Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ షట్‌ షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః

అథ క్షత్రవిట్‌ శూద్రవర్గాః

అగ్ని రువాచ :

మూర్ధాభిషిక్తో రాజన్యో బాహుజః క్షత్రియోవిరాట్‌ | రాజాతుప్రణాత శేషసామంతః స్యాదధీశ్వరః. 1

చక్రవర్తీ సార్వభౌమోనృపోన్యో మండలేశ్వరః | మంత్రీధీ సచివోమాత్యో మహామంత్రాః ప్రధానకాః.

ద్రష్టరివ్యవహారాణాం ప్రాడ్వివాకాక్ష దర్శకౌ | భౌరికః కనకాధ్యక్షోథాధ్యక్షాధికృతౌసమౌ. 3

అంతఃపురేత్వధికృతః స్యాదంతర్వంశికే జనః | సౌవిదల్లాః కంచుకినః స్థాపత్యాః సౌవిదాశ్చతే. 4

షండో వర్షవరస్తుల్యాః సేవకార్థ్య నుజీవినః | విషయానం తరోరాజా శత్రుర్మిత్రమతః పరమ్‌. 5

ఉదాసీనః పరతరః పార్షిగ్రాహస్తు పృష్ఠతః | చరః స్పశః స్యాత్ర్పణిధిరుత్తరః కాల ఆయతిః. 6

తత్కాలస్తు తదాత్వం స్యాదుదర్కః ఫలముత్తమమ్‌ | అదృష్టం వహ్నితోయాది దృష్టంస్వపర చక్రజమ్‌. 7

భద్రకుంభః పూర్ణకుంభో భృంగారః కనకాలుకా | ప్రభిన్నో గర్జితో మత్తోవమథుః కరశీకరః. 8

స్త్రీయాం సృణిస్త్వం కుశోస్త్రీ పరిస్తోమః కుథోద్వయోః |

కర్ణీరథ ః ప్రవహణందోలా ప్రేంఖాదికాస్త్రియమ్‌. 9

ఆధోరణా హస్తిపకా హస్త్యారోహా నిషాదినః | భటాయోధాస్చ యోద్ధారః కంచుకో వారణోస్త్రియమ్‌. 10

శీర్షణ్యం చ శిరస్త్రేథ తనుత్రం వర్మ దింశనమ్‌ | ఆముక్తః ప్రతిముక్తశ్చ

పీనద్ధాశ్చాపినద్ధనత్‌. 11

(అ)2/51

వ్యూహస్తు బలవిన్యాసశ్చక్ర చానీక మస్త్రియామ్‌ | ఏకేభైకరథాత్ర్య శ్వాపత్తిః పంచపదాతికా. 12

ప్రత్త్యంగై స్త్రి గుణౖః సర్వైః క్రమాదాఖ్యాయ థోత్తరమ్‌ |

సేనాముఖం గుల్మగణౌ వాహినీ పృతనాచమూః 13

అనీకినీ దశానీకిన్యక్షౌహిణ్యో గజాదిభిః | ధనుఃకోదండ ఇష్వాసో కోటిరస్యాటనీస్మృతా. 14

లస్తకస్తు ధనుర్మధ్యం మౌర్వీజ్యా సింజినీ గుణః | వృషత్కబాణ విశిఖా అజిహ్మగఖగాశుగాః. 15

