Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకపంచాశదధిక త్రిశతతమో7ధ్యాయః

అథ సుబ్విభక్తి సిద్ధరూపమ్‌

స్కంద ఉవాచ :

విభక్తి సిద్ధరూపంచ కాత్యాయన వదామితే | ద్వేవిభక్తీ సుప్తిఙశ్చ సుపః సప్తవిభక్తయః. 1

సుఔజసితి ప్రథమా అమౌట్‌శసో ద్వితీయా | టాభ్యాంభిసితి తృతీయా జేభ్యాంభ్యసశ్చ తుర్థ్యపి. 2

జసిభ్యాంభ్యసః పంచమీస్యాత్‌ జసోసామితిషష్ఠ్యపి | ఙిఓస్సుబితి సప్తమీస్యాత్స్యుః ప్రాతిపదికాత్పరాః. 3

ద్వివిధం ప్రాతిపదికం హ్యజన్తంచ హలన్తకమ్‌ | ప్రత్యేకం త్రివిధం తత్స్యాత్పుమాంస్త్రీచ నపుంసకమ్‌. 4

దర్శ్యన్త నాయకాస్తేషా మనుక్తానాంచ వీర్యతః | వృక్షః సర్వో7థ పూర్వశ్చ పథమశ్చ ద్వితీయకః. 5

తృతీయః ఖండపావహ్నిః సఖాపతి రహర్పతిః | పటుర్నా గ్రామణీంద్రశ్చ ఖలపూర్మిత్ర భూఃస్వభూః. 6

సుశ్రీః సుధీః పితా భ్రాతా నా కర్తా క్రోష్టు నప్తృకౌ |

సురారా గౌప్తథా ద్యౌగ్ల్రౌః స్వరాన్తాః పుంసినాయకాః. 7

సువాక్త్వ క్పృషత్సమ్రాట్‌ జన్మభాక్‌ చ సురాడపి | ఆపో మరుద్భవన్దీవ్యన్భవాంశ్చ మఘవాన్పిబన్‌. 8

భగవానఘవానర్వా వహ్ని మత్సర్వవిత్సుపృత్‌ | సుసీమాకుండీ రాజా చ శ్వా యువామఘవాతథా. 9

పూషాసుకర్మా యజ్వా చ సువర్మా చ సుధర్మణా | అర్యమా వృత్రహా పంథాః సుకకుదాది పంచచ. 10

ప్రశాన్సుతాంశ్చ పంచాద్యాః సుగీః సురాః సుపూరపి |

చంద్రమాః సువచాః శ్రేయాన్విద్వాcశ్చోశనసాసహ. 11

పేచివాన్గౌరనంగా న్గోధుఙ్మిత్ర ద్రుహౌశ్వలిట్‌ | స్త్రియాంజాయా జరాబాలా ఏడకా సహవృద్దయః. 12

క్షత్రియా బహురాజాచ బహుదామా7థ బాలికా | మాయా కౌముదగంధాచ సర్వాపూర్వా సహాన్యయా. 13

ద్వితీయాచ తృతీయాచ బుద్ధిః స్త్రీ శ్రీర్నదీ సుధీః | భవన్తీచైవ దీవ్య న్తీ భాతీ బాంతీ చ యాన్త్యపిః. 14

శృణ్వతీ తుదతీ కర్త్రీతదన్తీ కుర్వతీ మహీ | రుంధతీ క్రీడతీ దాంతీ పాలయంతీ సురాణ్యపి.

15

గౌరీ పుత్రవతీ నౌశ్చ వధూర్దేవతయా భువా | తిస్రోద్వేకతి వర్షాభూఃస్వసా మాతావరచాచగౌ. 16

నైర్వాక్త్వ క్ర్పాచ్యవాచీతి తిరశ్చీసముదీచ్యపి | శరద్విద్యుత్సరిద్యోషి దగ్ని విత్సస్యదా దృషత్‌. 17

యైషాసా వేదవిత్సంవిద్బహ్వీరాజ్ఞీ త్వయామయా |సీమాపంచాదయో రాజాధూఃపూశ్చైవ దిశోగిరా. 18

చతస్రో విదుషీ చైవ కేయం దిగ్ధృక్చతాదృశీ | అసౌస్త్రియాం నాయకాశ్చ నాయకాశ్చ నపుంసకే. 19

