Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్విషష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ నానార్థ వర్గః

అగ్నిరువాచ :

ఆకాశే త్రిదివే నాకోలోకన్తు భువనేజనే | పద్యేయశసి చ శ్లోకః శ##రే ఖడ్గేచ సాయకః. 1

అనకః పటహో భేరీ కలంకో7ంకాప వాదయోః | మారుతే వేధసి బ్రధ్నేపుంసికః కం శిరో7ంబునోః. 2

స్యాత్పులాకస్తుచ్ఛధాన్యే సంక్షేపే భక్తసిక్థకే | మహేంద్ర గుగ్గులూలూకవ్యాలగ్రాహిషు కౌశికః. 3

శాలావృకౌకపిశ్వానౌ మానం స్యాన్మితి సాధనమ్‌ | సర్గః స్వభావ నిర్మోక్ష నిశ్చయాధ్యాయ సృష్టిషు 4

యోగః సన్నహనో పాయధ్యాన సంగాతి యుక్తిషు | భోగః సుఖేస్త్ర్యాది భృతాబ్జౌశంఖనిశాకరౌ. 5

కాకే భగండౌ కరటీ దుశ్చర్మా శిపివిష్టకః | రిష్టం క్షేమాశుభాభావేష్వరిష్టేతు శుభా7శుభే. 6

వ్యష్టిః ఫలే సమృద్ధౌచ దృష్టిర్‌జ్ఞే7క్‌ష్ణి దర్శనే | నిష్ఠానిష్పత్తి నాశాంతాః కాష్ఠోత్కర్షేస్థితౌదిశి. 7

భూగోవాచ స్త్విడా ఇలః ప్రగాఢం భృశకృచ్ఛ్రయోః భృశప్రతిజ్ఞయోర్బాఢం శక్తస్థూలౌ దృఢౌత్రిషు. 8

వినస్త సంహతౌ వ్యూఢౌ కృష్ణోవ్యాసే7ర్జునేహరౌ | పణోద్యూతాది షూత్సృష్టేభృతౌమూల్యేదనే 7పిచ. 9

మౌర్వ్యాంద్రవ్యాశ్రితే సత్త్వ శుక్ల సంధ్యాదికే గుణః | శ్రేష్ఠే7ధిపే గ్రామణీః స్యాజ్జుగుప్సాకరుణఘృతే.

తృషాస్పృహాపిపాసే ద్వే విపణిః స్యాద్వణిక్పథే | విషాభిమరలోహేషు తీక్‌ష్ణం క్లీబేఖరేత్రిషు. 11

ప్రమాణం హేతుమర్యాదా శాస్త్రే యత్తాప్రమాతృషు| కరణం క్షేత్రగాత్రాదా వీరిణం శూన్య మూషరమ్‌. 12

