Sri Scanda Mahapuranamu-I    Chapters    

ఇరువది ఆరవ అధ్యాయము

అటు తరువాత మేరుపు మొదలగు పర్వతశ్రేష్టులు సంభ్రమముతో ఒక్కమారుగా హిమవంతునితో నిట్లనిరి.(1)పర్వతరాజా| నీ భాగ్యముచే మహాత్ముడగు శివుడు నీకు లభించినాడు మనసులో విమర్శను సేయక ఈశ్వరునికి నీ కన్యను దానమిమ్ము(2) అని తన మిత్రులు పలుకగా బ్రహ్మ ప్రేరేపించగా హిమాలయుడు సంకల్పము చేసేను (3)ఓ పర్వమేశ్వరా! నీకీ కన్యను నేను దానమిచ్చుచుంటిని భార్యగా గ్రహించుము. అని ఈ మంత్రముచే నొసంగెను. దేవదేవుడు మహాత్ముడగు శివునకు గిరీంద్రుడు కన్యాదానము చేసును.(4)అటుపిమ్మట, అందమైన కన్నులుగల పార్వతీ పరమేశ్వరులను వేదిక బయటకు తీసికొనివచ్చి, బయట వేదికవై ఆసీనుల జేసిరి.(5) మహాత్ముడగు కశ్యపుడు ఆచార్యుడై హవనము కొఱకు అగ్నినాహ్వానించెను(6)అపుడు బ్రహ్మ కమలాసనము పై కూర్చొని శివుని వద్దనుండెను హవనము కొనసాగుచుండగా విజ్ఞులగు ఋషులు అనేక దర్శనముల జ్ఞానముగలవారు,వేదవాదమున ఆసక్తిగలవారు సమ్మతముతో పరస్పరము ఇట్లు మాట్లాడుకొనిరి(8)

ఇత్యేవం బ్రువతాం శబ్ద: శ్రూయతే శివసన్నిధౌ| స్వకీయం మతమాస్థాయ హ్యబ్రువంస్తే కేవలం వేదబుద్దయ:10

తేషాం తద్వచనం శ్రుత్వా పరస్పరజయైషిణామ్‌| ప్రవాస్య నారదో వాక్యమువాచ శివసన్నిధౌ||11

యూయం సర్వే వాదినశ్చ వేదవాదరతాస్తథా| మౌనమాస్థాయ భో విప్రా హృది కృత్య సదాశివమ్‌||12

ఆత్మానం పరమాత్మానం పరాణాం పరమం చతత్‌ యేనేదం కారితం విశ్వం యత: సర్వం ప్రవర్తతే|| యస్మిన్నిలీయతే విశ్వం తస్మే సర్వాత్మనే నమ:||13

సోzయమాస్తేzధునా గేహే పర్వతేంద్రస్య భో ద్విజా| ముఖాదసై#్యవ సంజాతా సర్వే యూయంవిచక్షణా:||14

ఏవముక్తాస్తదా తేన నారదేన ద్విజోత్తమా:| ఉపదేశకరైర్వాక్యైర్భోధితాస్తే ద్విజోత్తమా:||15

ఇది ఈ విధంగానేనా మరోక విధంగా జరుగవలెనా?ఇట్లే చేయవలెనా? చేయ కూడదా? (9) అని కార్యాకార్య మీమాంసను చేయుచుండగా శివుని సన్నిధిన కోలాహలము వినబడినది. తత్త్వజ్ఞానము లేక కేవలం వేదముల శబ్దజ్ఞానముగల వారంతా తమ తమ మతముల ననుసరించి మాట్లడసాగిరి.(10) ఒకరినొకరు జయింపగోరుచూ వారట్లు మాట్లడుకుంటున్నంతలో శివుని వద్దనున్న నారదుడు నవ్వుచూ వారితోనిట్లనెను(11)మీరంతా వాదశీలురు, వేదవాదమం దాసక్తి గలవారు ఓ బ్రాహ్మణులారా! మౌనము నాశ్రయించుడు హృదయమున సదాశివుని నిలుపుకొనుడు (12) విశ్వముఎవరిచే సృజింపబడి ఎవరిచే ప్రవరిస్తూ ఎవరియందు లయించుచున్నదో అట్టి పరమాత్మ సర్వాత్మయగు సదాశివునకు నమస్కారము(13) అట్టి పరమశివుడిపుడు పర్వతేంద్రుని ఇంటువున్నాడు ఓ బ్రహ్మణులారా! విజ్ఞులైన మీరందరూ పరమశివుని ముఖమునుండే జన్మించినారు (14) అని నారదుడు ఉపదేశము నిచ్చు వాక్యములతో ఆ ద్విజోత్తములకు కనువిప్పు కలిగించెను(15)

వర్తమానే చ యజ్ఞే చ బ్రహ్మ లోకపితామహ | దదర్శ చరణౌ దేవ్యా నఖేందుం చ మనోహరమ్‌||16

దర్శనాత్‌ స్ఖలిత: సద్యో బభూవాంబుజసంభవ: మదనేన సమావిష్టో వీర్యం చ ప్రాచ్యవద్భువి||17

రేతసా క్షరమాణన లజ్ఞితోzభూత్పితామహ: చరణాభ్యాం మమర్దాzథ మహద్గోప్యం దురత్యయమ్‌||18

బహవశ్చర్షయో జాతా వాలఖిల్యా: సహస్రశ: ఉపతస్థుస్తదా సర్వే తాత తాతేతి చాబ్రువన్‌||19

నారదేన తదోక్తాస్తే వాలఖిల్యా: ప్రకోపినా| గచ్చంతు వటవో యాయం పర్వతం గంధమాదనమ్‌||20

న స్థాతవ్యం భవద్భిశ్చ భవతాం న ప్రయోజనమ్‌ ఇత్యేవముకాస్తే సర్వే వాలఖిల్యాశ్చ పర్వతమ్‌| నారదేన సమాదిష్టా యము సర్వే త్వరాన్వితా:||21

నారదేన తతో బ్రహ్మాశ్వాసితో వచనై: శుబై తావచ్చ హవనం పూర్ణం జాతం తస్య మహాత్మన:22

మహేశస్య తథా విప్రా శాంతిపారపరాబభు:| బ్రహ్మఘెషేణ మహతా వ్యాప్తమాసీద్దిగంతరమ్‌||23

యజ్ఞమట్టు కొనసాగుచుండగా లోకపితామహుడగు బ్రహ్మ దేవి చరణములను మనోహరమైన కాలిగొటి కాంతిని చూచెను.

(16)చూచినంతనే మనసు చెదురుటచే మన్మథుడు అవేశింపగా వీర్యము స్థలించి భూమిపై బడెను(17)రేతసట్లు స్రవించుచుండగా పితామహుడు సిగ్గిలెను అతిరహస్యముగా దానిని కాళ్ళచే మర్ధించెను(18) అపుడు వాలఖిల్యులగు ఋషులు వేలకొలదిగా జన్మించి ఎదుట నిలిచి పితామహుని తండ్రియని సంభోధించిరి (19) అపుడు నారదుడు మిగులు కోపించి వారితో ఇట్లునెను వటులారా! మీరంతా గంధమాదన పర్వతమునకు వెళ్ళండి (20) ఇక్కడ మీరు నిలువరాదు.మీకు ప్రయోజనమేమీలేదు అని నారదుడాదేశించగా వాలఖిల్యులగు ఋషులందరు త్వరగా గంధమాదనమునకు వెళ్లిపోయిరి (21) అటుపిమ్మట నారదుడు బ్రహ్మను శుభవాక్కుచే ఓదార్చెను ఇంతలో హవనముకూడా పూర్తినొందెను (22) విప్రులందరూ మహేశ్వరునికి శాంతిపాఠముల చెప్పుచుండగావేదఘోష దిగంతరాలు వ్యాపించెను.(23)

తతో నీరాజితో దేవో పత్నీభిరుత్తమ: తథైవ ఋషివత్నీభిరర్చిత: పూజితస్తథా|| 24

తథా గిరీంద్రస్య మనోరమా: శుభా నీరాజయామాసురథైవ యోషిత:|

గీతై : సుగీతజ్ఞవిశారదాశ్చ తథైవ చాన్యే స్తుతిభిర్మహర్షయ:||25

రత్నాని చ మహార్హాణి దదౌతేభ్యో మహామనా: హిమాలయో మహాశైల సంహృష్ఠ పరితోషయన్‌||26

బభౌతదానీం సురసిద్దసంఘైర్వేద్యాం స్థితోzసౌ సకళత్రకో విభు: సర్వైరుపేతో నిజపార్షదైర్గణౖ: ప్రహృష్టచేతా జగదేకసుందర:|| 27

ఏతస్మిన్నంతరే తత్ర బ్రహ్మవిష్ణుపురోగమా: ఋషిగంధర్వయక్షాశ్చ యేzన్యేతత్ర సమాగతా:28

సర్వాన్సమభ్చర్చ్య తదా మహాత్మా మహాన్గిరీశ: పరమేణ వర్చసా| సద్రత్నవస్త్రాభరణాని సమ్యగ్దదౌ చ తాంబూలసుగంధవార్యపి|| 29

తదా శివం పురస్కృత్యాభ్యవజహ్రు: సురేశ్వరా: తథాసర్వే మిలిత్వా తు ఐకపద్యేన మోదితా:||30

పంక్తీభూతాశ్చ బుభుజుర్లింగినా శృంగిణా సహ| కేచిద్గణా పృథగ్భూతా నానాహాస్యరసైర్విభుమ్‌||31

అతోషయన్నారదాద్యా: అనేకాలీకసంయుతా:| తథా చండీగణాస్సర్వే బుభజు: కృతభాజనా:||32

అటుపిమ్మట దేవపత్నులు ,ఋషిపత్నులు ఉత్తముడగు దేవదేవునికి నీరాజనమిచ్చి పూజించిరి(24) అట్లే అందమైనకల్యాణీనీ స్త్రీలు నీరాజనమిచ్చిరి. చక్కని గీతజ్ఞానముగలవారు గీతములచే మహార్షులు స్తుతులచే నీరాజనమిచ్చిరి (25) గొప్పమనస్సుగల తాను సంతోషించి వారిని కూడా సంతోషపరుచుచూ, వారికి గొప్పవిలువైన రత్నములనిచ్చెను.(26) అపుడు సంతోషముతోనున్న జగదేక సుందరుడగు శివుడు భార్యతో, సురసిద్దగణాలతో, తన సభ్యుల గణములతో కూడిన వాడై ప్రకాశించెను(27) ఇంతలో బ్రహ్మ విష్ణు మొదలగు వారు ఋషులు గంధర్వులు, యక్షులు, ఇతరులు అక్కడికి వచ్చిరి(28)హిమవంతుడు వారినందరినీ చక్కగా గౌరవించి, విలువైన రత్నాభరణాలను, వస్త్రములను, తాంబూల,సుగంధజలము (పన్నీరు)నిచ్చెను. (29) అపుడు దేవతోత్తములు శివుని గూర్చి అందరూ కలిసి సంతోషముతో భోజనముచేసిరి (30)లింగి,శృంగి మొదలగు వారితో కలిసి వరుసలో కూర్చొని భుజించిరి మరికోన్ని గణములు విడిగా అనేక హాస్యములతో శివుని సంతోషపరిచెను.(31) నారదాదులు అనేకంగా అసమంజస భాషణము చేయుచూ శివుని సంతోషపరిచిరి అట్లే చండీ గణములన్నీ సపాత్రులై భుజించెను.(32)వైతాళా: క్షేత్రపాలాశ్చ బుభుజు: కృతభాజనా: శాకినీ డాకినీ చైవ యక్షిణ్యో మాతృకాదయ:33

యోగిన్యోథ చతు:షష్టిర్యోగినో హితథా పరే| దశకోటయో గణానాం చ కోట్యేకా చ మహాత్మనామ్‌ ||34

ఏవం తు ఋషయ: సర్వే తథాన్యే విబుధాదయ: యోగినో హిమయా చాన్యే కథితా: పూర్మమేవ హి||35

యోగిన్యశ్చైవ కథితాస్తాసాం భక్ష్యం వదామి ఖడ్గానాం కేచిదానీయం క్రవ్యం పవిత్రమేవ చ||36

భుంజింతి చాస్థిసంయుక్తం తథాంత్రాణి బుభుక్షితా: ఆనీయ కేచిచ్చీర్షాణి మహాషాణాం గురూణి చ|| 37

తథా కేచిన్నృత్యమానాస్తదానీం రోరూయ్యమాణా: ప్రమథాశ్చైవ చాన్యే |

కేచిత్తూష్ణిమాస్థితా రుద్రరూపా పరే చాన్యాంల్లోకమానాస్తథైవ|| 38

యోగినీచక్రమద్యస్థో భైరవో హి ననర్తచ| తథాన్యే భూతవేతాళా మామేత్యేవం ప్రలాపిన:|| 39

ఏవం తేషాముద్భవం హి నిరీక్ష్య మధుసూదన ఉవాచ ప్రవాసన్వాక్యం శంకరం లోకశంకరమ్‌||40

వేతాళురు క్షేత్ర పాలురు, శాకినీడాకినీ మొదలగు యక్షిణులు, మాతృకాదులు సపాత్రులై భుజించిరి(33) అరువదినాలుగు యోగినులు, పదికోట్ల యోగులు , మహాత్ములగు గణముల ఒకకొటి భుజించిరి (34) ఇట్టి ఋషులు, దేవతలు ,యోగులు వీరిని గూర్చి మునుపే నేను చెప్పితిని (35) యోగినుల గూర్చి చెప్పితిని కదా! ఇకవారు భుజించుదాని గూర్చి చెప్పెదను వారిలో కొందరు ఖడ్గ మృగములు పవిత్ర కవ్యమునుదెచ్చి (36) ఎముకలతో కూడ తినుచుందురు అట్లే ఆకలిగోనినపుడు ప్రేవులను, ఎనుముల పెద్దతలలను దెచ్చి తినుచుందురు.(37) ప్రమథులలో కొందరు నర్తించుచుండగా , మరికొందరు గట్టిగా అరచుచుండిరి. మరికొందరు నిశ్శబ్దముగా నుండగా ,కొందరు ఇతరులను చూచుచుండిరి (38) ఇక భైరవుడు యోగినుల గుంపు మధ్యనుండి నాట్యము జేసెను అట్లే ఇతర భూత వేతాళములు వద్దు వద్దు అంటూ అరుస్తూవుండిరి (39) వారందరి సందడిని చూచి విష్ణువు నవ్వుచూ శంకరునితో నిట్లనెను.(40)

ఏతాన్గణాన్వారయ భో అత్ర మత్తాంశ్చ సంప్రతి అస్మిన్కాలే చ యత్కార్యం సర్వైస్తత్కార్యమేవ చ||41

పాండిత్యేన మహాదేవ తస్మాదేతాన్నివారయ | తచ్చృత్వా భగవాన్రుద్రో వీరభద్రమువాచ హ||42

రుద్ర ఉవాచ:

వారయస్వ ప్రమత్తాంశ్చ క్షీబాంశ్చైవ విశేషత: | తేనోక్తో వీరభద్రశ్చ శంభునా పరమేష్టినా||43

ఆజ్ఞాపితా: ప్రమత్తాశ్చ వీరభ##ద్రేణ ధీమతా ప్రమథా వారితస్తేన తూష్ణిమాశ్రిత్య తే స్థితా:||44

నిశ్చలా యోగినీ మధ్యే భూతప్రమథగువ్యాకా: శాకిన్యో యాతుధానాశ్చ కూష్మాండా: కోపికర్పటా:||45

తథాన్యే భూతవేతాళా: క్షేత్రపాలాశ్చ భైరవా : సర్వే శాంతా: ప్రమత్తాశ్చ బభూవు : ప్రమథాదయ:||46

ఏవం విస్తారసం యుక్తం కృతముద్వహనం తదా| హిమాద్రిణా పరం విప్రా సుమంగల్యం సుశోభనమ్‌|| 47

చత్వారో దివసా జాతా: పరిపూర్ఱేన చేతసా | హిమాద్రిణా కృతా పూజా దేవదేవస్య శూలిన ||48

వస్త్రాలంకారాభరణౖ రత్నైరుచ్చావచైస్తత:| పూజయిత్వా మహాదేవ విష్ణోర్వచనపరోబవత్‌|49

శివా| మత్తిల్లిన ఈ గణములనను వారించుము ఈ సమయమున చేయవలసినది పాండిత్యముచేతనే చేయవలెను కనుక వీరిని వారించుముఅనగా రుద్రుడు వీరభద్రునితోనిట్లనెను(42) మదించి మద్యపానముచేసిన వీరిని వారించుము అనగా వీరభద్రుడు వారిని వారించగా వారు మిన్నకుండిరి(43, 44) యోగినుల భూత, ప్రమథ, గుహ్యకులు,శాకినులు, యాతుధానులు, కుష్మాండుట, కోపికర్పటులంతా కదలకుండా నిలిచిరి.(45) భూతవేతాళములు , క్షేత్రపాలురు, భైరవులు, ప్రమథాదులంతా శాంతులైరి (46) ఇట్లు గొప్ప విస్తారముగలదైన వివాహము. హిమవంతుడిచే పరమమాంగళ్యయుక్తముగా చేయబడెను (47)ఇట్లు నాలుగు దినములు గడిచినవి హిమవంతుడుపరిపూర్ణమనస్సుతో దేవదేవుడగు పరమశివుని పూజించెను.(48) వస్త్రములు, అలంకారాభరణములు, రత్నములు మొదలగు వివిధ బహుకృతులతో మహాదేవుని అర్చించి విష్ణువు చెప్పినట్లు చేసెను(49)

లక్ష్మీసమేతం విష్ణుం చ వస్త్రాలంకరణౖ శుభై | పూజయామాస హిమవాంస్తథా బ్రహ్మాణమేవ చ||50

ఇంద్రం పురోధసా సార్థమింద్రాణ్యా సహితం విభుమ్‌ | తథైవ లోకపాలాంశ్చ పూజయిత్వా పృథక్పృథక్‌ ||51

తథైవ పూజితా చండి భూతప్రమథగుహ్యకై: వస్త్రాలంకరణౖశ్చైవ రత్నైర్నానావిదైరసి||

యే చాన్య ఆగతాస్తత్ర తేచ సర్వే ప్రపూజితా :52

ఏవం తదానీం ప్రతిపూజితాశ్చ దేవాశ్చ సర్వే ఋషయశ్చ యక్షా : గందర్వవిద్యాధరసిద్దచారణాస్తథైవ మర్త్యాప్సరసాం గణాశ్చ||53

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కేదారఖండే శివపార్వతీవివాహమంగళోత్సవవర్ణనం నామ షడ్వింశోzధ్యాయ:|

హిమవంతుడపుడు బ్రహ్మను . లక్ష్మీసమేతవిష్ణువును వస్త్రాలంకారాలతో పూజించెను.(50) ఇంద్రాణితో ఇంద్రుని, బృహస్పతి , లోకపాలురను విడివిడిగా పూజించెను(51) అదేవిధంగా . భూత ప్రమథ గుహ్యకులతో చండిని , వివాహమున కేతెంచిన ఇతరులనందరినీ వస్త్రాలంకరణములతో రత్నములతో పూజించెను (52)ఈ విధంగానే హిమవంతునిచే గంధర్వవిద్యాధర సిద్ది చారణులు, అప్సరములగణములు, ఋషులందరూ చక్కగా పూజింపబడిరి.

ఇది శ్రీ స్కాంద మహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందు కేదారఖండమున శివపార్వతీ వివాహమంగళోత్సవ వర్ణనమను ఇరువదియారవ అధ్యాయము

సప్తవింశోధ్యాయ:

లోమశ ఉవాచ:

తథైవ విష్ణునా సర్వే పర్వతాశ్చ ప్రపూజితా :| సహ్యాచలశ్చ వింధ్యశ్చై మైనాకో గంధమాదన:||1

మాల్యవాన్మలయశ్చైవ మహేంద్రో మందరస్తథా | మేరుశ్చవ ప్రయత్నేన పూజితో విష్ణునా తదా||2

శ్వేత: కృత :శ్వేతగిరిర్నీలాద్రిశ్చ తథైవ చ || ఉదయాద్రిశ్చ శృంగశ్చ అస్తాచలవరో మహాన్‌||3

మానసాద్రిస్తథా శైల పూజిత: పర్వతోత్తమ: లోకాలోకస్తథా శైల: పూజిత పరమేష్టినా||4

ఏవం తే పర్వతశ్రేష్ఠా పూజితా సర్వ ఏవ హి తథాన్యే పూజితాస్తేన సర్వే పర్వతవాసిన:||5

విష్ణుణా బ్రహ్మణా సార్దం కృతం సర్వం యథోచితమ్‌ అన్యేహని చ సంప్రాప్తే వరయాత్రా కృతా తథా||6

హిమాద్రిణా బంధుభిశ్చ పర్వతం గంధమాదనమ్‌| యయు: సర్వే సురగణా గణాశ్చ బహవస్తథా||7

ప్రమథాశ్చ తథా సర్వేతథా చండీగణా: సరే యే చాన్యే బహవస్తత్ర సమాయాతా హిమాలయమ్‌||8

శివస్యోద్వహనం విప్రా: శివేన పరిభావితా: పరం హర్షం సమాపన్నా దృష్ట్వా తౌ దంపతీ తదా|| 9

ఇరవై ఏడవ అధ్యాయము

లెమశుడు చెప్పెను అట్లే విష్ణువు, సహ్యాద్రి , వింధ్యాద్రి , మైనాకపర్వతము, గంధమాదనము, మాల్యవంతుడు, మలయపర్వతము, మహేంద్ర పర్వతము, మందరపర్వతము మేరుపర్వతము అను పర్వతములనన్నింటినీ పూజించెను (1,2) అట్లే పరమేష్టి శ్వేతగిరి, నీలాద్రి, ఉదయాద్రి, అస్తాద్రి, మానసాద్రి కైలాసాద్రి, లోకాలోకపర్వతములను పూజించెను. (3,4) ఈ విధముగా పర్వతశ్రేష్టములనన్నంటినీ పర్వతవాసులనందరినీ అతను పూజించెను (5) ఉచితమైన దానిని బ్రహ్మతో గూడి విష్ణువు ఆచరించెను మరునాడు, వరయాత్రను చేసిరి (6) అనేక సురగణములు మరియు ఇతరగణములు హిమవత్పర్వతములో తక్కిన బందువులతో కలిసి గంధమాదన పర్వతము వద్దకు బయలుదేరిరి.(7) ప్రమథ గణములు చండీ గణములు మొదలగునవి హిమాలయుని వచ్చి చేరిరి (8) శివుని వివాహమును గూర్చి విప్రులు శివునిచే చక్కగా గౌరవించబడి మిగులు ఆనందముతో వారిద్దరినీ చూచిరి.(9)

పార్వతీసహిత: శంభు: శంభునా సహ పార్వతీ | పుష్పగంధౌ యధా స్యాతాం వాగర్థానివ తత్త్వత:||10

తథా ప్రకృతిపుంసౌ చ ఐకపద్యేన నాన్యథా| దంపతీ తౌ గజారూఢా శుశుభాతే మహాప్రభౌ||11

విమానస్థస్తదా బ్రహ్మా విష్ణుశ్చ గరుడోపరి ఐరావతగతశ్చేంద: కుబేర: పుష్పకోపరి||12

పాశీ చ మకరారూడో యమో మహిషేన చ|| ప్రేతారూఢో నైరృత: స్యాదగ్నిర్చస్తగతో మహాన్‌13

మృగారూఢోzథ పవన ఈశో వృషభ##మేవచ ఇత్యేవం లోకపాలాశ్చ సగ్రహా: పరమేష్టిన:||14

సై#్వ:సై#్వర్చలై: పరిక్రాంతాస్తథాన్యే ప్రమధాదయ :| హిమాద్రిశ్చ మహాశైల ఋషభో గంధమాదన:||15

సహ్యాచలో నీలగిరిర్మందరో మలయాచల: కైలాసో హి మహాతేజా మైనాకశ్చ మహాప్రభ:||16

ఏతే చాన్యే చ గిరియ : శ్రీమంతో హి మహాప్రభా: సకలత్రాశ్చ తే సర్వే సమతాశ్చ మనోరమా:||17

బలినో రూపిణి సర్వే మేర్వాద్యాస్తత్ర పర్వతా వరయాత్రాప్రసంగేన శివార్చనపరా అభవన్‌||18

పార్వతితో శివుడు, శివునితో పార్వతి పుష్పము దాని సుగంధమువలె, వాక్కు దాని అర్థము వలెనుండిరి(10) అట్లే ప్రకృతి, పురుషులవలె నుండిరి వేరొక విధంగా కాదు ఏనుగునెక్కిన ఆ దంపతులు గొప్ప తేజస్సుతో ప్రకాశించిరి.(11)బ్రహ్మ విమానము నెక్కి విష్ణువు గరుడని అధిరోహించి, ఇంద్రుడు ఐరావతము నెకకి కుబేరుడు పుష్పకమునెక్కి (12) వరుణుడుమొసలినెక్కి యముడు మహిషమునెక్కి నైరృతుడు ప్రేతమునెక్కి , అగ్ని అజమునెక్కి, వాయువు జింకనెక్కి , ఈశానుడు వృషభమునెక్కి యుండిరి, ఇట్లు ఆయా లోకపాలురు గ్రహాలతో గూడి తమ తమ బలములతో కూడుకొనిన వారైయుండిరి. ఇట్లే ప్రమాధాది గణములు కూడా వుండెను. హిమాచలము,ఋషభుడు గంధమాదనము, సహ్యాద్రి నీలాద్రి, మందరగిరి మలయాద్రి, కైలాసము మైనాకము(16)మరియు ఇతర కాంతివంతములైన పర్వతములు తమ తమ భార్యలతో, పుత్రులతో యుండిరి.(17)మేరుపు మొదలగుపర్వతములు అందరూ బలము గలవారు, సుందరరూపవంతులై వరయాత్రా ప్రసంగమున శివుని అర్చించుటలో మునిగిరి(18)

నందినా హ్యుపవిష్టాస్తే మేర్వాద్యాస్తత్ర పర్వతా :| వరయాత్రా కృతా తేన యథోక్తా చ హిమాద్రిణా || సర్వైసైర్భంధుబి: సార్దం పునరాగమనం కృతమ్‌ ||19

శివసంపర్కజేనైవ మహసా పరమేణ చ | విఖ్యాతో హి మహాశైలస్త్రిషు లోకేషు విశ్రుత:|20

కన్యాదానేన మహతా తుష్టో యస్వ చ శంకర: తే ధన్యాస్తే మహాత్మాన: కృతకృతాస్తథైవ చ| 21

ద్వక్షరం నామ యేషాం చ జిహ్యాగ్రే సంస్థితం సదా | శివేతి ద్వ్యక్షరం నామ యైర్హృదీరితమద్య వై||22

కించిద్దానేన సంతుష్ట: పత్రేణాపి తథైవ చ తోయేనాపి సంతుష్టో మహాదేవో నిరంతరమ్‌||23

పత్రేణ పుష్పేణ తథా జలేన ప్రీతో భవత్యేష సదాశివో హి| తస్మాచ్చ సర్వై: ప్రతిపూజనీయ :శివో మహాభాగ్యకరో నృణామిహ||24

ఏకో మహన్జ్యోతిరజ: పరేశ: పరాపరాణాం పరమో మహాత్మా ||నిరంతరో నిర్వకారో నిరీశో నిరాబాధో నిర్వికల్పో నిరీహ:||25

నిరంజనో నిత్యరూపో నిరోధో నిత్యానన్దో నిత్యముక్త సదైవ

ఏవం భూతో దేవదేవోర్చితశ్చ తైర్దేవాద్యైర్విశ్వవేద్యో భవశ్చ||

స్తుతో ద్యాత: పూజితశ్చింతితశ్చ సర్వజ్ఞోసౌ సర్వదా సర్వదశ్చ|| 26

నంది వారినందరినీ ఆసీనులను చేయగా, హిమవంతుడు యథోక్తముగా వరయాత్రను చేసి, బంధువులందరితో మరలివచ్చెను.(19) తన నివాసమున హిమవంతుడు మిక్కిలి శోభాయుతుడాయెను పరమశివుని సంపర్కముతో కలిగిన గోప్పదనముతో అతను మహాశైలుడు ముల్లోకముల వాసికెక్కను.(20) హిమవంతుని కన్యాదానముచే శివుడు సంతోషించెను.రెండక్షరాల పేరు నాలుక చివర ఎల్లప్పుడూ వుండువారు నిజముగా ధన్యులు మహాత్ములు , కృతార్థులు శివ అనురెండక్షరాల పేరును హృదయమున పలుకువారు మనుష్యరూపమున నున్న రుద్రులనుటలో సంశయములేదు.(21, 22) ఏ కొంచెము దానమిచ్చిననూ పత్రము నీరు ఇచ్చిననూ శివుడు ఎల్లప్పుడు సంతోషించును. (23) పత్ర, పుష్ప, ఫల, జలాదులతోసదాశివుడెల్లప్పుడూ తృప్తి చెందును గావున మహాభాగ్యము నిచ్చు శివుని అందరూ పూజించవలెను (24)శివుడు ఒక గొప్పప్రకాశము, జన్మలేనివాడు ప్రభువు, పరాపరముల దాటియున్న మహాత్ముడు అద్వితీయుడు కూటస్థుడు,నిరీశుడు,నిరాబాధుడు, నిర్వికల్పుడు, అప్తకాముడు.(25) అతను నిరంజనుడు , నిత్యరూపుడు, నిరోధుడు, నిత్యానన్ధుడు, నిత్యనన్ధుడు నిత్యముకూడా ఇట్టి విశ్వవేద్యుడు భవుడగు శివుని దేవాదులు అర్చించిరి ,ధ్యానించిరి పూజించిరి , చింతించిరి. శివుడు ఎల్లప్పుడూ అన్నింటినీ ఇచ్చువాడు (26)

యథా వరిష్టో హిమవాన్ర్పసిద్ద సర్వైర్గుణౖ సర్వగుణో మహాత్మా| విశ్వేశవందో హితదా హిమాలయో జాతో గిరీణాం ప్రవరస్తదానీమ్‌||27

మేనయా సహ ధర్మాత్మ యథాస్థానగతస్తత: సర్వాన్విసర్జయామాస పర్వతాన్పర్వతేశ్వర:|| 28

గతేషు తేషు హిమావాన్పుత్రై: పౌత్రై: ప్రపౌత్ర కై: రాజా గిరీణాం ప్రవరో మహాదేవప్రసాదత:||29

అథో గిరిజయా సార్దం మహేశో గంధమాదనే ఏకాంతే చ మతిం చక్రే రమణార్థం స్వరూపవాన్‌||30

సురతేనైవ మహతా తపసా హిసమాగమే| ద్వయో: సురతమారబ్దం తద్ద్వయోశ్చ తదాభవత్‌||31

అనిష్టం మహదాశ్చర్యం ప్రళయోపమమేవ చ | తస్మిన్మహారతే ప్రాప్తే నావిందంత సుఖం పరమ్‌||32

సర్వే బ్రహ్మాదయో దేవా: కార్యా కార్యావ్యవస్థితౌ| రేతసాచ జగత్సర్వం నష్టం స్ధావరజంగమమ్‌||33

సస్మార చాగ్నిం బ్రహ్మా చ విష్ణుశ్చాధ్యాత దాయక: మనసా సంస్మృత: సద్యో జగామాగ్నిస్త్యరాన్విత:||34

తాభ్యాం సంప్రేషితో పశ్యద్రుచిరం శివమందిరమ్‌| ద్వారి స్థితం నందినం చ దదర్శాగ్రే మహాప్రభమ్‌||35

అన్ని గుణములచే ప్రసిద్దుడగు ఉత్తముడైన హిమవంతుని పరమశివుడు కూడా స్తుతించెను (27) అటుపిమ్మట ధర్మాత్ముడగు హిమవంతుడు తన నిలయమున వివాహమునకు విచ్చేసిన పర్వతములందరికీ వీడ్కోలు చెప్పెను(28)వారందరూ వెళ్ళిపోగా గిరిరాజుగు హిమవంతుడు పుత్ర,పౌత్ర, ప్రపౌత్రులతో మహాదేవుని యను గ్ర

హమును నుండెను (29) ఇక, పరమశివుడు గంధమాదన పర్వతము పై పార్వతితో యుండి, ఏకాంతమున రమించు కోరికను పొందెను. (30) సురతమును గొప్ప తపస్సు వంటి సమాగమమును వారట్లు కొనసాగించిరి (31) వారిద్దరి వలన గొప్ప ఆశ్చర్యమును కలిగించునది ప్రళయమువంటిదీయగు అనిష్టము కలిగినది ఆ మహారతియందు ఇతర ఏ సుఖమునూ తెలియకుండిరి (32)బ్రహ్మాది దేవతలందరూ కార్యాకార్యవ్వవస్థితిని తెలియకుండిరి రతివలన రేతస్సుకలిగి చరాచర జగత్తంతా నశించిపోయెను(33) అపుడు బ్రహ్మ, విష్ణువు అగ్నిదేవుని స్మరించిరి. మనసులో స్మరించగనే అగ్ని త్వరగా ఎదుటనిలిచెను (34) బ్రహ్మ, విష్ణువు, అతనిని పంపగా అగ్నిదేవుడు శివమందిరమును చేరెను అచట ద్వారము వద్ద నిలిచి యున్న గొప్పకాంతివంతుడగు నందిని చూచెను(35)

అగ్నిర్హ్రస్వస్తదా భూత్వా కాశ్మీరసదృశచ్చవి: ప్రవిష్టోంత పురం శంభోర్నానాశ్చర్యసమన్వితమ్‌||36

అనేకరత్నసంవీతం ప్రాసాదైశ్చ స్వలంకృతమ్‌| తదంగణమును ప్రాప్య ఉపవిశ్యాహ హన్యవాట్‌ ||37

పాణి పాత్రస్య మే హ్యంబ భిక్షాం దేహ్యవరోధత: తచ్చృత్వా వచనం తస్య పాణిపాత్రస్య బాలికా||38

యావద్దాతుం చ సారేభే భిక్షాం తసై#్మ తత: స్వయమ్‌| ఉత్థాయ సురతాత్తస్మాచ్చివో హి కుపితో భృశమ్‌||39

రుద్రస్త్రిశూలముద్యమ్య భైరవో హ్యభవత్తదా | నివారితో గిరిజయా వధాత్తస్మాచ్చివ స్వయమ్‌|| భిక్షాం తసై#్మ దదౌవాచా అగ్నయే జాతవేదసే||40

పాణౌ భిక్షాం గృహీత్వాథ ప్రత్యక్షం తేన చాగ్నినా భిక్షితా కుపితా తం వై శశాప గిరిజా తత:||41

రే భిక్షో భవితా శాపాత్సర్వభక్షో మమాశు వై| అనేన రేతసా సద్య: పీడాం ప్రాప్స్యసి సర్వత:||42

ఇత్యుక్తో భక్షయిత్వాగ్నీ రేత ఈశస్య హవ్యవాట్‌ | యత్ర దేవా: స్థితాస్సర్వే బ్రహ్మాద్యాశ్త్చెవ సర్వశ:43

ఆగత్యాకథయత్సర్వం తద్రేతో భక్షణాదికమ్‌| సర్వే సగర్బా హ్యభవన్నింద్రాద్యా దేవతాగణా:||44

కాశ్మీర సమానకాంతిగల యగ్ని కురచగా మారి అనేక ఆశ్చర్యములతో కూడిన శివుని అంతఃపురమును ప్రవేశించెను (36) ఆ అంతపురము అనేక రత్నములతో ప్రాసాదములతో అలంకరింపబడియుండెను దాని ప్రాంగణమును ప్రవేశించి అగ్ని ఇట్లనెను (36) పాత్ర చేతబూనిన (భిక్షుకుడైన) నాకు భిక్షనిమ్ము అనగా పార్వతి వినెను (38) విని భిక్షాదానమును స్వయముగా చేయబోగా సురతక్రీడనుండి లేచిన శివుడు మిగులకోపించెను.(39) వెంటనే త్రిశూలము నెత్తి భైరవుడిగా మారెను. అపుడు గిరిజ అగ్నిని వధించుట నుండి శివుని వారించి స్వయముగా అగ్నియే జాతవేదసే యని భిక్షనిచ్చెను (40)అంతచేతిలో భిక్షాపాత్రతో అగ్ని వెంటనే ప్రత్యక్షమాయెను. అపుడు కోపించిన పార్వతి అతనిని ఇట్లు శిపించెను.(41) ఓ భిక్షుకా! నా శాపముచే నీవు సర్వభక్షకుడవు అవగలవు శివుని రేతస్సుచే నీవిపుడు వెంటనే పీడను పొందెను (42)అని పార్వతి శపించగా హవ్యమునువహించు అగ్ని శివుని రేతస్సును భక్షించెను వెంటనే అతను బ్రహ్మది దేవతలు నిలిచియున్న చోటికి వచ్చి (43) శివుని రేతస్సును భక్షించుటను గూర్చి అంతా వివరించగా ఇంద్రాది దేవగణములన్ని గర్భముగలవాయెను (44) అగ్నేర్యథా హనిశ్చై సర్వేషాముపతిష్టతి| అగ్నేర్ముఖోద్భవేనైవ రేతసా తే సురేశ్వరా:||45

సగర్భా హ్యభవన్‌ సర్వే చింతయా చ ప్రపీడితాః | విష్ణుం శరణమాజగ్ముర్దేవదేవేశ్వరం ప్రభుమ్‌||46

దేవా ఊచు:

త్వం త్రాతా సర్వదేవానాం లోకానాం ప్రభురేవ చ | తస్మాద్రక్షా విధాతవ్యా శరణాగతవత్సల||47

వయం సర్వే మర్తుకామా రేతసానేన పీడితా :| అసురేభ్య : పరిత్రస్తా వయం సర్వే దివౌకస:||48

శరణం శంకరం యాతా పరిత్రాతుం కృతోద్వహా: యదా పుత్రో హి రుద్రస్య భవిష్యతి తదా వయమ్‌|| సుఖిన: స్యామ సర్వే వై నిర్భయాశ్చ త్రివిష్టమ్‌||49

ఏవం విష్టభ్యమానానాం సర్వేషాం భయమాగతమ్‌| అనేన రేతసా విష్ణో జీవితుం శక్యతే కథమ్‌||50

త్రివర్గో హి యథా పుంసాం కృతో హి సుపరిష్కృత:| విపరీతో భవత్యేవ వినా దేవేననాన్యథా||51

తస్మాత్తద్వై బలం మత్త్వా సర్వేషామపి దేహినామ్‌| కార్యాకార్యవస్ధాయాం సర్వే మన్యామహే వయమ్‌||52

తథా నిశమ్య దేవానాం పరేశ: పరిదేవనమ్‌ | ఉవాచ ప్రవాసన్వాక్యం దేవానాం దేవతారిహా||53

అగ్ని ద్వారా హవిస్సు అందరినీ చేరుటచే అగ్ని ముఖమునుండి యుద్భవించిన రేతస్సుచే దేవతోత్తములందరూ గర్భమును పొంది చింతాక్రాంతులైరి. వారందరూ జగదీశ్వరుడైన విష్ణువును శరణుజొచ్చిరి.(45,46) దేవతలనిరి శరణాగతవత్సలా! నీవు అందరు దేవతలరక్షకుడవు లోకములకు ప్రభువు కూడా కనుక రక్షణను కల్పించుము.(47) ఈ రేతస్సుచే పీడింపబడి మేమంతా మరణించదలిచితిమి. అసురులు బెదిరించగా మేము శంకరుని శరణు జొచ్చగా వివాహమాడెను రుద్రునికి పుత్రుడు జన్మించినపుడు మేము స్వర్గమున భయము లేక సుఖముగా ఉండెదమని అనుకుంటిమి.(49) ఈ విధంగా మేముండగా మాకందరికీ ఈ రేతస్సుచేత భయముత్పన్నమైనది.విష్ణుదేవా! ఇక జీవించుట ఎట్లు?(50) పురుషులకు త్రివర్గము సుపరిష్కృతమైనదిగా చేయబడినది. దేవతలు లేనిచో అది విపరీత మేయగును(51) కనుక అదే అందరు జీవుల బలమని తలచి మేము కార్యాకార్యవ్యవస్థను గూర్చి ఆలోచించుచుంటిమి. (52) అని దేవతలు తమ బాధను వ్యక్తపరచగా విని, దేవతలశత్రువులను నశింపజేయు విష్ణువు నవ్వుచూ ఇట్లనెను (53)

స్తూయతాం వై మహాదేవో మహేశ: కార్యగౌరవాత్‌||54

తథేతి గత్వాతే సర్వే దేవా విష్ణువురోగమా తథా బ్రహ్మాదయ : సర్వ ఈడిరే ఋషయో హరమ్‌ ||55

ఓం నమో భర్గాయ దేవాయ నీలకంఠాయ మీడుషే | త్రినేత్రాయ త్రివేదాయ లోకత్రితయధారిణ||56

త్రిస్వరాయ త్రిమాత్రాయ త్రివేదాయ త్రిమూర్తయే | త్రివర్గాయ త్రిధామాయ త్రిపదాయ త్రిశూలినే||57

త్రాహి త్రాహి మహాదేవ రేతసో జగత: పతే||58

బ్రహ్మణా తు స్తుతో యావత్తావద్దేవో వృషధ్వజ : ప్రాదుర్భభూవ తత్రైవ సురాణాం కార్యసిద్దయే||59

దృష్టస్తదానీం జగదేకబంధుర్మహాత్మభిర్దేవవరై: సుపూజిత:| సంస్తూయమానో వివిధైర్వచోభి : ప్రత్యగ్రూపై: శ్రుతిసమ్మతైశ్చ||60

స్తువతాం చైవ దేవానామువాచ పరమేశ్వర: త్రాసం కుర్వంతు మా సర్వే రేతసానేన పీడితా:||61

వమనం వై భవద్బిశ్చ కార్యమద్యైవ భో: సురా: తథేతి మత్వా తే సర్వే ఇంద్రాద్యా దేవతాగణా:||వేము సర్వే తదా విప్రాస్తద్రేత :శంకరస్య చ||62

ఐకపద్యేన తద్రేతో మహాపర్వతసన్నిభమ్‌ | తప్తచామీకరప్రఖ్యం బభూవ పరమాద్భుతమ్‌||63

కార్య గౌరవముచే మీరు మహాదేవుడైన మహేశుని స్తుతించండి (54) అనగా వారందరూ అట్లే అని తలిచి విష్ణువుతో సహా శివుని స్తుతించిరి (55) ఓం నమో భర్గాయ! దేవాయ! నీలకంఠాయ! మీడుషే! త్రినేత్రాయ! త్రివేదాయ! లోకత్రితయధిరిణ!(56) త్రిస్వరాయ! త్రిధామాయ! త్రిపదాయ! శూలినే! (57) అని స్తుతించి ఈ రేతస్సు నుండి రక్షించమని ప్రార్థించిరి.(58) బ్రహ్మస్తుతించిన వెంటనే వృషభద్వజుడైన శివుడు దేవతల పని సిద్దించుటకై ప్రత్యక్షమాయెను(59) దేవతోత్తములందరూ ఆ జగదేకబంధువుని చూచి, ప్రత్యగ్రూపములు శ్రుతి సమ్మతములైన వివిధ వాక్కులచే స్తుతించుచూ పూజించిరి (60) వారందరూ అట్లు స్తుతిచేయగా పరమేశ్వరుడు ఈ రేతస్సు నుండి భయపడరాదు.(61)దేవతలారా: మీరందరూ వెంటనే దానిని కక్కివేయండిఅనగా వారట్లే తలిచి శంకరుని రేతస్సును బయటకు కక్కివేసిరి(62)మహాపర్వతాకారమునున్న ఆ రేతస్సు మేలిమిబంగారు కాంతిలో పరమాద్భుతముగా నుండెను(63)

సర్వే చ సుఖినో జాతా ఇంద్రాద్యా దేవతాగణా: వినా హ్యగ్నిం చ తే సర్వే పరితుష్టాస్తదా భవత్‌! 64

తేనాగ్నినాపి చోక్తస్తు శంకరో లోకశంకర: | కిం మయాద్య మహాదేవ కర్తవ్యం దేవతావర||65

తద్ర్బూహి మే ప్రభోద్య త్వం యేనాహం సర్వదా సుఖీ| భవిష్యామి చ యేనాహం హవ్యవాహక:||66

తదోవాచ శివ: సాక్షాద్దేవానామిహ శృణ్వతామ్‌ రేతో విసృజ్యతాం యోనౌ తదాగ్ని: ప్రహసన్నివ||67

ఉవాచ శంకరం దేవం భవత్తేజో దురాసదమ్‌ | ఇదముల్బణవత్తేజో ధార్యతే ప్రాకృతై: కథమ్‌||68

తత: ప్రోవాచ భగవానగ్నిం ప్రతి మహేశ్వర: మాసి మాసి ప్రతప్తానాం దేహే తేజో విసృజ్యతామ్‌||69

