Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచ చత్వారింశదధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ శబ్దార్థయోరలంకారాః

అగ్ని రువాచ :

శబ్దార్థయోరలంకారో ద్వావలంకురుతే సమమ్‌ | ఏకత్రనిహితోహారః స్తనం గ్రీవామివస్త్రియాః. 1

ప్రశస్తిః కాన్తిరౌచిత్యం సంక్షేపోయావదర్థతా | అభివ్యక్తిరితివ్యక్తం షడ్‌భేదాస్తస్య జాగ్రతి. 2

ప్రశస్తిః పరవన్మర్మ ద్రవీకరణ కర్మణః | వాచోయుక్తిర్ద్విధాసాఛ ప్రేమోక్తిస్తుతి భేదతః. 3

ప్రేమోక్తిస్తుతి పర్యా¸° ప్రియో క్తిర్గుణకీర్తనే | కాంతిః సర్వమనోరుచ్య వాచ్యవాచక సంగతిః. 4

యథావస్తు తథారీతిర్యథావృత్తి స్తథారనః | ఊర్జస్విమృదు సందర్భా దౌచిత్యముపజాయతే. 5

సంక్షేపో వాచకైరల్పైర్బ హోరర్థస్యసంగ్రహః అన్యూనాధికతా శబ్దవస్తు నోర్యావదర్థతా. 6

ప్రకటత్వ మభివ్యక్తిః శ్రుతిరాక్షేవ ఇత్యపి | తస్యాభేదే శ్రుతిస్తత్ర శబ్దం స్వార్థసమర్పణమ్‌. 7

భ##వేన్నైమిత్తికీ పారిభాషికీ ద్వివిధైవసా . సంకేతః పరిభాషేతి తతః స్యాత్పరిభాషికీ. 8

ముఖ్యౌపచారికీచేతి సాచసాచద్విధా ద్విధా | స్వాభిధేయస్ఖల ద్వృత్తిరముఖార్థస్య వాచకః. 9

యయాశబ్దో నిమిత్తేన కేనచిత్సౌ పచారికీ | సాచలాక్షణికీ గౌణీలక్షణా గుణయోగతః. 10

అభిధేయా వినాభూతా ప్రతీతిర్లక్షణోచ్యతే | అభిధేయేన సంబంధాత్సామీప్యాత్సమవాయతః. 11

వైపరీత్యా త్ర్కియాయోగాల్లక్షణా వంచధామతా | గౌణీ గుణానామానంత్యా దనన్తా తద్వివక్షయా. 12

అన్యధర్మన్తతో7న్యత్ర లోకసీమానురోధినా | సమ్యగాధీయతేయత్ర ససమాధి రిహన్మృతః. 13

శృతేరలభ్యమానో7ర్థోయస్మాద్భాతి నచేతనః | న ఆక్షేపోధ్వనిః స్వాచ్చధ్వనినా వ్యజ్యతే యతః. 14

శ##బ్దేనార్థేన యత్రార్థః కృత్వా స్వయముపార్జనమ్‌ | ప్రతి షేధ ఇవేష్టన్యయో విశేషో7భి ధిత్సయా. 15

తమాక్షేపం బ్రువన్త్వత్రస్తుతం స్తోత్రమిదం పునః | అధికారా ద పేతస్య వస్తునో7న్యస్య యాస్తుతిః. 16

యత్రోక్తం గమ్యతే నార్థస్తత్సమాన విశేషణ్‌ | సాసమాసోక్తి రుదితా సంక్షేపార్థతయాబుధైః. 17

అపహ్నుతి రపహ్నుత్య కించిదన్యార్థ సూచనమ్‌ | పర్యాయోక్తం యదన్యేన ప్రకారేణాభి ధీయతే.

ఏషామేకతమస్యేవ సమాఖ్యా ధ్వనిరిత్యతతః.

ఇత్యాదిమహాపురాణ ఆగ్నేయే శబ్దార్థాలంకార నిరూపణంనామ పంచచత్వారింశదధిక

త్రిశతతమో7ధ్యాయః.

