Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తత్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.
అథ కావ్యాది లక్షణమ్
అగ్నిరువాచ :
కావ్యస్య నాటకా దేశ్చ అలంకారాన్వదామ్య7థ | ధ్వనిర్వర్ణాఃపదం వాక్యమిత్యేతద్వాజ్మయం మతమ్. 1
శాస్త్రేతిహాస వాక్యానాం త్రయంయత్ర సమాప్యతే | శాస్త్రేశబ్ధప్రధాన త్వమితిహాసేషు నిష్ఠతా. 2
అభిధాయాః ప్రధానత్వాత్కావ్యం తాభ్యాం విభిద్యతే | నరత్వం దుర్లభం లోకే విద్యాతత్ర సుదుర్లభా. 3
కవిత్వం దుర్లభం తత్ర శక్తిస్తత్ర చ దుర్లభా | వ్యుత్పత్తిర్దుర్లభాతత్ర వివేక స్తత్ర దుర్లభః. 4
సర్వంశాస్త్ర మవిద్వద్భిర్మృగ్యమాణం సనిధ్యతి | ఆదివర్ణా ద్వితీయాశ్చ మహాప్రాణాస్తురీయకః. 5
వర్గేషు వర్ణబృందంస్యాత్పదం సుప్తిఙ్ప్రభేదతః | సంక్షేపాద్వాక్యమిష్టార్థ వ్యవచ్చిన్నాపదావళీ. 6
అగ్ని దేవుడు పలికెను. కావ్య నాటక అలంకారాదుల స్వరూపమును చెప్పెదను. ధ్వని, వర్ణము, పదము, వాక్యము. ఇదియే సకల వాఙ్మయము. శాస్త్ర ఇతి హాస కావ్యములు ఈ వాఙ్మయములో అంతర్గతములు. శాస్త్రము నందు శబ్దమునకు ప్రాధాన్యము. ఇతిహాసము లందు అర్థమునకు ప్రాధాన్యము. వీటిలో అభిధకే ప్రాధాన్యము. అందుచే కావ్యము ఈ రెండింటి కంటెను భిన్నమైనది. లోకములో నరత్వము దుర్లభము. విద్యను ఇంకను దుర్లభము. కవిత్వము ఇంకను దుర్లభం, శక్తి ఇంకను దుర్లభము. వ్యుత్పత్తి ఇంకను దుర్లభము వివేకము అన్నిటి కంటెను. దుర్లభము. అవిద్వాంసులు ఎంత ప్రయత్నించినను శాస్త్రము సిద్ధించదు. శాది వర్ణములు, వర్గ, ద్వితీయ చతుర్థాక్షరములు మహా ప్రాణములు వర్ణ సముదాయము పదము సుబంతము తిఙంతము యని, ఇది రెండు విధములు. ఇష్టార్థమును బోధించు పద పంక్తి వాక్యము.
కావ్యం స్ఫుటదలంకారం గుణవద్దోష వర్జితమ్ | యోనిర్వేదశ్చలోకశ్చ సిద్ధమన్నాదయోనిజమ్. 7
దేవాదీనా సంస్కృతం స్యాత్ర్పాకృతం త్రివిధం నృణామ్ |
గద్యం పద్యంచ మిశ్రంచ కావ్యాది త్రివిధం స్మృతమ్. 8
అపదః పదసన్తానోగద్యం తదపిగద్యతే | చూర్ణకోత్కలికా గ్రంథివృత్తభేదాత్త్రిరూపకమ్. 9
అల్పాల్ప విగ్రహం నాతిమృదు సందర్భనిర్భరమ్ | చూర్ణకం నామతో దీర్ఘసమాసాత్కలికా భ##వేత్. 10
భ##వేన్మధ్య మసందర్భం నాతికుత్సిత విగ్రహమ్ | వృత్తచ్ఛాయాహరం వృత్తసంధినైత త్కిలోత్కటమ్.
