Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ చతుర్వింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ రుద్ర శాంతిః

ఈశ్వర ఉవాచ :

శివ శాంతి ప్రవక్ష్యామి కల్పాఘోర ప్రపూర్వకమ్‌ | సప్తకోట్యధిపో ఘోరోబ్రహ్మ హత్యాధ్యమార్దనః. 1

ఉత్తమాధమసిద్దీనామలయో7ఖిల రోగనుత్‌ | దివ్యాన్తరిక్షభౌమానా ముత్తత్పాతానాం విమర్దనః. 2

విషగ్రహ పిశాచానాం గ్రసనః సర్వకామకృత్‌ | ప్రాయశ్చిత్తమఫ°ఘార్తౌ దౌర్భాగ్యార్తి వినాశనమ్‌. 3

ఏక వీరన్తు విన్యస్య ధ్యేయః పంచముఖఃసదా | శాంతికే పౌష్టికే శుక్లో రక్తో వశ్యే7థ పీతకః. 4

స్తంభ##నే ధూమ్ర ఉచ్చాట మారణ కృష్ణ వర్ణకః | కర్షణః కపిలో మోహే ద్వాత్రింశద్వర్ణమర్చయేత్‌. 5

త్రింశల్లక్షం జపేన్మంత్రం హోమం కుర్యాద్దశాంశతః | గుగ్గులామృతయుక్తేన సిద్ధే సిద్ధే7థ సర్వకృత్‌. 6

అఘోరాన్నాపరో మంత్రో విద్యతే భుక్తిముక్తికృత్‌ |

ఆ బ్రహ్మచారీ బ్రహ్మచారీ అస్నాతః స్నాతకోభ##వేత్‌. 7

అఘోరాస్త్ర మఘోరన్తు ద్వావిమౌ మంత్రారాజకౌ | జపహోమార్చనాద్యుద్ధే శత్రుసైన్యం విమర్దయేత్‌. 8

పరమేశ్వరుడు చెప్పెను. ఇపుడు కల్పా ఘోర శివశాంతిని చెప్పెదను. అఘోర శివుడు ఏడు కోట్ల గణములకు అధిపతి బ్రహ్మహత్యాది పాపములను నశింపచేయును. ఉత్తమాధమ సిద్ధులను ఇచ్చువాడు సమస్త రోగములను తొలగించును. భౌమ దివ్య అంతరిక్ష ఉత్పాతములను మర్దించును. విషగ్రహ పిశాచములను కూడ మ్రింగి వేసి సకల కామము లను పూరించును. పాప పీడలను తొలగించుటకు దుర్భాగ్య దుఃఖ వినాశకమగు ప్రబల ప్రాయశ్చిత్తరూపుడు ఏకవీర మును సర్వాంగన్యాసము చేసి సర్వదా పంచముఖ ధ్యానము చేయవలెను. శాంతిక పౌష్టికములందు శివుడు శుక్లవర్ణుడు వశీ కరణమున రక్తవర్ణుడు స్తంభన కర్మయందు పీతవర్ణుడు. ఉచ్చాటన మారణ కర్మలందు ధూమ్ర వర్ణుడు ఆకర్షణమున కృష్ణవర్ణుడు మోహన కర్మయందు కపిల వర్ణుడు ముప్పది రెండు అక్షరములు వేదోక్తములగు అఘోర శివుని రూపము అందుచే అట్టి అఘోర శివుని పూజించవలెను ఈ మంత్రమును ముప్పది లక్షల జపము చేసి గుగ్గులు మిశ్ర ఘృతముతో దశాంశ హోమము చేసినచో, సాధకుడు మంత్ర సిద్ధి పొంది సిద్ధార్థుడగును అతడన్నియు సాధించగలడు. అఘోర మంత్రమును మించి భుక్తి ముక్తి ప్రదమగు మరియొక మంత్రములేదు. దీనిని జపించుటచే అబ్రహ్మచారి బ్రహ్మచారి యగును. అస్నాతకు స్నాతకుడగును. అఘోరాస్త్రము అఘోర మంత్రము ఈ రెండును మంత్రరాజములు ఏఒక్క దాని నైనను జప హోమార్చనములందు వినయెగించినచో యుద్ధము నందు శత్రు సైన్యమును నశింపచేయవచ్చును.

రుద్రశాంతిం ప్రవక్ష్యామి శివాం సర్వార్థసాధనీమ్‌ | పుత్రార్థం గ్రహనాశార్థం విషవ్యాధి వినష్టయే 9

దుర్భిక్షమారీ శాంత్యర్థే దుఃస్వప్న హరణాయచ | బలాది రాజ్య ప్రాప్త్యర్థం రిపూణాం నాశనాయచ. 10

అకాలఫలితే వృక్షే సర్వగ్రహ విమర్దనే | పూజనేతు నమస్కారః స్వాహాన్తో హవనే తథా. 11

ఆప్యాయనే వషట్‌కారం పుష్టౌ వౌషణ్నియోజయేత్‌ | చకార ద్వితయస్థానే జాతి యోగన్తు కారయేత్‌. 12

ఓం రుద్రాయ చతేఓం వృషభాయ నమః అవిముక్తాయ ఆసంభవాయ, పురుషాయచ పూజ్యాయ ఈశానాయ

పౌరుషాయ పంచచోత్తరే విశ్వరూపాయ కరాలాయ వికృతరూపాయ అవికృతరూపాయ

నికృతౌ చాపరేకాలే అప్సుమాయాచ నైరృతే | ఏక పింగలాయ శ్వేతపింగలాయ కృష్ణపింగలాయ నమః.

