Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్విసప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ యమనియమాః

అగ్నిరువాచ :

సంసారతాప ముక్త్యర్థం వక్ష్యామ్యష్టాంగ యోగకమ్‌ | బ్రహ్మ ప్రకాశకం జ్ఞానం యోగస్తత్రైకచిత్తతా.

చిత్తవృత్తినిరోధశ్చ జీవబ్రహ్మాత్మనోపరః | అహింసాసత్యమస్తేయం బ్రహ్మచర్యాపరిగ్రహౌ.

2

యమాః పంచస్మృతా విప్రనియమాద్భుక్తిము క్తిదాః | శౌచం సంతోష తపసీ స్వాధ్యాయేశ్వర పూజనే. 3

భూతాపీడాహ్య హింసాస్యా దహింసా ధర్మఉత్తమః | యథా గజపదేన్యాని పదాని పథగామినామ్‌. 4

ఏవం సర్వమహింసాయాం ధర్మార్థ మభిదీయతే | ఉద్వేగం జననం హింసా సంతాపకరణం తథా. 5

రుక్కృతిః శోణితకృతిః పైశున్యకరణం తథా | హితస్యాతి నిషేదశ్చ మర్మోద్ఘాటన మేవచ. 6

సుఖాపహ్నుతిః సంరోధోవధోదశ విధాచసా | యద్భూతహితమత్యన్తం వచః సత్యస్యలక్షణమ్‌. 7

సత్యం బ్రూయా త్ర్పి యం బ్రూయాన్న బ్రూయాత్సత్యమప్రియమ్‌ |

ప్రియంచ నానృతం బ్రూయాదేషధర్మః సనాతనః. 8

మైథునస్య పరిత్యాగో బ్రహ్మచర్యం తదష్టధా | స్మరణం కీర్తనం కేలిః ప్రేక్షణం గుహ్యభాషణమ్‌. 9

సంకల్పోధ్యవ సాయశ్ఛ క్రి యా నిర్వృతిరేవచ | ఏతన్మైథున మష్టాంగం ప్రవదంతి మనీషిణః. 10

బ్రహ్మచర్యం క్రియామూల మన్యథా విఫలాః క్రియాః | వసిష్ఠశ్చంద్రమాః శుక్రో దేవాచార్యః పితామహః.

తపోవృద్ధా వయోవృద్ధాస్తేపి స్త్రీభిర్విమోహితాః | గౌడీపైష్టీచ మాధ్వీచ విజ్ఞేయా త్రివిధాసురా. 12

చతుర్థీ స్త్రీసురా జ్ఞేయాయయేదం మోహితం జగత్‌ |

మాద్యతిప్రమదాం దృష్ట్వా సురాం పీత్వాతు మాద్యతి. 13

యస్మాద్దృష్ట మదానారీ తస్మాత్తాం నావలోకయేత్‌ | యద్వాతద్వా పరద్రవ్య మపహృత్య బలాన్నరః. 14

అవశ్యం యాతి తిర్యక్త్వం జగ్ధ్వా చైవా హుతం హవిః | కౌపీనాచ్ఛాదనం వాసః కంథాం శీతనివారిణీమ్‌.

పాదుకే చాపిగృహ్ణీయాత్కుర్యాన్నాన్యస్యసంగ్రహమ్‌ | దేహస్థితి నిమిత్తస్య వస్త్రాదేః స్యాత్పరి గ్రహః. 16

శరీరం ధర్మసంయుక్తం రక్షణీయం ప్రయత్నతః |

శౌచంతు ద్వివిధం ప్రోక్తం బాహ్యమాభ్యంతరం తథా. 17

మృజ్జలాభ్యాం స్మృతం బాహ్యం భావ శుద్ధేరథాంతరమ్‌ | ఉభ##యేన శుచిర్యస్తు సశుచిర్నేతరః శుచిః. 18

