Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ ఏకోన సప్తత్యధిక త్రిశతతమో೭ధ్యాయః
అథాత్యన్తిక ప్రళయగర్భోత్పత్తి నిరూపణమ్
అగ్ని రువాచ :
ఆత్యన్తికంలయం వక్ష్యేజ్ఞానాదాత్యన్తికో లయః | ఆధ్యాత్మికాదిసంతావం జ్ఞాత్వాస్వస్య విరాగతః. 1
ఆధ్యాత్మికస్తు సంతాపః శారీరో మానసోద్విధా | శారీరో బహుభిర్భేదైస్తాపో೭సౌ శ్రూయతాంద్విజ. 2
త్వక్త్వాజీవో భోగదేహం గర్భమాప్నోతి కర్మభిః | ఆతివాహిక సంజ్ఞస్తు దేహోభవతి వైద్విజ.
3
కేవలం సమనుష్యాణాం మృత్యుకాల ఉపస్థితే | యామ్యైః పుంభిర్మనుష్యాణాం తచ్ఛరీరం ద్విజోత్తమ. 4
నీయతే యామ్యమార్గేణ నాన్యేషాంప్రాణినాంమునే| తతః స్వర్యాతి నరకం సభ్రమేద్వ(ద్ఘ)ట యంత్రవత్.
కర్మభూమిరియం బ్రహ్మన్పల భూమిరసోస్మృతా | యమోయోనిశ్చ నరకం నిరూపయతి కర్మణా. 6
పూరణీయాశ్చతేనైవ యమంచైవాను పశ్యతామ్ | వాయుభూతాః ప్రాణినశ్చగర్భంతే ప్రాప్నువన్తిహి. 7
యమదూతైర్మనుష్యస్తు నీయతే తంచవశ్యతి | ధర్మిచ పూజ్యతేతేన పాపిష్ఠస్తాడ్యతే గృహే. 8
శుభాశుభం కర్మతస్య చిత్రగుప్తో నిరూపయేత్ | భాంధవానామశౌచేతు దేహేఖల్వాతివాహికే. 9
తిష్ఠన్నయతి ధర్మజ్ఞ దత్తపిండాశనం తతః | తంత్యక్త్వా ప్రేతదేహన్తు ప్రాప్యాన్యం ప్రేతలోకతః. 10
వసేతుక్షధాతృషాయుక్తా ఆమశ్రాద్ధాన్నభుఙ్ నరః | ఆతివాహికదేహాత్తు ప్రేతపిండైర్వినానరః. 11
నహిమోక్షమవాప్నోతి పిండాంస్తత్రైవ సో೭శ్నుతే | కృతే సపిండీకరణ నరః సాంవత్సరాత్పరమ్. 12
ప్రేతదేహం సముత్సృజ్య భోగదేహం ప్రపద్యతే | భోగదేహావుభౌ ప్రోక్తావశుభాశుభ సంజ్ఞితౌ. 13
భుక్త్వాతు భోగదేహేన కర్మబంధాన్ని పాత్యతే | తందేహం పతత స్తస్మాద్భక్షయన్తి నిశాచరాః. 14
పాపేతిష్ఠతి చేత్స్వర్గం తేన భుక్తం తదాద్విజాః | తదా ద్వితీయం గృహ్ణాతి భోగదేహన్తు పాపినామ్. 15
భుక్త్వా పాపన్తువై పశ్చాద్యేన భుక్తం త్రివిష్టమ్ | శుచీనాం శ్రీమతాంగేహే స్వర్గభ్రష్టో೭భి జాయతే. 16
పుణ్యతిష్ఠతి చేత్పాపంతేన భుక్తంతదాభ##వేత్ | తస్మిన్సం భక్షితే దేహేశుభం గృహ్ణాతి విగ్రహమ్. 17
కర్మణ్యల్పావశేషేతు నరకాదపి ముచ్యతే | ముక్తస్తు నరకాద్యాతి తిర్యగ్యోనిం న సంశయః.
