Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ చతుఃపంచాశ దధిక త్రిశతతమో7ధ్యాయః
అథ కారకమ్
స్కంద ఉవాచ :
కారకం సంప్రవక్ష్యామి విదక్త్యర్థ సమన్వితమ్ |
గ్రామో7స్తి హే మహార్కోహ (?) నౌమివిష్ణుం శ్రియాసహ. 1
స్వతంత్రః కర్తా విద్యానాం కృతినః సముపాసతే | హేతుకర్తాలంభయతే హితం వైకర్మ కర్తరి. 2
స్వయం భిద్యేత్పాకృతధీః స్వయంచ ఛిద్యతేతరుః | కర్తా7భిహిత ఉత్తమః కర్తా7నభిహితో7ధమః. 3
కర్తా7నభిహితోధర్మః శిష్యేవ్యాఖ్యాయతేయథా | కర్తాపంచవిధః ప్రోక్తః కర్మసప్తవిధం శృణు. 4
ఈప్సితం కర్మచ యథాశద్దధాతి హరిం యతిః | అనీప్సితం కర్మయథా అహిం లంఘయతే భృశమ్. 5
నైవేప్సితం నానీప్సితం దుగ్ధం సంభక్షయన్రజః | భక్షయేదప్యకథితం గోపాలో దోగ్ధిగాంపయః. 6
కర్తృకర్మా7థ గమయేచ్ఛిష్యం గ్రామం గురుర్యథా | కర్మచాభి హితం పూజా క్రియతే వైశ్రియైహరేః. 7
కర్మనాభి హితం స్తోత్రం హరేః కుర్యాత్తు సర్వదమ్ |
కరణం ద్వివిధం ప్రోక్తం బాహ్యమాభ్యంతరంతథా. 8
చక్షుషారూపం గృహ్ణాతి బాహ్యం దాత్రేణ తల్లునేత్ |
సప్రదానం త్రిధాప్రోక్తం ప్రేరకం బ్రాహ్మణాయగామ్. 9
నరోదదాతి నృపతయే దాసం తదను మంత్రకమ్ | అనిరాకర్తృకం భ##ర్త్రే దద్యాత్పుషాణి సజ్జనః. 10
అపాదానం ద్విధాప్రోక్తం చలమశ్వాత్తు ధావతః | పతితశ్చాచలం గ్రామాదాగచ్ఛతి సవైష్ణవః. 11
స్కందుడు చెప్పెను. విభక్త్యర్థ సమన్వితమగు కారకమును చెప్పెదను. గ్రామో7స్తి, హే మహార్క, ఇవి ప్రథమ, సంబోధనమునకు ఉదాహరణములు. ''నౌమి విష్ణుం శ్రియాసహ'' ఇచట విష్ణుం అనునది కర్మకావున ద్వితీయలో వున్నది. శ్రియా యనునది తృతీయా, సహ యోగముచే వచ్చినది. క్రియ చేయుటలో స్వతంత్రుడు కర్త. వానిని ప్రేరేపించువాడు హేతు కర్త్ర. కర్మనే కర్తగా చెప్పినచో కర్మకర్త. దీనికి ''స్వయ భిద్యేత్ ప్రాకృతధీః'' ''స్వయంఛిద్య తేతరుః'' ఇత్యాదులు ఉదాహరణములు. అభిహితము, అనభిహితము అని కర్త రెండు విధములు. మొదటిది ఉత్తమము, రెండవది అధమము. ''ధర్మః వ్యాఖ్యాయతే'' ఇత్యాదులలో కర్త ఆనభిహితము. ఈ విధముగా కర్త ఐదు విధములుగా చెప్పబడినది. కర్మ ఏడు విధములు. ''యతిః హరిం శ్రద్దదాతి'' ఇచట ఈప్సిత కర్మ. అహిం లంఘయతే; ఇది అనీప్సిత కర్మ. ''దుగ్ధంసంభక్షయన్ రజభక్షయతి'' ఇది ఈప్సితా నిప్సిత కర్మకు ఉదాహరణము. ''గోపాలః గాం పయోదోగ్ధి'' ఇది అకథిత కర్మ; ''గురుం శిష్యం, గ్రామంగమ యతి'' ఇచట కర్త్రుకర్మ; హరేః పూజా క్రియతే. ఇచట అభిహిత కర్మ హరేః స్తోత్రం కుర్యాత్'' ఇచట అనభిహితకర్మ; బాహ్యము అభ్యంతరము అని కరణము రెండువిధములు; ''చక్షుషారూపం గృహ్ణాతి'' ఇచట బాహ్యకరణము. ''ధాత్రేణలునాతి'' ఇచట ఆంతర కర్మము; సంప్రదానము మూడు విధముల; ''బ్రాహ్మణాయ గాం దదాతి'' ఇచట ప్రేరక సంప్రదానము. ''నరః నృపతయే దాసందదాతి'' ఇచట అనుమంత్రక సంప్రదానము. భ##ర్త్రే పుష్పాణిదదాతి. ఇచట అనిరాకర్తృక సంప్రదానము; అపాదానము రెండు విధములు; ధావతః అశ్వాత్ పతితః ఇచట చలాపాదానము సః వైష్ణవః గ్రామాదాగచ్ఛతి. ఇచట అచలాపాదానము.
