Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ఏకషష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథావ్యయవర్గః

అగ్నిరువాచ :

ఆంగీషదర్థే7భివ్యాప్తౌ సీమార్థే ధాతుయోగజే ః ఆప్రగృహ్యః స్మృతౌ వాక్యేప్యాస్తు స్యాత్కోపపీడయోః.

పాపకుత్సేషదర్థేకుధిగ్జుప్సన నిందయోః | చాన్వాచయ సమాహారే తర సముచ్చయే. 2

స్వస్త్యాశీక్షేమపుణ్యాదౌ ప్రకరే లంఘనేవ్యతి | స్విత్ర్పభే చవితర్కే చతుస్యాద్భేదేవ ధారణ. 3

నకృత్స పైకవారేస్యాదారాద్దూరసమీపయోః | ప్రతీచ్యం చరమే పశ్చాదుతాప్యర్థవికల్పయోః. 4

పునః సహ్ణార్థయోః శశ్వత్సాక్షా త్ర్పత్యక్ష తుల్యయోః | ఖేదానుకంపా సంతోషవిస్మయామంత్రణ బత. 5

హన్తహర్షేనుకంపాయాం వాక్యారంభవిషాదయోః | ప్రతిప్రతినిధౌ వీప్సాలక్షణాదౌ ప్రయోగతః. 6

ఇతి హేతౌప్రకరణ ప్రకాశాది సమాప్తిషు | ప్రాచ్యాం పురస్తాత్ర్పథమే పరారేగ్రత ఇత్యపి. 7

యావత్తావచ్చ సాకల్యే7వధౌ మానేవధారణ | మంగళానంతరారంభ ప్రశ్నకార్‌త్స్న్యేష్వథో అథ. 8

వృథా నిరర్థకావిధ్యోర్నానానేకోభయార్థయోః | నువృచ్ఛాయాం వికల్పేచ పశ్చాత్సాదృశ్యయోరను. 9

ప్రశ్నావ ధారణానుజ్ఞాను నయామంత్రణనను | గర్హా సముచ్చయ ప్రశ్న శంకాసంభావనాస్వపి. 10

ఉపమాయాం వికల్పేవా సామిత్వర్దే జుగుప్సితే | అమాసహ సమీపేచకం వారిణి చ మూర్ధని. 11

ఇనేత్థమర్థయోరేవం నూనం తర్కేర్థ నిశ్చయే | తూష్ణీమర్థే సుఖే జోషం కింపృచ్ఛాయం జుగుప్సనే. 12

నామప్రకాశ్యసంభావ్యక్రోధోపగమకుత్సనే | అలం భూషణ పర్యాప్తి శక్తి వారణ వాచకమ్‌. 13

హూం వితర్కే పరిప్రశ్నే సమయాన్తిక మధ్యయోః | పునరప్రథమే భేదే నిర్నిశ్చయని షేధయోః. 14

స్యాత్ర్పబంధే చిరాతీతే నికటాగామికే పురా | ఉరర్యురీ చోరరీచ విస్తారేగీకృతే త్రయమ్‌. 15

స్వర్గే పరేచ లోకేస్వర్వార్తా సంభావయోఃకిల | నిషేధ వాక్యాలంకారే జిజ్ఞాసావసరే ఖలు. 16

సమీపోభయతః శీఘ్రసాకల్యాభి ముభేభితః | నామప్రకాశయోః ప్రాదుర్మిథోన్యోన్యం రహస్యపి. 17

తిరోన్తర్ధౌ తిర్యగర్థే హావిషాద శుగార్తిఘ | అహ హేత్యద్భుతే ఖేదే హి హేతావ వధారణ. 18

