Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ చతుః సప్తత్యధిక త్రిశతతమో೭ధ్యాయః
అథ ధ్యానమ్
అగ్నిరువాచ :
ధ్యై చింతాయాం స్మృతో ధాతుర్విష్ణు చింతాముహుర్ముహుః | ఆనాక్షిప్తేన మనసా ధ్యానమిత్యభిధీయతే. 1
ఆత్మనః సమనస్కస్య ముక్తాశేషోపధస్యచ | బ్రహ్మ చింతాసమాసక్తిర్ధ్యానం నామతదుచ్యతే. 2
ధ్యేయాలంబన సంస్థస్య సదృశ ప్రత్యయస్యచ | ప్రత్యయాన్తర నిర్మూక్తః ప్రత్యయో ధ్యానముచ్యతే. 3
ధ్యేయావస్థిత చిత్తస్య ప్రదేశేయత్ర కుత్రచిత్ | ధ్యానమేతత్సముద్దిష్టం ప్రత్యయసై#్యక భావనా. 4
ఏవం ధ్యానసమాయుక్తః స్వదేహం యః పరిత్యజేత్ | కుల స్వజన మిత్రాణి సముద్ధృత్య హరిర్భవేత్. 5
ఏవం ముహూర్త మర్దంవా ధ్యాయేద్యః శ్రద్ధయాహఠిమ్ |
సో೭పియాం గతి మాప్నోతి నతాం సర్వైర్మహామఖైః 6
అగ్ని దేవుడు పలికెను ''ధ్యై - చింతాయాం'' అని ధాతువు చెప్పబడినది. విక్షేపము లేని మనస్సుతో మాటి మాటికి విష్ణువును చింతించుట ధ్యానము సమస్త ఉపాధి విముక్తమును సమనస్కమును అగు ఆత్మ బ్రహ్మచింతా లగ్నమై వుండుట ధ్యానము ధ్యేయముపై నిలచి యున్నదియు, సదృశ ప్రత్యయములు మాత్రము కలదియు అగు మనస్సు ఇతర ప్రత్యయములు లేకుండగ వుండుట కూడ ధ్యానము. ఏ ప్రదేశము నందైనను చిత్తమును ధ్యేయము నందు నిలిపి ఏకైక జ్ఞానము కలిగి యుండుట ధ్యానము ఇట్టి ధ్యానము నందు లగ్నుడై స్వదేహమును త్యజించిన వాడు కులమును, స్వజనమిత్రులను ఉద్ధరించి హరి సారూప్యమును పొందును. ఈ విధముగా ముహూర్తకాలము గాని, అర్ధ ముహూర్తము గాని శ్రద్ధాపూర్వకముగా హరిని ధ్యానించువాడు ఏ గతిని పొందునో ఆ గతిని సకల మహా యజ్ఞములచేత కూడ పొంద శక్యము గాదు.
ధ్యాతా ధ్యానం తథాధ్యేయం యచ్చధ్యాన ప్రయోజనమ్ |
ఏతచ్చతుష్టయం జ్ఞాత్వా యోగం యుంజీత తత్త్వవిత్. 7
యోగాభ్యాసాద్భవేన్ముక్తిరైశ్వర్యం చాష్టధా మహత్ | జ్ఞాన వైరాగ్య సంపన్నః శ్రద్ధధానః క్షమాన్వితః. 8
విష్ణుభక్తః సదోత్సాహీ ధ్యాతేత్థం పురుషః స్మృతః |
మూర్తామూర్తం పరం బ్రహ్మ హరేర్ధ్యానం హి చింతనమ్. 9
సకలో నిష్కలో జ్ఞేయః సర్వజ్ఞః పరమో హరిః | అణిమాది గుణౖశ్వర్యం ముక్తిర్ధ్యాన ప్రయోజనమ్. 10
ఫలేన యోజకో విష్ణురతో ధ్యాయేత్పరేశ్వరమ్ | గచ్ఛం స్తిష్ఠన్స్వపం జాగ్రదున్మిషన్నిమిషన్నపి. 11
శుచిర్వాప్యశుచిర్వాపి ధ్యాయేత్సతతమీశ్వరమ్ | స్వదేహా యతనస్యాన్తే మనసిస్థాప్య కేశవమ్. 12