అగ్ని దేవుడు పలికెను. సంసారతాపము తొలగుటకు అష్టాంగ యోగములు చెప్పెదను బ్రహ్మను సాక్షాత్కరింప చేయునది జ్ఞానము. ఏకాగ్ర చిత్తత్త్వము యోగము చిత్తవృత్తులను నిరోధించుట కూడ యోగము. జీవాత్మయందును, పరమాత్మయందును, చిత్తమును స్థాపించుట ఉత్తమయోగము. అహింసా సత్య, అస్తేయ బ్రహ్మచర్య అపరి గ్రహములు ఐదు యమములు. కూడ ఐదు భుక్తిముక్తి ప్రదములు శౌచ, సంతోష - తపస్‌- స్వాధ్వాయ. ఈశ్వర పూజనములు నియమములు. ప్రాణులకు పీడ కల్గించకుండుట అహింస. ఇది ఉత్తమ ధర్మము. మార్గమున నడుచు అందరి అడుగున ఏనుగు అడుగులో ఇమిడిపోయినట్లు అన్ని ధర్మములును అహింసలో ఇమిడిపోవును ఇతరులకు. ఉద్వేగమును కల్గించుట సంతాపము కల్గించుట రోగము కల్గించుట వాని శరీరము నుండి రక్తము బయటకు వచ్చునట్లు చేయుట, చాడీలు చెప్పుట, ఇతరుల హితమునకు అడ్డుతగులుట, వారి రహస్యములను బయటపెట్టుట, వారికి సుఖము లేకుండ చేయుట అకారణముగ బంధించుట, చంపుట అని హింస పది విధములు. అట్లు చేయకుండుట అహింస, ప్రాణులకు అత్యంతహితమైన వాక్కు సత్యము. సత్యము పలుకవలెను. ప్రియము పలుకవలెను. సత్యమైనను అప్రియము చెప్పరాదు. ప్రియమైనను అసత్యము చెప్పరాదు. ఇది సనాతన ధర్మము, మైథునమును పరిత్యజించుట బ్రహ్మ చర్యము - స్మరణము, కీర్తనము, విహరించుట, చూచుట, రహస్యముగా మాటలాడుట పొందవలెను, సంకల్పము అందుకు ప్రయత్నము అది సిద్ధించుట అని మైథునము ఎనిమిది విధములు. బ్రహ్మచర్యము సమస్త క్రియలకును మూలము. అదిలేని క్రియలు వ్యర్థము. వయోవృద్ధులు తపోవృద్ధులు యైన వశిష్ఠుడు, చంద్రుడు, దేవాచార్యుడైన, గురుడు. శుక్రుడు, పితామహుడు కూడ స్త్రీలచే మోహింపబడిరి. సుర బెల్లముతో చేసినది పిండితో చేసినది. మధువుతో చేసినది అని, మూడు విధములు. ఈ జగత్తునంతను మోహింపచేయు స్త్రీ యనుసుర నాలుగవది. స్త్రీని చూచి మత్తుచెందును. సురను త్రాగిన తరువాతనే మత్తుచెందును. ఈ విధముగ చూచినంత మాత్రమునకు మత్తునిచ్చు స్త్రీని చూడకూడదు. పరద్రవ్యము ఏమాత్రమైనను, బలాత్కారముగ అపహరించిన వాడును, హోమము చేయుహవిస్సును తిన్నవాడును తప్పకతిర్యగ్‌ జంతువై పుట్టును. కౌపీనమును ఆచ్ఛాదించుటకు వస్త్రమును శీత నివారణార్ధమై బొంతను పాదుకలను సంగ్రహించుకొనవలెను. మరి దేనిని సంగ్రహించకూడదు. దేహస్థితి నిమిత్తమగు వస్త్రాదులను పరిగ్రహించవచ్చును. శరీరము ధర్మ యుక్తముగ ప్రయత్న పూర్వకముగా రక్షింపదగినది. శౌచము బాహ్యము అభ్యంతరమని రెండు విధములు. మృత్‌ జలములతో చేయు శౌచము బాహ్యము. భావశుద్ధి అంతరము. ఈ రెండు విధముల శౌచము బాహ్యము అభ్యంతరమని రెండు విధములు. మృత్‌ జలములతో చేయు శౌచము బాహ్యము. భావశుద్ధి అంతరము. ఈ రెండు విధముల శౌచమున్న వాడే శుచియైన వాడు, ఇతరుడు కాడు.

