Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ త్రిచత్వారింశదధిక త్రిశతతమో7ధ్యాయః.
అథ శబ్దాలంకారాః
అగ్ని రువాచ :
స్యాదావృత్తిరనుప్రాసో వర్ణానాం పదవాక్యయోః | ఏకవర్ణా7నేక వర్ణావృత్తేర్వర్ణగుణోద్విధా. 1
ఏకవర్ణగతా వృతేర్జాయనే పంచవృత్తయః మధురాలలితా ప్రౌఢా భద్రా పురుషయాసహ. 2
మధురాయాశ్చ వర్గాన్తా దధోవర్గ్యా రణౌస్వనౌ | హ్రస్వస్వ రేణా న్తరితౌ సంయుక్తత్వంనకారయోః. 3
నకార్యావర్గ్య వర్ణానామావృత్తిః పంచమాధికా | మహాప్రాణోష్మ సంయోగ ప్రవిముక్త లమూత్తరౌ. 4
లలితాబల భూయిష్ఠా ప్రౌఢాయా పణవర్గజా | ఊర్ద్వంరేఫేవ యుజ్యన్తే నటవర్గో న పంచమాః. 5
భద్రాయాం పరిశిష్టాఃస్యు పరుషాసా7భి ధీయతే | భవన్తియస్యా మూష్మాణః సంయుక్తా స్తత్తదక్షరైః. 6
అకార వర్జమావృత్తిః స్వరాణా మతిభూయసీ | అనుస్వారవిసర్గౌచ పారుష్యాయ నిరంతరౌ. 7
శషసారేఫసంయుక్తాశ్చాకారశ్చాపి భూయసా | అంతఃస్థా భిన్నమాభ్యాంచహః పారుష్యాయ సంయుతః 8
అన్యథాసి గురుర్వర్ణః సంయుక్తే పరిపంథిని | పారుష్యాయా77ధి మాంస్తత్ర పూజితానతు పంచమీ. 9
క్షేపే శబ్దానుకారేచ పురుషాపి ప్రయుజ్యతే | కర్ణాటీ కౌన్తలీ కౌన్తీ కౌంకణీ వానవాసికా. 10
అగ్ని దేవుడు చెప్పెను. పద వాక్యము లందు వర్ణముల ఆవృత్తికి అను ప్రాస అని పేరు. ఏక వర్ణము అనేక వర్ణము అని వృత్త్యను ప్రాస వర్ణ సముదాయము రెండు విధములు, ఏక వర్ణగతా వృత్తి వలన మధుర లలిత ప్రౌఢభద్ర పరుషలను ఐదు వృత్తులు ఏర్పడును. మధుర వృత్తియందు వర్గ పంచమ వర్ణము క్రింద ఆ వర్గకే చెందిన అక్షరములు, హ్రస్వ స్వర అంతరితములగు ర, ణ, మ, న, లు నకార ద్వయ సంయోగము కూడ వుండును. వర్గ్య వర్ణములను ఐదు పర్యాయములు మించి ఆ వృత్తి చేయరాదు. మహా ప్రాణ ఊష్మ వర్ణముల సంయోగముతో కూడ ఉత్తరోత్తర లఘ్వక్షరములు కల రచన మధుర యని చెప్పబడును. లలిత రచనలో వకారలకారములు అధికముగా ప్రయోగింపబడును. రేప సంయుక్త ప, కా ర నకారములు వర్గ్య వర్ణములు దేని యందు ప్రయోగింపబడునో టవర్గ పంచమాక్షరములు వుండవో అది ప్రౌఢా వృత్తి. మిగిలిన ఆసంయుక్తములగు రేపనకారాది కోమల వర్ణములు ప్రయోగించిన వృత్తి భద్ర లేద కోమల వృత్తి యని చెప్పబడును. ఊష్మలు భిన్న అక్షరములతో సంయుక్తములై ప్రయోగింపబడినచో పరుషావృత్తి. దీని యందు ఆకార భిన్నములగు స్వరములు అత్యధికముగా ఆ వృత్తి చెందుచుండును. అనుస్వార విసర్గలు నిరంతరము ప్రయోగింపబడును. రేప సంయుక్త శ, ష, స, ల ప్రయోగము ఎక్కువగా అకార ప్రయోగము అధికముగా అంతస్థవర్ణ ప్రయోగము రేపానంతస్థలచే భేదితము సంయుక్తము యగు హకార ప్రయోగము పదుషత్వమును కలిగించును. గురు వర్ణములు మాధుర్య విరుద్ధములగు వర్ణములతో సంయుక్తములై నచో పరుషత్వము కలుగును. పరుష రచనలో వర్గాద్యక్షరమే సంయుక్తము. గురువు అయినచో శ్రేష్ఠము. పంచమ వర్ణము సంయుక్తమైనచో ప్రశస్తము కాదు. ఎవరినైవన ఆక్షేపించుట యందును కఠోర శబ్దానుకరణము నందును పరుష వృత్తిని ప్రయోగించవలెను. క, చ, ట, త, వ వర్గలను అంతస్థ ఊష్మలను క్రమముగ ఆవర్తనముచేయుటచే ఏర్పడు వృత్తికి కర్నాటి, కౌంతలీ, కౌంకీ కౌంకణీ, వాణ వాసికా, ద్రావిడీ, మాథూలీ, మాత్సీ, మాగధీ, తామ్ర లిప్తికా, ఔండ్రీ పౌండ్రీ అను పండ్రెండు భేదము లుండును.