హృత్పద్మ పీఠికామధ్యే ధ్యాన యోగేన పూజయేత్ | ధ్యానయజ్ఞః పరః శుద్ధః సర్వదోష వివర్జితః. 13
తేనేష్ట్వా ముక్తిమాప్నోతి బాహ్య శుద్ధైశ్చ నాధ్వరైః | హింసాదోష విముక్తత్వాద్విశుద్ధిశ్చిత్తసాధనః. 14
ధ్యాన యజ్ఞః పరస్తస్మా దపవర్గ ఫలప్రదః | తస్మాదశుద్ధం సంత్య జ్య హ్యనిత్యం బాహ్యసాధనమ్. 15
యజ్ఞాద్యం కర్మసంత్యజ్య యోగమప్యర్థ మభ్యసేత్ | వికారముక్త మవ్యక్తం భోగ్యభోగ సమన్వితమ్. 16
చింతయేద్ధృదయే పూర్వం క్రమాదాదౌ గుణత్రయమ్ |
తమః ప్రచ్ఛాద్య రజసా సత్త్వేన ఛాదయేద్రజః. 17
ధ్యాయెత్త్రి మండలం పూర్వం కృష్ణం రక్తం సితం క్రమాత్ |
సత్త్వోపాధి గుణాతీతః పురుషఃపంచ వింశకః. 18
ధ్యేయమేత దశుద్ధంచత్యక్త్వా శుద్ధం విచిన్తయేత్ | ఐశ్వర్యం పంకజం దివ్యం పురుషోపరి సంస్థితమ్. 19
ద్వాదశాంగుల విస్తీర్ణం శుద్ధం వికసితం సితమ్ | నాలమష్టాంగులం తస్యనాభికంద సముద్భవమ్. 20
పద్మపత్రాష్టకం జ్ఞేయమణి మాది గుణాష్టకమ్ | కర్ణికా కేసరం నాలం జ్ఞానవైరాగ్య ముత్తమమ్. 21
విష్ణుధర్మశ్చ తత్కందమితి పద్మం విచింతయేత్ | తద్ధర్మ జ్ఞాన వైరాగ్యం శివైశ్వర్యమయం పరమ్. 22
జ్ఞాత్వా పద్మాసనం సర్వం సర్వదుఃఖాన్త మాప్నుయాత్ |
ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ధ్యాన ప్రయోజనము అను ఈ చతుష్టయును తెలుసుకొని తత్త్వవేత్తయై యోగాభ్యాసము చేయవలెను. యోగాభ్యాసము వలన అష్టవిధ ఐశ్వర్యములు, ముక్తి కలుగును. జ్ఞాన వైరాగ్యవంతుడు, శ్రద్ధాళువు, క్షమాశీలుడు, విష్ణు భక్తుడు, సర్వదా ధ్యానము చేయువాడు అగుసాధకుడే ధ్యాత. పరబ్రహ్మ, మూర్తము అమూర్తము అని రెండు విధములు హరి ధ్యానము చింతనము సర్వజ్ఞుడైన శ్రీ మహావిష్ణువు సకలుడు నిష్కలుడు అని తెలుసుకొనవలెను. అణిమాద్యైశ్వర్య ప్రాప్తియు ముక్తియు ధ్యానమునకు ప్రయోజనము. కర్మఫలము నిచ్చువాడు విష్ణువు. అందుచే ఆ పరమేశ్వరుని ధ్యానించవలెను. నడుచునపుడు, నిలిచినపుడు, నిద్ర పోవుచున్నపుడు, మేల్కొన్నపుడు, కండ్లు తెరచినపుడు, మూసినపుడు, శుచిగా వున్నన, అశుచిగా వున్నను సర్వదా పరమేశ్వరుని ధ్యానించవలెను. తన దేహము అనెడు మందిరము మధ్య మనస్సులో హృదయపీఠ మధ్యము నందు కేశవుని స్థాపించి ధ్యాన యోగముతో పూజించవలెను. ధ్యాన యజ్ఞము చాల శ్రేష్ఠమైనది. సకల దోష రహితమైనది. అట్టి యజ్ఞము చేసి ముక్తి పొందవలెను. బాహ్య శుద్ధి మాత్రము గల యజ్ఞములచే ముక్తి లభింపదు. ధ్యానము హింసాదోష