చతుర్థాచాదికరణం వ్యాపకం దధ్నివైఘృతమ్ | తిలేషు తైలం దేవార్ధమౌపశ్లేషికముచ్యతే.
12
గృహేతిష్ఠేత్కపిర్వృక్షే స్మృతం వైషయికంయథా | జలేమత్స్యో వనేసింహః స్మతం సామీప్యకంయథా.
గంగాయాం ఘోషోవసతి ఔపచారిక మీదృశమ్ | తృతీయావాథ వాషష్ఠీ స్మృతా7నభిహితేతథా. 14
విష్ణుం సంపూజ్యతే లోకైర్గన్తవ్యం తేనతస్యవా | ప్రథమా7భి హితకర్తృ కర్మణోః ప్రణమేద్ధరిమ్. 15
హేతౌతృతీయా చాన్యేన వసేద్వృక్షాయ వైజలమ్ | చతుర్థీ తాదర్థ్యే7భిహితా పంచమీ పర్యుపాఙ్ముఖైః.
యోగేవృష్టః పరిగ్రామాద్దేవో7యం బలవత్పురా | పూర్వోగ్రామాదృతే విష్ణోర్నముక్తి రితరోహరేః. 17
పృథగ్వినాదైస్తుతీయా పంచమీచ తథాభ##వేత్ | పృథగ్గ్రామాద్విహారేణ వినాశ్రీశ్చశ్రియా శ్రియః 18
కర్మప్రవచనీయా ఖ్యైర్ద్వితీయాయోగతో భ##వేత్ | అన్వర్జునంచ యోద్ధారో హ్యభితో గ్రామమీరితమ్. 19
నమఃస్వాహా స్వధాస్వస్తి వషడాద్యైశ్చతుర్థ్యపి | నమోదేవాయతే స్వస్తితుమర్థాద్భావ వాచినః. 20
పాకాయ పక్తయేయాతి తృతీయా సహయోగకే | హేత్వర్థేకుత్సితే7ంగే సాత్పతీయాచ విశేషణ. 21
పితా7మాత్సహ పుత్రేణకాణో7క్షాణ గదయాహరిః | అర్థేన నివసేద్భృత్యః కాలేభావేచ సప్తమీ. 22
విష్ణౌనతే భ##వేన్ముక్తిర్వసన్తేస గతోహరిమ్ | నృణాం స్వామీనృషుస్వామీనృణామీశః సతాంపతిః. 23
నృణాం సాక్షీనృషు సాక్షీ గోఘనాథో గవాంపతిః | గోషుసూతో గవాంసూతోరాజ్ఞాం దాయాదకో7స్త్విహ.
అన్యస్యహేతోర్వ సతిషష్ఠీ స్మృత్యర్థ కర్మణి | మాతుఃస్మరతి గోప్తారం నిత్యంస్యాత్ కర్తృకర్మణోః.