ద్రావణీ మాధవీ పంచవర్ణాంతః స్థోష్మభిః క్రమాత్ ః అనేక వర్ణావృత్తిర్వా భినార్థ ప్రతిపాదికా. 11
యమకం సావ్యపేతంచ వ్యపేతంచేతి తద్ద్విధా | ఆనన్తర్యాద వ్యపేతం వ్యపేతం వ్యవధానతః. 12
ద్వైవిధ్యేనానయోః స్థానపాదభేదా చ్చతుర్విధమ్ | ఆదిపాదాది మధ్యాన్తే ష్వేకద్వి త్రినియోగతః. 13
సప్తధా సప్తపూర్వేణ చేత్పాదేనోత్త రోత్తరః | ఏకద్విత్రి పదారంభస్తుల్యః షోఢాతదా పరమ్. 14
తృతీయం త్రివిధం పాదస్యాది మాధ్యాన్త గోచరమ్ | పాదాంత యమకంచైవ కాంచీయమక మేవచ. 15
సంసర్గయమకంచైవ విక్రాస్త యమకంతథా | పాదాదియమకంచైవ తథామ్రేడిత మేవచ. 16
చతుర్వ్యవసితం చైవ మాలాయమకమేవచ | దశధాయమకం శ్రేష్టం తద్భేదా బహవో7పరే. 17
స్వతంతస్యాన్యతన్త్రన్య పదస్యావర్తనా ద్విధా | భిన్న ప్రయోజన పదస్యావృత్తిం మనుజావిదుః 18
ద్వయోరావృత్తపదయోః సమస్తాస్యాత్సమాసతః | అసమాసాత్త యోర్వ్యస్తా పాదేత్వేకత్ర విగ్రహాత్. 19
వాక్యస్యావృత్తి రప్యేవం యథాసంభవమిష్యతే | అలాంకారాద్యనుప్రాసో లఘుమధ్యే (ప్ర్యే)వమర్హణాత్. 20
యయాకయాచి ద్వృత్తవాయత్స మానమనుభూయతే | తద్రూపాది పదాసత్తిః సానుప్రాసారసావహా. 21
గోష్ఠ్యాం కుతూహలాధ్యాయీ వాగ్బంధశ్చిత్రముచ్యతే |
భిన్నార్థ ప్రతిపాదక మగు అనేక వర్ణా వృత్తికి యమక మని పేరు. అవ్యపేతము వ్యపేతము యని అది రెండు విధములు. నిరంతరా వృత్తి యున్నది, అవ్యపేతము. వ్యవధానముతో ఆ వృత్తి యున్నది వ్యపేతము. స్థాన పాద భేదములచే ఈ రెండుంటికిని రెండేసి భేదములు ఏర్పడును. మొదటి పాదము యొక్క ఆది మధ్య అంతము లందు ఒకటి రెండు మూడు వర్ణములు పర్యాయములు ఆవృత్తములు అయినచో మొత్తము ఏడు భేదములు ఏర్పడును. ఏడు పాదములలో ఉత్తరోత్తర పాదమును ఒకటి, రెండు, మూడు పదములతో ప్రారంభించినచో అంతిమ పాదము ఆరు విధములగును, తృతీయ పాదమున ఆది మధ్యాంతము లందు ఆవృత్తి చేసినచో మూడు విధములగును. శ్రేష్ఠయమకము పాదాంతయమకము, కాంచీ యమకము సముద్గ యమకము విక్రాంత యమకము వక్రవాల యమకము సందష్టము పాదాది యమకము ఆమ్రేడితము చతుర్వ్యవ సితము, మాలాయమకము యని పది పది విధములు. వీటిలో కూడ అనేక భేదము లుండును. భిన్నార్థ వాచక పదమును ఆ వృత్తి చేసినచో ఆది స్వతంతము అస్వతంత్రము అని రెండు విధములు. రెండు ఆ వృత్త పదములకు సమాసమున్నచో సమస్తము