అగ్ని పలికెను. ''నాకః = ఆకాశము, స్వర్గము, ''లోకః = లోకము, జనులు, ''శ్లోకః'' = పద్యము, కీర్తి, ''సాయకః = బాణము, ఖడ్గము, ''ఆనకః'' = పటహము, భేరి. ''కలంకః'' = మచ్చ, అపవాదము ''కః'' = (పుం) = వాయువు, బ్రహ్మ, సూర్యుడు, కం = (న) = శిరస్సు, జలము. ''పులాకః'' = తుచ్ఛధాన్యము, సంక్షేపము, అన్నపు మెతుకు, ''కౌశికః'' = మహేంద్రుడు, గుగ్గులు, గుడ్లగూబ, పాములవాడు, ''శాలావృకః'' = వానరము, శునకము, ''మానమ్‌'' = కొలుచు సాధనము. ''సర్గ'' = స్వభావము, నిర్మోక్షము, నిశ్చయము, అధ్యాయము, సృష్టి, ''యోగః'' = కట్టుట, ఉపాయము, ధ్యానము. సంగతి, యుక్తి, ''భోగః'' = సుఖము, వేశ్యా స్త్రీలకు, మొదలగు వారికి ఇచ్చుభృతి ''అబ్జ'' = శంఖము, చంద్రుడు, ''కరటః'' = కాకి, ఏనుగు గండస్థలము ''శిపివిష్ఠః'' = దుష్ట చర్మకలవాడు, ''రిష్టం'' = క్షేమము, అశుభము, అభావము, ''అరిష్టం'' = శుభము, అశుభము ''వ్యుష్టిః'' = ప్రభాతము, సమృద్ధి ''దృష్టిః'' = జ్ఞానము, నేత్రము, దర్శనము ''నిష్ఠా'' = నిష్పత్తి, నాశము, అంతము ''కాష్ఠా'' = ఉత్కర్షము, స్థితి, దిక్కు, ''ఇడా'', ''ఇలా'' = భూమి, గోవు. ''ప్రగాఢః'' = అంత్యంతము, కఠినము, ''బాఢం'' = మిక్కిలి ప్రతిజ్ఞ, ''దృఢ'' = సమర్థుడు, స్థూలమైనది. ''వ్యూఢః'' = ఏర్పరుపబడినది. కలిసియున్నది. ''కృష్ణ'' = వ్యాసుడు అర్జునుడు, హరి, ''ఫణః'' = జూదాదుల యందు పందెము, భృతి మూల్యము, ధనము, ''గుణః'' = నారి, గుణము. సత్త్వాదులు, శుక్లాదులు, సంధి మొదలగునవి. ''గ్రామణీః'' = శ్రేష్ఠుడు, గ్రామాధిపతి. ''ఘృణా'' = జుగుప్స కరుణ ''తృషా'' = ఆసక్తి, దాహము ''విపణిః - వర్తకుల వీథి, తీక్‌ష్ణమ్‌'' = విషము, యుద్ధము, లోహము, తీక్‌ష్ణమైనది. అను అర్థమున ఇది త్రిలింగము, ''ప్రమాణము'' = హేతువు, మర్యాద, శాస్త్రము, ఇంత అను నిశ్చయము. ప్రామాణికుడు. ''కరణమ్‌'' = క్షేత్రము, శరీరము. మొదలగునవి, ఈరిణమ్‌ = శూన్యము ఊషరక్షేత్రము.

యన్తాహస్తి పకేసూతే వహ్నిజ్వాలా చ హేతయః |

శ్రుతం శాస్త్రా వభృతయోర్యుగ పర్యాప్తయోః కృతమ్‌. 13

ఖ్యాతే హృష్టే ప్రతీతో7భి జాతస్తు కులజే బుధే |

వివిక్తౌ పూతవిజనౌ మూర్ఛితౌ మూఢసోచ్ఛ్ర¸°. 14

అర్థో7భిధేయ రైవస్తు ప్రయోజన నివృత్తిషు | నిదానాగమయో స్తీర్ణ మృషిజుష్ట జలేగురౌ. 15

పాధాన్యే రాజలింగేచ వృషాంగే కకుదో7స్త్రియామ్‌ | స్త్రీ సంవిజ్‌జ్ఞాన సంభాషా క్రియాకారం జినామసు. 16

ధర్మేరహస్యుపనిషత్స్యాదృతౌ వత్సరే శరత్‌ | పదం వ్యవసితి త్రాణస్థాన లక్ష్మాం ఘ్రి వస్తుషు. 17

త్రిష్విష్ట మధురౌ స్వాదూమృదూ చాతీక్‌ష్ణకోమలౌ | సత్యేసాధౌ విద్యమానే ప్రశ##స్తే7భ్యర్హితే చసత్‌. 18

విధిర్విధానే దైవే7పి ప్రణిధిః ప్రార్థనేచరే | వధూర్జాయా స్నుషా స్త్రీచ సుధాలేపో 7 మృతంస్నుహీ. 19

స్పృహా సంప్రత్యయః శ్రద్ధా పండితమ్మన్య గర్వితౌ | బ్రహ్మ బంధురధిక్షేపే భానూరశ్మి దివాకరౌ. 20