అగ్ని దేవుడు పలికెను. మూర్ధాభిషిక్త - రాజన్య - బాహుజ - క్షత్రియ - విరాట్‌ = క్షత్రియుడు. అధీశ్వరః=సామంతరాజు లందరును వంగి నమస్కరించు రాజు. చక్రవర్తి=సార్వభౌమః=సకల భూ మండలము నందు అధికారము కలవాడు. చిన్న చిన్న మండలములు పాలించు వారు మండలేశ్వరులు. మంతీ - ధీసచివః - అమాత్యః=పర్యా మహా మంతః=ప్రధానుడైన మంత్రి. పాడ్వివాకః - అక్షదర్శకః=వ్యవహారమును పరిశీలించువాడు; భౌరికః= సువర్ణాధ్యక్షుడు. అధ్యక్షః - అధికృతః=అధికార. అంతర్వంశికః=అంతః పురాధికారి. సౌవిదల్ల - కంచుకిన్‌ - స్థాపద్య - సౌవిద=అంతఃపుర రక్షకులు. షండః - వర్షవరః=అంతఃపుర భృత్యులు. సేవకః - అర్థీ - అనుజీవి=పర్యా తన దేశమునకు సరిహద్దు నున్నరాజు శత్రువు; వాని రాజ్యమునకు అవతలనున్నవాడు మిత్రుడు. వానికి అవతల వున్న వాడు ఉదాసీనుడు. వెనుకనున్న వాడు పార్షి గ్రాహుడు. చరఃసృశః - ప్రణిధిః=గూఢచారి. ఆయతిః=భవిష్కత్కాలము - తదాత్వం=తత్కాలము. ఉదర్కః=భవిష్యత్ఫలము. అగ్ని జలాదుల వలన కలుగు భయము. అదృష్ట భయము. స్వపర రాజ్యముల నుండి కలిగినది దృష్ట భయము; భద్ర కుంభః, పూర్ణ కుంభ=పర్యా. భృంగారః - కనకాలుకా=పర్యా. ప్రభిన్నః - గర్జితః - మత్తః=మదించిన ఏనుగు; వమథు=ఏనుగు తొండము నుండి వచ్చు జల బిందువులు; శ్రుణి - అంకుశః=పర్యాయ పదములు. పరిస్తోమః - కథ=ఏనుగుపై పరచిన ఆస్తరణము. కర్ణీరథః - ప్రవహణమ్‌=స్త్రీలు ప్రయాణించు రథము. దోలా=ప్రేంకా - ఊయల. ఆధోరణ - హస్తిపక - హస్త్యారోహ - నిషాదిన్‌=ఏనుగు నెక్కు వారు. (మావటీడు) భట - యోధ - యోధృ=పర్యా. కంచుకః వారణః=కవచము. శీర్షణ్యమ్‌ - శిరస్త్రమ్‌=పర్యా తనుత్రమ్‌ - వర్మ - దంశనమ్‌=కవచము. ఆముక్తః - ప్రతిముక్తః - పివద్ధః - అపినద్ధః=ధరించిన కవచము. వ్యూహః=వల విన్యాసము. చక్రమ్‌ - అనీకమ్‌=సైన్యము. ఒక ఏనుగు, ఒక రథము, మూడు గుర్రములు, ఐదుగురు కాలిబంట్లు వున్నది "పత్తి". పత్తిలోని అంగములను ఏడు పర్యాయములు మూడేసిరెట్టు చేసినచో వరుసగా సేనాముఖ - గుల్మ గణ - వాహినీ - పృతానా - చమూ - అనీ కినీ అను సేనా విభాగములు ఏర్పడును. గజములు మొదలగు సకలాంగములతో కూడిన పది అనీకుల సేనను అక్షౌహినీ అని పేరు; ధనుః - కోదండః - ఇశ్వాసః=ధనుస్సు. కోటి-అటనీ=ధనుస్సు యొక్క రెండు అగ్ర భాగములు. లస్తకః=ధనుర్మధ్యము. మౌర్వీ - జ్యా - సింజినీ - గుణః=నారి. పృషత్క - బాణ విశిఖ - అజిహ్మగ - ఖగ - అశుగ - ఇవి పర్యాయ పదములు.