సమాసములేనిచే వ్యస్తము. ఒకపాదమున విగ్రహముండుటచే అదివ్యస్తమగును. యథా సంభవముగ, వాక్యావృత్తి ఈ విధముగా జరుగును. అనుప్రాస యమకాదులు పండితులచే సమ్మానితములు. పదావృత్తి యైనను వాక్యా వృత్తి యైనను ఏ వర్ణ సమూహము సమానముగ కన్పట్టునో దానిని మొదట వుంచి సాను ప్రాస పదరచన చేసినచో యది రసావహమే వుండును. కవి గోష్టిలో కౌతూహల పూర్వకముగ చదువబడు వాగ్బంధము చిత్రము.
ప్రశ్నః ప్రహేళికా గుప్తం చ్యుతదత్తేతథోభయమ్. 22
సమస్యాసప్త తద్బేదా నానార్థస్యానుయోగతః | యత్రప్రదీయతే తుల్యవర్ణ విన్యాసముత్తరమ్. 23
సప్రశ్నః స్యాదేకపృష్ట ద్విపృష్టోత్తర భేదతః . ద్విధైక పృష్టో ద్వివిధః సమస్తో వ్యస్తఏవచ. 24
ద్వయోరప్యర్థయోర్గుహ్యమానశబ్దాప్రహేళికా | సాద్విధార్థిచ శాబ్దీచ తత్రార్థీ చార్థబోధతః. 25
శబ్దావ బోధతః శాబ్దీప్రాహుః షోఢావ్రహేలికామ్ | యస్మిన్గుప్తేపి వాక్యాంగ భావ్యర్థో7పారమార్థికః. 26
తదంగ విహితాకాంక్షస్తద్గుప్తం గూఢమప్యదః | యతార్థాంతర నిర్భాసో వాక్యాంగచ్య వనాదిభిః. 27
తదంగ విహితా కాంక్షస్తచ్చ్యుతం స్యాచ్చతుర్విధమ్ | స్వరవ్యం జనబిందూనాం విసర్గన్య చ విచ్యుతే. 28
దత్తే7పి యత్రబాక్యాంగే ద్వితీయో7ర్థః ప్రతీయతే | దత్తం తదాహుస్తద్భేదాః స్వరాద్యైః పూర్వవన్మతాః.
అవనీతాక్షరస్థానేన్యస్తే వర్ణాంతరే7పిచ | భాసతే7ర్థాంతరం యత్ర చ్యుతదత్తం తదుచ్యతే. 30
సుశ్లిష్ట పద్యమేకం యన్నానాలోకాంశ నిర్మితమ్ | సాసమస్యా పరస్యాత్మ పరయోః కృతిసంకరాత్. 31
దుఃఖేన కృతమత్యర్థం కవిసామర్ద్య సూచకమ్ | దుష్కరం నీరసత్వేపి విదగ్ధానాం మహోత్సవః. 32
నియమాచ్చ విదర్భాచ్చ బంధాచ్చ భవతిత్రిధా | కవేఃప్రతిజ్ఞా నిర్మాణ రమస్య నియమఃస్మృతః. 33
స్థానేనాపి స్వరేణాపి వ్యంజనేనాపి సాత్రిధా | వికల్పః ప్రాతిలోమ్యాను లోమ్యాదేవాభి ధీయతే. 34
ప్రాతిలోమ్యాను లోమ్యంచ శ##బ్దేనార్థేన జాయతే | అనేక ధావృత్త వర్ణవిన్యాసైః శిల్పకల్పనా. 35
తత్తత్ర్పసిద్ధవస్తూ నాంబంధ ఇత్యభిధీయతే ః గోమూత్రికార్ధ భ్రమణ సర్వతోభద్ర మంబుజమ్. 36
చక్రం చక్రాబ్జకం దండోముర జాశ్చేతి చాష్టధా | ప్రత్యర్ధం ప్రతిపాదం స్యాదేకాన్తర సమాక్షరా. 37
ద్విధాగోమూత్రికాంపూర్వా మాహురశ్వ పదాంపరే | అంత్యాం గోమూత్రికాంధేనుం జాలబంధం వదన్తిహి.