యథాకథంచిత్ర్పాప్త్యాచ సంతోషస్తుష్టిరుచ్యతే | మనసశ్చేంద్రియాణాంచ ఐకాగ్ర్యం తప ఉచ్యతే.. 19

తజ్జయః సర్వధర్మేభ్యః సధర్మపర ఉచ్యతే | వాచికం మంత్రజప్యాది మానసం రాగవర్జనమ్‌. 20

శారీరం దేవపూజాది సర్వదంతు త్రిధాతపః | ప్రణవాద్యాస్తతో వేదాః ప్రణవే పర్యవస్థితాః. 21

వాఙ్మయః ప్రణవః సర్వం తస్మాత్ర్పణవమభ్యసేత్‌ | అకారశ్చతథోకారో మకారశ్చార్ధమాత్రయా. 22

తిస్రోమాత్రాస్త్రయోవేదాలోకా భూరాదయో గుణాః | జాగత్స్వప్నః సుషుప్తిశ్చ బ్రహ్మవిష్ణుమహేశ్వరాః.

ప్రద్యుమ్నః శ్రీవాసుదేవః సర్వమోంకారకః క్రమాత్‌ | ఆమాత్రో నష్టమాత్రశ్చ ద్వైతస్యా పగమః శివః. 24

ఓంకారో విధితోయేన సమునిర్నేతరోమునిః | చతుర్థీ మాత్రా గాంధారీ ప్రయుక్తా మూర్ధ్నిలక్ష్యతే. 25

తత్తురీయం పరంబ్రహ్మ జ్యోతిర్దీపో ఘటేయథా | తథా హృత్పద్మ నిలయం ధ్యాయేన్నిత్యం జపేన్నరః.

ప్రణవో ధనుః శరోహ్యాత్మా బ్రహ్మతల్లక్ష్య ముచ్యతే | అప్రమత్తేన వేద్ధవ్యం శరవత్తన్మయో భ##వేత్‌. 27

ఏతదేకాక్షరం బ్రహ్మ ఏతదేకాక్షరం పరమ్‌ | ఏ తదేకాక్షరం జ్ఞాత్వా యోయదిచ్ఛతి తస్యతత్‌. 28

ఛందోస్య దేవీ గాయత్రీ అంతర్యామీ ఋషిః స్మృతః | దేవతా పరమాత్మాస్య నియోగో భుక్తిముక్తయే. 29

భూరగ్న్యాత్మనే హృదయం భువః ప్రాజాపత్యాత్మనే | శిర స్వః సూర్యాత్మనే చ శిఖాకవచ ముచ్యతే. 30

ఓం భూర్భువఃస్వః కవచం సత్యాత్మనే తతోస్త్రకమ్‌ |

విన్యస్య పూజయే ద్విష్ణుం జపేద్వై భుక్తిముక్తయే. 31

జుహుయాచ్చ తిలాజ్యాది సర్వం సంపద్యతేనరే | యస్తు ద్వాదశ సాహస్రం జపమన్వహ మాచరేత్‌. 32

తస్య ద్వాదశ భిర్మాసైః పరం బ్రహ్మ ప్రకాశ##తే | అణిమాది కోటి జప్యాల్లక్షాత్సార స్వతాదికమ్‌. 33

వైదిక స్తాంత్రికో మిశ్రో విష్ణోర్వైత్రివిధోమఖః | త్రయాణామీప్సితే నైక విధినా హరిమర్చయేత్‌. 34

ప్రణమ్య దండవద్భూమౌ నమస్కారేణ యోర్చయేత్‌ | సయాం గతి మవాప్నోతి న తాం క్రతు శ##తైరపి.

యస్యదేవే పరాభక్తిర్యథా దేవేతథాగురౌ | తసై#్యతే కథితా హ్యర్థాః ప్రకాశంతే మహాత్మనః.

36

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యమనియమ నిరూపణం నామ ద్విసప్తత్యధిక త్రిశతతమోధ్యాయః.

