Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ వింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః
అథ మండలాని
ఈశ్వర ఉవాచ :
సర్వతోభద్రకాన్యష్టమండలాని వదేగుహ | శక్తిమాసాధయే త్ర్ఫాచీ మిష్టాయాం విషువే సుధీః. 1
చిత్రాస్వాత్యన్తరేణాథ దృష్టసూత్రేణవాపునః | పూర్వాపరాయతం సూత్రమాస్ఫాల్య మధ్యతో7ంకయేత్. 2
కోటిద్వయంతు తన్మధ్యాదంకయే ద్ధక్షిణోత్తరమ్ | మధ్యేద్వయం ప్రకర్తవ్యం స్ఫాలయే ద్దక్షిణోత్తరమ్. 3
శతక్షేత్రార్థ మానేన కోణసంపాత మాదిశేత్ | ఏవం సూత్రచతుష్కస్య ఫాలనాచ్చ తురస్రకమ్. 4
జాయతే తత్రకర్తవ్యం భద్రస్వేదకరం శుభమ్ | వసుభ క్తేన్ధు ద్విపదేక్షేత్రే వీథౌచ భాగికా. 5
ద్వారం ద్విపాదికం పద్మమానాద్ధ్వై సకపోలకమ్ | కోణబంధ విచిత్రన్తు ద్విపదీం తత్రవర్తయేత్. 6
శుక్లం పద్మం కర్ణికాతు పీతా చిత్రన్తు కేసరమ్ | రక్తావీథీతత్ర కల్ప్యాద్వారంలో కేశరూపకమ్. 7
రక్తకోణం విధౌనిత్యే నైమిత్తికే7బ్జకం శృణు | అసంసక్తతుసంసక్తం ద్విఢాబ్జం భుక్తిముక్తికృత్. 8
అసంసక్తం మముక్షూణాం సంసక్తం తత్త్రిధాపృథక్ | బాలోయువాచ వృద్ధశ్చ నామతః ఫలసిద్ధిదాః. 9
ఈశ్వరుడు పలికెను. స్కందా! ఇపుడు సర్వతో భద్రములు యను పేరుగల ఎనిమిది మండలములను చెప్పెదను. శంకువుతో తూర్పు దిక్కున సాధించి విషువ కాలమున చిత్ర స్వాతి నక్షత్రముల మధ్య యందు గాని లేదా సూత్రము గ్రహించి తూర్పు నుండి పశ్చిమము వరకు లాగి మధ్యము నందు రెండు కోటులను గుర్తించవలెను. వాటి మధ్య నుండి ఒక దీర్ఘమైన ఉత్తర దక్షిణ రేఖ గీసి రెండు మత్స్యములను నిర్మించి వాటిని దక్షిణోత్తరములపై ఆస్ఫాలనము చేయవలెను. క్షత పద క్షేత్రము యొక్క అర్ధ మానముచే కోణ సంపాతము చేయవలెను. ఈ విధముగా నాల్గు పర్యాయములు సూత్రమును క్షేత్రము నందు ఆస్ఫాలనము చేయగా ఒక చతురస్రము ఏర్పడును. దాని నాల్గు హస్తముల శుభకర మగు భద్ర మండలము ఏర్పరుపవలెను. ఎనిమిది పదములచే అన్ని వైపులను విభక్తములగు అరువది నాలుగు పదముల నుండి ఇరువది పదములు గల క్షేత్రమున వెలుపల ఒక వీథిని నిర్మించవలెను. ఈ వీథి ఒక మంత్రమునకు సంబంధించినది. కమల మానముచే రెండు పదముల ద్వారము నిర్మించి దానిని కపోలయుక్తముగ చేయవలెను. కోణ బంధముచే అది ఆందముగ నుండవలెను. ఈ విధముగ ద్విపదమును ద్వార నిర్మాణము నందు ఉపయోగించవలెను. కమలమును శ్వేత వర్ణముగాను, కర్ణికను పీత వర్ణముగాను, కేసరములను చిత్ర వర్ణములు గాను, వీథిని రక్త వర్ణముగాను చేయవలెను. ద్వారములలో కపాల స్వరూపములు నిత్య నైమిత్తిర వీథు లందు కోణము ఎర్రగా వుండవలెను. ఇపుడు పద్మమును గూర్చి వినుము. అసంసక్తము సంసక్తము యని అవి రెండువిధములు. భుక్తి ముక్తి ప్రదము. అసంసక్తము ముముక్షువులకు ఉపయుక్తము బాల యువ. వృద్ధములని సంసక్త కమలములు మూడు విధములు. అవి తమ పేర్లననుసరించి ఫలసిద్ధిని ఇచ్చును.