అర్ధాభ్యామర్ధ పాదైశ్చ కుర్యాద్విన్యాన మేతయోః |
ప్రశ్నము ప్రహేళికా గుప్తము, చ్యుతాక్షరము, దత్తాక్షరము, చ్యుత దత్తాక్షరము, సమస్యయని ఏడు ప్రహేళికా భేదములు, సమానాంతర విన్యాస పూర్వకముగా ఉత్తరము ఇచ్చినచో యది ప్రశ్న ప్రహేళికా. ఏకవృష్ఠోత్తరము ద్విప్నష్టోత్తరమని అది రెండు విధములు, సమస్తము వ్యస్తము అని మొదటిది రెండు విధములు. రెండు అర్థములను చెప్పు శబ్దములుగూఢ ముగ నున్న దానిని ప్రహేళిక యందురు. ఆర్థీశాబ్దియని యిది రెండు విధములు. అర్థ బోధతో సంబంధించని ఆర్థి. శబ్ద బోధతో సంబంధించినది శాబ్ది, ఈ విధముగా ప్రహేళికా ఆరు విధములు. వాక్యాంగము గుప్తమైనను సంభావ్యమగు ఒకఅపార మార్థిక అర్థము దేని ఆంగమునందు ఆకాంక్షా యుక్తమైవుండునో అది గుప్తము. దీనికే గూఢమని కూడపేరు. వాక్యాంగ వైకల్యముచే అర్థాంతర ప్రతీతి వికాలితాంగమునందు సాకాంక్షముగ నున్నచో అదిచ్యుతాక్షర. స్వరవ్యంజన, బిందు విసర్గలచ్యుతిని బట్టి ఇది నాలుగు విధములు. వాక్యాంగము యొక్క వికలాంశము, పూర్తిచేసిన పిమ్మట కూడ ద్వితీయార్థ ప్రతీతి కల్గించునది దత్తాక్షర, స్వరాదులను బట్టి దీనికి కూడ నాలుగు భేదము లుండును. లుప్తమగు వర్ణము స్థానమున మరియొక్క అక్షరము వుంచినను అర్థాంతరా భాసము కల్గించునది చ్యుత దత్తాక్షర. ఒక పద్యాంశముతో నిర్మితమై మరియొక పద్యముతో సంబంధించినది సమస్య. సమస్య ఇతరులదగును. దాని పూర్తి తనదగును. ఈ విధముగా స్వపర, కృతి సాంకర్యముచే సమస్య పూర్తియగును. చిత్రకావ్యము అతిక్లేశ సాధ్యము అగుటచే కవియొక్క కవితా శక్తిని సూచించును. అది రసవిహీనమైనను విదగ్ధులకు మహోత్సవము, నియము విదర్భబంధములను బట్టి ఇది మూడు విధములు. రమణీయ కవిత్వమును చెప్పు కవియొక్క ప్రతిజ్ఞ నియమము. ఇది స్థానస్వర వ్యంజనములను బట్టి మూడు విధములు. ప్రాతిలో మ్యానులోమ్యములచే వికల్పన చేయబడును. ప్రాతిలోమ్యానులోమ్యములు శబ్దమును బట్టియు, అర్థమును బట్టియు ఏర్పడును. వివిధ వృత్తముల వర్ణములను ఆయా వస్తువుల ఆకారమున కూర్చుటకు బంధమని పేరు. గోమూత్రికా, అర్థ భ్రమకము, సర్వతో భద్రము, కమలము, చక్రము, చక్రాబ్జకము, దండము, మురజముయని బంధములు యెనిమిది విధములు. రెండు శ్లోకార్థము లందును ప్రతిపాదమునందు ఏకైకాక్షర వ్యవధానముచే అక్షరసామ్యము వున్నచో అదిగో మూత్రికాబంధము. పూర్వగోమూత్రికా ఆంత్యగో మూత్రికాయని ఇదిరెండు విధములు. వీటికి అశ్వపదధేనుజాల బంధయని కూడ పేరు. ఆర్ధభాగములు రెండింటి యందును ఏకైకాక్షర వ్యవధానమున అక్షరసామ్య మున్నది మొదటిది. ఒక్కొక్క పదమునందు వున్నది రెండవది. వాటిని అర్ధభాగము లందును. అర్ధపాదము నందును విన్యాసము చేయవలెను.