లభించిన దానితో ఆనందించుట తుష్టి. మనస్సును, ఇంద్రియములను, ఏకాగ్రముగ నుంచుట తపస్సు. ఇంద్రియమనస్సులను జయించుట అన్ని ధర్మముల కంటెను ఉత్తమమైన ధర్మము. మంత్రజపాదికము వాచిక తపస్సు. వైరాగ్యము మానస తపస్సు. దేవపూజాధికము శారీర తపస్సు. ఈత్రివిధ తపస్సు సర్వఫలప్రదము. వేదములు ప్రణవముతో ప్రారంభ##మైనవి. ప్రణవమునందే వాటిస్థితి. వాఙ్మయమంతయు ప్రణవరూపము. అందువలన ప్రవణవము నభ్యసించవలెను. ప్రణవమున అకార - ఉకార - అర్ధ మాత్రమకారములున్నవి. ఈ మూడు మాత్రలు మూడు వేదములు మూడు భూరాది లోకములు మూడు. గుణములు మూడు. జాగత్స్వప్న సుషుప్తి అవస్థలు, బ్రహ్మ విష్ణు, మహేశ్వరులను మూడు మూర్తులు. ప్రద్యుమ్నుడు, శ్రీవాసుదేవుడు సర్వము ఓంకారమే. ''ఓం''కారము అమాత్రము లేదా నష్టమాత్రము. ఇది ద్వైత్యవినాశరూపమగు శివము. ఓంకారము తెలిసినవాడే ముని ఇతరుడుకాడు. ఓంకారము యొక్క నాల్గవ మాత్ర గాంధారి. అది ప్రయుక్తమైనపుడు మూర్ధస్థానమున లక్షింపబడును. అదియే తురీయమైన పరబ్రహ్మ జ్యోతి. కటములోనున్న దీపమువలె, హృతద్మమునందున్న ఆజ్యోతిని నరుడు నిత్యము జపించవలెను. ప్రణవమే ధనస్సు. ఆత్మ ప్రాణము. బ్రహ్మ లక్ష్యము సాధకుడు తన్మయుడై ఆప్రమత్తుడై శరముతో కొట్టినట్లు దానిని కొట్టవలెను. ఈ ఏకాక్షరమే బ్రహ్మ. ఈ యక్షరమే పరతత్త్వము. ఈ ఏకాక్షర బ్రహ్మ తెలిసినవాడు దేనిని కోరునో అది లభించును. ఈ ఓంకారమునకు గాయత్రి ఛందస్సు. అంతర్యామి ఋషి. పరమాత్మదేవతా. భుక్తిముక్తులపై వినియోగించవలెను ''ఓం భూః ఆగ్న్యాత్మనే హృదయాయనమః'' భువః ప్రాజాపత్యాత్మనే శిరసేస్వాహా'' ''ఓం స్వః సూర్యాత్మనే, శిఖాయై వషట్‌'' ఓం భూర్భువ స్స్వః'' సత్యాత్మనే కవచాయ హుం'' అనియు తరువాత అస్త్రమును విన్యసించి, విష్ణువును పూజించి, భుక్తిముక్త్యర్థమై తన్నామ జపము చేయవలయును. తిల ఆజ్యాదులను హోమము చేయవలెను. సర్వము లభించును. ప్రతిదినము పండ్రెండు వేలు ప్రణవజపము చేయువానికి పన్నెండు మాసములలో పరబ్రహ్మ జ్ఞానోదయము కలుగును. కోటిజపము చేసినచో ఆణిమాదులు సిద్ధించును. లక్షజపముచే సరస్వత్యాదుల అనుగ్రహము కలుగును. వైదికము, తాంత్రికము, మిశ్రము, అని విష్ణుపూజ మూడు విదములు. వీటిలో ఇష్టమైన విధిని ఆశ్రయించి విష్ణువును పూజించవలెను. భూమిపై దండమువలె పడి విష్ణువునకు నమస్కరించుటచే కలుగు సద్గతి వందక్రతువులచే గూడ కలుగదు ఎవనికి ఆరాధ్య దేవతయందు ఉత్తమ భక్తి యుండునో గురువు యందు గూడ ఆరాధ్య దేవత యందువున్నంత భక్తి యుండునో ఆతనికే ఈ చెప్పిన విషయములు స్పష్టముగ అవగతము లగును.

అగ్ని మహాపురాణమున యమనియమ నిరూపణమను మూడు వందల డెబ్బది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page