Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏక చత్వారింశదధిక త్రిశతతమోధ్యాయః
అధ నృత్యాదావంగకర్మ నిరూపణమ్
అగ్నిరువాచ :
చేష్టావిశేష మప్యంగ ప్రత్యంగే కర్మచానయోః | శరీరారంభమిచ్చన్తి ప్రాయః పూర్వో7బలాశ్రయః. 1
లీలావిలాసో విఛ్చిత్తిర్విభ్రమం కిలకించితమ్ | మోట్టాయితం కుట్టమితం బిబ్బోకోలలితం తథా. 2
వికృతం క్రీడితం కేళిరితి ద్వాదశ##ధైవసః | లీలేష్టజన చేష్టాను కరణం సంవృతక్షయే. 3
విశేషం దర్మయన్కించిద్విలాసః సద్భిరిష్యతే | హసితక్రంది తాదీనాం సంకరః కిలకించితమ్. 4
వికారకో7పి బిబ్బోకో లలితం సౌకుమార్యతః శిరః పాణిరురః పార్శ్వం కటిరంఘ్రిరి తిక్రమాత్. 5
అంగాని భూతలాదీని ప్రత్యంగాన్యభి జానతే | అంగప్రత్యంగయోః కర్మపయత్న జనతం వినా. 6
న ప్రయోగం క్వచిన్ముఖ్యం తిరశ్చీనంచ తత్క్వచిత్ | ఆ కంపితం కంపితంచ ధూతం విధూతమేవచ. 7
పరివాహిత మాధూత మవధూత మథా77చితమ్ | నికుంచితం పరావృత్త ముత్షిప్తం చాప్యధోగతమ్. 8
లలితం చేతివిజ్ఞేయం త్రయోదశ విధంశిరః | భ్రుకర్మ సప్తధాజ్ఞేయం పాతనే భ్రూకుటీ ముఖమ్. 9
దృష్టిస్త్రిధా రసస్థాయి సంచారి ప్రతిబంధనా | షట్‌త్రింశ##ద్భేద విధురా రసజాతత్ర చాష్టధా. 10
నవధా తారకాకర్మ భ్రమణం చలనాదికమ్ | షోడా చ నాసికాజ్ఞేయానిఃశ్వాసో నవధామతః. 11
షోఢౌష్ఠకర్మకం పావం సప్తధా చిబుకక్రియా | కలుషాది సుఖం షోఢా గ్రీవానవవిధాస్మతా. 12
అసంయుతః సంయుతశ్చ భూమ్నాహస్తః ప్రముచ్యతే | పతాకస్త్రీపతాకశ్చ తథావై కర్తరీ ముఖః. 13
అర్ధచంద్రోత్కరాలశ్చ శుకతుండ స్తథైవచ | ముష్టిశ్చ శిఖరశ్చైవ కపిత్థః ఖేటకాముఖః. 14
సూచ్యాస్యః పద్మకోశో హిశిరాః సమృగశీర్షకాః కాంబూలకాల పద్మౌచ చతురభ్రమరౌ తథా. 15
హంసాస్య హంసపక్షౌచ సన్దంశ ముకలౌ తథా | ఊర్ణనాభస్తామ్ర చూడశ్చతుర్వింశతిరిత్యమీ. 16
అసంయుతకరాః ప్రోక్తాః సంయుతాస్తు త్రయోదశ | అంజలిశ్చ కపోతశ్చ కర్కటః స్వస్తికాస్తథా. 17
కటకోవర్ధమానశ్చాప్యసంగో నిషధస్తథా | దోలః పుష్పపుటశ్చైవ తథా మకర ఏవచ. 18
గజదంతో బహిఃస్తంభో వర్దమానో7పరే కరాః | ఉరః పంచవిధం స్యాత్తు ఆభుగ్న నర్తనాదికమ్. 19
ఉదరం దురరి క్షామం ఖండం పూర్ణమితి త్రిధా | పార్శ్వయోః పంచకర్మాణి జంఘాకర్మచ పంచధా. 20
అనేకథా పాదకర్మ నృత్యాదౌ నాటకే స్మృతమ్ |
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే నృత్యాదావంగ కర్మ నిరూపణం
నామైక చత్వారింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.