తథేతి మత్త్వా వచనం మహాప్రభ: స జాతవేదా : పరమేణ వర్చసా| సముజ్జ్వలంస్తత్ర మహాప్రభావో బ్రాహ్మే ముహేర్తే హి స చోపవిష్ట:||70

తదా ప్రాత: సముత్థాయ పాత్ర: స్నానపరా: స్త్రీయ:| యయు: సదా ఋషీణాం చ సత్యస్తా: జాతవేదసమ్‌||71

దృష్ట్యా ప్రజ్వలితం తత్ర సర్వాస్తా: శీతకర్షితా: | తప్తుకామాస్తదా సర్వా హ్యరుంధత్యా నివారితా:||72

ఇంద్రాది దేవతాగణములన్నీ సుఖము నొందగా అగ్ని మాత్రము సంతోషించలేదు (64) అగ్ని కూడా లోకమంగళుడైన శివుని తన కర్తవ్యమేమిటని ప్రార్ధించెను. నేను దేనిచే దేవతలకు హవ్యమును వహించు వాడినయ్యెదను ఆమార్గమును తెలుపుమని అగ్ని ప్రార్ధించగా శివుడు దేవతలందరూ వినుచుండగా ఆ రేతస్సును యోనియందు విడువుమని అగ్నితో చెప్పెను అనగా అగ్ని నవ్వుచూ నీ తేజస్సు అతి మహత్తరమైనది దీనిని ప్రాకృతులెట్లు ధరించగలరు? (68) అనగా మహేశ్వరుడు అగ్నితో మరల ప్రతిమాసము తపించువారి దేహమున విడువుమని చెప్పెను(69) ఆ మాటలను విని అగ్ని గొప్ప వర్చస్సుతో జ్వలిస్తూ బ్రాహ్మీముహుర్తమున అసీనుడాయెను (70) ప్రొద్దుననే లేచిన ఋషిపత్నులు , సతులు, యగు స్త్రీలు స్నానమాడి అగ్నిని చేరిరి.(71) బాగా జ్వలిస్తున్న అగ్ని చూచి చలితో బాధపడుచున్న ఆ స్త్రీలందరూ కాచుకుందామని వెళ్ళబోగా అరుంధతి వారినాపెను(72)

తయా నివారితాశ్చాపి తాస్తేపు: కృత్తికా: స్వయమ్‌ | యావత్తేపుశ్చ తా : సర్వా రేతస: పరమాణవ:|| వివిశూ రోమకూపేషు తాసాం తత్రైవ సత్వరమ్‌||73

నీరేతోగ్ని స్తదా జాతో విశ్రాంత: స్వయమేవ హి||74

తతస్తా ఋషిభార్యా హి యము: స్వభవనం ప్రతి | ఋషిభిస్తు తదా శప్తా: కృత్తికా : ఖేచరాభవన్‌ | 75

తదానీమేవ తా సర్వా: వ్యభిచారేణ దు:ఖితా :| తత్ససర్జుస్తదా రేత: పృష్టే హిమవతో గిరే:||76

ఐకపద్యేన తద్రేతస్తప్తచామీకరప్రభమ్‌ | గంగాయాం చ తదా క్షిప్తం కీచకై: పరివేష్టితమ్‌ ||77

షణ్ముఖం బాలకం జ్ఞాత్వా సర్వే దేవా ముదాన్వితా: | గర్గేణోక్తాస్తదంతే వై సుఖేన హ్రియతామితి||78

శంభో: పుత్ర : ప్రసాదేవ సర్వో భవతి శాశ్వత: గంగాయా: పులినే జాత: కార్తికేయో మహాబల:||79

ఉపవిష్టోథ గాంగేయో హ్యహోరాత్రోపోషితస్తదా | శాఖో విశాఖో తిబల: షణ్ముభోసౌ మహాబల:||80

జాతో యదాzథ గంగాయాం షణ్ముఖ: శంకరాత్మజ: తదానీమేవ గిరిజా సంజాతా ప్రన్నుతస్తనీ||81

అరుందతి నివారిచినమా ఆస్త్రీలు స్వయముగా కాచుకొనిరి అంత రేతస్సుయొక్క పరమాణువులు అక్కడనే వారి రోమకూపములను ప్రవేశించెను (73) అపుడు అగ్ని రేతస్సులేనివాడై విశ్రాంతినొందెను (74) అటు తరువాత ఆ ఋషిపత్నులు తమ తమ భవనములకు వెళ్ళగా, ఋషులు వారిని శపించిరి, అంత ఆ కృత్తికలు ఆకాశచారిణులాయిరి,(75) అపుడే వారందరూ తమ వ్యభిచారమునకు దు:ఖించి శివుని రేతస్సును హిమవత్పపర్వతము వెనుక భాగమున విడిచిరి.(76) ఆ రేతస్సు ఒక్కమారుగా బంగారు వన్నెతో ప్రకాశించెను. గంగయందు విడవబడిన ఆ రేతస్సు వెదురుబొంగుల మధ్యనుండెను (77) అక్కడ ఆరుముఖములు గల బాలుడున్నాడని తెలిసి దేవతలు సంతోషించిరి. కాని తెమ్మని గర్గుడు పలికెను (78) శంభుని పుత్రుడైన ఇతని ప్రసాదముచే అంతా శాశ్వతమగును గంగానది ఇసుకలో లభించిన ఈ మహాబలుడు కార్తికేయుడు (79) ఇక్కడున్న ఈ బాలుడు రాత్రింబవళ్ళు ఉపవసించెను. శాఖుడు అతిబలుడు ఈ షణ్ముఖుడు (80) ఎప్పుడైతే గంగానదిన శివపుత్రుడు షణ్ముఖుడై అవతరించాడో అపుడే మాతృభావనతో పార్వతి చన్నులనుండి పాలుగారనారంభించెను.(81)

శివం నిరీక్ష్య సా ప్రాహ హే శంభో ప్రస్నవో మహాన్‌| సంజాతో మే మహాదేవ కిమర్థస్తన్నిరీక్ష్యతామ్‌|| సర్వజ్ఞోపి మహాదేవో హ్యబ్రవీత్తామథాజ్ఞవత్‌||82

నారదస్తత్ర చాగత్య ప్రోక్తవాన్జన్మ తస్యతత్‌| శివామ చ శివాయై చ పుత్రో జాతో హి సుందర:||83

తదాకర్ణ్య వచో విప్రా హర్షనిర్బరమానసా:| బభూవు: ప్రమధా: సర్వే గంధర్వా గీతతత్పరా:||84

అనేకాభి: పతాకాభిశ్చైలపల్లవతో రణౖ:| తథా విమానైర్బహుభిర్భభౌ ప్రజ్వలితో మహాన్‌|| పర్వత: పుత్రజననాచ్ఛంకరస్య మహాత్మన:||85

తదా సర్వే సురగణా ఋషయ: సిద్దచారణా! రక్షోగంధర్వయక్షాశ్చ అప్సరోగణసేవితా:||86

ఐకపద్యేన తే సర్వే సహితా : శంకరేణ తు| ద్రష్టుం గాంగేయమధికం జగ్ము : పులినసంస్థితమ్‌||87

తతో వృషభామారుహ్య య¸° గిరిజయా సహ| అన్యై: సమేతో భగవాన్సురైరింద్రాదిభిస్తదా|| 88

తదా శంఖాశ్చ భేర్యశ్చ నేదుస్తూర్ణాణ్యనేకశ:||89

శివుని చూచి పార్వతి ప్రభూ! నా స్తనములు స్రవించుచున్నది కారణమేమిటో తెలుసుకొనుము. అనగా సర్వజ్ఞడైన శివుడు తెలియని వానివలె పలికెను (82) అపుడక్కడకు వచ్చిన నారదుడు షణ్ముఖుని జన్మను గూర్చి చెప్పెను .శివపార్వతులకు సుందరపుత్రుడు జన్మించెను (83) అని నారదుడనగా విప్రులు, ప్రమథులు ఆనందముతో నుప్పొంగిన వారయెను గంధర్వులు గానము చేయసాగిరి. (84) మహాత్ముడగు శంకరునికి పుత్రుడు జన్మించుటచే పర్వతుడు అనేక పతాకాలతో , చిగురుటాకుల తోరణాలతో , అనేక విమానములతో ప్రకాశించెను.(85) అపుడు దేవగణములు, ఋషులు, సిద్దచారణులు,రక్షయక్షగంధర్వులు, అప్సరోగణములు అన్ని శంకరునితో కలిసి గంగానది బడ్డున యున్న షణ్ముఖుని చూచుటకు వెళ్ళిరి (86,87) అంతట , శివుడు పార్వతితో వృషభము నధిరోహించి , ఇంద్రాది దేవతలు వెంటరాగా బయలుదేరెను (88) అపుడు శంఖములను, భేరీ వాద్యములను , తూర్ణములను అనేక పర్యాయములు మ్రోగించిరి(89)

తదానీమేవ సర్వేశం వీరభద్రాదయో గణా: అన్వయు: కేళిసంరబ్దా నానావాదిత్రవాదకా:|| వాదయన్తశ్చ వాద్యాని తతాని వితతాని చ||90

కేచిన్నృత్యపరాస్తత్ర గాయకాశ్చ తథా పరే| స్తావకా: స్తూయమానాశ్చ చక్రుస్తే గుణకీర్తనమ్‌||91

ఏవం విధాస్తే సురసిద్దయక్షా గంధర్వవిద్యారపన్నగా హ్యమీ | శివేన సార్థం పరిహృష్టచిత్తా దృష్టుం యయుస్తం వరదం చ శాంకరీమ్‌||92

యావత్సమీక్షయామాసుర్గాంగేయం శంకరోపమమ్‌ |దదృశుస్తే మహత్తేజో వ్యాప్తమాసీజ్ఞగత్త్రయమ్‌ ||93

తత్తేజసా వృతం బాలం తప్తచామీకరప్రభమ్‌ | సుముఖం సుశ్రియా యుక్తం సునసం సుస్మితేక్షణమ్‌||94

చారుప్రసన్న వదనం తథా సర్వాంగ సుందరమ్‌| తం దృష్ట్యా మహాదాశ్చర్యం గాంగేయ ప్రధితాత్మకమ్‌||95

వవందిరే తదా బాలం కుమారం సూర్యవర్చసమ్‌ | ప్రమధాశ్చ గణా: సర్వే వీరభద్రాదయస్తథా||96

పరివార్యోపతస్థుస్తే వామదక్షిణభాగత:తథా బ్రహ్మా చ విష్ణుశ్చ ఇంద్రశ్చాపి సురైర్వృత:||97

అపుడు వీరభద్రాదిగణములు అనేక వాద్యములను మ్రోగించుచూ క్రీడను సలుపుచూ శివుని అనుసరించిరి వారు రంధ్రముగలవానిని రంధ్రములేనివానిని మ్రోగించుచుండిరి (91) వారిలో కొందరు నాట్యము చేయుచుండగా , కొందరు గానము చేయుచుండిరి కొందరు గుణకీర్తనము చేయుచూ స్తుతించుచుండిరి.(91) ఈ విధంగా సురసిద్ద యక్ష గంధర్వ, విద్యాధర, సర్పగణములన్నీ మిగుల ఆనందముతో షణ్ముఖుని చూచుటకై శివునితో కలిసి వెళ్ళిరి.(92) వారు శంకరుని వలెనున్న కార్తికేయుని చూచుచుండగా ఒక గొప్ప తేజస్సు కనబడెను. అది ముల్లోకముల నిండియుండెను.(93) చక్కని ముక్కు, ముఖము,తేజస్సు,నవ్వు గల ఆ బాలుని ఆ కాంతి కప్పియుండెను చక్కని నవ్వుతో ప్రసన్నంగా వున్న ఆ బాలుని సర్వాంగసుందరునిగా జూచివారు ఆశ్చర్యము నొందిరి.(95) అపుడు వారు సూర్యకాంతిగల బాలునికి నమస్కరించిరి(96) వారు ఆ బాలునికి ఇరుప్రక్కల చేరినిలిచిరి. బ్రహ్మ, విష్ణువులు కూడా దేవతలతో కూడి యుండిరి.(97)

ఋషుయో యక్షగంధర్వా : పరివార్య కుమారకమ్‌ దండవత్పతితా భూమౌ కేచిచ్చ నతకంధరా:||98

ప్రణము: శిరసా చాన్యే మత్వా స్వామినమవ్యయమ్‌| అవాద్యంత విచిత్రాణి వాదిత్రాణి మహోత్సవే|| ఏవమభ్యుదయే తస్మిన్నృషయ: శాంతిమపఠన్‌ ||99

ఏతస్మిన్నంతరే యాత: శంకరో గిరిజాపతి :| అవతీర్య వృషాచ్చీఘ్రం పార్వత్యా సహ సువ్రతా :||100

పుత్రం నిరైక్షత తదా జగదేకబంధు: ప్రీత్యా యుత: పరమయా సహ వై భవాన్యా| స్నేహాన్వితో భుజగభోగయుతో హి సాక్షాత్సర్వేశ్వర: పరివృత: ప్రమథై: ప్రహృష్ట:||101

ఉపగృహ్య గుహం తత్ర పార్వతీ జాతసంభ్రమా | ప్రస్నుతం పాయయామాస స్తనం స్నేహపరిప్లుతా||102

తదా నీరాజితో దేవై: సకళ##త్రైర్ముదాన్వితై: జయశ##బ్దేన మహతా వ్యాప్తమాసీన్నభస్తలమ్‌||103

ఋషయో బ్రహ్మఘోషేణ గీతేనైవ చ గాయకా : | వాద్యైశ్చ వాదకాశ్చైవ ఉపతస్థు: కుమారకమ్‌ ||104

స్వయం కమారోప్య తదా గిరీశ: కుమారకం తం ప్రభయా మహాప్రభమ్‌| బభౌ భవానీపతిరేవ సాక్షాచ్ర్చియా యుత: పుత్రవతాం వరిష్ఠ:||105

దంపతీ తౌ తదా తత్ర ఐకపద్యేన నందతు: అభిషిచ్యమాన ఋషిభిరావృత: సురసత్తమై:||106

ఋషులు , యక్షగంధర్వులు కుమారకుని చుట్టుముట్టి దండమువలె నేల పై బడి నమస్కరించిరి మరికొందరు తలవంచి నమస్కరించిరి.(98) అవ్వయుడగు స్వామియని దలిచిన మరికొందరు తలవంచి నమస్కరించిరి. ఆ మహోత్సవమున విచిత్ర వాద్యములు మ్రోగినవి ఇట్లు ఆ బాలుని అభ్యుదయమున ఋషులు శాంతిమంత్రములు పఠించిరి.(99) ఇంతలో శివుడు పార్వతితో అక్కడికి వచ్చి వృషభము పై నుండి వెంటనే క్రిందకు దిగెను.(100) జగదేకబంధువగు శివుడు , పార్వతితో కలిసి వచ్చి మిగుల ఆనందముతో తమ పుత్రుని కనులారా జాచెను సర్పాలంకారములు గల ఈశ్వరుని అపుడు ప్రమధగణములు చుట్టుముట్టగా అతను సంతోషించెను.(101) సంభ్రమముతో పార్వతి కార్తికేయుని దగ్గరకు తీసుకొని వాత్సల్యముతో తన పాలనివ్వసాగెను.(102) అపుడు దేవతలందరూ తమ తమ భార్యలతో సంతోషముగా నీరాజనమిచ్చిరి జయజయ శబ్దము మిన్నంటెను(103) ఋషులు బ్రహ్మఘోషచే , గాయకులు గానముచే, వాద్యకారులు వాద్యములచే, కుమారుని వచ్చి చేరిరి(104) అపుడు శివుడు కుమారుని ఒడిలో కూర్చోబెట్టి ప్రకాశించెను.(105) అపుడు శివపార్వతులిద్దరూ ఒక్కమారుగా ఆనందించిరి. ఋషులు దేవతోత్తములు బాలుని అభిషేకించిరి.(106)

కుమార: క్రీడయామాస ఉత్సంగే శంకరస్య ఛ| కంఠే స్థితం వాసుకిం చ పాణిభ్యాం సమపీడయత్‌ ||107

ముఖం ప్రపీడయిత్వాసౌ పాణీనగణయత్తదా | ఏకం త్రీణి దశాష్టౌ చ విపరీతక్రమేణ చ||108

ప్రవాస్య భగవాంఛంభురువాచ గిరిజాం తదా|| 109

మందస్మితేన చ తదా భగవాన్మహేశ: ప్రాప్తో మదం చ పరమాం గిరిజాసమేత:|

ప్రేవ్లూ సగద్గదగిరా జగదేకబంధుర్నోవాచ కించన తదా భువనైకభర్తా||110

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రధమే మాహేశ్వరఖండే

కేదారఖండే కార్తికేయస్వామికుమారోత్పత్తివర్ణనం నామ సప్తవింశోద్యాయ:

అట్టి ఆ బాలుడు శంకరుని ఒడిలో ఆడుకొనుచుండెను. శివుని కంఠమునందున్న వాసుకియను సర్పమునుతనచేతులతో బాధించుచుండెను(నొక్కుచుండెను)(107) ముఖమును మెలిదిప్పి చేతులను ఒకటి మూడు ,పది ఎనిమిది అని విపరీత క్రమములో లెక్కించుచుండెను.(108) అపుడుపరమశివుడది చూచి నవ్వుచూ పార్వతితో మాట్లాడెను. (109) మహేశ్వరుడు సంతోషమునొంది, ప్రేమతో, నగుమోముతో పార్వతిని చూచి గద్గదస్వరముతో ఏదీ చెప్పజాలడాయెను.(110)

ఇది శ్రీ స్కాందపురాణము మొదటి మాహేశ్వరఖండమున

కేదారఖండమున కార్తికేయస్వామికుమారోత్పత్తివర్ణనమను ఇరవయ్యేడవ అధ్యాయము

అష్టావింశోzధ్యాయ:

లోమశ ఉవాచ:-

కుమారం స్వాంకమారోప్య ఉవాచ జగదీశ్వర: | దేవాన్‌ ప్రతి తదా రుద్ర: సేంద్రాన్‌ భర్గ: ప్రతాపవాన్‌|| 1

కిం కార్యం కథ్యతాం దేవా: కుమారేణాధునా మమ| తదోచు సహితా సర్వే దేవం పశుపతిం ప్రతి||2

తారకాద్భయముత్నన్నం సర్వేషాం జగతాం విభో | త్రాతా త్వం జగతాం స్వామీ తస్మాత్త్రాణం విధీయతామ్‌|| 3

కుమారేణ హతోద్యైవ తారకో భవితా ప్రభో | తస్మాదద్యైవ యాస్యామస్తారకం హంతుముద్యతా:||4

తథేతి మత్వా సహసా నిర్జగ్ముస్తే తదా సురా:| కార్తికేయం పురస్కృత్య శంకరాత్మజమేవ హి||5

సర్వే మిళిత్వా సహసా బ్రహ్మవిష్ణువుపురోగమా: దేవానాముద్యమం శ్రుత్వా తారకోపి మహాబల :||6

సైన్యేన మహతా చైవ య¸° యోద్దుం సురాన్‌ ప్రతి | దేవైర్దృష్టం సమాయాతం తారకస్య మహద్బలమ్‌||7

తదా నభోగతా వాణీ హ్యువాచ పరిసాంత్వ్య తాన్‌| శాంకరీం చ పురస్కృత్య సర్వే యూయం ప్రతిష్టితా:||8

దైత్యాన్విజిత్య సంగ్రామే జయినో హి భవిష్యథ|| 9

ఇరవైఎనిమిదవ అధ్యాయము

లోమశుడిట్లు చెప్పెను కుమారుని ఒడిలో నుంచుకొని జగదీశ్వరుడు, ప్రతాపవంతుడగు శివుడు ఇంద్రాది దేవతలనడిగెను.(1) దేవతలారా! నా కుమారునితో నీకేమి పని అని అడుగగా దేవతలందరూ పశుపతితో నిట్లనిరి (2) ప్రభూ తారకుని నుండి మా అందరకు భయముత్పన్నమైనది జగత్తులన్నిటి రక్షకుడవు నీవే రక్షణ కల్పించవలెను(3) ఈ తారకుడు కుమారుని చేతనే నేడు చావగలడు. కనుక నేడు తారకుని వధించగోరి వెళ్ళెదము.(4)అని తలిచి దేవతలందరూ ఒక్కమారుగా శంకరునిపుత్రుడగు కుమారుని ముందుంచుకొని బయలుదేరిరి.(5) బ్రహ్మ విష్ణువు మొదలైన దేవతలందరూ అట్లు కలిసి బయలుదేరగా వారి ప్రయత్నమునుగూర్చి వినిన మహాబలుడు తారకుడు దేవతలతో యద్దము చేయుటకు గొప్ప సైన్యముతో బయలుదేరెను దేవతలందరూ ఆ గొప్ప బలమును చూచిరి (6) అపుడు వారందరినీ ఓదార్చుచూ ఆకాశవాణి ఇట్లనెను మీరందరూ శక్తిని ముందిడుకొని ప్రతిష్టింపబడినారు కనుక దైత్యులను యుద్దములో మీరు జయించగలరు(9) వాచం తు ఖేచరీం శ్రుత్వా దేవా: సర్వే సముత్సుకా: కుమారం చ పురస్కృత్య సర్వే తే గతసాధ్వసా:||10

యుద్దకామా: సురా యావత్తావత్సర్వే సమాగతా: వరణార్ధం కుమారస్య సుతా మృత్యోర్దురత్యయా||11

బ్రహ్మణా నోదితా పూర్వం తప: పరమమాశ్రితా| తపసా తేన మహతా కుమారం ప్రతి వై తదా ||ఆగతా దుహితా మృత్యో: సేనా నామైక సుందరీ||12

తాం దృష్ట్వా తే బ్రువన్‌ సర్వే దేవం పశుపతిం ప్రతి | ఏనం కుమారముద్దిశ్య ఆగతా హ్యతిసుందరీ||13

బ్రహ్మణో వచనాచ్చైవ కుమారేణ తదా వృతా | ఆధ సేనాపతిర్జాత: కుమార: శాంకరిస్తదా||14

తదా శంఖాశ్చ భేర్యశ్చ పటహానకగోముఖా:| తథా దుందుభయో నేదు: మృదంగాశ్చ మహాస్వనా:||15

తేన నాదేన మహతా పూరితం చ నభస్తలమ్‌ తదా గౌరీ చ గంగా చ కృత్తికా మాతరస్తథా||

పరస్పరమథోచుస్తా: సుతో మమ మమేతి చ| 16

ఏవం వివాదమాపన్నా: సర్వాస్తా మాతృకాదయ:| నివారితా: నారదేన మౌడ్యం మా కురుతేతి చ||17

పార్వత్యాం శంకరాజ్ఞాతో దేవకార్యార్థసిద్దయే | తూష్ణీం భూతాస్తదా సర్వా: కృత్తికా మాతృభిస్సహ||18

ఆ ఆకాశవాణిని విని దేవతలందరూ ఉత్సాహంతో కుమారస్వామిని ముందుంచుకొని భయములేకుండా యుద్దము చేయగోరి బయలుదేరిరి.(10) వారట్లుండగా కుమారుస్వామిని ఎన్నుకొనుటకు మృత్యుదేవత సుతులు, గొప్పవీరులక్కడకు వచ్చిరి.(11)బ్రహ్మ ప్రేరేపణచే పూర్వము తపస్సు నాశ్రయించిన సేన అను పేరుగల సుందరి, మృత్యుదేవతపుత్రిక, కుమారస్వామి వద్దకు వచ్చెను.(12) ఆమెను చూచి అందరూ శివునితో కుమారస్వామిని కై ఈ సుందరి చెప్పిరి.(13)బ్రహ్మ మాటలపై అపుడు కుమారస్వామి ఆమెను వివాహమాడెను. తరువాత సేనాపతి ఆయెను. (14) అపుడు శంఖములను పూరించిరి భేరీ వాద్యాలను, తప్పెటలను ఇతరవాద్యాలను మోగించిరి గొప్ప ధ్వనిగల మృదంగములను మోగించిరి.(15) ఆ గొప్ప ధ్వనితో ఆకాశతలము అంతా నిండిపోయినది. అపుడు గౌరి,గంగ, కృత్తికాది తల్లులు ఇతను మా పుత్రుడు , మాపుత్రుడని పరస్పరము అనుకొనిరి.(16)ఇట్లు వివాదమును వారుపొందగా నారదుడు మూర్ఖంగా వ్యవహరించవద్దని వారిని వారించెను(17) ఇతను పార్వతికి శంకరుని వలన దేవతలపనికై పుట్టినవాడ ని నారదుడు తెలుపగా వారందరూ మిన్నకుండిరి.(18)

గుహేనోక్తాస్తదా సర్వా ఋషిపత్న్యశ్చ కృత్తికా :| నక్షత్రాణి సమాశ్రిత్య భవద్బి: స్థీయతాం చిరమ్‌||19

తథా మాతృగణస్తేన స్వామినా స్థాపితో దివి| మృత్యో: కన్యాం చ సంగృహ్య కార్తికేయస్త్వరాన్విత:||20

ఇంద్రం ప్రోవాచ భగవాన్‌ కుమార: శంకరాత్మజ: దివం యాహి సురై: సార్దం రాజ్యం కురు నిరంతరమ్‌||21

ఇంద్రేణోక్త: కుమారో హి తారకేణ ప్రపీడితా:| స్వర్గాద్విద్రావితా: సర్వే వయం యాతా దిశో దశ||22

కిం పృచ్చసి మహాభాగ ఆస్మాన్‌ పదిపరిచ్యుతాన్‌| ఏవముక్తస్తదా తేన వజ్రిణా శంకరాత్మజ:|| ప్రహస్యేంద్రం ప్రతి తదా మా భైషీత్యభయం దదౌ|| 23

యావత్కథయతస్తస్య శాంకరేశ్చ మహాత్మన: కైలాసం తు గతే రుద్రే పార్వత్యా ప్రమథై: సహ||24

ఆజగామ మహాదైత్యో దైత్యాసేనాభిరావృత: |రణదుందుభయో నేదుస్తథా ప్రళయభీషణా:||25

రణకర్కశతూర్యాణి డిండిమాన్యద్భుతాని చ గోముఖా: ఖరశృంగాణి కాహళాన్యేవ భూరిశ:||26

వాద్యభేదా అవాద్యంత తస్మిన్‌ దైత్యసమాగమే | గర్జమానాస్తదా వీరాస్తారకేణ సహైవ తు||27

ఉవాచ నారదో వాక్యం తారకం దేవకంటకమ్‌||28

అపుడు కుమారస్వామి వారినుద్దేశించి మీరు నక్షత్రాలను ఆశ్రయించి చిరకాలము వుండండి అనెను (19) ఆ విధంగా ఆకాశమున కృత్తికాది మాతృగణము కుమారస్వామిచే నుంచబడెను. ఇక కుమారస్వామి మృత్యుదేవత కన్యయగు సేనను తీసుకొని త్వరగా ఇంద్రునితో నిట్లనెను(20) నీవు దేవతలతో స్వర్గమునకు వెళ్ళి నిరంతరము రాజ్యము చేయుము.(21)అనగా ఇంద్రుడు అతనితో తారకుడు పీడించగా మేమంతా స్వర్గమునుండి పారిపోయి నలుదిక్కులను చేరితిమి(22) పదమునుండి చ్యుతులమైన మమ్ము ఏమడిగెదవు? అనగా కుమారస్వామి నవ్వి భయపడవలదని వారి కభయమునిచ్చెను.(22) అతనట్లు పలుకుచుండగనే,రుద్రుడు పార్వతితో, ప్రమధులతో కైలాసమునకు వెళ్ళిపోగా, దైత్యసేవలు చుట్టురాగా దైత్యరాజు తారకుడక్కడికి వచ్చెను. అపుడు ప్రళయ కాలమువలె భయంకరమగు యుద్దవాద్యాలు మ్రోగించబడెను.(25) రణమునందు కఠోరమగు తూర్యములు, అద్భుతమగు డిండిమములు, గోముఖములు, ఖడ్గమృగము కొమ్ముతో చేయబడిన కాహళమను వాద్యాలు

మ్రోగినవి (26)ఇట్టి అనేక వాద్యభేదములు ఆ దైత్యుల రాకతో మ్రోగించబడినవి, తారకునితో కలిసి ఆ వీరులట్లు గర్జించుచుండగా నారదుడు దేవతలకు కంటకమగు తారకునితో ఇట్లనెను.(28)

నారదఉవాచ:

పురా దేవై: కృతో యత్నో వధార్థం నాత్ర సంశయ: | తవైవ చాzసురశ్రేష్ఠ మయోక్తం నాన్యథా భ##వేత్‌ ||29

కుమారోzయం చ శర్వస్య తవార్థం చోపపాదిత:| ఏవం జ్ఞాత్వా మహాబాహో కురు యత్నం సమాహిత:||30

నారదోక్తం నిశమ్యాథ తారక: ప్రహసన్నివ| ఉవాచ వాక్యం మేధావీ గచ్ఛ త్వం చ పురందరమ్‌ ||31

మమ వాక్యం మహర్షే త్వం వద శీఘ్రం యథాతథమ్‌ | కుమారం చ పురస్కృత్య మయా యోద్దుం త్వమిచ్చసి||32

మూఢభావం సమాశ్రిత్య కర్తుమిచ్చసినాన్యథా | మనుష్యమేకమాశ్రిత్య ముచుకుందాఖ్యమేవ చ||33

తత్ప్రభావేzమరావత్యాం స్థితోzసి త్వం న చాన్యధా| కౌమారం బలమాశ్రిత్య తిష్ఠసే త్వం మమాగ్రత:||34

త్వాం హనిష్యామ్యహం మంద లోకపాలై: సహైవ హి ఏవం కథయ దేవేంద్రం దేవర్షే నాన్యథా వద||35

తథేతి మత్వా భగవాన్‌ స నారదో | య¸° సురాన్‌ శక్రపురోగమాంశ్చ|

ఆచష్ట సర్వం హ్యసురేంద్రభాషితం | సహోపహాసం మతిమాంస్తథైవ||36

పూర్వము నిన్ను వధించుటకై దేవతలుప్రయత్నించిరి, ఇందు సంశయము లేదు ఓ అసురశ్రేష్ఠా! నేను చెప్పినది నిజమగును(29) ఈ శివుని కుమారుడు నీకొరకే జన్మింపబడినాడు ఇది తెలిసి తగిన ప్రయత్నమును జాగ్రత్తగా చేయుము.(30) అని నారదుడనగా విని తారకాసురుడు నవ్వుచూ మహర్షి! నీవు ఇంద్రుని వద్దకు వెళ్ళినా మాటలను ఉన్నదున్నట్లుగా చెప్పుము.(31) కుమారస్వామిని ముందుంచుకొని నాతో యుద్దము చేయగోరిన నీవు మూర్ఖుని వలె చేయుచుంటిని(32) వేరొక విధముగా కాదు ముచుకుందుడనుమనుష్యుని ఒకడిని ఆశ్రయించి, వాని ప్రభావముచే అమరావతి యందున్నావు వేరొక విధముగా కాదు ఇపుడు కుమారుని బలము నాశ్రయించి నా ఎదుట నిలబడుచున్నాము (34) మూర్ఖుడా! నిన్ను నీ లోకపాలకులతో సహా వధించెదను. అని దేవేంద్రునికి చెప్పుము.(35) అని తారకుడనగా సరే నని నారదుడు ఇంద్రాది దేవతల వద్దకు వెళ్ళి అసురోత్తముడనిన మాటలను ఉపహాసపూర్వకము వున్నదున్నట్లుగా చెప్పెను.(36)

నారద ఉవాచ:

భవద్బి : శ్రూయతాం దేవా వచనం మమ నాన్యథా | తారకేణ యదుక్తం చ సానుగేనావధార్యతామ్‌ ||37

తారక ఉవాచ:

త్వాం హనిష్యామి రే మూఢ నాన్యథా మమ భాషితమ్‌ |38

ముచుకుందం సమాసాద్య లోకపాలైశ్చ పూజిత:| న త్వయా భీరుణా యోత్స్యే దేవొ భూత్వా నరాశ్రిత:||39

తస్య వాక్యం నిశమ్యోచు: సర్వే దేవా: సవాసవా: కుమారం చ పురస్కృత్య నారదం చర్షిసత్తమ్‌ ||40

జనాసి త్వం హి దేవర్షే కుమారస్య బలాబలమ్‌ | ఆజ్ఞో భూత్వా కథం వాక్యముక్తం తస్య మమాగ్రత:||41

ప్రవాస్య నారదో వాక్యమువాచ తస్య సన్నిధౌ| అహమప్యుపహాసం చ వాక్యం తారకముక్తవాన్‌ ||42

జానీధ్వమమరా: సర్వే కుమారం జయినం సురా: భవిష్యత్యత్ర మే వాక్యం నాత్ర కార్యా విచారణా||43

నారదస్య వచ: శ్రుత్వా సర్వే దేవా: ముదాన్వితా:| ఐకసద్యేన చోత్తస్థుర్యోద్దుకామాశ్చ తారకమ్‌||44

కుమారం గజమారోప్య దేవేంద్రో హ్యగ్రగోzభవత్‌: సురసైన్యేన మహతా లోకపాలై: సమావృత:||45

తదా దుందుభయో నేదు: భేరీ తూర్యాణ్యనేకశ: వీనావేణుమృదంగాని తథా గంధర్వునిస్వనా:||46

దేవతలారా: నేను చెప్పుచున్న మాటలను వినండి తారకుడు తన అనుచరులతో కలిసి పలికిన మాటలను శ్రద్దగా ఆలకించండి(37) తారకుడు ఇట్లు చెప్పెను. మూర్ఖుడా! నిన్ను వధించెను ఇది నిజమగు ముచుకుందుని ఆశ్రయించి లోకపాలురతో పూజలందుకుంటున్న నీవంటి భీరువుతో యుద్దము చేయబోను. దేవుడవై కూడా నరుడినాశ్రయించావు.(39) అనెననినారదుడు చెప్పగా ఇంద్రాది దేవతలు కుమారస్వామి ముందునిలవగా నారదునితో ఇట్లనిరి.(40)ఓ దేవర్షి: కుమారస్వామి బలమునీకు తెలియును గదా! అజ్ఞునివలె నా ముందు అతని మాటలనెట్లు పలికితివి? (41) అనగా నారదుడు నవ్వి, నేను కూడా అతనిని పరిహసిస్తూ పలికితిని కుమారస్వామి జయించునని మీరందరు తెలియుడు నా వాక్యము తప్పక నిజమగును.(43)అని నారదుడనగా విని దేవతలందరూ సంతోషించిరి(44) కుమారస్వామిని ఏనుగు పై నిలిపి, దేవేంద్రుడు ముందునడుచుచుండెను. అతని వెంట గొప్ప దేవసైన్యము లోకపాలురు నడచిరి (45) అపుడు దుందుభులు ,భేరి వాధ్యాలు, తూర్యములు అనేక మార్లు మ్రోగినవి వీణలు ,వేణువులు, మృదంగములు గంధర్వధ్వనులు వినిపించినవి.(46)

గజం దత్త్వా మహేంద్రాయ కుమారో యానమారుహత్‌ అనేకరత్నసంవీతం నానాశ్చర్యసమన్వితమ్‌|| విచిత్ర చిత్రం సుమహత్తథాశ్చర్యసమన్వితమ్‌||47

విమానమారుహ్య తదా మహాయశా: స శాంకరి: సర్వగణౖరుపేత:| శ్రియా సమేత: పరయా బభౌ మహాన్‌ స వీజ్యమానశ్చమరైర్మహాప్రభై:||48

ప్రాచేతసం ఛత్రం మహామణిప్రభం రత్నైరుపేతం బహుభిర్విరాజితమ్‌|

ధృతంతదా తేన కుమారమూర్ధని చంద్రేణ చాంద్రైః కిరణౖ సుశోభితమ్‌||49

సమ్మీళితాస్తదా సర్వే దేవా ఇంద్రపురోగమా: | బలై: సై#్వః సై#్వ: పరిక్రాంతా యోద్దుకామా మహాబలా:||50

యమోzపి స్వగణౖ: సార్థం మరుద్భిశ్చ సదాగతి:పాథోభిర్వరుణస్తత్ర కుబేరో గుహ్యకై: సహ|| ఈశోzపి ప్రమథై: సార్దం నైర్‌ఋతో వ్యాదిభి: సహ||51

ఏవం తేzష్టౌ లోకపా యోద్దుకామ: | సర్వే మిళిత్వా తారకం హంతుమేవ|

పురస్కృత్వా శాంకరిం విశ్వవంద్యం | సేనాపతిం చాత్మవిదాం వరిష్ఠమ్‌||52

ఏవం తే యోద్దుకామా హి అవతేరుశ్చ భూతలమ్‌ అంతర్వేద్యాం స్థితా: సర్వే గంగాయమునమధ్యగా:||53

పాతాళాచ్చ సమాయాతాస్తారకస్యోపజీవిన: చేరురంగబలోపేతా హంతుకామా సురాన్‌రణ||54

అపుడు కుమారస్వామి ఏనుగును దేవేంద్రునికే ఇచ్చి వేరొక వాహనమునెక్కెను అది అనేక రత్నములతో కూడినది అనేక ఆశ్చర్యములుగలది (47) అట్టి చిత్రవిచిత్రమైన వాహనమునెక్కి గొప్పకీర్తిగల కార్తికేయుడు అన్నిగుణములుకలవాడు కాంతి వంతమైన చామరములతో వీచబడుచూ గొప్ప కాంతితో విలసిల్లెను (48) అనేక రత్నముల కాంతిగలది , చంద్ర కిరణములతో ఆలరారునది యగు ఛత్రమును చంద్రుడు కుమారుని తల పై పట్టెను (49) అపుడు ఇంద్రుడు మొదలగు దేవతలందరూ తమ తమ బలాలతో యుద్దముచేయగోరి బయలుదేరిరి.(50) యముడు తన గణములతో, వాయువు మరుత్తులతో, వరుణుడు జలముతో కుబేరుడు, గుహ్యకులతో, ఈశ్వరుడు ప్రమధులతో , నైర్‌ఋతుడు వ్యాధులతో వచ్చిరి(51) ఇట్లు ఆ ఎనిమిది మంది లోకపాలకులు కలిసి యుద్దము చేసి తారకుని వధించదలిచిరి విశ్వవంద్యుడగు కుమారుని, సేనాపతిని, ఆత్మవేత్తను ముందు నిలిపిరి.(52) ఇట్లు వారందరూ యుద్దము చేయగోరిభూతలమున దిగి గంగాయమున మధ్య అంతర్వేది వద్ద నిలిచిరి.(53) తారకుని సేవకులందరూ పాతాళమునుండి వచ్చి, తమ బలముతో దేవతలను రణమున దెబ్బతీయుటకు చరించసాగిరి.(54)

తారకో హిసమాయాతో విమానేన విరాజిత| ఛత్రేణ హి మహాతేజా ధ్రియమాణన మూర్ధని||55

చామరైర్వీజ్యమానో హి శుశుభే దైత్యరాట్‌ స్వయమ్‌||56

ఏవం దేవాశ్చ దైత్యాశ్పయ అందర్వేద్యాం స్థితాస్తదా| సైన్యేన మహతా తత్ర వ్యూహాన్‌ కృత్వా పృథక్‌ పృథక్‌||57

గజాన్‌ కృత్వా హ్యేకతశ్చ హాయంశ్చ వివిధాంస్తథా| స్యందనాని విచిత్రాణి నానారత్నయుతాని చ ||58

పదాతా బహవస్తత్ర శక్తి శూలపరశ్వదై: ఖడ్గతోమరనారాచై: పాశముద్గరశోభితా:||59

తే సేనే సురదైత్యానాం శుశుభాతే పరస్పరమ్‌ |హంతుకామాస్తదా తే వై స్తూయమానాశ్చ బంధుభి:60

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రధమే మాహేశ్వరఖండే కేదారఖండే శివశాస్త్రే దేవై: సహ తారకాసురస్య సంగ్రామే దేవదైత్యసేనాసంనాహవర్ణనం నామ అష్టావింశోధ్యాయ:

విమానముతో విరాజిల్లుతున్న తారకుడు తలపై ఛత్రమును సేవకులు పట్టగా వచ్చెను (55) చామరములతో వీచుచుండగా మిగులు శోభించెను (56) ఇట్లు దేవదానవులు అంతర్వేది యందు వచ్చి నిలిచి,త మ తమ సైన్యముతో విడివిడిగా వ్యూహముల రచించిరి(57) ఏనుగులను ఒక వైపు వివిధమగు అశ్వబలమును మరొకవైపు అనేక రత్నములతో నున్న విచిత్రమైన రథములనొకవైపు నిలిపిరి.(58) శక్తి శూల, పరశు మొదలగు ఆయుధములను చేత ధరించిన పదాతులు,ఖడ్గ, తోమర , నారాచములతో , పాశములతో,ముద్గరములతో విలిసిల్లిరి.(59) అట్లు దేవదానవుల సేనలు శోభిల్లుచుండగా, బంధువులతో స్తుతింపబడుచున్న వారు వధింపగోరి నిలిచిరి(60) ఇది శ్రీ స్కాందపురాణము మొదటి మహేశ్వరఖండమున శ్రీకేదారఖండమున దేవతలతో తారకాసురుని యుద్దమున దేవదానవుల సేనలు యుద్దమునకు సిద్దమగుట యను ఇరవైఎనిమిదవ అధ్యాయము

ఏకోనత్రింశోధ్యాయ:

లోమశ ఉవాచ:

ఉభే సేనే తదా తేషాం సురాణాం చామరద్విషామ్‌ | అనేకాశ్చర్యసంవీతే చతురంగబలాన్వితే|| విరేజుస్తదాన్యోన్యం గర్జతో వాంబుదాగమే||1

ఏతస్మిన్నంతరే తత్ర వల్గమానా: పరస్పరమ్‌ | దేవాసురాస్తదా సర్వే యుయుధుశ్చ మహాబలా:||2

యుద్దం సుతుములం హ్యాసీద్దేవదైత్యసమాకులమ్‌ | రుండమూండాంకితం సర్వం క్షణన సమపద్యత||3

భూమౌ నిపతితాస్తత్ర శతశోzథ సహస్రశ: | కేషాంచిద్బాహవశ్చిన్నా: ఖడ్గపాతై: సుదారుణౖ:4

ముచుకుందో హి బలవాం సై#్రలోక్యేzమితవిక్రమ:||5

తారకో హితదా తేన ముచుకుందేన ధీమతా | ఖడ్గేన చాహతస్తత్ర సర్వప్రాణన వక్షసి|| ప్రసహ్యతత్‌ ప్రహారం చ ప్రవాసన్‌ వాక్యమబ్రవీత్‌||6

కిం రే మూఢ త్వయా చాద్య కృతమస్తి బలాదిదమ్‌ | న త్వయా యోద్దుమిచ్చామి మానుషేణౖవ లజ్ఞయా||7

తారకస్య వచ: శ్రూత్వా ముచుకుందోభ్యభాషత| మయా హతో సి దైత్యేంద్ర నాన్యో భవితుమర్హసి||8

దృష్ట్యా మే ఖడ్గసంపాతం న త్వం తిష్టసి చాగ్రత:| త్వాం హన్మి పశ్యమే శౌర్యం దైత్యరాజ స్థిరో భవ|| 9

ఇరవై తొమ్మిదవ అధ్యాయము

లోమశుడు చెప్పెను.-దేవదానవులు ఆ సేనలప్పుడు అనేకాశ్చర్యములతోకూడి యుండి చతురంగబలముతో నుండెను. మేఘములవలె గర్జించుచూ వారి విలసిల్లిరి(1) ఇంతలో ఒక్కమారుగా ఒకరినొకరు బాధించుకొనుచూ మహాబలులైన దేవదానవులు యుద్దమును ప్రారంభించిరి. (2) ఆ దేవదానవులు యుద్దము ఘోరమై ఒక్కక్షణములోనే రుండ ముండ దానవుల కంకితమాయెను (3) వందలకొలదిగా, వేలకొలదిగా నేలకూలసాగిరి కొందరి చేతులు దారుణమైన ఖడ్గపాతములచే తెగిపోయెను (4) ముల్లోకములో అతి పరాక్రమశాలియగు ముచికుందుడు బలంగా తారకాసురుని ఎద పై తన ఖడ్గముతో దెబ్బతీసెను దానిని కాచుకొని తారకాసురుడు నవ్వుచూ అతనితో ఇట్లనెను(6) మూర్ఖుడా! బలముతో నీవు చెసినదిదేమి? నీవు మనుష్యుడవని సిగ్గుతో నీతో యుద్దము చేయును (7) అనగాముచుకుందుడు దైత్యరాజా! నీవు నాచేత మరణించినట్లే (8) నాకత్తి దెబ్బ తిని నాఎదుట నిలువలేవు. నిన్ను చంపెదను. చూడు నాశౌర్యము నిలుపుము(9)

