Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ చత్వారింశ దధిక త్రిశతతమో7ధ్యాయః
అథ రీతి నిరూపణమ్
అగ్నిరువాచ :
వాగ్విద్యా సంప్రతి జ్ఞానేరీతిః సాపిచతుర్విధా | పాంచాలీ గౌడ దేశీయా వైదర్భీలాటజాతథా. 1
ఉపచారయుతామృద్ధీ పాంచాలీ హ్రస్వవిగ్రహా | అనవస్థిత సందర్భా గౌడీయా దీర్ఘవిగ్రహా. 2
ఉపచారైర్న బహుభిరుపచారైర్వివర్జితా | నాతికోమల సందర్భావైదర్భీ ముక్తివిగ్రహా. 3
లాటీయూస్ఫుటసందర్భా నాతివిస్ఫుర విగ్రహా | పరిత్వక్తాపి భూయోభిరుపచారైరుదాహృతా. 4
క్రియాస్వవిషయావృత్తిర్భారత్యారభటీతథా | కౌశికీ సాత్వతీచేతిసా చతుర్ధా ప్రతిష్ఠితా. 5
వాక్ర్పధానానరప్రాయా స్త్రీయుక్తాప్రకృతోక్తితా | భరతేన ప్రణీతత్వాద్భారతీ రీతిరుచ్యతే. 6
చత్వార్యంగాని భారత్యావీథీ ప్రహసనం తథా | ప్రస్తావనా నాటకాదేర్వీధ్యంగాశ్చత్రయోదశ. 7
ఉద్ఘాతకం తథైవస్యాల్లపితం స్యాద్ద్వితీయకమ్ | అసత్ర్పలాపో వాక్ఛ్రేణీ నాలికా విషణం తథా. 8
వ్యాహారస్త్రిమతం చైవ ఛలావస్కందితే తథా | గండో7థ మృదవశైవ త్రయోదశ మథోచితమ్. 9
తాపసాదేః ప్రహసనం పరిహాసపరం వచః | మాయేన్ద్ర జాలయుద్దాది బహులార భటిస్మతా.
సంక్షిప్తకార పాతౌచ వస్తూత్థాపన మేవచ. 10
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే రీతినిరూపణంనామ చత్వారింశదధిక త్రిశతతమో7ధ్యాయః.
అగ్నిదేవుడు పలికెను. కావ్యశాస్త్ర జ్ఞాన నిమిత్తమై ఉపయోగించు రీతి పాంచాలీ, గౌడదేశీయ, వైదర్భీ లాటజాయని నాలుగు విధములు, ఉపచారయుతమైనది హ్రస్వసమాసములు కలిది మృదువుగా వున్నది పాంచాలీ. దీర్ఘ సమాసములతో, అనవస్థిత సందర్భము కలది ఆధికోపచార యుక్తరహితమైనది గౌడి. ఉపచారరహితము మిక్కిలి కోమలముగాని కూర్పుకల సమాస వర్జితమగు రీతి వైదర్భి. స్పుటసందర్భము కలది నాతి దీర్ఘ సమాసములు కలది యగరీతి లాటి. చాలమంది విద్వాంసులు పరిత్యజించినను అధికోపచార యుక్తమగు ఈలాటి లభించుచున్నది. క్రియలలో వైషమ్యమును పొందని వాక్యరచనకు వృత్తియని పేరు. భారతీ, ఆరభటీ, కైశికీ, సాత్వతీ, యని అది నాలుగు విధములు. వాక్ర్పధానమైనది, ఎక్కువ పురుషుల నాశ్రయించినది స్త్రీల చేతకూడ ప్రాకృతమునందు ఉపయోగింపబడినది యగు రీతి భరత రచితమగుటచే భారతీయని చెప్పబడును. దీనికి వీథి ప్రహసనము ఆముఖము నాటకాది ప్రరోచనయని, భారతికి నాలుగు అంగములు. ఉద్ఘాతుక, లపిత, అసత్ర్పలాప, నాక్ర్ఛేణీనాలికా, విషణవ్యవహార, త్రిగత. ఛల, అవస్కందిత, గండ, మృదవ ఉచితములు యని వీథికి పదమూడు అంగములు. పరిహాస యుక్తమగు తాపసాద వచనము ప్రహసనము. ఆరభటి యందు మాయ ఇంద్రజాలము యుద్ధము మొదలగునవి వుండును. సంక్షిప్తకారము, పాతము, వస్తూత్థాపనము యని ఆరభటి భేదములు.
అగ్నిమహాపురాణమున రీతి నిరూపణమను మూడువందల నలుబదియవ అధ్యాయము సఘాప్తము.