అగ్నిపలికెను "ఆజ్‌" = కొంచము అను అర్థమునందును, అభి వ్యాప్తి యందును, సీమ యను అర్థము నందును ప్రయోగింపబడును. దానిని ధాతువుతో చేర్చినపుడు వేర్వేరు అర్థములుండును. "" ఇది ప్రగృహ్య సంజ్ఞకము. స్మృతి వాక్యము అను అర్థమున ప్రయోగింపబడును. ఆః=కోపము పీడ, కు=పాపము, నింద, కొంచెము "ధిక్‌="అసహ్యించుకొనుట-నింద. "" ఇది అనువాచయ సమాహార ఇతరేతర, సముచ్చ యార్థములందు ప్రయోగింపబడును. "స్వస్తి" = ఆశీర్వాదము. క్షేమము-పుణ్యాదికము "అతి" = ప్రకర్ష లంఘించుట, "స్విత్‌"= ప్రశ్నవితర్కము "తు"= భేదము, అవధారణము. "సకృత్‌"= కలిసి, ఒక పర్యాయము, "అరాత్‌"= దూరము, సమీపము. "పశ్చాత్‌"= పశ్చిమ దిక్కు, వెనుకటిది. "ఉత" అపి అనుదానికి వున్న అర్థములను వికల్పార్థమును బోధించును. పునః సదా అను పదములకు వున్న అర్థమును "శ్వత్‌" అనునది బోధించును. "సాక్షాత్‌"= ప్రత్యక్షము, తుల్యము. బత=ఖేదము, అనుకంప, అసంతోషము, విస్మయము, ఆమంత్రణము. హంత=హర్షము, అనుకంప, వాక్యారంభము. విశాదము. "ప్రతి"= ప్రతినిధి. వీప్స, లక్షణాదికము. "ఇతి"= హేతువు, ప్రకరణము, ప్రకాశాదకము, సమాప్తి. "పురస్తాత్‌"= పూర్వదిక్కు, ప్రథమము పూర్వము. "అగ్రతః= ఇది కూడ పై అర్థములనే చెప్పును. "యావత్‌ తావత్‌" ఇవి సాకల్యము అవధి, మానము, అవధారణము అను అర్థములగు చెప్పును. "అథో" "అథ" మంగళ, అనంతర, ఆరంభ, ప్రశ్న, సంపూర్ణత్వములు. వృథా=నిరర్థకము, యథా, విధిగ లేనిది. నానా=అనేకము, ఉభయము. "ను"= ప్రశ్న, వికల్పము. అను=వెనుక, సాదృశ్యము. "నను"= ప్రశ్న అవధారణము, అనుజ్ఞ అనునయము, ఆమంత్రణము. "అపి"= గర్హ, సముచ్చయము, ప్రశ్న, శంక, సంభావన, వా=ఉపమ, వికల్పము. సామి=సగము, జు గుప్సితము. అమా=కూడ, సమీపము. కం=నీరు, శిరస్సు, ఏవం=అనునది "ఇన" "ఇత్థం" పదముల అర్థము బోధించును. నూనం=తర్కము అర్థ నిశ్చయము. జోషం=మౌనముగా వుండుట సుఖము. "కిం"= ప్రశ్న నింద. "నామ"= పాకాశ్యము. సంభావ్యము, క్రోధము, స్వీకారము, నింద. ఆలం=భూషణము, పర్యాప్తి శక్తి, నివారణము. "హూం"= వితర్కము, పరిప్రశ్న. "సమయా"= సమీపము, మధ్య. "పునః"= ప్రథమము కానిది, భేదము. "నిః"= నిశ్చయము, నిషేధము. "పురా"= చిరకాలమునకు పూర్వము, సమీప భవిష్యత్తు. "ఉరరీ" "ఊరీ" "ఉరీ"= విస్తారము, అంగీకారము. "స్వర్‌"= స్వర్గము, పరలోకము. కిల=వార్త, సంభావనా. "ఇలు"= నిషేధము. వాక్యాలంకారము. జిజ్ఞాసావసరము. అభితః=సమీపము. రెండు వైపుల, శీఘ్రము, సాకల్యము, అభిముఖము. "ప్రాదున్‌" నామ, ప్రకాశము, "మిథః"= న్యోన్యము, రహస్యము. "తిరన్‌"= అంతర్ధానము, అడ్డము. "హా"= విషాదము. శోకము, అర్తి. "అహః"= అద్భుతము, ఖేదము. "హి"= హేతువు, అవధారణము.

చిరాయ చిరరాత్రాయ చిరస్యాద్యా శ్చిరార్థకాః | ముహుః పునః శశ్వదభీక్ష మసకృత్సమాః. 19

స్యాజ్ఘటిత్యంజసాహ్నాయ ద్రాఙ్మ సపదిద్రుతే | బలవత్సుష్ఠు కిముత వికల్పేకిం కిమూతచ. 20

తుహిచన్మహవై పాదపూరణ పూజనేస్వతి | దిహహ్నీత్యథ దోషాచ నక్తంచ రజనావితి. 21

తిర్యగర్థేసాచి తిరో7ప్యథ సంబోధనార్థకాః | స్యుః ప్యాట్‌ పాడంగ హేహైభోః సమయానికషాహిరుక్‌. 22

అతర్కితేతు సహసాస్యాత్పురః పురతో7గ్రతః స్వాహాదేవ హవిర్దానే శ్రౌషడ్‌ వౌషడ్‌ వషట్‌స్వధా. 23

