Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ త్రయస్త్రింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ అర్ధసమనిరూపణమ్‌

అగ్ని రువాచ :

ఉపచిత్రకం ససమనామథ భోజభగామథ | ద్రుతమధ్యాతత భగాగథోనన జయాః స్మృతాః.

1

వేగవతీససమగా భభభగోగథోస్మృతా | రుద్రవిస్తారస్తో సభగా సమజాగో గథాస్మృతా. 2

రజసాగోగథోద్రోణౌ గోగౌవై కేతుమత్యపి | ఆఖ్యానికీ తతజగాగథో తతజగాగథ. 3

విపరీతాఖ్యానికీతౌ జయాగాతౌ జగోగథ | సౌమలౌ గథలభభావౌ భ##వేద్దరిణ వల్లభా. 4

లోవనౌగాథనజజాయః స్యాదపరాక్రమమ్‌ | పుష్పితా ననవయానజజావోగథోరజౌ. 5

వోజథో జవజవాగో మూలేపనమతీశిభా | అష్ణవింశతి నాగాభా త్రింశన్నాగం తతోయుజి |

ఖంజాతద్విపరీతా స్యాత్సమవృత్తం ప్రదర్శ్యతే. 6

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయ ఛందఃసారే త్రయస్త్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను. ప్రథమ పాదమున స, స, స, స, ల, గులు రెండవ పాదము. భ, భ, భ, గు, గు, లు వుండి ఉత్తరార్ధము పూర్వార్ధము వలె నున్నచో యది ఉప చిత్రకము. ప్రథమ పాదమున భ, భ, భ, గు, గు, లు. ద్వితీయ పాదమున న, జ, జ, జ, లు వున్న ధృత మధ్య ప్రథమ పాదమున స, స, స, గు లు ద్వితీయ పాదమున భ, భ, భ గులు వున్నచో వేగవతి, మొదటి పాదమున త, జ, ర. గులు, ద్వితీయ పాదమున య, స, జ, గు, గు, లు వున్నది భద్ర విరాట్‌. ప్రథమ పాదమున స, జ, స, గు, లు ద్వితీయ పాదము, భ, ర, న, గు, గు, లు వున్నవి హేతుమతి. ప్రథమ పాదమున త, త, జ, గు, గు, లు. ద్వితీయ పాదమున జ, త, జ, గు, గు, లు వున్నది ఆఖ్యానికి. ఏత ద్విపరీతముగా నున్నది విపరీతాఖ్యానకి. ప్రథమ పాదమున స, స, స, ల, గులు ద్వితీయమున న, భ, భ, రలు వున్నది హరిణప్లుత. ప్రథమ పాదమున న, న, ర, ల, గులు, ద్వితీయమున న, జ, జ, ర, లు వున్ది అపర వక్త్రము. ప్రథమ పాదమున న, ర, య లు ద్వితీయము న, న, జ, ర, గు, లు వున్నది పుష్పితాగ్ర. ప్రథమ పాదమున ర, జ, ర, జలు ద్వితీయ పాదమున జ, ర, జ, ర, గులు వున్నది యమవతి. ప్రథమ తృతీయ చరణము లందు ఇరువది యెనిమిద లఘువులు ఒక గురువు ద్వితీయ చతుర్థ చరణము లందు ముప్పది లఘువులు ఒక గురువు వున్నది శిఖా. ఏత ద్విపరీతముగ నున్నది ఖంజ. ఇపుడు సమ వృత్తము చెప్పబడుచున్నది.

అగ్ని మహా పురాణమున ఛందస్సార మను మూడువందల ముప్పది మూడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page