అఖ్యాయికాక కథాఖండ కథాం పరికథా తథా | కథానికేతి మన్యన్తే గద్యకావ్యం చ పంచధా. 12
కర్తృవంశ ప్రశంసా స్యాద్యత్ర గద్యేన విస్తరాత్ | కన్యాహరణ సంగ్రామ విప్రలంభ విపత్తయః. 13
భవన్తియత్ర దీప్తాశ్చరీతి వృత్తిప్రవృత్తయః | ఉచ్ఛాసైశ్చ పరిచ్ఛేదో యత్రయా చూర్ణకోత్తరా. 14
వక్రంవా పరవక్రంవా యత్రసాఖ్యాయి కాస్మృతా | శ్లోకైః స్వవంశం సంక్షేపాత్క విర్యత్రప్రశంసతి. 15
ముఖ్యస్యార్థావతారాయ భ##వేద్యత్ర కథాన్తరమ్ | పరిచ్చేదోనయత్ర స్యాద్భవేద్వా లంబకైః క్వచిత్. 16
సాకథనామ తద్గర్భే నిబధ్నీ యాచ్చ తుష్పదీమ్ | భ##వేత్ఖండ కథాయాసౌయాసౌ పరికథాతయోః. 17
అమాత్యం సార్థకం వాపి ద్విజంవా నాయకం విదుః | స్యాత్తయోకరుణంవిద్ధి విప్రలంబ శ్చతుర్విధః. 18
సమాప్యతే, తయోర్నాద్యా సాకథా మనుధావతి | కథాఖ్యాయిక యోర్మిశ్ర భావాత్పరి కథాస్మృతా. 19
భయానకం సుఖపరం గర్భేచ కరుణోరసః | అద్భుతో7న్తే సుక్ ? ప్తార్థో నోదాత్తాసా కథానికా. 20
స్పష్టమైన అలంకారములు గలది, గుణములు కలది, దోషములు లేనిది యగు వాక్యము కావ్యము. వేదములు, లోకము, కావ్య హేతువులు. సిద్ధ మంత్రముచే నిర్మించబడిన కావ్యము అయోనిజము. దేవతలకు సంస్కృత భాషను, మనుష్యులకు త్రివిధ ప్రాకృత భాషలను ప్రయోగించవలెను. గద్యము పద్యము మిశ్రము యని, కావ్యము మూడు విధములు పాదములు లేని పద సముదాయము గద్యము చూర్ణకము ఉత్కలికా వృత్త గంధి యని గద్యము మూడు విధములు. చిన్న చిన్న మృదువైన మాటలున్నది చూర్ణకము. దీర్ఘ సమాసములు కలది ఉత్కలికా, ఈ రెండింటికి నడుమ వున్నదియు, అత్యంత కుత్సిత విగ్రహము కానిదియు వృత్తాచ్ఛాయ కలదియు యగు గద్యము వృత్త గలది. ఇదిఉత్కటకముగ నుండదు. ఆఖ్యాయికా, కథ, ఖండ కథ, పరికథ, కథానిక యని గద్య కావ్యము ఐదు విధములు. గ్రంథ కర్త యొక్క వంశ ప్రశస్తి అధికముగ నుండి కన్యాహరణ సంగ్రామ విప్రలంబ విపత్తుల వర్ణనములతో వైదర్భ్యాది రీతులు భారత్యాది వృత్తులు ప్రవృత్తులు వున్నదియు ఉచ్ఛ్వాసములను పేరు గల పరిచ్ఛేదములు కలదియు, చూర్ణక ప్రధానమును వక్త్రము గాని అపర వక్త్రము గాని యున్నది యగు గద్య కావ్యము అఖ్యాయికా. కవి దేనిలో తన వంశమును శ్లోకములలో సంక్షిప్తముగా చెప్పునో, ముఖ్యార్థమును ప్రవేశ పెట్టుటకు మరియొక కథ చేర్చబడునో పరిచ్ఛేదము లుండవో, వున్నను లంబకములను పేర్లతో వుండునో యది కథ. దాని మధ్య భాగమున చతుష్పదితో బంధ రచన చేయవలెను. కథా ఖండము మాత్రమే వుద్నది. ఖండ కథ. ఖండ కథా పరికథలలో, మంత్రి లేద వైశ్యుడు లేదా బ్రాహ్మణుడు నాయకుడుగా వుండును. కరుణరసము ప్రధానము. నాలుగు విధములగు విప్రలంబము వర్ణింపబడును. ఈ రెండింటిలో కథ సమాప్తి పొందదు. లేదా ఖండ కథలో కథా శైలి అనుసరించబడదు. కథా ఆఖ్యాయికల లక్షణములు కలిసి యున్నది పరికథా. ప్రారంభమున భయానకము, మధ్య యందు కరుణము, అంతమున అద్భుతము వుండునది కథానిక. ఇది ఉదాత్తమైనది కాదు.
