Sri Madagni Mahapuranamu-2 Chapters Last Page
అథ త్ర్యశీత్యధిక త్రిశతతమో೭ధ్యాయః
అథాగ్నేయపురాణ మాహాత్మ్యమ్
అగ్ని రువాచ :
ఆగ్నేయం బ్రహ్మరూపన్తే పురాణం కథితం మయా |
సప్రపంచం నిష్ర్పపంచం విద్యాద్వయమయంమహత్. 1
ఋగ్యజుః సామాథర్వాఖ్యావిధ్యా విష్ణుర్జగజ్జనిః ఛందః శిక్షావ్యాకరణ నిఘంటుర్జ్యోతి రాఖ్యకాః. 2
నిరుక్త ధర్మశాస్త్రాది మీమాంసా న్యాయవిస్తరాః | ఆయుర్వేద పురాణాఖ్యా ధనుర్గంధర్వ విస్తరాః. 3
విద్యాసైవార్థ శాస్త్రాఖ్యా వేదాంతా೭న్యా హరిర్మహాన్ | ఇత్యేషా చాపరా విద్యా పరవిద్యా೭క్షరం పరమ్.
యస్యభావో೭ఖిలం విష్ణుస్తస్య నోబాధతే కలిః | అనిష్ట్వాతు మహాయజ్ఞానకృత్వాపి పితృస్వధామ్. 5
కృష్ణమభ్యర్చ యన్భక్త్వా నైనసో భాజనం భ##వేత్ | సర్వకారణ మత్యన్తం విష్ణుం ధ్యాయన్న సీదతి. 6
అన్యతంత్రాది దోషోత్థో విషయాకృష్ట మానసః | కృత్వాపిపాపం గోవిందం ధ్యాయన్పాపైః ప్రముచ్యతే. 7
తద్ధ్యానం యత్రగోవిన్దః సాకథా యత్రకేశవః | తత్కర్మ యత్తదర్థీయం కిమన్యైర్బహు భాషితైః. 8
న తత్పితాతు పుత్రాయ న శిష్యాయ గురుర్‌ద్విజ | పరమార్థం పరం బ్రూయాద్యదే తత్తేమయోదితమ్.
సంసారే భ్రమతాలభ్యం పుత్రదార ధనం వసు | సుహృదశ్చ తథైవాన్యే నోపదేశో ద్విజేదృశః. 10
కింపుత్రదారైర్ మిత్రైర్వాకిం మిత్రక్షేత్ర బాంధవైః | ఉపదేశఃపరో బంధురీదృశోయో విముక్తయే. 11
ద్వివిధో భూతమార్గోయం దైవ ఆసుర ఏవచ | విష్ణుభక్తి పరోదైవో విపరీతస్తథాసురః. 12
ఏతత్పవిత్ర మారోగ్యం ధన్యం దుఃస్వప్ననాశనమ్ | సుఖప్రీతికరం నౄణాం మోక్ష కృద్యత్త వేరితమ్.
యేషాం గృహేతు లిఖిత మాగ్నేయం హి పురాణకమ్ | పుస్తకం స్థాస్యతి సదాతత్రనేశురుపద్రవాః.
కిం తీర్థైర్గోధనైర్వా కిం కిం యజ్ఞైః కిముపోషితైః | ఆగ్నేయం యేహిశృణ్వంతి అహన్య హనిమానవాః.
