Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ సప్త సప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

అథ బ్రహ్మ విజ్ఞానమ్‌

అగ్ని రువాచ :

బ్రహ్మజ్ఞానం ప్రవక్ష్యామి సంసారా జ్ఞానముక్తయే | అయమాత్మా పరంబ్రహ్మ అహమస్మీతి ముచ్యతే. 1

దేహ ఆత్మా న భవతి దృశ్యత్వాచ్చ ఘటాదివత్‌ | ప్రసుప్తే మరణ దేహాదాత్మాన్యో జ్ఞాయతే ధ్రువమ్‌. 2

దేహః సచేద్య్వవహరేదవికార్యాది సన్నిభః | చక్షురాదీనీంద్రియాణి నాత్మావైకరణం త్వతః.

3

మనోధీరపి ఆత్మా న దీపవత్కరణం త్వతః | ప్రాణోప్యాత్మాన భవతి సుషుప్తే చిత్ర్పభావతః. 4

జాగ్రత్స్వప్నేచ చైతన్యం సంకీర్ణత్వాన్న బుధ్యతే | విజ్ఞాన రహితః ప్రాణః సుషుప్తే జ్ఞాయతే యతః. 5

అతో నాత్మేంద్రియం తస్మాదింద్రియాదికమాత్మనః | అహంకారోపి నైవాత్మా దేహవద్వ్యభిచారతః. 6

ఉక్తేభ్యో వ్యతిరిక్తోయ మాత్మా సర్వహృది స్థితః | సర్వద్రష్టాచ భోక్తాచ నక్తముజ్జ్వల

దీపవత్‌. 7

అగ్నిదేవుడు పలికెను. సంసారమును అజ్ఞానమును తొలగించుకొనుటకు సాధనమైన బ్రహ్మజ్ఞానమును చెప్పెదను. ''అయం ఆత్మాపరం బ్రహ్మ అహమస్మి''. నేనే పరబ్రహ్మమైన ఆత్మను అని భావించుటచే ముక్తుడగును. ఘటాదులవలె దృశ్యమగుటచే దేహము ఆత్మ కాజాలదు. నిద్ర పోయినపుడున్ను, మరణమునందును, దేహముకంటే ఆత్మ భిన్నమని తెలియుచున్నది. అదినిశ్చితము. దేహమే ఆత్మయైనచో నిద్రా సమయమునందును, మరణానంతరమున కూడ అది వ్యవహరించవలెను. చక్షురాది ఇంద్రియములు కూడ సాధనము లేకాని ఆత్మకాదు. మనస్సు బుద్ధియు కూడ దీపమువలె సాధన మేకాని ఆత్మ కాదు. సుషుపావస్థలో జ్ఞానము లేకపోవుటచే ప్రాణము కూడ ఆత్మకాదు. జాగ్రత్స్వప్న సమయము లందు ప్రాణ చైతన్యము కలిచి పోయినట్లుండును. అందుచే వేరుగా తెలియుట లేదు. సుషుప్తి అవస్థలో ప్రాణము విజ్ఞాన రహితమై ఉన్నది. అందుచే ప్రాణము ఆత్మ కాదు. ఈ విధముగా ఇంద్రియాదులు ఆత్మ కాదు. ఆత్మకు కరణములు మాత్రమే. అహంకారము కూడ ఆత్మకాదు. అదికూడ దేహమువలె వేరుగ కనబడుచున్నది కదా ! పైన చెప్పిన దేహాదుల కంటే భిన్నమగు ఆత్మ అందరి హృదయము నందును వున్నది. అదియే భోక్త. రాత్రి ప్రకాశించుచున్న దీపము వలె సర్వమును చూచునది.

