Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ సప్తత్యధిక త్రిశతతమో೭ధ్యాయః
అథ నరక నిరూణనమ్
అగ్నిరువాచ :
శ్రోత్రం త్వక్ చక్షుషీ జిహ్వా ఘ్రాణం ధీః ఖంచ భూతగమ్ |
శబ్దస్పర్శరూపరస గంధాః ఖాదిషు తద్గుణాః. 1
పాయూపస్థౌ కరౌపదౌ వాగ్భవేత్కర్మ ఖంతథా ఉత్సర్గానందకాదాన గతివాగాది కర్మతత్. 2
పంచకర్మేంద్రియాణ్యత్రపంచ బుద్ధీంద్రియాణిచ | ఇంద్రియార్థాశ్చ పంచైవ మహాభూతా మనో೭ధిపాః. 3
ఆత్మా೭వ్యక్తశ్చతుర్వింశ తత్త్వాని పురుషః పరః | సంయుక్తశ్చ వియుక్తశ్చ యథా మత్స్యోదకేఉభే. 4
అవ్యక్తమాశ్రితా నీహ రజః సత్త్వతమాంసి చ | ఆంతరః పురుషో జీవః సపరం బ్రహ్మకారణమ్. 5
సయాతి పరమం స్థానం యోవేత్తి పురుషం పరమ్ | సప్తాశయాః స్మృతాదేహేరుధిర సై#్యక ఆశయః. 6
శ్లేష్మణశ్చామ పిత్తాభ్యాం పక్వాశయస్తు పంచమః | వాయుమూత్రాశయః సప్తస్త్రీణాం గర్భాశయో೭ష్టమః.
పిత్తాత్పక్వాశయో೭గ్నేః స్యాద్యోనిర్వికసితాద్యుతౌ | పద్మవద్గర్భాశయః స్యాత్తత్ర ధత్తే సరక్తకమ్. 8
శుక్రం స్వశుక్రతశ్చాంగం కుంతలాన్యత్ర కాలతః | న్యస్తం శుక్రమతో యోనౌనేతి గర్భాశయం మునే. 9
ఋతావపిచ యోనిశ్చేద్వాతపిత్తకఫావృతా | భ##వేత్తదా వికాసిత్వం నైవ తస్యాం ప్రజాయతే. 10
ఋక్కాత్పుక్కసకప్లీహ కృత కోష్ఠాంగ హృద్ర్వణాః | తండకశ్చ మహాభాగనిబద్ధాన్యాశ##యేమతః. 11
రసస్య పచ్యమానస్య సారాద్భవతి దేహినామ్ | ప్లీహాయకృచ్ఛధర్మజ్ఞ రక్తఫేనాచ్చ పుక్కసః. 12
రక్తం పిత్తంచ భవతి తథా తండక సంజ్ఞకః | మేదోరక్తప్రసారాచ్చ బుక్కాయాః సంభవః స్మృతః 13
రక్తమాంస ప్రసారాచ్చ భవన్త్యంత్రాణి దేహినామ్ | సార్థత్రివ్యామసంఖ్యానితాని నృణాం వినిర్దిశేత్. 14
త్రివ్యామానితథా స్త్రీణాం ప్రాహుర్వేదవిదోజనాః | రక్తవాయు సమాయోగాత్కామేయస్యోద్భవః స్మృతః.
కఫ ప్రసారాద్భవతి హృదయం పద్మసన్నిభమ్ | అధోముఖా తత్సుషిరం యత్రజీవో వ్యవస్థితః. 16
చైతన్యానుగతా భావావసర్వే తత్రవ్యఃస్థితాః | తస్యవామేతథా ప్లీహాదక్షిణచ తథాయకృత్. 17
దక్షిణచతథాక్లోమ పద్మసై#్యవం ప్రకీర్తితమ్ | ప్రోతాంసియాని దేహే೭స్మిన్కఫరక్తవహానిచ. 18
తేషాంభూతానుమానాచ్చ భవతీంద్రియసంభవః నేత్రయోర్మండలం శుక్లం కఫాద్భవతి పైతృకమ్. 19
కృష్ణంచ మండలం వాతాత్తథా భవతి మాతృకమ్ | పిత్తాత్త్వఙ్మండలం జ్ఞేయం మాతాపితృసముద్భవమ్.