రహితమగుటచే చిత్తశుద్ధికి ఉత్తమ సాధనము. అందువలన ధ్యాన యజ్ఞము ఉత్తమమైనది, మోక్ష ఫలము నిచ్చును. అందువలన అశుద్ధమైనదియు అనిత్యము బాహ్య సాధనములు కలదియు అగు యజ్ఞాది కర్మను త్యజించి యోగాభ్యాసము చేయవలెను. ప్రారంభమున వికారయుక్తము, అవ్యక్తము భోగ్య భోగ సమన్వితము, అగు గుణత్రయమును క్రమముగ హృదయము నందు ధ్యానించవలెను. తమో గుణమును రజోగుణముచే ఆచ్ఛాదించి రజోగుణముచే సత్త్వ గుణమును ఆచ్ఛాదించవలెను. ప్రారంభమున వరుసగా కృష్ణ, రక్తసిత ములగు మూడు మండలములను ధ్యానించవలెను. సత్త్వోపాధి గుణాతీతుడగు ఇరువది యైదవ తత్త్వము పురుషుడు. అశుద్ధములగు మొదట చెప్పిన గుణాదులను క్రమముగ త్యజించి శుద్ధ మగు ఈ పురుష తత్త్వమును ధ్యానించవలెను. పురుషుని పైన నాభి నుండి ఒక దివ్యపంజకము ప్రకటమై యున్నది. అది ఐశ్వర్య రూపము. అది పండ్రెండు అంగుళముల విస్తారముతో పరిశుద్ధమై వికసించి శ్వేత వర్ణముతో నుండును. నాభి కందము నుండి పుట్టిన దాని మృణాలము ఎనిమిది అంగుళముల పొడవు గలది. దాని ఎనిమిది పత్రములే ఎనిమిది అణిమాది గుణములు. దాని కర్ణిక జ్ఞానము. దాని నాశము ఉత్తదు వైరాగ్యము. విష్ణు ధర్మమే దాని కందము. ఈ విధముగా పద్మమును భావన చేయవలెను. ధర్మ జ్ఞాన వైరాగ్య రూపము శివైశ్వర్యమయము, శ్రేష్ఠము అగు ఆ పద్మాసనమును తెలుసుకొన్న వాడు సర్వ దుఃఖములను దాటును.
తత్పద్మ కర్ణికామధ్యే శుద్ధదీప శిఖాకృతిమ్. 23
అంగుష్ఠ మాత్రమమలం ధ్యాయే దోంకార మీశ్వరమ్ | కదంబ గోలకాకారం తారం రూపమివస్థితమ్. 24
థ్యాయేద్వారశ్మి జాలేన దీప్యమానం సమన్తతః | ప్రధానం పురుషాతీతం స్థితం పద్మస్థ మీశ్వరమ్. 25
ధ్యాయేజ్జపేచ్చ సతతమోంకారం పరమక్షరమ్ | మనః స్థిత్యర్థ మిచ్ఛన్తి స్థూల ధ్యానమనుక్రమాత్. 26
తద్భూతం నిశ్చలీ భూతం లభేత్సూక్ష్మే೭పి సంస్థితమ్ | నాభికందే స్థితం నాలం దశాంగుల సమాయతమ్.
నాలేనాష్టదలం పద్మం ద్వాదశాంగుల విస్తృతమ్ | సకర్ణికే కేసరాలే సూర్యసోమాగ్ని మండలమ్. 28
అగ్నిమండల మధ్యస్థః శంఖచక్ర గదాధరః | పద్మీ చతుర్భుజో విష్ణురథ వాష్టభుజోహరిః.
29
శార్జాగక్ష వలయధరః పాశాంకుశధరః పరః | స్వర్ణవర్ణః శ్వేతవర్ణః సశ్రీవత్సః సకౌస్తుభః 30
వనమాలీ స్వర్ణహారీ స్ఫురన్మకర కుండః | రత్నోజ్జ్వల కిరీటశ్చ పీతాంబరధరో మహాన్. 31
సర్వాభరణ భూషాఢ్యో వితస్తిర్వా యథేచ్ఛయా | అహం బ్రహ్మ జ్యోతిరాత్మా వాసుదేవో విముక్త ఓం.