ఏకముక్త్వా తదా వీరో ముచుకుందో మహాబల :| యావజ్ఞఘాన ఖడ్గేన తావచ్చక్త్యా సమాహత: మాంధాతుస్తనయస్తత్ర పపాత రణమండలే||10

పతిత స్తత్ష్కణాదేవ చోత్థిత: పరవీరహా ||11

స సజ్జమానోzతి మహబలో వై | హంతుం తదా దైత్యపతిం చ తారకమ్‌ |

బ్రహ్మాస్త్రమద్యమ్య ధనుర్గృహీత్వా | మాంధాతుపుత్రో భువనైక జేతా||12

స తారకం యోద్దుకామస్తరస్వీ | రుషాన్వితోత్ఫుల్లవిలోచనో మహాన్‌|

స నారదో బ్రహ్మసుతో బభాషే| తదా నృవీరం ముచుకుందమేవమ్‌||13

స తారకో హన్యతే మానుషేణ | తస్మాదేతన్మా విమోచీర్మహాస్త్రమ్‌||14

నిశమ్య వచనం తస్య దేవర్షేర్నారదస్య చముచుకుంద ఉవాచేదం భవితా కోzస్య మారక:||15

తదోవాచ మహాతేజా నారదో దివ్యదర్శన | ఏవం హంతా కుమారశ్చ కుమారోzయం శివాత్మజ:16

తస్మాద్భవద్భి :స్థాతవ్యమైకపద్యేన యుద్ద్యతామ్‌ తిష్ట త్వం చాయతో భూత్వా ముచుకుంద మహామతే||17

నిశమ్య వాక్యం చ మనోహరం శుభం | హ్యుదీరితం తేన మహాప్రభేణ|

సర్వే సురా: శాంతి పరా బభూవు తేనైవ సాకం నృపరేణ యత్నాత్‌||18

ఇట్లు పలికి మహాబలుడగు ముచుకుందుడు బలంగా కత్తితో దెబ్బతీయగా తారకుడు శక్తిని ప్రయోగించగా ,ముచుకుందుడు యుద్దమున నేల గూలి వెంటనే మరల లేచెను.(10) మాంధాత పుత్రుడు ముల్లోకముల జయించువాడగు ముచుకుందుడు తారకుని వధించగోరి ధనుస్సునెక్కు పెట్టి , కోపముతో విప్పారిన కళ్ళతో తారకుని చంపబోగా , బ్రహ్మ సుతుడగు నారదుడు అతనితో నిట్లనెను (13) ఈ తారకుడు మనుష్యుని చేతిలో చావడు కనుక మహాస్త్రమును విడువకు (14)అనగా ముచుకుందుడు మరి ఇతనిని చంపువాడెవడు అని అడిగెను(15) అపుడుగోప్పతేజస్సుతో దివ్యమగు దర్శనముగల నారదుడు కుమారుడు ఇతనిని సంహరించును శివుని పుత్రుడే ఆ కుమారుడు (16) కనుక మీరంతా కలిసి ఒక్కమారుగా యుద్దము చేయండి ఓ ముచుకుందా! నీవు విడిగా నిలువుము (17) అని నారదుడు హితము,మనోహరము అగునట్లు పలుకగా దేవతలందరూ శాంతించిరి. అపుడు ముచుకుందుడు అతిప్రయత్నము పై తనను తాను నిలువరించెను.(18)

తతో దుందుభయో నేదు: శంఖాశ్చ కృతనిశ్చయా :| తాడితా వివిధైర్వాద్వై:సురాసురసమన్వితై:|| 19

జగర్జురసురాస్తత్ర దేవాన్‌ ప్రతి కృతోద్యమా : శివకోపాద్బవో వీరో వీరభద్రో రుషాన్విత:||20

గణౖర్బహుభిరాసాద్య తారకం చ మహాబలమ్‌ | ముచుకుందం పృష్టత: కృత్వా తథైవ చ సురానపి||21

తదా తే ప్రమధా: సర్వే పురస్కృత్య కుమారకమ్‌ | యుయుధు : సంయుగే తత్ర వీరభద్రాదయో గణా:||22

త్రిశూలై: ఋషిభి: పాశై: ఖడ్గై పరశుపట్టశై: నిజఘ్న: సమరేన్యోన్యం సురాసురవిమర్దనే||23

తారకో వీరభ##ద్రేన త్రిశూలేన హతో భృశమ్‌| పపాత సహసా తత్ర క్షణం మూర్చా పరిప్లుత:24

ఉత్ధాయ చ ముహుర్తాచ్చ తారకో దైత్యపుంగవ: లబ్దసంజ్ఞో బలావిష్టో వీరభద్రం జఘాన చ||25

స శక్తిం చ మహాతేజౌ వీరభద్రో హి తారకమ్‌| త్రిశూలేన చ ఘోరేణ శివస్యానుచరో బలీ||26

ఏవం సంయుధ్యమానౌ తౌ జఘ్నతుశ్చేతరేతరమ్‌| ద్వంద్వయుద్దం సుతుములం తయోర్జాతం మహాత్మనో ||27

సురాస్తత్రైవ సమరే ప్రేక్షకా హ్యభవంస్తదా| తయోర్బేరీమృదంగాశ్చ పటహానకగోముకా:||28

తథా డమరునాదేన వ్యాప్తమాసీజ్జగత్త్రయమ్‌ | అపుడు దుందుభులు మ్రోగినవి నిశ్చయంగా శంఖాలు పూరింపబడినవి సురాసురుల వివిధ వాద్యములు మ్రోగించబడినవి (19) అపుడు అసురులు, ప్రయత్నముతో దేవతలను చూచి గర్జించిరి అపుడు శివకోపమునుండి పుట్టినవీరభద్రుడు కోపముతో పెక్కు గణములతో కలిసి మహాబలుడు తారకుని ఎదుర్కొనెను (20) ముచుకుందుడు , దేవతలు అతని వెంటనుండిరి .(21) ప్రమధులు , వీరభద్రాది గణములు ఆయుధమున కుమారస్వామి వెంటనిలిచి యుద్దము చేయసాగిరి.(22) త్రిశాలము పాశముమున్నగు ఆయుధములతో వారు తలపడిరి.( 23) వీరభద్రుడు త్రిశూలముతో దెబ్బతియగా నేలకూలిన తారకుడు ఒక్కక్షణము మూర్చనొందెను (24) మరుక్షణమున లేచి ,స్పృహనొంది వీరభద్రుని కొట్టెను (25) ఇట్లు తారకుడు శక్తితో వీరభద్రుడు త్రిశూలముతో ఒకరి నొకరు దెబ్బతీయుచుండిరి, ఆ ద్వంద్వయుద్దమతిఘోరముగా నుండెను.(27) ఆ యుద్దమున దేవతలు ప్రేక్షకులైరి వారిద్దరి భేరీమృదంగాదివాద్యములు మ్రోగింపబడగా వాని నాదము డమరునాదము ముల్లోకముల వ్యాపించెను.(28)

తేన ఘోషేణ మహతా యుధ్యమానౌ మహాబలౌ ||29

శుశుభాతేzతిసంరబ్దౌ ప్రహారైర్జర్జరీకృతా | అన్యోన్యమభిసంరభ్దౌ తౌ బుధాంగారకావివ ||30

నారదేన తదా ఖ్యాతో వీరభద్రస్య తద్వధ:| నరోచతే చ తద్వాక్యం వీరభద్రస్య వై తదా ||31

నారదేన యుదుకం హి తారకస్య వధం ప్రతి | యథా రుద్రస్తథా సోపి వీరభద్రో మహాబల:32

ఏవం ప్రయుధ్యమానౌ తౌ జఘ్నతుశ్చేతరేతరమ్‌ | అన్యోన్యం స్పర్థమానౌ తౌ గర్జంతౌ సింహయోరివ || 33

ఏవం తదా తౌ భువి యుధ్యమానౌ మహాత్మనా జ్ఞానువతాం వరేణ|

న వీరభద్రో హితదా నివారితో వాక్యైరనేకైరథ నారదేన|| 34

తథా నిశమ్య తద్వాక్యం నారదస్య ముఖోద్గతమ్‌ | వీరభద్రో రుషావిష్టో నారదం ప్రత్యువాచ హ||35

తారకం చ వధిష్యామి పశ్య మేzద్య పరాక్రమమ్‌ ఆనయంతి చ యే వీరా: స్వామినం రణసంసది|| తే పాపినో హ్యధర్మిష్టా విమృశంతి రణం గతా:||36

భీరవస్తే తు విజ్జేయా నా వాచ్యాస్తే కదాచన| త్వం న జానాసి దేవర్షే యోధానాం చ ప్రతిక్రియామ్‌ ||37

మృత్యుం చ పృష్టత కృత్వా రణభూమౌ గతవ్యధా: శస్త్రాసై#్రర్భిన్నగాత్రా : ప్రశస్తా నాత్ర సంశయ:|| 38

ఆ ధ్వనిచేత తారకుడు, వీరభద్రుడు మిగులు శోభించిరి.(29) అతి సంరంభమున ప్రహారములతో సడలుచున్నవారు . వారు ఋధ, అంగారకుల వలె ఒండొరులు దెబ్బతీయసాగిరి (30) నారదుడపుడు వీరభద్రుని తారకుని వధను గూర్చి చెప్పగా వీరభద్రునికది రుచించకుండెను (31) తారకుని వధను గూర్చి నారదుడన్నది విని వీరభద్రుడు ఇష్టపడలేదు రుద్రుడెట్లో వీరభద్రుడూ అట్లే (32) ఈ విధంగా వారిద్దరూ ఒకరినొకరు దెబ్బతీయుచూ సింహములవలె గర్జించుచుండిరి అపుడు మహాజ్ఞానియైన నారదుడు అనేక విధాలుగా నచ్చచెప్పి వీరభద్రుని వారించెను.(34)నారదుడు పలికులనాలకించి వీరభద్రుడు కోపముతో నారదునితోనిట్టనెను. (35) చూడు నా పరాక్రమము, తారకుని వధించగలను. ఏ వీరులు తమ స్వామిని రణభూమికి కొనివత్తురో వారు, రణమునకు వచ్చి ఆలోచించువారుకూడా పాపులు అధర్ములు (36) వారు పిరికివారని తెలియువలయును వారిని గౌరవించరాదెప్పుడూ యోధుల ప్రతిక్రియను నీవెరుగును దేవర్షీ! (37) వ్యధనొందక, మృత్యువును వెనకనుంచుకొని యుద్దమున శస్త్రాస్త్రములతో గాయపడిన శరీరముగల వారే ప్రశంసార్హులు సందేహము లేదు.(38)

ఇత్యుక్త్వా చావదద్దేవాన్‌ వీరభద్రో మహాబల: శృణ్వంతు మమ వాక్యాని దేవా ఇంద్రపురోగమా: 39

అతారకాం మహీం చాద్య కరిష్యే నాత్ర సంశయ:||40

అథ త్రిశూలమాదాయ తారకేణ యుయోధ స: వృషారూడైరనేకైశ్చ త్రిశూలవరధారిభి:||41

కపర్దినో వృషాంకాశ్చ గణాస్తేతిప్రహారిణ: వీరభద్రం పురస్కృత్య వీరభద్రపరాక్రమా:||42

త్రిశూలధారిణ: సర్వే సర్వే సర్పాంగభూషణా | సచంద్రశేఖరా : సర్వే జటాజూటవిభూషితా:||43

నీలకంఠా దశభుజా : పంచవక్త్రాస్త్రీలోచనా :| ఛత్రచామరసంవీతా సర్వే తేత్యుగ్రబాహవ:||44

వీరభద్రం పురస్కృత్య సర్వే హరపరాక్రమా :| యుయుధుస్తే తదా దైత్యాస్తారకాసురజీవిన:||45

పున: పునసై#్తశ్చ తదా బభూవు గణౖర్తితాస్తే హ్యసురా పరాజ్మఖా:

బభూవ తేషాం చ తదాతిసంగరో| మహాభయో దైత్యవరైస్తదానీమ్‌ ||46

అమృష్యమాణా : పరమాస్త్రకోవిదై: తతో గణాస్తే జయినో బభూవు:|

గణౖర్జితాస్తే హ్యసురా: పరాభవం| తం తారకం తే వ్యధితా : శశంసు:47

అని పలికి మహాబలుడైన వీరభద్రుడు దేవతలతో నిట్లునెను ఇంద్రాది దేవతలారా! నా మాట వినుడు (39) నిస్సంశయంగా నేను భూమిని తారకుడు లేని దానిగా చేసెదను (40) అని త్రిశూలముతో తారకుని ఎదుర్కొనెను అతనితో అనేకముగా గణములు వృషభముల నెక్కి త్రిశూలముల ధరించి, జటాజూటములతో, ఆయుధముల ధరించి యుండెను.(43) వారు పరాక్రమమున వీరభద్రుని వంటివారే, చంద్రుని తలపైదాల్చి నీలకంఠులు, దశభుజులు, ఐదుతలలు మూడుకన్నులు, గలిగి ఛత్రా చామరములతో వీచబడుచూ అత్యుగ్రమగు బాహువులు గలిగి యుండిరి .(44) పరాక్రమమున హరుని వంటి వీరంతా వీరభద్రుని వెంటనుండిరి. తారకాసురుని అనుచరులగు దైత్యులు యుద్దము చేయుసాగిరి. (45) దేవతల చేత ఓడిన దైత్యులు వెనుదిరిగిరి. వారి మధ్య సమరము భీకరముకాగా , పరమాస్త్రముల జ్ఞానముగల దేవతల చేతితో పరాభవము పొంది దైత్యులు వ్యధనొంది తారకుని చేరి విన్నవించిరి.(47)

వినమ్య చాపం హి తథా చ తారక : | స యోద్దుకామ: ప్రవివేశ సేనామ్‌ |

యథా ఝషో వై ప్రవివేశ సాగరం | తథా హ్యసౌ దైత్యవరో మహాత్మా||48

గణౖ: సమేతో యుయుధే తదానీం | స వీరభద్రో హి మహాబలశ్చ|

సర్వాన సురాంశ్చేంద్రముఖాన్మహాబల :| తథా గణాన్యక్షపిశాచగుహ్యకాన్‌||

స దైత్యవర్యోతిరుషం ప్రవిష్ట: సంమర్ధయామాస మహాబలో హి||49

తత:సమభవద్యుద్దం దేవదానవసంకులమ్‌ | దేవదానవయక్షాణాం సన్నిపాతకరం మహత్‌||50

తథా వృషా గర్జమానా ఆశ్వాన్‌ జఘ్నశ్చ సాదిభి: రథిభిశ్చ రధాన్‌ జఘ్న: కుంజరాన్‌ సాదిభి: సహ||51

వృషారుడై: సరథైస్తే చ సర్వే | నిష్పాటితా హ్యసురా: పోధితాశ్చ||52

క్షయం ప్రణీతా బహవస్తదానీం | పేతు: ప్రవిష్టా హి రసాతలం చ | పలాయమానా బహవస్తథైవ చ||53

కేచిచ్చ శరణం ప్రాప్తా రుద్రానుచరకింకరాన్‌ ఏవం నష్టం తదా సైన్యం విలోక్యాసురపాలక :|| తారకో హి రుషావిష్టో హంతుం దేవగణాన్‌ య¸°||54

అపుడు తారకుడు తన చాపమును ఎక్కుబెట్టి యుద్దము చేయుతలంపుతో సేనను ప్రవేశించెను. అపుడతను సముద్రమున ప్రవేశించు పెద్దచేపవలె నుండెను (48) మహాబలుడగు వీరభద్రుడు తన గణములతో కలిసి యుద్దము చేయసాగెను. ఇకమహాబలుడైన దైత్యశ్రేష్టుడు తారకుడు మిక్కిలి కోపించి రణమున ప్రవేశించి ఇంద్రాది దేవతలను యక్షపిశాచ గుహ్యకులను, అణచివేయసాగెను (49) అప్పుడు అతి ఘోరమైన యుద్దము జరుగగా యుద్దము జరుగగా అందు వృషభములు గర్జించుచూ , ఆశ్వికులతో అశ్వములను,రథికులతో రథములనను, మావటిలతో ఏనుగులు కలిపి కూల్చివైచి బాధించెను. (50,51,52) అనేకులు నాశమునొంది నేల పై పడిరి. కొందరు ప్రాణము విడిచిరి మరికొందరు రసాతలమునుజొచ్చిరి (53) మరికొందరు రుద్రుని అనుచరులైన కింకరులను శరణుజొచ్చిరి ఇట్లు సైన్యము నాశమునొందుటనుచూచి తారకుడు కోపముతో దేవతగణముల హంసించుటకు కదిలెను.(54)

భుజానామాయుతం కృత్వా దైత్యరాజో హి తారక: అరుహ్య సింహం సహసా ఘూతయామాస తాన్‌ రణ||55

దంశితేన చ సింహేన వృషా: కేచిద్విదారితా: తథైవ తారకేణౖవ ఘాతితా బహవో గణా:||56

ఏవం కృతం తదా తేన తారకేణ మహాత్మనా సర్వేషామేన దేవానామశక్యస్తారకో మహాన్‌ ||57

జాతస్తదా మహాబాహుసై#్త్రలోక్యక్షయకారక: | తారకస్యానుగా దైత్యా అజేయా బలవత్తరా:||58

మహారూఢా దంశితాశ్చ కరాళాస్తే ప్రహారిణ: తైరాహృతా గణాస్సర్వే సింహైశ్చ వృషభాహతా:||59

ఏవం నిహన్యమాన వై గణాస్తే రణమండలే | ప్రవాస్య విష్ణు: ప్రోవాచ కుమారం శివవల్లభమ్‌||60

విష్ణు రువాచ:

నాన్యో హంతాస్య పాపస్య త్వద్వినా కృత్తికాసుత | తస్మాత్త్వయా హి కర్తవ్యం వచనం చ మహాభుజ||61

తారకస్య వధార్థాయ ఉత్పన్నోసి శివాత్మజ | తస్మాత్త్వయైవ కర్తవ్యం నిధనం తారకస్య చ ||62

తచ్చృత్వా భగవాన్‌ కృద్ద: పార్వతీనందనో మహన్‌ ఉవాచ ప్రహాసన్‌ వాక్యం విష్ణుం ప్రతి యథోచితమ్‌|| 63

మయా నిరీక్ష్యత సమ్యక్‌ చిత్రయుద్దం మహాత్మనామ్‌| ఆనభిజ్ఞోzస్మ్యహం విష్ణో కార్యాకార్యవిచారణ||64

కేస్మదీయా పరే చైవ న జానామి కథం చన| కిమర్థం యుధ్యమానా వై పరస్పరవధే స్థితా:||65

తారకుడు భుజములను ఆసంఖ్యాకంగా పెంచి సింహమునెక్కి రణమున దేవతలనొక్క మారుగా హింసించ నారంభించెను.(55) ఆ సింహము కొన్ని వృషభముల చీల్చినైచెను. తారకుడు పెక్కు గణముల హింసించెను (56) ఇట్లా తారకాసురుడుచేయగా దేవతలందరిలో ఏ ఒక్కడూ అతనిని నిలువరించలేకపోయెను (57) ముల్లోకములకు నాశనము కలిగించువాడిగా మహాబాహువగు తారకుడు కాగా, అతని అనుచరులగు దైత్యులు మిగులు బలవంతులై జయింప శక్యము కాకుండిరి.(58) వారు మిగుల భయంకరులై ఆయుధములతో గణములన్నింటిని దెబ్బతీసిరి వారి వాహనములగు సింహములు వృషభములను చంపసాగినవి.(59) ఇట్లు రణభూమియందు గణములు ప్రాణముల కోల్పోవుచుండగా విష్ణువు నవ్వుచూ శివుని కత్యంతప్రియుడగు కుమారస్వామితో ఇట్లనెను(60) కార్తికేయా! ఈ పాపిని వధించుటకు నీవుదప్ప వేరొకరు లేరు గాన మాటను నిలుపుము (61) ఇతని వధకై జన్మించితిని కావున నీవే ఇతనిని వధించవలెను (62)అనగా కుమారస్వామి కోపించి తగిన రీతిలో విష్ణువుకు ఇట్లు నవ్వుచు సమాధానమిచ్చెను.(63) విష్ణుదేవా! ఈ మహాత్ముల చిత్రయుద్దమును బాగుగా గమనించుచుంటిని ఏమి చేయాలో తెలియకుంటిని (64) వీరిలో మనవారెవరు? శత్రువులెవరు? దేనికొరకు వీరు యుద్దము చేయుచూ ఒకరినొకరు చంపుకొనుచున్నారు?(65)

కుమారస్య వచ: శ్రుత్వా నారదో వాక్యముబ్రవీత్‌|

నారద ఉవాచ:

కుమారోzసి మహాభాహో శంకర స్వాంశసంభవ :| త్వం త్రాతా జగతాం స్వామి దేవానాం చ పరా గతి:||67

తారకేణ పురా వీర తపస్తప్తం సుదారుణమ్‌ యేనైవ విజితా దేవా యేన స్వర్గస్తథా జిత:||68

తపసా తేన చోగ్రేణ అజేయత్వమవాప్తవాన్‌ | అనేనాపి జితశ్చేంద్రో లోకపాలాస్తథైవ చ||69

త్రైలోక్యం చ జితం సర్వం హ్యనేనైవ దురాత్మనా | తస్మాత్త్వయా నిహంతవ్యస్తారక: పాపపూరుష:70

సర్వేషాం శం విధాతవ్యం త్వయా నాథేన చాద్య వై | నారదస్య వచ: శ్రుత్వా కుమార: ప్రహసన్మహాన్‌|| విమానాదవతీర్యాథపదాతి : పరమోzభవత్‌||71

పద్భ్యాం తదాzసౌ పరిధావమాన : శివాత్మజోయం చ కుమారరూపీ|

కరే సమాధాయ మహాప్రభావం శక్తిం మహోల్కామివ దీప్తియుక్తామ్‌|72

దృష్ట్యా తమాయాంతమతీవచండమవ్యక్తరూపం బలినాం వరిష్టమ్‌ |

దైత్యో బభాషేసురసత్తమానామసౌకుమారో ద్విషతాం నిహంతా||73

అని కుమారస్వామి అనగా నారదుడు విని అతనితో నిట్లనెను మహాబహువా! నీవు శంకరుని అంశ##చే జన్మించిన కుమారునివి. జగత్తుల రక్షించువాడివి, దేవతల పరమగతి (67) వీరుడా! పూర్వము తారకుడు దారుణమగు తపస్సు నాచరించి , దేవతలను, స్వర్గమునూ జయించెను.(68) ఆ ఉగ్రమగు తపస్సుచే అజేయుడాయెను ఇంద్రుని, లోకపాలురను కూడా జయించెను.(69) ఈ దురాత్ముడా ముల్లోకములనూ జయించినందున నీవీ పాపపురుషుని వధించవలెను (70) అందరికీ నీవే శుభమును కలిగించవలెను. అని నారదుడనగా విని కుమారస్వామి నవ్వుచూ విమానము నుండి దిగి, నడవసాగెను(71) గోప్ప ఉల్కవలె కాంతివంతమగు శక్తి యను మహాయుధమును చేతబూని శివుని కుమారుడగు ఆ కుమారస్వామి ముందుకేగెను (72) ఉగ్రముగా తమవైపు నడచుచూ వచ్చుచున్న ఆ మహాబలుని చూచి దైత్యుడు ఇతను సురశ్రేష్టుల కుమారుడు, శత్రువుల దునుమాడువాడు' అనెను.(73)

అనేన సార్థం హ్యహమేవ వీరో యోత్స్యామి సర్వానహమేవ వీరాన్‌| 74

గణాంశ్చ సర్వానపి ఘాతయామి మహేశ్వరాంల్లోకపాలాంశ్చ సద్య: ||

ఇత్యేవముక్త్యా సతతం మహాబల: కుమారముద్దిశ్య య¸° చ యోద్దుమ్‌ |

జగ్రాహ శక్తిం పరమాద్భుతాం చ | స తారకో వాక్యమిదం బభాషే||75

తారక ఉవాచ-

కుమారో మేగ్రతశ్చాద్య భవద్బిశ్చ కథం కృత: యూయం గతత్రపా దేవా యేషాం రాజా పురందర:||76

పురా యేన కృతం కర్మ విదితం సర్వమేవ తత్‌ ప్రసుప్తాశ్చార్దితా గర్భే జఠరస్తథా నిపాతిత:||77

కశ్యపస్యాత్మజేనైవ బహురూపో హతోzసుర: నముచిశ్చ హతో వీరో వృత్రశ్చైవ తథా హత:||78

కుమారం హంతుకామోసౌ దేవేంద్రో బలఘాతుక: కుమారోయం మహాదేవ ఘాతితోద్య న సంశయ:||79

పురా హతాస్త్వయా విప్రా దక్షయజ్ఞే హ్యనేకశ: తత్కర్మణ: ఫలం చాద్య వీరభద్ర మహామతే| దర్శయిష్యామి తే వీరే రణ రణవిశారద||80

అంతేకాక నేనేఇతనితో యుద్దము చేసెదను. ఈ వీరగణములను, గొప్ప లోకపాలురనందరినీ వెంటనే వధించెదను'(74) అని ఆ మహాబలుడు కుమారస్వామితో యుద్దము చేయుటకు బయలుదేరెను పరమాద్బుతమగు శక్తని గ్రహించి తారకుడు దేవతలతో నిట్లనెను (75) మీరీ కుమారుని మీ ముందట్లు నిలుపుకొనిరి? మీరు సిగ్గులేని వారు మీకు రాజు ఇంద్రుడు(76)పూర్వము తానేమీ చేసెనో అందరికీ తెలుసు, గర్భమున నిద్రించిన వారిని వధించి గర్బమును పడగొట్టినవాడు(77)కశ్యపుని పుత్రుని చేతనే బహురూపుడగు అసురుడు వీరుడగు నముచి, వృత్రుడు వధింపబడిరి(78) కుమారుని చంపగోరువాడీ దేవేంద్రుడు, బలవంతుని హింసించువాడు ఈ కుమారుడీనాడు వధింపబడినట్టే సంశయము లేదు(79) వీరభద్రా పూర్వము దక్షయజ్ఞమున అనేక మంది విప్రులను వధించితివి కదా! ఇప్పుడా కర్మఫలితమును నీకీ రణమున చూపించెదను.(80)

ఇత్యేవముక్త్వా స తదా మహాత్మా| దైత్యాధిపో వీరవర: స ఏక:|

జగ్రాహ శక్తి పరమాద్భుతాం చ| స తారకో యుద్దవిదాం వరిష్ఠ:||81

ఇతి పరమరుషాభిభూతో దితితనయ: పరివృతోzసురేంద్రే:|

యుధి మతిమకరోత్తదా నిహంతుం సమరవిజయి స తారకో బత యాన్‌||82

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే శివశాస్త్రే

సురతారకాసురసంగ్రామవర్ణనం నామ ఏకోనత్రింశోధ్యాయ:

అని పలికి ఆ దైత్యాధిపుడగు మహావీరుడొక్కడే పరమాద్భుతమగు శక్తిని ధరించెను (81) అసురరాజులు తన చుట్టూ నిలువగా దైత్యుడగు ఆ తారకుడు మిక్కిలి కోపము నొంది సురులను వధించుటకు యుద్దము చేయగోరెను(82)

ఇతి శ్రీ స్కాందపురాణమున మొదటి మాహ్వేశరఖండమునందలి కేదారఖండమున శివశాస్త్రమున దేవతలకు, తారకాసురునికి మధ్య యుద్దమును వర్ణించుట యను ఇరవైతొమ్మిదవ అధ్యాయము.

త్రింశోzధ్యాయ:

లోమశ ఉవాచ:

వల్గమానం తమాయాంతం తారకాసురమోజసా | ఆజఘాన చ వజ్రేణ ఇంద్రో మతిమతాం వరు:||1

తేన వజ్రప్రహారేణ తారకో విహ్వలీకృత పతితోపి సముత్థాయ శక్త్యా తం ప్రాహరద్ద్విపమ్‌||2

పురందరం గజస్థం హి అపాతయత భూతలే| హాహాకారో మహానాసీత్పతితే చ పురందరే||3

తారకేణాపి తత్రైవ యత్కృతం తచ్చృణు ప్రభో పతితం చ పదాక్రమ్య హస్తాద్వజ్రం ప్రగృహ్య చ || 4

హతం దేవేంద్రమాలోక్య తారకో రిపుసూదన:| వజ్రఘాతేన మహతాతాడయత్తు పురందరమ్‌||5

త్రిశూలముద్యమ్య మహాబలస్తదా| వీరభద్రో రుషిత: పురందరమ్‌

సంరక్షమాణో హి జఘాన తారకం శూలేన దైత్యం చ మహాప్రభేన:6

శూలప్రహారాభిహతో నిసపాత మహీతలే| పతితోzపి మహాతేజాస్తారక: పునరుత్థిత:||7

జఘాన పరయా శక్యా వీరభద్రంతదోరసి| వీరభద్రోపి పతితః శక్తి ఘాతేన తస్య వై||8

సగణాశ్చైవ దేవాశ్చ గంధర్వోరగరాక్షసాః | హాహాకారేణ మహతా చుక్రుశుశ్చ పున:పున:||9

ముప్పదియవ అధ్యాయము

పరమమతిమంతుడగు ఇంద్రుడు తనపైకి దూకి వచ్చిపడుచున్న తారకాసురుని తన వజ్రముతో బలముగా కొట్టెను (1) ఆదెబ్బతో తారకుడు చేష్టలుడిగి క్రిందపడిననూ, మరలలేచి శక్తితో ఐరావతమునుకొట్టెను (2) అపుడా ఏనుగు పైనుండిఇంద్రుడు క్రిందపడగా దేవతలుపెద్దగా మహాకారములు చేసిరి (3) ఇక తారకుడు కూడా ఏమి చేసెనో చెప్పెదము వినుము.క్రిందపడిన ఇంద్రుని చేరి వజ్రాన్ని లాగికొని ముందే దెబ్బతినిన అతనిని మరల కొట్టసాగెను (4,5) అపుడు మహాబలుడగు వీరభద్రుడు ఇంద్రుని రక్షింపదలచి కోపముతో త్రిశూలమునెత్తి తారకుని కొట్టెను(6) ఆ శూలము తగిలి తారకుడు క్రిందపడి మరలలేచను (7) పరమశక్తితో వీరభద్రుని వక్షస్థలము పై కొట్టగా వీరభద్రుడు కిందపడెను.('8) అపుడు దేవగణములు గంధర్వులు, నాగులు, రాక్షసులు మరల మరల పెద్దగా హహాకారములు చేసిరి.

(9)తదోత్థిత: సహసా మహాబల | స వీరభద్రో ద్విషతాం నిహంతా|

త్రిశూలముద్యమ్య తడిత్ర్పకాశం | జాజ్వల్యానం ప్రభయా నిరంతరమ్‌ ||

స్వరోచిషా భాసితదిగ్వితానం సూర్యేందుబింబాగ్న్యుడమండలాభమ్‌||10

త్రిశూలేన తదా యావద్దంతుకామో మహాబల నివారిత కుమారేణ మావధీస్త్వం మహామతే||11

జగర్జ చ మహాతేజా: కార్తికేయో మహాబల:||12

తదా జయేత్యభిహితో భూతైరాకాశసంస్థితై: శక్త్వా పరమయా వీరస్తారకం హంతుముద్యత:||13

తారకస్య కుమారస్య సంగ్రామస్తత్ర దు:సహ: జాతస్తతో మహాఘోర: సర్వభూతభయంకర:||14

శక్తిహస్తౌ చ తౌ వీరౌ యుయుధాతే పరస్పరమ్‌| శక్తిభ్యాం భిన్నభ్యాం భిన్నహస్తౌ తౌ మహాసాహససంయుతౌ|15

పరస్పరం వంచయంతౌ సింహావివ మహాబలౌ| వైతాళకీం సమాశ్రిత్య తథా వై ఖేచరీం గతిమ్‌||16

పార్వతం మతమాశ్రిత్య శక్త్యా శక్తిం నిజఘ్నత:| ఏభిర్మతైర్మహావీరౌ చక్రతుర్యుద్దముత్తమమ్‌||17

అన్యోన్యసాధకౌ భూత్వా మహాబలపరాక్రమౌ| జఘ్నతు: శక్తిధారాభీ రణ రణవిశారదౌ||18

మూర్ధ్ని కంఠే తథా బాహ్వోర్జాన్యోశ్చ కటీతటే| వక్షస్యురసి పృష్ఠే చచిచ్చిదతు: పరస్పరమ్‌||19

అపుడు పైకిలేచినవీరభద్రుడు , శత్రునాశకుడు మెరుపుతీగలవలె మెరియుచున్న త్రిశూలమునెత్తివచ్చెను. అది నిరంతర కాంతితో వెలుగుచుండెను ఆ కాంతితో దిక్కులు ప్రకాశించునట్లు చేసెనుసూర్యచంద్రుల, అగ్ని ,నక్షత్రాల కాంతి దానిది (10) ఆత్రిశూలముతో తారకుని దెబ్బతీయబోగా కుమారుడు కొట్టదవద్దని వారించెను.(11) అపుడు మహాబలుడు కార్తికేయుడు గర్జించెను (12) అపుడు ఆకాశమున నున్న భూతములు జయమునొందుమనినవి పరమశక్తి దాల్చి తారకుని వధించుటకు సిద్దిపడెను (13) వారిద్దరి మధ్య యుద్దము అందరికీ భయము గొల్పుచూ ఘోరముగా నుండెను. (14) ఇద్దరూ శక్తిని దాల్చి యుద్దము చేయుచూ , ఆయుధములచే చేతులు గాయపడినవారైరి(15) సింహములవలె ఒకరి నొకరు దెబ్బతీయుచుండిరి ఖేచరమైన వైతాళికగతి నాశ్రయించి,పర్వతిగతి నాశ్రయించి ఆయుధములతో కొట్టుకొనుచుండిరి.(16) వారి యుద్దము ఉత్తమముగా నుండెను(17) మహాబలపరాక్రమములతో ఒకరినొకరు సాధించువారై యుద్దమున యుద్దమున మెళకువలు తెలిసి ఆయుధములతో కొట్టుకొనుచుండిరి.(18)ఒకరినొకరు అపుడు తల పై కంఠము పై చేతుల పై, మోకాళ్ళపై, నడుము పై, ఎదపై, వీపుపై అనేకచోట్ల గాయముచేసుకొనిరి,(19)

తదా తౌ యుధ్యమానౌ చ హంతుకామౌ మహాబలా | ప్రేక్షకా హ్యభవన్‌ సర్వే దేవగంధర్వగుహ్యకా:||120

ఊచు: పరస్పరం సర్వే కోస్మిన్యుద్దే ఇజేష్యతే తదా సభోగణా వాణి ఉవాచ పరిసాంత్వ్య వై||21

తారకం హి సురాశ్చాద్య కుమారోzయం హనిష్యతి మా శోచ్యతాం సురా: సర్వే: సుఖేన స్థియతాం దివి||22

శ్రుత్వా తదా తాం గగనే సమీరితాం తథైవ వాచం ప్రమథై: పరీత:|

కుమారకస్తం ప్రతి హంతుకామో| దైత్యాధిపం తారకముగ్రరూపమ్‌ ||23

శక్త్వా తయా మహాబాహురాజఘాన స్తనాంతరే | తారకం హ్యసురశ్రేష్టం కుమారో బలవత్తర

:||24

తం ప్రహారమనాదృత్య తారకో దైత్యపుంగవ: కుమారం చాపి సంక్రుద్ద: స్వశక్త్యా చాజఘాన వై||25

తేన శక్తి ప్రహారేణ శాంకరిర్మూర్చితో భవత్‌ ముహుర్తాచ్చేతనాం ప్రాప్త: స్తూయమానో మహర్షిభి:||26

యథా సింహో మదోస్మత్తో హంతుకామస్తథైవ చ కుమారస్తారకం దైత్యమాజఘాన ప్రతాపవాన్‌||27

ఏవం పరస్పరేణౖవ కుమారశ్చైవ తారక: | యుయుధాతేzతిసంరబ్దౌ శక్తియుద్దపరాయణౌ||28

ఆ విధంగా వారు ఒకరినొకరు వధించదలిచి యుద్దము చేయుచుండగా దేవతలు, గంధర్వులు, గుహ్యకులు ప్రేక్షకులైరి.(20)ఎవరుజయించునో యని వారనుకుంటూ వుండగా వారిని ఓదార్చుచూ ఆకాశవాణి ఇట్లనెను (21) దేవతలారా: నేడు తారకుని కుమారుడు వధించును శోకమునొందక, సుఖముగా స్వరముననుండుడు (22) అనగా విని ప్రమధులతో నున్న కుమారుడు ఉగ్రరూపుడైన తారకుని వధించగోరెను.(23) మహాబాహువగు కుమారుడు అసురశ్రేష్టుడైన తారకుని ఎదపై శక్తితో గట్టిగా కొట్టెను.(24) కాని తారకుడు దానిని లెక్కించక కుమారుని కోపముతో కొట్టెను.(25) అ దెబ్బతో కుమారుడు మూర్చనొంది క్షణములో స్పృహనొందెను అపుడు మహర్షులు అతనిని సుత్తించిరి. (26) మదించిన సింహము వధించునట్టు కుమారుడు తారకుని దెబ్బతీసెను.(27) ఈ విధమయు కుమారుడు తారకుడు శక్తి యుద్దపరాయణులై భయంకరముగా యుద్దము చేయసాగిరి.(28)

అభ్యాసపరమావాస్తామన్యోన్యవిజిగీషయా తదా తౌ యుధ్వమానౌచ చిత్రరూపౌ తపస్వినౌ|29

ధారాభిశ్చ అణీభిశ్చ సుప్రయుక్తా చ జఘ్నతు:| అవలోకపరా: సర్వే దేవగంధర్వకిన్నరా:|| 30

విస్మయం పరమం ప్రాప్తా నోచు: కించన తస్య వై| న వవౌ చ తదా వాయు: నిష్ర్పభోzభూద్దివాకర:||31

హిమాలయోzధ మేరుశ్చ శ్వేతకూటశ్చ దుర్దుర: మలయోథ మహాశైలో మైనాకో వింధ్యపర్వత:||32

లోకాలోకౌ మహాశైలౌ మానసోత్తరపర్వత: | కైలాసో మందరో మాల్యో గంధమాదన ఏవ చ ||33

ఉదయాద్రిర్మహేంద్రశ్చ తథైవాస్తగిరిర్మహాన్‌||34

ఏతే చాన్యే చ బహవ: పర్వతాశ్చ మహాప్రభా: స్నేహార్ధితాస్తదా జగ్ము: కుమారం చ పరీప్సవ:||35

తత: స దృష్ట్యా తాన్‌ సర్వాన్‌ భయభీతాంశ్చ శాంకరి : | పర్వతాన్‌ గిరిజాపుత్రో బభాషే ప్రతిబోధయన్‌ ||36

కుమార ఉవాచ-

మా ఖిద్యత మహాభాగా మా చింతా క్రియతాం నగా:| ఘాతయామ్యద్య పాపిష్టం సర్వేషామిహ పశ్యతామ్‌ ||37

ఏవం సమాశ్వాస్య తదా మనస్వీ తాన్పర్పతాన్దేవగణాన్‌ సమేతాన్‌|

ప్రణమ్య శంభుం మనసా హరిప్రియ: స్వాం మాతరం చైవ నత: కుమార:||38

కార్తికేయస్తత: శక్త్యా నిచకర్తరిపో: శిర : తచ్చిరో నిపపాతోర్వ్యాం తారకస్య చ తత్ఘ్కణాత్‌ ||

ఏవం స జయామాపేదే కార్తికేయో మహాప్రభు:39

ఒకరినొకరు జయింపగోరి చిత్రరూపమున అభ్యాసపరములై యుద్దము చేయుచుండిరి (29) వారు వివిధాయుదములతో కొట్టుకొనుచుండగా దేవాదులుచూచువారైరి (30) అమిత విస్మయమునొంది మిన్నకుండిరి వాయువు వీచలేదు, సూర్యుడు కాంతిలేనివాడాయెను హిమాలయము, మేరుపు, శ్వేతకూటము, మలయ, మైనాక, వింధ్యపర్వతములు (32) మరియు లోకాలోక పర్వతములు, మానసమునకు త్తరమున్నది కైలాసము, మందరము, మూల్యము, గంధ మాదనము, ఉదయాస్తమయపర్వతములు, ఇతర పర్వతమలులు కుమారుని చేరినవి. (35) భయమునొందియున్న వానిని చూచి కుమారుడు ,జ్ఞానము గరువుచూ ఇట్లనెను (36) మహానుభావులారా: చింతంచకుడు ఈ పాపిష్టుని నేను అందరు చూచుచుండగా వధించెను(37) అని ఊరడించి మనసులో శివుని తల్లని నమస్కరించెను(38) వెంటనే కుమారుడు శక్తి తో తారకుని తలను ఖండించెను అది క్షణములో నేలపైపడెను ఇట్లు కార్తికేయుడుజయమును పొందెను(39)

దదృశుస్తం సురగణాఋషయో గుహ్యకా: ఖగా: కిన్నరాశ్చారణా: నర్పాస్తధా చైవాప్సరో గణా:||40

హర్షేణ మహతాzవిష్టాస్తుష్టుపుస్తం కుమారకమ్‌ | విద్యాధర్యశ్చ ననృతుర్గాయకాశ్చ జగుస్తదా||41

ఏవం విజయామాపన్నం దృష్ట్యా సర్వే ముదా యుతా: | తతో హర్షాత్సమాగమ్య స్వాంకమారోప్య చాత్మజమ్‌ ||42

పరిష్వజ్య తు గాఢేన గిరిజాపి తుతోష వై| స్వోత్సంగే చ సమారోప్య కూమారం సూర్యవర్చసమ్‌||43

లాలయామాస తన్వంగీ పార్వతీ రుచిరేక్షణా |ఋషిభి సత్కృత:శంభు పార్వత్యా సహితస్తదా||44

ఆర్యాసనగతా సాధ్వీ శుశుభే మితభాషిణి సంస్తూయామానా మునిభి: సిద్దచారణపన్నగై:45

నీరాజితా తదా దేవై: పార్వతీ శంభునా సహ| కుమారేణ సహైవాథ శోభమానా తదాసతీ||46

హిమాలయస్తదాzగత్య పుత్రైశ్చ పరివారిత: మేర్వాద్యై: పర్వతైశ్చైవ స్తూయమాన: పరzభవత్‌||47

తదా దేవగణా సర్వ ఇంద్రాద్యా: ఋషిభిస్సహ| పుష్పవర్షేణ మహతా వవర్షురమితద్యతిమ్‌|| కుమారమగ్రత :కృత్వా నీరాజనపరా బభు:||48

ఋషులు, సురగణములు, గుహ్యకులు, ఆకాశచారులు, కిన్నరులు , చారణులు, సర్పములు అప్సర గణములు కుమారస్వామిని చూచినవి.(40) గొప్ప సంతోషమునుపొంది అతనిని స్తుతించెను విధ్యాధరులు నర్తించిరి, గాయకులు గానము చేసిరి. (41) ఇట్లు విజయాన్ని పొందిన కుమారుని చూచి అందరూ ఆనందముతో నుండగా పార్వతి హర్షముతో అక్కడకు వచ్చి కుమారుని ఒడిలో నుంచుకొని (42) గాఢముగా కౌగలించుకొని సంతోషించెను. సూర్యునివలె నున్న కుమారుని ఒడిలో నుంచుకొని పార్వతి లాలించెను (43) అపుడు ఋషులు పార్వతితో శివుని సత్కరించిరి (44) మితభాషిణియగు పార్వతి ఆర్యాసనమునజేరి మునులు సిద్దచారణనాగులచే స్తుతింపబడుచూ మిగుల శోభించెను (45) దేవతలు పార్వతినున్న శివునికి నీరాజనమివ్వగా కుమారునితో నున్న పార్వతి మిగుల శోభిల్లెను (46) అపుడు హిమాలయుడక్కడకు వచ్చి మేర్వాది పర్వతములచే స్తుతింపబడెను (47) అపుడు ఇంద్రాది దేవగణములు,ఋషులతో పుష్పవర్షమును కురిపించి కుమారస్వామిని ఎదుట నిలుపుకొని నీరాజనమిచ్చిరి(48)

గీతవాదిత్రఘోషేణ బ్రహ్మఘోషేణ భూయసా| సంస్తూయమానో వివిధై: సూకైర్వేదవిదాం వరై:||49

కుమారవిజయం నామ చరిత్రం పరమాద్భుతమ్‌ | సర్వపాపహరం దివ్యం సర్వకామప్రదం నృణామ్‌ ||50

యే కీర్తయంతి శుచయోమిత భాగ్యయుక్తాశ్చానన్త్యరూపమజరామరమాదధానా:|

కౌమారవిక్రమహాత్మ్యముదారమేతదానందదాయకమనోzర్దకరం నృణాం హి||51

య:పఠేచ్చృణుయాద్వాపి కుమారస్య మహాత్మన: | చరితం తారకాఖ్యంచ సర్వపాపై:

సముచ్యతే ||52

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే శివశాస్త్రే

తారకాసురవధపూర్వం స్వామికార్తికేయవిజయోత్సవవర్ణనం నామ త్రింశోధ్యాయ:|

గీతా వాద్యముల ఘోషతో వేదవేత్తల, వేదఘోషతో, వివిధ సూక్తములతో స్తుతింపబడిన కుమారస్వామి మిగుల ప్రకాశించెను (49) ఇది కుమారవిజయము పరమాద్బుతమగు చరిత్రము అన్ని పాపముల హరించు ఈదివ్య చరితము మానవుల కోరికలనన్నింటిని దీర్చును.(50) శుచితో ఏ నరులీ అనన్తరూపుని జరామరణములు లేని కుమారుని కీర్తింతురో వారు అమితభాగ్యమును పొందెదరుఈ కుమారస్వామి మాహాత్మ్యము ఉదారమైనది ఆనందమును, అర్థమును కలిగించునది (51) ఈ కుమారమాహాత్మ్యమును, తారకచరితమనుదానిని చదివిననూ, విన్ననూ అన్ని పాపములు తొలగిపోవును.