తూణోపాసంగ తూణీర నిషంగా ఇషుధిర్ద్వయోః | అసిర్‌ ఋష్టిశ్చ నిస్త్రింశః కరవాలః కృపాణవత్‌. 16

త్సరుః ఖడ్గస్య ముష్టిః స్యాదీలీతు కరపాలికా | ద్వయోః కుఠారః స్వధితిః ఛురికాచాసి పుత్రికా 17

పాసస్తు కుంతో విజ్ఞేయః సర్వలా తోమరోస్త్రియమ్‌ | వైతాలికా బోధకరా మాగధా బందినస్తుతో. 18

నంశప్తకాస్తు సమయాత్సంగ్రామాదనివర్తినః | పతాకా వైజయంతీస్యాత్కేతనం ధ్వజమస్త్రియామ్‌. 19

అహం పూర్వమహం పూర్వమిత్యహం పూర్వికాస్త్రియామ్‌ |

అహమహమికాసాస్యాదోహంకారః పరస్పరమ్‌. 20

శక్తిపరాక్రమః ప్రాణః శౌర్యం స్థాన నహోబలమ్‌ | మూర్భాతు కశ్మలం మోహోప్యవమదస్తు పీడనమ్‌.

అభ్యవస్కంద నస్త్వభ్యాసాదనం విజయోజయః | నిర్వాసనం సంజ్ఞపనం మారణం ప్రతిఘాతనమ్‌. 22

స్యాత్పంచతా కాలధర్మో దిష్టాంతః ప్రలయోత్యయః | విశోభూమి స్పృశోవైశ్యావత్తిర్వర్తన జీవనే. 23

కృష్యాదివృతయోజ్ఞేయాః కుసీదం వృద్ధి జీవికా | ఉద్దారోర్థ ప్రయోగః స్యాత్కణిశం సస్యమంజరీ. 24

కింశారుః సస్యశూకం స్యాత్త్యంభో గుత్సస్తృణాదినః |

ధాన్యం వ్రీహిః స్తంబకరిః కడంగరో బుసంస్మృతమ్‌. 25

మాషాదయః శమీధాన్యో శూకధాన్యే యావాదయః | తృణధాన్యాని నీవారాః శూర్పంప్రప్ఫోటనం స్మృతమ్‌.

స్యూతప్రసేవౌ కండోలపిటౌకట కిలింజకౌ | సమానౌ రసవత్యాన్తు పాకస్థాన మహానసే. 27

పౌరోగవస్తదధ్యక్షః సూపకారాస్తు బల్లవాః | అరాలికా ఆంధసికాః సూదా ఔదనికా గుణాః. 28

క్లీబేంబరీషం భ్రాష్ట్రో నాకర్కర్యాలూర్గ లంతికా | ఆలింజరః స్యాన్మణికం సుషవీకృష్ణ జీర కే. 29

ఆరనాలస్తు కుల్మాషం బాహ్లీకం హింగురామఠమ్‌ | విశాహరిద్రా పీతాస్త్రీ ఖండే మత్స్యండిఫాణితే. 30

కూర్చికా క్షిరవికృతిః స్నిగ్ధం మసృణ చిక్కణమ్‌ | పృథుకః స్యాచ్చిపికో ధానాభ్రష్టయవాః స్త్రియామ్‌.