మాంసాసృక్కఫజాజిహ్వామేదో೭సృక్కఫ మాంసజౌ |
వృషా (ష) ణౌ దశప్రాణన్య జ్ఞేయాన్యాయతధానితు. 21
మూర్ధాహృన్నాభికంఠాశ్చ జిహ్వాశుక్రంచో శోణితమ్| గుదం బస్తించ గుల్పశ్చ కండరాః షోడశేరితాః. 22
అగ్ని దేవుడు పలికెను. శ్రోత్ర, త్వక్ నేత్ర, ఉహ్వా, నాసికలు, జ్ఞానేంద్రియములు. ఆకాశము సర్వ భూత వ్యాప్తము. శబ్ద స్పర్శ రూప రసగంధములు ఆకాశాది గుణములు. పాయు ఉపస్థ, కర, పాద, వాక్కులు కర్మేంద్రియము. ఉత్సర్గ, ఆనంద, గ్రహణ ఆగమన, వాగాదికములు వీటి కర్మలు. పంచకర్మేంద్రియము. పంచ జ్ఞానేంద్రియములు, పంచేంద్రియముల విషయములు పంచ మహా భూతములు, మనస్సు, బుద్ధి మహత్తత్వము మూల ప్రకృతి అనునవి ఇరువది నాలుగు తత్త్వములు. పురుషుడు వీటి అన్నింటికి అతీతుడు. మత్స్యోదకముల వలె ఈ రెండును పరస్పర సంయుక్తములై వియుక్తములై వుండును. రజస్సత్వ తమోగుణములు ప్రకృతినాశ్రయించి వుండును. అంతఃకరణోపాధి కల పురుషుడు జీవుడు. ఉపాధి రహితుడగు ఆ జీవుడే సర్వకారణ మగు బ్రహ్మ. పరమ పురుషుని తెలుసుకొనినవాడు పరమ పదమును పొందును దేహము నందు ఏడు ఆశయములున్నవి. రుధిర, శ్లేవ్మ, అమ, పిత్త, పక్వ, వాయు, మూత్ర ఆశయములని అవి ఏడు. స్త్రిలకు ఎనిమిదవ గర్భాశయము కూడ వుండును. అగ్ని వలన పిత్తము, పిత్తము వలన పక్వాశయము ఏర్పడును. ఋతు కాలమున యోని వికసించును. గర్భాశయము పద్మము వలె నుండును. అచట వుంచబడిన వీర్యము గర్భాశయము చేరును. ఆ గర్భాశయము రజో వీర్యములను ధరించును. వీర్యము వలన శరీరము కాలక్రమమున కేశములు ప్రకటములగును. ఋతు సమయమున యోని వాత పిత్త కఫలములచే ఆవృతమైనచో అది వికసించదు. బుక్కము వలన పుక్కసము ప్లీహ యకృతి కోష్ఠాగ, హృదయ, వ్రణ, తండకములు ఏర్పడును. ఇవన్ని ఆశయము నందు నిబద్ధములై వుండును. పచ్య మానమగు రసము యొక్క సారము నుండి ప్లీ హయకృత్ పుట్టును. రక్త ఫేనము నుండి పుక్కసము పుట్టును. రక్త పిత్త తండకములు కూడ ఈ విధముగనే పుట్టును. రక్త ప్రసారము వలన బుక్క పుట్టును. రక్త మాంస ప్రసారము వలన ప్రేగులు ఏర్పడును. మానవుని ప్రేగులు మూడున్నర బారలు వుండును. వేద వేత్తలగు పురుషుల యొక్కయు, స్త్రీల యొక్కయు పేగులు మూడు బారలుండును. రక్త వాయు సంయోగముచే కామము ఉదయించును. కఫ ప్రసారముచే హృదయము ప్రకట మగును. ఆది కమలము వలె వుండును. దాని ముఖము క్రిందికి వుండును. దాని మధ్య నున్న ఆకాశములో జీవుడుండును. చైతన్యముతో సంబంధించిన అన్ని భావములును దాని యందే వుండును. దాని ఎడమ ప్రక్క ప్లీహ, దక్షిణ భాగమున యకృత్ క్లోమములు వుండును. ఈ శరీరమున కఫ రక్తములను ప్రవహింపచేయు స్రోతస్సుల వలన భూతాను మానముచే ఇంద్రియముల ఉత్పత్తి జరుగును. నేత్రము లందలి శుక్ల మండలము కఫము వలన ఏర్పడును. ఇది తండ్రిక సంబంధించినది కృష్ణ భాగము వాతము వలన కలుగును. ఇది తల్లి ఆంశమునకు సంబంధించినది. త్వఙ్మండలము పిత్తముచే ఉత్పన్న మగును. ఇవి మాతృ పితృ సముద్భవములు. మాంస, రక్త, కఫముల వలన జిహ్వయు, మేదో రక్త కఫముల వలన, అండ కోశము ఉత్పన్నమగును. ప్రాణమునకు శిరస్సు హృదయము, నాభి కంఠము, జిహ్వ శుక్రము రక్తము గుదము మూత్రాశయము గుల్పములు కండరములు ఆను పదునారు స్థానములు.