అగ్ని దేవుడు పలికెను. నీకు బ్రహ్మ రూప మగు అగ్ని పురాణమును చెప్పితిని. విద్య విస్తృతము, సంక్షిప్తము అని రెండు విధములు. ఋగ్యజుస్సా మాథర్వ రూప మగు విద్య జగత్కారణ భూతుడగు విష్ణువు. ఛందస్సు శిక్షా, వ్యాకరణ, నిఘంటు జ్యోతిష నిరుక్త, ధర్మ శాస్త్ర, మీమాంసా, న్యాయ, ఆయుర్వేద, పురాణ, ధనుర్వేద, గాంధర్వ, అర్ధ శాస్త్ర, వేదాంతాది విద్యలు అన్నియు హరి స్వరూపములు, ఈ విద్య అపర విద్య. పరమగు ఆత్మతత్త్వమును బోధించు విద్య పరవిద్య. ఈ ప్రపంచ మంతయు విష్ణు రూపము అను భావించు వానిని కలియు బాధించదు. మహా యజ్ఞమును చేయకున్నను పితృస్వధ చేయకున్నను, భక్తి పూర్వకముగా కృష్ణుని పూజించు వాడు పాపములను పొందడు. సర్వకారణ భూతుడగు విష్ణువును సర్వదా ధ్యానించు వాడు ఎన్నటికిని నశించడు. పారతంత్ర్యాది దోషములు కలవాడును, విషయములచే ఆకర్షింపబడిన మనస్సు కలవాడు, పాపములు చేసినను గోవిందుని ధ్యానించుటచే ఆ పాపముల నుండి విముక్తుడగును. గోవిందుడన్నదే ధ్యానము. కేశవుడు వున్నదే కథ. వానికై చేయునదే కర్మ. చాల చెప్పనేల. నేను చెప్పిన ఈ ఉత్తమ పరమార్థమును తండ్రి కుమారున కుమారునకు చెప్పజాలడు. గరువు శిష్యునకు చెప్పజాలడు. సంసారములో భ్రమించుచున్నవాడు పుత్ర దారాదులను అధికధనమును మిత్రులను, ఇతరులను కూడ పొంద వచ్చును. కాని ఇట్టి ఉపదేశమును పొందజాలడు. పుత్రదార, మిత్ర, క్షేత్ర, బాంధవాదులచే ఏమి ప్రయోజనము. ఇట్టి ఉపదేశ##మే పరమ బంధువు. ఈ భూతి మార్గము, దైవము ఆసురము అని రెండు విధములు. విష్ణు భక్తిపరమైనది దైవ మార్గము. తద్విపరీతమైనది ఆసుర మార్గము. నేను నీకు బోధించిన ఈ పురాణము పవిత్రము, ఆరోగ్యము, ధన్యము, దుఃస్వప్న నాశనము. సుఖ ప్రీతికరము, మానవులకు మోక్షము నిచ్చునది. వ్రాయబడిన అగ్ని పురాణ గ్రంథము, ఎవరి గృహమునందుండో, వారికి ఉపద్రవము లేవియు వుండవు. ప్రతి దినము అగ్ని పురాణమును విను వారికి తీర్థ స్నానమెందుకు? గోదాన మెందుకు? యజ్ఞము లెందుకు? ఉపవాసము లెందుకు?
యోదదాతి తిలప్రస్థం సువర్ణస్యచ మాషకమ్ | శృణోతి శ్లోకమేకంచ ఆగ్నేయస్య తదాప్నుయాత్. 16
అధ్యాయ పఠనం చాస్యగోప్రదానాద్వి శిష్యతే | అహోరాత్రం కృతం పాపం శ్రోతు మిచ్ఛోః ప్రణశ్యతి. 17
కపిలానాం శ##తే దత్తే యద్భవే జ్జ్యేష్ఠ పుష్కరే | తదాగ్నేయం పురాణం హి పఠిత్వా ఫలమాప్నుయాత్. 18
ప్రవృత్తంచ నివృత్తంచ ధర్మం విద్యాద్వయాత్మకమ్ | ఆగ్నేయస్య పురాణస్యాస్య శాస్త్రస్యసమంనహి. 19
ఫఠన్నాగ్నేయకం నిత్యం శృణ్వన్వాపి పురాణకమ్ | భక్తో వశిష్ఠ మనుజః సర్వపాపైః ప్రముచ్యతే. 20
నోపసర్గాన చానర్థాన చౌరాది భయంగృహే | తస్మిన్స్యాద్యత్ర చాగ్నేయ పురాణస్య హి పుస్తకమ్. 21
నగర్భహారిణీ భీతిర్నచ బాలగ్రహాగృహే | యత్రాగ్నేయం పురాణం స్యాన్న పిశాచాదికం భయమ్.