18
అగ్ని దేవుడు పలికెను. ఆత్యంతిక ప్రళయమును గూర్చి చెప్పెదను. ఇది జ్ఞానము వలన కలుగును. ఆధ్యాత్మికాది సంతాపమును తెలుసుకొని మానవుడు తన విషయముననే కొంత వైరాగ్యమును పొందవలయును. అపుడు జ్ఞానము కలుగును. ఆధ్యాత్మిక సంతాపము ''శారీరము'' మానసము అని రెండు విధములు. శారీరక సంతాపము అనేక విధములైనది. వాటిని గూర్చి వినుము. జీవుడు భోగ దేహమును త్యజించి కర్మానుసారముగ గర్భమును చేరును. ఆతివాహికమను ఒక దేహ ముండును. మనుష్యులకు మృత్యు కాలము వచ్చినపుడే ఆ దేహము లభించును. యమదూతలు ఆ శరీరమును యమలోక మార్గమున యమ లోకమునకు తీసుకొని పోవుదురు. ఇతర ప్రాణులకు ఈ ఆతివాహిక శరీరము వుండదు. యమ లోకమునకు వెళ్ళిన జీవుడు కొంత కాలము స్వర్గము, కొంత కాలము నరకము పొందుచు ఘట యంత్రము వలె తిరుగుచుండును. ఇది కర్మ భూమి, పరలోకము ఫల భూమి. యముడు ఆయా జీవుల కర్మానుసారముగా వివిధ యోనులను నరకములను వారికి ఇచ్చును. ఆతడే నరకములను నింపు చుండును. యముడే వీరికి నియామకుడు. జీవుడు వాయు రూపముగ గర్భములో ప్రవేశించుచుండును. యమ దూతలచే తీసుకొని వెళ్ళబడిన జీవుని యముడు చూచును. ఆ జీవుడు ధర్మాత్ముడైనచో యముడు ఆతనిని పూజించును. పాపాత్ములైనచో తన లోకమున ఆతనిని దండించును. వాని శుభా శుభ కర్మలను గూర్చి చిత్రగుప్తుడు వివరించి చెప్పును. బంధువులకు ఆశౌచము తీరు వరకును జీవుడు ఆతివాహిక శరీరములోనే వుండి వారిచ్చిన పిండములను భుజించును. పిదప ప్రేత లోకము చేరి ప్రేత దేహమును విడచి మరియొక భోగ దేహమును పొంది ఆకలి దప్పికలతో బాధపడుచు అచట నివసించును. శ్రాద్ధ రూపమున ఇవ్వబడు ఆమద్రవ్యమును అతడు భుజించును. ప్రేతకు పిండ దానము లేకుండగ చేయనిచో వానికి ఆతివాహిక దేహము నుండి విడుదల వుండదు. సపిండీకరణ శ్రాద్ధము జరిగిన సంవత్సరమునకు తరువాత వాడు. ప్రేత దేహము విడచి భోగ దేహమును పొందును శుభ దేహము, అశుభ దేహము అని ఆది రెండు విధములు. ఆ దేహముతో కర్మ బంధములను అనుభవించిన పిమ్మట, మర్త్య లోకమునకు గెంటి వేయబడును. అపుడు ఆతను విడిచిన దేహమును నిశాచరులు భక్షింతురు. మొదట పుణ్య ఫల మగు స్వర్గమును అనుభవించినచో పాప భోగము మిగిలి యున్నచో మరొక భోగ శరీరమును ధరించును. కాని ఫాప ఫలమును అనుభవించినవాడు పిదప స్వర్గ సుఖమును అనుభవించి దాని పిమ్మట స్వర్గ భ్రష్టుడై పవిత్రులగు శ్రీమంతుల గృహము లందు జనించును. పుణ్యము వుండగా ముందు పాప ఫలము అనుభవించిన వాడు ఫల భోగము పూర్తియైన పిమ్మట ఉత్తమ దేహమును ధరించును. కర్మ భోగము కొంచెము మాత్రమే మిగిలి యుండగా జీవునకు నరకము నుండి విముక్తి లభించును. నరక విముక్తుడు తిర్యగ్యోనిలో పుట్టును. సందేహము లేదు.