కుండం సర్వం సోమ పంచ దధి వారి ఖటప్వథ | మథుత్రపు కర్తృభర్తృ అతిభర్తృ పయః పురః. 20

ప్రాక్ర్పత్యక్‌ చతిర్యగుదగ్జగజ్జాగ్రత్తథా శకృత్‌ | సుసంపచ్చ సుదండీహ అహః కించేదమిత్యపి. 21

షట్‌ సర్పిః శ్రేయశ్చత్వారి అదో7న్యే హీదృశాః పరే | ఏతేభ్యః ప్రథమాద్యాశ్చస్యుః ప్రాతిపదికాత్పరాః.

ధాతుప్రత్యయహీనం యత్స్యాత్ర్పాతి పదికంతుతత్‌ | ప్రాతిపదికాత్స్వలింగార్థ వచనే ప్రథమాభ##వేత్‌. 23

సంబోధనే చ ప్రథమా ఉక్తేకర్మణి కర్తరి | కర్మయత్క్రియతే తత్స్యాద్ద్వితీయా కర్మణిస్మృతా. 24

క్రియతే యేనకరణం కర్తాయశ్చ కరోతిసః | అనుక్తే తిఙ్కృత్తద్ధితైస్తృతీయా కరణభ##వేత్‌. 25

కారకేకర్తరి చ సాసంప్రదానే చతుర్థ్యపి | యసై#్మదిత్సాం ధారయతే సంప్రదానం తదీరితమ్‌. 26

ఆపాదానంయతో7దేతి ఆదత్తేచ భయం యతః | ఆపాదానే పంచమీస్యాత్స్వ స్వామ్యాదౌచ షష్ట్యపి. 27

ఆధారో యో7ధికరణం విభక్తిస్తత్ర సప్తమీ | ఏకార్థేచైకవచనం ద్వ్యర్థేద్వివచనం భ##వేత్‌. 28

బహుషు బహువచనం సిద్ధరూపాణ్యథోవదే | వృక్షః సూర్యోమ్బు వాహో7ర్కో హేరవే హేద్విజాతయః.

విప్రౌ గజాన్మహేంద్రేణ యమాభ్యామనలైఃకృతమ్‌ | రామాయ మునివర్యాభ్యాం కేభ్యో ధర్మాద్దరౌరతి. 30

శరాభ్యాం పుస్తకేభ్యశ్చ అర్థస్యేశ్వర యోర్గతిః | బాలానాం సజ్జనే ప్రీతిర్హంసయోః కమలేషుచ. 31

ఏవం కామమహేశాద్యాః శబ్దాజ్ఞేయాశ్చ వృక్షవత్‌ | సర్వేవిశ్వేచ సర్వసై#్మసర్వస్మాత్క తరోమతః. 32

సర్వేషాం స్వంచవిశ్వస్మిన్‌ శేషం రూపంచ వృక్షవత్‌ | ఏవంచోభయ కతరకతమాన్య తరాదయః. 33

పూర్వే పూర్వశ్చ పూర్వసై#్మ పూర్వస్మాత్సు సమాగతః |

పూర్వేబుద్ధిశ్చ పూర్వస్మిన్‌ శేషరూపన్తు సర్వవత్‌. 34

ఏవంపరావరాద్యాశ్చ దక్షిణోత్తర కాంతరాః | అపరాశ్చాధరోనేమాః ప్రథమాః ప్రథమే7ర్కవత్‌. 35

ఏవం చరమాశ్చ తయాఅల్పార్థానేమ ఆదయః | ద్వితీయసై#్మ ద్వితీయాయ ద్వితీయస్మాద్ద్వితీయకాత్‌. 36

ద్వితీయస్మిన్ద్వితేయే చ తృతీయశ్చ తథా7ర్కవత్‌ | సోమపాః సోమపౌజ్ఞే¸° సోమపాః సోమపాం వ్రజ.