ద్వేకరేద్వేచ చరణ చతస్రః పృష్ఠతోగలే | దేహే పాదాదిశీర్షాంతే జాలాని షోడశ. 23
మాంసస్నాయు శిరాస్థిన్య చత్వారశ్చ పృథక్పృథక్ | మణి బంధన గుల్ఫేషు నిబద్ధాని పరస్పరమ్. 24
షట్ కూర్చాని స్మృతానీహ హస్తషాః పాదయోఃపృథక్ | గ్రీవాయాంచ తథామేఢ్రేకథితాని మనీషిభిః 25
పృష్ఠవంశస్యోపగతాశ్చతస్రో మాంసరజ్జవః | నవత్యశ్చ తథా పేశ్యస్తాసాం బంధనకారికాః. 26
సీవన్యశ్చతథా సప్తపంచ మూర్దానమాశ్రితాః | ఏకైకా మేఢ్రజిహ్వాస్తా అస్థి షష్టి శతత్రయమ్. 27
సూక్ష్మైః సహచతుః షష్టిర్దశనా వింశతిర్నఖాః | పాణి పాదశలాకాశ్చతా సాంస్థాన చతుష్టయమ్. 28
షష్ట్యంగులీనాం ద్వేపార్ష్యోణర్గుల్ఫేషుచ చతుష్టయమ్ | చత్వార్యరత్న్యో రస్థీని జంఘయోస్తద్వ దేవతు. 29
ద్వేద్వేజానుకపాలోరుఫలకాంశ సముద్రవమ్ | అక్షస్థానాంశక శ్రోణిఫలకే చైవ మాదిశేత్. 30
భ##గేత్వేకం తథాపృష్ఠే చత్వారింశచ్చ పంచచ | గ్రీవాయాంచ తథాస్థీని జత్రుకంచ తథాహనుః. 31
తన్మూలంద్వే లలాటాక్షి గండనాస్యాంఘ్ర్యవస్థితాః | వర్ముకాస్తాలుకైః సార్ధమర్భుదైశ్చ ద్విసప్తతిః. 32
ద్వేశంఖకే కపాలాని చత్వార్యేవ శిరస్తథా | ఉరః సప్తదశాస్థీని నంధీనాంద్వే శ##తేదశౌ. 33
అష్టషష్టిస్తు శాఖాసు షష్టిశ్చైకవివర్జితా | అన్తరావైత్ర్యశీతిశ్చ స్నాయోర్నవశతాని చ. 34
త్రింశాధికే ద్వేశ##తేతు అన్తరాధౌతు సప్తతిః | ఊర్ద్వగాః షట్ ఛతాన్యేవ శాఖాస్తు కథితానితు. 35
పంచపేశీశతాన్యేవ చత్వారింశత్తథోర్ధ్వగాః | చతుఃశతన్తు శాఖాసు అంతరాధౌ చషష్టికా. 36
స్త్రీణాం చైకాధికావై స్యాద్వింశతిశ్చతురుత్తరా | స్తనయోర్దశ యోనౌచత్రయోదశ తథాశ##యే.
37
గర్భన్యచ చతస్రః స్యుః శిరాణాంచ శరీరిణామ్ | త్రింశచ్ఛత సహస్రాణి తథాన్యాని నవైవతు. 38
షట్పంచాశత్సహస్రాణి రసందేహే విహన్తితాః | కేదార ఇవకుల్యాశ్చ క్లేదలేపాదికంచయత్.
39
ద్వాసప్తతిస్తథాకోట్యౌ లోమ్నామిహ మహామునే | మజ్ఞాయా మేదసశ్చైవ వసాయాశ్చతథాద్విజ. 40
మూత్రస్య చైవపిత్తస్య శ్లేష్మణః శకృతస్తథా | రక్తస్య సరసస్యాత్ర క్రమశో೭ంజలయోమతాః. 41
అర్ధార్ధాభ్యధికాః సర్వాః పూర్వపూర్వా೭ంజలేర్మతాః | ఆర్ధాంజలిశ్చ శుక్రస్య తదర్ధంచ తథౌజసః. 42
రజసస్తు తథా స్త్రీణాం చతస్రః కథితా బుధైః | శరీరం మలదోషాది పిండం జ్ఞాత్వాత్మనిత్యజేత్. 43
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే శరీరావయవ వర్ణనం నామ నప్తత్యధిక త్రిశతతమోధ్యాయః.