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమందలి కేదారఖండమున శివశాస్త్రమున తారకాసురవధ మరియు కార్తికేయస్వామి విజయోత్సవవర్ణనము అను ముప్పదియవ అధ్యాయము

ఏకత్రింశోzధ్యాయ:

శౌనక ఉవాచ-

హత్వా తం తారకం సంఖ్యే కుమారేణ మహాత్మనా | కిం కృతం సుమహద్విప్ర తత్సర్వం వక్తుమర్హసి||1

కుమారో హ్యపర: శంభుర్యేన సర్వమిదం తతమ్‌ | తపసా తోషిత: శంభుర్దదాతి పరమం పదమ్‌ ||2

కుమారో దర్శనాత్సద్య: సఫలో హి నృణాం సదా| యే పాపినో హ్యధర్మిష్టాః శ్వపచా ఆపి లోమశ:||దర్శనాద్దూతపాపాస్తే భవంత్యేవ న సంశయ:||3

శౌనకస్య వచ: శ్రుత్వా ఉవాచ చరితం తదా| వ్యాసశిష్యో మహాప్రాజ్ఞ: కుమారస్య మహాత్మన:

లోమశ ఉవాచ:

హత్వా తం తారకం సంఖ్యే దేవానామజయం తత: అవధ్యం చ ద్విజశ్రేష్టా కుమారో జయమాప్తవాన్‌ ||5

మహిమా హి కుమారస్య సర్వశాస్త్రేషు కథ్యతే | వేదైశ్చ స్వాగమైశ్చాపి పురాణౖశ్చ తథైవ చ||6

తధోపనిషదైశ్చైవ మీమాంససాద్వితయేన తు | ఏవం భూత: కుమారోz యమశక్యో వర్ణితుం ద్విజా:||7

యో హి దర్శనమాత్రేణ పునాతి సకలం జగత్‌ | త్రాతారం భువనస్యాస్య నిశమ్య పితృరాట్‌ స్వయమ్‌||8

బ్రహ్మాణం చ పురస్కృత విష్ణుం చైవ సవాసవమ్‌ | స య¸° త్వరితేనైవ శంకరం లోకశంకరమ్‌|| తుష్టావ ప్రయతో భూత్వా దక్షిణా శాపతి స్వయమ్‌||9

ముప్పదియోకటలవ అధ్యాయము

శౌనకుడు అడిగెను విప్రా మహాత్ముడగు కుమారుడు యుద్దమున తారకుని వధించి ఏమి చేసెనో చెప్పుము (1) కుమారస్వామి, ఈ విశ్వమునంతా వ్యాపించిన శివుడే తప్పస్సుచే సంతోషించి పరమపదమునిచ్చును (2) దర్శనమాత్రమున కుమారస్వామి ఫలమునిచ్చును, పాపులు, అధర్మవర్తులు, శ్వపచులైననూ (చండాలురైననూ) దర్శన మాత్రమున పవిత్రులగుదురు. సంశయములేదు (3) అని శౌనకుడనగా విని, వ్యాసశిష్యుడు, మహాప్రాజ్ఞుడగు లోమశుడు మహాత్ముడగు కుమారుని చరితమునపుడు చెప్పసాగెను (4) లోమశుడిట్లు చెప్పెను దేవతలు జయింపలేని, వధింపలేని ఆ తారకుని యుద్దమున వధించి కుమారుడు జయమునొందెను (5) కుమారస్వామి మహిమ శాస్త్రములన్నింటిలో చెప్పుబడుచున్నది వేదములు, అగమములు, పురాణములు, ఉపనిషత్తులు, పూర్వ ఉత్తరమీమాంసలు కూడా కుమారుడిట్టివాడని వర్ణించలేవు (7) దర్శనము చేతనే లోకముల పవిత్రము చేయునితడు లోకముల రక్షకుడని విని యముడు స్వయముగా (8) బ్రహ్మా, విష్ణు, ఇంద్రులతో లోకములకు కల్యాణకారకుడగు శంకరుని త్వరగా సమీపించి వినయముగా స్తుతించెను.(9)

నమో భర్గాయ దేవాయ దేవానాం పతయే నమ: మృత్యుంజయాయ రుద్రాయ ఈశానాయ కపర్దినే|10

నీలంకంఠాయ శర్వాయ వ్యోమావయవరూపిణ| కాలాయ కాలానాధాయ కాలరూపాయ వైనమ:||11

యమేవ స్తూయమానో హి ఉవాచ ప్రభురీశ్వర: | కిమర్ధమాగతోసి త్వం తత్సర్వం కథయస్వ న:||12

యమ ఉవాచ:

శ్రూయతాం దేవదేవేశ వాక్యం వాక్యవిశారద| తపసా పరమేణౖవ తుష్టిం ప్రాప్తోసి శంకర||13

కర్మణా పరమేణౖవ బ్రహ్మా లోకపితామహ: తుష్టిమేతి న సందేహో వరాణాం హి సదా ప్రభు:||14

తథా విష్ణుర్హి భగవాన్‌ వేదవేద్య సనాతన:| యజ్ఞేరనేకై సంతుష్ట ఉపవాసవ్రతైస్తథా||15

దదాతి కేవలం భావం యేన కైవల్యమాప్నుయ: నరా సర్వే మమ మతం నాన్యథా హి వచో మమ||16

దదాతి తుష్టో వై భోగం తథా స్వర్గాదిసంపద సూర్యో నమస్యయారోగ్యం దదాతీహ నచాన్యథా||17

గణశో హి మహాదేవ అర్ఘ్యపాద్యాదిచందనై మంత్రావృత్త్యా తథా శంభో నిర్విఘ్నం చ కరిష్యతి ||18

తథాన్యే లోకపా: సర్వే యథాశక్తా ఫలప్రదా:| యజ్ఞాధ్యయనదానాద్యై: పరితుష్టాశ్చ శంకర||19

భర్గునికి, దేవునికి , దేవపతికి, మృత్యుంజయునికి , రుద్రునికి , ఈశానునికి, కపర్దునికి నమస్కారములు,(10) నీలకంఠునికి శర్వునికి ఆకాశ##మే అవయములుగా , రూపముగాగలవానికి, కాలునికి, కాలనాథునికి, కాలరూపికి నమస్సులు (11) అని యముడు స్తుతించగా ఈశ్వరుడు దేనికై నీవు వచ్చితివో చెప్పుము అని అడిగెను.(12)

అంత యముడు ఇట్లుచెప్పెను వాక్యవేత్తవగు ఈశ్వరా! వినుము పరమతపస్సుతో తుష్టిపొందువాడవు (13) లోకపితామహుడగు బ్రహ్మా కూడా అట్లే తుష్టిని పొంది ఎల్లప్పుడు వరములనిచ్చును. (14) అదే విధంగా వేదవేద్యుడు , సనాతనుడగు విష్ణువు అనేక యజ్ఞములతో, ఉపవాసవ్రతములతో సంతోషించును.(15) అతననుగ్రహించి అద్యైతభావననిచ్చిన నరులందరూ కైవల్యమునొందెదరని నా అభిప్రాయము , వేరొక విధముగా కాదు,(16) అతను సంతోషించి భోగమును స్వర్గాది సంపదలను ప్రసాదించును సూర్యుడు , నమస్కరించిన అనుగ్రహించి ఆరోగ్యము నిచ్చును వేరోకవిధముగా కాదు(17) గణశుడు అర్ఘ్యపాద్యాదులచే, మంత్రావృత్తిచే నిర్విఘ్నముగా చేయును (18) అట్లే ఇతర లోకపాలకులు యథాశక్తి ఫలములనిత్తురు. యజ్ఞాధ్యయన దానాదులతో సంతోషించిన వీరు ఫలములనిత్తురు.(19)

మహదాశ్చర్యసంభూతం సర్వేషాం ప్రాణినామిహ | కృతం చ తవ పుత్రేణ స్వర్గద్వారముపావృతమ్‌||20

దర్శనాచ్చ కుమారస్య సర్వే స్వర్గాకసో నరా| పాపినోపి మహాదేవ జాతా నాస్త్యత్ర సంశయ:||21

మయా కిం క్రియతాం దేవ కార్యాకార్యవ్యవస్థితా | యే సత్యశీల శాంతాశ్చ వదాన్యా నిరవగ్రహా:||22

జితేంద్రియా అలుబ్దాశ్చ కామరాగవివర్జితా యాజ్జికా ధర్మనిష్టాశ్చ వేదవేదాంగపారగా:||23

యాం గతిం యాంతి వై శంభో సర్వే సుకృతి నోపి హి | తాం గతిం దర్శనాత్సర్శే శ్వపచా అధమా అపి||24

కుమారస్య చ దేవేశ మహదాశ్చర్యకర్మణ కార్తిక్యాం కృత్తికాయెగసహితాయాం శివస్య చ ||25

శివస్య తనయం దృష్ట్యా తే యాంతి స్వకులైస్సహ| కోటిభిర్భహుభిశ్చైవ మత్ధ్సానం పరిముచ్య వై||26

కుమారదర్శనాత్సర్వే శ్వపచా ఆపి యాంతి వై| సద్గతిం త్వరితేనైన కిం క్రియేత మయాధునా ||27

యమస్య వచనం శ్రుత్వా శంకరో వాక్యమబ్రవీత్‌ ||28

అన్ని ప్రాణులకు మహదాశ్చర్యము కలిగించునట్లు నీ పుత్రుడొనరించెను దీనిచే స్వర్గద్వారము తెరువబడినది(20) కుమారస్వామి దర్శనముచే నరులందరు స్వర్గవాసులైరి. మహాదేవా! పాపులైననూ స్వర్గమున నివసింతురు సందేహము లేదు. (21) దేవా! కార్యము ఇట్లుండ,మరి నేనేమి చేయవలెను? సత్యశీలురు, శాంతులు, పూజ్యలు, అవగ్రహము లేనివారు(22) జితేంద్రియులు, లోభము లేనివారు, కామము, రాగము లేనివారు , యజ్ఞములు చేయువారు, ధర్మనిష్టులగు వేదవేదాంగవేత్తలు.(23) ఏ గతిని పొందెదరో ఆ గతిని ఆధములు చండాలురు కూడా కుమారస్వామి దర్శనముచే పొందుచున్నారు.(24)

మహదాశ్యర్యమును కలిగించు కర్మనొనరించిన మహాత్ముడగు కుమారుని, కృత్తికతో కూడియుండగా కార్తికమున చూచిన వారు కోట్లకొలది గా తమ కులముతో నా స్దానము వీడి చండాలురైననూ త్వరగా సద్గతిని పొందెదరు. ఇట్టి తరినేనేమి చేయవలెను? (25,26,27) అని యముడనగా విని శంకరుడిట్లనెను (28)

శంకర ఉవాచ:

యేషాం త్వంతగతం పాపం జనానాం పాపకర్మణామ్‌ | విశుద్దభావో భో ధర్మ తేషాం మనసి వర్తతే|| 29

సత్తీర్థగమనాయైన దర్శనార్థం సతామిహ| వాంఛా చ మహతీ తేషాం జాయతే పూర్వకారితా||30

బహునాం జన్మనామంతే మయి భావోనువర్తతే ప్రాణినాం సర్వభావేన జన్మాభ్యాసేన భో మమ||31

తస్మాత్సుకృతిన: సర్వే యేషాం భావోసువర్తతే జన్మజన్మానువృత్తానాం విస్మయం నైవ కారయేత్‌ ||32

స్త్రీ బాలశూద్రా శ్వపచాధమాశ్చ ప్రాగ్జన్మసంస్కారవశాద్ది ధర్మ| యోనిం గతా: పాపిషు వర్తమానా స్తథాపి శుద్దా మనుజా భవంతి||33

తథా సితేన మనసా చ భవంతి సర్వే' సర్వేషు చైవ విషయేషు భవంతి తజ్ఞా:34

దైవేన పూర్వచరితేన భవంతి సర్వే సురాశ్చేంద్రాదయో లోకపాలా: ప్రాక్తనేన||

జాతా హ్యమీ భూతగణాశ్చ సర్వే హ్యమీ ఋషయో హ్యమీ దేవతాశ్చ:||35

విస్మయో నైవ కర్తవ్యస్త్వయా వాపి కుమారకే కుమారదర్శనే చైవ ధర్మరాజ నిభోధ మే||36

ధర్మరాజా! ఏ పాపకర్ములగు జనులకు పాపము లోపల మాత్రముండునో వారికి విశుద్దభావన మనసులో నున్నట్లే(29) మంచి తీర్థములను చూడ వెళ్లుటకై సత్పురుషులను చూచుటకై వారికి పూర్వజన్మనుండి వచ్చు తీవ్రమైన కోరిక వుండును. (30) ఎన్నో జన్మల చివర నా యందు భావము కొనసాగును. ప్రాణులకిది జన్మాభ్యాసముచే ఏర్పడునది(31)కనుక ఈ భావమేర్పడు వారందరూ పుణ్యాత్ములే జన్మజన్మలనుండి వచ్చువానికి విస్మయం పొందరాదు.(32) స్త్రీలు బాలురు శూద్రులు,చండాలురు , అధములు వీరందరూ పూర్వజన్మ సంస్కారవశము చేతనే పాపయోనినొంది , పాపులతో జీవించుచున్ననూ వీరు పవిత్రులగు మానవులే (33) స్వచ్చమైన మనస్సుతో వారందరూ అన్ని విషయములు తెలిసిన వారయ్యెదరు పూర్వమాచరించిన దానిచే భాగ్యవశాత్తు వారందరూ ఇంద్రాది దేవతలు, లోకపాలురూ అయ్యెదరు (34) ఈ భూతగణములు , ఋషులు, ఈ దేవతలు ఇట్టివారే(35) కనుక నీవు కుమారుని విషయమున విస్మయమును పొందరాదు కుమారదర్శనముననూ అట్లే ధర్మరాజా!వినుము(36)

వచనం కర్మసంయుక్తం సర్వేషాం ఫలదాయకమ్‌ సర్వతీర్థాని యజ్ఞాశ్చ దానాని వివిధాని చ| కార్యాణి మన: శుద్ద్యర్థం నాత్ర కార్యా విచారణా||37

మనసా భావితో హ్యాత్మా ఆత్మనాత్మానమేవచ ఆత్మా అహం చ సర్వేషాం ప్రాణినాం హి వ్యవస్థిత:||38

అహం సదా భావయుక్త ఆత్మసంస్ధో నిరంతర:| జంగమాజంగమానాం చ సత్యం ప్రతివదామితే ||39

ద్వంద్వా తీతో నిర్వికల్పో హి సాక్షాత్‌ స్వస్థో నిత్యో నిత్యయుక్తో నిరీహ:

కూటస్థో వై కల్పభేదప్రవాదై: బహిష్కృతో భోధబోధ్యో హ్యనంత:||40

విస్మృత్య చైనం స్వాత్మానం కేవలం బోధలక్షణమ్‌ | సంసారిణో హి దృశ్యంతే సమస్తా జీవరాశయ:||41

అహం బ్రహ్మా చ విష్ణుశ్చ త్రయోమీ గుణకారిణ: సృష్టిపాలనసంహరకారకా నాన్యథా భ##వేత్‌||42

అహంకారవృతేనైవ కర్మణా కారితా వయమ్‌ | యూయం చసర్వే విబుధా మనుష్యాశ్చ ఖగాదయ:||43

పశ్వాదయ: పృథగ్భూతాస్తథాన్యే బహవో హ్యమీ| పృథక్‌ సమీచీనా గుణవతశ్చ సంసృతౌ||44

కర్మతో కూడిన ఈ మాట అందరికీ ఫలమునిచ్చునది అన్ని తీర్థములు యజ్ఞములు, దానములు వివిధ కార్యములు కేవలం మనస్సు శుద్దమగుటకే ఇందు ఆలోచించపని లేదు (37) ఆత్మ మనస్సుచే భావింపబడును అట్లు తననుతానే భావించుకొనుము అట్టి అత్మగా నేనే అన్ని ప్రాణుల యందునున్న వాడను (38) అన్ని ప్రాణుల ఆత్మయందెల్లప్పుడూ వున్న నేను భావముతో కూడుకున్న వాడను నీకు నిజము చెప్పుచున్నాను.(39) ద్వంద్వములు దాటిన, సాక్షాత్తు నిర్వికల్పుడిని. ఆత్మయందుండిన నిత్యుడిని, నిత్యము యోగమునందుండువాడిని, కోరికలు లేనివాడను ఏ మార్పులూ లేక కల్పభేధప్రభేదములు లేన కేవల జ్ఞానముచే తెలియబడువాడిని, అంతము లేని వానిని (40) కేవలుడిగా జ్ఞానలక్షణుడగు ఆత్మనే మరిచి ఈ సమస్త జీవరాశులు సంసారచక్రమున భ్రమించుచున్నవి (41) నేను బ్రహ్మ, విష్నువు, ముగ్గురమూ గుణములను చేయుచూ సృష్టి పాలన సంహార బాధ్యతలను చేపట్టితిమి వేరొక విధముగా గాదు (42) అహంకారముచే ఆవరింపబడిన కర్మచేతనే మేము. మీరు దేవతలు, మనుష్యులు, పక్షలు మున్నగునవి. (43) పశువులు మున్నగునవి చేయబడినవి అట్లే వేరువేరుగా చేయబడిన మిగతా జీవులన్నీ(44)పతితా మృగతృష్ణాయాం మాయయా చ వశీకృతా:| వయం సర్వే చ విబుధా: ప్రాజ్ఞా పండితమానిన||45

పరస్పరం దూషయంతో మిథ్యావాదరతా: ఖలా:||46

త్రైగుణా భవసంపన్నా అతత్త్వజ్ఞాశ్చ కామక్రోధభయద్వేషమదమాత్సర్యసంయుతా:||47

పరస్పరం దూషయంతో హ్యతత్త్యజ్ఞా బహిర్ముఖా: తస్మాదేవం విదిత్వాzథ అసత్యం గుణభేదత:||48

గుణాతీతే చ వస్త్యర్థే పరమార్థైకదర్శనమ్‌ ||49

యస్మిన్‌ భేదో హ్యభేదం చ యస్మిన్‌ రాగో విరాగతామ్‌ క్రోథో హ్యక్రోధతాం యాతి తద్దామ పరమ శ్రుణు||50

న తద్బాసయతే శబ్ద: కృతకత్వాద్యథా ఘట: శభ్దో హి జాయతే ధర్మ: ప్రవృత్తి పరమో యత:||51

ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ తథా ద్వంద్వాని సర్వశ:| విలయం యాంతి యత్రైవ తత్‌ స్థానం శాశ్వతం మతమ్‌||52

నిరంతరం నిర్గుణం జ్ఞప్తిమాత్రం నిరంజనమ్‌ నిర్వికారం నిరీహమ్‌|

సత్తామాత్రం జ్ఞానగమ్యం స్వసిద్దం స్వయంప్రభం సుప్రభం బోధగమ్యమ్‌||53

ఏతత్‌ జ్ఞానం జ్ఞానవిదో వదంతి సర్వాత్మభావేన నిరీక్షయంతి | సర్వాతీతం జ్ఞానగమ్యం యేన స్వస్థా: సమబుద్ద్యా చరంతి ||54

అతీత్య సంసారమనాదిమూలం మాయామయం మాయయా దుర్విచార్యమ్‌

మాయాం త్యక్త్యానిర్మమా వీతరాగా గచ్చంతి తే ప్రేతరాణ్ణిర్వికల్పమ్‌||55

సంసృతి: కల్పనామూలం కల్పనా హ్యమృతోపమా | యై: కల్పనా పరిత్యక్తా తే యాంతి పరమాం గతిమ్‌ ||56

ఎండమావుల యందు పడి మాయచే బద్దులైన మనమందరమూ పండితులమనుకొనెడి ఆజ్ఞులము (45) ఒకరినొకరము దూషించుకొనుచూ , మిధ్యా వాదములందాసక్తి గలిగి దుర్జనులమగుచున్నాము (46) మూడు గుణాలుకలిగి సంసారమును పొంది తత్త్వమును తెలియక బంధమును పొందినారము . కామ, క్రోధ, భయ,ద్వేష, మద,మాత్సర్యములు గలవారము (47) ఒకరినొకరము దూషించుకొనుచూ తత్త్వమునెఱుగక బహిర్ముఖులమైతిమి కనుక ఇట్లు గుణబేధముచే ఆసత్యమును బాగుగా తెలిసి, గుణములకతీతమైన సత్యపదార్థమందు పరమార్థమగు అభేదదర్శనమును, అద్వైతదర్శనమును పొందవలయును. (49) దేనియుందు భేదము ఆభేదమును,రాగము విరాగమును, క్రోధము, ఆక్రోథమును పొందునో అదే నా స్థానమని తెలియును (50)

ఘటము వలె కృత్రిమమైనందువలన శబ్దము కూడా దానిని ప్రకాశింపచేయజాలదు, ప్రవృత్తి పరమమైనందున శబ్దము కూడా దానిని ప్రకాశింపచేయజాలదు. ప్రవృత్తి పరమమైనందున శబ్దము కూడా పుట్టునదే.(51) ప్రవృత్తి నివృత్తి మొదలగు ద్వంద్వాలు విలీనముగునది శాశ్వతస్థానమనబడును(52) భేదములు గుణములు లేక జ్ఞప్తిమాత్రమై, దేనికి అంటక వికారములు, కోరికలు లేక సత్యమై, జ్ఞానముచే పొందదగునది యని తెలిసినవారు స్వస్థులై సమబుద్దితో మెలిగెదరు (54) ఓ ధర్మరాజా: మాయామయమై, అనాది మూలముగా నున్న సంసారమును దాటి మాయను వదిలి, మనకారమును, రాగమును విడచి నిర్వికల్పస్థితిని పొందెదరు. (55) ఈ సంసారమునకు కల్పనయే మూలము అది అమృతము వంటిది ఎవరు ఈ కల్పనను విడిచెదరో విడిచెదరో వారు పరమగతిని పొందెదరు.(56)

శుక్త్యాం రజతబుద్దిశ్చ రజ్ఞుబుద్దిర్యథోరగే | మరీచౌ జలబుద్దిశ్చ మిథ్యా మిథ్యైవ నాన్యథా||57

సిద్ది: స్వచ్చందవర్తిత్వం పారతంత్ర్య హి వై మృషా బద్దో హి పరతంత్రాఖ్యో ముక్త: స్వాతంత్ర్యభావన:||58

ఏకో హ్యాత్మా విదిత్వాథ నిర్మమో నిరవగ్రహ: కుతస్తేషాం బంధనం చ యథా ఖే పుష్పమేవ చ ||59

శశవిషాణమేవైతత్‌ జ్ఞానం సంసార ఏవ చ కిం కార్యం బహునోక్తేన వచసా నిష్పలేన హి ||60

మమతాం చ నిరాకృత్య ప్రాప్తుకామా!: పరం పదమ్‌ |జ్ఞానినస్తే హి విద్వాంసో వీతరాగా జితేంద్రియా:||61

యైస్యక్తో మమతాబావో లోభకోపౌ నిరాకృతా | తే యాంతి పరమం స్థానం కామక్రోధవివర్జితా:||62

యావత్కామశ్చ లోభశ్చ రాగద్వేషా వ్యవస్థితౌ నాప్నువంతి చ తాం సిద్దిం శబ్దమాత్రైకబోధకా:||63

యమ ఉవాచ:

శబ్దాచ్చబ్ద: ప్రవర్తేత నిశబ్దం జ్ఞానమేన చ | అనిత్యత్వం హి శబస్య కథం ప్రోక్షం త్వయా ప్రభో||64

అక్షరం బ్రహ్మ పరమం శబ్దో వై హ్యక్షరాత్మక: | తస్మాచ్భబ్దస్వయా ప్రోక్తో నిరీక్షక ఇతి శ్రుతమ్‌||65

ప్రతిపాద్యం హి యత్కించిచ్చబ్దేనైవ వినా కథమ్‌ | తత్సర్వం కథ్యతాం శంభో కార్యాకార్యవస్థితా ||66

ముత్యపు చిప్పను వెండిగా భావించుట సర్పమును తాడుగా భావించుట, ఎండమావినీ నీటికలముగా భావించుట యన్నది మిథ్య (57) స్వతంత్రముగా ప్రవర్తించుట సిద్ది పారతంత్ర్యమున్నది అసత్యము ఆధారపడి యున్నవాడు బంధముననుండును స్వతంత్రభావన గలవాడు ముక్తినొందును (58)బకే ఆత్మను తెలిసి, మమకారము, అవగ్రహము లేనివారికి బంధనమొక్కడిది?అది గగనకుసుమమే కదా! (59) సంసారము జ్ఞానము కుందేటి కొమ్ము మాత్రమే నిష్పలమైనది అధికముగా చెప్పి లాభ##మేమి?(60) మమకారమును విడిచి పరమపదమును పొందగొరువారు, జ్ఞానులు, విద్యాంసులు, విరాగులు, జితేంద్రియములు(61)ఎవరు మమకారమును వీడి, లోభకోపములను, కామక్రోధములను విడనాడి వుందురో వారు పరమస్దితిని పొందుదురు.(62)శబ్ద మాత్రమున బోధన చేయువారు , కామ క్రోధ లోభరాగద్వేషములు వున్నంతవరకు ఆ సిద్దిని పొందలేరు. (63) అని చెప్పగా యముడిట్లడిగెను శబ్దము నుండి ప్రవర్తించుచో ని:శబ్దము జ్ఞానమే కదా! మరి శబ్డము నిత్యమని నీ వెట్లంటిని ప్రభూ?(64) అక్షరమైనది పరబ్రహ్మ ఈ అక్షరస్వరూపమే శబ్దము కనుక నీవన్న శబ్దము నిరీక్షకము (సాక్షి) యనబడునని వినుచుంటిమి.(65) ఈ శబ్దము లేకుండా ఏదైననూ ఎట్టు ప్రతిపాదించబడును? ఏమిచేయవలెనో ఏమి చేయరాదో దీనిని తెలియజేయుము పరమశివా (66) అని అడిగెను.

శంకర ఉవాచ:

శ్రుణుష్వావహితో భూత్వా పరమార్థయుతం వచ:యస్య శ్రవణమాత్రేణ జ్ఞాతవ్యం నావశిష్యతే||67

జ్ఞానప్రవాదిన: సర్వ ఋషయో వీతకల్మషా:జ్ఞానాభ్యాసేన వర్తంతే జ్ఞానం జ్ఞానవిదో విదు:||68

జ్ఞానం జ్ఞేయం జ్ఞానగమ్యం జ్ఞాతా చ పరిగీయతే | కథం కేన చ జ్ఞాతవ్యం కిం తద్వక్తుం వివక్షితమ్‌|69

ఏతత్సర్వం సమాసేన కథయామి నిబోధ మే| ఏకో హ్యనేకథా చైవ దృశ్యతే భేదభావన:||70

(దృష్టా) యథా భ్రమరికాదృష్ట్యా భ్రమ్యతే చ మహీ యమ| తథాత్మా భేదబుద్ద్యా చ ప్రతిభాతి హ్యనేకథా||71

తస్మాద్విమృశ్య తేనైవ జ్ఞాతవ్య: శ్రవణన చ| మంతవ్య : సంప్రయోగేణ మననేన విశేషత| 72

నిర్దార్య చాత్మనాత్మనం సుఖం బంధాత్‌ ప్రముచ్యతే మాయాజాలమిదం సర్వం జగదేతచ్చరాచరమ్‌ ||73

మాయామయోయం సంసారో మమతాలక్షణో మహాన్‌ మమతాం చ బహి కృత్వా సుఖం బంధాత్‌ ప్రముచ్యతే||74

కోహం కస్త్వం కుతశ్చాన్యే మహామాయావలంబిన అజాగళస్తనస్యేన ప్రపంచోయం నిరర్థక:||75

నిష్పలోయం నిరభాసో ని:సారో ధూమడంబర: తస్మాత్సర్యప్రయత్నేన ఆత్మానం స్మర వై యమ:|76

అపుడు పరమశివుడిట్లు బదులిచ్చెను శ్రధ్దగా నీవీ పరమార్గమగువచనమును వినుము దీనిని వినినంత మాత్రమున ఇక తెలుసుకొనవలసినది వుండదు (67) ఏమాత్రము కల్మషమూ లేని ఋషలందరూ జ్ఞానమును గూర్చి తెలుపువారు, జ్ఞానమునభ్యసించుచూ వుందురు ఇదే జ్ఞానమని అది తెలిసినవారందురు(68) జ్ఞానమే తెలియబడవలసినదిగా ,జ్ఞానముచే పొందదగినదిగా , తెలియువానిగా చెప్పబడుచున్నది ఏది ఎవరిచే ఎట్లు తెలియబడవలెనో చెప్పదలిచితిని (69) దీనినంతా క్లుప్తంగా చెప్పెదను వినుము ఒక్కటే యైననూ భేదబుద్దిచే అనేకముగా కనబడును (70) తల తిరుగువాడికి భూమి తిరుగుచున్నట్లేలా కనబడునో, భేదబుద్దికలవానికి ఈ ఆత్మ అనేక ప్రకారములుగా కనబడును (71) కనుక చక్కగా విచారించి శ్రుతి చేతనే దానిని తెలియువలయును తరువాత విశేషముగా మననమును చక్కగా ప్రయోగించి చింతించవలెను(72) అటు తరువాత అనుభవముచే నిర్దారించినచో సుఖముగా బంధమునుండి ముక్తుడగును చరాచరజగత్తంతా మాయతో కూడివున్నది.(73)మమకారమే లక్షణముగా గల గొప్ప సంసారము మాయతో కూడినదే ఈ మమకారమును తనలో నుంచి తొలగించిన బంధము సుఖముగా విడిపోవును(74) నేనెవరు? మహామాయనవలంబించి వుండు మిగతావారెవరు? ఈ ప్రపంచము మేక మెడవద్ద చన్నువలె నిరర్దకము(75) ఫలము లేని ప్రపంచమిది ప్రకాశములేక పొగవలె కనబడునది కనుక ఏ విధముగా నైనా ఆత్మనే స్మరించుము అని శివుడు చెప్పెను.(76)

లోమశ ఉవాచ:

ఏవం ప్రచోదితస్తేన శంభునా ప్రేతరాట్‌ స్వయమ్‌ | బుద్దో భూత్వా యమ: సాక్షాదాత్మభూతోభవత్తదా||77

కర్మణాం హి చ సర్వేషాం శాస్తా కర్మానుసారత బభూవ డంబరో నౄణాం భూతానాం చ సమాహిత:||78

ఋషయఊచు:

హత్వా తే తారకం యుద్దే కుమారేణ మహాత్మనా అత ఊర్ద్వం కథ్యతాం భో కిం కృతం మహదద్భుతమ్‌ | 79

సూత ఉవాచ:

హతే తు తారకే దైత్యే హిమవత్ర్పముఖాద్రయ: కార్తికేయం సమాగమ్య గీర్భీ రమ్యాభిరైడయన్‌ ||80

గిరియ ఊచు:

నమ: కల్యాణరూపాయ నమస్తే విశ్వమంగళ | విశ్వబంధో నమస్తేస్తు నమస్తే విశ్వభావన||81

వరిష్టా శ్వపచా యేన కృతా వై దర్శనాత్త్వయా | త్వాం నమామో జగద్భందుం త్వాం వయం శరణాగతా:||82

నమస్తే సార్వతీపుత్ర శంకరాత్మజ తే నమ: నమస్తే కృత్తికాసూనో అగ్నిభూత నమోస్తు తే||83

నమోస్తు తే దేవవరై: సుపూజ్య నమోస్తు తే జ్ఞానవిదాం వరిష్ట|

నమోస్తు తే దేవవర ప్రసీద శరణ్య సర్వార్తివినాశ దక్ష ||84

ఏవం స్తుతో గిరిభి కార్తికేయో హ్యుమాసుత: తాన్గిరీన్‌ సుప్రసన్నాత్మా వరం దాతుం సముత్సుక:||85

అని లోమశుడు చెప్పసాగెను ఈ విధంగా శివునిచే ప్రేరితుడైన యముడు జ్ఞానమును పొంది సాక్షాత్తు ఆత్మయై మిగిలెను '(77) కర్మలన్నిటి శాసకుడు అగు యముడు కర్మానుసారము నరుల భూతములకు డంబరమాయెను (78) అని చెప్పగా ఋషులిట్లడిగిరి అయ్యా కుమారుడు తారకుని యుద్దమున వధించి మహాద్బుతమైన దేమి చేసెనో చెప్పుము(79) అనగా అపుడు సూతుడు ఇట్లు చెప్పెను తారకాసురుడు వదింపబడుగా హిమవంతుడు మొదలైన పర్వతములు కార్తికేయుని వద్దకువచ్చి రమ్మమైన వాక్కుతో స్తుతింపసాగిరి (80) కల్యాణరూపునికి, విశ్వమంగళునికి, విశ్వబందువుకు, విశ్వభావనునకు నమస్కారములు,'(81) ఎవరి దర్శనముచే చండాలుడుకూడా శ్రేష్టులుగా చేయబడిరో నీకు నమస్సులు జగద్బంధువైన నిన్ను మేము శరణుజొచ్చితిమి.(82) పార్వతీ పుత్రా!శంకరాత్మజా! కృత్తికాసూనూ! అగ్ని భూతా నీకు నమస్కారములు (83) దేవతాశ్రేష్టులచే పూజింపబడు నీకు నమస్కారము జానులలో శ్రేష్టుడవగు దేవవరా నమస్కార ము, ప్రసన్నుడవు గమ్ము అందరికీ అన్నివిధాల ఆర్తిని నశింపజేయుటలోప నీవే నేర్పరివి శరణుజొచ్చుచుంటిమి (84) అని పర్వతములు స్తుతించగా పార్వతీపుత్రుడగు కార్తికేయుడు ప్రసన్నుడై వారికి వరమునివ్వనుత్సుకూడాయెను(85)

కార్తికేయ ఉవాచ:

భో భో గిరివరా మూయం శ్రుణధ్వం మద్వచాధునా కర్మభి: జ్ఞానిభిశ్చైవ సేవ్యమానా భవిష్యథ||86

భవత్స్వేవ హి వర్తంతే దృషదో యత్నసేవితా :| పునంతు విశ్వం వచనాన్మమ తా నాత్ర సంశయ:||87

పర్వతీయాని తీర్ధాని భవిష్యంతి న చాన్యథా శివాలయాని దివ్యాని దివ్యాన్యాయతనాని చ ||88

అ యనాని విచిత్రాని శోభనాని మహాంతి చ |భవిష్యంతి న సందేహ: పర్వతా వచనాన్మను ||89

యోయం మాతామహో మేద్య హిమవాన్‌ పర్వతోత్తమ:| తపస్వినాం మహాభాగ: ఫలదో హి భవిష్యతి ||90

మేరుశ్చ గిరిరాజోయమాశ్రయో హి భవిష్యతి| లోకాలోకో గిరివర ఉదయాద్రిర్మహాయశ:||91

లింగరూపో హి భగవాన్‌ భవిష్యతి న చాన్యథా| శ్రీ శైలో హి మహేంద్రశ్చ తథా సహ్యాచలో గిరి:||92

మాల్యవాన్మలయో వింధ్యస్తథాసౌ గంధమాదన: శ్వేతకూటస్త్రీకూటో హి తథా దద్దురపర్వత:||93

ఏతే చాన్యే చ బహువ:పర్వతా లింగరూపిణి | మమ వాక్యాద్భవిష్యంతి పాపక్షయకరా హ్యమీ||94

ఏవంవరం దదౌ తేభ్య: పర్వతేభ్వశ్చ శాంకరి:| తతో నందీహ్యువాచాథ సర్వాగమపురస్కృతమ్‌||95

వారినుద్దేశించి కార్తికేయుడిట్లనెను . ఓ పర్వతారాజులారా: నా మాటనిపుడు వినుడు మీరు కర్మఠులు, జ్ఞానులుగు జనులచే సేవించబడెదరు.(86) ప్రయత్నముచే సేవింపబడు శిలలు మీ యందే నుండును కదా! నామాటపై ఆశిలలు తప్పక విశ్వమును పవిత్రము చేయును (87) పర్వతసంబంధి తీర్థములగును దివ్యములగు శివాలయములు, ఆయతనములు, విచిత్రముగా అందమగు ఈ నెలవులన్ని పర్వతముల పై వెలయునుపర్వతములారా: నామాట పై ఇట్లుగును సందేహము లేదు(88,89) నాతాతయగు హిమవంతుడు తపస్సు నాచరించువారికి ఫలమునిచ్చును (90) పర్వతరాజగు మేరుపు ఆశ్రయమగును. లోకాలోక పర్వతము, ఉదయాచలము లింగరూపము నుండును శ్రీ శైలము మహేంద్రపర్వతము , సహ్యాద్రి.(92) మాల్వవాన్‌, మలయ వింధ్య, గంధమాదన, శ్వేత కూట, త్రికూట, దర్దుర(93) పర్వతములు మరియు మిగతావన్నీ లింగరూపమును దాల్చును. ఇవి నా వాక్కముచే పాపమును తొలగించునవే యగును.(94) అని కార్తికేయుడు ఆపర్వతములకు వరము నిచ్చెను అటు తరువాత నంది అన్ని అగమములను పురస్కరించుకొని ఇట్లుడిగెను. (95)

నంద్యువాచ:

త్వయా కృతా హి గిరయో లింగరూపిణ ఏవతే శివాలయా: కథం నాథ పూజ్యా స్యుః సర్వదైవతై:||96

లింగం శివాలయం జ్ఞేయం దేవదేవస్య శూలిన :| సర్వై నృభిర్దైవతైశ్చ బ్రహ్మాదిభిరతంద్రితై:||97

నీలం ముక్తా ప్రవాళం చ వైడూర్యం చంద్రమేవ చ | గోమేదం పద్మరాగం చ మారతం కాంచనం తథా||98

రాజతం తామ్రమారం చ తథా నాగమయంపరమ్‌ | రత్నధాతుమయాన్యేవ లింగాని కథితాని తే||99

పవిత్రాణ్యవ పూజ్యని సర్వకామప్రదాని చ | ఏతేషామపి సర్వేషాం కాశ్మీరం హి విశిష్యతే ||100

ఐహికాముష్మికం సర్వం పూజాకర్తు: ప్రయచ్చతి ||101

నాథా! నీవు పర్వతములన్నీ లింగ రూపమునుండునట్లు చేసితివి.మరి అందరు దేవతలచే శివాలయము లెట్లు పూజింపదగినవి కాగలవు? (96) అని అడుగగా కుమారస్వామి ఇట్లు చెప్పెను అందరు మానవులు , దేవతలు, బ్రహ్మాదులు ఆలసించక శివాలయము శివునికి చిహ్నమని తెలియవలయును (97) నీలము, ముత్యము, ప్రవాళము, వైడూర్యము, చంద్రకాంతము , గోమేదము, పద్మరాగము, మరకతము, బంగారము (98) అట్లే వెండి, రాగి, నాగమయము, రత్నధాతువులతో కూడినవి లింగములని చెప్పబడినవి. (99) ఇవన్నీ పవిత్రములు, పూజింపదగినవి, అన్ని కోరికల దీర్చునవి, వీటన్నింటిలో కాశ్మీరమునకు చెందినది విశేషమైనది.(100)ఇది తనను పూజించినవానికి ఇహ, పరములకుచెందినదంతా ప్రసాదించుము(101)

నంద్యువాచ:

లింగానామపి పూజ్యం స్యాద్బాణలింగం త్వయా కథమ్‌ | కథితం చోత్తమత్వేన తత్సర్వం వద సువ్రత||102

కుమార ఉవాచ:

రేవాయాం తోయమధ్యే చ దృశ్యంతే దృషదో హి యా: శివప్రసాదాత్తాస్తు స్యుర్లింగరూపా న చాన్యథా||103

శ్లక్ణ మూలాశ్చ కర్తవ్యా: పిండికోపరి సంస్థితా:| పూజనీయా ప్రయత్నే శివదీక్షాయుతేన హి||104

పిండీయుక్తం చ శాస్త్రేణ విధినా చ యజేచ్చివమ్‌ | వరదో హి జగన్నాథ పూజకస్య న చాన్యథా||105

పంచాక్షరీ యస్య ముఖే స్థితా సదా| చేతోనివృత్తి: శివచింతనే చ|

భూతేషు సామ్యం పరివాదమూకతా | షండత్వమేవం పరయోషితాసు||106

ఇతి శ్రీ శ్రీ స్కాందే పురాణప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే శివశాస్త్రే

కార్తికేయప్రోక్తశివలింగమాహత్మ్యవర్ణనం నామ ఏకత్రింశోధ్యాయ:

అపుడు నంది ఇట్లడిగెను అన్నిలింగములలో బాణలింగమే ఉత్తమమైనదనీ పూజింపదగినదనీ నీవంటి అదెట్లో చెప్పుము(102) అనగా కుమారస్వామి ఇట్లుచెప్పెను రేవానదియందు నీటి మధ్యలో ఏ శిలలు కనబడునో అవి శివుని అనుగ్రహముచే లింగరూపములే అగును వేరే కాదు (103) వాని మూలములను నునువు చేసి, ఆధారము పై నుంచి శివదీక్షయందుండిపూజించవలెను (104)పానవట్టముతో శాస్త్రోక్త విధితో పూజించినచో, జగన్నాథుడగు శివుడువరము నిచ్చువాడగును (105) ఎవరి నోటిలో ఎల్లప్పుడు పంచాక్షరీ మంత్రముండునో , చిత్తమును మరల్చి శివుని గూర్చి చింతించువాడెవరో అట్టివాడు అన్ని ప్రాణులయెడ సమబుద్దిని కలిగి పరివాదవిషయమున మూగానివలెనుండి , ఇతర స్త్రీలయందు నపుంసకుని వలెననుండును.(106)

ఇది శ్రీ స్కాంద మహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున

శివశాస్త్రమగు కేదారఖండమునందు కార్తికేయుడు చెప్పిన శివలింగమహత్మ వర్ణనమను ముప్పదియొకటవ అధ్యాయము

ద్వాత్రింశోధ్యాయ:

లోమశ ఉవాచ:

ఏవం తే శివధర్మాశ్చ కథితాస్తేన వై ద్విజా: సవిశేషా: పాశుపతా: ప్రసాదాచ్చైవ విస్తరాత్‌||1

అనేకాగమసంవీతా యథాతత్త్వముదాహృతా |కాపాలికానాం భేదాశ్చ ప్రాక్తా వ్యాససమాసత:||2

ధర్మా నానావిధా: ప్రాక్తో నందినం ప్రతి వైతదా ||3

ఋషయ ఊచు:

శ్రుతం కుమారచరితం విశేషం సుమంగళమ్‌ | అస్మాభిశ్చ మహాభాగ కించిత్‌ పృచ్చామహే వయమ్‌||4

శ్వేతస్య రాజసింహస్య చరితం పరమాద్భుతమ్‌ | యేన సంతోషితో రుద్ర: శివో భక్త్యాప్రమేయయా||5

తే భక్తాస్తే మహాత్మానో జ్ఞానినస్తే చ కర్మిణ యేర్చయంతి మహాశంభుం దేవం భక్యా సమావృతా:6

తస్మాత్‌ పృచ్చామహే సర్వే చరితం శంకరస్య చ వ్యాసప్రసాదాత్సర్వం యజ్ఞానాసి త్వం న చాపరా:|||7