మదు పింగలాయ నమః మధుపింగలాయ నియతౌ అనంతాయ ఆర్ద్రాయ శుష్కాయ ప్రయోగణాయ

కాలతత్త్వే కరాలాయ వికరాలాయ | ద్వౌమాయాతత్త్వే | సహస్రశీర్షాయ సహస్ర వక్త్రాయ సహస్ర కర

చరణాయ సహస్ర లింగాయ | విద్యాతత్త్వే | సహస్రాక్షాద్విన్యసేద్దక్షిణ దలే |

ఏక జటాయ ద్విజటాయ త్రిజటాయ స్వాహాకారాయ స్వధాకారయ వషట్‌ కారాయ |

షడ్‌రుద్రాయేశతత్త్వేతు వహ్నిపత్రే స్థితా గుహ |

భూతపతయే పశుపతయే ఉమాపతయే కాలాధిపతయే |

సదాశివాఖ్యతత్త్వే షట్‌ పూజ్యాః పూర్వదలే స్థితాః.

ఉమాయై కురూప ధారిణి ఓం కురు కురు రుహిణి రుహిణి |

రుద్రో7సి దేవానాం దేవానాం దేవ దేవ విశాఖ హనహన దహదహ పచపచ మథమథ తురుతురు

అరుఅరు సురుసురు రుద్రశాంతి మనుస్మర కృష్ణపింగల అకాల పిశాచాధిపతి విశ్వేశ్వరాయ నమః.

శివతత్త్వే కర్ణికాయాం పూజ్యౌతూమా మహేశ్వరౌ.

ఓం వ్యోమవ్యాపినే వ్యోమ రూపాయ సర్వవ్యాపినే

శివాయ అనన్తాయ అనాథాయ అనాశ్రితాయ శివాయ శివతత్త్వేనవ పదాని వ్యోమవ్యాప్యభిధాస్యహి.

శాశ్వతాయ యోగపీఠ సంస్థితాయ నిత్యం యోగినే

ధ్యానాహారాయనమః. ఓం నమః శివాయ సర్వప్రభ##వే

శివాయ ఈశాన మూర్దాయ తత్పురుషాది పంచ వక్త్రాయ |

నవపదం పూర్వదలే సదాఖ్యే పూజయేద్గుహ |

అఘోర హృదయాయ వామదేవ గుహ్యాయ సద్యోజాత

మూర్తయే ఓం నమో నమః గుహ్యాతి గుహ్యాయ గోప్త్రే

అనిధనాయ సర్వయోగాధి కృతాయ జ్యోతి రూపాయ |

అగ్ని పత్రే హోమతత్త్వే విద్యాతత్త్వే ద్వేయామ్యగే |

పరమేశ్వరాయ చేతనా చేతన వ్యోమన వ్యాపినే ప్రథమ

తేజస్తేజః. మాయతత్త్వేనైరృతే చ కాలతత్త్వే7

వారుణ | ఓం ధృధృ నానా వాం వాం అనిధన నిధనోద్భవ

శివ సర్వ పరమాత్మన్‌ మహదేవ సద్భావేశ్వర మహాతేజః

యోగాధిపతే ముంచ ముంచ ప్రమథ ప్రమథ ఓంసర్వ ఓంసర్వ ఓం భవ ఓం భవ

ఓం భవోద్భవ సర్వభూత సుఖప్రద |

వాయుపుత్రే7థ నియతౌ పురుషే చోత్తరేణ చ |

సర్వసాన్నిధ్యకర బ్రహ్మ విష్ణు రుద్రపర ఆనర్చిత

అస్తుతస్తుత సాక్షిణ సాక్షిణ తురు తురు పతంగ పింగ పతంగ పింగ జ్ఞాన జ్ఞాన

శబ్ద శబ్ద సూక్ష్మ సూక్ష్మ శివ శివ సర్వప్రద సర్వప్రద ఓం నమః.

శివాయ ఓం నమోనమః శివాయ ఓం నమో నమః.