పద్మ క్షేత్రేతు సూత్రాణి దిగ్విదిక్షు వినిక్షి పేత్ | వృత్తాని పంచకల్యాణి పద్మ క్షేత్ర సమానితు. 10
ప్రథమే కర్ణికా తత్ర పుష్కరైర్నవభిర్యుతా | కేసరాణి చతుర్వింశ ద్వితీయే7థ తృతీయకే. 11
దలసంధిర్గజ కుంభనిభాన్తర్యద్దలా గ్రకమ్ | పంచమే వ్యోమరూపన్తు సంసక్తం కమలం స్మృతమ్. 12
ఆసంసక్తం దలాగ్రేతు దిగ్భాగైర్విస్తరాద్భజేత్ | భాగద్వయ పరిత్యాగాద్వస్వం శైర్వర్తయేద్ధలమ్. 13
సంధి విస్తరసూత్రేణ తన్మూలా దంజయేద్ధలమ్ | సవ్యాపసవ్య క్రమేణౖవ వృద్ధమేత ద్భవేత్తథా. 14
అథవాసంధి మధ్యాత్తు భ్రామయే దర్ధచంద్రవత్ | సంధి ద్వయాగ్ర సూత్రంవా బాలపద్మం తథాభ##వేత్. 15
సంధి సూత్రార్థమానేన పృష్ఠతః పరివర్తయేత్ | తీక్‌ష్ణాగ్రంతు సువాతేన కమలం ముక్తి భుక్తిదమ్. 16
ముక్తవృధ్ధౌ చ వశ్యాదౌ బాలం పద్మం సమానకమ్ | నవనాభం నవహస్తం భాగైర్మంత్రాత్మకైశ్చతత్. 17
మధ్యే7బ్జం పట్టికాబీజం ద్వారేణాబ్జస్యమానతః | కంఠోపకంఠముక్తాని తద్బా హ్యే వీథికా మతా. 18
పంచభాగాన్వితా సాతు సమంతాద్ధశభాగికా | దిగ్విదిక్ష్వష్ట పద్మాని ద్వారపద్మం సవీథికమ్. 19
తద్భాహ్య పంచపదికా వీథికాయత్ర భూషితా | పద్మవద్ద్వారకంఠన్తు పదికం చౌష్ఠకంఠకమ్. 20
కపోలం పదికం కార్యం దిక్షు ద్వారత్రయం స్ఫుటమ్ | కోణబంధం త్రిపట్టంతు ద్విపట్టం వజ్రవద్భవేత్.
