Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్తచత్వారింశ దధిక త్రిశతత7మోధ్యాయః

అథ కావ్యదోషవివేకః

అగ్నిరువాచ :

ఉద్వేగజనకోదోషః సభ్యానాం సచసప్తధా | వక్తృవాచకవాచ్యానామేక ద్విత్రినియోగతః. 1

తత్రవక్తాకవిర్నామ ప్రథతే సచ భేదతః | సందిహానో7వినీతః సన్నజ్ఞోజ్ఞాతా చతుర్విధః. 2

నిమిత్త పరిభాషాయా మర్థసంస్పర్శివాచకమ్‌ | తద్బేదౌ పదవాక్యేద్వే కథితం లక్షణం ద్వయోః. 3

అసాధుత్వా ప్రయుక్తత్వే ద్వావేవ పదనిగ్రహౌ | శబ్దశాస్త్ర విరుద్ధత్వ మసాధుత్వం విదుర్భుధాః. 4

వ్యుత్పన్నైరనిబద్ధత్వ మప్రయుక్తత్వ ముచ్యతే | చాందసత్వమనిస్పష్టత్వంచ కష్టత్వమేవచ. 5

తదసామయికత్వంచ గ్రామ్యత్వంచేతి పంచధా | ఛాందసత్వంన భాషాయామవిస్పష్టమబోధతః. 6

గూఢార్థతా విపర్యస్తార్థతా సంశయితార్థతా | అవిస్పష్టార్థతా భేదాస్తత్ర గూఢార్థతేతిసా. 7

యత్రార్థో దుఃఖ సంవేద్యో విపర్యస్తార్థతాపునః | వివక్షితాన్య శబ్దార్థ ప్రతిపత్తిర్మలీమసా. 8

అన్యార్థత్వాసమర్థత్వే ఏతామేవోపసర్పతః | సందిహ్యమానవాచ్యత్వ మాహుః సంశయితార్థతామ్‌. 9

దోషత్వమనుబధ్నాతి సజ్జనోద్వేజనాదృతే | అసుఖోచ్చార్య మాణత్వం కష్టత్వం సమయాచ్యుతిః. 10

ఆసామయికతానేయామేతాంచ మునయోజగుః | గ్రామ్యతాతు జుఘన్యార్థ ప్రతిపత్తిః ఖలీకృతా. 11

వక్తవ్యగ్రామ్యవాచ్యస్య వచనాత్స్మరణాదపి | తద్వాచక పదేనాభిసామ్యాద్భవతిసాత్రిధా.

12

దోషః సాధారణః ప్రాతిస్వేకో7ర్థస్య సతుద్విధా | అనేక భాగుపాలభ్యః సాధారణ ఇతిస్మృతః. 13

క్రియాకరకయోర్ర్భంశో విసంధిః పునరుక్తతా | వ్యస్తసంబంధతా చేతిపంచసాధారణామతాః. 14

అక్రియత్వం క్రియాభంశో భ్రష్టకారకతాపునః | కర్త్రాది కారకాభావో విసంధిః సంధిదూషణమ్‌. 15

