Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ ఛందః సారః

అగ్ని రువాచ :

పాద ఆపాద పూరణ గాయత్ర్యోవసవఃస్మృతాః | జగత్యా ఆదిత్యాః పాదో విరాజో దిశ ఈరితాః. 1

విష్ణుతోరుద్రాః పాదఃస్యాచ్ఛంద ఏకాది పాదకమ్‌ | ఆద్యం చతుష్పాచ్చతుర్భిస్త్రిపాత్‌ సప్తాక్షరైః క్వచిత్‌. 2

సాగాయత్రీ పదే నీవృత్త త్పతిష్ఠాది షట్‌ త్రిపాత్‌ | వర్ధమానాః షడష్టాష్టా త్రిపాత్షడ్‌ వసుభూధరైః. 3

గాయత్రీ త్రిపదా నీవృన్నాగీనవ నవర్తుభిః | వారాహీ రసద్విరసా ఛందశ్చాథ తృతీయకమ్‌. 4

ద్విపాద్ద్వాదశవస్వన్తైస్త్రిపాత్తు త్రైష్టుభైః స్మృతమ్‌ | ఉష్ణిక్ఛందో7ష్టవసుకైః పాదైర్వేదే ప్రకీర్తితః. 5

కకు బుష్ణిగష్ట సూర్యవస్వర్ణాత్రిభిరేవసః | పునరుష్ణిక్సూర్యవసువస్వర్ణైశ్చ త్రిపాద్భవేత్‌. 6

పరోష్ణిక్పరతస్తస్మాచ్చతుష్పాదాస్త్రిభిర్భవేత్‌ | సాష్టాక్షరైరనుష్టుప్స్యాచ్ఛతుష్పాచ్చ త్రిపాత్క్వచిత్‌. 7

అష్టార్క సూర్యవర్ణైః స్యాన్మధ్యే7న్తేచ క్వచిద్భవేత్‌ |

బృహతీ జగత్యస్త్రయో గాయత్ర్యాః పూర్వకోయది. 8

తృతీయః పఠ్యాభవతి ద్వితీయాన్యంకుసారిణీ | స్కంధౌ గ్రీవా క్రౌష్టుకే స్యాదక్షే న్యాద్వౌ బృహత్యపి. 9

ఉపరిష్టాద్బృహత్యన్తే పురస్తాద్‌ బృహతీపునః | క్వచిన్న వకాశ్చత్వారో దిగ్విదిక్ష్వష్టవర్ణికాః. 10

మహాబృహతీ జాగతైః స్యాత్త్రిభిః సతోబృహత్యపి |

అగ్నిదేవుడు పలికెను. ఈ ప్రకరణమును చివరి వరకు ''పాదః'' యను పదము అనువర్తించును. గాయత్రికి ఒక పాదమున ఎనిమిది అక్షరములుండును. జగతికి పండ్రెండు అక్షరములు, విరాట్‌నకు పది త్రిష్టున్‌నకు పండ్రెండు అక్షరములుండును. ఛందస్సులలో కొన్ని ఏక పాదములు, ద్విపాదములు ఇత్యాది విధమున నుండును. గాయత్రి ఆరేసి అక్షరముల నాల్గు పాదములతో కూడ వుండును. కొన్ని చోట్ల ఏడు అక్షరముల మూడు పాదములతో కూడ వుండును. దీనికి నిచృత్‌ యని పేరు. ప్రథమ పాదము యెనిమిది అక్షరములు. ద్వితీయ పాదము ఏడు అక్షరములు, తృతీయ పాదము ఆరు అక్షరములు అయినచో అది ప్రతిష్ఠా గాయత్రి. ఇందుకు విపరీతముగా మూడు పాదములలో వరుసగా ఆరు, ఏడు, ఎనిమిది అక్షరములున్నచో వర్ధమాన గాయత్రి మొదటి పాదము ఆరు, రెండవది ఎనిమిది, మూడవది ఏడు అక్షరములున్నచో అతిపాద నిచృత్‌'' యని పేరు. రెండు పాదములందు తొమ్మిదేసి అక్షరములు, తృతీయ పాదమున ఆరు అక్షరములున్నచో ''నాగీ గాయత్రి'' ఆరు తొమ్మిది తొమ్మిది వున్నచో వారాహి గాయత్రి. ఇపుడు మూడవ భేదము చెప్పబడుచున్నది. ద్విపాద ఛందస్సులో వరుసగా పండ్రెండు ఎనిమిది అక్షరములున్నచో అది ద్విపాద విరాట్‌. పదకొండేసి అక్షరముల ఒక పాదము వున్నచో ఉష్ణిక్‌, ప్రథమ తృతీయ పాదము లందు ఏడేసి అక్షరములు ద్వితీయ పాదమున పండ్రెండు అక్షరములు, ద్వితీయ తృతీయములు ఎనిమిదేసి అక్షరములైన పునరుష్ణిక్‌. ప్రథమ ద్వితీయములు ఎనిమేది అక్షరములు, తృతీయము పండ్రెండు అక్షరములు అయినా, పరోష్ణిక్‌. ఏడేసి అక్షరముల నాలుగు పాదములున్నను ఉష్ణిక్‌ చంధస్‌. ఎనిమిదేసి అక్షరములు నాలుగు పాదములున్నది. అనుష్టుప్‌ ఛందస్సు, త్రిపాద అనుష్టుప్‌ కూడ వుండును. దీనిలో మొదటి పాదమున ఎనిమిది, ద్వితీయ, తృతీయము లందు పండ్రెండేసి అక్షరములున్నది ఒక భేదము మధ్యమ పాదము గాని అంతిమ పాదముగాని అష్టాక్షరమై మిగిలిన రెండు పాదములందు పండ్రేడేసి అక్షరములున్నది రెండవ భేదము. ఒకపాదము జగతీ ఛందస్సు మూడు పాదములు గాయత్రి ఛందుస్సు అయినచో యది బృహతీ ఛందస్సు. మూడవ పాదము మొదటి పాదము వలె అయినచో అది పథ్యా బృహతి. ప్రథమ మగు జగతీ పాదము ద్వితీయపాదమై మిగిలినవి మూడు గాయత్రి పాదములైనచో యదిన్యంకు సారిణీ బృహతీయగును. క్రోష్టుకి మతము ప్రకారము దీనికే స్కందలేదా గ్రీవాయని పేరు. అంతిమ పాదము జగతియై మొదటి మూడు పాదములు గాయత్రియైనచో యది ఉపరిష్టాద్బృహతి. ప్రథమ పాదము జగతియై మిగిలిన పాదములు గాయత్రియైనచో అది పురస్తాద్బృహతి. తొమ్మిదేసి అక్షరములు నాలుగు పాదములు కూడ కనబడుచున్నవి. పది యక్షరముల రెండు పాదములు, ఎనిమిదేసి అక్షరముల రెండు పాదములు వున్నది కూడ బృహతియే. కేవల జగతీ పాదములు మూడున్నచో మహాబృహతీ.