ఈశానే ప్రాకృతే తత్త్వే పూజయేజ్జుహుయాజ్జపేత్‌ | గ్రహరోగాది మాయార్తి శమనీ సర్వసిద్ధికృత్‌. 13

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రుద్రశాంతి వర్ణవం నామ చతుర్వింశత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

ఇపుడ సర్వార్థ సాధకమగు మంగళకరమైన రుద్రశాంతిని చెప్పెదను. పుత్రప్రాప్తి గ్రహ బాధా నివారణ విష వ్యాధుల వినాశము దుర్భిక్ష మహామారి శాంతి దుస్స్వప్న నివారణము బల రాజ్యాది ప్రాప్తి రివు వినాశనము వీటిని సాధించుటకు రుద్రశాంతిని ప్రయోగించవలెను. వృక్షము అకాలమున ఫలించినను సమస్త గ్రహబాధలను తొలగించుటకు కూడ దీనినిప్రయోగించవలెను. పూజనమునందు మంత్రాంతమున నమః చేర్చవలెను. హోమమునందు స్వాహా చేర్చవలెను. తృప్తి యందు వషట్‌ పుష్టికరము యందు వౌషట్‌ చేర్చవలెను. మంత్రము నందు రెండు చోట చ వున్న చోట ఆవశ్య కతాను సారముగ ''నమః'' స్వాహా మొదలు జాతి యోగములు చేయవలెను. ''ఓం రుద్రాయ'' మొదలు ''అవికృత రూపాయ'' వరకును మూలోక్తము రుద్ర శాంతి మంత్రము. ఉత్తరపర్తి కమల దళమున నియతి తత్త్వము. పశ్చిమ కమల దళమున కాలతత్వము నైఋతి దళమున మాయాతత్వము వుండును వీటి యందు దేవతలను పూజించవలెను. ఏక పింగళాయ శ్వేతపింగళాయ కృష్ణపింగళాయ, మధుపింగళాయ, మధుపింగళాయ నమః యని నియతితత్త్వమునందు పూజించవలెను. అనంతాయ ఆర్ద్రాయ శుష్కాయపయో గణాయయని కాలతత్వమునందు కరాళాయ వికరాళాయయని మాయాతత్వము నందుపూజించవలెను. దక్షిణ దళము నదున్న విద్యాతత్త్వమున ''సహస్ర శీర్షాయ'' మొదలు ''సహస్ర లింగాయ'' వరకు చెప్పి పూజించవలెను. అచటనే ఏక జటాయ మొదలు షడ్రుద్రాయ వరకును షడ్విధ రుద్రుల పూజ చేయవలెను. ఆగ్నేయ దళమున వున్న ఈ శతత్వమును భూత పతయే పశుపతయే ఉమాపతయే కాలధి పతయే యని చెప్పి పూజ చేయవలెను. పూర్వ దళమున వున్న సదా శివతత్త్వము నందున్న ఆరువురిని ''ఉమాయై'' మొదలు ''విశ్వేశ్వరాయ నమః'' వరకును వున్న మంత్రము లతో పూజించవలెను. కర్ణికలను నున్న శివతత్వముపై ఉమామహేశ్వరుని ఓం వ్యోమ వ్యాపినే మొదలు శివాయ వరకును వున్న మూలోక్తమంత్రముతో పూజించవలెను. శివతత్వమున వ్యోమ వ్యాపి యను పేరుగల శివుని నవ పదముల పూజ చేయవలెను. పిదప యోగ పీఠముపై నున్న శివుని నవ పద యుక్త నామములు చెప్పుచు పూజించవలెను. ''శాశ్వతాయ'' మొదలు పంచ వక్త్రాయ వరకును వున్న మూలోక్తము మంత్రము. పిదప ''సత్‌'' యను పేరు గల పూర్వ దళము నందు ''అఘోర హృదయాయ'' మొదలు ''జోతీ రూపాయ'' వరకును మూలోక్త మంత్రముతో శివుని పూజించవలెను. ఆగ్నేయము నందున్న ఈ శతత్త్వము నందును దక్షిణము నందున్న విద్యాతత్త్వము నందును ''పరమేశ్వరాయ'' మొదలు ''తేజ'' వరకును వున్న మూలోక్త మంత్రముతో పరమేశ్వరుని పూజించవలెను. నైఋతి యందున్న కాలతత్వము నందును పశ్చిమ దిక్కు నందున్న కాలతత్వము నందును ''ఓం ధ్రు ధ్రు'' మొదలు ''సుఖప్రద'' వరకును వున్న మూలోక్త మంత్ర ముతో పూజించవలెను. వాయవ్య ఉత్తరదళములందున్న నియతి పురుషులను ''సర్వసాన్నిద్యకర'' మొదలు ''నమోన్నమః'' వరకును వున్న మూలోక్త మంత్రముతో పూజ చేయవలెను. ఈశాన్యము నందున ప్రాకృత తత్త్వము నందు కూడ జప హోమములు చేయవలెను. ఈ రుద్ర శాంతి గ్రహ బాధను రోగాది త్రివిధ పీడలను నశింప చేయును.

అగ్ని మహా పురాణమున రుద్ర శాంతి వర్ణన మను మూడు వందల ఇదువది నాల్గవ అధ్యాయము సమాప్తము.

7

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page