జీవః ప్రవిష్టో గర్భన్తు కలలే೭ప్య త్రతిష్ఠతి | ఘనీ భూతం ద్వితీయేతు తృతీయో೭వయవాస్తతః. 19
చతుర్థే೭స్థినిత్వఙ్మాంసం పంచమే రోమసంభవః | షష్ఠేచేతో೭థ జీవస్యదుఃఖం విందతి సప్తమే. 20
జరాయువేష్టితే దేహేమూర్ధ్ని బద్ధాంజలిస్తథా | మధ్యేక్లీబస్తు వామేస్త్రీ దక్షిణ పురుషస్థితిః.
21
తిష్ఠత్యుదరభాగేతు వృష్ఠన్యాభి ముఖస్తథా | యస్యాంతిష్ఠత్య సౌయోనౌతాం సవేత్తిన సంశయః. 22
సవచవేత్తి వృత్తాంత మారభ్యజన్మనః | అంధకారంచ మహతీం పీడాం విన్దతి మానవః. 23
మాతురాహారపీతన్తు సప్తమేమాస్యుపాశ్రుతే | అష్టమేనవమేమాసి భృశముద్విజతేతథా. 24
వ్యబాయే పీడా మాప్నోతి మాతుర్వ్యాయామకే తథా |
వ్యాధిశ్చ వ్యాధితాయాం స్యాన్ముహూర్తం శతవర్షవత్. 25
గర్భములో ప్రవేశించిన జీవుడు కలలము నందుండును. రెండవ మాసమున గట్టి పడును. మూడవ మాసమున అవయవములు ప్రకట మగును. నాల్గవ మాసమున అస్థి మాంస త్వక్‌లు ఏర్పడును. ఐదవ మాసమున రోమములు పుట్టును. ఆరవ మాసమున చై తన్యము ఏర్పడును. ఏడవ మాసము నుండి దుఃఖము ననుభవింప ప్రారంభించును. మావితో చుట్టబడిన దేహము నందు శిరస్సుపై దోసిలి కట్టి యుండును. గర్భ మధ్యమున నున్నచో నపుంసకుడు, వామ భాగములో వున్నచో స్త్రీ, కుడి ప్రక్క వున్నచో పురుషుడు, ఉదరము నందుండి పృష్ఠ భాగమునకు అభిముఖుడుగా వుండును. తాను ఏ యోని యందున్నాడో వానికి తెలియును. సందేహము లేదు. నర జన్మ మొదలు సకల వృత్తాంతమును స్మరించును. ఆ అంధకారమున మానవుడు గొప్ప పీడను పొందును. ఏడవ మాసమున తల్లి భుజించి ఆహారమును ఆ శిశువు పొందును. అష్టమ, నవమ మాసము లందు మిక్కిలి ఉద్విగ్నుడగును. మైథునము నందు ఇంకను పీడను పొందును తల్లి అధిక వ్యాయామము చేసినను శిశువునకు పీడ కలుగును. ఆమెకు వ్యాధి యున్నచో శిశువు కూడ ఆరోగము యొక్క కష్టమును అనుభవించును. ఒక ముహూర్తము నూరు సంవత్సరముల వలె కనబడును.