గ్రావాణౌ శైలపాషాణౌ మూర్ఖనీచౌపృథగ్జనౌ | తరుశైలౌ శిఖరిణౌ తనుస్త్వగ్ధే హయోరపి. 21

ఆత్మాయత్నో ధృతిర్బుద్ధిః స్వభావో బ్రహ్మవర్ష్మచ | ఉత్థానం పౌరుషే తంత్రేవ్యుత్థానం ప్రతిరోధనే. 22

నిర్యాతనం వైరశుద్ధౌదానే న్యాసార్పణ7పిచ వ్యసనం విపదిభ్రంశే దోషే కామజోపతే. 23

మృగయాక్షా దివాస్వప్నః పరివాదః స్త్రియోమదః | తౌర్యత్త్రికం వృథాట్యాచ కామజో దశకోగణః. 24

పైశున్యం సాహసం ద్రోహ ఈర్ష్యాసూయార్థ దూషణమ్‌ |

వాగ్దండశ్చైవ పారుష్యం క్రోధజో7పి గణో7ష్టకః. 25

''యంతా'' = మావటివాడు, సారథి, ''హేతి'' = అగ్నిజ్వాల. ''శ్రుతమ్‌'' = శాస్త్ర నిర్ణయము, శాస్త్రము. ''కృతం'' = కృతయుగము, పర్యాప్తము, ''ప్రతీతః'' = ప్రసిద్ధము, చూడబడినది. ''అభిజాతః'' = సత్కులీనుడు, పండితుడు ''వివిక్త'' = పవిత్రమైనది. విజనము, ''మూర్ఛితః'' = మూర్ఛ పొందినవాడు, అంతట వ్యాపించినది. ''అర్థః'' = అర్థము, ధనము, వస్తువు, ప్రయోజనము, నివృత్తి ''తీర్థం'' = మూల కారణము, ఆగమము, మహర్షులు సేవించిన జలము, గురువు. ''కకుద్‌'' = ప్రధానము, రాజచిహ్నము, ఎద్దుమూపురము ''సంవిత్‌'' = జ్ఞానము, సంభాషణము, క్రియా నియమము, యుద్ధము, నామము ''ఉపనిషత్‌'' = ధర్మము, రహస్యము, ''శరత్‌'' = శరదృతువు, సంవత్సరము, ''పదం'' = నిశ్చయము, రక్షణము స్థానము, చిహ్నము, పాదము, వస్తువు, ''స్వాదు'' = ఇష్టము, మధురము ''మృదు'' = తీక్‌ష్ణము కానిది, కోమలము. ''సత్‌'' = సత్యము సాధువు, వున్నది, ప్రశస్తము, పూజ్యము, విధిః = విధానము, దైవము. ''ప్రణిధిః'' = పార్థన, గూఢచారి. ''వధూః'' = భార్య, కోడలు, స్త్రీ ''సుధా'' = సున్నము, అమృతము, ''శ్రద్ధా'' = ఆసక్తి, విశ్వాసము, పండితం మన్య, గర్విత = పండితునని గర్వించిన వాడు, ''బ్రహ్మ బంధుః'' = బ్రాహ్మణుని అధిక్షేపమును తెలుపును. ''భానుః'' = సూర్యుడు, కిరణము. ''గ్రావా'' = పర్వతము, శిల. ''పృథక్‌ జన'' = మూర్ఖుడు, నీచుడు. ''శిఖరీ'' = వృక్షము, పర్వతము. ''తనుః'' = చర్మ, దేహము. ''ఆత్మా'' = యత్నము, ధృతి, బుద్ధి, స్వభావము, బ్రహ్మ, శరీరము. ''ఉత్థానమ్‌'' = పౌరుషము, తంత్రము. ''వ్యుత్థానమ్‌'' = ఎదిరించుట. ''నిర్యాతనం'' = వైరము తీర్చుకొనుట. దానము, న్యాసము తిర్గి ఇచ్చుట. ''వ్యసనం'' = ఆపద, క్రింద పడుట, కామ క్రోధముల వలన కలిగిన దోషము, వేటజూదము, పగటి నిద్ర, ఇతరులను నిందిలచుట, స్త్రీ సక్తి, మద్యపానము, నాట్యము, గానము, వాద్యములు, వ్యర్థముగా, తిరుగుట. ఇవి కామము వలన కలిగిన పది వ్యసనములు; చాడీలు చెప్పుట, సాహసము, ఈర్ష్య, అసూయ, అర్థ దూషణము, పరుషవాక్‌, పరుష దండము. ఇవి క్రోధము వలన కలిగిన ఎనిమిది వ్యసనములు.