మధ్యన్తు కమలం శుక్లం పితం రక్తం చ నీలకమ్ | పీతశుక్లంచ ధూమ్రంచ రక్తం పీతంచ ముక్తిదమ్. 21
కమల క్షేత్రము నందు దిక్ విదిక్కులవైపు సూత్ర విన్యాసము చేసి పద్మ క్షేత్ర సమములగు ఐదు వృత్తములను నిర్మించవలెను. ప్రథమ వృత్తము నందు నాలుగు పుష్కరములు గల కర్ణికయు రెండవ దాని యందు ఇరువది నాలుగు కేసరములు, మూడవ దాని యందు గజ కుంభ సదృశములగు దశ సంధులు నాల్గవ వృత్తము నందు దళాగ్ర భాగములు పంచమ వృత్తము నందు ఆకాశ మాత్రము వుండును. ఇది సంసక్త కమలము. అసంసక్త కమలమున దళాగ్రభాగము నందున్న దిక్కుల భాగము నందున్న దిక్కుల భాగము విస్తారము ననుసరించి రెండు భాగములు విడచి ఎనిమిది భాగములతో దళములు ఏర్పరుప వలయును. సంధి విస్తార సూత్రముతో దాని మానముననుసరించి దళములను రచించవలయును. దీని యందు ఎడమ నుండి, కుడికి ఏర్పరుచ వలయును. లేదా సంధి మధ్య నుండి అర్ధ చంద్రాకారముగా త్రిప్పవలెను. లేదా రెండు సంధుల అగ్రము నందున్న సూత్రమును అర్ధ చంద్రాకారముగ త్రిప్పవలెను. అపుడు బాల పద్మము ఏర్పడును. సంధి సూత్రము యొక్క అగ్ర భాగము నుండి పృష్ఠ భాగము వైపు సూత్రము త్రిప్పవలెను. యది తీక్‌ష్ణాగ్ర భాగ మగు యువ సంజ్ఞక కమలము. భుక్తి ముక్తి ప్రదము. ముక్తినుద్దేశించి చేయు ఆరాధనము నందు వృద్ధ కమలమును వశీకరణాదులందు బాల పద్మమును ఉపయోగించవలెను. నవనాభ కమల చక్రము ఎనిమిది హస్తముల ప్రమాణము కలదై యుండును. దాని యందు మంత్రాత్మకములగు తొమ్మిది భాగములుండును. దాని మధ్య భాగమున కమల ముండును. కమల మానానుసారముగ పట్టిక వీథి ద్వారము యొక్క ఏడు కంఠము, ఉపకంఠములు నిర్మించవలెను. ఐదు భాగముల వీథి యుండును. దాని నలువైపుల పది భాగముల స్థానముండును. దాని ఎనిమిది దిక్కులందు ఎనిమిది కమలములున్న వీథి సహితమగు ఒక ద్వార పద్మము వుండును. దాన బాహ్య భాగమున లతా దివిభూషిత మగు ఐదు పదముల వీథి యుండును. ద్వార కంఠము నందు కమలముండును. ద్వారము యొక్క ఓష్ఠ కంఠ భాగములు ఒక్కొక్క పదము నందుండును. కపోల భాగము ఒక పదముండును. మూడు దిక్కులందును మూడు ద్వారములు స్పష్టముగా వుండును. కోణ బంధము నందు మూడు పట్టములు రెండు పదములు వజ్ర చిహ్నముండును. మధ్య కమలము శుక్ర వర్ణము. మిగిలిన దిక్కుల కమలములు పూర్వాదిక్రమమున పీత, రక్త, నీల, పీత, శుక్ల ధూమ్ర రక్త పీత వర్ణములై యుండును. ఈ కమల చక్రము ముక్తి దయాకము.