శృణ్వన్విప్రోవేద విత్స్యాత్షత్రియః పృథివీపతిః | బుద్ధిం ప్రాప్నోతి వైశ్యశ్చ శూద్రశ్చా రోగ్యమృచ్ఛతి.
యః పఠేచ్ఛృణు యాన్నిత్యం సమదృగ్విష్ణు మానసః | బ్రహ్మాగ్నేయం పురాణం సత్తత్ర నశ్యన్త్యుపద్రవాః.
దివ్యాన్తరిక్ష భౌమాద్యా దుఃస్వప్నాద్యాభిచారకాః | యచ్చాన్యద్దురితం కించిత్తత్సర్వం హన్తికేశవః. 25
పఠతః శృణ్వతః పుంసః పుస్తకం యజతోమహత్ |
ఆగ్నేయం శ్రీపురాణం హి హేమన్తేయః శృణోతివై. 26
ప్రపూజ్య గంధపుష్పాద్యై రగ్నిష్టోమఫలం లభేత్ | శిశిరే పుండరీకస్య వసన్తే చాశ్వమేధజమ్. 27
గ్రీష్మేతు వాజ పేయస్య రాజసూయస్య వర్షతి | గో సహస్రస్య శరది ఫలం తత్పఠతోహ్యృతై. 28
ఆగ్నేయంహి పురాణంయో భక్త్యాగ్రేచ పఠేద్దరేః | సో೭ర్చయేచ్చ వసిష్ఠేహ జ్ఞానయజ్ఞేన కేశవమ్. 29
యస్యాగ్నేయ పురాణస్య పుస్తకం తస్యవైజయః | లిఖితం పూజితం గేహేభుక్తిర్ముక్తిః కరే೭స్తిహి. 30
ఇతికాలాగ్ని రూపేణ గీతం మే హరిణాపురా | ఆగ్నేయం హి పురాణంవై బ్రహ్మ విద్వాద్వయాస్పదమ్.
విద్యాద్వయం వసిష్ఠేదం భ##క్తేభ్యః కథయిష్యతి. 31
వసిష్ట ఉవాచ :
వ్యాసాగ్నేయ పురాణంతేరూపం విద్యాద్వయాత్మకమ్ | కథితం బ్రహ్మణో విష్ణోరగ్నినా కథితం యథా.
సార్ధం దేవైశ్చ మునిభిర్మహ్యం సర్వార్థదర్శకమ్ | పురాణమగ్నినా గీతమాగ్నేయం బ్రహ్మసమ్మితమ్. 33
యః పఠేచ్ఛృణు యాద్వ్యాస లిఖేద్వాలేఖ యేదపి | శ్రావయేత్పాఠయేద్వాపి పూజయేద్దారయే దపి. 34
సర్వపాప వినిర్ముక్తః ప్రాప్తకామో దివంవ్రజేత్ | లేఖయిత్వా పురాణం యోదద్యాద్వి ప్రేభ్య ఉత్తమమ్.
స బ్రహ్మలోక మాప్నోతి కులానాం శతముద్ధరేత్ | ఏకం శ్లోకం పఠేద్యస్తు పాపపంకాద్వి ముచ్యతే. 36
తస్మా ద్వ్యాస సదా శ్రావ్యం శిష్యేభ్యః సర్వదర్శనమ్ | శుకాద్యైర్మునిభిః సార్థంశ్రోతుకామైః పురాణకమ్.
