గద) ప్రకాశించుచున్న త్రిదళ కమలముతో పాద పట్టికను నిర్మించవలెను. దానిపై భాగ ప్రమాణముచే ఒక వేది రచించవలెను. పూర్వాది దిశలందు ద్వార కోణభాగములతో ఉపద్వార మెర్పరచినచో ఆమండలము విఘ్ననాశకమగును. మధ్యనున్న కమలము దాని వెలుపలవున్న కమలములు అరక్తవర్ణములై వుండవలెను. వీథిశ్వేత వర్ణమై వుండవలెను. ద్వారము రంగు ఇష్టము వచ్చినట్లు వుండవచ్చును. కర్ణికను పీతవర్ణముతోను కేసరములు కూడ ఆదేవర్ణములోను వుండవలెను. దీనికి విఘ్నవర్ణ మండలమని పేరు. దీనిమధ్యభాగమున గణపతిని పూజించవలెను. నామాద్య క్షరమును అను స్వారసహితముగ పలికి ఆది యందు ఓం అంతమునందు నమః చేర్చవలెను. హ్రస్వాన్త బీజయుక్తములగు ఈశాన తత్పురుషాది మంత్రములతో బ్రహ్మ మూర్తులను పూజించి దీర్ఘాంత బీజములతో అంగన్యాసము చేయవలెను. ఆమండలము యొక్క పూర్వదిక్కు యందున్న పంక్తి యందు, గజ గజశీర్ష గాంగేయ, గణవాయక, గగ, నగ, గోపతియను పేర్లు వ్రాయవలెను. చివరిరెండు పేర్లను మూడేసి పర్యాయములు వ్రాయవలెను.

విచిత్రాంశం మహాకాయం లంబోష్ఠం లంబకర్ణకమ్‌ | లంబోదరం మహాభాగం వికృతం పార్వతీ ప్రియమ్‌.

భయావహం చ భద్రంచ భగణం భయసూదనమ్‌ | ద్వాదశైతే దశపంక్తౌ దేవత్రాసంచ పశ్చిమే. 17

మహానాదం భాస్వరంచ విఘ్నరాజం గణాధిపమ్‌ | ఉద్భటస్వాన భశ్చండౌ మహాశుండంచ భీమకమ్‌. 18

మన్మథం మధుసూదనంచ సుందరం భావపుష్టకమ్‌ |

సౌమ్యే బ్రహ్మేశ్వరం బ్రాహ్మం మనోవృత్తించ సంలయమ్‌. 19

లయం దూత్య ప్రియం లౌల్యం వికర్ణం వత్సలం తథా |

కృతాంతం కాలదండంచ యజేత్కుంభంచ పూర్వవత్‌. 20

అయుతంచ జపేన్మంత్రం హోమయేత్తు దశాంశతః | శేషాణాంతు దశాహూత్యా జపాద్ధోమన్తు కారయేత్‌. 21

పూర్ణాం దత్త్వా7భిషేకంతు కుర్యాత్సర్వంతు సిద్ధ్యతి| భోగో7శ్వగజవస్త్రాద్యైర్‌ గురుపూజాంచరేన్నరః.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే గణ పూజా నిరూపణం నామాష్టాదశాధిక త్రిశతతమో7ధ్యాయః.

విచిత్రాంశ, మహాకాయ, లంబోష్ఠ లంబకర్ణ లంబోదర, మహాభాగ, వికృత, పార్వతీ ప్రియ, భయావహ, భద్ర భగణ, భయసూదన, యను పండ్రెండు నామములు దక్షిణ దిక్పంక్తి యందు వ్రాయవలెను. పశ్చిమమున దేవత్రాస మహానాద భాసుర, విఘ్నరాజ, గణాధిప ఉద్భట స్వన ఉద్భశుండ, భీమ, మన్మథ, మధుసూదన సుందర భావ పుష్ట యను పేర్లులును. ఉత్తరమున బ్రహ్మేశ్వర బ్రాహ్మ మనోవృత్తి సంలయ, లయ, నృత్య ప్రియలోల, వికర్ణ, వత్సల కృతాంత, కాలదండ, కుంభ, యను పేర్లను వ్రాసి అన్నింటిని పూజించవలెను. పదివేల జపము చేసి దశాంశ హోమము చేయవలెను. మిగిలిన మంత్రములను పదేసి పర్యాయములు జపించి ఒక్కొక్క హోమము చేయవలెను. సకల మనోరథములు సిద్ధించును. గురువునకు, భూగో, అశ్వ, గజ వస్త్రాదులు ఇచ్చి పూజించవలెను.

అగ్ని మహాపురాణమున గణ పూజా నిరూపణమున మూడు వందల పదునెనిమిదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page