సమాధ్యారంభ కాలేచ ఏవం సంచింతయేన్మునిః | యతో బ్రహ్మణం ఆకాశం ఖాద్వాయుర్వాయుతోనలః. 8

అగ్నేరాపో జలాత్పృథ్వీతతః సూక్ష్మం శరీరకమ్‌ | అపంచీకృత భూతేభ్య ఆసన్పంచీ కృతాన్యతః. 9

స్థూలం శరీరం ధ్యాత్వాస్మాల్లయం బ్రహ్మణి చింతయేత్‌ |

పంచీకృతాని భూతాని తత్కార్యంచ విరాట్‌ స్మృతమ్‌. 10

ఏతత్థ్సూలం శరీరంహి ఆత్మనోజ్ఞాన కల్పితమ్‌ | ఇంద్రియైరథ విజ్ఞానం ధీరా జాగరితంవిదుః. 11

విశ్వస్తదభిమానీ స్యాత్త్రయ మేతదకారకమ్‌ | అపంచీకృత భూతాని తత్కార్యం లింగముచ్యతే. 12

సంయుక్తం సప్తదశభిర్హిరణ్య గర్భసంజ్ఞితమ్‌ | శరీరమాత్మనః సూక్ష్మం లింగమిత్యభిధీయతే. 13

జాగ్రత్సంస్కారజః స్వప్నః ప్రత్యయోవిషయాత్మకః | ఆత్మాతదభిమానీ స్యాత్తైజసోహ్యప్రపంచతః. 14

స్థూలసూక్ష్మ శరీరాఖ్యద్వయసై#్యకంహి కారణమ్‌ | ఆత్మాజ్ఞానంచ సాభాసం తదధ్యాహృతముచ్యతే. 15

స సన్నాసన్న సదసదేతత్సావయవంనతత్‌ | నిర్గతావయవంనేతి నాభిన్నం భిన్నమేవచ. 16

భిన్నాభిన్నం హ్యనిర్వాచ్యం బంధ సంసారకారకమ్‌ | ఏకం సబ్రహ్మ విజ్ఞానా త్ర్పాప్తం నైవచ కర్మభిః.

యోగి సమాధి ప్రారంభమున ఈ విధముగ భావన చేయవలెను. బ్రహ్మ నుండి ఆకాశము, దాని నుండి వాయువు దాని నుండి అగ్ని అగ్ని నుండి జలము దాని నుండి పృథివి, దాని నుండి సూక్ష్మశరీరము ఆవిర్భవించినది. అపంచీకృత భూతముల నుండి పంచీకృతములగు స్థూల భూతములు జనించినది. స్థూల శరీరము జనించినదని భావించి అది బ్రహ్మ యందు లీనమైనట్లు చింతించవలెను. వాటి నుండి పంచీకృత భూతములకును, వాని కార్యములకును విరాట్‌ యని పేరు. ఈ స్థూల శరీరము ఆత్మ అజ్ఞాన కల్పితము. ఇంద్రియముల వలన జ్ఞానము జాగ్రదవస్థ అని అందురు. జాగ్రదావస్థ అభిమాని యగు ఆత్మకు విశ్వ అని పేరు. ఈత్రయము అకార స్వరూపము. అంపచీకృత భూతములు, వాటి కార్యము ''లింగము'' పదునేడు తత్త్వములతో కూడిన శరీరమునకు హిరణ్య గర్భుడనియు సూక్ష్మ మనియు లింగమనియు పేరు. జాగ్రత్సంస్కారము వలన కలిగిన వివిధ విషయ జ్ఞానము స్వప్నము. తదభిమాని యగు ఆత్మకు తైజసుడు అని పేరు. స్థూల సూక్ష్మ శరీరములకు ఆత్మ ఒక్కటియే కారణము. పైన చెప్పిన తైజసము జాగ్రత్‌ ప్రపంచమునకంటే భిన్నమైనది. ఉకార రూపమైనది. ఆభాస రూపము అగు జ్ఞానమునకు అధ్యాహృతము అని పేరు. ఈ అవస్థలకు సాక్షియైన బ్రహ్మ సత్తు కాదు. అసత్తు కాదు. సదసత్తు కాదు. సావయవము కాదు నిరవయవము కాదు. భిన్నము కాదు, అభిన్నము కాదు, భిన్నాభిన్నము కాదు. అది నిర్వచింప శక్యము గానిది. సంసార బంధనములకు కారణమైనది ఇదియే. బ్రహ్మ ఒక్కటియే. అది జ్ఞానముచే లభించును. కర్మలచే లభ్యము కాదు.