అగ్ని దేవుడు పలికెను. శబ్దార్థాలంకారము ఒక చోట వుంచి హారము స్త్రీ యొక్క స్తనమును కంఠమును కూడ అలంకరించినట్లు శబ్దార్థములు రెండింటిని అలంకరించును. ప్రశస్తి కాంతి ఔచిత్యము సంక్షేపము, యావ దర్థత, అభివ్యక్తి అని ఇది ఆరు విధములు. ఇతరుల మర్మమును ద్రవింప చేయునట్లు వుండు వాక్కౌశలము ప్రశస్తి. ప్రేమోక్తిస్తుతి అని ఇది రెండు విధములు. వీటికే ప్రియోక్తి గుణ కీర్తనము అని నామాంతరములు. వాచ్య వాచకములు చక్కగా కలిసి యుండుట కాంతి. ఓజో మాధుర్య యుక్త రచన లందు వస్తురీతి వృత్త్యనుసారముగా రసప్రయోగము కలుగునపుడు ఔచిత్యముండును. తక్కువ శబ్దములతో ఎక్కువ అర్థము చెప్పుట సంక్షేపము. శబ్దార్థముల అన్యూనానధికముగా వున్నచో యావదర్థత అని పేరు. అర్థ పాకఠ్యమునకు అభివ్యక్తి యని పేరు. శృతి ఆ క్షేపము అని అది రెండు విధములు. శబ్దముచే అర్థమును ప్రత్యక్షముగ బోధించుట శృతి. అది నైమిత్తికము పారిభాషికము అని రెండు విధములు. పరిభాషయనగా సంకేతము గలది పారిభాషికీ, పారిభాషికికి ముఖ్య యనియు, నైమిత్తికికి ఔపచారికము అని పేరు. ఔష చారికము రెండు విధములు. అభిధేయార్థము చెప్పజాలని శబ్దము ఏదైన ఒక నిమిత్తముచే అముఖ్య మగు అర్థమును బోధించినచో అది ఔపచారికవృత్తి. నైమిత్తికమునందునుకూడ ఈ భేదము లుండును. అది లక్షణాయోగముచే లాక్షణికి యనియు గుణ యోగముచే గౌణి యనియు చెప్పబడును. ఎచట అభిధేయార్థముతో సంబద్ధమగు అన్యార్థము ప్రతీతమగునో అచ్చట లక్షణావృత్తి, అభిధేయముతో సంబంధము సామీప్యము, సమవాయము వైపరీత్యయము క్రియా యోగము వీటిచే లక్షణా ఐదు విధములు. అనంతములగు గుణముల వివక్షనుబట్టి గౌణీ వృత్తి యందు కూడ అనంత భేదము లుండును. లోక వ్యవహారజ్ఞడగు కవి ప్రస్తుత వస్తువుపై అప్రస్తుత వస్తు ధర్మములను పూర్తిగా ఆరోపించినచో దానికి సమాధి యని పేరు. శ్రవణ మాత్రముచే తెలియని అర్థము బుద్ధి గోచరమైనచో అది ఆక్షేపము. ఇది ధ్వనిచే వ్యజింప చేయబడును కాన ధ్వని యని పేరు. ధ్వని సంబంధముచే శబ్దార్థములు మరియొక అర్థమును వ్యంజింప చేయును. ఒక వస్తువు యందు ఉత్కర్షను సూచించుటకు చేయు నిషేధమునకు ఆక్షేపము యని పేరు. అప్రకృత వస్తువును స్తుంతించుట, అస్తుత స్తోత్రము ఒక వస్తువును వర్ణించునపుడు సమాన విశేషణములు గల మరియొక అర్థము ప్రతీతమైనచో దీనిని అర్థ సంక్షేపమును బట్టి సమాసోక్తి అని అందురు, వాస్తవిక పదార్థములు కప్పిపుచ్చి అన్య పదార్థమును సూచించుట అపహ్నుతి, ఒక విషయమును ఋజువగా చెప్పక మరియొక విధముగా త్రిప్పి చెప్పుట పర్యాయోక్తి. వీటిలో ఒకటి ధ్వని యని చెప్పబడును.

అగ్ని మహా పురాణమున శబ్దార్థాలంకార నిరూపణ మను మూడు వందల నలుబది ఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page