పూర్వాదౌకమాలన్యష్ట శివవిష్ణ్వాదికంజపేత్ | ప్రాసాద మధ్యతో7భ్యర్చ్య శక్రాదీనబ్జ కాదిషు. 23
అస్త్రాణి బాహ్యవీథ్యాస్తు విష్ణ్వాదీ నశ్వమేధభాక్ | పవిత్రారోహాణాదౌచ మహామండల మాలిఖేత్. 24
అష్టహస్తం పురాక్షేత్రం రసపక్షైర్వివర్తయేత్ | ద్విపదం కమలం మధ్యే వీథికా పదికాతతః. 25
దిగ్విదిక్షు తతో7ష్టౌచ నీలాబ్జాని వివర్తయేక్ | మధ్యపద్మ ప్రమాణన త్రింశత్పద్మాని తానితు. 26
దలసంధి విహీనాని నీలేందీవరకాణి చ | తత్పృష్ఠే పదికావీథీ స్వస్తి కాని తదూర్ధ్వతః. 27
ద్విపదాని తథాచాష్టౌ కృతిభాగకృతానితు| వర్తయేత్స్వ స్తికాస్తత్ర వీథికా పూర్వవద్బహిః. 28
ద్వారాణి కమలంయద్వ దుపకంఠ యుతానితు | రక్తం కోణం పీతవీథీ నలంపద్మంచ మండలే. 29
పూర్వాది దిక్కులందు ఎనిమిది కమలములను శివ విష్ణ్వాది దేవతలను పూజించవలెను. శివ విష్ణ్వాదులను ప్రాసాద మధ్యకమల మందు పూజించి పూర్వాది కమలములపై ఇంద్రాది దేవతలను పూజించవలెను. బాహ్య వీథి యందు ఆ దేవతల హస్త్రములను విష్ణ్వాదులను పూజించినవాడు అశ్వమేధ ఫలము పొందును. పవిత్రారోహణాదు లందు మహా మండలము ఏర్పరుపవలెను. ఎనిమిద హస్తముల పొడవైన క్షేత్రమును ఇరువది ఆరుచే విభజించి మధ్యనున్న పదద్వయము నందు కమలమును తనకు తర్వాత ఒక పదమున వీథిని దిగ్విదిక్కులందు ఎనిమిది నీలకమలములను నిర్మించవలెను. మధ్య నున్న కమలము మానముతో మొత్తము ముప్పది పద్మములు నిర్మించవలెను. వాటికి దళ సంధులు వుండకూడదు. అవినీలేందీ వరములు. దాని పృష్ఠమున ఒక పాదము వీథియు. దాని పైన స్వస్తిక చిహ్నము ఏర్పరుచవలెను. పిదప బాహ్య భాగమున వీథికయు ద్వారములు కమలములు ఉపకంటములు అన్నియు వుండవలెను. కోణములు రక్త వర్ణములు. వీథిపీత వర్ణము. మండల మధ్య కమలము నీల వర్ణము అయి వుండవలెను. విచిత్ర వర్ణములు గల స్వస్తికాది మండలములు సకల కామప్రదములు.
స్వస్తికాది విచిత్రంచ సర్వకామప్రదం గుహ | పంచాబ్జం పంచహస్తం స్యాత్సమంతాద్దశ భాజితమ్. 30
ద్విపదం కమలం వీథీ పట్టికాదిక్షుపంకజమ్ | చతుష్కం పృష్ఠతో వీథీపదికా ద్విపదాన్యథా. 31
కంఠోపకంఠ యుక్తాని ద్వారాణ్యబ్జన్తు మధ్యతః | పంచాబ్జమండలే హ్యస్మిన్సితం పీతంచ పూర్వకమ్. 32
వైడూర్యాభం దక్షిణాబ్జం కుందాభం వారుణం కజమ్ | ఉత్తరాబ్జన్తు శంఖాభమన్యత్సర్వం విచిత్రకమ్. 33
పంచాబ్జ మండలము ఐదు హస్తముల క్షేత్రమును అన్ని వైపుల నుండి పదిచే విభజించి నిర్మించవలెను. రెండు పదములు కమలము, దాని బాహ్య భాగమున వీథి, పట్టికా, మరల నాల్గు దిక్కులందును నాలుగు కమలములు వాటి పృష్ఠభాగమున వీథి వుండవలెను. దానిని ఏక పదములందు గాని పద ద్వయమునందు గాని నిర్మించవలెను. కంఠోప కంఠములు గల ద్వారములు వాటి మధ్య భాగమున కమలములు వుండవలెను. ఈ పంచాబ్జ మండలమున పూర్వ దిక్కు నందున్న కమలము శ్వేత వర్ణము, పీత వర్ణము అయి వుండును. దక్షిణ కమలము వైఢూర్య వర్ణము. పశ్చిమ కమలము శ్వేత వర్ణము ఉత్తర కమలము శంఖ తుల్య వర్ణము. మిగిలినవన్నియు విచిత్ర వర్ణములు అయి వుండును.