సర్వాత్మనా హీంద్రియాణాం సంహారః కారణాత్మనామ్‌ |

బుద్ధేఃస్థానంసుషుప్తం స్యాత్తద్ద్వయస్యాభి మానవాన్‌. 18

ప్రాజ్ఞ ఆత్మాద్వయంచైతన్మకారః ప్రణవః స్మృతః. 19

అహం సాక్షీచ చిన్మాత్రో జాగ్రత్స్వప్నాదికస్యచ | నాజ్ఞానంచైవ తత్కార్యం సంసారాదిక బంధనమ్‌ . 20

నిత్యశుద్ధబుద్ధ ముక్తసత్యమానంద మద్వయమ్‌ | బ్రహ్మాహ మస్మ్యహం బ్రహ్మపరం జ్యోతిర్విముక్తఓమ్‌.

అహం బ్రహ్మపరం జ్ఞానం సమాధిర్చంధ ఘాతకః | చిరమానన్దకం బ్రహ్మసత్యం జ్ఞాన మనన్తకమ్‌. 22

అయమాత్మాపరంబ్రహ్మ తద్ర్బహ్మత్వమసీతిచ | గురణాబోధితో జివోహ్యయం బ్రహ్మాస్మిబాహ్యతః. 23

సోసావాదిత్య పురుషః సోసావహ మఖండ ఓం | ముచ్యతేసార సంసారద్ర్బహ్మజ్ఞో బ్రహ్మతద్భవేత్‌.

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే బ్రహ్మ విజ్ఞాన నిరూపణంనామ సప్తత్యధిక త్రిశతతమోధ్యాయః

సాధనములగు ఇంద్రియములు లీనములై బుద్ధి మాత్రమే నిలచియుండు స్థితికి సుషుప్తియని పేరు. ఈ బుద్ధి సుషుప్తులకు అభిమాని యగు ఆత్మ ప్రాజ్ఞుడు. ఈ మూడును మకారము గాను ప్రణవము గాను చెప్పబడుచున్నవి. ఈ ప్రాజ్ఞుడే ఆకార, ఉకార, మకారములు. అహంపద లక్ష్య భూతుడగు ఆత్మ జ్ఞాన స్వరూపుడు, జాగ్రత్స్వప్నాదులకు సాక్షి. వానిలో అజ్ఞానము కాని, తత్కార్యమైన సంసారాది బంధనము గాని లేదు. నిత్యము శుద్ధము, బుద్ధము, ముక్తము, సత్యము, ఆనందము, అద్వయ మగు బ్రహ్మయే నేను. జ్యోతి స్వరూపము, ముక్తము అగు పరబ్రహ్మ నేను. ఓంకార రూప పరబ్రహ్మ నేను. జ్ఞాన రూపమును, సమాధి రూప బ్రహ్మను. బంధనమును నశింప చేయువాడును నేను. చిరము ఆనందమయము, సత్యము, జ్ఞానము అనంతమగు బ్రహ్మ నేనే. ''అయం ఆత్మా పరం బ్రహ్మ'', ''తత్‌ బ్రహ్మత్వం ఆసి''. ఈ విధముగా గురువుచే బోధింపబడిన జీవుడు దేహ విలక్షణమైన బ్రహ్మను తెలుసుకొనును. సూర్య మండలమున ప్రకాశించు పురుషుడు నేనే. నేనే ఓంకారమును, నేనే అఖండ పరమేశ్వరుడను. ఇట్లు జ్ఞానము కలవాడు అసారమగు సంసారము నుండి విముక్తుడై బ్రహ్మ రూపుడగును.

అగ్ని మహా పురాణమున బ్రహ్మ విజ్ఞాన నిరూపణమను మూడు వందల డెబ్బది ఏడవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page