జేమనంలోప ఆహారో మాహేయీ సౌరభీచ గౌః | యుగాదీనాంచ వోఢారో యుగ్యప్రాసంగ్య శాకటాః. 32

చిరసూతా బష్కయణీధేనుః స్యాన్నవసూతికా | సంధినీ వృషభాక్రాన్తా వేహద్గర్భోపఘాతినీ. 33

తూన - ఉపాసంగ - తూణీర - నిషంగ - ఇషుధి=అంబుల పొది; అసి - ఋష్టి - నిస్త్రింశ - కరవాల - కృపాణ=ఖడ్గము. త్సరుః=ఖడ్గముపిడి. ఈలీ - కరపారికా = చేతులను రక్షించు కొనుసాధనము. కుఠారః - స్వదితీః=గొడ్డలి ఛురికా - అసిపుత్రికా=చిన్న కత్తి ప్రాసః - కుంతః = పర్యా. సర్వలా - తోమరః = పర్యా. వైతిలికాః - బోధకరాః= ప్రాతః కాలమున మేల్కొలుపు వారు. మాగధాః - వందినః=సోత్ర పాఠకులు. సంశప్తకాః=శపథము చేసి యుద్ధము నుండి తిరిగి రాని వారు. పతాకా - వైజయంతీ=చిన్న జండా. కేతనమ్‌ - ధ్వజమ్‌=పెద్ద జండా. అహంపూర్వికా=నేనుముందు, నేను ముందు యని చెప్పుట. అహమహమిక=నేను నేను సమర్థుడనను అహంకారము. శక్తి-పరాక్రమ - ప్రాణ - శౌర్య - స్థాన సహన్‌ బల = (స్థామ) పర్యా. మూర్ఛా - కష్మలం - మోహః=పర్యా. అవమర్దః=పీడించుట. అభ్యవస్కందనః - అభ్యాసాదనమ్‌ = శత్రువును ఆక్రమించుట. విజయః - జయః=పర్యా. నిర్మాసనమ్‌ - సంజ్ఞపనం - మారణం - ప్రతిఘాతనం=చంపుట. దిష్టాంత - ప్రళయ - పంచతా - కాలధర్మ - అత్యయ=మరణము; విశ్‌ - భూమి స్పృశ్‌ - వైశ్య=పర్యా. వృత్తిః - వర్తనం - జీవనం - జీవిక. కృషి=మొదలగునవి వృత్తులు. కుసీదం=వడ్డిపై జీవించుట ఉద్ధారః=అర్థప్రయోగః=వడ్డీకి ధనమిచ్చుట. కణిషం=సస్యముల వెన్ను; కింశారు=సస్యముల ముల్లు. స్తంబః - గుత్సః - తృణాదుల గుచ్చము, ధాన్య - వ్రీహి - స్తంభకరీ=వరి. కడంగరః - బుసం=పర్యా. మాషము మొదలగునది శమీధాన్యమనియు, యవాదులు శూక ధాన్యమనియు, నీవారములు తృణ దాన్య మనియు చెప్పబడును. శూర్పం - పస్ఫోటనం=చాటు. స్యూతః - ప్రసేవః=త్రాడు (అల్లినది); కండోలు - పీటః=బుట్ట - కటః - కిలింజకః=చాప. రసవతీ - పాకస్థానం - మహానసం=వంట యిల్లు. పౌరోగవః=పాక గృహాధ్యక్షుడు. సూపకారాః - వల్లవాః - అరాలికాః - ఆంధసికాః - సూదాః - ఔదనికాః - గుణా = వంట చేయువారు. అంబరీషం - బ్రాష్ట్ర=మంగలము. కర్కరీ - ఆలుః గలంతికా=కత్తిపీట. ఆలింజరః - మణికం=పెద్ద ఘటము. శుషవీ=నల్ల జీలకర్ర; అరనాలః - కుల్మాషం=గంజి. వాహ్లికం - హింగు రామఠం=హింగువ. నిశా - హరిద్రా - పీతా=పసుపు. మత్స్యండి - ఫాణితం - ఖండము. కూర్చికా - క్షీరముతో తయారు చేసిన పదార్థము. స్నిగ్ధం - మస్రుణం - చిక్కనం=చిక్కగా నున్నది. వృథుకః - చిపిటకః=అటుకులు. ధానాః=వేయించిన యవలు-జేమనం - లేపః - ఆహారః=వర్యా. మాహేయీ - సౌరభీ - గౌః=ఆవు. యుగ్య - పాసంగ్య-శాకట = కాడిమోయు ఎద్దుల. భష్కయిణీ=చాల కాలము క్రితము ఈనిన ఆవు. ధేనుః =క్రొత్తగా ఈనిన ఆవు. సంధినీ = వృషభముతో కలిసిన ఆవు - వేహత్‌ = గర్భము పోయిన ఆవు.

