Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏకోనవింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః
అథ వాగీశ్వరీ పూజా
ఈశ్వర ఉవాచ :
వాగీశ్వరీ పూజానంచ ప్రవదామి సమండలమ్ | ఊహకం కాల సంయుక్తం మనుం వర్ణ సమాయుతమ్. 1
నిషాద ఈశ్వరం కార్యం మనుమా చంద్ర సూర్యవత్ |
అక్షరస్య హి దేయం స్యాద్ధ్యాయేత్కుంటేందు సన్నిభామ్. 2
పంచాశద్వర్ణ మాలాంతు ముక్తాస్రగ్దామ భూషితామ్ | వరదా భయాక్ష సూత్ర పుస్తకాఢ్యాం త్రిలోచనామ్.
లక్షం జపేన్మస్త కాంతం స్కంధాన్తం వర్ణమాలికామ్ | అకారాది క్షకారాన్తాం విశన్తీం మానవఃస్మరేత్. 4
కుర్యాద్గురుశ్చ దీక్షార్థం మంత్ర గ్రాహేతు మండలమ్ |
సూర్యాగ్ని మిందు భక్తంతు భాగాభ్యాం కమలం హితమ్. 5
వీథికా పదికా కార్యాపద్మాన్యష్టౌ చతుష్పదే | వీథికా పదికా బాహ్యే ద్వారాణి ద్విపదానితు. 6
ఉపద్వారాని తద్వచ్చ కోణబంధం ద్విపట్టికమ్ | సితాని నవపద్మాని కర్ణికా కనకప్రభా. 7
కేసరాణి విచిత్రాణి కోణాన్రక్తేన పూరయేత్ | హోమరేఖాన్తరం కృష్ణం ద్వారాణీన్ద్రే భమానతః. 8
మధ్యేసరస్వతీం పద్మే వాగీశీం పూర్వపద్మకే | హృల్లేఖా చిత్రవాగీశీ గాయత్రీ విశ్వరూపయా. 9
శాంకరీ మతిర్దృతిశ్చ పూర్వాద్యా హ్రీం స్వబీజకా | ధ్యేయా సరస్వతీవచ్చ కపినాజ్యేన హోమకః.
సంస్కృత ప్రాకృతకవిః కావ్యశాస్త్రాది విద్భవేత్. 10
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే వాగీశ్వరీపూజావిధానం నామైకోనవింశత్యధిక త్రిశతతమోద్యాయః.
శివుడు చెప్పెను. ఇపుడు మండలసహిత వాగీశ్వరీ పూజా విధానమును చెప్పెదను. ఊకారమును ఘాతో చేర్చి దానికి అనుస్వారము చేర్చినచో, ''ఘాం'' యను ఏకాక్షర మంత్రము ఏర్పడును. నిషాదముపై ''ఈ'' చేర్చి దాని బిందు విసర్గయుక్తము చేయవలయును. ఈ ఏకాక్షర మంత్రము అందరికిని ఉపదేశించరాదు. వాగీశ్వరీదేవిని ఈ విధముగా ధ్యానించవలెను. దేవి శరీర కాంతి చంద్ర కుంద కుసుమములు వలె వుండును. ఏబది అక్షరముల మాలామయ మగు రూపము ధరించి యుండును. ముత్యాల హారములు శ్వేత పుష్పహారములు ధరించి యుండును. త్రినేత్రియగు ఆమె హస్తములలో వరుసగవరద, అభయ, అక్షమాల, పుస్తకములు, శోభించు చుండును. ఇట్లు ధ్యానించిపైన చెప్పిన ఏకాక్షర మంత్రము ఒక లక్ష జపించవలెను. పాదముల నుండి మస్తకము వరకు లేదా స్కంధము వరకు ఆకారాదిక్ష కారాంతమగు వర్ణమాలను ఆమె ధరించి యున్నట్లు భావన చేయవలెను. గురువు మంత్రోపదేశము చేయుటకు దీక్షార్థమై ఒక మండలము ఏర్పరుపవలయును. అది సూర్యాగ్రమై ఇందు విభక్తమై యుండవలెను. రెండు, భాగములందు కమలము ఏర్పరుపవలెను. ఆ కమలము సాధకునకు హితకరమగును. పిదప వీథిపాదిక ఏర్పరచి నాలుగు పదములందు కమలములను వాటి బాహ్య భాగమున వీథి పదికలను నిర్మించవలెను. రెండేసి పదములతో ఒక్కొక్క దిక్కు యందు ద్వారములను ఉపద్వారములను నిర్మించవలెను. కోణములందు రెండేసి పట్టికలు నిర్మించవలెను. తొమ్మిది కమలములను శ్వేత వర్ణములుగా చేసి కర్ణికపై బంగారు రంగుగల చూర్ణము చల్లి పచ్చగాను కేసరములను వివిధ వర్ణములు గను కోణములను రక్తవర్ణములుగను చేయవలెను. వ్యోమరేఖాంతరము కృష్ణ వర్ణముగా చేసి ద్వారము మానము ఇంద్ర గజమానమును అనుసరించి వుండునట్లు చేయవలెను. మధ్య కమలమున సరస్వతిని, పూర్వ కమలమున వాగీశిని ఆగ్నేయాది విదిక్కుల క్రమమున హృల్లేఖా చిత్రవాగీశి, గాయత్రి విశ్వరూప శాంకరీ మతిధృతులను స్థాపించి పూజించవలెను. నామ ప్రారంభము హ్రీం చేర్చి నామాద్యక్షరమును బీజరూపమున ఉచ్చరించి పూజించవలెను. సరస్వతినే వాగీశ్వరీ రూపమున ధ్యానించవలెను. కపిల ఘృతముతో హోమము చేయవలెను. ఇట్లు చేసిన వాడు సంస్కృత ప్రాకృత భాషలలో, కావ్యరచన చేయు కవియగును. కావ్యశాస్త్ర విద్వాంసుడగును.
అగ్ని మహాపురాణమున వాగీశ్వర పూజా విధానమను మూడువందల పందొమ్మిదవ అధ్యాయము సమాప్తము.