కించిదీషన్మ నాగల్పే ప్రత్యా7ముత్ర భవాన్తరే | యథాతథాచైవ సామ్యే అహోహో ఇతివిస్మయే. 24

మౌనేతు తూష్ణీం తూష్ణీకం సద్యః సపది తత్‌క్షణ | దిష్ట్యా సముపయోషం చేత్త్యానందే7థా న్తరే7న్తరా. 25

అంతరేణ చ మధ్యేస్యుః ప్రసహ్యతు హఠార్థకమ్‌ | యుక్తేద్వే సాంవ్రతం స్థానే7భీక్‌ష్ణం శశ్వదనారతే. 26

అభవోనహ్యనో నాపిమాన్మ మాలంచ వారణ | పక్షాంతరే చేద్యది చతత్త్వేత్వ7ద్ధా7ంజ సాద్వయమ్‌. 27

ప్రాకాశ్యే ప్రాదురావిః స్యాదోమేవం పరమంమతే | సమంతతస్తు పరితః సర్వతో విష్వగిత్యపి. 28

అకామానుమతౌ కామమసూయోపగమే7స్తుచ | ననుచన్యాద్విరోధోక్తౌ కచ్పిత్కామ ప్రవేదనే. 29

నిఃసమం దుష్షమం గర్హ్యేయథాస్వన్తు యథాయథమ్‌ | మృషా మిథ్యాచ వితథే యథార్థన్తు యథాయథమ్‌. 30

స్యురేవన్తు పునర్వై వేత్యవధారణ వాచకాః | ప్రాగతీ తార్థకం నూనమవశ్యం నిశ్చయే ద్వయమ్‌. 31

సంవద్యర్షే7వరేత్వర్వా గామేవం స్వయమాత్మనా |

అల్పేనీచైర్మ హత్యుచ్చైః ప్రాయోభూమ్న్యద్రుతేశ##నైః. 32

సనానిత్యే బహిర్భా హ్యేస్మాతీ తే7స్తమదర్శనే | అస్తిసత్త్వే రుశోక్తావూముం ప్రశ్నే7నునయేత్వయి. 33

హూంతర్కే స్యాదుషా రాత్రేరవసానే నమోనతౌ | పునరర్థే7ంగ నిందాయాం దుష్టుసుష్ఠు ప్రశంసనే. 34

సాయంసాయే ప్రగేపాత్రః ప్రభాతేనికషా7న్తికే | పరుత్పరా ర్యైషమో7బ్ధే పూర్యైపూర్వతరేయతి. 35

అద్యాత్రాహ్న్య7థ పూర్వేహ్నీత్యాదౌ పూర్వోత్తరాపరాత్‌ |

తథా7ధరాన్యాన్య తరేతరాత్పూర్వే ద్యురాదయః. 36

ఉభయద్యుశ్చో భ##యేద్యుః పరేత్వహ్ని పరేద్యవి | హ్యోగతే నాగతే7హ్నిశ్వర పశ్వః పరే7హని.

తదాతదానీం యుగపదేకధా సర్వదాసదా | ఏతర్హి సంప్రతీదానీ మధునా సాంప్రతం తథా. 38

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శబ్దకోశే7వ్యయ వర్గాది నిరూపణం నామైక షష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః.,