పద్యం చతుష్పదీతచ్చ వృత్తం జాతిరితిత్రిధా | వృత్తమక్షర సంఖ్యే యముక్థం తత్కృతి శేషజమ్. 21
మాత్రాభిర్గణనాయత్ర సాజాతిరితి కాశ్యపః | సమమర్ధ సమంవృత్తం విషమం వైంగులంత్రిధా. 22
సావిద్యానౌస్తితీర్షూణాం గభీరం కావ్యసాగరమ్ | మహాకావ్యం కలాపశ్చ పర్యాబంధో విశేషకమ్. 23
కులకం ముక్తకంకేశ ఇతిపద్య కుటుంబకమ్ | సర్గబంధో మహాకావ్య మారబ్ధం సంస్కృతేనయత్. 24
తాదాత్మ్యమజహత్తత్ర తత్సమం నాతి దుష్యతి | ఇతిహాసకథోద్భూతమితరద్వా సదాశ్రయమ్. 25
మంత్రదూత ప్రయాణాజి నియతం నాతి విస్తరమ్ | శక్వర్యాతి జగత్యాతి శక్వర్యాత్రిష్టుభాతథా. 26
పుష్పితాగ్రాదిభిర్వక్రాభి జనైశ్చారుభిః సమైః | ముక్తాతు భిన్న వృత్తాన్తా నాతి సంక్షిప్తసర్గకమ్. 27
అతిశర్కరికాష్టిభ్యా మేకసంకీర్ణకైః పరః | మాత్రయాప్యపరః సర్గః పాశ##స్త్యేషుచ పశ్చిమః 28
కల్పో7తి నిందిత్యస్తస్మిన్విశేషానాదరః సతామ్ | నగరార్ణవశైలర్తు చంద్రార్కాశ్రమ పాదపైః. 29
ఉద్యాన సలిలక్రీడా మధుపానరతోత్సవైః | దూతీవచవిన్యాసైరసతీ చరితాద్భుతైః. 30
తమసా మరుతాప్యన్యైర్విభావైరతి నిర్భరైః | సర్వవృత్తి ప్రవృత్తంచ సర్వభావ ప్రభావితమ్. 31
సర్వరీతిరసైః పుష్టం పుష్టం గుణ విభూషణౖః | అతఏవ మహాకావ్యం తత్కర్తాచ మహాకవిః. 32
చతుష్పది యనగా పద్మము. యది వృత్తయు, జాతి యని రెండు విధములు. అక్షర సంఖ్యా నియమము వున్నది వృత్తము. యిది ఉక్థము కృతి శేషజము యని రెండు విధములు. మాత్రాగణన వున్నది జాతి యని కాశ్యపుడు చెప్పెను. పింగళుని ప్రకారము సమము, అర్ధ సమము, విషమము యని వృత్తము మూడు విధములు. కావ్య సముద్రమును దాట గోరువారికి ఛందో విద్య నౌక వంటిది. మహా కావ్యము, కలాపము, పర్యాయ బంధము, విశేషకము, కులకము, ముక్తకము కోశము ఇవన్నియు పద్య సముదాయములే. సర్గలలో విభక్తమై సంస్కృతములో రచింపబడినది మహా కావ్యము. మహా కావ్య స్వరూపమును విడువక దాని వలె మరియొక విధమైన రచన చేసినను దోషము లేదు. ఇతిహాస కథను గ్రహించి గాని, మరియొక్క ఉత్తమ కథను గ్రహించి గాని మహా కావ్యము రచింపబడును. మంత్రము దూత ప్రయాణము యుద్ధము మొదలైనవి అచ్చట అచ్చట వర్ణింపబడును. అధిక విస్తృతము కాకూడదు. శక్వరి అతశక్వరి, అతజగతి, త్రిష్టుప్ పుష్పితాగ్ర వక్త్రము మొదలగు సమవృత్త ఛందస్సులను ప్రయోగించవలెను. సర్గల అంతమున ఛందస్సు మార్చవలెను. సర్గలు చాల సంక్షిప్తముగా నుండకూడదు. ఒక సర్గ అతశక్వరి, అష్టి ఛందస్సులతోను, మరియొక సర్గ మాత్రా ఛందస్సులతోను సంకీర్ణమై యుండవలెను. రాబోవు సర్గ పూర్వ సర్గ కంటే ఉత్తమముగా నుండవలెను. కల్పము చాలా నిందితము. సత్పురుషులకు వాని యందు ఆదరము వుండదు. న, గర, సముద్ర పర్వత, ఋతు, చంద్ర సూర్య, ఆశ్రమ, వృక్ష, ఉద్యాద, జలక్రీడ, మధుపాన, రతోత్సవ, దూతి వచన, కులటా చరిత్రాదుల అద్భుత వర్ణనలతో కావ్యము నిండి యుండును. అంధకారము వాయువు, ఇతి రతి విభావములు వర్ణింపబడును. అన్ని విధములగు వృత్తులు ప్రయోగింప బడును. అన్ని భావములచే ప్రభావితమై యుండును. సకల రీతుల సకల రసములు గుణములు అలంకారములు. దీనిని పరిపుష్టము చేయును. ఈ విశేషములుండుట చేతనే ఇది మహా కావ్యము. దానిని రచించిన వాడు మహా కవి.