ధ్యానాచ్ఛాన్తో జపేన్మంత్రం జపాచ్ఛాన్తశ్చ చింతయేత్ | జపధ్యానాది యుక్తశ్చ విష్ణుః శీఘ్రం ప్రసీదతి. 33
జపయజ్ఞస్య వై యజ్ఞాః కలాం నార్హన్తి షోడశీమ్ | జపినం నోపసర్పన్తి వ్యాధయశ్చాధయోగ్రహాః.
భుక్తిర్ముక్తిర్మృత్యుజయో జపేన ప్రాప్ను యాత్పలమ్. 34
ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే ధ్యాన నిరూపణం నామ చతుః సప్తత్యధిక త్రిశతతమో೭ద్యాయః.
ఆ పద్మము యొక్క కర్ణికా మధ్యమున శుద్ధ దీపశిఖా వంటి ఆకారము కలవాడును, అంగుష్ఠ మాత్ర ప్రమాణము కలవాడును నిర్మలుడును ఓంకార స్వరూపుడును, కందపుష్పము వలె గోళాకారముగల తారారూపము కలవాడును అగు పరమేశ్వరుని ధ్యానించవలెను. లేదా ఈ కమలముపైన ప్రకృతి పురుషుల కంటే అతీతుడగు పరమాత్మవున్నట్లు ధ్యానము చేయుచు ఆ పరమాత్మ కిరణసముదాయముతో నలువైపుల ప్రకాశింప చేయునట్లు భావించుచు ధ్యానించవలెను. పరమాక్షరమగు ఆ ఓంకారమును సర్వదా ధ్యానించవలెను. సాధకుడు మనస్సును స్థిరము చేసుకొనుటకై ముందుగా స్థూలమును ధ్యానించవలెను. మనస్సు స్థిరమైన పిమ్మట దానిని సూక్ష్మముపై నిలుపుట శక్యమగును. నాభికమలమున దశాంగుల దీర్ఘమగు. నాళము వున్నది. దానిపై పండ్రెండు అంగుళముల విస్తారముగల అష్టదశ పద్మము వున్నది. కర్ణికా కేసరములు గల దానిపై సూర్య, సోమ, అన్ని మండలము లున్నవి. ఆ అన్ని మండల మధ్యమున శంఖ, చక్ర. గదా, పద్మముల ధరించిన చతుర్భుజుడగు విష్ణువుగాని, శార్జగ అక్షవలయ, పాశాంకుశములను కూడ ధరించిన అష్ట భుజ విష్ణువుగాని వున్నట్లు భావించవలెను. అతని విగ్రహము సువర్ణ వర్ణమై లేదా శ్వేత వర్ణమై వుండును. ఆతడు పీతాంబర ధారియై, శ్రీవత్స, కౌస్తుభ - వనమాలా, సువర్ణహార, మకర కుండల రత్నోజ్జ్వల కిరీటములను ధరించి యుండును. ఈ విధముగ సర్వాభరణ భూషితుడగు ఆతని ఆకారము జానెడు వున్నట్లుగాని, ఇచ్ఛాను సారము అంతకంటే అధికముగా వున్నట్లుగాని భావన చేయవచ్చును. నేనే జ్యోతిరాత్మాయగు బ్రహ్మను ఓంకార రూపమగు దేవుడను, విముక్తుడును, అని ధ్యానము చేయవలెను. ధ్యానము చేసి అలసినవాడు మంత్రమును జపించవలెను. జపము వలన అలసినవాడు ధ్యానము చేయవలెను. ఈ విధముగ జపధ్యానాదులు చేయువానికి విష్ణువు ప్రసన్నుడగును. యజ్ఞములన్నియు జపయజ్ఞము యొక్క పదునారవ వంతుకు కూడ సరితూగవు. జపము చేయువానిని వ్యాధులు కాని, ఆధులుగాని, గ్రహములు కాని. పీడించవు. జపమువలన భుక్తిని ముక్తిని మృత్యు జయమును పొందును.
అగ్ని మహా పురాణమున ధ్యాననిరూపణమను మూడు వందల డెబ్బది నాల్గవ అధ్యాయము సమాప్తము.