ఆగ్నేయం పఠితం ధ్యాతం శుభం స్యాద్భుక్తిముక్తిదమ్ |
ఆగ్నేయేతు సభస్తసై#్మ యేన గీతం పురాణకమ్. 38
వ్యాస ఉవాచ :
వసిష్ఠేన పురాగీతం నూతైతత్తేమ యోదితమ్ | పరావిద్యా೭పరావిద్యా స్వరూపం పరమం పదమ్. 39
అగ్ని పురాణములోని ఒక శ్లోకము విన్న వానికి తిలప్రస్థము, ఒక మాషము సువర్ణము, దానము చేసిన వానికి, వచ్చు పుణ్యము లభించును. ఒక అధ్యాయమును చదువుట గోదానము కంటే విశిష్టము. దీనిని చదువకోరు వానికి ఒక అహో రాత్రము నందు చేసిన పాపములు నశించును. అగ్ని పురాణము పఠించిన వాడు జ్యేష్ఠ పుష్కరము నందు నూరు కపిల గోవులను దానము చేసిన పుణ్యమును పొందును. ధర్మము ప్రవృత్తి, నివృత్త్యాత్మకము. అగ్ని పురాణముతో సమానమైన శాస్త్రము లేదు. వశిష్ఠా ! నిత్యమును అగ్ని పురాణమును, చదివినను విన్నను భక్తుడగు మనుష్యుడు సర్వ పాప విముక్తుడగును. అగ్ని పురాణము పుస్తకము వున్న గృహమున గృహోప ద్రవములు కాని, అనర్థములు కాని చోర శత్రు భయముండదు. ఆ యింటిలో గర్భస్రావ భీతి కాని, బాల గ్రహములు కాని, పిశాచాది, భయము గాని వుండదు. బ్రాహ్మణుడు దీనిని వినినచో వేదవేత్త యగును. క్షత్రియుడు పృథివీ పతియు అగును వైశ్యుడు ఐశ్వర్యమును, శూద్రుడు ఆరోగ్యమును పొందును. సమ దృష్టియై విష్ణువు నందు మనస్సు నిలిపి, ఈ అగ్ని పురాణమును చదివినచో అచట ఉపద్రములన్నియు నశించును. దివ్య, అంతరిక్ష, భౌమాది ఉపద్రవములు, దుస్వప్న అభిచారములు, ఇతర పాపములు వాటినన్నింటిని, కేశవుడు నశింప చేయును. ఈ పురాణమును చదువు వానికిని, విను ఈ పుస్తకమును పూజించు వానికిని పూర్వోక్త ఫలము లభించును. ఈ పుస్తకమును, గంధ పుష్పాదులతో పూజించి, హేమంతము నందు ఎవడు వినునో వానికి అగ్నిష్ఠోమ ఫలము లభించును. శిశిర ఋతువు నందు పుండరిక ఫలమును, వసంతము నందు అశ్వమేధ ఫలమును, గ్రీష్మము నందు వాజపేయ ఫలమును, వర్షా కాలము నందు రాజసూయ ఫలమును, శరత్కాలమున గోసహస్ర దాన ఫలమును పొందును. భక్తి పూర్వకముగ విష్ణు సన్ముఖముఖమున అగ్ని పురాణమును పూజించిన వాడు జ్ఞాన యజ్ఞముచే కేశవుని పూజించిన వాడగును. అగ్ని పురాణము యొక్క లిఖిత పుస్తకము ఎవని గృహము నందు పూజింపబడునో వానికి జయము కలుగును. భుక్తి ముక్తులు వాని చేతిలో నుండును. ఈ విధముగ కాలాగ్నిరూపుడగు