సర్వకామప్రదం వక్ష్యేదశహస్తస్తు మండలమ్ | వికారభక్తస్తుర్యాశ్రం ద్వారన్తు ద్విపదం భ##వేత్. 34
మధ్యేపద్మం పూర్వవచ్ఛవిఘ్నధ్వంసం వదామ్యథ | చతుర్హస్తం పరంకృత్వా వృతంచైవ కరద్వయమ్. 35
వీథికా హస్తమాత్రన్తు స్వస్తికైర్బహు భిర్వృతా | హస్తమాత్రాణి ద్వారాణి దిక్షువృత్తం సపద్మకమ్. 36
పద్మాని పంచశుక్లాని మధ్యేపూజ్యశ్చ నిష్కలః | హృదయాదీని పూర్వాదౌ విదిక్ష్వస్త్రాణి వైజయేత్. 37
ప్రాగ్వచ్చపంచ బ్రహ్మాణి బుద్ధ్యాధార మతోవదే | శతభాగే తిథి భాగేపద్మం లింగాష్టకందిశి. 38
మేఖలాభాగసంయుక్తం కంఠం ద్విపదికం భ##వేత్ | ఆచార్యో బుద్ధిమాశ్రిత్య కల్పయేచ్చలతాదికమ్. 39
చతుః షట్పంచ మాష్టాదిఖాక్షి ఖాద్యాదిమండలమ్ | ఖాక్షీన్దు సూర్యగం సర్వంఖాక్షి చైవేన్దు వర్ణనాత్. 40
చతుర్వింశదధికాని చతుర్దశ శతానిహి | మండలాని హరేః శంభోర్దేవ్యాః సూర్యస్యసన్తిచ 41
దశసప్త విభ##క్తేతు లతాలింగోద్భవంశృణు | దిక్షు పంచత్రయం చైకం త్రయం పంచచలోపయేత్. 42
ఊర్ధ్వగే ద్విపదే లింగమందిరం పార్శ్వకోష్టయోః | మధ్యేనద్విపదం పద్మమథచైకం చ పంకజమ్. 43
లింగస్య పార్శ్వయోర్భద్రే పదద్వార మలోపనాత్ | తత్పార్శ్వ శోభాః షడ్‌లోప్యలతాః శేషాస్తథాహరేః. 44
ఊర్ధ్వం ద్విపదికం లోహ్యహరేర్భద్రాష్టకం స్మృతమ్ | రశ్మిమానసమాయుక్త వేదలోపాచ్చ శోభితమ్. 45
పంచవింశతికం పద్మం తతః పీఠమపీఠకమ్ | ద్వయం ద్వయం రక్షయిత్వా ఉపశోభాస్తథాష్టచ. 46
దేవ్యాది ఖ్యాపకం భద్రం బృహన్మధ్యేపరం లఘు | మధ్యే నవపదం పద్మం కోణభద్ర చతుష్టయమ్. 47
త్రయోదశ పదం శేషం బుద్ధ్యాధారన్తు మండలమ్ | శతపత్రం షష్ట్యధికం బుద్ధ్యాధారం హరాదిషు. 48
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే మండల నిరూపణం నామ వింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః.
