Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ అష్టత్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.
అథ నాటక నిరూపణమ్
అగ్నిరువాచ :
నాటకం ప్రకరణం డిమ ఈహామృగో7పివా | జ్ఞేయః సమవకారశ్చ భ##వేత్ర్పహసనంతథా. 1
వ్యాయోగ బాణవీథ్యంక త్రోటకాన్యథనాటికా | సట్టకం శిల్పకః కర్ణా ఏకో దుర్మల్లికాతథా. 2
ప్రస్థానం బాణికా భాణీ గోష్ఠీ హల్లీశకానిచ | కావ్యం శ్రీగదితం నాట్యరాసకం రాసకంతథా. 3
ఉల్లాప్యకం ప్రేక్షణం చ సప్తవింశతి రేవతత్ | సామాన్యం చ విశేషశ్చలక్షణస్యద్వయీగతిః. 4
సామాన్యం సర్వవిషయం శేషః క్వాపి ప్రవర్తతే | పూర్వరంగే నివృత్తేద్వౌ దేశకాలా పుభావపి. 5
రసభావ విభావాను భావా అభినయా న్తథా | అంకః స్థితిశ్చ సామాన్యం సర్వత్రైవోప సర్పణాత్. 6
విశేషో7వసరే వాచ్యః సామాన్యం పూర్వం ముచ్యతే | త్రివర్గసాధనం నాట్యమిత్యాహుః కరణం చయత్.
ఇతి కర్తవ్యతా తస్య పూర్వరంగో యథావిధి | నాందీముఖాని ద్వాత్రింశదంగాని పూర్వరంగకే. 8
దేవతానాం నమస్కారో గురూణామపిచస్తుతిః | గోబ్రాహ్మణనృపాదీనా మాశీర్వాదాది గీయతే. 9
నాంద్యన్తేసూత్రధారో7సౌరూపకేషు నిబధ్యతే | గురుపూర్వం క్రమం వంశం ప్రశంసా పౌరుషం కవేః. 10
సంబంధార్థౌ చ కావ్యస్య పంచై తానేష నిర్దిశేత్ | నటివిదూషకోవాపి పారిపార్శ్విక ఏవవా. 11
సహితాః సూత్రధారేణ సంలాపం యత్రకుర్వతే | చిత్త్రైర్వాక్యైః స్వకార్యోత్థైః ప్రస్తుతాక్షేపిభిర్మిథః. 12
ఆముఖం తత్తు విజ్ఞేయం బుధైః ప్రస్తావనాపిసా | ప్రవృత్తకం కథోద్ఘాతః ప్రయోగాతిశయస్తథా. 13
ఆముఖస్యత్రయో భేదా బీజాంశేషూపజాయతే | కాలం ప్రవృత్తమాశ్రిత్య సూత్రధృగ్యత్ర వర్ణయేత్. 14
తదాశ్రయశ్చ పాత్రస్య ప్రవేశస్తత్ర్పవృత్తకమ్ | సూత్రధారస్య వాక్యం వాయత్ర వాక్యార్థమెవవా. 15
గృహృత్వా ప్రవిశేత్పాత్రం కథోద్ఘాతఃస ఉచ్యతే | ప్రయోగేషు ప్రయోగన్తు సూత్రధృగ్యత్రవర్ణయేత్. 17
తతశ్చ ప్రవిశేత్పాత్రం ప్రయోగాతిశయోహిసః | శరీరం నాటకాదీనామితివృత్తం ప్రచక్షతే. 17
సిద్ధముత్ర్పేక్షితం చేతితస్య భేదావుభౌస్మృతౌ | సిద్ధమాగమదృష్టంచ సృష్టముత్ర్పేక్షితం కవేః. 18
బీజం బిందుః పతాకా చ ప్రకరీకార్యమేవచ | అర్థప్రకృతయః పంచ పంచ చేష్టా అపిక్రమాత్. 19
ప్రారంభశ్చ ప్రయత్నశ్చ ప్రాప్తిః సద్భావ ఏవచ | నియతాచ ఫలప్రాప్తి ఫలయోగశ్చపంచమః. 20
ముఖం ప్రతిముఖం గర్భో విమర్శశ్చ తథైవచ | తథా నిర్వహణం చేతి క్రమాత్పంచైవసంధయః. 21
అల్పమాత్రం సముద్దిష్టం బహుధా యత్ర్ప సర్పతి | ఫలావసానం యచ్చైవ బీజం తదభీధీయతే. 22
యత్రబీజసముత్పత్తిర్నానార్థ రససంభవా | కావ్యే శరీరానుగతం తన్ముఖం పరికీర్తితమ్. 23
ఇష్టస్యార్థస్య రచనా వృత్తాన్త స్యాను పక్షయః | రాగప్రాప్తిః ప్రయోగస్య గుహ్యానాంచైవ గూహనమ్. 24
ఆశ్చర్యవదభిఖ్యాతం ప్రకాశ్యానాం ప్రకాశనమ్ | అంగహీనం నరోయద్వన్న శ్రేష్ఠం కావ్యమేవచ. 25
దేశకాలౌవినా కించిన్నే తివృత్తం ప్రవర్తతే | అతస్తయోరుపాదాన నియమాత్పద ముచ్యతే. 26
దేశేషుభారతం వర్షం కాలేకృత యుగత్రయమ్ | నర్తేతాభ్యాం ప్రాణభృతాం సుఖదుఃఖోదయః క్వచిత్.
సర్గేసర్గాది వార్తాచ ప్రసజ్జన్తీన దుష్యతి. 27
ఇత్యది మహాపురాణ ఆగ్నేయే నాటకనిరూపణం నామాష్ట త్రింశదధిక త్రిశతతమో7ధ్యాయః.