భండిలః పంక్తిచ్ఛందః స్యాత్సూర్యార్కాష్టాష్ట వర్ణకైః. 11

పూర్వౌవేదయుజౌసతః పంక్తిశ్చ విపరీతకీ | ప్రస్తార పంక్తిశ్చ పురతః పవాదాస్తర పంక్తికా. 12

అక్షరపంక్తిః పంచకాశ్చత్వారశ్చాల్పశో ద్వయమ్‌ | పదపంక్తిః పంచభ##వేచ్చతుష్కం చషకత్రయమ్‌. 13

షట్కపంచభిర్గాయత్రైః షడ్భిశ్చ జగతీ భ##వేత్‌ | ఏకేన త్రిష్టుబ్జ్యో తిష్మతీత థైవ జగతీరితా. 14

పండ్రెడేసి అక్షరముల రెండు పాదములు ఎనిమిదేసి అక్షరముల రెండు పాదములున్నచో పంక్తి ఛందస్సు. విషమ పాదమైనచో యనగా ప్రథమ తృతీయ చరణములు పండ్రెడేసి యక్షరములు మిగిలినవి రెండు ఎనిమిదేసి అక్షరములు అయినచో సతః పంక్తి ఛందస్సు. అవి విపరీతావస్థలో వున్నచో యది కూడ సతః పంక్తి మొదటి రెండు పాదములు పండ్రెడేసి అక్షరములు మిగిలిన రెండు పాదములు ఎనిమిదేసి అక్షరములైనచో ప్రస్తార పంక్తి. చివరి రెండు పాదములందు పండ్రెడేసి అక్షరములు మొదటి రెండు పాదము లందును ఎనిమిదేసి అక్షరములున్నచో ఆస్తార పంక్తి. పండ్రెడేసి అక్షరములున్న రెండు పాదములు మధ్య నుండి మిగిలిన పాదములందు ఎనిమిదేసి అక్షరములున్నచో విస్తార పంక్తి ప్రథమ చతుర్థములందు పండ్రెడేసి అక్షరములు. ద్వితీయ చతుర్థములందు ఎనిమిదేసి అక్షరములు వున్నచో సంస్తార పంక్తి ఐదేసి అక్షరముల నాలుగు పాదములున్నచో అక్షర పంక్తి ఐదేసి అక్షరముల రెండు పాదములే వున్నచో అల్ప శః పంక్తి అయిదేసి అక్షరములు ఐదు పాదములున్నది పదపంక్తి. ప్రథమము నందు నాలుగు అక్షరములు ద్వితీయమునందు ఆరుఅక్షరములు మిగిలిన మూడింటియందు ఐదేసి అక్షరములు వున్నను పదపంక్తియే ఎనిమిదేసి అక్షరముల ఐదు పాదములున్నది పథ్యా పంక్తి. ఎనిమిదేసి అక్షరముల ఆరుపాదములున్నది జగతీ పంక్తి.