కీలాతపౌ సోమపశ్చ సోమపాత్సోమపే దద | సోమపాభ్యాం సోమపాభ్యః సోమపః సోమపౌకులమ్‌. 38

ఏవం కీలాలపాద్యాః స్యుః కవిరగ్నిస్తథా7రయః | హేకవే కవిమగ్నీ తాన్హరీన్యాత్సకినా హృతమ్‌. 39

రవిభ్యాం రవిభిర్దేహి వహ్నయేయః సమాగతః | ఆగ్నేరగ్న్యోస్తథా గ్నీనాం కవౌకవ్యోః కవిష్వ7థ. 40

ఏవం సుసృతి రభ్రాన్తిః సుకీర్తిః సుధృతిస్తథా | సఖాసఖా¸° సఖాయః హే సఖే వ్రజసత్పతిమ్‌. 41

సఖాయంచ నఖా¸°చ సఖీన్సఖ్యాగతోదద | సఖ్యేసఖ్యుశ్చ సఖ్యుశ్చ సఖ్యోః శేషః కవేరివ. 42

పత్యాపత్యేచ పత్యుశ్చ పత్యుః పత్యోస్తథా7గ్నివత్‌ | ద్వౌద్వౌద్వాభ్యాం ద్విత్వాద్యరేద్వయోర్ద్వయోః. 43

త్రయస్త్రీంశ్చ త్రిభిస్త్రిభ్యస్త్రయాణాంచ త్రిషుక్రమాత్‌ | కవివత్కతి కతీతి శేషం బహువచనం స్మృతమ్‌.

నీర్నియాచ నియోహేనీః నియ ని¸°నియోనియా | నీభ్యాం నిభిర్నియే నీభ్యః నియాం నియినియోస్తథా.

సుశ్రీః సుధీః ప్రభృతయోగ్రామణీః పూజయేద్ధరిమ్‌ |

గ్రామణ్యౌ గ్రామణ్యో గ్రామణ్యం గ్రామణ్యా గ్రామణీభిః. 46

గ్రామణ్యోర్గ్రామణ్యా మేవం సేనానీ ప్రముఖా సుభూః |

సుభువౌచ స్వయం భూవః స్వయంభువం స్వయం భువః. 47

స్వయంభువా స్వయంభువి ఏవం ప్రతి భువాదయః | ఖలపూః ఖలప్వౌ శ్రేష్ఠౌ ఖలప్వంచ ఖలప్విచ. 48

ఏవం శరప్ర ముఖాఃస్యుః క్రోష్టాకోష్టార ఈరితాః |

క్రోష్టూంశ్చ క్రోష్టునా క్రోష్ట్రా క్రోష్టూనాం క్రోష్టరీదృశమ్‌. 49

పితాపితరౌపితరః హేపితః పితరౌ శుభౌ | పితౄన్‌ పితుః పితుః పిత్రోః పితౄణాం పితరీదృశమ్‌. 50

ఏవం భ్రాతాచ జామాతృ ముఖౌనౄణాం నృణాం తథా |

కర్తా కర్తారౌ కర్తృశ్చ కర్తౄణాం కర్తరీదృశమ్‌. 51

పితృవచ్చైవ ముద్గాతా స్వసానాత్ర్పాదయః స్మృతాః | సురాః సురా¸°సరాయః సరాయంచ సరాయ్యపి.

గౌఃగావౌ గాంగాగవాచ గోర్గవోచ్చ గవాం గవి | ఏవం దౌగ్ల్రౌశ్చాపి తథాస్వరాన్తాః పుంసినాయకాః. 53

సువాక్సువాచౌ సువాచా సువాగ్భ్యాంచ సువాక్ష్వపి | ఏవం దిక్ప్రముఖాః ప్రాఙ్చపాంచౌ ప్రాంచశ్చ భోవ్రజ.

పాగ్భ్యాం పాగ్భిః పాచాంచ ప్రాచిచ పాఙ్షుపాఙ్ఞ్వపి | ఏవహ్యుదఙ్దీచీవా సమ్యఙ్‌ ప్రత్యక్‌ సమీచ్యపి. 55

తిర్యఙ్‌ తిరశ్చః సధ్రఙ్‌చ విష్వద్ర్యఙ్‌ పూర్వవత్స్మృతాః |

అదద్యఙ్‌ దముయగం స్యాతథా ముముయ ఙీరితః.