అకర్మగుహ్యే కౌపీనం మైథునం సంగతౌరతౌ | ప్రధానం పరమార్థాధీః ప్రజ్ఞానం బుద్ధి చిహ్నయోః. 26

క్రందనే రోదనాహ్వానే వర్ష్మదేహ ప్రమాణయోః | ఆరాధనం సాధనే స్యాదవాప్తౌ తోషణపి చ. 27

రత్నంస్వజాతి శ్రేష్ఠే7పిలక్ష చిహ్న ప్రధానయోః | కలాపో భూషణ బర్హే తూణీరౌ సంహతే7పిచ. 28

తల్పం శయ్యాట్ట దారేషు డింభౌతు శిశుబాలిశౌ | స్తంభౌ స్థూణాజడీ భావౌ సభ్యే సంసది వై సభా. 29

కిరణప్రగ్రహౌరశ్మి ధర్మాః పుణ్యయమాదయః | లలామం పుచ్ఛపండ్రాశ్మ భూషాప్రాధానకే తుషు. 30

ప్రత్యయో7ధీన శపథ జ్ఞానవిశ్వాస హేతుషు | సమయాః శపథా చారకాల సిద్ధాంత సంవిదః. 31

అత్యయో7తిక్రమే కృచ్ఛ్రే సత్యం శపథ తథ్యయోః | వీర్యం బలప్రభావౌ చ రూప్యం రూపే ప్రశస్తకే.

దూరోదరో ద్యూతకారే పణద్యూతే దురోదరమ్‌ | మహారణ్య దుర్గపథే కాంతారః పున్నపుంసకమ్‌. 33

యమానిలేంద్ర చంద్రార్క విష్ణు సింహాదికే హరిః | దరో7స్త్రియాం భ##యేశ్వభ్రే జఠరః కఠినే7పిచ. 34

ఉదారో దాతృమహతో రితరస్త్వన్య నీచయోః | చూడాకిరీటం కేశాశ్చ సంయతా మౌలయస్త్రయః. 35

బలిః కరోపహారాదౌ సైన్య స్థైర్యాదికె బలమ్‌ | స్త్రీకటీ వస్త్రబంధోపి నీవీపరిపణ7పిచ. 36

శుకలే మూషికే శ్రేష్ఠే సుకృతే వృషభే వృషః | ద్యూతాక్షే సారిఫలకే7ప్యాకర్షో7థా7క్షమింద్రియే. 37

నా ద్యూతాంగే చ కర్షేచ వ్యవహారే కలిద్రుమే | ఊష్ణీషః స్యాత్కిరీటాదౌ కర్షూః కుల్యాభిధాయినీ. 38

ప్రత్యక్షే7ధి కృతే7ధ్యక్షః సూర్య వహ్నీ విభావసూ | శృంగారాదౌ విషేవీర్యే గుణరాగే ద్రవేరసః. 39

తేజఃపురీష యోర్వర్చ ఆగః పాపాపరాధయోః | ఛందః పద్యే7భిలాషే చ సాధీయాన్సాధు బాఢయోః.

వ్యూహోవృందే7ప్యహిర్వృత్రే7ప్య గ్నీంద్వర్కా స్తమోనుదః. 40

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శబ్దకోశే నానార్థవర్గనిరూపణంనామ ద్విషష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః.