ఆగ్నిదేవుడు పలికెను నాటకము, ప్రకరణము. డిమము, ఈహా మృగము, సమకారము, ప్రహసనము, వ్యాయోగము భాణము, వీథి, అంకము, త్రోటకము, నాటికా, సట్టకము శిల్పకము, కర్ణ, దుర్మల్లికా, ప్రస్థానము భాళిక, భాణి, గోష్ఠి హల్లీశకము, కావ్యము, శ్రీ గదితము, నాట్యరాసకము, ఉల్లాప్యము, ప్రేంఖణము యని రూపకములు ఇరువదియేడు విధములు. లక్షణము సామాన్యము విశేషము యని రెండు విధములు. అన్ని రూపకములకు వర్తించునది సామాన్య లక్షణము. ఏదో ఒక దానిని వర్తించునది విశేష లక్షణము. అన్ని రూపకము లందును పూర్వరంగము జరిగిన పిమ్మట దేశకాలములు రసభావ విభావ, అనుభావ, అభినయ, అంకస్థితులు సామాన్య లక్షణము. విశేష లక్షణము సమయానుసారముగా చెప్పబడును. ఇపుడు సామాన్య లక్షణము చెప్పబడుచున్నది. ధర్మార్థకామములను నాటకము
(అ) 2 /43
సాధించవలెను. ముందుగా పూర్వరంగమును యథా విధిగా జరుపవలెను. దీనికి నాంది మొదలగు ఇరువది రెండు అంగములున్నవి. దేవతా నమస్కారము. గురుస్తుతి గోబ్రాహ్మణ రాజాద్యాశీర్వాదము. చేయబడును. నాంది తరువాత ''నాంద్యన్తే సూత్రధారః''యని రూపకములలో వ్రాయబడును. కవి యొక్క గురు పరంపర వంశ ప్రశంస, పౌరుషము కావ్యము యొక్క సంబంధ ప్రయోజకములు ఈ ఐదింటిని సూత్రధారుడు చెప్పవలెను. నటిగాని విదూషకుడు గాని పారిపార్శ్వకుడు గాని, సూత్రధారునితో కలిపి స్వకార్యముతో సంబంధించినవి ప్రస్తుత విషయమును చెప్పనవి యగు చిత్రమైన వాక్యములతో సంభాషణము చేసినచో దానికి ఆముఖమని పేరు. దీనికి ప్రస్తావనయని కూడ పేరు. ప్రవృత్తకము కథోద్ఘాతము ప్రయోతిశయము యని ఆముఖము మూడు విధములు. సూత్రధారుడు వచ్చిన కాలమును గూర్చి వర్ణించినపుడు ఆ వర్ణనను ఆశ్రయించి పాత్ర ప్రవేశించినచో దానికి ప్రవృత్తక మని పేరు. యిది బీజాంశము లందే ఆవిర్భవించును. సూత్రధారుని వాక్యముగాని వాక్యార్థములుగాని గ్రహించి పాత్ర ప్రవేశించినచో యది కథోద్ఘాతము. సూత్రధారుడు ఒక ప్రయోగమున మరియొక ప్రయోగమును వర్ణించగా ఆ సమయమున పాత్ర ప్రవేశించినచో అది ప్రయోగాతిశయము నాటకాదులకు ఇతి వృత్తము శరీరము. సిద్ధము ఉత్ర్పేక్షితము యని యది రెండు విధములు. ప్రసిద్ధమైని సిద్ధము; కవి కల్పించినది ఉత్ర్పేక్షితము. బీజము, బిందువు, పతాక, ప్రకరి, కార్యము యని ఐదు అర్థ ప్రకృతులు. చేష్టలు కూడ ప్రారంభము ప్రయత్నము ప్రాప్తి సద్భావము నియత ఫల ప్రాప్తి ఫల యోగము యని ఐదు. ముఖము ప్రతి ముఖము గర్భము విమర్శము నిర్వహణము యని క్రమముగా ఐదు సంధులు. అల్పముగా వర్ణితమై బహుధా విస్తరించి ఫలమును కల్గించునది బీజము. నానార్థ రస సంభవ మగు బీజోత్పత్తి కావ్యము నందు కలిగిన సంధికి ముఖము యని పేరు. ఇష్టమైన అర్థము యొక్క రచన, కథాంశము అఖండముగా నుండుట ప్రయోగము నందు అనురాగము గోపనీయ విషయముల గోపనము అద్భుత విషయముల వర్ణనము ప్రకాశింపదగిన విషయములను ప్రకాశింప చేయుట యివి కావ్యాంగముల ఆరు ఫలములు. అంగహీనుడగు మనుష్యునివలె అంగహీన మగు కావ్యము కూడ శ్రేష్ఠము కాజాలదు, దేశ కాలములు లేకుండగ ఇతి వృత్త మేదియు ప్రవర్తించదు. అందుచే వాటిని నియమ పూర్వకముగా స్వీకరించుటకు పదము యని పేరు. దేశములలో భారత వర్షమున, కాలము, కృతాది యుగత్రయమును గ్రహించవలెను. దేశ కాలములు లేకుండ ప్రాణులకు ఎచ్చటను సుఖ దుఃఖోదయము కలుగదు. స్పష్ట్యాదివార్త ప్రసంగ వశమున వర్ణింప వలసి వచ్చినను దోషము లేదు.
అగ్ని మహా పురాణమున నాటక నిరూపణ మను మూడు వందల ముప్పది యెనిమిదవ అధ్యాయము సమాప్తము.