వాగైదగ్ద్య ప్రధానే7పి రసఏవాత్ర జీవితమ్ | పృథక్ర్ఫయత్న నిర్వర్త్యం వాగ్వక్రివ్ణిురసాద్వపుః. 33
చతుర్వర్గఫలం విష్వగ్వ్యాఖ్యాతం నాయకాఖ్యయా | సమానవృత్తి నిర్వ్యూఢః కౌశికీవృత్తికోమలః. 34
కలాపో7త్ర ప్రవాసః ప్రాగనురాగాహ్వయోరసః | సవిశేషకం చ ప్రాప్త్యాది సంస్కృతేనేత రేణచ. 35
శ్లోకైరనేకైః కులకం స్యాత్సం దానితకానితత్ | ముక్తకం శ్లోక ఏకైకశ్చ మత్కా రక్షమః సతామ్. 36
సూక్తిభిః కవిసింహానాం సుందరీభిః సమన్వితః | కోశో బ్రహ్మా పరిచ్ఛిన్నః సవిదగ్ధాయరోచతే. 37
ఆభాసోపమశక్తిశ్చ సర్గే యద్బిన్నవృత్తయా | మిశ్రం వపురితి ఖ్యాతం ప్రకీర్ణమితిచద్విధా.
శ్రవ్యంచైవాభి నేయంచ ప్రకీర్ణం సకలోక్తిభిః. 38
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కావ్యాది లక్షణ వర్ణనం నామ సప్తత్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.
మహా కావ్యమునందు ఉక్తివై చిత్త్ర్యమునకు ప్రాధాన్యమున్నను రసమే దాని జీవనము కావ్యస్వరూపమువచో వక్రత్వము ఉన్నను ప్రయత్న పూర్వకముగ రసమును పోషించుటచే సిద్ధించును. మహాకావ్య ఫలము చతుర్వర్గ ప్రాప్తి దీనికి నాయకుని పేరుతో పేరు పెట్టవలెను. సమానమైన వృత్తులు. కూర్చవలెను. కైశికీ వృత్తిచే కావ్యము కోమల ముగా నుండును. ప్రవాస వర్ణనమున్న కావ్యము కలాపము దానిలో పూర్వానురాగమను శృంగారముండును. సంస్కృతముల లేదా ప్రాకృతముతో పాప్త్యాదులను వర్ణించినచో విశేషకము అనేక శ్లోకములకు ఒకే అన్వయమున్నచో కులకము, సందారితకము యని పేరు. ఒక్కొక్క శ్లోకము స్వతంత్రార్థకమైనచో ముక్తకము యది సత్పురుషులకు చమత్కారము కల్గించవలెను. మహాకవులు ఉత్తమ సూక్తులు కూర్చినది కోశము యది బ్రహ్మవలె. అపరిచ్ఛిన్న రసభరితమై సహృదయులకు రుచికరముగ నుండును. సర్గలో వేరువేరు వృత్తములను ఉపయోగించుట ఆభాసోపమ శక్తి యది మిశ్రము ప్రకీర్ణము యని రెండు విధములు. శ్రవ్య అభినేయముల రెండు లక్షణములును వున్నది మిశ్రము. సకలోక్తులతో కూడినది ప్రకీర్ణము.
అగ్ని మహాపురాణమున కావ్యాది లక్షణ వర్ణనయను మూడువందల ముప్పది యేడవసర్గ అధ్యాయము సమాప్తము.