Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page

అథ ద్వ్యశీత్యధిక త్రిశతతమో7ధ్యాయః.

అథ యమగీతా

అగ్నిరువాచ :

యమగీతాం ప్రవక్ష్యామి ఉక్తా యా నాచికేతసే| పఠతాం శృణ్వతాం భుక్త్యై ముక్త్యైమోక్షార్థినాంసతామ్‌. 1

యమ ఉవాచ :

ఆసనం శయనం యాన పరిధాన గృహాదికమ్‌ | వాంఛత్యహోతిమోహేన సుస్థిరం స్వయమస్థిరః. 2

భోగేష్వసక్తిః సతతం తథైవాత్మావలోకనమ్‌ | శ్రేయః పరం మనుష్యాణాం కపిలోద్గీత మేవహి. 3

సర్వత్రసమదర్శిత్వం నిర్మమత్వ మసంగతా | శ్రేయఃపరం మనుష్యాణాం గీతం పంచశిభేనహి. 4

ఆగర్భజన్మబాల్యాది వయోవస్థాది వేదనమ్‌ | శ్రేయఃపరం మనుష్యాణాం గంగావిష్ణు ప్రగీతకమ్‌. 5

ఆధ్యాత్మికాది దుఃఖానా మాద్యన్తాది ప్రతిక్రియా | శ్రేయఃపరం మనుష్యాణాం జనకోద్గీత మేవచ. 6

అభిన్నయోర్భేదకరః ప్రత్యయో యః పరాత్మనః | తచ్ఛాంతిః పరమంశ్రేయో బ్రహ్మోద్గీత ముదాహృతమ్‌. 7

కర్తవ్యమితి యత్కర్మ ఋగ్యజుః సామసంజ్ఞితమ్‌ | కురుతేశ్రేయసే సంగాజ్జైగిషవ్యేణ గీయతే. 8

హానిః సర్వవిధిత్సానా మాత్మనః సుఖహేతుకీ | శ్రేయఃపరం మనుష్యాణాం దేవలోద్గీత మీరితమ్‌. 9

కామత్యాగాత్తు విజ్ఞానం సుఖంబ్రహ్మపరం పదమ్‌ | కామినాంనహి విజ్ఞానం సనకోద్గీత మేవతత్‌. 10

అగ్నిదేవుడు పలికెను. నచికేతునుకి చెప్పిన యమగీతను చెప్పెదను. ఇతి మోక్షార్థులగు పఠించువారికిని, వినువారికిని, భుక్తి ముక్తి ప్రదము. యముడు పలికెను. మానవుడు తాను అస్థిరుడైనను, అశాశ్వతుడైనను అతి మోహావిష్టుడై ఆసన, శయన, యానవస్త్ర గృహాదికమును స్థిరముగ నుండవలెనని కోరుకొనును. భోగములయందాసక్తి లేకుండుట, సర్వదా ఆత్మను చూచుట ఇది మనుష్యులకు పరమ శ్రేయస్సు అని కపిలుడు చెప్పినాడు. సర్వత్ర సమముగా చూచుట, మమకారము, లేకుండుట, అసంగత్వము ఇది మనుష్యులకు పరమ శ్రేయస్సు అని పంచ శిఖుడు చెప్పెను. గర్భవాసము మొదలు జన్మ బాల్యాది, వయస్సులకు సంబంధించి అవస్థలను తెలుసుకొనుట మనుష్యులకు పరమ శ్రేయస్సు. అని గంగా విష్ణువులు చెప్పిరి. ఆధ్యాత్మికాది దుఃఖములకు ఆద్యంతాదులను తెలుసుకొని ప్రతి క్రియ చేయుట మానవులకు పరమ శ్రేయస్సు అని జనకుడు బోధించెను. భేదము లేని తత్త్వము నందు భేదమును చూచుటను, శమింపచేయునది, ఉత్తమ శ్రేయస్సు అని బ్రహ్మ చెప్పెను. ఋగ్యజుస్సామవిహితమగు కర్మను కర్తవ్య బుద్ధితో సంగములేక చేసిన శ్రేయస్కరము అని జైగీశవ్యుడు బోధించెను. సమస్త కార్యారంభములను పరిత్యజించుటయే సుఖసాధనము. అదియే మనుష్యులకు పరమ శ్రేయస్సు అని దేవలుడు బోధించెను. కామములను త్యజించినచో, విజ్ఞాన, సుఖ, పరమపద, ప్రాప్తి కలుగును, కామవంతులకు విజ్ఞానము కలుగదు. అనిసనకుడు బోధించెను.