న్యస్తానామిహ వర్ణానామదో7ధః క్రమభాగినామ్. 39
అధో7ధః స్థితవర్ణానాం యావత్తుర్య వదంనయేత్| తుర్యపాదాన్నయేదూర్ధ్వం పాదార్ధం ప్రాతిలోమ్యతః. 40
తదేన సర్వతోభద్రం త్రివిధం సరసీరుహమ్ | చతుష్పత్రంతో విఘ్నం చతుష్పత్రేఉభేఅపి. 41
అథ ప్రథమాపాద్య మూర్ధన్యం త్రిపదాక్షరమ్ | సర్వేషామేవ పాదానామన్తే తదుపజాయతే. 42
ప్రాక్పదస్యాన్తిమం ప్రత్యక్పాదాదౌ ప్రాతిలోమ్యతః అంత్యపాదాన్తియం చాద్యపాదాదా వక్షరద్వయమ్. 43
చతుశ్ఛదే భ##వేదష్టచ్ఛదే వర్ణత్రయంపునః | స్యాత్షోడశచ్ఛదేత్వే కాన్తరంచేదేక మక్షరమ్. 44
కర్ణికాం తోలయేదూర్ధ్వం పత్రాకారాక్షరావలిమ్ | ప్రవేశ##యేత్కర్ణికాయాంచతుష్పత్ర సరురుహే. 45
కర్ణికాయం లిఖేడేకం ద్వేద్వే దిక్షు విదుక్షుచ | ప్రవేశ నిర్గమౌదిక్షు కుర్యాదష్టచ్ఛదేం7బజే. 46
విశ్వగ్విషమ వర్ణానాం తావత్సత్రావళిజుషామ్ | మధ్యో సమాక్షరన్యాసః సరోజేషోడశచ్ఛదే. 47
ద్విధాచక్రం చతురరం షడరం తత్ర చాదిమమ్ | పూరోర్దే సదృశావర్ణాః పాదప్రథమ పంచమాః. 48
అయుజోశ్వయుజశ్చైవ తుర్యాషప్యష్టమావపి | తస్యోవపపాద ప్రాకృత్య గరేఘచ యథాక్రమమ్. 49
క్రమముగా క్రింద క్రిందుగా వ్రాసిన వర్ణములతో క్రింద క్రింద వ్రాసిన వర్ణములతో కలువగా చతుర్థ పాదము పూర్తియగు వరకు నడిపించవలెను. చతుర్థపాదము పూర్ణమై పిమ్మట అక్షరములను ప్రతితోమ క్రమమున పాదార్ధ పర్యంతము పైకి తీసుకుని పోవలెను. ఈ విధముగా మూడు విధములగు సర్వతో భద్రము ఏర్పడును. కమల బంధము చతుర్ధళము, అష్టదళము షోడశదళము యని మూడు విధములు. ప్రథమ పాదము యొక్క పై మూడు పదముల అక్షరములను అన్నిపాదముల చివరను ఉంచవలెను. పూర్వపాద అంతిమ వర్ణమును ప్రత్యక్పాదాది యందు ప్రాతిలోమ్య క్రమమున ఉంచవలెను. అంతిమపాద అంతిమాక్షరద్వయమును ప్రథమ పాదాది యందు వుంచవలెను. ఈ విధముగా చతుర్దళకమలము ఏర్పడును. అష్టదళ కమలమునందు అంత్యపాద అంత్యాక్షరత్రయమును ప్రథమపాద ఆదియందు వుంచవలెను. షోడశదళ కమలమున రెండు అక్షరముల మధ్య కర్ణిక దాని మధ్యయందు ఒక అక్షరము కర్ణికాంతమున పైభాగమున పత్రాకారాక్షర పంక్తి వ్రాసి దానిని కర్ణికలో చేర్చవలెను. ఈ విషయము చతుర్ధళకమలము విషయమున చెప్పబడిననది. కర్ణికయందు ఒక అక్షరము వ్రాసి దిగ్విదుక్కులందు రెండేసి అక్షరములు వ్రాసి ప్రత్యేక దిక్కుయందు ప్రవేశ నిర్గమ మార్గము వ్రాయవలెను. ఇది అష్టదళ కమలము విషయమున చెప్పబడినది. నాలుగు వైపుల ఎన్ని విషమవర్ణములున్నవోయన్ని పత్రము లేర్పరచి న్యాసము చేసి మధ్య కర్ణికయందు సమాక్షరములను ఏకాక్షర రూపమున న్యాసము చేయవలెను. ఇది షోడశదళ కమలమునకు సంబంధించిన విషయము. చతరరము, షడరము అని చక్రబంధము రెండు రెండు విధములు. చతురరమునందు పూర్వార్ధమున సమవర్ణమును ప్రతిపాదము యొక్క ప్రథమ పంచమాది విషమ వర్ణములను చతుర్థ అష్టమ వర్ణములను క్రమముగా ఉత్తర పూర్వ దక్షిణ, పశ్చిమారములందుంచవలెను.