నిశమ్య వచనం తేషాం మునీనాం లోమశోzబ్రవీత్‌||8

ముప్పది రెండవ అధ్యాయము

లోమశుడు చెప్పసాగెను బ్రాహ్మణులారా ! ఇట్లుతను శివధర్మములను చెప్పెను. విశేషములతో విస్తరముగనూ(1) అనేకాగమములతో కూడిన ఈ పాశుపత ధర్మములను వాస్తవముగా తెలియజేసేను అట్లే విస్తారముగానూ క్లుప్తంగానూ కాపాలిక భేదముల కూడా చెప్పెను.(2) ఇట్లు నానావిధ ధర్మములు నందికి చెప్పబడినవి (3) అపుడు ఋషులిట్లడిగిరి మహానుభావా! మంగళకరమగు కుమారస్వామి చరితమును పూర్తిగా వింటిమి కొంత ప్రశ్నించదలిచితిమి.(4) రాజసింహుడగు శ్వేతని చరిత్ర మహాద్బుతముగా నున్నది అ శ్వేతుడు అమితభక్తితో శివుని సంతోషింపజేసెను (5) భక్తితో సదాశివుని అర్చించువారు మహాత్ములు,భక్తులు, జ్ఞానులు, కర్మఠులు(6) కనుక శంకరుని చరితను గూర్చి అందరమూ అడుగుచుంటిమి . వ్యాసుని అనుగ్రహము వలన నీకు అంతా తెలియును. వేరొకరికి కాదు (7) అనగా విని లోమశుడిట్లనెను(8)

అకర్ణ్యతాం మహాభాగాశ్చరితం పరమాద్బుతమ్‌ | తస్య రాజ్ఞా హి భజతో రాజభోగాంశ్చ సర్వశ:||

మతిర్దర్మే సముత్పన్నా శ్వేతస్య చ మహాత్మన:||9

పృథీవీం పాలయామాస ప్రజా ధర్మేణ పాలయన్‌ | బ్రహ్మణ్య: సత్యవాక్బూర: శివభక్తో నిరంతరమ్‌ || 10

రాజ్యం శశాసాధ స శక్తితో నృపో | భక్త్యా తదా చైవ సమర్చయత్సదా |

శంభుం పరేశం పరమం పరాత్పరమ్‌ | శాంతం పురాణం పరమాత్మరూపమ్‌ ||11

ఆయుస్తస్య పరిక్షీణమర్చత: పరమేశ్వరమ్‌ | అథైతచ్చ మహాభాగ చరితం శ్రూయతాం మమ||12

మానీ శివకథాయుక్తా పరమాశ్చర్యసంయుతా | న వాzzధయో హి తసై#్యవ వ్యాధయో హీ మహీపతే:||13

తస్య రాజ్ఞో న బాధంతే తథా చోపద్రవాస్త్వమీ నిరీతికో జనో హ్యీసీన్నిరుపద్రవ ఏవ చ ||14

అకృష్టపచ్యౌషదయస్త్య రాజ్ఞాzభవన్‌ భువి| తపస్వినో బ్రాహ్మణాశ్చ వర్ణాశ్రమయుతా జనా:||15

న పుత్రమరణ దుఖం నాపమానం న మారకా: న దారిద్ర్యం చ తే సర్వే ప్రాప్నువంతి కదాచన||16

ఏవం బహుతర: కాలస్తస్య రాజ్ఞో మహాత్మన: | గతో హి సఫలో విప్రా శివపూజారతస్య వై ||17

మహానుభావులారా: పరమాద్బుత చరిత్రమును వినుడు ఆ శ్వేతుడను మహాత్ముడు రాజుగా అనేక రాజభోగములనుభవించుచుండగా , ధర్మమును బుద్ది ఏర్పడెను. (9) అతను ధర్మముగా ప్రజలను ,భూమని పాలించుచుండెను. అతను బ్రహ్మణ్యుడు, సత్యవాక్‌ శూరుడు, ఎల్లప్పుడూ శివభక్తుడు(10) ఆరాజు యథాశక్తి రాజ్యమును శాసించును అట్లే భక్తితో పరాత్పరుడు, శాంతుడు, నిత్యుడు, పరమాత్మయూనగు శివుని అర్చించెను .(11) పరమేశ్వరుని అర్చించుచున్న అతని ఆయువు క్షీణించిపోయెను మరి అతని చరితమును వినుడు (12) పరమాశ్చర్యమును కలిగించు శివకథతో కూడిన మాటలివి ఆ రాజు పాలించుచుండగా జనులను ఆధివ్యాధులు భాధించలేదు (13) అట్లే ఉపద్రవములేని భాదించనందున. జనులు ఈతి బాధలు,కష్టములులేని వారై జీవింపసాగిరి. (14) ఆ రాజు పాలించు చోట ఓషదులు కృషి లేకనే పండునవాయెను బ్రాహ్మణులు తపస్సు చేయువారైరి జనులు వర్ఱాశ్రమము పాటించిరి ,(15) పుత్రుని మరణమున దు:ఖముగానీ అవమానముగానీ మారకముగానీ, దరిద్రముకానీ వారు పొందలేదు. (16) ఇట్లు ఆ మహాత్ముడు, శివభక్తుడగు శ్వేతుడు రాజ్యమును పాలించుచుండగా కాలము సఫలముగా గడిచెను.(17)

ఏకదా పూజమానం తం శంకరం పరమార్దదమ్‌ యమో హి ప్రేషయామాస యమదూతాన్‌ నృపం ప్రతి||18

వచనాత్‌ చిత్రగుప్తస్య శ్వేత ఆనీయతామితి | తథేతి మత్వా తే దూతా :శివమందిరమ్‌ ||19

రాజానం నేతుకామాస్తే పాశహస్తా మహాభయా:| యావత్సమాగతా యామ్యా రాజానం దదృశుస్త్వరాత్‌ ||20

న చక్రిరే తదా దూతా: ఆజ్ఞాం ధర్మస్య చైవ హి| జ్ఞాత్వా సర్వం యమశ్చెవ ఆగత: స్వయమేవ హి||21

ఉద్దృత్య దండం సహపా నేతుకామస్తదా నృపమ్‌ | దదర్శ చ మహాబాహు: శివధ్యానపరాయణమ్‌ ||22

శివభక్తియుతం శాంతం కేవలం జ్ఞానసంయుతమ్‌ | యమోzపి దృష్ట్యా రాజానం పరం క్షోభముపాగమత్‌||23

చిత్రస్థో హ్యభవత్‌ సద్య: ప్రేతరాజోతివిహ్వల : కాలరూపశ్చ యో నిత్యం ప్రజానాం క్షయకారక:||24

ఆగతస్తత్ష్కణాదేవ నృపం ప్రతి రుషాన్విత:| ఖడ్గేన సితాధారేణ చర్మణా పరమేణ హి||25

తావత్తం దదృశే సోపి స్థితం ద్వారి భయావృతమ్‌ | ఉవాచ కాలో హితదా యమం వైవస్వతం ప్రతి ||26

ఒకనాడు పరమార్దమునొసగు శివుని ప్రార్థించుచున్న ఆరాజుని గొని తెమ్మని యముడు తన దూతలను పంపెను.(18)చిత్రగుప్తుని మాటపై ఆశ్వేతుని తెచ్చుటకు దూతలు శివమందిరమనకు వచ్చిరి.(19) రాజును తీసికొని వచ్చుటకు వారు పాశములను పట్టుకొని భయంకరముగా వచ్చి శ్వేతుని త్వరగా చూచిరి.(20) కానీ,ధర్మరాజు ఆజ్ఞను పాలించలేకపోయిరి అది తెలిపి యముడే స్వయముగా వచ్చెను. (21) తన దండమునొక్క మారుగా పై కెత్తి శ్వేతుని కొనిపోవలెనని చూడగా శ్వేతుడు శివధ్యానమున, భక్తితో,శాంతుడై, కేవలునిగా నుండెను (22) అట్టి రాజునుచూచి యముడు కూడా చాలా క్షోభపడెను'(23) విహ్వలుడై చిత్తరువువలె కాసేపు ఆ కాలరూపుడు ప్రజలకు నిత్యము క్షయకారకుడగు యముడుండెను. (24) వెంటనే కోపముతో రాజువద్దకు పదునైనఖడ్గమును చర్మమును దాల్చివచ్చెను (25) అంతలో రాజుద్వారము వద్ద నిలుచ్చున్న భయంకరుడైన యముని చూచెనుఅపుడు కాలుడిట్లనెను (26)

కస్మాత్త్వయా ధర్మరాజు నో నీతోయం నృపో మహాన్‌ | యమదూతసహాయశ్చ భీతవత్‌ ప్రతిభాసి మే||27

కాలాత్యయో న కర్తవ్యో వచనాన్మను సువ్రత| కాలేనోక్తస్తదా ధర్మ ఉవాచ ప్రస్తుతం వచః||28

తవాజ్ఞాం చ కరిష్యామినాత్ర కార్యా విచారణా| అసౌ దురత్యయోస్మాకం శివభక్తో నిరంతరమ్‌||29

చిత్రస్థా ఇవ తిష్టామ భయాద్దేవస్య శూలిన| యమస్య వచనం శ్రుత్వా కాల: క్రోధ సమన్విత:||30

త్రిగుణాష్టార్కసంకాశం ప్రవివేశ శివాలయమ్‌ యావత్కోపేన మహాతా తావద్దృష్ట పినాకినా||

స్వభక్తం హంతుకామోz'సౌ శ్వేతరాజానముత్తమమ్‌ ||31

ధ్యానస్థితం చాత్మని తం విశుద్దజ్ఞానప్రదీపేన విశుద్దచిత్తమ్‌|ఆత్మానమాత్మత్యయతయా నిరంతరం స్వయంప్రకాశం పరమం పురస్తాత్‌32

ఏవం విధం తం ప్రసమీక్ష్య కాలం సంచింత్యమానం మనసౌచలేన|

శైవం పదం యత్పరమార్ధరూపం కైవల్యసాయుజ్యకరం స్వరూపత:33

సదాశివేన దృష్టోసౌ కాల: కాలాంతకేన చ ఉచ్చృంఖల : ఖలో దర్పాద్విశమానో నిజాంతికే||34

ఓ ధర్మరాజా! ఈ మహాత్ముడగు రాజును నీవేల కొనిపోవుట లేదు? యమదూతలతోనున్ననూ యముడా! నీవు భయపడినట్లు నాకనిపించుచున్నది (27) నా మాటననుసరించుము, కాలమును దాటనీయకుము అని కాలుడగా యముడు ఇట్లనెను (28) నీ ఆజ్ఞను పాటించెదను ఇక ఆలోచించవలసినది లేదు, ఈ వ్యక్తి మాకు లొంగువాడుకాడు నిత్య శివభక్తుడు .(29)శివుడు నుండి భయముచే మేము చిత్తరువులోనున్నట్లు నిలుచుంటిమి అని యముడనగా కాలుడు కోపించి రాజును వధించుటకు ఖడ్గమును గ్రహించెను.(30) ఇరువది నాలుగు సూర్యులవలె ప్రకాశించు శివాలయమున కోపముతో ప్రవేశించగానే, శివుడు తన భక్తుడగు ఉత్తమరాజని , శ్వేతుని, వధింపబూనిన కాలుని చూచెను (31) అపుడు శ్వేతుడు ధ్యానమునుండి, విశుద్దజ్ఞానప్రకాశముచే పరిశుద్దమనస్సు గలవాడై ఆత్మరూపమున నిత్యుడిగా స్వయంప్రకాశుడిగా నుండెను.(32) ఇట్టి శ్వేతుని, మరియు కోపించిన కాలుని స్థిరమనస్సుతో చూచెను. అపుడు శ్వేతుడు నిశ్చలచిత్తముతో పరమసత్యమగు నది కైవల్య సాయుజ్యమగు శివపదమును ధ్వానించుచుండెను.(3) కాలాంతకుడగు సదాశివుడా అడ్డులేక దుర్జనుని వలె తన సమీపమునకు వచ్చు కాలుని చూచెను(34)

నందికేశ్వరమధ్యస్థో యావద్దృష్టో నిజాంతికే శివనే జగదీశేన భక్తవత్సలబంధునా||35

నిరీక్షితస్తృతీయేన చక్షుషా పరమేష్టినా | స్వభక్తం రక్షమాణన భస్మసాదభవత్ష్కణాత్‌ ||36

దదాహ తం కాలమునేకవర్ణం వ్యాత్తాననం భీమబహుగ్రరూపమ్‌ |

జ్వాలావలీభి:పరిదహ్యమానమత్రిమచండం భువనైకభక్షణమ్‌ ||37

దదర్శిచే దేవగణా: సమేతా సయక్షగంధర్వపిశాచగుహ్యకా :| సిద్దాప్సర: సర్వఖగాశ్చ పన్నగా: పతత్రిణో లోకపాలాస్తథైవ ||38

జ్వాలామాలావృతం కాలమీశ్వరస్యాగ్రత: స్థితమ్‌ | లబ్దసంజ్ఞస్తదా రాజా కాలం స్వం హంతుమాగతమ్‌ ||39

పున: పునర్దదర్శాథ దహ్యమానం కృశానునా | ప్రార్దయామాస సవ్యగ్రో రుద్రం కాలాగ్నిసన్నిభమ్‌||40

అట్లు నందికేశ్వరుని మధ్యనున్న కాలుని జగదీశుడు, భక్తవత్సల బంధువగు శివుడు తన భక్తుని రక్షించుచూ మూడవకంటితో చూడగా, కాలుడు అదే క్షణంలో భస్మమాయెను (35) అనేక వర్ణములుగలిగి నోరు తెరిచి, భయంకరముగా నున్న కాలుని దహించగా ఆభువనైకభక్షకుడు జ్వాలలతో చుట్టుముట్టబడి దహింపబడెను.(37) అపుడు దేవాదులందరూ అక్కడికి వచ్చి దానిని చూచిరి.(38) ఈశ్వరుని ఎదుట నిలిచి జ్వాలమాలలలో కప్పబడియున్న కాలుని , స్పృహనొందిన రాజు చూచెను (39) అగ్నిచే దహింపబడు ఆ కాలుని చూచి వ్వగ్రుడై శ్వేతుడు కాలాగ్నివంటి రుద్రుని ప్రార్థింపసాగెను (40)

రాజోవాచ:

నమో రుద్రాయ శాంతాయ స్వజ్యోత్స్నాయాత్మవేధసే| నిరంతరాయ సూక్ష్మాయ జ్యోతిషాం పతయే నమ:||41

త్రాతా త్వం హి జగన్నాథ పితా మాతా సుహృత్సఖా| త్వమేవ బంధు: స్వజనో లోకానాం ప్రభురీశ్వర:||42

కిం కృతం హి త్వయా శంభో కోZసౌ దగ్దో మమాగ్రత: న జానామి చ కిం జాతం కృతం కేన మహత్తరమ్‌ ||43

ఏవం ప్రార్థయతస్తస్య శ్రుత్వా చ పరిదేవనమ్‌ ఉవాచ శంకరో వాక్యం బోధయన్నివ తం నృపమ్‌ ||44

రుద్రునికి , శాంతునికి, స్వయం ప్రకాశునికి ,స్వయం భువునికి, ఏకమైన వానికి సూక్ష్మునికి ,జ్యోతిస్సుల పతికి నమస్సులు(41) జగన్నాథ ! నీవే రక్షకుడవు , తండ్రిని తల్లిని,మిత్రుడివి, బాంధవుడవు నీవే లోకముల ప్రభువు వగు పాలకుడవు (42) శివా! నీవేమి చేసితివి? నాఎదుట దగ్దమైన ఇతనెవడు? ఏమయినది? ఎవరేమి చేసితిరో తెలియకున్నాను (43) అని ప్రార్ధించగా, అతని పరిదేవనమును విని శంకరుడు అతనికి తెలియజేయుచూ నిట్లనెను (44)

రుద్ర ఉవాచ:

మయా దగ్దో హ్యయం కాలస్తవార్థే చ తవాత్రగ!| దహ్యమానో హి దృష్టస్తే జ్వాలామాలాకులోమహాన్‌ ||45

ఏవముక్తస్తదా తేన శంభునా రాజసత్తమ:| ఉవాచ ప్రశ్రితో భూత్వా వచనం శివమగ్రత:||46

కిమనేన కృతం శంభో అకృత్యం వద తత్త్వత:| య ఇమాం ప్రాపితోవస్థాం ప్రాణాత్యయకరీం భవ||47

ఏవం విజ్ఞాపితస్తేన హ్యువాచ పరమేశ్వర:| భక్షకోయం మహారాజ సర్వేషాం ప్రాణినామిహ|| 48

భక్షణార్థం తవ విభో సోzయం క్రూరోధునాగత:| మమాంతికం మహారాజ తస్మాద్దగ్దొ మయా విభో ||49

బహునాం క్షేమమన్విచ్చంస్తవార్దేన్వహం విశేషత:||

యేపాసినో హ్యధర్మిష్ఠా లోకసంహరకారకా :పాషండవాదసంయుక్తా వద్యాస్తే మమ చైవ హి||

వాక్యం నిశమ్య రుద్రస్య శ్వేతో వచనమబ్రవీత్‌ ||51

కాతేనైవ హి లోకోయం పుణ్యమాచరతే సదా| ధర్మనిష్టాశ్చ కేచిత్తు భక్త్యా పరమయా యుతా:||52

ఉపాసనారతా : కేచిత్‌ జ్ఞానినో హి తథా పరే కేచిదధ్యాత్మసంయుక్తాశ్చాన్యే ముక్తాశ్చ కేచన||53

రాజా! నీ కొరకే నీ ఎదుట నేను దహించిన ఇతను కాలుడు జ్వాలమాలలతో చుట్టబడగా నీవు చూచితివి(45) అని శివుడనగా విని రాజు వినయముగా ఇట్లనెను (46) పరమశివా! ఇతనాచరించిన ఆకృత్యమేమిటో వాస్తవముగా తెలియజేయుము. దేనిదే ఇతనీ మరణావస్థను పొందెను (47) అనగా పరమేశ్వరుడిట్లనెను మహారాజా! ప్రాణులన్నింటి భక్షకుడితను (48) ఈ క్రూరుడు నిన్ను భక్షించుటకై ఇపుడిక్కడకు వచ్చెను నావద్దకు వచ్చిన ఇతనిని నేను దహింతిని (49) అనేకుల క్షేమమును , అందునా నీక్షేమమును కోరుచూ దహించితిని (50) పావులు, అధర్మవర్తనులు, లోకసంహారమును చేయువారు పోషండవాదులు నా చేత వధింపబడెదరు. అని రుద్రుడనగా శ్వేతుడిట్లనెను (51) ఈ కాలముచేతనే లోకము పుణ్యమాచరించును కొందరు ధర్మనిష్టులై, కొందరు భక్తిరతులై మరికొందరు ఉపాసనారతులై వేరేకొందరు జ్ఞానులై కొందరు అధ్యాత్మయుక్తులై ముక్తులగుదురు.(53)

కాలో హి హర్తా చ చరాచరాణాం | తథా హ్యసౌ పాలకోప్యద్వితీయ:|

స స్రష్టా వై ప్రాణినాం ప్రాణభూతస్తస్మాదేనం జీవయస్వాశు భూయ:||54

యది సృష్టిపరోసి త్వం కాలం జీవయ సత్వరమ్‌ యది సంహారభూతో సి సర్వేషాం ప్రాణినామిహ||55

తర్హ్యేవం కురు శంభో త్వం కాలస్య చమహాత్మన:| వినా కాలేన యత్కించిద్భవిష్యతి న శంకర| 56

ఇతి విజ్ఞాపితస్తేన రాజ్ఞా శంభు: ప్రతాపినా చకార వచనం తస్య భక్తస్య చ చికీర్షతమ్‌ ||57

శంభు ప్రవాస్యాథ తదా మహేశ సంజీవయామాస పినాకపాణి :|

చకార రూపం చ యథా పురాసీద్‌ ఆలింగితోz సౌ యమదూతమధ్యే||

ఉపస్థితోసౌ త్వథ లజ్ఞమాన స్తుష్టావ దేవం వృషభద్వజం తమ్‌ |

నత్వా పుర స్థాగ్నిమయం హికాల :| సవిస్మయో వాక్యమిదం బభాషే||59

చరాచరముల హరించువాడు కాలము అట్లే అద్వితీయుడగు పాలకుడు కూడా. అతనే ప్రాణుల సృజించువాడు ప్రాణభూతమైన ఈ కాలమును నీవు జీవింపజేయుము నీవు సృషించువాడవైనచో వెంటనే కాలమును జీవింపజేయుము (54) సంహర భూతుడవైనచో ఈ మహాత్ముడగు కాలమును ఇట్లే చేయము (55) శంకరా! కాలము లేక ఏదీ జరుగదు కదా!(56) అని విన్నవించగా శివుడు భక్తుడు కోరినది చేయదలిచెను(57) అపుడు శివుడు నవ్వి కాలమును పునరుజ్ఞీవింపచేసెను. పూర్వమున్న రూపముతో కాలుని బ్రతికించగా యమదూతలు మధ్యనుంచుకొని కౌగిలించుకొనిరి (58) అపుడు కాలుడు సిగ్గుతో నిలిచి వృషభద్వజుడగు శివుని స్తుతించెను అగ్నిమయుని నమస్కరించి కాలుడు విస్మయముతో నిట్లనెను (59)

కాల ఉవాచ:

కాలాంతక త్రిపురేశ త్రిపురాంతకర ప్రబో మదనో హి త్వయా దేవ కృతో నంగో జగత్పతే||60

దక్షయజ్ఞవినాశశ్చ కృతో హి పరమాద్భుత: కాలకూటం దు:ప్రసహం సర్వేషాం క్షయకృన్మహత్‌||61

గ్రసితం తత్త్వయా శంభో అన్యేషామపి దుర్థరమ్‌ | లింగరూపేణ మహతా వ్యాప్తమాసీజ్జగత్త్రయమ్‌ ||62

లయనాల్లింగమిత్యుక్తం సర్వైరపి సురాసురై: యస్యాంతం న విదుర్దేవా బ్రహ్మవిష్ణుపురోగమా:||63

లింగస్య దేవదేవస్య మహిమానం పరస్య చ నమస్తే పరమేశాయ నమస్తే విశ్వమంగళ||

నమస్తే విశ్వకంఠాయ నమస్తసై#్మ కపర్దినే||64

నమో నమ: కారణకారణాయ | తే నమో నమ: మంగళమంగళాత్మనే 65

జ్ఞానాత్మనే జ్ఞానవిదాం మనీషిణాం| త్వమాదిదేవోzసి పుమాన్పురాణ:

త్వమేవసర్వం జగదేకబంధో | వేదాంతవేద్యోzసి మహానుభావ:|

మహానుభావై: పరికీర్తనీయ:| త్వమేవ విశ్వేశ్వర విశ్వమాన్య:||66

అపుడు కాలుడిట్లనెను కాలాంతకా! త్రిపురేశా! త్రిపురాంతకరా! ప్రభూ! మదనుడు నీచేతనేకదా ఆనంగుడిగా చేయబడెను! (60) ఓ జగత్పతీ ! పరమాద్బుతముగా దక్షయజ్ఞమును నాశమొనర్చితివి. అట్లే ఎవరు సహించలేనిదీ అందరినీ నాశనమొనర్చు కాలకూటమును నీవే మింగితివి ఈ ముల్లోకములూ గొప్ప లింగముచేతనే వ్యాపింపబడినవి (61,62) సురాసురులందరూ లయించుటచే లింగ మని అందురు బ్రహ్మ విష్ణు మొదలగు దేవతలెవరూ దాని అంతమును తెలియజాలదు (63) ఆ పరమ మహిమగల దేవదేవుని మహిమను తెలియలేరు. పరమేశా! విశ్వమంగళా! విశ్వకంఠా !కపర్దీ! నీకు నమస్కారము (64) కారణమునకే కారణమగు దేవా! మంగళమునకే మంగళస్వరూపా! జ్ఞానస్వరూపా! పురాణపురుషా! ఆదిదేవా! నీవే సర్వము, జగదేకబంధువు నీవే! వేదాంతముచే తెలియదగువాడవు ! మహానుభావులచే క్తీరింపబడదగువాడవు , విశ్వేశ్వరుడవు, విశ్వపూజ్యుడవు!(65,66)

త్వం పాసి లుంపసి జగత్త్రితయం | మహేశ స్రష్టాసి భూతపతిరేవ న కశ్చిదన్య:||67

ఇతి స్తుతస్తదా తేన కాలేన జగదీశ్వర:| ఉవాచ కాలో రాజానం శ్వేతం సంబోధయన్నివ||68

కాల ఉవాచ:

మనుష్యలోకే సకలే నాన్యస్త్వత్తో హి విద్యతే | యేన త్వయా జితో దేవో హ్యజేయో భువనత్రయే ||69

మయా హతమిదం విశ్వం జగదేతచ్చరాచరమ్‌ | జేతాహం సర్వదేవానాం సర్వేషాం దురతిక్రమ:||70

సహితే చానుగో జాతో మహారాజ ప్రయచ్చ మే | అభయం దేవదేవాచ్చ శూలిన: పరమేష్టిన:||71

ఏవముక్తస్తదా తేన శ్వేత: కాలేన చైవ హి | ఉవాచ ప్రవాసన్‌ వాచా మేఘనాదగభీరయా||72

నీవీముల్లోకములను రక్షించుచుంటివి, సంహరించి మరల సృష్టించుచుంటివి. నీవే భూతపతివి వేరొకడు కాదు.(67) అని కాలుడు జగదీశ్వరుడగు శివుని స్తుతించి రాజగు శ్వేతునితో నిట్లనెను (68) ముల్లోకములలో జయింపబడని దేవుని నీవు జయించితిని నీతో సముడు మనుష్యలోకమున వేరొకడు లేడు (69) చరాచరజగ్తును నేను నశింపజేసితిని. దేవతలందరికీ విజేతనగు నేను అందరికీ దురతిక్రముడను (70) అట్టి నేను నీ అనుచరుడినైతిని . దేవదేవుడు , పరమేష్టియగు శివుని నుండి నాకభయము నిమ్ము (71) అని కాలుడనగా నవ్వుచూ శ్వేతుడు మేఘగంభీర ధ్వనితో ఇట్లనెను(72)

రోజా వాచ:

శివస్య పరమం రూపం త్వమేకో నాస్తి సంశయ:| కాలస్త్వమసి భూతనాం స్థితిసంహరరూపవాన్‌ ||73

తస్మాత్పూజ్యతమోసి త్వం సర్వేషాం చ నియామక: త్వద్భయాత్కృతిన: సర్వే శరణం పరమేశ్వరమ్‌ | వ్రజంతి వివిధైర్భావైరాత్మలక్షణతత్పరా:||74

నిస్సంశయముగా నీవు శివుని పరమరూపానివి ప్రాణుల స్థితి సంహారరూపము గల వానిని.(73) కనుక, పూజ్యతముడవు, అందరిని నియమించువాడవు, నీభయమువలననే పుణ్యాత్ములు ఆత్మలక్షణతత్పరులై వివిధ భావములతో పరమేశ్వరుని శరణుజొచ్చెదరు.(74)

సూత ఉవాచ:

తేనైవం రక్షిత: కాలో రాజ్ఞా పరమధిర్మిణా | శివప్రసాదమాత్రేణ లబ్దసంజ్ఞో బబూవ హి||75

తదా యమేన స్తవితో మృత్యునా యమదూతకై: శివం ప్రణమ్య సంస్తుత్య శ్వేతం రాజానమేవ చ|| య¸° స్వమాలయం విప్రా మేనే స్వం జనితం పున:||76

మాయయా సహ పత్న్యా చ శివస్య చరితం మహత్‌ | అనుసంస్మృత్య సంస్మృత్య విస్మయం పరమం య¸°||77

కథయామాస సర్వేషాం దూతానాం స్వయమేవ హి | ఆకర్ణ్యతాం మమ వచో హే దూతాస్త్వరితేన హి||78

కర్తవ్యం చ ప్రయత్నేన నాన్యథా మమ భాషితమ్‌ ||79

సూతుడిట్లు చెప్పెను పరమధర్మాత్ముడగు రాజచే శివుని ప్రసాదమాత్రమున రక్షించబడిన కాలుడు స్పృహను పొందిన వాడాయెను (75) అపుడు యముడు తన దూతలచే శివస్తుతిని చేయించి తానూ నమస్కరించి,శ్వేతుడను రాజకు నమస్కరించి తన నివాసమునకు వెళ్లిను విప్రులారా! మరల తనకు జన్మయనియే చింతించెను (76) మాయయను తన పత్నితో శివుని చరితమును మరల మరల స్మరించుచూ పరమవిస్మయమును పొందెను (77) తానే స్వయముగా ఈ ఉదంతమును దూతలందరికీ చెప్పెను దూతలారా! త్వరగా నా మాట విని తప్పక ఆచరించుడు నా మాట వేరొక విధముగ కాదు(78,79)

కాల ఉవాచ:

యే త్రిపుండ్రం ధారయంతి తథా యే వై జటాధరా: యే రుద్రాక్షధరశ్చైవ తథా యే శివనామిన:||80

ఉపజీవనహేతోశ్చ భియా యే హ్యపి మానవా: పాపినోషి దురాచారా: శివవేషధరా హ్యమీ||81

నానేతవ్యా భవిద్భిశ్చ మమ లోకం కదాచన: వర్జ్యాస్తే హి ప్రయత్నేన పాపినోపి సదైవ హి||82

కాలుడు చెప్పెను: త్రిపుండ్రములను, జటలను, రుద్రాక్షలను ధరించి, శివనామములను గలవారినీ,(80) జీవించుటకై గాన భయముతో గానీ మానవులు ఎవరైనా , దురాచారులు పాపులైననూ, శివవేషమును ధరించినచో వారినీ (81) మీరు నా లోకమునకు తీసికొని రాకూడదు వారు పాపులైననూ ఎల్లప్పుడు వారిని విడిచివేయవలెను (82)

అన్యేషాం కా కథా దూతా యేర్చయంతి సదాశివమ్‌ | భక్త్యా పరమయా శంభుం రుద్రాస్తే నాత్ర సంశయ: 83

రుద్రాక్షమేకం శిరసా బిభర్తి య |స్తథా త్రిపుండ్రం చ లలాటమధ్యకే |

పంచాక్షరీం యే ప్రజపంతి సాధవ: | పైజ్యా భవద్భిశ్చ న చాన్యథా క్వచిత్‌ ||84

యస్మిన్‌ రాష్ట్రేzథవా దేశే గ్రామే చాపి విచక్షణ శివభక్తో న దృశ్యేత స్మశానాత్తు విశిష్యతే||

తద్రాష్టం దేశమిత్యాహు: సత్యం ప్రతివదామి వ:||85

యస్మిన్న సంతి నిత్యం హి శివభక్తిసమన్వితా:| తద్గ్రామస్థా జనా: సర్వే శాసనీయా న సంశయ:||86

ఏవమాజ్ఞాపయామాస యమోపి నిజకింకరాన్‌ | తథేతి మత్వా తే సర్వే తూష్ణీమాసన్‌ సువిస్మితా:||87

ఏవం విధోzయం భువనైకభర్తా| సదాశివో లోకగురు: స ఏక:|

దాతా ప్రహర్తా నిజభావయుక్త: సనాతనోయం జగదేకబంధు:||88

దగ్ద్వా కాలం మహాదేవో నిర్భయం చ దదౌ విబు: | శ్వేతస్య రాజరాజస్య మహీపాలవరస్య చ||89

ఇక ఎల్లప్పుడూ సదాశివుని అర్చించువారిని గూర్చి చెప్పునదేమి ? పరమభక్తితో శివుని అర్చించువారు నిస్సంశయముగా రుద్రులే (83) రుద్రాక్షను శిరస్సు పై ధరించువాడు లలాట మధ్యభాగమున త్రిపుండ్రమును ధరించువాడు, పంచాక్షరిని జపించు సాధువులు మీకు పూజ్యులు వేరొకవిధముగా కాదు| (84) ఏ రాష్ట్రమున గానీ దేశమున గానీ, గ్రామమున గానీ విచక్షణుడగు శివభక్తుడు కనిపించడో, ఆ రాష్ట్రము, దేశము స్మశానముకంటే విశేషమగునా? మీకు సత్యము చెప్పుచుంటివి (85) శివభక్తులు లేని గ్రామంలోని జనులను నిత్యము శాసించవలెను సంశయము లేదు (86) అని యముడు తన కింకరులను ఆజ్ఞాపించగా వారందరూ అలాగేనని విస్మయముతో మిన్నకుండిరి (87) ఇట్టివాడు రుద్రుడు, భువనములన్నిటి పాలకుడు , సదాశివుడు, లోకగురువు, అద్వితీయుడు దాత, శాసకుడు, ఆత్మభావయుక్తుడు, సనాతనుడు, జగద్బందువు(88) ఇక మహదేవుడు కాలుని దహించి మహారాజగు శ్వేతునికి అభయము నిచ్చెను (89)

తదా నిర్భయమాపన్న: శ్వేతరాజో మహామనా! భక్త్యా చ పరయా ముక్తో బభూవ కృతనిశ్చయ:||90

తదా దేవై: పూజ్యమాన ఋషిభి: పన్నగైస్తథా శ్వేతో రాజన్యవర్యో సౌ శివసాయుజ్యమాప్తవాన్‌ ||91

అపుడు నిర్బయమును పొందిన శ్వేతుడను బుద్దిమంతుడగు రాజు నిశ్చయముతో పరమభక్తితో ముక్తినిపొందెను.(90) అపుడు దేవతలు, పన్నగులు, తనను పూజించుచుండగా, రాజులలో శ్రేష్టుడగు శ్వేతుడు శివసాయుజ్యమును పొందెను.(91)

ఏవం భక్తిపరాణాం చ మహేశే చ జగద్దురౌ | సిద్దిః కరతలే తేషాం సత్యం ప్రతివదామి వ:||92

శ్వపచోపి వరిష్ట: స్యాత్‌ ప్రసాదాచ్చంకరస్య చ తస్మాత్సర్వప్రయత్నేన పూజనీయో హి శంకర:||93

బహునాం జన్మనామంతే శివభక్తి: ప్రజాయతే||94

జ్ఞానినాం కృతబుద్దీనాం జన్మజన్మని శంకరః కిం మయా బహునోక్తేన పూజనీయ: సదాశివ:||95

అత్రైవోదాహరం తీమమితిహాసం పురాతనమ్‌ కిరాతేన కృతం యచ్చ వ్రతం చ పరమాద్భుతమ్‌ || యేనైవ తారితం విశ్వం జగదేతచ్చరాచరమ్‌ ||96

ఇతి శ్రీ స్కాందపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కేదారఖండే శ్వేతరాజచరితే శివభక్తి ప్రభావేన కాలదహనవృత్తాస్తవర్ణనం నామ ద్వాత్రింశోధ్యాయ:

ఇట్లు జగద్గురువగు మహేశుని యందు శక్తి గలవారికి సిద్ది కరతలముననే వుండును. మీకు సత్యమును చెప్పుచుంటిని(92) శంకరుని అనుగ్రహము వలన చండాలుడైననూ శ్రేష్టుడగును కనుక ప్రయత్నముచే శంకరుని పూజించవలెను.(93)పెక్కు జన్మల చివర శివభక్తి కలుగును (94) నేను ఎక్కువ చెప్పి లాభ##మేమి?జ్ఞానులు నిశ్చితబుద్దితో ప్రతిజన్మలోనూ శివుని పూజించవలెను (95) ఈ సందర్బముగా కిరాతుడొకడాచరించిన పరమాద్బుతవ్రతమును దానిచే చరాచరజగత్తంతా తరింపబడుటనూ చెప్పు పురాతనమగు ఇతిహాసమును ఉదాహరింతురు.(96)

ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండము నందలి కేదారఖండమున శ్వేతరాజచరితయందు శివభక్తి ప్రభావముచే కాలుడు దహింపబడు వృత్తాంతమును వర్ణించుటయను ముప్పది రెండవ అధ్యాయము .

త్రయస్త్రింశోzధ్యాయ:

ఋషయో ఊచు:

కిన్నామా చ కిరాతోభూత్కిం తేన వ్రత మాహితమ్‌ | తత్త్వం కథయ విప్రేంద్ర పరం కౌతూహలం హి న:||1

తత్సర్వం శ్రోతుమిచ్చామో యాథాతథ్యేన కథ్యతామ్‌ | న హ్యన్యో విద్యతే లోకే త్వద్వినా వదతాం వర:|| తస్మాత్కథయ భో విప్ర సర్వం శుశ్రూషతాం హి న:||2

ఏవముక్తస్తదా తేన శౌనకేన మహాత్మనా కథయామాస తత్సర్వం పుష్కసేన కృతం చ యత్‌ || 3

లోమశ ఉవాచ:

ఆసీత్సురా మహారౌద్రశ్చండో నామ దురాత్మవాన్‌ | క్రూరసంగో నిష్కృతికో భూతానాం భయవాహక:||4

జాలేన మత్స్యాన్దుష్టాత్మా ఘాతయత్యనిశం ఖలు| భ##ల్లైర్మృగాంఛ్వాపదాంశ్చైవ కృష్ణసారాంశ్చ శల్లకాన్‌ ||5

ఖడ్గాంశ్చైవ దుష్టాత్మా దృష్ట్వా కాంశ్చిచ్చ పాపవాన్‌ | పక్షిణోఘాతయత్‌ క్రుద్దో బ్రాహ్మణాంశ్చ విశేషత:||6

లుబ్దకో హి మహాపాపో దుష్టో దుష్టజనప్రియ:| భార్యా తథావిధా తస్య పుష్కసస్య మహాభయా||7

ఏవం విహరతస్తస్య బహుకాలోత్యవర్తత| గతే బహుతిథే కాలే పాపౌఘనిరతస్యచ ||8

నిషంగే జలమాదాయ క్షుత్పిపాసార్దితో భృశమ్‌ ఏకదా నిశి పాపీయాన్‌ శ్రీ వృక్షోపరి సంస్థిత:|| కోలం హంతుం ధనుష్పాణిర్జాగ్రచ్చానిమిషేణ హి||9

ముప్పది మూడవ అధ్యాయము

ఋషులడిగిరి : ఆ కిరాతుని పేరేమి? అతడే వ్రతమాచరించెను? మాకు అధికముగా కుతూహలమున్నందున దానిని చెప్పుము. (1) దానినంతా మేము వినగోరుచున్నాము, వాస్తవముగా తెలియజేయుము. నీవు తప్ప ఈ లోకమున శ్రేష్టుడైన వక్తలేడు కనుక వినగోరుచున్న దానిని తెలియజేయుము(2) అని శౌనకుడు అడుగగా పుష్కసుడుచేసిన దానినంతా తెలియజెప్పసాగెను.(3) పూర్వము మహారౌద్రుడగు చండుడను దురాత్ముడు , క్రూరులతో కలిసి ప్రాణులకు భయమును కలిగించువాడుగా నుండెను.(4) ఎప్పుడూ జాలముతో చేపలను పట్టి చంపుచూ దుష్టాత్ముడై వుండెను భల్లూకములను, లేళ్ళను, ఖడ్గమృగములను ఇతర మృగములను పక్షులను విశేషముగా బ్రాహ్మణులను చంపుచుండెడివాడు(5,6) ఆ వేటగాడు మహాపాపి, దుష్టుడు, దుష్టజనులకే ఇష్టమైనవాడు, అట్లాంటిదే అతని భార్య(7) ఇట్లు అతను విహరించుచుండగా చాలాకాలము గడిచెను. ఒక్కనాడతను బాగా దప్పిగొని తిత్తిలో నీటిని తీసుకొని రాత్రి సమయాన బిల్వవృక్షము పై కూర్చుని చంపుటకై, చేత విల్లునుపట్టి మెలకువతో నుండెను(9)

మాఘమాసేzసితాయాం వై చతుర్దశ్యామథాగ్రత: మృగమార్గవిలో కార్థీ బిల్వపత్రాణ్యపాతయత్‌ ||10

శ్రీవృక్షపర్ణాని బహుని తత్ర స చ్చేదయామాస రుషాన్వితోపి| శ్రీ వృక్షమూలే పరివర్తమానే లింగం చ తస్యోపరి దుష్టభావ:||11

వవర్ష గండూషజలం దురాత్మా యదృచ్చయా తాని శివే పతంతి |

శ్రీవృక్షపర్ణాని చ దైవయోగాజ్ఞాతం చ సర్వం శివపూజనం తత్‌ ||12

గండూషవారిణా తేవ స్నపనం చ కృతం మహత్‌ | బిల్వపత్రైరసంఖ్యాతైరర్చనం చ మహత్కృతమ్‌ |13

అజ్ఞానేనాపి భో విస్రా: పుష్కసేన దురాత్మనా| మాఘమాసేసితే పక్షే చతుర్దశ్యాం విధూదయే||14

పుష్కసోzథ దురాచారో వృక్షాదవతతార స:| ఆగత్య జలసంకాశం మత్స్యాన్‌ హంతుం ప్రచక్రమే||15

లుబ్దకస్యాపి భార్యాభూన్నామ్నా చ ఘనోదరీ| దుష్టా సా పాపనిరతా పరద్రవ్యాపహారిణీ ||16

గృహాన్నిర్గత్య సాయాహ్నే పురద్వారబహిస్థితా| వనమార్గం ప్రపశ్యంతీ పత్యురాగమనేచ్చయా||17

చిరాద్భర్తరి నాయాతే చింతయామాసలుబ్దకీ అద్య సాయాహృవేళాయామాగతా :సర్వలుబ్దకా:||18

తమ: స్తోమేన సంఛన్నాశ్చతస్రో విదిశో దిశ:రాత్రౌ యామద్వయం యాతం కిం మతంగ: సమాగత:||19

మాఘకృష్ణ చతుర్దశినాడు మృగమార్గమును చూచుకోరికతో బిల్వపత్రములను నేలరాల్చెను.(10) కోపముతో బిల్వ పత్రములనతడు తెంపి పడవేయసాగెను ఆ చెట్టు కిందనున్న లింతముపై దుష్టభావములనతడు తెంపి పడవేయసాగెను.(11)అనుకోకుండా ఆ బిల్వపత్రములు, పుక్కిటి నీరు క్రిందనున్న లింగాకార శివుని పై పడగా దైవయోగముచే అదంతా శివపూజ ఆయెను.(12) పుక్కిటి నీరుతో స్నానముచేయించి అనేక బిల్వపత్రాలతో ఆ కిరాతుడు తెలియకుండానే మాఘకృష్ణ చతుర్ధశీ చంద్రోదయమునాడు శివునర్చించెను (13) అటు తరువాత పుష్కసుడు చెట్టు పై దిగి, మడుగు వద్దకు వచ్చి చేపలను చంపసాగెను(15) ఇక ఆ వేటగాని భార్య ఘనోదరి యను పేరుగలది, దుష్టపాపనిరత, పరద్రవ్యమునపహరించునది.(16) సాయంకాలమున ఇంటినుండి బయటకు వచ్చి ఇంటి బయట నిలుచుండి భర్తరాకకై ఎదురుచూచుచూ వనమార్గమును చూచుచుండెను (17) ఎంతకూ భర్తరానందుచే ఆమె ఇట్లాలోచింపసాగెనుఈనాడు సాయంకాలముననే వేటగాళ్ళందరూ వచ్చేసిరి (18) దిక్కులన్నీ చీకటితో కప్పబడినవి రాత్రి రెండుజాములు గడిచిననూ నాభర్తరాడేమి?(19)

కిం వా కేసరలోభేన సింహేనైవ విదారిత:| కిం భుజంగఫణారత్నహారీ సర్పవిషార్దిత:||20

కిం వా వరాహదం ష్ట్రాగ్రఘాతై: పంచత్వమాగత:| మధులోభేన వృక్షాగ్రాత్స వై ప్రపతితో భువి||21

క్వాన్వేషయామి పృచ్చామి క్వ గచ్చామి చ కం ప్రతి ఏవం విలప్య బహుధా నివృత్తా స్వం గృహం ప్రతి||22

నైవాన్నం నో జలం కించిన్న భుక్తం తద్దినే తయా! చింతయంతీ పతిం చాపి లుబ్దకీ త్వనయన్నిశామ్‌ ||23

అథ ప్రభాతే విమలే పుష్కసీ వనమాయ¸°| అశనార్దం చ తస్యాన్నమాదాయ త్వరితా సతీ||24

భ్రమమణా వనే తస్మిన్దదర్శ మహతీం నదీమ్‌ | తస్యాస్తీరే సమాసీనం స్వపతి ప్రేక్ష్య హర్షితా||25

తదన్నం కూలత: స్థాప్య నదీం తర్తుం ప్రచక్రమే| నిరీక్ష్య చాథ యత్స్యాన్‌ స జాలప్రోతాన్‌ సమానయత్‌|| 26

తావత్తయోక్తశ్చండో సావేహి శీఘ్రం చ భిక్షయ| అన్నం త్వదర్తమానీతముపోప్య దివసం మయా||27