సర్వకామ ప్రదమగు దశ హస్త మండలమును చెప్పెదను. దానిని వికార సంఖ్యచే(24) అన్ని వైపుల విభక్తము చేసి చతురస్ర క్షేత్రము ఏర్పరుపవలెను. రెండేసి పదముల ద్వారముండును. పూర్వము నందు చెప్పిన చక్రము నందువలె
(అ) 2/39
దీని మధ్య భాగమున కమలముండును. ఇపుడు విఘ్న ధ్వంస చక్రము చెప్పెదను. నాల్గు హస్తముల పురము ఏర్పరచి దాని మధ్య రెండు హస్తముల గోళాకార చక్రము ఏర్పరుచవలెను. అన్ని వైపులనుండి స్వస్తిక చిహ్న వృతమగు హస్తప్రమాణము గల వీథి యుండును. ఒక్కొక్క హస్తమున నాలుగు వైపుల ద్వారములు ఏర్పరుచవలెను. నాలుగు దిక్కులందు, కమలాంకితములగు వృత్తములుండును. ఈ చక్రమున శ్వేత వర్ణములగు ఐదు కమలములు వుండును. మధ్యవర్తి కమలమును నిరాకారుడగు పరమాత్మను పూజించవలెను. పూర్వాది దిక్కులందు హృదయాద్యంగములను విదిక్కులందు హస్తములను పూజించవలెను. సద్యోజాతాది పంచ బ్రహ్మ మయ ముఖములను గూడ పూజించవలెను. ఇపుడు బుద్ధ్యా ధార చక్రమును చెప్పెదను. నూరు పదముల క్షేత్రమున మధ్య యందున్న పదునైదు పదములలో ఒక కమలము అంకితము చేసి ఎనిమిది దిక్కులందును ఒక్కొక్క శివ లింగమును ఉంచవలెను. రెండు పదములలో మేఖలా భాగ సహిత మగు కంఠము రచించవలెను. ఆచార్యుడు తన బుద్ధి సహాయముతో లతాదులను ఏర్పరుపవలెను. నాలుగు, ఆరు, ఐదు, ఎనిమిది ఇత్యాది సంఖ్యలో వున్న కమలములతో మండము ఏర్పడును. ఇరువది ముప్పది కమలములున్నది కూడ వుండును. 12120 కమలములున్న సంపూర్ణ మండలము కూడ వుండును. 120 కమలములు మండలము కూడ కనబడుచున్నది. విష్ణు, శివ దేవీ సూర్యులకు 1440 మండము లుండును. పదిహేడు పదములతో పదిహేడు పదములను విభజించినచో 289 పదములగును. ఈ మండము నందు ''లతాలింగము'' ఎట్లు ఉద్భవించునో చెప్పెదను. వినుము. ఒక్కొక్క దిక్కు యందు ఐదు, మూడు, ఒకటి, మూడు, ఐదు పదములను తుడిచి వేయవలెను. పైన నున్న రెండు పదములతో లింగము పార్శ్వము నందున్న రెండేసి కోష్టములతో మందిరము ఏర్పడును. మధ్యనున్న రెండు పదములలో కమలము మరల మరియొక కమలము ఏర్పడును. లింగ పార్శ్వ భాగము లందు రెండు భద్రములు ఏర్పడును. మధ్యనున్న రెండు పదములలో కమలము మరల మరియొక కమలము ఏర్పడును. లింగ పార్శ్వ భాగము లందు రెండు భద్రములు ఏర్పడును. ఒక పదమున ద్వార ముండును. దానిని తుడిచి వేయకూడదు ఆ ద్వార పార్శ్వము లందు ఆరేసి పదములను తుడిచి వేయగా ద్వార శోభ ఏర్పడును. మిగిలిన పదములందు శ్రీహరికి లతలు ఏర్పడును. పైనున్న రెండు పదములను తుడిచి వేయగా విష్ణువునకు భద్రాష్టకము ఏర్పడును. మరల నాల్గు పదములను తుడిచి వేయగా రశ్మి మానాయుక్త మగు శోభా స్థానమేర్పడును. ఇరువది ఐదు పదములచే పద్మము, పిదప పీఠము, ఆపీఠము రెండేసి పదములను వుంచగా ఎనిమిది ఉప శోభలు ఏర్పడును. దేవ్యాది సూచక మగు భద్ర మండలము మధ్య విస్తృతముగను. ప్రాంత భాగమున లఘువుగను వుండును. మధ్య తొమ్మిది పదముల కమల మేర్పడును. నాల్గు కోణములందున నాలుగు భద్ర మండలములు ఏర్పడును. మిగిలిన పదమూడు పదములలో బుద్ధ్యాధారమండలము ఏర్పడును. దీని యందు నూరు అరువది పదములుండును. బుద్ధ్యాధార మండలము శివాది దేవతారాధనకు ప్రశస్తములు.
అగ్ని మహాపురాణమున మండల నిరూపణ మను మూడువందల ఇరువదవ అధ్యాయము సమాప్తము.