సంతప్యతే కర్మభిస్తు కురుతే೭థ మనోరథాన్ | గర్భాద్వినిర్గతో బ్రహ్మన్మోక్ష జ్ఞానం కరిష్యతి. 26
సూతివాతైరధోభూతో నిఃసరేద్యోనియంత్రతః | పీడ్యమానో మాసమాత్రం కరస్పర్శేన దుఃఖితః. 27
ఖశబ్దాక్షతుద్ర స్రోతాంసి దేహేశ్రోతం వివిక్తతా | శ్వాసోచ్ఛ్వాసౌ గతిర్వాయోర్వక్ర సంస్పర్శనంతథా. 28
అగ్నేరూపం దర్శనం స్యాదూష్మా పక్తిశ్చ పిత్తకమ్ | మేధావర్ణం బలం ఛాయాతేజః శౌర్యం శరీరకే. 29
జలాత్స్వేదంచరసనం దేహేవై సంప్రజాయతే | క్లేదో వసారసా రక్తం శుక్రమూత్రకపాదికమ్. 30
భూమేర్ఘ్రాణం కేశనఖం గౌరవం స్థిరతో೭స్థితః | మాతృజాని మృదూన్యత్ర త్వఙ్మాంస హృదయానిచ 31
నాభిర్మజ్జాశకృన్మేదః క్లేదాన్యామాశయానిచ | పితృజాని శిరాస్నాయు శుక్రం చై వాత్మజానితు. 32
కామక్రోధౌ భయంహర్షో ధర్మాధర్మాత్మతాతథా | ఆకృతిః స్వరవర్ణౌతు మేహనాద్యం తథాచయత్. 33
తామసాని తథా೭జ్ఞానం ప్రమదాలస్య తృటుక్షధాః | మోహమాత్సర్య వైగుణ్య శోకాయాన భయునిచ. 34
కామక్రోధౌ తథాశౌర్యం యజ్ఞేప్సా ఐహుభాషితా | అహంకారః పరావజ్ఞా రాజసాని మహామునే 35
ధర్మేప్సా మోక్షకామిత్వం పరాభక్తిశ్చ కేశ##వే | దాక్షిణ్యం వ్యవసాయిత్వం సాత్త్వికాని వినిర్దిశేత్. 36
కర్మలతో బాధపడుచు ఎన్నియో మనోరథములు కలిగి యుండును. గర్భము నుంచి బయట పడగనే మోక్షజ్ఞానమునకు ప్రయత్నము చేయునట్లు వుండును. ప్రసూతి వాయు ప్రేరణచే అధోముఖుడై యోని యంత్ర పీడితుడై బయటపడును. ఒక మాసము వరకు చేతితో ముట్టుకొనినను వానికి పీడ కలుగును. ఆకాశము వలన వాని శరీరము చిన్న చిన్న రంధ్రములు. చెవి మొదలగునవి ఏర్పడును. వాయువు వలన శ్వాసోచ్ఛ్వాసములు గతి, అవయవములను ఇటు అటు తిప్పుతూ స్పృశించుట ఏర్పడును. అగ్ని వలన రూపము నేత్రములు వేడి జీర్ణ శక్తి పిత్తము, మేధ, వర్ణము, బలము ఛాయ తేజస్సు శౌర్యము, ఇవి శరీరము నందేర్పడును. జలము వలన, చెమట, అస్వాదము, వస, రస, గ్రహణ శక్తి రక్తము, శుక్రమూత్ర కఫాదికము ఏర్పడును. భూమి వలన ఘ్రాణ కేశ, నఖములు బరువు ఏర్పడును. శరీరము నందలి త్వఙ్మాంస హృదయ, నాభి, మజ్జా, మల మేదస్, క్లేదనములు ఆమాశయములు తల్లి వలన పుట్టినవి. శిరస్‌స్నాయు శుక్రములు తండ్రి వల్ల పుట్టును. కామ క్రోధ భయ హర్ష, ధర్మ, ఆకృతి, స్వర, వర్ణ మేహన ఆరులు జీవుని శరీరమున స్వతః ప్రకటన మగును. అజ్ఞాన, ప్రమాద, ఆలస్య, క్షుధా, తృషా, మోహ, మాత్సర్య, వైగుణ్య, శోక, ఆభాస భయాదులు తమ గుణము వలన బుట్టును. కామ, క్రోధ, శౌర్య యజ్ఞాభిలాష బహుభాషిత అహంకార అనాదరములు రజో గుణము వలన పుట్టును. ధర్మాభిలాష, మోక్షకామిత్వము విష్ణువుపై ఉత్తమ భక్తి, దాక్షిణ్యము, ఉద్యోగ శీలత్వము. ఇవి సత్త్వ గుణము వలన పుట్టును.
చవలః క్రోధనో భీరుర్బహు భాషీ కలిప్రియః | స్వప్నే గగనగశ్చైవ బహువాతోనరో భ##వేత్. 37
అకాలపలితః క్రోధీమహాప్రాజ్ఞో రణప్రియః | స్వప్నేచ దీప్తిమత్ర్పేక్షీ బహుపిత్తో నరోభ##వేత్.