ఆదద్యంచౌ హ్యముద్రీచం అదద్యగూభ్యాంచ పూర్వవత్‌ |

తత్త్వతృట్‌ తత్త్వతృషాచ తత్వతృ ఙ్భ్యాంసమాగతః. 57

తత్త్వతృషి తత్త్వతృట్‌సు ఏవంకాష్ఠ తడాదయః | భిషక్‌ భిషగ్భ్యాం భిషజి జన్మభాగాదయస్తథా. 58

మరున్మరుద్భ్యాం మరుతిఏవం శత్రుజిదాదయః | భవాన్భవన్తౌ భవతాం భవంశ్చైవ భవత్యపి. 59

మహాన్మహన్తౌ మహతామేవం భగవదాదయః ఏవం మఘవాన్మ ఘవన్తౌ అగ్ని చిచ్చానిచిత్యపి. 60

అగ్ని చిత్స్వేవ మేవాన్యద్వేద విత్తత్త్వ విత్త్వపి | వేదవిదామేవ మన్యదః సమస్తేన సర్వవిత్‌. 61

రాజారాజానౌ రాజ్ఞః రాజ్ఞి రాజనిరాజన్‌ | యజ్వాయజ్వానస్త ద్వత్కరీ దండీచ దండినౌ. 62

పంథా పంథానౌచపథః పథిభ్యాం పథిచేద్ధశమ్‌ | మంథా ఋభుక్షాః పథ్యాద్యాః పంచ పంచచ పంచభిః. 63

ప్రతాన్ర్పతానౌ ప్రతాన్భ్యాం హేపత్రాంశ్చ సుశర్మణః |

ఆపః అపః ఆద్భిరప్యేవం ప్రశాంశ్చైవ ప్రశామ్యపి. 64

కః కేన సర్వవత్కేషు అయంచేమే ఇమాన్నయః | అనేన చాభ్యామేభిశ్చ అసై#్మ చైభ్యః స్వమస్యచ. 65

అనయోరేషామేషు స్యాచ్చత్వారశ్చతురస్తథా | చతుర్ణాంచ చతుర్ష్వస్తి సుగీః శ్రేష్టః సుగీర్ష్వపి. 66

సుద్యౌః సుదివౌ సుద్యుభ్యాం విఙ్‌ విశౌవిట్‌సుయాదృశః |

యాదృగ్భ్యాంచైవ విడ్భ్యాం చ షట్‌షట్‌ షణ్ణాంచ షట్స్వపి. 67

సువచాః సువచసా చ సువచోభ్యామథేదృశమ్‌ | హేసమచోహే ఉషనన్నుశనా వౌశనస్యపి.

68

పుదంశా అనేహా హేవిద్వాన్‌ విద్వాంశ్చ ఉత్తమాః | విదుషేనమో విద్వద్భ్యాం విద్వత్సుచ బభూవివాన్‌. 69

ఏవంచ పేచివాన్‌ శ్రేయోన్శ్రేయాంసౌశ్రయసన్తథా | ఆసౌ అమూ అమౌ శ్రేష్ఠా ఆముం అమూనిహామునా

అమీభిరముషై#్మవాముష్మాదముష్యవా7ముయోస్తథా | అమీషామముష్మిన్నిత్యేవం గోధుగ్భిరాగతః. 71

గోధుక్ష్విత్యేవ మన్యే7పి మిత్ర ద్రుహామితద్రుహా | మితధ్రుగ్భ్యాం మితద్రుగ్భిరేవం చిత్తదృహాదయః. 72

స్వలిట్‌ స్వలి ఙ్భ్యాం స్వలిహి అనడ్వా ననడుత్సుచ | అజంతాశ్చ హలన్తాశ్చపుంసథో7థ స్త్రియాంవదే. 73

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే సుబ్విభక్తి సిద్ధరూప నిరూపణం నామైక పంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః.