హరి బ్రహ్మ విద్యాద్వయస్థానమగు ఈ అగ్ని పురాణమును నాకు బోధించినాడు. వశిష్ఠా ! ఈ విద్యాద్వయమును భక్తులకు మాత్రమే చెప్పగలవు. వశిష్ఠుడు పలికెను. వ్యాస ! విష్ణువు బ్రహ్మకును, అగ్ని దేవ, ముని, సహితుడనగు నాకును బోధించిన విద్యాద్వయాత్మకమగు సర్వ విషయం ప్రదర్శకమైన అగ్ని పురాణము నీకు చెప్పబడినది. వ్యాసా ! అగ్నిచే ఉపదేశింపబడినదియు, వేదతుల్యమును అగు ఈ అగ్ని పురాణమును ఎవడు చదువునో, వినునో, వ్రాయునో, వ్రాయించునో, చదివించునో, పూజించునో, ధరించునో ఆతడు సర్వపాప వినిర్ముక్తుడై, సర్వ కామములను పొంది స్వర్గమునగు వెళ్ళును. ఈ పురాణము వ్రాయించి బ్రాహ్మణులకు దానము చేసిన వాడు నూరు తరములను ఉద్దరించి, బ్రహ్మ లోకము పొందును. ఒక్క శ్లోకము చదివిన వాడు పాప పంక విముక్తుడగును. వ్యాస ! అందువలన సర్వ దద్శన సంగ్రహ రూపమగు ఈ పురాణమును వినదలచిన శుకాది మునులతో కూడ శిష్యులు సర్వదా వినిపించవలెను. అగ్ని పురాణమును చదివినను, చింతనము చేసినను, భుక్తి ముక్తులనిచ్చును. ఈ పురాణమును చెప్పిన అగ్నికి నమస్కారము.
ఆగ్నేయం దుర్లభం రూపం ప్రాప్యతే భాగ్య సంయుతైః |
ధ్యాయన్తో బ్రహ్మ చాగ్నేయం పురాణం హరిమాగతాః. 40
విద్యార్థి నస్తథా విద్యాం రాజ్యం రాజ్యార్థినో గతాః | అపుత్రాః పుత్రిణః సన్తి నాశ్రయా ఆశ్రయం గతాః.
సౌభాగ్యార్థీచ సౌభాగ్యం మోక్షం మోక్షార్థినోగతాః | లిఖన్తో లేఖయన్తశ్చ నిష్పాపాశ్చ శ్రియంగతాః. 42
శుకపైల ముఖైః సూత ఆగ్నేయన్తు పురాణకమ్ |
రూపం చిన్తయ యాతాసి భుక్తిం ముక్తిం నసంశయః. 43
శ్రావయ త్వంచశిష్యేభ్యో భ##క్తేభ్యశ్చ పురాణకమ్ |
సూత ఉవాచ :
వ్యాసప్రసాదాదాగ్నేయం పురాణం శ్రుతమాదరాత్. 44
ఆగ్నేయం బ్రహ్మరూపం హి మునయః శౌనకాదయః | భవన్తో నైమిశారణ్య యజన్తో హరిమీశ్వరమ్. 45
తిష్ఠన్తః శ్రద్ధయా యుక్తాస్తస్మాద్వః సముదీరితమ్ | అగ్నినాప్రోక్తమాగ్నేయం పురాణం వేదసమ్మితమ్. 46
బ్రహ్మవిష్ణుద్వయోపేతం భుక్తిదం ముక్తిదం మహత్ |
నాస్మాత్పరతరః సారోనాస్మాత్పరతరః సుహృత్. 47
నాస్మాత్పరతరోగ్రంథో నాస్మాత్పరతరా గతిః | నాస్మాత్పరతరంశాస్త్రం నాస్మాత్పరతరాశ్రుతిః. 48
నాస్మాత్పరతరం జ్ఞానం నాస్మాత్పరతరాస్మృతిః | నాస్మాత్పరోహ్యాగమో೭స్తి నాస్మాద్విద్యా పరా೭స్తిహి.