రెండు చేతులందును రెండు చరణము లందును నాలుగు పీటమునందును నాలుగు కంఠము నందును పాదాది శిరః పర్యంత సకల శరీర మంతటను పదానారు జాలములుండును. మాంసజాల, స్నాయుజాల, శిరాజాల, అస్థిజాలములు వేర్వేరుగా రెండు మణి బంధనములందును గుల్ఫములందును పరస్పరా బద్ధములై వుండును. శరీరమున ఆరు కూర్చము లుండును. రెండు హస్తములు, రెండు పాదములు, కంఠము, మేడ్రము వీటి యందుండును. పృష్ఠ మధ్య భాగమున మేరు దండము, దాని సమీపమున నాలుగు మాంసరజ్జువులు, వాటిని బంధించి వుంచిన తొమ్మిది పేశీలు వుండును. ఏడు సీవనిలు వుండును. వాటిలో ఐదు శిరస్సునందును ఒకటి మేడ్రమునందును ఒకటి జివ్వా యందును ఉండును. ఎముకలు పదునెనిమిది వేలు. సూక్ష్మములు స్థూలములు కలిసి అరువది నాలుగు దంతములు. ఇరువది నఖములు హస్త, పాదము లందలి శలాకలు, నాల్గు స్థానములందుండును. వ్రేళ్ళలో అరువది పార్షుణల యందు రెండు గుల్ఫములందు నాలుగు అరత్నుల యందు నాలుగు, జంఘల యందు నాలుగు వుండును. జానువుల యందు రెండేసి కపోలము లందు రెండు, ఊరువుల యందు రెండు ఫలక మూల భాగము లందు రెండు ఎముకలుండును. ఇంద్రియ స్థానము లందున శ్రోణ ఫలకమునందును రెండేసి ఎముకలుండును. భగమునందు కొంచెము ఎముకలుండును. వీపుయందునలుబది యైదు కంఠమునందు నలుబదియైదు వుండును. గ్రీవయందు జతృకమునందు అను ప్రదేశమునందు రెండేసి వుండును. లలాట, నేత్ర, కపోల, నాసికా, పద, పరుశు తాలువులందు అర్ధార్బుదము డెబ్బదిరెండు అస్థువులుండును. శిరస్సుయందు రెండు శంఖకములు, నాలుగు కపాలములు,వక్షఃస్థలమున పదునేడు అస్థులు వుండును. రెండు వందల పది సంధుల వుండును. వీటిలో శాఖలలో అరువది ఎనిమిది, యేబది, తొమ్మిది, మధ్య యందు ఎనుబది మూడు వుండును. తొమ్మిది వందల స్నాయువులు వుండును. వీటిలో అంతర ప్రదేశమున రెండువందల ముప్పది వుండును. డెబ్బది ఊర్ధ్వగాములు శాఖలలో ఆరువందల స్నాయువు లుండును. పేశీలు ఐదువందలు వీటిలో నలుబది ఊర్ధ్వగాములు శాఖలలో నాలుగు వందలు. అంతరాధి యందు అరువది వుండును. స్త్రీలకు పురుషుల కంటే, ఇరువది నాలుగు మాంసపేశీలు, వీటిలో పది స్తనములందును, యోని యందు పదమూడు, గర్భము నందు నాలుగు వుండును శరీరము నందు ముప్పది వేల తొమ్మిది యేబది ఆరువేలు నాడులుండును. చిన్న చిన్న కాలువలు మడులలో నీరు ప్రవహింప చేసినట్లు ఈ నాడులు శరీరము నందంతటను రసమును ప్రవహింప చేయును. క్లేదలేపాదులు వాటి కార్యమే. డెబ్బది రెండు కోట్ల రోమకూపములు అంజలులు అను చెప్పబడు మజ్జామేదో, మూత్ర, పిత్త, శ్లేష్మ, మల, రక్త, రసములను ఈ దేహమునందుండును. పూర్వ పూర్వ అంజలుల కంటే ఉత్తరోత్తర అంజలలు ఒకటిన్నర రెట్టు అధికము. ఒక అంజలిలో సగము వీర్యము సగము ఓజస్సు వుండును. స్త్రీలలో రజస్సుకు సంబంధించిన నాలుగు అంజలులు వుండును. ఈ శరీరము మల దోషాదుల పిండము అని తెలుసుకొని దీనిపై ఆసక్తిని విడువవలెను.
అగ్ని మహాపురాణమున శరీరావయవ విభాగ వర్ణనమను మూడు వందల డెబ్బదవ అధ్యాయము సమాప్తము.