పణ్యాజీవోహ్యా పణికోన్యానశ్చోపనిధిః పుమాన్‌ | విపణో విక్రయః సంఖ్యా సంఖ్యేయే హ్యాదశత్రిషు. 34

వింశత్యాద్యాః సదైకత్వే సర్వాః సంఖ్యేయ సంఖ్యయోః | సంఖార్థే ద్విబహుత్వేస్తస్తాను చానవతేః స్త్రియః.

పంక్తేః శతసహస్రాది క్రమాద్దశ గుణోత్తరమ్‌ | మానన్తు లాంగులి ప్రస్థైర్గుంజాః పంచాద్యమాషకః. 36

తేషోడశాక్షః కర్షోస్త్రీపలం కర్షచతుష్టయమ్‌ | సువర్ణ బిస్తౌహేమ్నోక్షే కురువిస్తస్తు తత్సలే. 37

తులాస్త్రియాం పలశతం భారః స్యాద్వింశతిస్తులాః కార్షాపణః కార్షికః స్యాత్కర్షికే తామ్రికేపణః. 38

ద్రవ్యం విత్తం సాపతేయం రిక్థముక్థం ధనం వసు | రీతిః స్త్రియామారకూటోన స్త్రియామథతామ్రకమ్‌. 39

శుల్చమౌ దుంబరం లౌహే తీక్షం కాలాయసాయసీ | క్షారః కాచోథ చపలోరన సూతశ్చ పారదే. 40

గరలం మాహిషం శృంగంత్రపు సీసకపిచ్చటమ్‌ | డిండీరోబ్ధికఫః ఫేనో మధూచ్ఛిష్టన్తు సిక్థకమ్‌. 41

రంగవంగే పిచుస్థూలో కూలటీతు మనఃశిలా | యవక్షారశ్చపాక్యః స్యాత్త్వ క్షీరా వంశలోచనా. 42

వణ్యాజీవః - ఆపణికః = వ్యాపారము చేయువాడు. న్యాసః - ఉపనిధీ = దాచుటకు ఇచ్చిన వస్తువు. విపణః - విక్రయః = అమ్ముట. "దశ" వరకును. సంఖ్యా వాచకములు సంఖ్యేయమును చెప్పును. త్రిలింగములలో నుండును. వింశతి వరకు అన్ని సంఖ్యా వాచకములు సంఖేయ సంఖార్థములలో నిత్య ఏకవచనాంతములో వుండును. సంఖ్యార్థము నంది ఇవి ద్వివచన, బహువచనములందు కూడ వుండును. "నవతి" వరకు = ఇవి స్త్రీలింగములు; "పంక్తి" మొదలు "శత" సహస్ర" ఆదికము క్రమముగా పదేసి రెట్లుండును. తులా - అంగులి - ప్రస్థములతో చేయబడుమానము మూడు విధములు ఐదు గుంజలు ఒకమాషము. పదహారు మాషములు ఒక అక్షము లేదా కర్షము. నాల్గు కర్షములు ఒక పలము. ఒక అక్షము బంగారమునకు సువర్ణము, బిస్తము, అనిపేరు. ఒక పలము సువర్ణము కురు బిస్తము. నూరు పలములు ఒక తుల. ఇరవైతులలు ఒక భారము. వెండి రూపాయకు కార్షాపణము కార్షికము అని పేరు. రాగి పైసకు పణము అని పేరు. ద్రవ్య-విత్త - స్వాప తేయ, రిక్థ - రుక్థ - ధన వసు = ధనము; రీతిః - ఆరకూటః = ఇత్తడి తామ్రకమ్‌ - శుల్బమ్‌ - ఔదుంబరం = రాగి. తీక్షం - కాలాయసం - అయః = నుము. క్షారః - కాచః = గాజు. చవలః - రసః - సూతః - పారదః = పాదరసము. గరళం = మహిష శృంగము. త్రపు - సీసకం - పిచ్చటం = సిసము. హిండీరః - అబ్ధి - కఫః - ఫేనః = సముద్రము మీద నున్న నురుగు; మధూచిష్టం - సిక్థకం = మైనము. రంగః - వంగః = పర్యా; పిచుః - స్థూలః = దూది. కులటి - మనశ్శిలా = మణిశీల. యవక్షారః = పాక్యః పర్యా; త్వక్షీరా - వంశలోచనా = పర్యాయములు.