అపాంభేత్తా తవకృతిర్న నిష్టాదిషు షష్ఠ్యపి. 25
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే కారకనిరూపణంనామ చతుఃపంచాశదధిక త్రిశతతమోధ్యాయః.
అధికరణము నాలుగు విధములు ''దధ్నిఘృతమ్'' తిలేషుతైలమ్ ఇత్యాదులందు వ్యాపకాధికరణము. కపిః గృహే తిష్ఠతి'' ఇచట ఔపశ్లేషిక అధికరణము. జలేమత్స్యః ఇత్యాదులందు వైషయికాధికరణము. గంగాయాం ఘోషః వసతి, ఇత్యాదులందు సామీప్యకాధికరణము. దీనికే ఔపచారిక వాక్యమని పేరు. కర్త అనభిహితమైనపుడు తృతీయ కాని షష్టి కాని వచ్చును. ఉదా:- లోకైః విష్ణుః సంపూజ్యతే, ''తేన లేదా తస్యగంతవ్యమ్.'' కర్తృ కర్మలు అభిహితమైనచో ప్రథమా విభక్తి వచ్చును. భక్తః హరిం ప్రణమేత్. ఉదా:- హేతర్థమున తృతీయా విభక్తి వచ్చును. ఉదా- అన్నేన వసేత్. తాదర్థ్యమున చతుర్థి వచ్చును. ఉదాహరణము- వృక్షాయ జలమ్. పరి, అప, తిఙ్ మొదలగు వాటితో సంబంధ మున్నపుడు పంచమి వచ్చును. ఉదా- దేవః పరిగ్రామాత్ వృష్టః పూర్వః గ్రామాత్, ఋతేః విష్ణోః నముక్తి మరొక ఉదాహరణము. ఇతరః హరేః, పృథక్ వినా మొదలగు వాటితో సంబంధమున్నపుడు పంచమి కాని తృతీయ కాని వచ్చును. ఉదాహరణములు. పృథక్ గ్రామాత్ ''విహారేణవినా''. కర్మ ప్రవచనీయలతో సంబంధమున్నపుడు ద్వితీయ వచ్చును. ఉదాహరణములు, అన్వర్జుసంయోద్ధారః; అభితః గ్రామమ్. నమః స్వాహా, స్వధా స్వస్తి, వషట్, మొదలగునవి ప్రయోగించినపుడు చతుర్థి వచ్చును. ఉదాహరణములు. నమః దేవాయ, తేస్వస్తి, భావవాచకము కంటే తుమర్థమున చతుర్థి వచ్చును. ఉదాహరణము - పాకాయయాతి మొదలగునవి; సహార్థక శబ్దములతో సంబంధమున్నపుడును హేత్వర్థమునందును కుత్సి తాంగవాచకమునకును తృతీయ వచ్చును. ఉదాహరణములు; పితాపుత్రేణ సహఅగాత్ అక్షాణకాణః, భృత్యఃఅర్థేన నివసేత్ ఇత్యాదులు కాలమునందును భావార్థమునందును సప్తమి వచ్చును. ఉదాహరణములు. ''విష్ణౌనతే ముక్తిర్భవేత్'' ''వసంతే సహహరింగతః'' ఇత్యాదులు నౄణాంసామి వృఘస్వామి, నృణాం ఈశః, సతాంపతిః నృణాం సాక్షి, నృఘసాక్షి, గోఘనాథః, గవాం పతిః, గోఘ సూతః, గవాంసూతః, రాజ్ఞాందాయకః ఇత్యాద్యుదాహరణములలో షష్టీ సప్తమీ విభక్తులు వచ్చినవి. స్మృత్యర్థ కర్మకు షష్టి వచ్చును. మాతుః స్మరతి, కర్తృ కర్మలకు నిత్యముగ షష్టి వచ్చును. అపాంభేత్త, తవకృతిః, ఇత్యాదులు ఉదాహరణములు. నిష్ఠాదియోగమునందు షష్టిరాదు.
అగ్నిమహా పురాణమున కారక నిరూపణ మను మూడు వందల యేబది నాలగవ అధ్యాయము సమాప్తము.