కృతం కిమద్య రే మంద గతేహని చ కిం కృతమ్‌ | నాశితం చ త్వయా మూడ లంఘితేనాద్య పాపినా||28

నద్యాం స్నాతౌ తథా తౌచ దంపతీ చ శుచివ్రతౌ |యావద్గతశ్చ భోక్తుం స తావచ్చ్యాస్వయమాగత:||29

తేన సర్వం భక్షితం చ తదన్నం స్వయమేవ హి| చండీ ప్రకుపితా చైవ శ్వానం హంతుముపస్థితా||30

కేసరములపై లోభముతో సింహముచే చంపెబడెనా ఏమి? భుజంగముల పై నుండి మణులను హరించు, వాని విషముచే అసువులబాసెనా? (20) అడవిపంది కోరల పాలబడి ప్రాణములు కోల్పోయెనా? తేనె పొందు లోభముతో చెట్టెక్కి దానిపైనుండి క్రిందబడియుండునా?(21)ఎక్కడని వెదకను? ఎవరిని ఆడగను ? ఎవరివద్దకు వెళ్ళను? అని అనేక రీతుల విలపించి తన ఇంటినుండి బయటకు వెడలెను (22) ఆనాడు ఆమె నీరు తాగలేదు. అన్నం తినలేదు భర్తగూర్చి ఆలోచించుచూ రాత్రిని గడిపెను (23)ఇక పొద్దుననే ఆ స్త్రీ భర్త తినవలెనని అన్నమును తీసుకొని త్వరగా వనమునకు వచ్చెను(24)వనములో తిరుగుచూ ఒకపెద్దనదిని దాని ఒడ్డున కూర్చున్న తన భర్తను ఆమె చూచి సంతోషించినది.(25) ఆ అన్నమును ఒడ్డుననే వుంచి నదిని దాట సాగెను, ఇంతలో ఆ కిరాతుడు జాలమున బడిన చేపలను చూచి వానిని తీసుకొని వచ్చెను. (26) అపుడు ఆ స్త్రీ భర్తతో త్వరగా రా ఈ అన్నాన్ని నీ కోసం నేను పగలంతా ఉపవాసమునుండి తెచ్చాను తిను.(27) నిన్న ఈనాడు ఏం చేసావు? మూర్ఖుడా ! తినకుండానే వున్నావు! (28) అనగా ఆ కిరాతుడు అతని భార్య నదియందు స్నానము చేసి శుచియైరి ఇక ఆ వేటగాడు భోజనము చేయబొవుచుండగా కుక్క ఒకటి వచ్చెను. (29) అన్నాన్నంతా అదే స్వయంగా తిని వేయగా ఆ కిరాతస్త్రీ కోపించి కుక్కను కొట్టబోయెను.(30)

అవయోర్భక్షితం చాన్నమనేనైవ చ పాపినా| కిం చ భక్షయసే మూఢ భవితాద్య బుభుక్షిత:||31

ఏవం తయోక్తశ్చండోzసౌ బభాషే తాం శివప్రియ యచ్చునా భక్షితం చాన్నం తేనాహం పరితోషిత:||32

కిమనేన శరీరేణ నశ్వరేణ గతాయుషా | శరీరం దుర్లభం లోకే పూజ్యతే క్షణభంగురమ్‌||33

యే పుష్ణంతి నిజం దేహం సర్వభావేన చాహతా:| మూఢాస్తే పాపినో జ్ఞేయా లోకద్వయబహిష్కృతా :||34

తస్మాన్మానం పరిత్వజ్య క్రోధం చ దురవగ్రహమ్‌ | స్వస్థా భవ విమర్శేన తత్త్వబుద్ద్యా స్థిరా భవ||35

బోధితా తేన చండీ సా పుష్కసేన తదా భృశమ్‌ | జాగరాది చ సంప్రాప్తు : పుష్కసోzపి చతుర్ధశీమ్‌ ||36

శివరాత్రిప్రసంగాచ్చ జాయతే యుద్ద్యసంశయమ్‌ | తజ్ఞానం పరమం ప్రాప్త: శివరాత్రిప్రసంగత:||37

యామద్వయం చ సంజాతమమావస్యాం తత్ర వై| ఆగతాశ్చ గణాస్తత్రబహవ: శివనోదితా|| 38

విమానాని బహున్యత్ర ఆగతాని తదంతికమ్‌ | దృష్టాని తాన్యేన విమానాని గణాస్తథా||39

ఉవాచ పరయా భక్త్యా పుష్కసోపి చతాన్ప్రతి | కస్మాత్సమాగతా యూయం సర్వే రుద్రాక్షధారిణ||40

విమానస్థాశ్చ కేచిచ్చ వృషారుఢాశ్చ కేచన| సర్వే స్పటికసంకాశా: సర్వే చంద్రార్థశేఖరా :||41

కపర్దినశ్చర్మపరీతవాససో భుజంగభోగై: కృతహారభూషణా:|

శ్రియాన్వితా రుద్రసమానవీర్యా యథాతథం భో వదతాత్మనోచితమ్‌ || 42

మన అన్నాన్ని ఈ పాపిష్టి కుక్క తినివేసినది మూర్ఖుడా | ఇంక నీవేమి తినెదవు? ఇక ఆకలితో వుండవలెను(31) అని అనగా చండుడు ఆమెను ఉద్దేశించి ఇట్లనెను కుక్క తిన్న అన్నముతో నేను సంతోషించితిని (32) ఆయుష్షుకోల్పోయి నశించు స్వభావముగల ఈ శరీరముతో నేమి లాభము? క్షణభంగురమైన ఈ దుర్లభ శరీరము పూజింపబడును (33) అన్ని విధాలుగా ఈ దేహమును పోషించుకొను మానవులు, పాపులు అని తెలియవలయును, వారు ఇహ, పరలోకములనుండి బహిష్కరింపబడుదురు. (34) కనుక, కోపమును అభిమానమును వీడి స్వస్థురాలవు గమ్ము, విమర్శించి వాస్తవబుద్దితో స్థిరముగా నుండును (35) అని కిరాతుడు ఆ చండికి వాస్తవమును తెలియజేసెను పుష్కసుడు చతుర్ధశినాడు జాగరణం చేసి, శివరాత్రి ప్రసంగముచేత శివరాత్రినాడు ఏ ఫలమగు జ్ఞానము కలుగునో దానిని పొందెను (37) అమావాస్యనాడు రెండు జాములు గడిచి, అమావాస్యరాగా శివుని పనుపున పెక్కు గణములక్కడికి వచ్చినవి (38) కిరాతుని గణములు, పెక్కు విమానములురాగా చూచి,పుష్కసుడు (వేటగాడు) పరమభక్తితో వారితో నిట్లనెను మీరందరూ ఇక్కడకేల వచ్చితిరి? మీరందరూ రుద్రాక్షముల ధరించారు.(40) కొందరు విమానములో నుండగా కొందరు వృషభముల పై కూర్చున్నారు మీరంతా స్పటికములవలె మెరియుచూ అర్థచంద్రుని శిరము పై ధరించినారు (41) జటాజుటములను కృత్తివాసమును సర్పములను ధరించి శోభించుచున్నారు రుద్రుని తేజస్సుతో సమానమగు తేజస్సుగల మహానుభావులారా! మీరెవరో నిజముగా చెప్పండి.(42)

పుష్క సేన తదా పృష్టా ఊచు సర్వే చ పార్షదా : రుద్రస్య దేవదవస్య సంనమ్రా : కమలేక్షణా:||43

గణా ఊచు:

ప్రేషితా: స్మో వయం చండ శివేన పరమేష్ఠినా | ఆగచ్చ త్వరితో భూత్వా సస్త్రీకో యానమారుహ||44

లింగార్చనం కృతం యచ్చ త్వయా రాత్రౌ శివస్యచ | తేన కర్మవిపాకేన ప్రాప్తోసి శివసన్నిధిమ్‌ ||45

తథోక్తో వీరభ##ద్రేణ ఉవాచ ప్రవాసన్నివ | పుష్కసోzపి స్వయా ఋద్ద్యా ప్రస్తావసదృశం వచ:||46

పుష్కస ఉవాచ:

కిం మయా కృతమద్యైవ పాపినా హింసకేన చ | మృగయారసికేనైన పుష్కసేన దురాత్మనా ||47

పాపాచారో హ్యహం నిత్యం కథం స్వర్గం వ్రజామ్యహమ్‌ కథం లింగార్చనమిదం కృతమస్తి తదుచ్యతామ్‌ ||48

పరం కౌతుకమాపన్న: పృచ్చామి త్వాం యథాతథమ్‌ | కథయస్వ మహాభాగ సజర్వం చైవ యథావిధి||49

ఇత్యేవం పృచ్చతస్తస్య పుష్కసస్య యథావిధి|| కథయామాస తత్సర్వం శివధర్మం ముదాన్విత:||50

అని కిరాతుడడుగగా దేవదేవుడగు రుద్రునికి విధేయులు, కమలలోచనులగు ఈ దూతలిట్లనిరి.(43) చండా! పరమేష్టియగు శివుడు పంపగా వచ్చినాము, నీ భార్యతో సహా త్వరగా విమానము నెక్కుము (44) రాత్రియందు శివుని లింగార్చన చేసితివి. ఆ కర్మఫలముగా శివుని సన్నిధిని పొందితివి (45) అని వీరభద్రుడనగా నవ్వి ఆ కిరాతుడు తన బుద్దితో ప్రస్తావపూర్వకముగా నిట్లనెను.(46)పాపి హింసకుడవగు నేను నేడు చేసినదేమి? వేటయందాసక్తి గలవాడను, దురాత్ముడిని నేను(47) పాపము నాచరించు నేను స్వర్గమునకెట్లు వెళ్లెదను? లింగార్భనమును నేనెట్లు చేసితినో చెప్పండి (48)నాకు మిక్కిలి కుతూహలముగా నున్నది వాస్తవము తెలుపుడు (49) అని కిరాతుడడుగగా వీరభద్రుడు సంతోషముతో యథావిధిగా శివధర్మమును చెప్పనారంభించెను (50)

వీరభద్ర ఉవాచ-

దేవదేవో మహదేవో దేవానాం పతిరీశ్వర: | పరితుష్టోద్య హే చండ స మహేశ ఉమాపతి:|| 51

ప్రాసంగికతయా మఘె కృతం లింగార్చనం త్వయా | శివతుష్టికరం చాద్య పూతోzసి త్వం న సంశయ:|| శివరాత్ర్యాం ప్రసంగేన కృతమర్చనమేవ చ|| 52

కోలం నిరీక్షమాణన బిల్వపత్రాణి చైవ హి | చ్చేదితాని త్వయా చండ పతితాని తదైవ హి|| లింగస్య మస్తకే తాని తేన త్వం సుకృతీ ప్రభో ||53

తతశ్చ జాగరో జాతో మహాన్‌ వృక్షోపరి ధృవమ్‌ | తేనైవ జాగరేణౖవ తుతోష జగదీశ్వర:||54

ఛలేనైన మహాభాగ కోలసందర్శనేన హి శివరాత్రి దినే చాత్ర స్వప్నస్తే న చ యోషిత:||55

తేనోపవాసేన చ జాగరేణ తుష్టో హ్యసౌ దేవవరో మహాత్మా!

తవ ప్రసాదాయ మహాననుభావో దదాతి సర్వాన్‌ వరదో మహాంశ్చ||56

ఏవముక్తస్తదా తేన వీరభ##ద్రేణ ధీమతా! పుష్కసోపి విమానాగ్ర్యమారురోహ చ పశ్యతామ్‌ ||57

గణానాం దేవతానం చ సర్వేషాం ప్రాణినామపి | తదా దుందుభయో నేదు: భేర్యస్తూర్యాణ్య నేకశ:||58

'కిరాతుడా! దేవదేవుడు ఉమాపతి , దేవేశుడు అగు ఈశ్వరుడు నేడు సంతోషించినాడు (51) అనుకోకుండానే నీవు మాఘమాసమున శివుపూజ నొనరించితివి. అది శివునికి సంతోషమును కలిగించును నేడు నీవు నిస్పంశయముగా పవిత్రుడనైతివి.(52) శివరాత్రినాడు ప్రసంగవశాత్తు శివార్చనము చేసితివి. అదెట్లనిన ఆడవిపందిని గూర్చి నిరీక్షించుచూ బిల్వపత్రములను నీవు తెంపగా అవి అప్పుడు కిందనున్న శివలింగము పై పడినవి. దానిచే నీవు పుణ్యాత్ముడవైతివి(53) అట్లే చెట్టు పై మేల్కొని వుంటివి, దానిచే ఈశ్వరుడు సంతోషించెను (54) అడవిపందిని చూచు మిషతో శివరాత్రినాడు నీవుకానీ, నీ భార్యాకానీ నిద్రించలేదు (55) ఆ ఉపవాసముచే, జాగరణచే దేవవరుడగు మహేశ్వరుడు సంతోషఙంచెను నీవు ప్రసన్నుడవగుటకు వరములనన్నింటినీ ఇచ్చుచున్నాడు (56) అని ధీమంతుడగు వీరభద్రుడనగా పుష్కసుడు కూడా గణములు, దేవతలు అన్ని, ప్రాణులు చూచుచుండగా విమానమునెక్కెను(57) అపడు దేవదుందుభులు, భేరీ, తూర్య వాద్యములు మ్రోగెను. (58)

వీణావేణుమృదంగాని తస్య చాగ్రే గతాని చ | జగుర్గంధర్వపతయో ననృతూశ్చాప్సరో గణా:||59

విద్యాధరగణా: సర్వే తుష్టువు : సిద్దచారణా! చామరైర్వీజ్యమానో హి చత్రైశ్చ వివిధైరపి||

మహోత్సవేన మహతా ఆనీతో గంధమాదనమ్‌ ||60

శివసన్నిధిమగమచ్చండో సౌ తేన కర్మణా| శివరాత్య్రుపవాసేవ పరం స్థానం సమాగమత్‌||61

పుష్కసోపి తథా ప్రాప్త: ప్రసంగేన సదాశివమ్‌ | కింపున : శ్రద్దయా యుక్తా శివాయ పరమాత్మనే||62

పుష్పాదికం ఫలం గంధం తాంబూలం భక్ష్యమృద్దిమత్‌ యే ప్రయచ్చంతి లోకేస్మిన్రుద్రాస్తే నాత్ర సంశయ:||63

చండేన వై పుష్కసేన సఫలం తస్య చాభవత్‌ | ప్రసంగేనాపి తేనైవ కృతం తచ్చాల్పబుద్దినా||64

ఋషయ ఊచు:-

కిం ఫలం తస్య చోద్దేశ: కేన చైవ పురా కృతమ్‌| కస్మాద్ర్వతమిదం జాతం కృతం కేన పురా విభో ||65

లోమశ ఉవాచ-

యదా సృష్టం జగత్సర్వం బ్రహ్మణా పరమేష్టినా | కాలచక్రం తదా జాతం పురా రాశిసమన్వితమ్‌ ||66

ద్వాదశరాశయస్తత్ర నక్షత్రాణి తథైవ చ| సప్తవింశతిసంఖ్యాని ముఖ్యాని కార్యసిద్దయే||67

అతని ఎదుటనుండి వీణావేణు మృదంగములు నడచుచుండెను గంధర్వ రాజులు గానము చేసిరి, అప్సరగణములు నర్తించిరి. (59) సిద్ద చారణులు విద్యాధరగణములు అతనిని వివిధ చత్రముల పట్టి చామరములతో వీచుచూ స్తుతించిరి. అట్లు అతనిని గొప్ప వేడుకతో గంధమాదనముకు తెచ్చిరి.(60) శివరాత్రినాడు ఉపవాసముండుటచే శ్వేతుడు పరమస్థానము అగు శివుని సన్నిధిని చేరెను (61) కిరాతుడే ఆ విధంగా యాదృచ్చికంగా చేసిన శివపూజా సదాశివుని చేరిన, శ్రద్దగా అర్చించు వారిని గూర్చి చెప్పునదేమి? (62) పరమాత్మయగు శివునికి పుష్పములు మున్నగునవి, ఫలములు,గంధము, తాంబూలము,భక్ష్యము మున్నగునవి సమర్పించినవారు నిస్సంశయముగా రుద్రులే (63) అల్పబుద్ది యగు కిరాతుడట్లు ప్రాసంగికముగా శివుని యర్చించి శివసాన్నిధ్యము నొందెను (64) అని చెప్పగా ఋషులిట్లడిగిరి ఆ వ్రతమును పూర్వమెవరు చేసిరి? దాని ఉద్దేశము, ఫలము ఏమి? దేనినుండి వ్రతము వచ్చినది? (65) అని ప్రశ్నించగా లోమశుడు చెప్పసాగెను. పూర్వము పరమేష్టియగు బ్రహ్మ జగత్తునంతా సృజించినపుడు రాశులతో కాలచక్రమేర్పడినది.(66) అందు పన్నెండు రాశులు అట్లే ఇరువదియేడు నక్షత్రములు ముఖ్యముగా కార్యసిద్దికై ఏర్పడినవి.(67)

ఏభి: సర్వం ప్రచండం చ రాశిభిరుడుభిస్తధా| కాలచక్రాన్వితా: కాల: క్రీడయన్‌ సృజతే జగత్‌ ||68

ఆబ్రహ్మ స్తంబపర్యంతం సృజత్యవతి హంతి చ| నిబద్దమస్తి తేనైవ కాలేనైకేన భో ద్విజా:||69

కాలో హి బలవాంల్లోకే ఏక ఏవ న చాపర: | తస్మాత్కాలాత్మకమిదం సర్వం నాస్త్యత్ర సంశయ:||70

ఆదౌ కాల: కాలనాచ్చ లోకనాయకనాయక: | తతో లోకా హి సంజాతా : సృష్టిశ్చ తదనంతరమ్‌ ||71

సృష్టేర్లవో హి సంజాతో లవాచ్చ క్షణమేవ చ | క్షణాచ్చ నిమిషం జాతం ప్రాణినాం హి నిరంతరమ్‌ ||72

నిమిషాణాం చ పష్ట్యా వై పల ఇత్యభిదీయతే | పంచదశ్యా అహోరాత్రై: పక్ష ఇత్యభిధీయతే ||73

పక్షాభ్యాంమాస ఏవ స్యాన్మాసా ద్వాదశ వత్సర:| తం కాలం జ్ఞాతుకామేన కార్యం జ్ఞానం విచక్షణౖ:||74

ప్రతిపద్దినమారభ్య పౌర్ణమాస్యంతమేవ చ| పక్ష: పూర్ణో హి యస్మాచ్చ పూర్ణిమేత్వభిదీయతే||75

పూర్ణచంద్రమసీ యా తు సాపూర్ఱా దేవతాప్రియా | నష్టస్తు చంద్రో యస్యాం వా అమా సా కథితా బుదైః||76

అగ్నిష్వాత్తాదిపితృణాం ప్రియాతీవ బభూవ హ| త్రింశద్దినాని హ్యేతాని పుణ్యకాలయుతాని చ||77

ఈ రాశులతో, నక్షత్రములతో అంతా ప్రచండము అట్టి కాలచక్రముతో కూడి కాలము క్రీడించుచూ జగత్తును సృజించును. (68)బ్రహ్మ మొదలు స్థూలము వరకు సృజించును, పాలించును, సంహరించును ఆ ఒక్క కాలముచేతనే అంతా కూర్చబడినది.(69) లోకమున కాలమొకటే బలమైనది వేరోకటి లేదు కనుక ఇదంతా నిస్సంశయముగా కాలాత్మకమైనది.(70) మొదటి కాలము, అంతట సృష్టికర్త తరువాత లోకములు, వివిధ సృష్టి (71) సృష్టి నుండి లవము దానినుండి క్షణము దానినుండి నిమిషం ప్రాణుల నిరంతర నిమిషములివి (72) ఈ నిమిషములు అరవై పలమనబడును పదిహేను రాత్రింబవళ్ళు కలిసి పక్ష మనబడును.(73) రెండు పక్షములతో మాస మనబడును. ఇట్టి పన్నెండు మాసములైన సంవత్సరమనబడును. ఆ కాలమును తెలియగోరినవారు జాగ్రత్తగా తెలుసుకొనవలెను (74) పాడ్యమినుండి పౌర్ణపక్షము కనుక పూర్ణిమ'యనబడును. (75) పూర్ణచంద్రుడున్నది పూర్ణ అని దేవతల కిష్టమైనది చంద్రుడు కనబడనిది అమా యనబడును. (76) ఇది అగ్నిష్వాత్తు మొదలగు పితరులకు ప్రియము ఇటువంటి ముప్పది దినములు పుణ్యకాలముతో కూడినది.(77)

తేషాం మధ్యే విశేషో యస్తం శ్రుణుధ్వం ద్విజోత్తమా:||77

యోగానాం వా వ్యతీపాత ఉడూనాం శ్రతస్తథా | అమావస్యా తిథీనాం చ పూర్ణిమా వై తథైవ చ|| 78

సంక్రాంతయస్తథా జ్ఞేయా: పవిత్రా దానకర్మణి తథాష్టమీ ప్రియా శంభోర్గణశస్య చతుర్థికా||79

పంచమీ నాగరాజస్య కుమారస్య చ షష్టికా | భానోశ్చ సప్తమీ జ్ఞేయా నవమీ చండికాప్రియా||80

బ్రహ్మణో దశమీ జ్ఞేయా రుద్రసై#్యకాదశీ తధా| విష్ణుప్రియా ద్వాదశీ చ అంతకస్య త్రయోదశీ||81

చతుర్ధశీ తధా శంభో : ప్రియా నాస్త్యత్ర సంశయ | నిశీథ సంయుతా యా తు కృష్ణపక్షే చతుర్దశీ|| ఉపోష్యా సా తిథి: శ్రేష్టా శివసాయుజ్యకారిణీ||82

శివరాత్రి తిథి: ఖ్యాతా సర్వపాపప్రణాశినీ | అత్రైవోదాహరంతీమమితిహాసం పురాతనమ్‌ ||83

ద్విజులారా! వాని మధ్యనున్న విశేషమును వినుడు.(77) యోగములలో వ్యతీపాతము ,నక్షత్రములలో శ్రవణ నక్షత్రము, తిథులలో పూర్ణిమ , అమావాస్య(78) మరియు సంక్రాంతులు దానకర్మయందు పవిత్రములు, అట్లే శివునికి అష్టమీ గణశునికి చతుర్ది, (79) నాగరాజుకు పంచమి, కుమారస్వామికి షష్టి, సూర్యునికి సప్తమీ, చండికకు నవమి (80)బ్రహ్మకు దశమి , రుద్రునికి ఏకాదశి, దామోదురునికి ద్వాదశి, యమునకి త్రయెదశి,(81) శివునికి చతుర్థశి తిథులు అత్యంత ప్రియములు,సంశయములేదు కృష్టపక్షమున రాత్రితో కూడిన చతుర్ధశిన ఉపవాసమును వుండవలెను. శివసాయుజ్యమును కలిగించు శ్రేష్టమైన తిథి ఇది.(82) ఇదే పాపములన్నింటిని నశింపజేయు శివరాత్రి తిథియని పేరొందినది ఈసందర్భముగా ఈ పురాతనమగు ఇతిహాసమును ఉదాహరింతురు.(83)

బ్రాహ్మణీ విధవా కాచిత్పురా హ్యాసీచ్చ. చంచలా| శ్వపచాభిరతా సా చ కామకీ కామహేతుత:||84

తస్యాం తస్య సుతో జాత: శ్వపచస్య దురాత్మన:| దు:సహో దుష్టనామాత్మా సర్వధర్మబహిష్కృత:||85

మహాపాపప్రయోగాచ్చ పాపమారభ##తే సదా| కితవశ్చ సురాపాయీ స్తేయీ చ గురుతల్పగ:||86

మృగయుశ్చ దురాత్మాసౌ కర్మచండాల ఏవ స| అధర్మిష్టో హ్యసద్వృత్త: కదాచిచ్చ శివాలయమ్‌ ||87

శ్రవణం శైవశాస్త్రస్య యదృచ్చాజాతమంతికే | శివస్య లింగరూపస్య స్వయంభువో యదా తదా||88

స ఏకత్రోషితో దుష్ట: శివరాత్య్రాం తు జాగరాత్‌ | తేన కర్మవిపాకేన పుణ్యాం యోనిమవాప్తవాన్‌||89

భుక్త్వా పుణ్యతమాంల్లోకానుషిత్వా కానుషిత్వా శాశ్వతీస్సమా : చిత్రాంగదస్య పుత్రో భూద్భూపాలేశ్వరలక్షణ:||90

నామ్నా విచిత్రవీర్యోసౌ సుభగ :సుందరీప్రియ: | రాజ్యం మహత్తరం ప్రాప్య ని:స్తంభో హి మహానభూత్‌ ||91

శివే భక్తిం ప్రకుర్వాణ: శివకర్మపరోzభవత్‌ | శైవశాస్త్రం పురస్కృత శివపూజనతత్పర:|| రాత్రౌ జాగారణం యత్నాత్కరోతి శివసన్నిధౌ||92

శివస్య గాథా గాయంస్తు ఆనందాశ్రు కణాన్ముహు: ప్రముంచశ్చైవ నేత్రాభ్యాం రోమాంచపులకావృత:||93

ఆయుష్యం చ గతం తస్య శివధ్యానపరస్య చ | శివో హి సులభో లోకే పశూనాం జ్ఞానినామపి||94

సంసేవితుం సుఖప్రాపై#్య హ్యేక ఏవ సదాశివ:| శివరాత్ర్యుపవాసేన ప్రాప్తో జ్ఞానమనుత్తమమ్‌||95

పూర్వము చంచల, విధవయగు ఒక బ్రాహ్మణి యుండెను, కాముకియగు ఆ స్త్రీ చండాలునితో రమించినది.(84) వారికిపేరుచే స్వభావముచే దుష్టుడగు దు:సహుడను వాడు జన్మించెను. ధర్మములన్నింటిని విడిచినవాడు.(85) అనేక మహాపాపముల నాచరించువాడు, ద్యూతము,సురాపానము ,చౌర్యము, వ్యభిచారము (గురుతల్పమును పొందుట) (86) వేట మొదలగు వ్యసనములు గలవాడు, కర్మచే చండాలుడే వాడు, అధర్మవర్తనుడై చెడుపనులాచరించుచూ ఒకనాడు శివాలయమును చేరి శివరాత్రినాడు శివుని చెంతనుండెను.(87) అనుకోకుండా శివశాస్త్రమును శివుడు లింగరూపమున నుద్భవించునపుడు వినెను (88) శివరాత్రినాడు మేల్కొని ఒకచోటనున్న వాడు ఆపుణ్యఫలములచే పుణ్యమైనజన్మను పొందెను.(89) పుణ్యతమలోకములలో పెక్కు సంవత్సరాలు సుఖములను అనుభవించి రాజలక్షణములతో చిత్రాంగదుని పుత్రుడై జన్మించెను (90) సుందరుడగు అతని పేరు విచిత్రవీర్యుడు గొప్ప రాజ్యమునూ పొందెను శివభక్తి కలిగి శివార్చనను శివశాస్త్రము ననుసరించి చేయువాడాయెను రాత్రి సమయాన ప్రయత్నముతో శివుని చెంత జాగరణము చేయును (92) శివుని కథలు వినునపుడు ఆనందబాష్పములు రాలును , రోమాంచము కలుగును (93) అట్టి శివధ్యానపరునికి ఆయుష్షు తీరగా , శివలోకమును చేరెను . శివుడు జ్ఞానముగల పశువులకూ సులభుడే .సుఖము పొందుటకు సేవించదగిన వాడు శివుడొకడే ఆ విచిత్రవీర్యుడు శివరాత్రినాడుపవసించి ఉత్తమజ్ఞానమును పొందెను (95)

జ్ఞానాత్సర్వమను ప్రాప్తం భూతసామ్యం నిరంతరమ్‌ | సర్వభూతాత్మకం జ్ఞాత్వా కేవలం చ సదాశివమ్‌ || వినా శివేన యత్కించిన్నాస్తి వస్త్వత్ర న క్వచిత్‌ ||96

ఏవం పూర్ణం నిష్ర్పపంచం జ్ఞానం ప్రాప్నోతి దుర్లభమ్‌ | ప్రాప్తజ్ఞనస్తదా రాజా జాతో హి శివవల్లభ:||97

ముక్తిం సాయుజ్యతాం ప్రాప్త: శివరాత్రోపోషణాత్‌ | తేన లబ్దం శివాజ్ఞన్మ పురా యత్కథితం మయా||98

దాక్షాయణీవియోగాచ్చ జటాజుటేన విస్తరాత్‌ | య ఉత్పన్నో మస్తకాచ్చ శివస్య పరమాత్మన:|| వీరభ##ద్రేతి విఖ్యాతో దక్షయజ్ఞవినాశన!:99

శివరాత్రివ్రతేనైవ తారితా బహవ: పురా ప్రాప్తా: సిద్దిం పురా విప్రా భరతాద్యాశ్చ దేహిన:||100

మాంధాతా దుంధుమారిశ్చ హరిశ్చంద్రాదయో నృపా: ప్రాప్తా: సిద్దిమనేనైవ వ్రతేన పరమేణ హి||101

తతోగిరీశో గిరిజా సమేత: క్రీడాన్వితో సౌ గిరిరాజమస్తకే| ద్యూతం తథైవాక్షయుతం పరేశో

యుక్తో భవాన్యా స భృశం చకార|| 102

ఇతి శ్రీ స్కాందపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కేదారఖండే శివరాత్రివ్రతమాహాత్మ్యవర్ణనం నామత్రయస్త్రీంశోద్యాయ:

ఆ జ్ఞానముచే భూతములందు సమదృష్టి యతనికి ఎల్లప్పుడూ ప్రాప్తించిది. అన్ని ప్రాణుల రూపమున కేవలుడగు సదాశివుడుండుని తెలిసెను. శివుడు లేనిదే ఏ వస్తువైననూ ఎప్పుడూననూ లేదు.(96) ఇట్లు సంపూర్ణమైన నిర్వికార జ్ఞానమును, దుర్లభమగు దానిని పొంది ఆ రాజు శివునికిష్టుడాయెను. (97) శివరాత్రి ఉపవాసముండుటచే శివసాయుజ్యరూపముక్తిని పొందెను. ఉపవాసముచేతనే అతను శివుని నుండి విచిత్ర వీర్య జన్మను పొందెనని చెప్పితిని.(98) సతీదేవి వియోగముచే, జటాజూట విస్తారముచే శివుని తలనుండి జన్మించినవీరభద్రుడు యక్షయజ్ఞవినాశకుడు (99) ఇతరులుకూడా శివరాత్రి వ్రతముచే తరించిరి. విప్రులారా! పూర్వము భరతాది మానవులు కూడా సిద్దిని పొందిరి(100) మాంధాత, దుంధుమారి , హరిశ్చంద్రుడు మొదలైన రాజుల ఈ వ్రతముచేతనే సిద్దిని పొందిరి. (101) అటు తరువాత ,పరమశివుడు పార్వతితో కలిసి హిమవత్పర్వత శిఖరము పై ద్యూతక్రీడనాడసాగెను.(102)

ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమున

కేదారఖండమందు శివరాత్రిమాహాత్మ్యవర్ణనమును ముప్పది మూడవ అధ్యాయము.

చతుస్త్రింశోధ్యాయ:

లోమశ ఉవాచ-

రాజ్యం చకార కైలాసం దేవదేవో జగత్పతి| గణౖ: సమేతో బహుభిర్వీరభద్రాన్వితా మహాన్‌ ||1

ఋషిభి: సహితో రుద్రో దేవైరింద్రాదిభి సహ | బ్రహ్మ యస్య స్తుతిపరో విష్ణు: ప్రేష్యవదాస్ధిత:||2

ఇంద్రో దేవగుణౖ: సార్థం సేవాధర్మపరోభవత్‌ | యస్యచ్చత్రధరశ్చంద్రో వాయుశ్చామరధక్తథా||3

సూపాన్నకర్తా సతతం జాతవేదా నిరంతరమ్‌ | గంధర్వా గాయకా యస్య స్తావకాశ్చ పినాకిన:||4

విద్యాధరాశ్చ బహవస్తథా చాప్సరసాం గణా: | ననృతుశ్చాగ్రగా యస్య సోzసౌ కైలాసపర్వతే||5

పుత్రైర్గణశసందాద్యైస్తథా గిరిజయా సహ| రాజ్యం ప్రతాపిభిశ్చ క్రేశంకశ్చంక్రమణన చ||6

యేనాంధకో మహాదైత్య : స దేవానామరిర్మహాన్‌ | దుష్టో విద్దస్త్రిశూలేన గగనే స్ధాపితశ్చిరమ్‌ ||7

హత్వా గజాసురం యేన ఉత్కృత్య చర్మ వై కృతమ్‌ | చిరం ప్రావరణం దివ్యం తథా త్రిపురదీపనమ్‌ || విష్ణునా పాల్యభూతేన రేజే సర్వాంగసుందర:||8

ముప్పది నాలుగవ అధ్యాయము

లోమశుడు చెప్పసాగెను దేవదేవుడు, జగత్పతి యగు శివుడు వీరభద్రునితో ఇతర గణములతో కూడి కైలాసమున రాజ్యము చేసెను (1) ఇంద్రాది దేవతలతో ఋషులతో కలిసివుండగా బ్రహ్మ అతనికి స్తుతిపరుడై యుండెను . విష్ణువు వలెనుండెను.(2)దేవగణములలో ఇంద్రుడు సేవచేయువాడై యుండెను. చంద్రుడు ఛత్రమును, వాయువు, చామరమును ధరించియుండిరి.(3)అగ్ని నిరంతరము అన్నమును, సూపమును చేయువాడై యుండెను గంధర్వులు శివుని స్తుతించు గాయకులై యుండిరి.(4)విద్యాధరులు అప్సరసల గణాలు శివుని ఎదుట నర్తించిరి అట్టి శివుడు కైలాసపర్వతమున గిరిజతో , గణశకుమారస్వాములతో ఏశంకా లేక ప్రతాపవంతులతో రాజ్యమును చేయసాగెను. (5,6) ఎవరిచే దేవతల శత్రువగు మహాధైత్యుడు అంధకుడు త్రిశూలముచే కొట్టబడిఆకాశమున చిరకాలముంచబడెనో (7) ఎవరిచే గజాసురుడు చంపబడి, అతని చర్మము చాలాకాలముగా వస్త్రముగా చేసుకొనబడెనో , ఏ ప్రావరణము మూడు పురములను ప్రకాశింపజేయునదో అట్టి శివుడు భూతములను పాలించు విష్ణువుతో సర్వాంగసుందరుడై విలసిల్లెను.(8)

తం ద్రష్టుకామో భగవాన్నారదో దివ్యదర్శన య¸° చ పర్వత శ్రేష్టం కైలాసం చంద్రపాండురమ్‌ ||9

సుధయా పరయా చాపి సేవితం పరమాద్బుతమ్‌ | కర్పూరగౌరం చ తదా దృష్ట్యా తం మహాబలమ్‌ ! నారదో విస్మయావిష్ట: ప్రవిష్టో గంధమాదనమ్‌ 10

అనేకాశ్చర్యసంయుక్తం తపనైశ్చ సుశోభితమ్‌ | గాయద్విద్యాధరీభిశ్చ పూరితం చ మహాప్రభమ్‌||11

కల్పద్రుమాశ్చ బహవో లతాభి: పరివేష్టితాః | ఘనచ్చాయాసు తాస్వేవ విశిష్టా: కామధేనవ:||12

పారిజాతవనామోదలంపటా బహవొలయ: కలహంసాశ్చ బహవ: క్రీడమానా: సరస్సు చ ||13

శిఖండినో మహచ్చక్రుస్తత్ర కేకారవం ముదా | పంచమాలాపిన: సర్వే విహంగా సంమదాన్వితా:||14

కరిణ: కరిణీభిశ్చ మోదమానా : సువర్చస: | సింహాస్తథా గర్జమానా: శార్దూలై: సహ సంగతా:||15

వృషభా నందిముఖాశ్చ రేభమానా నిరంతరమ్‌ | దేవద్రుమాశ్చ బహవస్తథా చందనవాటికా:||16

నాగపుంనాచవకులాశ్చంపకా నాగకేసరా :| తథా చ వనజంబ్వశ్చ తథా కనకకేతకా:||17

దివ్యమగు దర్శనముగల నారదుడు శివుని దర్శించగోరి చంద్రుని వలె తెల్లనైన కైలాసమను పర్వతశ్రేష్టమునకు వెళ్ళెను.(19) అమృతముతో సేవింపబడుచున్న ఆ కైలాసము కర్పూరమువలె తెల్లగా అద్బుతముగా నుండుట జూచి నారదుడు విస్మయముతో గంధమాదనమునకు వెళ్లెను(10) అది అనేకాశ్చర్యములతో గానముచేయు విద్యాధర స్త్రీలతో నుండి గొప్ప కాంతితో నుండెను(11) కల్పవృక్షములు పెక్కు లతలతో కూడుకొని యుండెను, వాని దట్టమైన నీడలో విశిష్టమగు కామదేనువులుండెను.(12) పారిజాత వన సుగంధమును పొందు లాలసతో పెక్కు తుమ్మెదలు తిరుగుచుండెను సరస్సులయందు పెక్కు కలహంసలు క్రీడించుచుండెను (13) నెమళ్ళు ఆనందముతో గొప్ప దైన కేకారవమును చేయుచుండెను మదించిన పక్షులు పంచమ స్వరమున ఆలాపించుచుండెను(14) చక్కని కాంతి గల ఏనుగులు ఆడేనుగులతో ఆనందించుచుండెను .సింహములు గర్జించుచుండెను.(15) నంది మొదలగు వృషభములు నిరంతరము రంభారవములు చేయుచుండెను.దేవద్రుమాలు , చందన వాటికలు అనేకములు అక్కడ వుండెను. (16) నాగ, పున్నాగ,వకుల, చంపక, నాగకేసర, నేరేడి బంగారు కేతక వృక్షములనేకములుండెను.(17)

కల్హారా: కరవీరాశ్చ కుముదాని హ్యనేకశ: మందరాశ్చ బదర్యశ్చ కముకా: పాటలాస్తథా ||18

తథ్యానే బహనో వృక్షా! శంభోస్తోషకారా హ్యమీ | ఐకపద్యేన దృష్టాస్తే నానాద్రుమలతాన్వితా:||18

ఆరామా బహవస్తత్ర ద్విగుణాశ్చ బభూవిరే ||19

గగనాన్నిసృత: సద్యో గంగౌఘ: పరమాద్బుత: | పతితో మస్తకే తస్య పర్వతస్య సుశోభితే ||20

కూపో హి పయసాం యేన పవిత్రం వర్తతే జగతే | సోపి ద్విదా తదా దృష్టో నారదేవ మహాత్మనా||21

సర్వం తదా ద్విధాభూతం దృష్టం తేన మహాత్మనా |నారదేన తదా విప్రా: పరమేణ నిరీక్షిత:||22

ఏవం విలోకమానోzసౌ నారదో భగవానృషి:| త్వరితేన తథా యాత:శివాలోకనతత్పర:||23

యావద్ద్వారి స్థితోzపశ్యన్‌ మహదాశ్చర్యమేవ చ | ద్వారపాలౌ తదా దృష్టా కృతకౌ విశ్వకర్మణా||24

నారదో మోహితో హ్యాసీత్పప్రచ్చ చ స తౌ తదా| అహం ప్రవేష్టుమిచ్చామి శివదర్శనలాలస:25

తస్మాదనుజ్ఞా దాతవ్వా దర్శనార్థం శివస్య చ | అశ్రుణ్వన్తౌ తదా దృష్ట్యా నారదో విస్మితోzభవత్‌ ||26

కల్హారములు, కరవీరములు, కుముదములు, మందర, రేగి, కముక, పాటల వృక్షములు(18) మరియు అనేక వృక్షములు శివునకానందము కలిగించునవై యుండెను. అనేక వృక్షములు లతలతో ఆరామములు ఒక్కమారుగా రెండింతలై కనబడుచూ విలసిల్లెను.(19) ఆకాశము నుండి జాలువారిన పరమాద్భుతమగు గంగాప్రవాహము శోభిల్లు పర్వత శిఖరము పై పడెను.(20) ఆ నీటి నెలవుచే జగత్తు పవిత్రము చేయబడెను. నారదుడు అదికూడా రెండుగా నుండులను చూచెను (21) ఆ విధముగా ప్రతిదీ రెండుగా కనబడెను. బ్రాహ్మణులారా! ఈ విధముగా నారదుడు చూచుచుండెను.(23) ద్వారము వద్దనిలబడి చూడగా గొప్ప ఆశ్చర్యమును కలిగించు కృత్రిమ ద్వారపాలకు లిద్దరు విశ్వకర్మచే చేయబడి అక్కడ కనబడిరి.(24) భ్రమనొందిన నారదుడు వారిని ఇట్లడిగెను. శివుని చూడగోరి నేను ప్రవేశించగోరుచున్నాను (25) కనుక నాకు శివుని చూచుటకు అనుమతినివ్వవలెను. అనగా వారు వినకుండుటను చూచి నారదుడు విస్మయమును పొందెను.