అగ్నిదేవుడు పలికెను. దోషము సభ్యులకు ఉద్వేగమును కల్గించును. వక్తృ - వాచక - వాచ్యములలో ఏక, ద్వితి, యోగముచే ఇది ఏడు విధములు. వక్త అనగాకవి. సందిహానులు, అవినీతుడు, అజ్ఞుడు, జ్ఞాత, అని వక్త నాలుగు విధములు. నిమిత్తమును సంకేతమును అనుసరించి అర్థమును బోధించు శబ్దము వాచకము; పదము వాక్యము అను దీని రెండు భేదములు వెనుక చెప్పబడినవి. అసాధుత్వము, అప్రయుక్తత్వము అని పదదోషములు రెండు; వ్యాకరణ శాస్త్రమునకు విరుద్ధముగ నుండుట అసాధుత్వము. అప్రసిద్ధమగు పదమును ప్రయోగించుట అప్రయుక్తత్వము. ఛాందసత్వము, అవి స్పష్టత్వము, కష్టత్వము అసామయికత్వము గ్రామ్యత్వము యని అదిఐదు విధములు. లోకములో ప్రయోగించని వైదిక పదములు ప్రయోగించుట ఛాందసత్వము. అర్థము స్పష్టము కాకుండుట అవి స్పష్టత్వము. దీనిలో గూఢార్థత్వము, విపర్యస్తార్థత్వము, సంశయితార్థత్వము యని మూడు భేదములు. అర్థము శ్రమచే తెలిసినచో అది గూఢార్థత్వము. వివక్షితార్థమునకు విపరీతమగు అర్థమును బోధించుట విపర్యసార్థత్వము. అన్యార్థత్వము, అసమర్థత్వము అను దోషములు కూడ విపర్యస్తార్థత్వములో అంతర్గతమగును. అర్థము సందిగ్ధముగా వున్నచో అది సంశయితార్థత్వము. ఇది సహృదయులకు ఉద్వేగకరము గానిచో దోషము కాదు. ఉచ్చారణకు కష్టముగా నుండుట కష్టత్వము, కవి సమయ విరుద్ధత్వము అసామయికత్వము. దీనికి నేయ యని కూడ పేరు. నీచార్థమును బోధించుట గ్రామ్యతా దోషము. నింద్య మగు గ్రామ్యార్థమును చెప్పుట, తత్స్మరణ, తద్వాచక పదసామ్యము ఇవి గ్రామ్యతా దోషములో మూడు భేదములు. సాధారణము ప్రాతిస్వికముయని అర్థ దోషము రెండు విధములు. అనేక గత దోషము సాధారణము. క్రియాభ్రంశము కారక భ్రంశము, విసంధిపునరుక్తత, వ్యస్త సంబంధత అని ఇది ఐదు విధములు. క్రియ లేకపోవుట క్రియభ్రంశము. కర్త్రాది కారకములు లేకుండుట కారక భ్రంశము సంది దోషము విసంది.

విగతోవా విరుద్ధోవాసంధిః సభవతిద్విధా | సంధేర్విరుద్ధతా కష్టమపదార్థాంతరాగమాత్‌. 16

పునరుక్తత్వ మాభీక్ష్యాణదభిమానం ద్విధైవతత్‌ | అర్థావృత్తిః పదావృత్తిరర్థావృత్తిరపిద్విధా.

17

ప్రయుక్తవరశ##బ్దేన తథాశబ్దాంతరేణ చ | నా వర్తతే పదావృత్తౌ వాచ్యమావర్తతే పదమ్‌. 18

వ్యస్తసంబంధతాసుష్ఠు సంబంధో వ్యవధానతః | సంబంధాంతర నిర్భాసాత్సంబంధాంతర జన్మనః. 19

అభావే7పి తయోరన్తర్వ్య వధానాత్త్రిధైవసా | అంతరా వదవాక్యాభ్యాం ప్రతిభేదం పునర్ద్విధా. 20

వాచ్యమర్థార్థ్య మానత్వాత్తద్ద్విధా పదవాక్యయోః | ప్యుత్పాదితం పూర్వవాచ్యం వ్యుత్పాద్యంచేతి భిద్యతే.

ఇష్టవ్యాఘాత కారిత్వం హేతోః స్యాదసమర్థతా | అసిద్ధత్వం విరుద్ధత్వమనైకాంతికతాతథా.

22

ఏవం సత్ర్పతిపక్షత్వం కాలాతీతత్వ సంకరః | పక్షే సపక్షే నాస్తిత్వం విపక్షే7స్తిత్వమేవతత్‌. 23

కావ్యేషు పారిపద్యానాం నభ##వేదప్యరుంతుదమ్‌ | ఏకాదశ నరర్థత్వం దుష్కరాదౌ నదుష్యతి. 24

దుఃఖీకరోతి దోషజ్ఞాన్గూఢార్థత్వం నదుష్కరే | నగ్రామ్యతోద్వేయకారీ ప్రసిద్ధేర్లోక శాస్త్రయోః. 25

క్రియాభ్రంశేన లక్ష్మాస్తి క్రియాధ్యాహార యోగతః | భష్టకారకతాక్షేప బలాధ్యాహృత కారకే.

26

ప్రగ్రహే గృహ్యతే నైవం క్షతం విగతసంధినా | కష్టపాఠాద్వి సంధిత్వం దుర్వచాదౌన దుర్భగమ్‌. 27

సంధ్యభావము విరుద్ధ సంధి అని విసంధి రెండు విధములు. విరుద్ధములగు పదార్థంతరమున బోధించుటచే విరుద్ధ సంధి దుష్టమైనది. మాటిమాటికి చెప్పుట పునరుక్తత్వము, అర్థావృత్తి పదావృత్తి యని అది రెండు విధములు. అర్థావృత్తి రెండు విధములు, కావ్యప్రయుక్త మగు శబ్దము చేతను, శబ్దాంతరము చేతను ఏర్పడు పదావృత్తిచే అర్థావృత్తి కలుగదు. పదమాత్రమునకే ఆ వృత్తి ఏర్పడును, దూరముగ నున్న పదముల అన్వయము వ్యస్త సంబంధత. సంబంధాంతర ప్రతీతి, సంబంధాంతర జన్యత్వము ఏతదుభయ అభావము వీటిచే వ్యస్త సంభంధిత్వమునకు మూడు భేదములుండును. పైమూడింటి యందును పదవ్యవధానవాక్య వ్యవధానములచే మూడేసి భేదములు ఏర్పడును. పద వాక్యములందు అర్థ అర్థ్యమాన భేదముచే వాచ్యార్థము రెండు విధములగును. వ్యుత్పాదితము వ్యుత్పాద్యముయని పద వాచ్యార్థము రెండు విధములు. హేతువు అభీష్ట సిద్ధికి వ్యాఘాతమైనచో అది దుష్టము, అసమర్థత్వ - అసిద్ధత్వ - విరుద్ధత్వ - అనైకాంతికతా, - సత్ర్పతిపక్షత్వ - కాలాతీతత్వ - సంకర - పక్షాభావ - సపక్షాభావ - విపక్షాస్థిత్వ - నిర్థత్వములు పండ్రెండు హేతుదోషములు. ఇష్ట వ్యాఘాత కారిత్వదోషము సహృదములకును సభాసదులకును మార్మిక పీడ కల్గించును. దుష్కరములగు చిత్రబంధాది కావ్యములలో నిరర్థత్వము దోషముకాదు. గూఢార్థత్వము కూడ దోషముకాదు. లోకశాస్త్రములందు ప్రసిద్ధమైనచో గ్రామత్వము దోషము కాదు. క్రియను ఆధ్యాహారమును చేసుకొనుటకు అవకాశమున్నచో క్రియాభ్రంశము; కారకమును ఆధ్యాహారము చేసుకొనుటకు వీలున్నచో కారక భ్రంశము దోషములు కావు - ప్రగృహ్య సంజ్ఞను బట్టి ప్రకృతి భావము వచ్చిన చోట విసంధిత్వము దోషముకాదు, సంధి చేసినచో ఉచ్చరించుట కష్టమైనపుడు విసంధిత్వము దోషముకాదు.

అనుప్రాసే పదావృత్తిర్వ్యస్త సంబంధతాశుభా| నార్థసంగ్రహణదోషో వ్యుత్ర్కమా ద్యైర్నలిప్యతే. 28

విభక్తిసంజ్ఞా లింగానాం యత్రోద్వేగోన ధీమతామ్‌ | సంఖ్యాయాస్తత్ర భిన్నత్వ ముపమానోపమేయయోః.

అనేకస్యతథై కేన బహూనాం బహుభిః శుభా | కవీనాం సముదాచారః సమయోనామ గీయతే. 30

సామాన్యశ్చ విశిష్టశ్చ ధర్మవద్భతిద్విధా | సిద్ధసైద్ధాంతి కానాంచ కవీనాంచావివాదతః. 31

యః ప్రసిధ్యతి సామాన్య ఇత్యసౌసమయో మతః | సర్వేసి (సై) ద్ధాన్తికాయేన సంచరంతి నిరత్యయమ్‌. 32

కియన్తఏవవాయేన సామాన్యస్తేన సద్విధా | ఛేదిసిద్ధాంతతో7న్యః స్యాత్కేషాంచిద్ర్భాంతితోయథా. 33

తర్కజ్ఞానం మునేః కన్య కస్కచితక్షణ భంగికా | భూతచైతన్యతాకస్య జ్ఞానస్య సుప్రకాశతా.

34

ప్రజ్ఞాతస్థూలతా శబ్దానేకాన్తత్వం తథార్హతః | శైవ వైష్ణవ శాక్తేయ సౌర సిద్దాంతినాం మతిః.