వృషలా జఘన్యజాః శూద్రాశ్చాండాలాన్త్యాశ్చ సంకరాః |

కారుః శిల్పీ సంహతైసై#్తర్ద్వయో శ్రోణిః సజాతిభిః. 43

రంగా జీవశ్చిత్ర కరస్త్వష్టాతక్షాచ వర్ధకిః | నాడిం ధమః స్వర్ణకారో నాపితాన్తా వసాయినః. 44

జాబాలః స్యాదజాజీవో దేవాజీ వస్తు దేవలః | జాయాజీవాస్తు శైలూషా భృతిభుక్‌ తథా. 45

వివర్ణః పామురోనీచః ప్రాకృతశ్చ వృథగ్జనః | విహీనోపశదో జాల్మో భృత్యే దాసేర చేటకాః. 46

పటుస్తు పేశలో దక్షో మృగర్లుబ్దకః స్మృతః | చండాలస్తు దివాకీర్తిః పుస్తం లేప్యాది కర్మణి. 47

పంచాలికా పుత్రికా స్యాద్వర్కరస్తరుణః పశుః | మంజూషా పేటకః పేటా తుల్యసాధారణౌ సమౌ.

ప్రతిమాస్యాత్ర్పతి కృతిర్వర్గా బ్రహ్మాదయః స్మృతాః. 48

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే క్షత్రవిట్‌ఛూద్ర వర్గ వర్ణనం నామ

షట్‌షష్ట్యధిక త్రిశతతమోధ్యాయః.

వృషల - జఘన్య - శూద్ర = శూద్రులు. చండాల = అంత్యజాదులు వర్ణ సంకరముల. కారుః = శిల్పి; శ్రేణిః = ఒక సంఘముగా కలిసియున్న సజాతీయులగు శిల్పుల సంఘము. రంగా జీవః - చిత్రకరః = పర్యా. త్వష్టా - తక్షా - వర్ధకిః = వడ్రంగి; నాడింధమః - స్వర్ణకారః = కంసాలి. నాపితః - అంతావసాయి = మంగలి. జాబాలః - అజాజీవః గొల్ల; దేవలః = దేవ పూజపై జీవించువాడు. తన భార్యలతో నాటకము వేసి జీవించు వాళ్ళు జాయా జీవులనీ శైలూషలులని చెప్పబడుదురు. భృతకః - భృతిభుక్‌ రోజు కూలి. వివర్ణ - పామర - నీచ - ప్రాకృతి - పృథగ్జన - విహీన - అపసద - జాల్మ-నీచులు; భృత్యః - దాసేరః - చేటకః = భృత్యుడు. పటుః - పేశలః - దక్షః = నేర్పరి. మృగముః - లుబ్ధకః = వేటగాడు. చాండాలః, - దివాకీర్తిః = చండాలుడు. పుస్తం = లేపనాది కర్మ; పాంచాలికా - పుత్రికా = బొమ్మ. వర్కరః పడుచుదైన పశువు. మంజూష - పేటకః - పేటా - పెట్టె. తుల్య - సాధారణ = పర్యా. ప్రతిమా - ప్రతికృతిః = పర్యా. ఈ విధముగ బ్రహ్మాదివర్గములు చెప్పబడినవి.

అగ్ని మహాపురాణమున క్షత, విట్‌శూద్ర, వర్గవర్ణన

మన మూడు వందల అరువది ఆరవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page