Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ పంచషష్ట్యధిక త్రిశతతమో7ధ్యాయః

అథ బ్రహ్మవర్గః

అగ్నిరువాచ :

వంశోన్వ వాయో గోత్రం స్యాత్కులాన్యభి జనాన్వ¸° | మంత వ్యాఖ్యాకృదాచార్య ఆధష్టాత్వధ్వరేవ్రతీ. 1

యష్టాచ యజమానః స్యాజ్జాత్వారంద ఉపక్రమః | సతీర్థ్యాశ్చెక గురవః సభ్యాః సామాజికాస్తథా. 2

సభాసధః సభాస్తారా ఋత్విజో యాజకాశ్చతే | అర్ధ్వర్యూద్గాతృహోతారో యజుః సామర్గ్విదః క్రమాత్‌. 3

చషాలో యూపకటకః సమే స్థండిల చత్వరే | అమిక్షాసా శ్రుతోణ్ణయా క్షీరే స్యాద్దధియోగతః. 4

పృషదాజ్యం సదధ్యాజ్యే పరమాన్నంతు పాయసమ్‌ | ఉపాకృతః పశురసౌ యోభి మంత్ర్యక్రతౌహతః. 5

పరంపరాకం శమనం ప్రోక్షణంచ వధార్థకమ్‌ | పూజానమస్యాప చితిః సపర్యార్చార్హణాః సమాః. 6

వరివస్యాతు శుశ్రూషా పరిచర్యాప్యుపాసనిమ్‌ - నియమోవ్రతమస్త్రీతచ్చోపవాసాది పుణ్యకమ్‌. 7

ముఖ్యః స్యాత్ర్పథమః కల్పోను కల్పస్తుతతోధమః | కల్పేవిధిక్రమౌజ్ఞే¸° వివేకః వృథగాత్మతా. 8

సంస్కార పూర్వం గ్రహణం స్యాదుపాకరణం శ్రుతేః | భిక్షుః పరివ్రాట్‌ కర్మన్దీ పారాశర్యపిమస్కరీ 9

ఋషయః సత్యవచనః స్నాతకశ్చాప్లుతోవ్రతీ | యే నిర్జితేన్ద్రియగ్రామాయతినో యతయశ్చతే. 10

శరీశసాధనా పేక్షం నిత్యం యత్కర్మ యద్యయః | నియమస్తు సయత్కర్మ నిత్యమాగస్తుసాధనమ్‌. ||

స్యాద్బ్రహ్మ భూయం బ్రహ్మత్వం బ్రహ్మసాయుజ్యమిత్యపి. 11

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే బ్రహ్మవర్గవర్ణనంనామ పంచషష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.

అగ్నిదేవుడు పలికెను. వంశ - అన్వవాయ - గోత్ర - కుల - అభిజన - అన్వయ = వంశము. మంతవ్యా ఖ్యానము చేయువాడు ఆచార్యుడు. యజ్ఞమునందు వ్రతదీక్ష గ్రహించినవాడు ఆదేష్ట. యష్టా - యజమానః=పర్యా. ఉపక్రమః=తెలిసి చేసిన ప్రారంభము; సతీర్థ్యాః - ఒకగురువు కలవారు. సభ్యాః - సామాజికాః - సభాసదః - సభాస్తారాః=పర్యా. ఋత్విజః - యాజకాః=పర్యా. అధ్వర్యుః=యజుర్వేదము తెలిసిన ఋత్విక్‌. ఉద్గాతా=సామవేదము తెలిసిన ఋత్విక్‌. హోతా = ఋగ్వేదము తెలిసిన ఋత్విక్‌. చశాలః = యూపస్తంభము నందలి కటకము. స్థండిలం - చత్వరం=పర్యా. ఆమిక్షా = కాచిన పాలు తోడు బెట్టగా దానినుండి వచ్చిన నీరు; పెరుగు కలిపిన నెయ్యి వృషదాజ్యమ్‌. పరమాన్నం - పాయసం = పర్యా. యజ్ఞమునందు అభిమంత్రించి చంపబడిన పశువు "ఉపాకృతము". పరంపరాక - శమన - ప్రోక్షణ=యజ్ఞ పశువధము. పూజా-నమస్యా - అపచితిః - సపర్యా - అర్హణా=పర్యా. వరివస్యా - శుశ్రూష - పరిచర్యా - ఉపాచనమ్‌ = సేవ; నియమః - వ్రతమ్‌ = పర్యా. పుణ్యకమ్‌=ఉపవాసాది వ్రతము; ప్రధానమైనది ముఖ్యకల్పము. అధమమైనది అనుకల్పము. కల్పః విధిః - క్రమః=పర్యా. వివేకః = వేర్వేరు చేసి గ్రహించుట. ఉపాకరణమ్‌ = సంస్కార పూర్వకముగ వేదమును గ్రహించుట. భిక్ష - పరివ్రాట్‌ - కర్మందిన్‌ = పారాశరిన్‌ - మస్కరిన్‌ = సన్యాసి; సత్యవాక్కు కలవారు ఋషులు. వేదాధ్యయన వ్రతమును సమాప్తి చేసినవాడు స్నాతకుడు - యతిన్‌ - యతి = ఇంద్రియములను వశములో వుంచుకొనువాడు; శరిరసాధ్యమగు నిత్యకర్మకు "యమము" అని పేరు. అపుడప్పుడు చేయు అనిత్యకర్మ నియమము. బ్రహ్మభూయమ్‌ - బ్రహ్మత్వమ్‌-బ్రహ్మసాయుజ్యమ్‌ = పర్యా.

అగ్నిమహాపురాణమున బ్రహ్మవర్గ వర్ణనమను మూడువందల అరువదిఐదవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page