పురస్తాజ్జోతిః ప్రథమే మధ్యే జ్యోతిశ్చ మధ్యతః | ఉపరిష్టా జ్జోతిరన్త్యాదేకస్మిన్పంచ కేతథా. 15

భ##వేచ్ఛందః శంకుమతీ షట్‌ కే ఛందః కకుద్మతీ | త్రిపాద శిశుమధ్యాస్యాత్సా పిపీలిక మధ్యమా. 16

విపరీతాయవ మధ్యా త్రివృదేకేన వర్జితా | భూమిజై కేనాధికేన ద్విహీనాచ చిరాద్భవేత్‌. 17

స్వరాట్‌ స్యాద్ద్వాభ్యా మధికం సందిగ్ధో దైవతాదితః |

ఆదిపాదాన్నిశ్చయః స్యాచ్ఛందసాం దేవతాః క్రమాత్‌ . 18

అగ్నిఃసూర్యః శశీజీవో వరుణశ్చంద్ర ఏవచ | విశ్వేదేవాశ్చ షడ్‌జాద్యాః స్వరాః షడ్‌జోవృషః క్రమాత్‌.

గాంధారో మధ్యమశ్చైవ పంచమోర్ధవతస్తథా | నిషాదవర్ణాః శ్వేతశ్చ సారంగశ్చ పిశంగకః.

20

కృష్ణోనీలో లోహితశ్చ గౌరో గాయత్రి ముఖ్యకే | గోరోచనాభాః కృతయో జ్యోతిశ్ఛందోహి శ్యామలమ్‌. 21

అగ్నిర్వైశ్యః కాశ్యపశ్చ గౌతమాంగిర సౌక్రమాత్‌ | భార్గవః కౌశికశ్చైవ వాసిష్ఠోగోత్ర మీరితమ్‌. 22

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఛందఃసారే త్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

ఒక పాదము త్రిష్టుప్‌, ఎనిమిదేసి అక్షరములు నాలుగుపాదములు వున్నది త్రిష్టుబ్‌ జ్యోతిష్మతి ఒకపాదము జగతి నాలుగు పాదములు గాయత్రియైనచో జగతీ జ్యోతిష్మతి. మొదటి పాదము పదకొండు అక్షరములు, మిగిలిన నాలుగు పాదములు ఎనిమిదేసి అక్షరములైనచో పురస్తా జ్యోతి. మొదటి పాదము పండ్రెండు అక్షరములు, మిగిలిన నాలుగు పాదములు ఎనిమిదేసి అక్షరములైనను యదియే పేరు. మధ్యమచరణమున పండ్రెండు అక్షరములు, మిగిలిన చరణములందు ఎనిమిదేసి అక్షరము లున్నచో యది మధ్యేజ్యోతి మధ్య చరణము పండ్రెండు అక్షరములు మిగిలినవి ఎనిమిదేసి అక్షరములు వున్నను యదియే పేరు. మొదటి నాలుగు పాదములందు యెనిమిదేసి అక్షరములు. చివర పాదమునందు పదకొండు అక్షరములు లేదా పండ్రెండు అక్షరములు వున్నచో అది ఉపరిష్టాజ్యోతి. గాయత్ర్యాది ఛందస్సులందు ఒకపాదమున ఐదు అక్షరములు ఇతర పాదములందు నియతాక్షరములు వున్నచో శంకుమతి. ఒక చరణము ఆరు అక్షరములు ఇతర చరణములందు నియతములగు అక్షరములున్నచో కకుద్మతి. మూడు పాదముల ఛందస్సులో ప్రథమ తృతీయ పాదములందు ఎక్కువ అక్షరములుండి మధ్యయందు తక్కువ అక్షరములున్నచో యది పిపీలిక మధ్య. దీనికి విపరీతముగ వున్నది యవ మధ్య గాయత్రి లేదా ఉష్ణిక్‌ మొదలగు ఛందస్సులలో ఒక అక్షరము తగ్గినచో నిచృత్‌యనియు, ఒక అక్షరము పెరిగినచో భూరిక్‌ యనియు రెండు అక్షరములు తగ్గిన విరాట్‌ యనియు, రెండు అక్షరములు పెరిగిన స్వరాట్‌ యనియు పేర్లు సందేహము కల్గినపుడు మొదటి పాదమున బట్టి ఛందస్సును నిర్ణయించవలెను. దేవతా, స్వర, వర్ణ, గోత్రాదుల ద్వారా కూడ నిర్ణయించవలెను. గాయత్ర్యాది ఛందస్సులకు క్రమముగా అగ్ని సూర్యచంద్ర బహస్పతి మిత్రావరుణ ఇంద విశ్వేదేవతలు, షడ్జాదులు స్వరములు. శ్వేత సారంగ, కృష్ణ, నీల, లోహిత, గౌరములు వర్ణములు. కృతి ఛందస్సు యొక్క వర్ణముగోరోచనా సమానము అతి ఛందస్సుల వర్ణము శ్యామలము ఏడు ఛందస్సులకును వరుసగా అగ్నివేశ్య, కాశ్యప, గౌతమ అంగీరన్‌, భార్గవ కౌశిక వశిష్టులు దేవతలు.

అగ్ని మహాపురాణమున ఛందస్సారమను మూడువందల ముప్పదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page