అగ్నిదేవుడు పలికెను. ఇపుడు చేష్టాది విశేషముమ అంగ ప్రత్యంగములను వాటి కర్మలను చెప్పెదను. దానిని ఆంగిక కర్మయందురు. ఇదిసాధారణముగా స్త్రీ సంశ్రితము. లీలా, విలాస, విచ్ఛిత్తి. విభ్రమ, కిలి కించిత, మోట్టాయిత, కుట్టమితా, బిబ్బోక, లలిత, విహృత, క్రీడిత, కేళులుయని అది పండ్రెండు విధములు. ఆవృత ప్రదేశమున ఇష్టజన చేష్టను అనుకరించుట లీల. కొంచెము విశేషమును చూపించునది విలాసము. హాసరో దనాదుల సంకరము కిలికించితము. వికారము బిబ్బోకము; సుకుమార చేష్టలలితము. శిరస్సు, హస్తములు వక్షము, పార్శ్వము కటి, పాదముయని, ఇవి క్రమముగా యంగములు. కనుబొమలు మొదలగునవి ప్రత్యంగములు. అంగ ప్రత్యంగముల ప్రయత్న జనితమగు చేష్టలేకుండ ప్రయోగము ఎచ్చటను కలుగదు. కొన్నిచోట్ల ముఖ్యముగను కొన్నిచోట్ల వక్రరూపమునకు అది సాధింపబడును. ఆకంపిత, కంపిత, ధూత, విధూత పరివాహిత, ఆధూత, అవధూత, ఆచిత, నికుంచిత, పరావృత, ఉత్షిప్త, ఆధోగత లోలితములని శిరః కర్మ పదమూడు విధములు. కనుబొమ్మల చేష్టఏడు విధములు. వీటిలో భ్రుకుటీ మొదలగునవి ప్రధానములు. రస, స్థాయి, సంచారి భావముల, సంబంధమును బట్టి దృష్టి మూడు విధములు. దీనికి ముప్పది ఆరు భేదములు కూడ వుండును. అందురసజ దృష్టి, యెనిమిది విధములు. భ్రమణ చాలనాదికమగు తారకాకర్మ తొమ్మిది విధములు. నాసికాకర్మ ఆరు విధములు. నిశ్వాసము తొమ్మిది విధములు; ఓష్ఠకర్మ ఆరు విధములు; పాదకర్మ ఆరు విధములు; చిబుక కర్మ ఏడు విధములు; గ్రీవా కర్మ తొమ్మిది విధములు, హస్తకర్మ సాదారణముగ అసంయుతము సంయుతము, యని రెండు విధముల వుండును. పతాక త్రిపతాక, కర్తరీ ముఖ అర్ధ చంద్ర ఉత్కరాళ, శుకతుండ, ముష్టి, శిఖర, కపిత్థ, కటకా ముఖ సూచ్యాస్య, పద్మకోశ, శిర, మృగశీర్ష, కాంబోల, కాల పద్మ, చతుర, భ్రమర, హంసాన్య హంసపక్ష, సందంశ, ముకుళ, ఊర్ననాభ తామ్ర చూడములని అసంయుత హస్తమునకు ఇరువది నాలుగు భేదములు. అంజలి, కపోత, కర్కట, స్వస్తిక, కటవ వర్ధమాన, అసంగ, నిషద, దోల, పుష్పపుట, మకర, గజదంత, బెస్తంభములు యని సంయుత హస్తమునకు పదమూడు భేతముల; సంయుత హస్తమునందు ఇంకను భేదములుండ వచ్చును. వక్ష స్థల కర్మ ఆభుగ్న నర్తనాది భేదముచే ఐదు విధములు; ఉదరకర్మ దురతి క్షామ ఖండము, పూర్ణము అని మూడు విధములు; పార్శ్వకర్మలు ఐదు; జంఘాకర్మలు ఐదు; నాట్యనృత్యాదులందు పాదకర్మ అనేక విధములుగా నుండును.
అగ్ని మహాపురాణమున నృత్యాద్యంగకర్మ నిరూపణమను మూడువందల నలుబది ఒకటవ అధ్యాయము సమాప్తము.