ప్రవృత్తంచ నివృత్తంచ కార్యం కర్మపరోబ్రవీత్‌ | శ్రేయసాం శ్రేయఏతద్ధినైష్కర్మ్యం బ్రహ్మతద్ధరిః.

పుమాంశ్చా విగతజ్ఞానోభేదం నాప్నోతి సత్తమః | బ్రహ్మణా విష్ణుసంజ్ఞేన పరమేణావ్యయేనచ. 12

జ్ఞానం విజ్ఞాన మాస్తిక్యం సౌభాగ్యం రూపముత్తమమ్‌ | తపసాలభ్యతే సర్వం మనసాయద్యదిచ్ఛతి. 13

నాస్తివిష్ణు సమన్ధ్యేయం తపోనానశనాత్పరమ్‌ | నాస్త్యారోగ్య సమం ధాన్యం నాస్తి గంగాసమా సరిత్‌. 14

నసోస్తి బాంధవః కశ్చిద్విష్ణుం ముక్త్వా జగద్గురుమ్‌ | అధశ్ఛోర్ధ్వం హరిశ్చాగ్రే దేహేంద్రియ మనోముఖే.

ఇత్యేవం సంస్మర న్ర్పాణాన్యస్త్య జేత్స హరిర్భవేత్‌ |

యత్తద్ర్బహ్మయతః సర్వం యత్సర్వం తస్య సంస్థితమ్‌. 16

అగ్రాహ్యక మనిర్దేశ్యం సుప్రతిష్ఠం చ యత్పరమ్‌ | పరాపర స్వరూపేణ విష్ణుః సర్వహృదిస్థితః. 17

యజ్ఞేశం యజ్ఞపురుషం కేచి దిచ్ఛన్తి తత్పరమ్‌ | కేచిద్విష్ణుం హరంకేచిత్కే చిద్ర్భహ్మాణ మీశ్వరమ్‌. 18

ఇంద్రాదినామభిః కేచిత్పూర్యం సోమంచ కాలకమ్‌ | బ్రహ్మాదిస్తంబ పర్యన్తం జగద్విష్ణుం వదన్తి చ. 19

సవిష్ణుః పరమం బ్రహ్మయతో నావర్తతే పునః | సువర్ణాది మహాదాన పుణ్యతీర్థావగాహనైః 20

దానైర్ర్వతైః పూజయాచ ధర్మ శ్రుత్యాతదాప్నుయాత్‌ | ఆత్మానం రథినం విద్ది శరీరం రథమేవతు. 21

బుద్ధిన్తు సారథిం విద్ధిమనః ప్రగ్రహమేవచ | ఇంద్రియాణి హయానాహుర్విషయాంశ్చైషు గోచరాన్‌. 22

ఆత్మేంద్రియమనో యుక్తం భోక్తేత్యాహుర్మ నీషిణః | యస్త్వ విజ్ఞాన వాన్భవత్య పునర్మనసా సదా. 23

నతత్పద మవాప్నోతి సంసారం చాధిగచ్చతి | యస్తు విజ్ఞాన వాన్భవతి యుక్తేన మనసాసదా. 24

(అ) 2/57

సతత్ప దమవాప్నోతి యస్మాద్భూయోన జాయతే | విజ్ఞానసారథిర్యస్తు మనఃప్రగ్రహ వాన్నరః. 25

సోధ్వనః పారమాప్నోతి తద్విష్ణోః పరమం పదమ్‌ | ఇంద్రియేభ్యః పరాహ్యర్థా అర్థేభ్యశ్చ పరంమనః.

మనసస్తు పరా బుద్ధిర్బుద్దేరాత్తా మహాన్పరః మహతః పరమవ్యక్తమవ్యక్తాత్ఫురుషః పరః. 27

పురుషాన్న పరం కించిత్సా కాష్ఠాసాపరాగతిః | ఏషు సర్వేషు భూతేషు గూఢోత్మాన ప్రకాశ##తే. 28

దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః .

ప్రవృత్తి నివృత్తి రూపమగు కర్మ చేయవలెను. కాని నైష్కర్శ్యమే పరమ శ్రేయస్సు ఇదియే హరిస్వరూపము. జ్ఞానియైన పురుషుడు పరమము, అవ్యయము, విష్ణు సంజ్ఞకము అగు బ్రహ్మతో ఎన్నడును భేదమును పొందడు. తపస్సుచే జ్ఞానము విజ్ఞానము, ఆస్తిక్యము సౌభాగ్యము, ఉత్తమ రూపము లభించును. మనస్సుతో కోరిదెల్లయు లభించును. విష్దువుతో సమానమైన ధ్యేయము లేదు, ఉపవాసమును మించిన తపస్సు లేదు. ఆరోగ్యముతో సమానమైన ఉత్తమ వస్తువులేదు. గంగా సమానమైన నదిలేదు. జగద్గురులైన, విష్ణువు తప్ప మరియెవ్వరును బంధువులులేదు, క్రింద, పైన, ముందు దేహేంద్రియ మనో ముఖము లందును హరియేవున్నాడు అని స్మరించుచు ప్రాణములను త్యజించువాడు హరియే అగును. దేనినుండి సర్వము పుట్టినదో దేనియందే నిలచియున్నదో అట్టి, గ్రహింపశక్యముగా నిదియు, అనిర్దేశ్యము, సుప్రతిష్ఠీతము అగునది పరబ్రహ్మ. విష్ణువు పరాపర స్వరూపములతో అందరి హృదయము లందునువున్నాడు. కొందరాతనిని యజ్ఞేశుడు, యజ్ఞ పురుషుడు అని చెప్పుదురు. కొందరు విష్ణువనియు కొందరు శివుడనియు కొందరు బ్రహ్మ యనియు ఆ పరమేశ్వరునే చెప్పెదరు. కొందరు ఇంద్రాది నామములతో, పేర్కొందురు. కొందరు సూర్యుడు, సోముడు, కాలపురుషుడు అని చెప్పుదురు బ్రహ్మాదిస్తంభ పర్యంతమగు జగత్తు విష్ణు రూపమని చెప్పుదురు. ఆ విష్ణువుయే పరబ్రహ్మ. ఆస్థానము చేరినవారు పునరావృత్తి పొందరు. సువర్ణాది మహాదానముల చేతను, పుణ్య తీర్థ స్నానములచేతను, ధ్యాన, వ్రత, పూజా ధర్మ శ్రుతులచేతను, అస్థానమును పొందవలెను. ఆత్మయే అధికుడని తెలుసుకొనవలెను. శరీరము రథము. బుద్ధి సారథి, మనస్సు కళ్ళెము. ఇంద్రియములు అశ్వములు. విషయములు వాటిగమ్యములు. ఆత్మేంద్రియ మనస్స ముదాయ మునుపండితులు భోక్త అందురు. నిగ్రహింపబడని మనస్సు కలవాడై, విజ్ఞానమును సంపాదింపనివాడు. ఆ పరమ పదమును పొందజాలడు. సంసారమునే పొందును. మనో నిగ్రహవంతుడై విజ్ఞానమును సంపాదించినవాడు. ఆ పరమ పదమును పొందును. మరల దానినుండి వెనుకకురాడు. విజ్ఞాన సారథియై మనస్సు అను పగ్గము గలవరుడు మార్గమును దాటి, ఆ పరమ విష్ణు పదమును చేరును. ఇంద్రియముల కంటే అర్థములు పరములు. వాటికంటే మనస్సు పరము, దానికంటే బుద్ధి పరము బుద్ధికంటే మహత్తు పరము. మహత్తుకంటే అవ్యక్తము పరము, దానికంటే పురుషుడు పరుడు. పురుషుని కంటే పరమైనది యేదియు లేదు. పురుషుడే పరాకాష్ఠ. ఆతడే పరాగతి. సర్వభూతములందు గూఢమైవున్న ఆత్మ పైకి కనబడుట లేదు. కాని సూక్ష్మదర్శులచే సూక్ష్మమగు బుద్ధితో చూడబడుచున్నది.