స్యాత్పాదార్థ చతుష్కంతు నాభౌతస్యాద్య మక్షరమ్ | పశ్చిమారావధి నయేన్నేమౌ శేషేపదద్వయీ. 50
తృతీయం తుర్య పాదాన్తే ప్రథమో సదృశావుభౌ | వర్ణౌ పాదత్రయ స్యాపి దశమః సదృశోయది. 51
ప్రథమేచరమేతస్య షడ్వర్ణాః పశ్చిమేయది ః భవన్తిద్వ్యన్తరం తర్హాబృహచ్ఛక్ర ముదాహృతమ్. 52
సమ్ముఖారద్వయే పాదమేకైకం క్రమశోలిఖేత్ | నాభౌతు వర్ణం దశమం నమౌతుర్యపదం నయేత్. 53
శ్లోకస్యాద్యన్త దశమాః సమా ఆద్యన్తి మౌయుజోః | ఆదౌవర్ణః సమౌతుర్య పంచమావాద్యతుర్యయోః. 54
ద్వితీయయాతి లోమ్యేన తృతీయం జాయతేయది | పదం విదధ్యాత్పత్రస్య దండచక్రాబ్జకం కృతేః. 55
ద్వితీ¸°ప్రాగ్దలే తుల్యౌ సప్తమౌచ తథాపరౌ | సదృశావుత్తరదలౌ ద్వితీయాభ్యా మథార్ధయోః. 56
ద్వితీయ షష్ఠాః సదృశాశ్చతుర్థ పంచమావపి | ఆద్యన్తపాదయోస్తుల్యౌ వరార్థ సప్తమావపి. 57
సమౌతుర్యం పంచమన్తు క్రమేణ వినియోజయేత్ | తుర్యౌయోజ్యౌతుతద్వచ్చదలాంతాః క్రమపాదయోః. 58
అర్ధయోరన్తి మాద్యోతుమురజే నదృశావుబా | పాదార్ధపతితోవర్ణః ప్రాతిలోమ్యాను లోమతః. 59
అంతిమం పరిబధ్నీ యాద్యావత్తుర్య మిహాదిమత్ | పాదాతుర్యాద్య దేవా77ద్యం నవమాత్షోడశాదపి. 60
అక్షరాత్పుటకే మధ్యే మధ్యే7క్షర చతుష్టయమ్ | కృత్వా కుర్యాద్యథైస్తస్య మురజాకారతా భ##వేత్. 61
ద్వితీయం చక్రశార్దూల విక్రీడితక సమ్పదమ్ | గోమూత్రీకా సర్వవృత్తైరన్యే బంధాస్త్వ నుష్టుభా. 62
నామధేయం యదినచేదమీషు కవికావ్యయోః | మిత్రధేయాని తుష్యన్తి నామిత్రః ఖిద్యతే తథా. 63
బాణ బాణాసన వ్యోమఖడ్గ ముద్గరశక్తయః . ద్విచతుర్థ త్రిశృంగాటా దంభోలి ముసలాంకుశాః. 64
పదం రథస్య నాగస్య పుష్కరిణ్యసిపుత్రికా | ఏతే బంధా స్తథాచాన్యే ఏవంజ్ఞేయాః స్వయంబుధైః. 65
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శబ్దాలంకార నిరూపణంనామ త్రిచత్వారింశదధిక త్రిశతతమో7ధ్యాయః.