స్కందుడు చెప్పెను. కాత్యాయనా! విభక్తి సిద్ధ రూపములను చెప్పెదను. సప్పులు, తిజులు, అని విభక్తులు రెండు విధములు. సప్పులలో విభక్తులుండును. నుఔజస్‌, ప్రథమ. అంఔట్‌శన్‌'' ద్వితీయ, టాఖ్యాం భిస్‌, తృతీయ, జే, భ్యాంభ్యన్‌ చతుర్థి, జసి, భ్యాం, భ్యస్‌, పంచమి, జన్‌, ఓస్‌, అమ్‌, షష్టి, ఙి, ఓ, సుప్‌, సప్తమీ; అజంతములు హలన్తములు అని ప్రాతిపదికములు రెండు విధములు. అవి మరల, పుంలింగ స్త్రీలింగ నపుంసకలింగములని మూడేసి విధములు. పులింగాది శబ్దములలో ప్రధానమైన వాటిని చెప్పుచున్నాను. ఇక్కడ చెప్పబడని వాటికి వృక్షాదిశబ్దములు నాయకములు; వీటిలో వృక్షః, సర్వః, పూర్వః ప్రథమః, ద్వితీయః, తృతీయః, ఖడ్గపాః, వహ్నిః, సఖా, పతిః, అహర్పతిః. పటు, (పుంలిం) గ్రామణీః, ఇంద్రః, ఖలపూః. మిత్రభూః, స్వభూః, సుశ్రీః, సుధీః, పితా, భాత్రా; (పుంలిం) కర్తా, క్రోష్టా, నప్తా, సురా, రాః; గౌః, ద్యౌః గౌః ఈ అజంత శబ్దము పుంలింగమునందు నాయకశబ్దములు సువాక్‌. త్వక్‌, మొదలుశ్వలిట్‌ వరకు వున్నవి హలంత శబ్దము జాయా శబ్దము మొదలు అసౌవరకును వున్నవి స్త్రీలింగమున నాయకశబ్దములు. కుండమ్‌ మొదలు అదఃవరకును వున్నవి (మూలోక్తములు)నపుంసకలింగ నాయకశబ్దములు. ఈ శబ్దములకు ప్రథమాది విభక్తి ప్రత్యయములు ప్రాతిపదికకు పరముగ వచ్చును. ధాతుప్రత్యయ భిన్నమైనది ప్రాతిపదికము. ప్రాతిపదికకు స్వార్థము లింగము బోధించుటకు ప్రథమ వచ్చును. సంబోధనము నందునుకూడ ప్రథమవచ్చును. కర్మ కర్త ఉక్తములైనపుడు కూడ ప్రథమవచ్చును. కర్మ అనగా చేయబడునది. కర్మకు ద్వితీయవచ్చును. దేనిచే చేయబడునో ఆదికరణము; చేయువాడు కర్త; తిజ్‌ కృత్తద్ధితములచే అనుక్తమైనపుడు తృతీయ వచ్చును. కర్తృకారకమునకు తృతీయ వచ్చును. సంప్రదానమునకు చతుర్థిః ఎవనికి ఇవ్వవలెనని ఇచ్చయింతురో దానికి సంప్రదానము అనిపేరు. దేనునుండి ఒకటి వేరగునో దేనినుండి ఒకటి గ్రహింపబడునో దేని వలన భయమో, దానికి అపాదానము అనిపేరు. అపాదావము నకు పంచమీ వచ్చును. స్వస్వామ్యాది సంబంధమునందు షష్టి వచ్చును. ఆధారమునకు అధికరణమని పేరు. దానికి సప్తమి వచ్చును. ఒక వస్తువును బోధించునపుడు ఏకవచనము, రెండు వస్తువులను బోధించుటకు ద్వివచనము. అనేకమైన వస్తువులను బోధించుటకు బహువనము వచ్చును. ఇపుడు సిద్ధరూపములు చెప్పెదను. ''వృక్షః. సూర్యః'' మొదలు కమలేషు వరకు ఆయా శబ్దముల కొన్ని సిద్ధరూపములు ఇవ్వబడినవి. కామమహేశ. మొదలగు శబ్ద ములు కూడ వృక్ష శబ్దమువలె రూపము లుండును. సర్వే, విశ్వే, సర్వసై#్మ, సర్వస్మాత్‌, సర్వేషామ్‌, ఇత్యాది ప్రథమాది బహువచనము తప్ప ఈ శబ్దముల రూపములు వృక్షశబ్దముల రూపముల వలె ఉండును. ఉభయ, కతర, కతమ, అన్యతరాదులు కూడ ఇట్లే. ఈ విధముగా ''పూర్వే పూర్వాశ్చ మొదలగు అనడుత్సు వరకు ఆయూర అజంత హలన్త శబ్దములకు, పుంలింగమునందు కొన్ని విభక్తులలో సిద్ధరూపము లివ్వబడినవి. ఇపుడు స్త్రీలింగరూపములు చెప్పెదను.

అగ్ని మహాపురాణమున సుబ్వి భక్తి సిద్ధరూపనిరూపణమను మూడువందల యేబది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page