చిరాయ - చిరరాత్రయ చిరస్య మొదలగునవి చిరార్థకములు. ముహుః, ''పునః పునః'', ''శశ్వత్‌'', ''అభీక్‌ష్ణం'' ''అసకృత్‌'' = మాటిమాటికి. ద్రాక్‌, ఝటితి, అంజసా, అహ్నాయ, మంక్షు: ''సపది'' = శీఘ్రమ, ఋవత్‌- ''సుష్టు'' శోభనము. ''కిముత'' = వికల్పము. కిం, కిమూత =వికల్పము. ''తుహి'' ''చ'' ''స్మ'' ''హ'' ''వై'' పాదపూర్తికి ఉపయోగించబడును. ''అతి'' = పూజార్థకము ''దివా'' = పగలు. ''దోషా'', ''నక్తం'' = రాత్రి. ''సాచి'', ''తిరస్‌'' = అడ్డముగా. ''ప్యాట్‌'' పాట్‌, అంగ, ''హే'' హై'' భోః = ఇవి సమానార్థకములు. సమయా, నికషా, హిరుక్‌ = దగ్గర.''సహసా'' = అతర్కితము, ''పురః పురతః అగ్రతః'' = ఎదుట, దేవతలకు హవిస్సును ఇచ్చునపుడు ''స్వాహా'' స్రౌషట్‌, వౌషట్‌, స్వధా, అనుపదములు ప్రయోగింపబడును. ''కించిత్‌'' ''ఈశత్‌'' మనాక్‌ = కొంచెము. ''ప్రేత్య'', ''అముత్ర''= జన్మాంతరము నందు. యథా, తథా = సామ్యము అహో- ఓ = ఆశ్చర్యము. ''తూష్ణిం, తూష్ణీకమ్‌'' = మౌనము.''సద్యః, సపది'' = త్‌క్షణము, ''దిష్ట్యా'' సముప జోషమ్‌'' ఆనంద సూచకములు. ''అంతరే, అంతరా, అంతరేణ'' = మధ్యయందు. ''ప్రసహ్య'' = హఠాత్తుగా. ''సాంప్రతం. స్థానే యుక్తము. ''అభీక్‌ష్ణమ్‌, శశ్వత్‌'' = నిరంతరముగ. ''నహి, అ'' నో, న'' = అభావము. ''మాస్మ, మా, అలమ్‌'' = ఇవి నిషేధార్థకములు. ''చేత్‌, యది'' = ఇవి పక్షాంతరమును ''అద్ధా, అంజసా'' వాస్తవార్థమును బోధించును. ''ప్రాదుః ఆవిః = ప్రకటమగును. ''ఓం, ఏవం'' పరమం = అంగీకారము.''సమంతతః'' పరితః, సర్వతః విశ్వక్‌ = నలు వైపుల. ''కామమ్‌, ఇష్టములేని అనుమతిని సూచించును ''అస్తు = కోపముతో కూడిన అనుమతిని సూచించును నను = విరోధో క్తిని సూచించును. ''కచ్చిత్‌'' = కోరికను తెలుపుటను సూచించును ''నిస్సమం'' ''దుస్సమం'' = నింద్యము. యథాస్వం, యథా యథము-యథాయోగ్యముగా, మృషా, మిథ్యా = అసత్యము. ''యథాతథమ్‌'' యథార్థము. ''ఏవం. తు'' పునః వై, వా = ఇవి నిశ్చయార్థకములు. ప్రాక్‌ ఇది అతీతార్థమును ''నూనం, అవశ్యం'' నిశ్చయముగా. ''సంపత్‌'' = సంవత్సరము ''అర్వాక్‌ = వెనుకటి కాలము. ''ఆం, ఏవమ్‌'' = అట్లే. ''స్వయం'' = స్వయముగా ''నీచైః = అల్పము. ''ఉచ్చైః = అధికము. ''ప్రాయః'' = తరచుగా. శ##నైః = మందముగా. ''సనా'' = నిత్యము, ''బహిః = వెలుపల ''స్మ'' = భూత కాలార్థము. ''అస్తమ్‌ = అదృశ్యము. ''అస్తి'' = వున్నది. ''ఊ'' = కోపోక్తి.''అయి'' = ప్రశ్నము, అనునయము. ''హూం = తర్కము. ''ఉషా'' = ప్రాతఃకాలము. ''నమః'' = నమస్కారము, అంగ మరల. ''దుష్టు'' = నింద. ''సుష్టు'' = ప్రశంసా. ''సాయం'' = సాయంకాలము. ''ప్రగే'' = ప్రాతఃకాలము. ''నికషా'' = సమీపమున. ఐషమః = గడచుచున్న సంవత్సరము. ''పరుత్‌'' = నిరుడు. ''పరారి'' = ముందటేటు. అద్య = నేడు. ''పూర్వ, ఉత్తర, అపర, అధర, అన్య, అన్యతర, ఇతర శబ్దములకు, పూర్వే అహ్ని, ఇత్యాద్యర్థము లందు పూర్వేద్యుః ఇత్యాది పదములు నిష్పన్న మగును. ''ఉభయద్యుః, ఉభ##యేద్యుః'' = రెండు దినములందును. ''పరేద్యవి'' = మరసటి రోజున. ''హ్యః'' నిన్న. ''శ్వః'' = రేపు. ''పరశ్వః'' = ఎల్లుండి. ''తదా'' తదానీం = అపుడు. ''యుగవత్‌, ఏకదా'' = ఒక్క మాటుగా, ''సర్వదా, సదా'' ఎల్లప్పుడును. ''ఏతర్హి, సంప్రతి, ఇదానీం, అధునా, సాంప్రతం'' = ఇపుడు.

అగ్ని మహా పురాణమున శబ్ద కోశమున అవ్యయ వర్గాది నిరూపణ మమ మూడు వందల అరువది ఒకటవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page