నాస్మాత్పరః స్యాత్సిద్ధాంతో నాస్మాత్పర మమంగళమ్ |
నాస్మాత్పరో೭స్తి వేదాన్తః పురాణం పరమన్త్విదమ్. 50
నాస్మాత్పరతరం భూమౌవేద్యంవస్తు సుదుర్లభమ్ | ఆగ్నేయేహి పురాణ೭స్మిన్సర్వవిద్యాః ప్రదర్శితాః 51
సర్వే మత్త్సావతారాద్యా గీతా రామాయణన్త్విహ | హరివంశో భారతంచ నవసర్గాః ప్రకీర్తితాః. 52
ఆగమో వైష్ణవోగీతః పూజాదీక్షా ప్రతిష్ఠయా | పవిత్రారోహణాదీని ప్రతిమాలక్షణాదికమ్. 53
ప్రాసాదలక్షణాద్వంచ మంత్రావై భుక్తిముక్తిదాః | శైవాగమస్తదర్థశ్చ శాక్తేయః సౌరఏవచ. 54
మండలాని చ వాస్తుశ్చ మంత్రాణి వివిధానిచ | ప్రతిసర్గశ్చాను గీతోబ్రహ్మాండ పరిమండలమ్. 55
గీతోభువనకోశశ్చ ద్వీపవర్షాది నిమ్నగాః | గయాగంగా ప్రయాగాది తీర్థమాహాత్మ్య మీరితమ్. 56
జ్యోతిశ్చక్రం జ్యోతిషాది గీతోయుద్ధ యజార్ణవః | మన్వంతరాదయో గీతాః ధర్మావర్ణాది కస్యచ. 57
అశౌచం ద్రవ్యశుద్ధిశ్చ ప్రాయశ్చిత్తం ప్రదర్మితమ్ | రాజధర్మా దానధర్మా వ్రతాని వివిధానిచ. 58
వ్యవహారః శాంతయశ్చ ఋగ్వేదాది విధానకమ్ | సూర్యవంశః సోమవంశో ధనుర్వేదశ్చ వైద్యకమ్. 59
గంధర్వ వేదో೭ర్థశాస్త్రం మీమాంసా న్యాయని స్తరః |
పురాణ సంఖ్యా మాహాత్మ్యం ఛందో వ్యాకరణం స్మృతమ్. 60
అలంకారో నిఘంటుశ్చ శిక్షాకల్ఫ ఇహోదితః | నైమిత్తికః ప్రాకృతికోలయ ఆత్యన్తికః స్మృతః. 61
వేదాంతం బ్రహ్మవిజ్ఞానం యోగోహ్యష్టాంగ ఈరితః స్తోత్రం పురాణ మాహాత్మ్యం హ్యష్టాదతథాశస్మృతాః.
ఋగ్వేదాద్యాః పరాహ్యత్ర పరావిద్యాక్షరం పరమ్ | నప్రపంచం నిష్ర్పపంచం బ్రహ్మణో రూపమీరితమ్. 63
ఇదం పంచదశ సాహస్రం శతకోటి ప్రవిస్తరమ్ | దేవలోకే దైవతైశ్చ పురాణం పఠ్యతే సదా. 64
లోకానాం హితకామేన సంక్షిప్యోద్గీత మగ్నినా | సర్వం బ్రహ్మేతి జానీధ్వం మునయః శౌనకాదయః. 65
శృణుయాచ్ఛ్రావ యేద్వాపియః పఠేత్పాఠయేదపి | లిఖేల్లేఖాపయేద్వాపి పూజయేత్కీర్తయేదపి. 66
పురాణ పాఠకం చైవ పూజయేత్ర్పయతోనృపః | గోభూహిరణ్య దానాద్యైర్వస్త్రాలంకారతర్పణౖః. 67
తం సంపూజ్య లభేచ్చైవ పురాణ శ్రవణాత్ఫలమ్ | పురాణాన్తేచ వైకుర్యా దవశ్యం ద్విజభోజనమ్. 68
నిర్మలః ప్రా ప్తసర్వార్థః సకులః స్వర్గమాప్నుయాత్ |
శరయంత్రం పుస్తకాయ సూత్రం వైపత్ర సంచయమ్. 69
పట్టికాబంధ వస్త్రాది దద్యాద్యః స్వర్గమాప్నుయాత్ |
యోదద్యాద్ర్బహ్మలోకే స్యాత్పుస్తకం యస్యవైగృహే. 70
తస్యోత్పాతభయం నాస్తి భు క్తిముక్తి మవాప్నుయాత్ |
యూయం స్మరత చాగ్నేయం పురాణం రూపమైశ్వరమ్.