ఉత్తర పాదార్ధ అక్షర చతుష్టయమును నాభియందును, దాని ఆద్యక్షరమును వెనుకటి రెండు అరములందును, మిగిలిన రెండు పదములను నేమియందును స్థాపించవలెను. తృతీయాక్షరమును చతుర్థ పాదాంతమునందును, ప్రథమ సమవర్ణద్వయమును, మూడు పాదముల అంతమునందును వుంచవలెను. దశమాక్షరము సమమైనచో దానిని ప్రథమార మందును, ఆరు అక్షరములను పశ్చిమారము నందును ఉంచవలెను. వాటిని రెండేసి అక్షరముల వ్యవధానముతో వుంఛ వలెను. ఇట్లు బృహచ్చక్రము ఏర్పడును. ఎదుటనున్న రెండు అరములపై క్రమముగా ఒక్కొక్క పాదమును వ్రాయవలెను. నాభియందు దశమాక్షరమును వ్రాసి చతుర్థ పాదమును నేమివద్దకు తీసుకుని వెళ్ళవలెను. శ్లోకము యొక్క ఆది అంత దశమాక్షరములును ద్వితీయ చతుర్థ చరణముల ఆద్యంత్యాక్షరములను ప్రథమ చతుర్థ చరణముల ప్రథమ, చతుర్థ, పంచమ వర్ణములును, సమములుగా వుండవలెను. ద్వితీయ పాదమును విలోమ క్రమమున చదువగ, తృతీయ పాదము ఏర్పనిచో దానిని పత్ర సాధనమున వుంచగా దండ చక్రాబ్జబంధము ఏర్పడును. పూర్వార్ధమున రెండు పాదముల ద్వితీయాక్షరములును ఉత్తరార్ధమును రెండు పాదముల సప్తమాక్షరములును సమానములై వుండవలెను ద్వితీయా క్షరములకు బట్టి పూర్వార్ధ ఉత్తరార్ధములు తుల్యములై వుండవలెను. ద్వితీయషష్ట చతుర్థ పంచమాక్షరములు తుల్యములై వుండవలెను. ఉత్తరార్ధమున సప్తమ ప్రథమ చతుర్థ పాదముల ఆ అక్షరములతో సమానములైన చతుర్థ పంచమ అక్షరములను క్రమముగా కూర్చవలెను. క్రమపాదము లందున్న చతుర్థాక్షరములను, దళాంత వర్ణములను వెనుకటి వలె స్థాపించవలెను. మురజ బంధమున రెండు శ్లోకార్ధముల అంతిమ ఆద్యక్షరము సమానములై వుండవలెను. పాదార్ధము నందున్న వర్ణములను ప్రాతిలోమ్యాను లోమ్య క్రమముతో వుంచి అంతిమాక్షరము చతుర్థవాద ఆద్యక్షరమగునట్లు కూర్చ వలెను. చతుర్థపాద ఆద్యక్షరమును దానినుండి నవమ, షోడశాక్షరములను పుటకకము మధ్య మధ్య నుండి నాలుగేసి అక్షరములను కూర్చవలెను. ఈ విధముగా మురజ బంధము ఏర్పడును. ద్వితీయ చక్రము శార్దూల విక్రీడితముతో చేయవచ్చును. గోమూత్రికా బంధమును అన్ని చంధస్సులలోను నిర్మించవచ్చును. మిగిలిన బంధములన్నియు అనుష్టుఫ్ ఛందస్సుచే నిర్మింపబడును. ఈ బంధములలో కవికావ్యముల నామధేయములు లేకున్నచో మిత్రులు సంతుష్టులగుదురు. శత్రువులు కూడ ఖిన్నులు కారు. బాణ ధునుస్, వ్యోమ, ఖడ్గ, ముద్గర, శక్తి ద్విశృంగాట, తిశృంగాట చతుశ్ముంగాట వజ, ముసల, అంకుశ, రథపద, నాగపత పుష్కరిణీ, అసి పుత్రికాది ఆకారములలో కూడ చిత్ర బంధములు వ్రాయబడును. వీటిని ఇంకను అధికమగు చిత్రబంధమును విద్వాంసుడు స్వబుద్ధిచే తెలుసుకొనవలెను.
అగ్నిమహాపురాణమున శబ్దాలంకార నిరూపణమును మూడువందల నలభైమూడవ అధ్యాయము సమాప్తము.