35

జగతః కారణం బ్రహ్మసాంఖ్యానాం సప్రధానకమ్‌ | ఆస్మిన్సరస్వతీ లోకే సంచరంతః పరస్పరమ్‌. 36

బధ్నంతి వ్యతిపశ్యన్తోయద్విశిష్టఃస ఉచ్యతే | పరిగ్రహాదప్యసతాం సతామేవాపరిగ్రహాత్‌. 37

భిద్యమానస్య తస్యాయాం ద్వైవిధ్యముపగీయత్‌ | ప్రత్యక్షాది ప్రమాణౖర్యధ్బాధితం తదసద్విదుః. 38

కవిభిస్తత్ర్పతిగ్రాహ్యం జ్ఞానన్య ద్యోతమానతా | యదేవార్థ క్రియాకారి తదేవపరమార్థసత్‌.

39

అజ్ఞానాత్‌ జ్ఞానతస్త్వేకం బ్రహ్మైవ పరమార్థసత్‌ | విష్ణుః స్వర్గాదిహేతుః సశబ్దాలంకారరూపవాన్‌. 40

అపరాచ పరా విద్యాతాం జ్ఞాత్వాముచ్యతే భవాత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కావ్యదోష వివేకో నామ సప్త చత్వారింశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

అనుప్రాసలో పదావృత్తి వున్నపుడు వ్యస్తసంబంధత్వము దోషముకాదు. అర్థసంగ్రహమున అర్థావృత్తి దోషము కాదు. కాని వ్యుత్ర్కమాదులు మాత్రము దోషము. ఉపమానోపమేయముల విభక్తి సంజ్ఞా లింగవచనములలో భేదమున్నను బుద్ధిమంతులకు ఉద్వేగము కలుగనంతవరకు అవి దోషములు కావు. ఉద్వేగమును కల్గించని దోషములు దోషకరములు కావు. అనేక వస్తువులకు ఒక వస్తువుతోను, అనేక వస్తువులకు అనేక వస్తువులతోను ఔపమ్యము చెప్పినను దోషములేదు. కవిజన పరంపరా అంగీకృతమగు సదాచారమునకు సమయమనిపేరు. దానిని సకల సిద్థాంతవాదులును నిస్సంశయముగా అనుసరింతురు. కొన్ని సమయములను కొంతమందియే అనుసరింతురు. ఈ విధముగా సమయములు రెండు విధములు; ఏదైనా ఒక సిద్థాంతమును అనురించుట చేతను భ్రాంతి చేతను ఈ మత భేదము ఏర్పడును. కొంతమంది మనుల సిద్థాంతమునకు తర్కము ఆధారము; కొంతమందికి క్షణ భంగవాదము ఆధారము; పంచభూత సంఘాతముచే శరీరమున చైతన్యము వచ్చునని కొందరందురు. స్వతః ప్రకాశమగు జ్ఞానమే చైతన్యమని కొందరందురు. కొందరందురు. కొందరు ప్రజ్ఞాత స్థూంతావాదులు కొందరు శబ్దానేకాంతతావాదులు ఈ జగత్తుకు బ్రహ్మకారణమని, శైవవైష్ణవ శాక్తసౌర, సిద్ధాంతవాదులు అంగీకరింతురు. కాని సాంఖ్యులు దృశ్య జగత్తునకు ప్రదానమే కారణమని చెప్పుదురు. ఈ విధముగా సరస్వతీ లోకమున సంచరించు విచారకులు పరస్పర విపర్యస్త దృష్టితో చూచుచు యుక్తులతో పరస్పర ఖండనము చేసుకొను చున్నారు. వీరు చెప్పు విభిన్న మార్గములు విశిష్ట సమయము. అసత్తునే గ్రహించుట, సత్తును పరిత్యజించుట, దీనిచే ఈ విశిష్ట సమయము రెండు విధములు. ప్రత్యక్షాది ప్రమాణములచేబాధితమైనది అసత్తు. దేని యందు జ్ఞాన ప్రకాశముండునే ఆమతమునే కవులు గ్రహించవలెను. ఏది అర్థ క్రియాకారియో అదియే పరమార్థసత్‌; అజ్ఞాన జ్ఞానాతీతమై వున్న ఏక మాత్ర బ్రహ్మయే పరమార్థసత్‌. అదిజ్ఞేయము. అదియే సృష్టిపాలన సంహార హేతువగు విష్ణువు. అదియే శబ్ద అలంకార రూపము. అదియే పరాపర విద్యలు. దానిని తెలిసిన వాడే సంసార బంధ ముక్తుడగును.

అగ్నిమహాపురాణమున కావ్య దోష వివేకమను మూడు వందల నలుబదియేడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page