సూతోగతః పూజితసై#్తః శౌనకాద్యా హరింయయుః. 71
ఇత్యాగ్నేయే ఆది (మహా) పురాణ ఆగ్నేయ పురాణ మాహాత్మ్యం నామ
త్ర్యశీత్యధిక త్రిశతతమో೭ధ్యాయః.
వ్యాసుడు పలికెను. సూతా ! పూర్వము వశిష్ఠుడు చెప్పిన పరావిద్యా అపరావిద్యా రూపమగు పురాణమును నీకు చెప్పితిని. దీనిని చదువు భాగ్యవంతులు దుర్లభమగు ఆగ్నేయ రూపమును పొందుదురు. ఆగ్నేయమును ధ్యానించువారు పరమాత్మ హరిని చేరిరి. విద్యార్థులు విద్యను రాజ్యార్థులు రాజ్యమును పొందిరి. పుత్రులు లేనివారు పుత్రులను ఆశ్రయము లేనివారు ఆశ్రయమును, సౌభాగ్యము కోరువారు సౌభాగ్యమును, మోక్షమును కోరువారు మోక్షమును పొందిరి. వ్రాసిన వారును వ్రాయించిన వారును పాపరహితులై ఐశ్వర్యము పొందిరి. ఈ అగ్ని పురాణమును శుకపైల వాదులలతో కలసి చింతన చేయుము. భుక్తి ముక్తులను పొందెదవు. సందేహములేదు. నీవు కూడ శిష్యులకు భక్తులకును ఈ పురాణము వినిపించుము. సూతుడు పలికెను. శౌనకాదిమునులారా ! వ్యాసుని అనుగ్రహమువలన బ్రహ్మ రూపమగు ఈ ఆగ్నేయ పురాణము, ఆదర పూర్వకముగ వినబడినది. మీరు నైమిశారణ్యమును శ్రద్ధాయుక్తులై పరమేశ్వరుడగు శ్రీ హరిని పూజించుచున్నారు. కావున మీకు బోధింపబడినది. అగ్ని ప్రోక్తమగు, ఈ అగ్ని పురాణము, వేదతుల్యము, ద్వి విధ బ్రహ్మ విద్యలు బోధించునది? భుక్తిముక్తి ప్రదము. దీనిని మించిన సారము, దీనిని మించిన మిత్రుడు, దీనిని మించిన గ్రంథము, గతి, శాస్త్రము, శ్రుతి, జ్ఞానము, స్మృతి, ఆగమము, విద్య సిద్ధాంతము, మంగళము, దీనిని మించిన వేదాంతము లేవు. ఇదియే అత్యుత్తమము. దీనిని మించినది ఈ భూలోకమున లేదు. అట్టి వస్తువు దుర్లభము. ఈ అగ్ని పురాణమున సకల విద్యలు ప్రదర్శింపబడినవి. సమస్తమైన, మత్స్యాద్యవ తారములు రామాయణము, హరివంశము, భారతము, నవ విధ సృష్టులు వర్ణింపబడినవి. వైష్ణ వాగమము, పూజ, దీక్షా, ప్రతిష్ఠా, పవిత్రారోహణాదికము, ప్రతిమాలక్షణాదికము, ప్రాసాద లక్షణాదికము, భుక్తిముక్తి ప్రదములగు మంత్రములు, శైవాగయము దాని అర్థము శాక్తే యాగమము, సౌరాగమము మండలములు, వాస్తు, వివిధ మంత్రములు, ప్రతిసర్గ, బ్రహ్మాండ మండలము, భువన కోశము ద్వీప వర్షాదులు, నదులు, గ, యా, గంగా, ప్రయాగాది తీర్థ మాహాత్మ్యము, జ్యోతిశ్చక్రము, జ్యోతిషాదికము, యుద్ధ జయార్ణ వము మన్వంతరాదులు వర్ణాది ధర్మములు, ఆశౌచము ద్రవ్య శుద్ధి ప్రాయశ్చిత్తము, రాజ ధర్మములు, దాన ధర్మములు, వివిధ వ్రతములు, వ్యవహారములు, శాంతులు, ఋగ్వేదాది విధానము, సూర్య వంశము, సోమ వంశము, ధనుర్వేదము, వైద్యము, గంధర్వ వేదము, ఆర్థ శాస్త్రము, మీమాంసా శాస్త్రము, న్యాయ విస్తరము, పురాణ సంఖ్యామాహాత్మ్యము, ఛందస్సు, వ్యాకరణము, అలంకారము, నిఘంటువు, శిక్షా, కల్పము, నైమిత్తిక ప్రళయము, ప్రాకృతిక ప్రళయము, ఆత్యంతిక ప్రళయము వేదాంతము బ్రహ్మ విజ్ఞానము, అష్టాంగ యోగము స్తోత్రము, పురాణ మాహాత్మ్యము, అష్టాదశ విద్యలు దీని యందు చెప్పడినవి. ఋగ్వేదాది అపరా విద్యలు, అక్షర మగు పరావిద్య బ్రహ్మ యొక్క సప్రపంచ నిష్ప్రపంచ రూపము బోధింపబడినది. ఇది వది హేను వేల సంఖ్య గలది. దేవ లోకమున శతకోటి విస్తరమగు. ఈ పురాణము, దేవతలచే పఠింపబడును. అగ్ని లోకహితమును గోరి దీనిని సంక్షిప్తమును చేసి ఉపదేశించెను. శౌనకాది మునులారా ! సర్వము బ్రహ్మ స్వరూప మని తెలుసుకొనుడు. ఎవడు వినునో వినిపించునో, చదువునో, చదివించునో వాడు స్వర్గమును పొందును. రాజు నియమవంతుడై గో, భూ, హిరణ్య, దానాదులచేతను, వస్త్రాలంకారాదుల చేతను పురాణ పాఠకుని పూజించవలెను. అట్లు పూజించి, పురాణ శ్రవణ ఫలమును పొందును. పురాణాంతమున ద్విజులకు భోజనము పెట్టవలెను. ఇట్లు చేసినవాడు నిర్మలుడై, సకల ప్రయోజనములను పొంది తన వంశముతో స్వర్గము చేరును. పుస్తకము నిమిత్తమై శర యంత్రమును, త్రాడును, పత్ర సముదాయమును. పట్టికాబంధమును వస్త్రాదులను ఇచ్చువాడు స్వర్గమును పొందును. పుస్తకము దానము చేసినవాడు బ్రహ్మలోకము పొందును. ఈ పుస్తకము ఎవరి ఇంటిలో వుండునో వానికి ఉత్పాత భయముండదు. ఆతడు భుక్తి ముక్తులను పొందును. ఈ అగ్ని పురాణము ఈశ్వర రూపమైనది, అని మీరు చింతింపుడు. ఇట్లు పలికి వారిచే పూజింపబడి సూతుడు వెళ్ళి పోయెను. శౌనకాదులు విష్ణువును పొందిరి.
అగ్ని మహాపురాణమున ఆగ్నేయ పురాణ మాహాత్మ్యమను మూడు వందల ఎనుబది మూడవ అధ్యాయము సమాప్తము.
యత్కృపాలేశ సంసర్గా దనువాదః కృతో మయా |
తసై#్యవ జానకీ జానేః పదయోరయ మర్ప్యతే.
దేవతానుగ్రహః పిత్రోస్తపశ్చాచార్య సత్కృపా|
కర్తాస్మ ద్గ్రన్థజాతన్య కరణం కేవలం వయమ్.
శ్రీః శ్రీః శ్రీః