''కౌపీనం'' = చెడ్డపని, గుహ్యము. ''మైథునం'' = సంగతి, రతి. ''ప్రధానం'' = పరమార్థ బుద్ధి. ''ప్రజ్ఞానం'' = చిహ్నము, బుద్ధి. ''క్రందనం'' = ఏడ్పు, పిలుచుట. ''వర్ష్మ'' = దేహము, ప్రయాణము. ''ఆరాధనం'' = సాధనము, ప్రాప్తి, సంతోష పెట్టుట. ''రత్నం'' = స్వజాతీ శ్రేష్ఠము. ''లక్ష్య'' = చిహ్నము, ప్రధానము. ''కలాపః'' = భూషణము, నెమలి పింఛము, అంబులపొది, సంఘటితము. ''తల్పం'' = శయ్యా, అట్టాలిక, భార్య. ''డింభః'' = శిశువు, మూర్ఖుడు. ''స్తంభః'' = స్తంభము, కొయ్యబారుట. ''సభా'' = సమితి, సదస్సులు. ''రశ్మిః'' = కిరణము, కళ్ళెము. ''ధర్మః'' = పుణ్యము యమాదులు, లలామం, పుచ్ఛము, పుండ్రము, అశ్వము, అలంకారము, ప్రాధాన్యము, ధ్వజము. ''ప్రత్యయః'' = అధీనము, శపథము, జ్ఞానము, విశ్వాసము, హేతువు. ''సమయః'' = శపథము, ఆచారము, కాలము, సిద్ధాంతము. ఒడబాటు. ''అత్యయః'' = అతిక్రమణము, కాఠిన్యము. ''సత్యం'' = శపథము, తథ్యము. ''వీర్యం'' = బలము, ప్రభావము. ''రూప్యం'' = రూపము, పశస్తము ''దురోదరః'' = (పుం) జూదరి (నపుం) పందెము, జూదము. ''కాంతారః'' = మహారణ్యము, దుర్గ మార్గము. ''హరిః'' = యముడు, వాయువు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు విష్ణువు, సింహాదులు. ''దరః'' = (పుం. న) భయము, గొయ్యి. ''జఠరః'' = ఉదరము, కఠినము. ''ఉదారః '' దాతా, మహాపురుషుడు, ''ఇతరః'' = అన్యుడు, నీచుడు, ''మౌళిః'' = శిఖ, కిరీటము, ముడివేసిన జుట్టు, ''బలిః'' = పన్ను, ఉపహారము, ''బలం'' = సైన్యము, స్థెర్యము మొదలగునది. ''నీవీ'' = స్త్రీకటి వస్త్రబంధము, మూలధనము. ''వృషః'' = అధిక వీర్యవంతుడు, ఎలుక, శ్రేష్ఠము, పుణ్యము, వృషభము, ''ఆకర్షః'' = జూదము నందుపయోగించు పాచికా, సారి ఫలకము ''అక్షం'' - ఇంద్రియము, 'అక్షః'' = పాచికా, కర్షము, వ్యవహారమ. కలిద్రుమము. ''ఉష్ణీశః'' = కిరీటాదికము. ''కర్షూః'' = చిన్ననది. ''అధ్యక్షః'' = పత్యక్షము అధికారి. ''విభావసుః'' = సూర్యుడు, అగ్ని ''రసః'' = శృంగారాదిరసము, విషము, వీర్యము, గుణము, రాగము, ద్రవము, ''వర్చస్‌'' = తేజస్సు, పురీషము 'ఆగః' = పాపము, అపరాధము, 'ఛందస్‌' = పద్యము, అభిలాష, సాధీయన్‌' = ఉత్తమము, నిశ్చితము. 'వ్యూహః' = సమూహము, 'అహిః' = వృత్రాసురుడు, 'తమోపహ' = అగ్ని, చంద్రుడు, సూర్యుడు

అగ్ని మహా పురాణమున శబ్ద కోశము నందు నానార్థ వర్గ నిరూపణ మమ మూడు వందల అరువది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page