38
స్థిరమిత్రః స్థిరోత్సాహః స్థిరాంగో ద్రవిణాన్వితః | స్వప్నే జలసితాలోకే బహుశ్లేష్మా నరోభ##వేత్. 39
రసన్తు ప్రాణినాందేహే జీవనం దుధిరంతథా | లేపనంచ తథా మాంసమేహస్నేహ కరన్తుతత్. 40
ధారణన్త్వస్థి మజ్జాస్యాత్పూరణం వీర్యవర్దనమ్ | శుక్రవీర్యకరం హ్యోజః ప్రాణ కృజ్జీవసంస్థితిః. 41
ఓజః శుక్రాత్పారతర మాపీతం హృదయోపగమ్ | షడంగంసక్థినీ బాహుర్మూర్ధా జఠరమీరితమ్. 42
షట్‌త్వచా బాహ్యతో యద్వదన్యా రుధిర ధారికా | విలాసధారిణీ చాన్యా చతుర్థీ కుండధారిణీ. 43
పంచమీ విద్రథిస్థానం షష్టీప్రాణధరామతా | కలాసప్తమీ మాంసధరా ద్వితీయా రక్తధారిణీ.
44
యకృత్ల్పీహాశ్రయా చాన్యామేదోధారా೭స్థి ధారిణీ | మజ్జాశ్లేష్మ పురీషాణాంధరా పక్వాశయస్థితా ||
షష్ఠీపిత్తధరా శుక్రధరా శుక్రాశయా೭పరా. 45
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ఆత్యన్తిక ప్రలయగర్భోత్పత్తి వర్ణనం
నామైకోనసప్తత్యధిక త్రిశతతమోధ్యాయః.
చపలుడు క్రోధి భీరువు బహుభాషి కలహప్రియుడు స్వప్నయుడు స్వప్నమునందు ఆకాశములో సంచరించువాడు అగు మనుష్యునిలో వాతము ప్రధానముగా నుండును. అకాలమున జుట్టు నెరసినవాడు కోపశీలుడు మహాబుద్ధిమంతుడు యుద్ధ ప్రియుడు స్వప్నమునందు ప్రకాశించుచున్న వస్తువులను చూచువాడు అగు మనుష్యుని యందుపిత్తము అధికముగా నుండును. స్థిరమైన మైత్రి కలవాడు స్థిరోత్సాహుడు స్థిరాంగుడు ధనవంతుడు స్వప్నమున శ్వేత వస్త్రమును చూచువాడు అగు మనష్యునిలో కఫము అధికముగా నుండును ప్రాణుల దేహమున రసము జీవనమును, రక్తము లేపనమును, మాంసము, మోహన స్నేహనములను కలగించును. అస్థులు - మజ్జ శరీరమును నిలుపును. వీర్యవృద్ధి శరీరమును పూర్ణము చేయును. ఓజస్సు శుక్ర వీర్య వృద్ధికరము. జీవుని స్థితికి ప్రాణమునకు అవష్టంభకము. ఓజము శుక్రము కంటే ఎక్కవ సారము కలది. అది హృదయ సమీపమునందుండును. కొంచెము పసుపు పచ్చగ వుండును. కాళ్ళు బాహువులు. శిరస్సు, ఉదరము. ఇవి షడంగములు. చర్మలో ఆరు పొరలుండును. బయటకు కనబడునది బాహ్యము. రక్తము ధరించునది రెండవది. మూడవది కిలాసమును, నాల్గవది కుండమును ధరించును. ఐదవది ఇంద్రియముల స్థానము. ఆరవది ప్రాణధారణము చేయునది. కల కూడ ఏడు విధములు. మొదటిది మాంసములు ధరించును. రెండవది రక్తమును, మూడవది యకృత్ ప్లీహలను, నాల్గవది మేదస్సును అస్థులను, ఐదవది మజ్జా శ్లేష్మ పురీషములను, ఆరవది పిత్తమును, ఏడవది శుక్రమును ధరించును. ఐదవది మజ్జా శ్లేష్మ పురీషములను, ఆరవది పిత్తమును, ఏడవది శుక్రమును ధరించును. ఐదవది పక్యాశయమునందును, ఏడవది శుక్రాశయము నందును వుండును.
అగ్ని మహా పురాణమున ఆత్యంతిక ప్రళయ గర్భోత్పత్తి వర్ణన మను
మూడు వందల అరువది తొమ్మిదవ అధ్యాయము సమాప్తము.