యచ్ఛేద్వాఙ్మనసీ ప్రాజ్ఞస్తద్యచ్ఛే జ్ఞానమాత్మని. 29

జ్ఞానమాత్మనిమహతి నియచ్ఛేత్తద్యచ్ఛేచ్ఛాన్త ఆత్మని |

జ్ఞాత్వాబ్రహ్మాత్మ నోర్యోగం యమాద్యైర్ర్బహ్మ సద్భవేత్‌. 30

అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యా పరిగ్రహౌ | యమాశ్చ నియమాః పంచశౌచం సంతోషసత్తపః. 31

స్వాధ్యాయేశ్వర పూజాచ ఆసనం పద్మకాదికమ్‌ | ప్రాణాయామో వాయుజయః ప్రత్యాహారః స్వనిగ్రహః.

శుభేహ్యేకత్ర విషయే చేతసోయత్ర్ప ధారణమ్‌ ః నిశ్చలత్వాత్తు ధీమద్భిర్ధారణా ద్విజకథ్యతే. 33

పౌనః పున్యేన తత్తైవ విషయేష్వేవ ధారణా | ధ్యానం స్మృతం సమాధిస్తు ఆహం బ్రహ్మాత్మ సంస్థితిః.

ఘటధ్వంసాద్య థాకాశ మభిన్నం నభసాభ##వేత్‌ |

ముక్తోజీవో బ్రహ్మణౖవం సద్ర్బహ్మ బ్రహ్మవైభ##వేత్‌. 35

ఆత్మానం మన్యతే బ్రహ్మజీవోజ్ఞానేన నాన్యథా | జీవోహ్యజ్ఞాన తత్కార్యముక్తమ స్యాజరామరః. 36

అగ్నిరువాచ :

వశిష్ఠ యమగీతోక్తా పఠతాం భుక్తిముక్తిదా | ఆత్యన్తికోలయః ప్రోక్తో వేదాంతబ్రహ్మ ధీమయః. 37

ఇత్యాది మహాపురాణ ఆగ్నేయే యమగీతానామ ద్వ్యశీత్యధిక త్రిశతతమోధ్యాయః.

పండితుడు వాక్కును మనస్సు యందు నిలుపవలెను. దానిని జ్ఞానమునందు నిలుపవలెను. దానిని మహదాత్మ యందు నిలుపవలెను. దానిని శాంతమగు ఆత్మయందు నిలుపవలెను. బ్రహ్మాత్మల యోగమును యమాదులచే తెలుసుకొని మానవుడు బ్రహ్మ స్వరూపుడగును. అహింస, సత్యము, అస్తేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము, అనునవి యమములు. శౌచము సంతోషము, తపస్సు స్వాధ్యాయము, ఈశ్వర పూజ ఈ ఐదునుని యమములు. పద్మాదికము ఆసనము ప్రాణనాయువును జయించుట ప్రాణాయామము. ఇంద్రియ నిగ్రహము ప్రత్యాహారము. శుభమగు ఒక విషయముపై చిత్తమును నిలుపుట ధారణ. ఒకే విషయముపై మాటి మాటికి, ధారణ చేయుట ధ్యానము. నేనే బ్రహ్మను అనుస్థితిలో నుండుట సమాధి. ఘటము నశించగనే ఘటాకాశము మహాకాశముతో అభిన్నమైనట్లు ముక్తుడగు జీవుడు బ్రహ్మతో ఐక్యమును పొందును. సద్ర్బహ్మ స్వరూపుడగును జీవుడు అజ్ఞాన వశముచే తాను బ్రహ్మ భిన్నుడనని అనుకొనుచున్నాడు. అజ్ఞానము దాని కార్యములు తొలగి పోయిన వెంటనే ఆతడు అజరామరుడు అగును. అగ్నిదేవుడు పలికెను. వశిష్ఠా ! పఠితలకు భుక్తి ముక్తి ప్రదమగు యమ గీతను చెప్పితిని. వేదాంత జ్ఞానముచే, సర్వత్ర బ్రహ్మ బుద్ధి కలుగటయే ఆత్యంతిక ప్రళయము.

అగ్ని మహాపురాణమున "యమగీత" అను మూడు వందల ఎనుబది రెండవ అధ్యాయము సమాప్తము.

Sri Madagni Mahapuranamu-2    Chapters    Last Page