జ్ఞానదృష్ట్యా విలోక్యాథ తూష్ణీంభూతోభవత్తదా| కృత్రిమౌ హి చ తౌ జ్ఞాత్వా ప్రవిష్టోహి మహామనా:||27

తథాన్యే తత్సరూపాశ్చ దృష్ట్యాస్తేన మహాత్మనా| ఋషి: ప్రణమితసైశ్చ నారదో భగవాన్ముదా||28

ఏవమాదీన్యనేకాని ఆశ్చర్యాణి దదర్శన: దదర్శాథ చ సువ్యక్త్యం త్ర్యంబకం గిరిజాన్వితమ్‌ ||29

అర్దాసనగతాసాధ్వీ శంకరస్య మహాత్మన: | తనయా గిరిరాజస్య యయా వ్యాప్తం జగత్త్రయమ్‌ ||30

గౌరీ సితేక్షణా బాలా తన్వంగీ చారులోచనా| యయారూపీ కృత: శంభురుపాదేయ: కృతో మహాన్‌||31

నిర్వికారో వికారైశ్చ బహుభిర్వికలీకృత: | అర్దాంగలగ్నా సాదేవీ దృష్టా తేన శివస్య చ ||32

నారదేన తథా శంభు: దృష్టస్త్రిభువనేశ్వర:| శుద్దచామీకరప్రఖ్య: సేష్యమాన: సురాసురై:||33

శంఖేన భోగివర్యేణ సేవితం చాంఘ్రిపంకజమ్‌ | ధృతరాష్ట్రేణ చ తథా తక్షకేణ విశేషత:||

తథా పద్మేన మహతా శేషిణాపి విశేషత:||34

అన్యైశ్చ నాగవర్యైశ సేవితో హి నిరంతరమ్‌ | వాసుకి: కంఠలగ్నో హి హారభూతో మహాప్రభ:||35

తరువాత జ్ఞానదృష్టితో చూచి మిన్నకుండెను వారు కృతిమ విగ్రహములని తెలిసి లోనికి వెళ్ళెను.(27) అక్కడ విజ్ఞుడగు నారదునికి అలాంటి రూపమ గల వారు కనబడిరి, వారు ఋషికి నమస్కరించిరి.(28) ఇట్టి అనేక అశ్చర్యములను చూచి, చివరకు సువ్యక్తముగా గిరిజతో కూడిన శివుని చూచెను(29) శంకరుని అర్థాసనమున ముల్లోకముల వ్యాపించిన పార్వతి యుండెను (30) పార్వతి చల్లని చూపులతో చక్కని శరీరముతో ఉండెను. అట్టి గౌరిచే కదా శివుడు రూపవంతుడిగా గ్రహింపయోగ్యునిగ చేయబడినాడు (31) నిర్వికారుడైననూ పెక్కు వికారములతో వికలముగాచేయబడెను. శివుడా పార్వతి అర్ధాంగమున నుండుటనుచూచెను(32) అపుడు నారదుడు ముల్లోకములకు ప్రభువగు శివుని చూచెను. అపుడు శివుడు స్వచ్చమగు బంగారు వర్ణముతో నుండి దేవదానవులచే పూజింపబడుచుండెను (33) సర్పశ్రేష్టుడగు శంఖుడను వాడు శివుని పాదకమలములనర్చించుచుండెను. దృతరాష్ట్రుడు, తక్షకుడు, పద్ముడు, శేషుడు (34) మరియు ఇతర సర్పరాజులతని ఎల్లప్పుడూ సేవించుచుండెను. వాసుకి కంఠమునకు చుట్టుకొని సదాశివునికి హారమాయెను.(35)

కంబళాశ్వతరౌ నిత్యం కర్ణభూషితౌ| జటామూలగతాశ్చాన్యే మహాఫణివరా హ్యమీ ||36

అనేకజాతిసంవీతా నానావర్ణాశ్చ పద్మిన:| తక్షక కులిక: శంఖో ధృతరాష్ట్రో మహాప్రభ:||37

పద్మో దంభ: సుదంభశ్చ కరాలో భీషణస్తదా| ఏతే చాన్యే చ బహవో నాగాశ్చాశీవిషా హ్యమీ||38

అంగభూతా హరస్యాస్య పూజ్యస్యాస్య జగత్త్రయే | ఫణౖకయా శోభమానా: కేచిద్దిపన్నగోత్తమా :||39

ఫణానాం ద్వితయం కేషాం త్రితయం చ మహాప్రభమ్‌ | చతుష్కం పంచకషట్కం స్తపకం చాష్టకం తథా||40

నవకం దశకం చైవ తథైకాదశకం త్వథ| ద్వాదశకం చాష్టాదశకమేకోనవిశకం తథా||41

చత్వారింశత్ఫణా| కేపి పంచాశత్కం చ షష్టికమ్‌ | సప్తతిశ్చాప్యశీతిశ్చ నవతిశ్చ తథైవ చ||42

తథా శతసహస్రాణి హ్యయుతప్రయుతాని చ | అర్చుదాని చ రత్నాని తథా శంఖమితాని చ||43

అనంతాశ్చ ఫణా యేషాం తే సర్పా: శివభూషణా: దృష్టాస్తదానీం తేసర్వే నారదేన మహాత్మనా ||44

కంబళ అశ్వతరములు ఎల్లప్పుడూ చెవికి అలంకరణములాయెను . ఇతర శ్రేష్టసర్పములు జటామూలమున నుండెను(36) అనేక జాతులకు, వర్ణములుకు చెందిన తక్షక, కులిక, శంఖ, ధృతరాష్ట్ర ,పద్మ, దంభ, సుదంభ, కరాళ, మరియు ఇతర విషసర్పములు (37,38) ముల్లోకములయందు పూజ్యుడగు శివునికి అంగములాయెను. మరికొన్ని ఒక పడగచే శోభిల్లుచుండెను (39) కొన్ని రెండు పడగలతో మరికొన్ని మూడింటితో , కొన్నినాలుగు, కొన్ని ఐదు, మరికొన్ని ఆరు, కొన్ని ఏడు, కొన్ని ఎనిమిది పడగలను కలిగియుండెను (40) కొన్ని పదకొండు, మరికొన్ని పన్నెండు , కొన్ని పద్దెనిమిది, కొన్ని పంతొమ్మిది పడగలతో నుండెను.(41) నలభై పడగలతో కొన్ని, యభైపడగలతో కొన్ని , అరవై పడగలతో కొన్ని వుండగా , కొన్ని ఎనబై , కొన్ని తొంబై పడగలను కలిగివుండెను.(42) అట్లే వంద, వెయ్యి, పదివేలు, లక్ష, అర్బుద, రత్న, శంఖ, అనంత సంఖ్యలో పడగలతో సర్పములు శివుని కాభరణము లై యుండుటను మహత్ముడగు నారదుడు చూచెను.(43,44

)

విద్యావంతోపి తేప సర్వే భోగినోపి సుశోభితా| హారభూషణభూతాస్తే మణిమంతోమితప్రభా:||45

అర్దచంద్రాంకితో యస్య కపర్దస్త్వతి సుందర: చక్షుషా చ తృతీయేన ఫాలస్థేన విరాజిత:||46

పంచవక్త్రో మహదేవో బాహుభిర్దశభిర్వృత:| తథా మరకతశ్యామకంధరోతీవ సుందరమ్‌ ||47

ఉరో యస్య విశాలం చ తథో రు జఘనం పరమ్‌ | చరణద్వయం చ రుద్రస్య శోభితం పరమం మహత్‌ ||48

తద్‌ దృష్టం చరణారవిందమతులం తేజోమయం సుందరమ్‌ | సంధ్యారాగసుమంగళం చ పరమం తాపాపనుత్తింకరమ్‌ ||

తేజోరాశికరం పరాత్పరమిదం లావణ్యలీలాస్పదం | సర్వేషాం సుఖవృద్దికారణపరం శంభో: పదం పావనమ్‌||49

తథైవ దృష్ట్యా పరమం పరాణాం పరా సతీ రూపవతీ చసుందరీ|

సౌభాగ్యలావణ్యమహావిభూత్యా విరాజమానా హ్యతిసుందరీ శుభా||50

దృష్ట్యా తౌ దంపతీ శుద్దౌ రాజమానౌ జగత్త్రయే |అభిన్నౌ భేదమాపన్నౌ నిర్గుణౌ గుణినౌ చ తౌ||51

సాకారౌ చ నిరాకారౌ నిరాతంకౌ సుఖప్రదౌ|వవందే చ ముదా తౌ స నారదో భగవత్ప్రియ:|| ఉత్ధాయోత్థాయ చ తదా తుష్టావ జగదీశ్వరౌ||52

విద్యావంతులై ఆ సర్పములు శోభిల్లుచుండి గొప్ప కాంతిగల మణులతో హారముల భూషణములైనవి (45) తలపై అర్థచంద్రునితో నుదురు పై మూడువ కంటితో పరమశివుడు మిగులు సుందరముగా నుండెను (47) వక్షస్థలము,జఘనము విశాలముగానుండి, పాదములు గొప్ప కాంతితో రాజిల్లుచుండెను (48) ఆ చరణముల రెంటిని చూచెను అది సాటిలేనిది. తేజస్సు కలిగి సంధ్యారాగ కాంతితో మంగళ##మై తాపమును తొలగించు పదద్వయము తేజస్సును కలిగించునది, పరాత్పరము,లావణ్యలీలకు నెలవు, అందరికీ సుఖమును వర్ధిల్లచేయునది. పరమ పవిత్రమగు శివుని పదద్వయమది(49) అట్లు చూచే సుందరి,సతియగు పార్వతి సౌభాగ్యలావణ్యములచే, మహా ఐశ్వర్యముచే విరాజిల్లు చున్నది.(50) భగవంతునికి ప్రియుడగు నారదుడు భేదము లేకున్నవారు భిన్నమై, గుణములు లేకున్ననూ గుణముల పొందిన వారిని, ఆకారములు లేకున్ననూ ఆకారముల ధరించు పార్వతీ పరమేశ్వరులను ముల్లోకముల విరాజిల్లుచుండగా చూచెను(51) వారు ఆతంకములు లేక, సుఖమునిచ్చువారు అట్టి వారికి సంతోషముతో నమస్కరించి నారదుడు మరల మరల లేచిస్తుతించెను.(52)

నతోస్మ్యహం దేవవశౌ యువాభ్యాం | పరాత్పరాభ్యాం కళయా తథాపి |

దృష్టా మయా దంపతీ రాజమానౌ| ¸° బీజభూతౌ సచరాచరస్య||53

పితరౌ సర్వలోకస్య జ్ఞాతౌ చాద్యైవ తత్త్వత:| మయా నాస్త్యత్ర సందేహో భవతో: కృపయా తథా ||54

ఏవం స్తుతౌ తదా తేన నారదేన మహాత్మనా | తుతోష భగవాన్‌ శంభు: పార్వత్యా సహితస్తదా|| 55

మహాదేవ ఉవాచ-

సుఖేన స్థీయతే బ్రహ్మన్‌ కిం కార్యం కరవాణి తే | తచ్చృతా వచనం శంభోర్నారదో వాక్యమబ్రవీత్‌ ||56

దర్శనం జాతద్యైవ తేన తుష్టోస్మ్యహం విభో| దర్శనాత్సర్వమేవాద్య శంభో మమ న సంశయ:||57

క్రీడనార్ధమిహాయతా: కైలాసం పర్వతోత్తమమ్‌ | హృదిస్టో హి సదా నృణామాస్థితో భగవాన్‌ ప్రభో ||58

తథాపి దర్శనం భావ్యం సతతం ప్రాణినామిహ||59

గిరిజోవాచ-

కా క్రీడా హి త్వయా భావ్యా వద శీఘ్రం మమాగ్రత: తస్యాస్తద్వచనం శ్రుత్వా ఉవాచ ప్రహసన్నివ||60

ద్యూతక్రీడా మహాదేవి దృశ్యతే వివిధాత్ర చ | భ##వేద్ద్వాభ్యాం ద్యూతే హి రమణాచ్చ మహత్సుఖమ్‌ ||61

ఇత్యేవముక్త్యోపరతం సఖీ భృశమువాచ వాక్యం కుపితా ఋషిం ప్రతి|

నారదుడనెను దేవతలారా! పరాత్పరులైన మీకు నమస్కరించుచున్నాను- చరాచరమునకు బీజమైన దంపతులను విరాజిల్లుచుండగా చూచితిని (53) నేడే మిమ్ముసర్వలోకమునకు తల్లిదండ్రులుగా తెలిసితిని సందేహములేదు మీకృప యట్టిది (54) అని నారదుడు స్తుతించగా పార్వతితోప సహా శివుడు సంతోషించెను (55) అపుడు మహాదేవుడగు శివుడిట్లనెను బ్రహ్మర్షీ! సుఖముగా నుంటిరా మీకు కార్యము చేయగలను నేను? అనగా నారదుడిట్లనెను నేడు మీ దర్శనము కలుగగా సంతోషించితిని.దర్శనమాత్రాన సర్వము నాకు చెందినదే అగును దేవా! సందేహము లేదు.(57) కేవలము క్రీడకై ఈ కైలాసమునకు వచ్చితిని. భగవాన్‌ నీవే మానవులందరి హృదయమున నుండువాడవు (58) అయిననూ ప్రాణులకెల్లప్పుడూ దర్శనము భావించతగినదే కదా! (59) అనగా పార్వతి అనెను ఏ క్రీడనాలోచించితివి. త్వరగా నా ఎదుట చెప్పుము అనగా విని నవ్వుచూ నారదుడిట్లనెను (60)మహాదేవి! ఇక్కడ జూదము అనేక రీతుల కనబడుచున్నది ఇద్దరూ జూదమాడుచుండగా ఆనందించిన గొప్ప సుఖము కలుగును, అని మిన్నకుండిన నారదుని చూచి కోపించి పార్వతి అతనితో నిట్లనెను.(61)

కథం విజానాని పరం ప్రసిద్దం ద్యూతం చ దుష్టోదరకం మనస్వినామ్‌ ||62

త్వం బ్రహ్మపుత్రోపి మునిర్మనీషిణాం శాస్తాహివాక్యైం వివిధై: ప్రసిద్దై:||

చరిష్యమాణో భువనత్రయే సదా న హిత్వదన్యో హ్యపరో మనస్వీ||63

ఏవముక్తస్తదా దేవ్యా నారదో దేవదర్శన్‌ః | ఉవాచ ప్రవాసన్‌ వాక్యం గిరిజాం శివసన్నిదౌ|| 64

నారద ఉవాచ-

ద్యూతం న జానామి న చాశ్రయామి హ్యహం తపస్వీ శివకింకరశ్చ కథం చ మాం పృచ్చసి రాజకన్యకే యోగీశ్వరాణాం పరమం పవిత్రే || 65

నిశమ్య వాక్యం గిరిజా సతీ తదా హ్యువాచ వాక్యం చ వివాస్య తం ప్రతి| జానాసి సర్వం చ బటోద్య పశ్యమే ద్యూతం మహేశేన కరోమితేగ్రత:||66

ఇత్యేవముక్త్వా గిరిజకన్యకా జగ్రాహ చాక్షాన్భువనైకసుందరీ| క్రీడాం చకారాథ మహర్షిసాక్ష్యకే తత్రాస్థితా సా హి భ##వేన సంయుతా||67

తౌ దంపతీ క్రీడయా సజ్ఞమానౌ దృష్టౌ తదా ఋషిణా నారదేన| సవిస్మయోత్పుల్లమనా మనస్వీ విలోకమానోతితరాం తుతోష||68

సఖీజనేన సంవీతా తదా ద్యూతపరా సఖీ | శివేన సహ సంగత్వ చ్చలాద్ద్యూతమకారయత్‌ ||69

స పణన చ తదా చక్రే చలేన మహతా వృత: | జితా భవానీ చ తదా శివేన ప్రవాసన్నివ||70

అభిమానవంతులు గర్హించు ద్యూతమును నీవెట్టెఱిగెదవు? (62) నీవు బ్రహ్మపుత్రుడవు మునివి, జ్ఞానుల శాసకుడివి,వివిధ ప్రసిద్ద వాక్యములతో ముల్లోకముల చరించు నీకంటే గొప్ప మనస్వి లేడు (63) అనగా దివ్యదర్శనుడైన నారదుడు నవ్వుచూ శివుని వద్ద పార్వతితోనిట్లనెను (64) నాకు ద్యూతము తెలియదు ఆశ్రయించను కూడా నేను తపస్సు చేసుకొను వాడిని, శివుని అనుచరుడిని రాజకన్యా! పరమయోగీశ్వరుని నన్ను అడిగెదవెందులకు? (65) అనగా విని నవ్వి పార్వతి నీకంతా తెలుసు. నీఎదుట ఈశ్వరునితో నేనాడెదను చూడుము? (66) అని పాచికలను తీసికొనెను నారదమహర్షిని సాక్షిగా చేసిశివునితో పార్వతి ద్యూతక్రీడ నాడసాగెను (67) మనస్వియగు నారదుడు పార్వతీపరమేశ్వరులట్లు క్రీడలో మునుగుట చూచి విస్మయముతో కళ్ళు విప్పారగా చూచి బాగా సంతోషించెను (68) అపుడు ద్యూతపరురాలై పార్వతి చెలులతో కలిసి మోసముతో ద్యూతమునాడెను .(69) శివుడు పందెము కూడా బడ్డెను. కాని మోసమున బడి పార్వతియే ఓడిపోయెను.(70)

నారదోస్యా: శివేనాథ ఉపహాసకరోభవత్‌ | నిశమ్య హారితం ద్యూతముపహాసం నిశమ్య చ||71

నారదస్య దురుక్రైశ్చ కుపితా పార్వతీ భృశమ్‌ | ఉవాచ త్వరితా చైవ దత్త్వా చైవార్దచంద్రకమ్‌ ||72

తథా శిరోమణి చైవ తరళే చ మనోహరే | ముఖం సుశోభనం చైవ తథా కుపితసుందరమ్‌ ||దృష్టం హరేణ చ పున: పునర్ద్యూతమకారయత్‌ ||73

తథా గిరిజయా ప్రోక్త: శంకరో లోకశంర: హారితం చ మయా దత్త: పణ ఏవ చ నాన్యథా||74

క్రియతే చ త్వయా శంభో క: పణో హి తదుచ్యతామ్‌ | తత: ప్రవాస్య చోవాచ పార్వతీం చ త్రిలోచన:|75

మయా పణోయం క్రియతే భవాని త్వదర్థమేతచ్చ విభూషణం మహత్‌ | సౌ చంద్రలేఖా హి మహాన్షి హార స్తథైవ కర్ణోత్పలభూషణద్దయమ్‌ ||76

ఇదమేవ త్వయా తన్వి మాం జిత్వా గృహ్యతాం సుఖమ్‌ | తత: ప్రవర్తితం ద్యూతం శంకరేణ సహైవ చ||77

ఏవం విక్రీడమానౌ తావక్షివిద్యావిశారదౌ| తదా జితో శంకరో బహుభూషణ:||78

ప్రవాస్య గౌరీ ప్రోవాచ శంకరం త్వతిసుందరీ హారితం చ పణం దేహి మమ చాదైవ శంకర||79

తదామహాశ: ప్రవాసన్‌ సత్యం వాక్యమువాచ హ|

శివుని చేతిలో పార్వతి ఓడిపోవుటనుచూచి నారదుడు పరిహసించుచుండగా విని (71) అతని పరుషమైన పరిహాసవాక్కులకు మిక్కిలి కోపించిన పార్వతి అతనికి బదులిచ్చి అర్థచంద్రకమును ఇచ్చినది(72) అట్లే సుందరమైన రెండు శిరోమణులను ఇచ్చివేసినది అపుడామె ముఖము కోపముతో మరింత సుందరమైనది అది చూచి శివుడు మరల ద్యూతక్రీడవారంభించెను.(73) అంతట పార్వతి లోకపవిత్రుడగు శంకరునితో ఓడిపోయినందుచేతనే నేను పందెము నిచ్చివేసితిని శంకరా! ఇక నీవు దేనిని పందెమున ఒడ్డెదవో చెప్పుము అనెను (74) అపుడు త్రిలోచనుడు నవ్వుచూ పార్వతితో ఇట్లనెను.(75) పార్వతీ ఇదిగో నీకోసంనేను ఈ అభరణాన్ని చంద్రలేఖను, హారముగా, కర్ణభూషణముగా పెట్టుచుంటిని (76) నన్ను జయించి సుఖముగా వీనిని తీసుకొనుము అనెను ద్యూతము పార్వతీపరమేశ్వరుల మధ్య కోనసాగెను (77) ఈ విధముగా పాచికలాటలో నేర్పరులైన వారిద్దరూ ఆడసాగిరి. కొంతసేపటికి శివుని పార్వతి జయించెను.(78) అపుడు పార్వతి నవ్వుచూ ఓడిపోతిని కదా: ఒడ్డిన పణమునునాకు ఇచ్చివేయుము అనెను(79) అపుడు శంకరుడు నవ్వుచూ సత్యమునిట్లు పలికెను.

న జితో హం త్యయా తన్వి తత్త్వతో హి విమృశ్యతామ్‌ | 80

అజేయోహం ప్రాణినాం సర్వథైవ తస్మాన్న వాచ్యం తు వచో హి సాధ్వి|

ద్యూతం కురుష్వాద్య యథేష్టమేవ జేష్యామి చాహం చ పున: ప్రపశ్య||81

తదాంబికాహ స్వపతిం మహేశ | మయా జితోస్యద్య న విస్మయోzత్ర| ఏవముక్త్యా తదా శంభుం కరే గృహ్య వరాననా| జితోసి త్వం న సందేహస్త్వం న జానాసి శంకర|| 82

ఏవం ప్రవాస్య రుచిరం గిరిజా తు శంభుం | సా ప్రేక్ష్య నర్మ వ చ సా స తయాzభిభూత:|

దేహితి మే సకలమంగళమంగళేశ| యద్దారితం స్మరరిపో వచసానుమోదితమ్‌ ||83

శివ ఉవాచ-

అజేయోzహం విశాలాక్షి తవ నాస్త్యత్ర సంశయ: | అహంకారేణ యత్ప్రోక్తం తత్త్వతస్తద్విమృశ్యతామ్‌||84

తస్య తద్వచనం శ్వుత్వా ప్రోవాచ హి వివాస్య సా| అజేయో హి మహాదేవ: సర్వేషామపి వై ప్రభో ||85

మయైకయా జితోసి త్వం ద్యూతేన విమలేన హి| న జానాసి చ కించిచ్చ కార్యాకార్యం వివక్షితమ్‌ ||86

ఏవం వివదమానౌ తౌ దంపతీ పరమేశ్వరౌ| నారద: ప్రహసన్‌ వాక్యమువాచ ఋషిసత్తమ:||87

వాస్తవముగా గమనించినచో నేను ఓడిపోవలేదు (80) సాధ్వీ నేను ప్రాణులచే జయించబడని వానిని కాన అట్లు మాటాడరాదు. ఇపుడు నీకు ఇష్టమైన రీతిలో అడుము .నేనే గెలిచెదను చూడుము. (81) అనగా భర్తతో పార్వతి ఇట్లనెను నా చేతిలో నేడు నీవు ఓడిపోయావు .ఆశ్చర్యమేమి? అని శివుని చేతిని పట్టుకొని సందేహం లేదు ఓడిపోయావు నీకు తెలియదు(82)అని గిరిజ నర్మగర్భమగు మాటలతో శివుని దెప్పిపొడిచెను మదనాంతకా! నీవు మాటిచ్చిన పణమును నాకు ఇచ్చివేయువు(83) అనగా శివుడు ఇట్లనెను విశాలాక్షీ! నేను అజేయుడను సంశయము లేదు . అహంకారముతో నీవనిన దానిని యథార్థముగా తరచిచూడుము (84) అనగా నవ్వి గౌరి శివునితో నిట్లనెను.! నీవు అందరికీ అజేయుడవగు మహాదేవుడివే నేడు నా చేతమాత్రమే ఓడితివి. ఇది స్వచ్చమగు కపటము లేని ద్యూతక్రీడ ఇవుడిక కార్యాకార్యములను ఏమాత్రము తెలియలేకపోవుచున్నావు.(85,86) అని ఆ దంపతులగు పార్వతీపరమేశ్వరులిద్దరూ వాదించుకొనుచుండగా ఋషిసత్తముడగు నారదుడు నవ్వుచూ ఇట్లనెను (97)

ఆకర్ణకర్ణవిశాలనేత్రే వాక్యం తదేకం జగదేకమంగళమ్‌ |

అసౌ మహాభాగ్యవతాం వరేణ్యస్త్వయా జిత: కించ మృషాబ్రవీషి||88

అజితో హి మహాదేవో దేవానాం పరమో గురు: | అరూపోzయం సరూపోzయం రూపాతీతోz యముచ్యతే ||89

ఏక ఏవ పరం జ్యోతిస్తే షామపి చ యన్మహ:| త్రైలోక్యనాథో విశ్వాత్మా శంకరో లోకశంకర:||90

కథం త్యయా జితో దేవి హ్యతేయో భువనత్రయే | శివమేనం న జానాపి స్త్రీభావాచ్చ వరాననే ||91

నారదేనూవముక్తా సా కుపితా పార్వతీ భృశమ్‌ '| బభాషే మత్సరగ్రస్తా సాక్షేపం వచనం సతీ|| 92

పార్వత్యువాచ-

చాపల్యాచ్చ న వక్వ్యం బ్రహ్మపుత్ర నమోస్తుతే | తవ భీతాస్మి భద్రం తే దేవర్షే మౌనమానహ||93

కథం శివో హి దేవర్ష ఉక్తోzతో హి త్వయా బహు| మత్ర్పసాదాచ్చివో జాత ఈశ్వరో యోహి పఠ్యతే||94

మయా లబ్దప్రతిష్ఠోయం జాతో నాస్త్యత్ర సంశయ:||95

ఏవం బహువిధం శ్రుత్వా నారదో మౌనమాశ్రయత్‌ | ఉపస్థితం చ తద్దృష్ట్యా భృంగీ వాక్యమథాబ్రవీత్‌ ||96

కర్ణాంతమువరకూ విశాలమగు నేత్రములు గల పార్వతీ వినుము. ఈ మాట జగత్తుకు మంగళము చేకూర్చునది. మహాభాగ్యవంతులలో గొప్పవాడగు మహాదేవుని జయించితివా? అబద్దమును పలుకుచుంటివి(88) దేవతలకే పరమ గురువగు మహాదేవుడు జయింపబడని వాడు రూపములేనివాడు రూపము దాల్చువాడు రూపములకు అతీతుడు (98) అతనే పరమజ్యోతి జ్యోతిస్సుల ఉత్సవరూపుడు ముల్లోకముల కదిపతి, విశ్వరూపుడీ శంకరుడు(90) ముల్లోకములలో అజేయుడగు ఇతను నీ చేత ఎట్లు జయించబడెను? స్త్రీ భావముచేత శివుని ఈ విధముగా తెలియజాలకుంటివి(91) అని నారదుడనగా పార్వతీ మిగుల కోపించి మాత్పర్యముతో ఆక్షేపించచూ ఇట్లనెను (92) బ్రహ్మపుత్రా ! చపలత్వముతో అట్లు పలుకరాదు. నీకు దండము నీవంటినే భయము కలుగుచున్నది నీకు శుభమగుగాక! అయ్యా,మౌనముగా నుండుము.(93) దేవర్షీ! ఏదో శివుడి గూర్చి అధికముగా పలికితివి కదా! నా ప్రసాదము చేతనే శివుడనబడువాడు ఈశ్వరుడైనాడు (94) నా చేతనే అతను ప్రతిష్టనొందినాడు సందేహములేదు(95) అని అనేక విధములుగా పలుకగా విని నారదుడు మౌనమునాశ్రయించెను . ఆపరిస్థితిని చూచి భృంగిఇట్లనెను.(96)

భృంగ్యువాచ -

త్వయా బహు న వక్తవ్యం పునరేవ చ భామిని | అజేయో నిర్వికారో హి స్వామి మమ సుమధ్యమే||97

స్త్రీభావయుక్తాసి పరాననే త్వం దేవం న జానాసి పరం పరాణామ్‌ |

కామం పురస్కృత్య పురా భవాని సమాగతాస్యేవ మహేశముగ్రమ్‌ ||98

యథా కృతాం తేన పినాకినా పురా ఏతత్‌ స్మృతం కిం సుభ##గే పదస్వ న:| కృతో హ్యనంగో హి తదా హ్యనేన దగ్దం వనం తస్య గిరే : పితుస్తే||99

యావత్త్వయారాధిత ఏవ ఏష శివ: పరాణాం పరమ: పరాత్మా||100

భృంగిణత్యవముక్తా సా హ్యువాచ కుపితా భృశమ్‌ | శృణ్వతో హి మహేశస్య వాక్యం రుష్టా చ భృంగిణమ్‌ ||101

పార్వత్యువాచ-

హే భృంగిన్‌ ! పక్షపాతిత్త్వాద్యదుక్తం వచనం మమ| శివప్రియోసి రే మంద భేదబుద్దితో హ్యసి||102

అహం శివాత్మకా మూఢ శివో నిత్యం మయి స్థిత| కథం శివాభ్యాం భిన్నత్వం త్వయోక్తం వాగ్బలేన హి||103

శ్రుతం చ వాక్యం శుభదం పార్వత్యా భృంగినా తదా| ఉవాచ పార్వతీం భృంగీ రుషిత: శివసన్నిధౌ||104

పితుర్యజ్ఞే చ దక్షస్‌ శివనిందా త్వయా శ్రుతా| అప్రియశ్రవణాత్‌ సద్యస్త్వయా త్య్రక్తం కళేవరమ్‌ ||105

తక్ష్కణాదేవ తన్వంగి హ్యదునా కిం కృతం త్వయా | సంభ్రమాత్కిం న జానాసి శివనిందకమేవ చ||106

కథం వా పర్వతశ్రేష్ఠాజ్ఞాతాసి వరవర్ణిని | కథం వా తపసోగ్రేణ సంతప్తాసి సుమధ్యమే|| 107

మరొక్కమారు అధికముగా మాట్లాడరాదు. భామినీ! నా స్వామి అజేయుడు. నిర్వికారుడు కూడా (97) స్త్రీ భావముతో కూడుకొని నీవు పరాత్పరుడగు మహాదేవుని తెలియజాలకున్నావు. పూర్వము మన్మథుని ముందుంచుకొని కదా నీవు శివుని చేరుకొనినది. (98) అప్పుడతనేమి చేసెనో గుర్తున్నదా చెప్పుము . మన్మథుని అనంగుని చేసి నీ తండ్రి హిమవద్గిరికి చెందిన వనమును దగ్ధము చేయలేదా? (99) అంతవరకు నీవీ పరాత్పరుడిని ఆరాధించితివి కదా! (100) అని భృంగి అనగా కోపించిన పార్వతి శివుడు వినుచుండగనే ఇట్లనెను (101) ఓయీ భృంగీ! పక్షపాతముతో నీవట్లంటివి. మూఢుడా! శివప్రియుడివి కనుకనే భేదబుద్ది నీకు (102) నేను శివుడిని . శివుడు నిత్యము నాయందుండును. వాగ్బలముతో నీవు శివ పార్వతుల భేదమును ఎట్లు పలికితివి? (103) అని శుభమగు మాటను పార్వతియనగా విని భృంగి కోపించి శివునిచెంత ఆమెతో నిట్లనెను.(104)

తండ్రియగు దక్షుని యజ్ఞమున శివనిందను విని, అప్రియమును వినుటచే వెంటనే శరీరమును విడిచితివి.(105) ఇపుడేమి చేయుచున్నావు? సంభ్రమము వలన ఇది శివనిందయని తెలియకున్నావు.(106) నీవా పర్వతశ్రేష్ఠునికెట్లు జన్మించితివి? ఎట్లా ఘోరతపమునాచరించితివి?(107)

సప్రేమా చ శివే భక్తిస్తవ నాస్తీహ సాంప్రతమ్‌ | శివప్రియాసి తన్వంగి తస్మాదేవం బ్రవీమి తే ||108

శివాత్పరతరం నాన్యత్త్రిషు లోకేషు విద్యతే | శివే భక్తిస్వయా కార్యా సప్రేమా వరివర్ణిని||109

భక్తాసి త్వం మహాదేవి మహాభాగ్యవతాం వరే | సంసేవ్యతాం ప్రయత్నేన తపసోపోర్జితస్త్వయా||111

శివో వరేణ్య సర్వేశో శ్రుత్వా గిరిజా తమువాచ హ||

గిరిజోవాచ-

రే భృంగిన్మౌనమాలంబ్య స్థిరో భవాథ వా వ్రజ| వాచ్యావాచ్యం న జానాపి కిం బ్రవీషి పిశాచవత్‌ ||112

తపసా కేన చానీత: కయా చాపి శివో హ్యాయమ్‌ | కాహం కోzసౌ త్వయా జ్ఞాతో భేదబుద్ద్యా బ్రవీషి మే||113

కోసి త్వం కేన యుక్తోసి కస్మాచ్చ బహు భాషసే శాపం తవ ప్రదాస్యామి శివ: కిం కురుతేధునా||114

భృంగిణోక్తా తిరస్కృత్య తదా శాపం దదౌ సతీ| నిర్మాంసో భవ రే మంద రే భృంగిన్‌ శంకరప్రియ||115

ఏవముక్త్యా తదా దేవి పార్వతీ శంకరప్రియా | అథ కోపేన సంయుక్తా పార్వతీ శంకరం తదా||116

కరే గృహ్య చ తన్వంగీ భుజంగం వాసుకిం తథా | ఉదతారయత్‌ కంఠాత్సా తథాన్యాని బహుని చ||117

పూర్వము శివునియందున్న భక్తి నీకిపుడు లేదు. శివుని కిష్టురాలవని నీ కిట్లు చెప్పుచున్నాను. (108) మూడు లోకములలోనూ శివుని కంటే పరమైనది లేదు. సుందరీ! నీవు శివుని యందు భక్తి ని చూపుము. (109) నీవు భక్తురాలవు, భాగ్యవంతులలో శ్రేష్టురాలవు తపస్సుచే పొందిన శివుని ఎలాగైనా సేవించుము.(110) అన్ని ప్రాణులకూ నియామకుడు శివుని సేవించుట తప్ప వేరొకటి చేయరాదు నీవు. అని భృంగి యనగా విని గిరిజ అతనితో నిట్లనెను (111) ఓరీ భృంగీ! మౌనంగానైనా నిలువుము లేదా వెళ్ళిపపొమ్ము. వాచ్యావాచ్యముతెలియక పిశాచము వలె మాటాడుచుంటివేమి? (112) ఏ తపస్సు చేత శివుడు గొని తేబడెను? ఎవరిచేత? నేనే శివుడిని నేనెవరు? నీవెఱగిన అతనెవరు? భేదాబుద్దితో నీవు పలుకుచుంటివి .(113) నీవెవరు? దేనితో కూడితవి? అధికముగా ఎందుకు మాటాడుచుంటివి? నీకు శాపమిచ్చెదను ఈ నాడీ శివుడేమి చేయునో (114) అని పార్వతి భృంగి పలుకులను తిరస్కరించి ఇట్లు శిపించెను మూర్ఖుడా! శంకరప్రియా! భృంగీ నీవు నిర్మాంసుడివి కమ్ము అని ఆ సుందరస్త్రీయగు పార్వతి కోపముతో శంకరుని చేతిని పట్టుకొని వాసుకిని మరియు ఇతర ఆభరణములను కంఠమునుండి వలుచుకొనెను.(117)

శంభోర్జగ్రాహ కుపితా భూషణాని త్వరాన్వితా | హృతాచంద్రకళా తస్య గజాజినమనుత్తమమ్‌||118

కంబళాశ్వతరౌ నాగౌ మహేశకృతభూషణౌ | హృతౌ తయా మహాదేవ్యా ఛలోక్త్యా చ ప్రవాస్య వై||119

కౌపీనాచ్చాదనం తస్వ ఛలోక్త్యా చ ప్రవాస్య వై | తదా గణాశ్చ సఖ్యశ్చ త్రపయా పీడితా భవన్‌ ||120

పరాజ్ఞఖాశ్చ సంజాతా భృంగీ చైవ మహాతపా:తథా చండో హి ముండశ్చ మహాలోమా మహోదర:||121

ఏతే చాన్యే చ బహవో గణాస్తే దు:ఖినోభవన్‌ | తాంశ్చ దృష్ట్యా తథాభూతాన్మహేశో లజ్జితోభవత్‌ ||122

ఉవాచ వాక్యం రుషిత పార్వతీం ప్రతి శంక:||123

రుద్ర ఉవాచ:

పహాసం ప్రకుర్వంతి సర్వే హి ఋషయో భృశమ్‌ | తథా బ్రహ్మా చ విష్ణుశ్చ తథా చంద్రోదయో హ్యమీ||124

ఉపహాసపరా! సర్వే కిం త్వయాద్య కృతం శుభే| కులే జాతాసి తన్వంగి కథమేవం కిరిష్యసి||125

త్వయా జితో హ్యహం సుభ్రు యది జూనాసి తత్త్వత : | తర్హ్యేవం కురు మే దేహి కౌపీనాచ్చాదనం పరమ్‌ ||

దేహి కౌపీనమాత్రం మే నాన్యథా కర్తుమర్హసి||126

ఏవముక్తా సతీ తేన శంభునా యోగినా తదా | ప్రవాస్య వాక్యం ప్రోవాచ పార్వతీ రుచిరాననా||127

కోపించిన పార్వతి త్వరగా శివుని భూషణములను తీసుకొనెను చంద్రకళను చ ఉత్తమమైన గజాజినమును హరించెను.(118) కంబళాశ్వతరమను సర్పములు కూడా ఆమెచే ఛలోక్తితో తీసికొనబడెను.(119) అలాగే ఛలోక్తులతో నవ్వుచూ కౌపీనాచ్చాదనమును కూడా లాగి వేయగా గణములు , పార్వతి సుఖులు సిగ్గుతో పీడింపబడినవారైరి (120) వారు మరియు భృంగి, చండ, ముండచమమాలోమ, మహోదర మొదలగు గణములన్నీ ముఖము త్రిప్పుకొని దు:ఖముతో నుండిరి అట్టి వారిని చూచి ఈశ్వరుడు కూడా సిగ్గుపడెను (122) అపుడు రోషముతో శంకరుడు పార్వతినుద్దేశించి ఇట్లనెను(123) ఋషులందరూ ఉపహాసము చేయుచున్నారు. అట్లే బ్రహ్మ, విష్ణువు, ఈ చంద్రరేఖ కూడా (124) వీరంతా ఉపహసించుచున్నారు. నీవేమి చేసితివి? ఉన్నతకులమున జన్మించిన నీవీవిధముగా ఎట్లు చేయుగలవు? (125) నీవు నన్ను జయించునట్లు వాస్తవముగా తెలియుదువేనిఇట్లు చేయుము. కౌపీనము మాత్రము ఇచ్చివేయుము. వేరొక రీతిగా చేయరాదు(126) అని యోగియగు శివుడనగా నవ్వి సుందరియగు పార్వతి ఇట్లనెను.(127)

కిం కౌపినేన తే కార్యం మునినా భావితాత్మనా | దిగంబరేణౖవ తదా కృతం దారువనం తథా||128

భిక్షాటనమిషేణౖవ ఋషిపత్న్యో విమోహితా :| గచ్చతస్తే తదా శంభో పూజనం తైర్మహత్కృతమ్‌ ||129

కౌపీనం పతితం తత్ర మునిభిర్నాన్యథోదితమ్‌ | తస్మాత్త్వయా ప్రహాతవ్యం ద్యూతే హారితమేవ తత్‌ ||130

తచ్చృత్వా కుపితో రుద్ర : పార్వతీం పరమేశ్వర:| నిరీక్షమాణోzతిరుషా తృతీయేనైవ చక్షుషా||131

కుపితం శంకరం దృష్ట్యా సర్వే దేవగణాస్తదా| భ##యేన మహతాZవిష్టాస్తథా గణకుమారకా:||132

ఊచు: సర్వే శ##నైసత్ర శంకితేన పరస్పరమ్‌ | అద్యాయం కుపితో రుద్రో గిరిజాం ప్రతి సంప్రతి||133

యథా హి మదనో దగ్దస్తథేయం నాన్యథా వచ: | ఏవం మీమాంసమానాస్తే గణా దేవర్షయస్తథా||134

విలోకితాస్తయా దేవ్యా సర్వే సౌభాగ్యముద్రయా| ఉవాచ ప్రహసన్నేవ సతీ సతీ సత్పురుషం తదా||135

కిమాలోకపరో భూత్వా చక్షుషా పరమేణ హి నాహం కాలో న కామోహం నాహం దక్షస్య వై మఖ:136

త్రిపురో నైవ వై శంభో నాంధకో వృషభద్వజ| వీక్షితేనైన కిం తేన తవ చాద్య భవిష్యతి ||వృథైవ త్వం విరూపాక్షో జాతోసి మమ చాగ్రత: ||137

ఆత్మజ్ఞానివగు మునివైన నీకీ కౌపీనముతో నేమి పని? దిగంబరుడిగనే దారువనము నట్లుచేసితివి గదా! (128) భిక్షాటనముచేయు నెపముతో ఋషిపత్నులున్న చోటికివెళ్లి మోహమొందునట్లు చేసితివి గదా! వెళ్ళిపోవుచున్న నీకు వారు పూజనుకూడాచేసిరి.(129) కౌపీనము పడిపోయిననూ మునులు వేరొక విధముగా మాట్లాడలేదు.కనుక ద్యూతమున ఓడిన దానిని నీవు వదలివేయుము(130) అనగా రుద్రుడు కోపించి మూడవ కంటితో చూచుచుండెను (131) అట్టి శివుని చూచి దేవగణములన్నీ గణకుమారులతోసహ భయపడిరి.(132) వారంతా శంకించి మెల్లగా ఇట్లనుకొనిరి నేడు శివుడు గిరిజ పట్ల కోపమునొందెను(133) ఏ విధంగామదనుడు దహింపబడెనో అట్లే పార్వతి కూడా దహింపబడును. తప్పదు అని మీ మాంసలో నుండగా (తర్కించుచుండగా) పార్వతి వారిని చూచెను.(134) నవ్వుచూ ఆమె సత్పురుషుడగు శివునితో ననెను(135) పరమ చక్షువుతో ఏల చూచెదవు? నేను కాలమును కాను, కామమునూ కాను, దక్షుని యజ్ఞమునూ కానూ దహించడానికి (136) త్రిపురములనూ కాను, అంధకాసురుడినీ కాను చూచి మాత్రమే ఏమి చేయగలవు? నా ఎదుట నీవు వృథాగా మూడవ కన్నును తెరిచి విరూపాక్షుడివి అయితివి.(137)

ఏవమాదీన్యనే కాని హ్యువాచ పరమేశ్వరీ| నిశమ్య దేవో వాక్యాని గమనాయ మనో దధే||138

వనమేవ వరం చాద్య విజనం పరమార్థతః | ఏకాకీ యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహ:|139

స సుఖీ పరమార్థజ్ఞ: స విద్యాన్‌ స చ పండిత: | యేన ముక్తౌ కామరాగౌ స ముక్త: స సుఖీ భ##వేత్‌ || 140

ఏవం విమృశ్య చ తదా గిరిజాం విహాయ | శ్రీ శంకర: పరమకారుణికస్తదానీమ్‌ |

యాత: ప్రియావిరహితో వనమద్బుతం చ | సిద్దాటవీం పరమహంసయుతాం తథైవ||141

నిర్గతం శంకరం దృష్ట్యా సర్వే కైలాసవాసిన: | నిర్యయుశ్చ గణాస్సర్వే వీరభద్రాదయోzను తమ్‌ ||142

ఛత్రం భృంగీ సమాదాయ జగామ తస్య పృష్ఠత:| చామరే వీజ్యమానే చ గంగాయుమునసన్నిభే||143

తాభ్యాం యుక్తస్తదా నందీ వృష్టీతో నగమత్సుధీ :| వృషభో హ్యగ్రతో భూత్వా పుష్పకేణ విరాజిత:||144

శోభమానో మహాదేవ ఏభి సర్వై సుశోభ##వై: అంతపురగతా దేవీ పార్వతీ సాహి దుర్మనా:||145

సభీర్భహుభిస్తత్ర తథాన్యాభి: సుసంవృతా గిరిజా | చింతయామాస మనసా పరమేశ్వరమ్‌||146

పరమేశ్వరి ఇట్లు అనేక విధములుగా మాట్లాడెను. అవి విని మహాదేవు వెళ్ళిపోదలిచెను. (138) జనులు లేని వనమే నేడు వాస్తవానికి మేలైనది. ఒంటరిగా, మనస్సును నిగ్రహించి, అన్నింటినీ వదిలేసినవాడు, పరమార్థమును తెలిసినవాడు, విద్వాంసుడు, పండితుడు అతడే సుఖపడును. కామమును, రాగమును విడిచినవాడే సుఖమునొందును. (139,140) అని తర్కించి గిరిజను వదలి పరమకారుణికుడైన శంకరుడు ప్రియురాలైన పార్వతిని విడిచి సిద్ధాటవిన హంసలతో నున్న వనమునకు వెళ్ళెను. (141) శంకరుడు వెళ్ళిపోవుట చూచి కైలాసవాసులందరూ, వీరభద్రుడు మొదలైనవారు శంకరుని అనుసరించి వెళ్ళిరి.(142) భృంగి ఛత్రమును పట్టి వెంట నడిచెను. గంగా యమునల వంటి చామరముల (143) బట్టి నంది వెంట నడిచెను. వృషభము ముందు నడిచి పుష్పకముతో విరాజిల్లు చుండెను. (144) మహోజ్జ్వలమగు వీరందరిచే మహాదేవుడు శోభిల్లెను. ఇక అంతఃపురమునకు వెళ్ళిన పార్వతి మనసు చెదిరినదాయెను. (145) తన సఖీజనముతో మరియు ఇతరులతో కూడుకొని మనస్సులో పరమేశ్వరుని గూర్చి చింతించుచుండెను. (146)

తతో దూరం గత: శంభుర్విసృజ్య చ గణాంస్తదా | గణశం చ కుమారం చ వీరభద్రం తథాzపరమ్‌ ||147

భృంగిణం నందినం చైవ సోమనందినమేవ చ | ఏతానన్యాంశ్చ సర్వాంశ్చ కైలాసపురవాసిన:||148

విసృజ్య చ మహాదేవ ఏక ఏవ మహాతపా: గతో దూరం వనస్యాంతే తథా సిద్దవటం శివ:||149

కాశ్మీరరత్నోపలసిద్దరత్నవైడూర్యచిత్రం సుధయా పరిష్కృతమ్‌ | దివ్యాసనం తస్య చ కల్పితం భువా తత్రాస్థితో యోగపతిర్మహేశ :||150

పద్మాసనే చోపవిష్టో మహేశో యోగవిత్తమ: కేవలం చాత్మనాత్మానం దధ్యౌ మీలితలోచన:||151

శుశుభే స మహాదేవ: సమాధౌ చంద్రశేఖర:| యోగపట్ట: కృతస్తేన శేషస్య చమహాత్మన:

వాసుకి సర్పరాజశ్చ కటిబద్ద: కృతో మహాన్‌||152

ఆత్మానమాత్మత్మతయా చ సంస్తుతో | వేదాంతవేద్యో న హి విశ్వచేష్టిత:||

ఏకో హ్యనేకో హి దురంతపారస్తథా | హ్యతర్క్యో నిజబోధరూపః ||

స్థితిస్తదానీం పరమం పరాణాం నిరీక్షమాణోభువనైక భర్తా||153

ఇతి శ్రీ స్కాందపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కేదారఖండే శివపార్వతీ ద్యూతప్రసంగేన పార్వతీ హారితసర్వస్వస్య

శివస్య కైలాసం విహాయ తపోవనగమనవర్ణనం నామ చతుస్త్రింశోధ్యాయ:

తరువాత అక్కడి నుండి దూరముగా వెళ్ళిన శివుడు గణములను, గణశుని, కుమారస్వామిని, వీరభద్రుని (147)భృంగినినందిని, సోమనందిని మరియు ఇతక కైలాసవాసులను విడిచి (148) తానొక్కడే మహాతపస్వియై వనము మధ్యనున్న సిద్దవటమును చేరెను (149) అక్కడ కాశ్మీర రత్నములు, సిద్దరత్నములు, వైడూర్యములు పొందగబడి. సుద్దతో పరిష్కరించబడిన దివ్యాసనమొకటి సిద్దపరచబడెను. దాని పై యోగపతి మహేశుడు కూర్చొనెను (150)పద్మాసనము పై కూర్చున్న యోగపతి మహేశుడు కళ్ళుమూసుకొని ఆత్మధ్యానమున మునిగెను. (151) ఆ మహాదేవుడు సమాధియందుండి శోభిల్లోను. అపుడు శేషుని యెగపట్టముగా చేసుకొని వాసుకియను సర్పరాజుని కట్టుకొనెను.(152) భువనములకు పాలకుడగు అతను ఏకముగా నున్ననూ అనేకుడై వేదాంతవేద్యుడై తర్కమునకు దూరముగా నుండి , ఆత్మజ్ఞానరూపుడై, తనయందు తనను గాంచుచూ సమాధిస్థితి యందుండెను.(153) ఇది శ్రీ స్కాందపురాణమున మాహేశ్వరఖండమున కేదారఖండమందు శివపార్వతుల ద్యూతప్రసంగమున పార్వతిచే అంతా కోల్పోయిన శివుడు కైలాసమును విడిచి తపోవనమునకు వెళ్ళుటను వర్ణించు మూప్పదినాలుగువ అధ్యాయము

పంచత్రింశోzధ్యాయ:

లోమశ ఉవాచ- వసం గతే మహాదేవి గిరిజా విరహాతురా| సుఖం న లేభే తన్వంగీ హర్మేష్వాయతనేషునా||1

చింతయన్తీ శివం తన్వీ సర్వభావేన శోభనా | చింతమానా శివాం జ్ఞాత్వా హ్యువాచ విజయా సఖీ ||2

విజయోవాచ-

తపసా మహతా చైవ శివం ప్రాప్తాసి భోభ##నే| మృషా ద్యూతం కృతం తేన శంకరేణ తపస్వినా|| 3

ద్యూతే హి బహనో దోషా న శ్రుతా: కిం త్వయాzనఘే | క్షమాపయ శివం తన్వి త్వరేణౖవ విచక్షణ||4

అస్మాభి: సహితా దేవి గచ్చ గచ్చ వరాననే ||5

యావచ్చంభుర్దూరతోనాభిగచ్చేత్తావద్గత్వా శంకరం క్షామయస్వ| నో చేత్తన్వి క్షామయేథా శివం త్వం దు:ఖం పశ్చాత్తే భవిష్యత్యవశ్యమ్‌ ||6

నిశమ్య వాక్యం విజయాం సఖీం చ ఆశ్చర్యభూతం పరమార్థభూతమ్‌ ||7

మయా జితోzసౌ నిరపత్రపశ్చపురా వృతో వై పరయా విభూత్యా |కించిచ్చ కృత్యం మమ నాస్తి సద్యో మయా వినాసౌ చ విరూప ఆస్థిత:||8

రూపీకృతో మయా మహేశో నాన్యథా వద | మయా తేన వియోగశ్చ సంయోగో నైవ జాయతే||9

సాకారో హి నిరాకారో మహేశో హి మయా కృత:||

ముప్పది ఐదవ అధ్యాయము

లోమశుడు చెప్పసాగెను ఇట్లు మహాదేవుడు వనమునకు వెళ్ళిపోగా, పార్వతి విరహముచే బాధనొంది మేడలు, భవనాలలో సుఖమును పొందలేదు (1) అన్ని భావములలో శివుని గూర్చి ఆలోచించుచూవుండగా ,మిత్రురాలగు విజయ పార్వతితో నిట్లనెను(2) పార్వతీ గొప్ప తపస్సు చేసి శివుని పొందితివి. వృథాగా ఆతపస్వితో ద్యూతమాడితివి. (3) ద్యూతమున ఎన్నో దోషాలున్నవని వినలేదా నువ్వు? త్వరగా వెళ్ళి శివుని క్షమను కోరుము (4) మేము కూడా వచ్చెదము పద ! పద! (5) శివుడు దూరముగా పోయేలోపుననే అతనిని క్షమము కోరుము.లేనిచో శివుని బాధపెట్టి , తరువాత నీవు దు:ఖించెదవు తప్పదు(6) అనగా సమధీరచిత్తయగు పార్వతి నవ్వుచూ ఆశ్చర్యమును కలిగించునట్లు సత్యమునిట్లు పలికెను (7) ఆ శివుడు నాచేత జయింపబడినవాడు సిగ్గులేని వాడు. పూర్వము గొప్ప ఐశ్వర్యముతో వరించితిని ఇప్పుడు వెంటనే నేను చేయవలసినది లేదు.నేను లేక అతను విరూపమునే పొందును (8) నావల్లనే మహేశుడు రూపము గలవాడాయెను అంతే నాతో అతనికి సంయోగ వియెగములు లేవు. (9) నాచేతనే నిరాకారుడైన శివుడు సాకారుడైనాడు.(10)

కృతం మయా విశ్వమిదం సమగ్రమం | చరాచరం దేవవరై: సమేతమ్‌|

క్రీడార్థమస్యోద్బవవృత్తి హేతుభిశ్చిక్రీడితం మే విజయే ప్రవశ్య||11

ఏవముక్త్వా తదా దేవీ గిరిజా సర్వమంగళా శబరీరూపమాస్ధాయ గంతుకామా మహేశ్వరమ్‌ ||12

శ్యామా తన్వీ శిఖరదశనా బింబబింబాధరోష్ఠీ | సుగ్రీవాడ్యా కుచభరదశనా వర్థితస్నిగ్దకేశీ|

మధ్యేక్షామా పృథుకటితటా హేమరంభోరుగౌరీ పల్లీయుక్తా వరవలయినీ బర్హిబర్హావతం సా||13

పాణౌ మృణాలసదృశం దధతీ చ చాపం | ప్పష్ఠే లసత్కృతకకేతకీబాణకోశమ్‌|

సా తం గిరీశమాలోకయతి స్మ తత్ర | సంసేవితా సువదనా బహుభి: సఖీభి: ||14

భృంగీ నాదేన మహతా నాదయంతీ జగత్త్రయమ్‌ | గిరిజా మన్మథం సద్యో జీవయంతీ పున: పున:||15

సకామా రాజహంసా బభూవుస్తక్ష్కణాదపి | ద్విరేఫా బర్హిణశ్చైవ సర్వే తే హృచ్ఛయాన్వితా :||16

ఏకాకీ సంస్థితో యత్ర సమాధిస్థో మహేశ్వర: దృష్టస్తతస్తయా దేవ్యా భృంగీనాదేన మోహిత:||17

దేవవరులతో కూడిన ఈ విశ్వమును చరాచరముతో నేను సృజించితిని క్రీడకై నేను సృజించిన దీని ఉత్పతి స్థితి హేతువులచే క్రీడించబోవు దానిని చూడుము (11) అరి స్వరమంగళయగు గిరిజ శబరస్త్రీగారూపుదాల్చి మహేశ్వరుని వద్దకు వెళ్ళగోరెను(12) ఆ శబరి అందముగా నుండి, ఎర్రని పెదవులతో, చక్కని కంఠముతో, బరువైన స్తనములతో, పొడుగుగా దట్టముగా పెరిగిన కేశములతో, సన్నని నడుముతో, విశాల జఘనముతో, పచ్చని అరటిబోదెలవంటి తొడలతో, నెమలి ఈకను తలపై దాల్చి పల్లెపడుచుగా అందముగా నుండెను. (13) చేతిలో తామరరూపు వంటి విల్లును దాల్చి,వెనుక కృత్రిమ కేతకి బాణముల అంబులపాది విలసిల్లుచుండగా పార్వతి సఖులనేకులు సంసేవించుచుండగా గిరీశుని చూచుచుండెను(14) ఆడుతుమ్మెదలనాదముతో ముల్లోకములను నినదింపజేయుచూ పార్వతి మన్మథుని వెంటనే జీవింపచేయుచుండెను (15) రాజహంసలు, తుమ్మెదలు నెమళ్ళు అన్నీ వెంటనే మన్మథభావమును పొందెను.(16)సమాధియందు ఒక్కడిగా నున్న మహేశుడు వద్దకు వెళ్లి పార్వతి తన భృంగీనాదముచే మోహితుడైన శివుని చూచెను.(17)

ప్రబుద్దో హి మహదేవో నిరీక్ష్య శబరీం తదా| సమాదేరుత్థిత: సద్యో మహేశో మదనాన్విత:||18

యావత్కరే గృహ్యమాణో గిరిజాం స సమీపగ:| తావత్తస్య పుర: సద్యస్తిరోధానం గతా సతీ||19

తద్దృష్టా తక్ష్కణాదేవ దేవొ భ్రాంతివినాశన: భ్రమమాణస్తదా శంభుర్నాపశ్యదసితేక్షణామ్‌||20

విరహేణ సమాయుక్తో హృచ్చయేన సమన్విత:| మదనారిస్తదా శంభుర్జానరూపో నిరంతరమ్‌ ||21

నిర్మోహో మోహమాపన్నో దదర్శ గిరిజాం పున: ఉవాచ వాక్యం శబరీం ప్రస్తావసదృశం మహత్‌ ||22

శివ ఉవాచ-

వాక్యం మే శృణు తన్వంగి శ్రుత్వా తత్కర్తుమర్హసి | కాసి కస్యాసి తన్వంగి కిమర్ధమటనం వనే | తత్కథ్యతాం మహాభాగే యాథాతథ్యం సుమధ్యమే||23

శివోవాచ-

పతిమన్యేషయిష్యామి సర్వజ్ఞం సకలార్థదమ్‌ | స్వతంత్రం నిర్వికారం చ జగతామీశ్వరం పరమ్‌ ||24

ఇత్యుక్త: ప్రత్యువాచేదం గిరిజాంవృషభధ్వజ: | అహం తవొచితో భ##ద్రే పతిర్నాన్యో హి భామిని||25

విమృశ్యతాం వరారోహి తత్త్యతో హి వరాననే | వచో నిశమ్య రుద్రస్య స్మితపూర్వమభాషత|| 26

సమాధిస్థితి నుండి మేల్కాంచిన మహేశ్వరుడు ఎదుట శబరిని చూచి మదన పీడితుడాయెను (18) దగ్గరకు వెళ్ళి చేతినిపట్టుకొన బోగానే సతీదేవి అతని ఎదుటనుండి మాయమయ్యెను(19) అపుడు భ్రాంతిని నశింపజేయువాడైననూ ఆ మహాదేవుడు అది చూచి భ్రాంతినొంది అటునిటు తిరుగుచూ ఆ సుందరిని కాంచలేదు.(20)విరహముతోనున్న శివుడు మదన పీడితుడై మదనుని దహించిన జ్ఞానరూపుడు మోహములేని వాడైననూ మోహములేని వాడైననూ మోహమును పొంది గిరిజను చూచెను. అపుడు ఆ పల్లీయస్త్రీని చూచి ప్రస్తావమట్లు ఈ విధముగా ననెను.(21) సుందరీ! ఈ వనమున ఏకారణముచే తిరుగుచుంటివి? వాస్తవముగా తెలుపుము.(23) అనగా శబరి రూపముననున్న పార్వతి చెప్పెను. అన్నీ తెలిసి అన్నింటినీ ఇచ్చు స్వతంత్రుడు, నిర్వికారుడు, జగత్పతియగు పతిని వెదకుచున్నాను.(24) అనగా వృషభద్వజుడగు శివుడు పార్వతితో అనెను. సుందరీ! నేనే నీకు తగిన భర్తను. వేరొకడు కాదు. (25) భామిని !సరిగా ఆలోచించుకొనుము అనగావిని పార్వతి నవ్వి ఇట్లనెను(26)

మయార్థితో మహాభాగ పతిస్త్వం నాన్యథా వద | కిం తు వక్ష్యామి భద్రం తే నిర్గుణోసి పరంతప||27

యయా పురా వృతోసి త్వం తపసా చ పరేణ హి| పరిత్యక్తా త్వయారణ్య క్షణమాత్రేణ భామినీ||28

దురారాధ్యోసి సతతం సర్వేషాం ప్రాణినామపి: తస్మాన్న వాచ్యం హి పునర్యుదుక్తం తే మమాగ్రత!||29

శబర్యా వచనం శ్రుత్వా ప్రత్యువాచ వృషధ్వజ: | మైవం వద విశాలాక్షి న త్యక్తా సా తవస్వినీ|| యది త్యక్తా మయా తన్వి కిం వక్తుమిహ పార్యతే||30

ఏవం జ్ఞాత్వా విశాలాక్షి కృపణం కృపణప్రియమ్‌| తస్మాత్త్వయాహి హికర్తవ్యం వచనం మే సుమద్యమే||31

ఏవమభ్యర్ధితా తేన బహుధా శూలపాణినా ప్రవాస్య గిరిజా ప్రాహ ఉపహాసపరం వచ:||32

తపోధనోసి యోగీశ విరక్తోసి నిరంజన: ఆత్మారామో హి నిర్త్వంద్వోమదనో యేన ఘాతిత:||33

స త్వం సాక్షాద్విరూపాక్షో మయా దృష్టోసి చాద్య వై| ఆశక్యో హి మయా ప్రాప్తుం సర్వేషాం దురతిక్రమ:|| తస్మాత్త్వయా న వక్తవ్యం యదుక్తం చ పురామమ|| 34

తస్యాస్తద్వచనం శ్రుత్వా ప్రోవాచ మదనాంతక: | మమ భార్యా భవ త్వం హి నాన్యథా కర్తుమర్హసి||35

మహానుభావా! నేను కోరిన పతివి నీవే. వేరే కాదుకదా! చెప్పుదను. (27) నిర్గుణుడవు కదా! గొప్ప తపస్సు చేసి నిన్ను వరించిన సుందరిని ఒక్కక్షణములో అరణ్యమున విడిచి వైచితివి.(28) నిన్నుఆరాధించుట కష్టము. ప్రాణులన్నింటికి కూడా , కనుక నాఎదుట నీవన్నది మరొకమారు నీవనరాదు (29) అని శబరి అనగా విని శివుడిట్లు బదులిచ్చెను. విశాలాక్షీ! అట్లనరాదు ఆ అబలను నేను విడవలేదు. వదిలినట్లయితే చెప్పగలదేమున్నది.(30) అసహాయుడిని, అసహాయుల నిష్టపడువానినని తెలిసి నా మాటనాచరింపుము.(31)అని శివుడు అనేక విధాలుగా అభ్యర్ధించగా గిరిజ నవ్వి ఉపహసించుచూ ఇట్లనెను(32) యోగీశా! నీవు తపోధనుడవు. విరక్తుడవు. ఏదీ అంటనివాడవు నీయందే ఆనందము నొందు వాడవు రెండవది లేనివాడవు. మదనునే వధించిన వాడవు (33) అట్టి విరూపాక్షుడవైన నిన్ను నేనీనాడు చూచితిని.అందరికీ పొందశక్యముగాని వానిని నేనెట్లు పొందగలను? కనుక మునుపు నేనన్నదాని నాచరించుము.(34) అని పార్వతి అనగా విని మదనుని అంతమొనర్చిన శివుడనెను సుందరీ! నీ భార్యవు కమ్ము.వేరొక విధముగా కాదు.(35)ఇత్యుక్త్వాతాం కరేగృహ్ణాచ్చబరీం మదనాతుర: ఉవాచ తం స్మయంతీ సా ముంచ యుంచేతిసాదరమ్‌ ||36

నోచితం భగవాన్‌ కర్తుం తాపసేన బలాదిదమ్‌ | యాచయస్వ పితుర్మే త్వం నాన్యథాభిష్యసి||37

మహాదేవ ఉవాచ-

పితరం కథయాశు త్వం స్థితః కుత్ర శుభాననే | ద్రక్ష్యామి తం విశాలాక్షి ప్రణిపాతపురఃసరమ్‌ || 38

ఏతుదుక్తం తదా తేన నిశమ్యాసితనేత్రయా | ఆనీతో హితయా హి తయా తన్వ్యా పితరం వృషభద్వజ:||39

స్థితం కైలాసశిఖరే హిమవంతం నగోత్తమమ్‌ | అహిభిర్భహుభిశ్చెవ సంవృతం చ మహాప్రభమ్‌ ||40

ద్వారి స్థితం తయా దేవ్యా దర్శితం శంకరస్య చ | అసౌ మమ పితా దేవ యాచయస్వ విగతత్రప:||దదాతి మాం న సందేహస్తపస్విన్‌ మా విలంబితమ్‌ ||41

తథేతి మత్వా సహసా ప్రణమ్య| హిమాలయం వాక్యమిదం బభాషే| ప్రయచ్చ తాం చాద్య గిరీశవర్య | హ్యార్తాయ కన్యాం సుభగాం మహామతే||42

కృపణం వాక్యమాకర్ణ్య సముత్థాయ హిమాలయ: మహేశం చ సమాదాయ హ్యువాచ గిరిరాట్‌ స్వయమ్‌ || 43

అని పలికి ఆ పల్లె స్త్రీ చేతిని మదనాతురుడై పట్టుకొనెను అంత ఆమె అతనిని విస్మయమొనర్చుచూ వదలు వదులు మని ఆదరముతో అనెను(36) భగవాన్‌| తాపసుడవైన నీవిట్లు బలవంతము చేయుట తగదు నా తండ్రిని నాకై యాచించుము వేరొక విధముగా బలవంతపెట్టరాదు (37) అనగా శివుడనెను సుందరీ! త్వరగా చెప్పుము ఎక్కడున్నాడు నీ తండ్రి? ప్రణిపాతముతో అతనిని చూడదలిచితిని (38) అనగా అపుడు అందమైన కళ్ళుగల పార్వతి శివుని తన తండ్రి వద్దకు తీసుకొనివచ్చెను (39) కైలాస శిఖరమున పెక్కు సర్పములతో కూడిన గొప్ప కాంతిగల హిమవంతుని వద్దకు తెచ్చెను (40) ద్వారము వద్ద నిలిచిన తండ్రిని చూపించి అతనిని యాచింపుము అని శంకరునితోఅనెను సిగ్గువిడిచి నాతండ్రిని నాకై యాచింపుము నన్ను తప్పక ఇచ్చును ఆలసించకు (41) అనగా అట్లేనని శివుడు ఒక్కమారుగా నమస్కరించి హిమాలయునితో ననెను గిరివర్యా! సుందరియగు కన్యయైన ఈ నీ కూతురిని ఆర్తుడినైన నాకిమ్ము(42) అని కృపణుడై పలుకగా విని హిమాలయుడు లేచి మహేశుని దగ్గరకు తీసుకొని ఇట్లనెను.(43)

కిం జల్పసి హి భో దేవ తవాయుక్తం చ సాంప్రతమ్‌ | త్వం దాతా త్రిషు లోకేషు త్వం స్వామీ జగతాం విభో ||44

త్వయా తతమిదం విశ్వం జగదేతచ్చరాచరమ్‌ ఏవం స్తుతిపరోభూచ్చ హిమాలయగిరిర్మహాన్‌ ||

ఆగతో నారదస్తత్ర ఋషిభిః పరివారితః || 45

ఉవాచ ప్రవాసన్‌ వాక్యం శూలపాణ నమ: ప్రభో | హే శంభో శ్రుణు మే వాక్యం తత్త్వసారమయం పరమ్‌ ||46

యోషిద్భి: సంగతి : పుంసాం విడంబాయోపకల్పతే | త్వం స్వామీ జగతాం నాథ: పరాణాం పరమ: పర:|| విమృశ్య సర్వం దేవేశ యథావద్వక్తుమర్హసి||47

ఏవం ప్రబోదితస్తేన నారదేన మహాత్మనా ప్రభోధమగమచ్చంభుర్జహాస పరమేశ్వర:||48

శివ ఉవాచ:-

సత్యముక్తం త్వయా చాత్ర నాన్యథా నారద క్వచిత్‌ | యోషిత్సంగతిమాత్రేణ నృణాం పతనమేవ చ||49

భవిష్యతి స సందేహోనాన్యథా వచనం తవ| అనయా మోహితోద్యాహమానీతో గంధమాదనమ్‌ ||50

పిశాచవత్కృతమిదం చరితం పరమాద్బుతమ్‌ ||51

తస్మాన్న తిష్టామి గిరేః | సమీపే వ్రజామి చాద్యైవ వనాంతరం పున:| ఇత్యేవముక్తా స జగామ మార్గం | దురత్యయం యోగీనామప్యగమ్యమ్‌||52

దేవా! నీకు తగనిదానిని నీవెట్లు ఇప్పుడు పలుకుచుంటివి? ముల్లోకములో నీవే దాతవు స్వామివి కదా!(44) చరాచర జగత్తునంతా నీవే వ్యాపించియున్నావు అని అనేక విధములుగా హిమాలయుడు స్తుతించెను. ఇంతలో నారదుడు ఋషులతో కలిసి అక్కడకు వచ్చెను.(45) నవ్వుచూ శివునితో నిట్లనెను శూలపాణీ! నమస్కారము! వాస్తవముతో కూడిన నా మాటను వినుము.(46) స్త్రీలతో కలయిక అనునది మగవారిని ఎగతాళి పాలుచేయును. నీవు లోకములకునాథుడవు పరాత్పరుడవు. దీనినంతా తరచి చూచి వాస్తవమును పలుకవలెను (47) అని నారదుడు ప్రబోధమును గరుపగా శివుడు స్పృహనొంది నవ్వెను.(48) నారదా! నీవన్నదే నిజము . స్త్రీల సాంగత్యము చేతనే పురుషులు పతనమయ్యెదరు. (49) సందేహములేదు నీమాట సత్యము నేనీనాడు ఈస్త్రీచే మోహమునొంది గంధమాదనమునకు గొని రాబడితిని.(50) అ పరమాద్భుతచరిత్రము పిశాచము వలె చేయబడినది. (51) కనుక పర్వత సమీపమున నుండను . నేడే మరల వనమునకు వెళ్ళెదనని శివుడు యోగులు కూడా పొందలేని చోటికి వెళ్ళెను.(52)

నిరాలంబం స విజ్ఞాయ నారదో వాక్యమబ్రవీత్‌ | గిరిజాం చ గిరీంద్రం చ పార్షదాన్‌ ప్రతి సత్వరమ్‌ ||53

వందనీయశ్చ స్తుత్యశ్చ క్షామ్యతాం పరమార్థత: | మహేశోzయం జగన్నాథస్త్రీపురారిర్మహాయశా:||54

ఏతచ్చృత్వా తు వచనం నారదస్య ముఖోద్గతమ్‌ | గిరిజాం పురత: కృత్వా గిరయో హి మహాప్రభా:||55

దండవత్పతి: సర్వే శంకరం లోకశంకరమ్‌ | తుష్టువు: ప్రణతా : సర్వే ప్రమథా గుహ్యకాదయ:||56

స్తూయమానో హి భగవానాగతో గంధమాదనమ్‌ | అంగిరసా హి సర్వశో హ్యభిషిక్తో మహాత్మభి:||57

తదా దుందుభయో నేదుర్వాదిత్రాణి బహుని చ | ఇంద్రాదయ: సురా: సర్వే పుష్పవర్షం వవర్షిరే||58

బ్రహ్మదిబి: సురగణౖర్భహుభి: పరీతో యోగీశ్వరో గిరిజయా సహ విశ్వవంద్య:

అభ్యర్థిత: పరమమంగళమంగళైశ్చ | దివ్యాసనోపరి రరాజ మహావిభూత్యా||59

ఏవం విధాన్యనేకాని చరితాని మహత్మన: మహేశస్య చ బో విప్రా : పాపహారిణి శృణ్వతామ్‌ ||60

అతను నిరాలంబుడని తెలిసి నారదుడు పార్వతితో, హిమవంతునితో, ఇతర సభ్యులతో నిట్లనెను(53)ఈ శివుని పరమార్థముగా అభివాదముచేసి స్తుతించి, క్షమించునట్లు చేయాలి. ఈ మహేశుడు లోకములకు నాథుడు , త్రిపురముల నాశకుడు గొప్ప కీర్తి గలవాడు.(54) అనగా నారదుని నోటినుండి వచ్చిన పలుకులను విని గిరిజను ఎదుట నుంచుకొని పర్వతములన్నీ (55)శంకరుని ఎదుట దండప్రణామమునాచరించి , ప్రణతులై స్తుతించిరి(56) అట్లు స్తుతించగా శివుడు గంధమాదనమునకు అంగిరసునితో వచ్చి మహర్షులతో నభిషేకింపబడెను.(57) అపుడు దుందుభి మొదలైనవాద్యాలు మ్రోగెను. ఇంద్రాది దేవతలందరూ పుష్పముల కురిపించిరి. (58) బ్రహ్మది సురగణములతో గిరిజతో అభ్యర్థింపబడిన పరమవంద్యుడగు శివుడు వారితో కూడి దివ్యాసనము పై నుండి గొప్ప ఐశ్వర్యముతో రాజిల్లెను.(59) విప్రులారా! పరమశివుని ఇట్టి అనేక చరితములు, వినువారి పాపముల హరింపజేయునవి.(60)యాని యానీహ రుద్రస్య చరితాని మహాంత్యపి | శ్రుతాని పరమాణ్యవ భూయ: కిం కథయామి వ:||61

ఋషయా ఊచు:

ఏవముక్తం త్వయా సూత చరితం శంకరస్య చ | అనేన చరితేనైవ సంతృప్తా: స్మో న సంశయ:||62

సూత ఉవాచ-

వ్యాసప్రసాదాచ్చ్రుతమస్తి సర్వం | మయా తతం శంకరూపమద్భుతమ్‌ |

సువిస్తృతం చాద్భుతవేదగర్భం | జ్ఞానాత్మకం పరమం చేదముక్తమ్‌ ||63

శ్రద్దయా పరయోపేతా: శ్రావయంతి శివప్రియమ్‌ | శృణ్వంతి యే భక్త్యా శంభోర్మాహాత్మ్యమద్బుతమ్‌ ||

శివశాస్త్రమిదం ప్రీత్యా తే యాంతి పరమాం గతిమ్‌|64

ఇతి శ్రీ స్కాందపురాణ ప్రథమే మాహేశ్వర ఖండే కేదారఖండే శివశాస్త్రే

పార్వత్యా శబరీరూపేణ శివస్య గంధమాదనపర్వతం ప్రత్యానయనపూర్వకం

బృహస్పతికృతశివరాజ్యాభిషేకవర్ణనం నామ పంచత్రింశోధ్యాయ:

35

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

ప్రథమ: కేదారఖండ: సమాప్త:

రుద్రుని గొప్ప చరితములేవేవి గలవొ అవన్నీ వింటిమి ఇక మీకేమి చెప్పెదను? (61) అనగా ఋషులనిరి సూతుడా! ఈ విధముగా నీవు శంకరుని చరితమును చెప్పగా మేము నిస్పంశయముగా తృప్తి నొందితిమి.(62) అనగా సూతుడనెను హ్యసుని ప్రసాదముచేనేను అద్భుతము, విస్తృతము, వేదగర్భము, జ్ఞానాత్మకమైన ఈశంకరరూపమద్భుతమగు దానిని వింటిని(63) ఎవరు భక్తితో పరమశ్రద్దతో ప్రీతితో శివుని కిష్టమయిన శివమాహాత్మ్యమును శివశాస్త్రమును వినెదరో, వినిపించెదరో వారు పరమగతిని పొందెదరు.(64)

ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మాహేశ్వర ఖండమున కేదారఖండమున శివశాస్త్రమున పార్వతి శబరిరూపమున శివుని గంధమాదనపర్వతము వద్దకు తెచ్చుట బృహస్పతి శివుని రాజ్యాభిషిక్తుని జేయుట అను వాని వర్ణనమను

ముప్పదియైదవ అధ్యాయము-35

ఇది శ్రీ స్కాందపురాణమున మొదటి మాహేశ్వరఖండమున మొదటి కేదారఖండము సమాప్తము.

అథ శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కౌమారికాఖండే

ప్రథమోzధ్యాయ:

శ్రీ మునయ ఊచు:

దక్షిణార్ణవతీరేషు యాని తీర్థాని పంచ చ | తాని బ్రూహి విశాలాక్ష వర్ణయంత్యతి తాని చ||1

సర్వతీర్థఫలం యేషు నారదాద్యా వదంతి చ | తేషాం చరితమాహాత్మ్యం శ్రోతుమిచ్చామహే వయమ్‌ ||2

ఉగ్రశ్రవా ఉవాచ-

శ్రుణుధ్వమత్యద్భుతపుణ్యసత్కథం | కుమారనాథస్య మహాప్రభావమ్‌ |

ద్వైపాయనో యన్మమ చాహ పూర్వం | హర్షాంబురోమోద్గమచర్చితాంగ:||3

కుమారగీతా గాథzత్ర శ్రూయతాం మునిసత్తమా: | యా సర్వ దేవైర్మునిభి : పితృభిశ్చ ప్రపూజితా||4

మధ్వాచారస్తంభతీర్థం యో నిషేవేత మానవ: | నియతం తస్య వాస: స్యాద్‌ బ్రహ్మలోకే యథా మమ||5

బ్రహ్మ లోకాద్విష్ణులోకస్తస్మాదపి శివస్య చ| పుత్రప్రియత్వాత్తస్యాపి గుహలోకో మహత్తమ:||6

అత్రాశ్చర్య కథా యాచ ఫాల్గునస్య పురేరితా| నారదేన మునిశ్రేష్టుస్తాం వో వక్ష్యామి విస్తరాత్‌ ||7

మొదటి అధ్యాయము

మునులు ఉగ్రశ్రవుని ఇట్లడిగిరి దక్షిణ సముద్ర తీరముననున్న ఐదు తీర్థములేవో చెప్పి వానిని వర్ణించుము(1) నారదారులు ఆ తీర్థములకు అన్ని తీర్థముల ఫలితమునిచ్చు శక్తి వున్నదందురు కనుక వాని చరితమును ,మాహాత్మ్యమును వినగోరుచున్నాము.(2) అని అడగగా ఉగ్రశ్రువుడిట్లు చెప్పెను. పూర్వము ఆనంద బాష్పములతో పులకింతశరీరముతో వ్యాసుడు నాకు చెప్పిన అత్యద్భుతమగు కుమారనాథుని ప్రభావమగు పుణ్యసత్కథను వినుడు (3) మునిశ్రేష్టులారా! దేవతలందరిచే, మునులచే, పితరులచే పూజింపబడిన కుమారగాథను వినుడు (4)ఏ మానవుడు మధ్వాచారస్తంభతీర్థమును సేవించునో అతను నా వల్లనే బ్రహ్మలోకమున నియతముగా నివసించుము(5) బ్రహ్మలోకముకంటే విష్ణులోకము దాని పై శివలోకము, దానికంటే పుత్రుని పట్ల వాత్సల్యముచే కుమారలోకము గొప్పనైనది.(6) పూర్వము అర్జునునికి నారదుడు తెలిపిన అత్యాశ్చర్యమగు కథను మీకు విస్తరముగా చెప్పెదను.(7)

పురా నిమిత్తే కస్మింశ్చిత్‌ కిరీటి మణికూటత:| సముద్రే దక్షిణభ్యాగాత్‌ స్నాతుం తీర్థాని పంచ చ ||8

వర్జయంతి సదా యాని భయాత్తీర్థాని తాపసా! కుమారేశస్య పూర్వం చ తీర్థమస్తి మునే: ప్రియమ్‌ ||9

స్తంభేశస్య ద్వితీయం చ సౌభద్రస్య మునే: ప్రియమ్‌ బర్కరేశ్వరమన్యచ్చ పౌలోమీప్రియముత్తమమ్‌ ||10

చతుర్థం చ మహాకాలం కరంధమనృపప్రియమ్‌ భరద్వాజస్య తీర్థం చ సిద్దేశాఖ్యం హి పంచమమ్‌||11

ఏతాని పంచ తీర్థాని దదర్శ కురుపుంగవ: | తపస్విభిర్వర్జితాని మహాపుణ్యాని తాని చ||12

దృష్ట్యా పార్శ్వే నారదీయానపృచ్చ మహామునీన్‌ | తీర్థానీమాని రమ్యాణి ప్రభావాద్భుతవంతి చ||13

కిమర్థం బ్రూత వర్జ్యంతే సదైవ బ్రహ్మవాదిభి:

తాపసా ఊచు:

గ్రాహా: పంచ వసంత్యేషు హరంతి చ తపోధవాన్‌ ||14

ఆత ఏతాని వర్జ్యంతే తీర్థాని కురునందన | ఇతి శ్రుత్వా మహాబాహుర్గమనాయ మనో దధే||15

తతస్తం తాపసా ప్రోచుర్గంతుం నార్హసి పాల్గున| బహవో భక్షితా గ్రాహై రాజానో మునయస్తథా| 16

తత్త్వం ద్వాదశవర్షాణి తీర్థానామర్చుదేష్వపి| స్నాత: కిమేతైసీర్థెస్తే మా పతంగవ్రతో భవ||17

పూర్వము ఒక కారణముచే అర్జునుడు మణికూటమునుండి దక్షిణ సముద్రము వద్దకు అయిదు తీర్థములందు స్నానమాడుటకు వెళ్ళెను. (8)తాపసులు భయముతో ఎల్లప్పుడూ విడిచి పెట్టెదరో ఆ తీర్థములను అర్జునుడు చూచెను అవి కుమారేశుని తీర్థము, సౌభద్రమునికిష్టమైన స్తంభేశ తీర్థము, పౌలోమికిష్టమైన బర్కరేశ్వర తీర్థము, కరంధమరాజుకిష్టమైన మహాకాల తీర్థముచ భరద్వాజునికిష్టమైన సిద్దేశతీర్థము అనునవి (9,10,11) అర్జునుడు మహాపుణ్యకరములగు ఈ తీర్థములు తపస్వులు విచిచిపెట్టుట చూచెను (12) ప్రక్కనే వున్న నారదాది మహామునుల నిట్లడిగెను తీర్థములు అందముగా మరియు అద్భుతముగా నున్నవి (13) బ్రహ్మవాదులు ఎల్లప్పుడూ వీనినెందుకు విడిచెదరు? అని అడుగగా వారనిరి పాండవా: వీనియందు ఐదు మొసళ్ళుఉన్నవి అవి తపోధనుల ప్రాణములు తీయుచున్నవి గాన వారు తీర్థములను విడిచిరి అనగా అర్జునుడు తీర్ధముల వైపు వెళ్ళుచుండగా తాపసులు అతనిని ఆపదలిచి ఇట్లనిరి అర్జునా! నీవు వెళ్ళకూడదు ఎందరో రాజులు, మునులు ఆ మొసళ్ళ నోట్ల బడినారు.(16) నీవు పన్నెండు సంవత్సరాలు అనేక తీర్థములలో స్నానమాడితివి. ఈ తీర్థములతో పనిఏమి? మిడుతవలె ఆత్మార్పణము చేసుకొనకుము.(17)

అర్జున ఉవాచ-

యుదుక్తం కరుణాసారై: సారం కిం తదిహోచ్చతామ్‌ | ధర్మార్థీ మనుజో యశ్చ న సవార్యో మహాత్మభి: 18

ధర్మకామం హి మనుజం ¸° వారయతి మందరీ :| తదాశ్రితస్య జగతో ని:శ్వాసైర్భస్మసాద్భవేత్‌ ||19

యజ్జీవితం చాచిరాంశుసమానక్షణభంగురమ్‌ | తచ్చేద్ధర్మకృతే యాతి యాతు

దోషోస్తి కో నమ:||20

జీవితం చ , ధనం దారా! పుత్రా: క్షేత్రాగృహిణి చ యాన్తి యేషాం ధర్మకృతే త ఏవ భువి మానవా:||21

తాపసా ఊచు-

ఏవం తే బ్రువత: పార్థ దీర్ఘమాయ: ప్రవర్థతామ్‌ సధా ధర్మే రతిర్భూయాద్యాహి స్వం కురు వాంచితమ్‌ ||22

ఏవముక్తః ప్రణమ్యైతానాశీర్భిరభిసంస్తుత: | జగామ తాని తీర్థానేఇ దృష్టుం భరతసత్తమ:||23

తత: సౌభద్రమాసద్య మహర్షేస్తీర్థముత్తమమ్‌ | విగాహ్యతరసా వీర: స్నానం చక్రే పరంతప:||24

అథ తం పురుషవ్యాఘ్రమంతర్జలచరో మహాన | నిజగ్రాహ జలే గ్రాహ: కుంతీపుత్రం ధనంజయమ్‌ ||25

తమాదాయైవ కౌంతేయో విస్ఫురంతం జలేచరమ్‌ | ఉదతిష్ఠన్మహార్బలేన బలినాం వర:||26

అనగా అర్జునుడిట్లనెను. కరుణాసముద్రలైన మీరు పలికిన దానిలో సారమేమిటో చెప్పండి మహాత్ములు ధర్మమును కోరు మనుజుని నివారించరాదు (18) అల్పబుద్ది గలవాడైనా ధర్మమును కోరువానిని నివారించినచో అతని నాశ్రయించు జగత్తు నిశ్వాసములలో భస్మమగును (19) మెరుపువలె క్షణములో నశించు జీవితము ధర్మముకొరకు పోవుచున్న పొనిమ్ము. దోషమేమున్నది?(20) ఎవరు జీవితము , దనము,భార్య, పుత్రుతు, భూమి, గృహము అన్నీ ధర్మము కొరకు కోల్పోపుదురో వారే భూవిలో మానవులు (21) అనగా తాపసులనిరి ఇట్లు పలుకుచున్న నీ ఆయువు వర్థిల్లుగాక! పార్థా! ఎల్లప్పుడు నీకు ధర్మమున అభిరుచి నిలుచుగాక ! వెళ్ళు నీవు కోరినదే చేయుము (22) అనగా అర్జునుడు వారికి నమస్కరించి, వారి ఆశీస్సులను గ్రహించి ఆ ఐదు తీర్థములను చూచుటకు వెళ్ళెను(23) అనగా అర్జునుడు నీటిలో దిగి స్నానము చేయసాగెను.(24) అపుడు నీటిలో నున్న ఒక పెద్ద మొసలి ఆ కుంతీపుత్రుడగు అర్జునుని నీటిలో పట్టుకొనెను (25) అపుడు అమిత బలవంతుడగు అర్జునుడు కదలుతున్న ఆ మొసలితో సహా బలముగా పైకి లేచెను.(26)

ఉద్దృతశ్చైవ తు గ్రాహ: సోర్జునేన యశస్వినా| బభూవ నారీ కల్యాణీ సర్వాభరణభూషితా||27

దీప్యమానశిఖా విస్రా దివ్యరూపా మనోరమా| తదద్భుతం మహద్దృష్ట్యా కుంతీపుత్రో ధనంజయ:||28

తాం స్త్రీయం పరమప్రీతం ఇంద్రం వచనమబ్రవీత్‌ | కా వై త్వమసి కల్యాణి కుతో వా జలచారిణీ ||29

కిమర్ధం చ మహత్పాపమిదం కృతవతీ హ్యసి| నార్యువాచ-

అప్సరా హ్యస్మి కౌంతేయ దేవారణ్యనివాసినీ ||30

ఇష్టా ధనపతేర్నిత్యంవర్చా నామ మహాబల | మమ సఖ్యశ్చతస్రోన్యా సర్వా: కామగమా:శుభా:||31

తాభి: సార్థం ప్రయతాస్మి దేవరాజనివేశనాత్‌ | తత: పశ్యామహే సర్వా బ్రాహ్మణం చానికేతనమ్‌||32

రూపవంతమధీయానమేకమేకాంతచారిణమ్‌ |తస్య వై తపసా వీర తద్వనం తేజసా వృతమ్‌||33

ఆదిత్య ఇవ తం దేశం కృత్స్నమేవాన్వభాసయత్‌ | తస్య దృష్ట్యా తపస్తాదృగ్రహం చాద్బుతదర్శనమ్‌ ||34

అవతీర్ణాస్మి తం దేశం తపోవిఘ్నచికీర్ఝయా| అహం చ సౌరభేయీ చ సా మేయీ ఋద్బుదా లతా ||35

¸°గపద్యేన తం విప్రమభ్యాగచ్చామ భారత | గాయంత్యో లలమానాశ్చ లోభయంత్యశ్చ తం ద్విజమ్‌ ||36

అపుడు అర్జునుడు పైకి లేపగా ఆ మొసలి సర్వాభరణభూషితయగు ఒక అందమైన స్త్రీగా మారిపోయినది.(27) విప్రులారా!ఆమె శిఖ జ్వలించిచున్నది. అట్టి మనోహరస్త్రీ ఆమె. ఆ గొప్ప అద్భుతమును చూచి ధనంజయుడు పరమప్రీతితో ఆ స్త్రీనిట్లడిగెను. కల్యాణీ! నీవెవరవు! ఎట్లీ జలచరమైతివి?(29) ఎందుకీ గొప్ప పాపము నాచరించితివి ? అనగా ఆమె ఇట్లు చెప్పెను కౌంతేయా! నేనొక అప్సరసను. దేవారణ్యమున నివసించుదానను.(30) కుబేరునికి ఇష్టురాలైన వర్చ అను దానను. నా ఇతర మిత్రులు నలుగురు. వారంతా స్వేచ్చగా చరించువారు. కల్యాణులు.(31) ఒకనాడు దేవరాజగు ఇంద్రుని మందిరమునకు వారితో కలిసి వెళ్ళితిని. అక్కడ నివాసమంటూ లేని ఒక బ్రాహ్మణుని చూచితిమి.(32) అతను అందముగా నుండి, ఒంటరిగా అధ్యయనము చేయుచుండెను అతని తేజస్సుతో ఆ వనమంతా నిండినట్లుండెను (33) సూర్యుని వలె ఆ ప్రదేశమునంతా ప్రకాశింపజేసెను. అతని ఆ అద్బుత తపస్సును చూచి (34) దానికి ఆటంకము కల్పించవలెనని అక్కడ దిగితిని.నేను , సౌరభేయి, సామేయి, బుద్బుద,లత, అనువారలము ఒక్కమారుగా అతని వద్దకు వెళ్ళి గానము చేయుచూ, వయ్యారములోలికిస్తూ ద్విజుని లోభ##పెట్టితిమి.(35)

స చ నాస్మాసు కృతవాన్మనో వీర: కథంచన | నాకంపత మహాతేజా : స్థితస్తపసి నిర్మలే||37

సోశపత్ముపితోస్మాసు బ్రాహ్మణ: క్షత్రియర్షభ| గ్రాహభూతా జలే యూయం భవిష్యథ శతం సమా:||38

తతో వయం ప్రవ్యధితా : సర్వా భరతసత్తమ | ఆయాతా: శరణం విప్రం తపోధనమకల్మషమ్‌ ||39

రూపేణ వయసా చైవ కందర్పేణ చ దర్పితా: ఆయుక్తం కృతవత్య: స్మ క్షంతుమర్హసి నో ద్విజ||40

ఏష ఏవ వధోస్మాకం స పర్యాప్తస్తపోధన| యద్వయం శాసితాత్మానం ప్రలోబ్దం త్వాముపాగతా:||41

అవధ్యాశ్చ స్త్రియ: సృష్టా మన్యంతే ధర్మచింతకా :| తస్మాద్దర్మేణ దర్మజ్ఞ ఏష వాదో మనీషిణామ్‌ ||42

శరణం చ ప్రపన్నానాం శిష్టా: కుర్వంతి పాలనమ్‌ |శరణ్యం త్వాం ప్రసన్నా: సమస్తస్మాత్త్వం క్షంతుమర్హసి||43

ఏవముక్తస్తు ధర్మాత్మా బ్రాహ్మణ: శుభకర్మకృత్‌ ప్రసాదం కృతవాన్‌ శూర రవిసోమసమప్రభ:||44

బ్రాహ్మణ ఉవాచ-

భవతీనాం చరిత్రేణ పరిముహ్యామి చేతసి | అహో ధార్ఘ్యమహో మోహో యత్పాపాయ ప్రవర్తనమ్‌ ||45

మస్తకస్థాయినం మృత్యుం యది పశ్యేదయం జన: | అహోరోపి న రోచేత కిముతాకార్యకారితా||46

అహో మానుష్యకం జన్మ సర్వజన్మసు దుర్లభమ్‌ | తృణవత్‌ క్రియతే కైశ్చిద్యోషిన్మూడైర్దురాధరై:||47

కానీ ఆ వీరుడు మా యందు మనసునుంచలేదు నిర్మలమైన తపస్సునందున్న అతను చలించేలేదు.(37) తరువాత కోపించిన ఆ బ్రాహ్మణుడు మమ్ము చూచి మీరు మొసళ్ళె నీటిలో వంద సంవత్సరములుండెదరు.(38)అని శపించగా బాధనొంది మేమంతా ఆ స్వచ్చమైన తపస్విని శరణు జొచ్చితిమి. అపరాధము నాచరించితిమి. క్షమించుము. (40)ఇదే మాకు వధ. ఇది చాలు ఆత్మనిగ్రహముగల నిన్ను లోభ##పెట్టుటకు మేము వచ్చితిమి ఇదే మాకు శిక్ష (41) ధర్మమును గూర్చి ఆలోచించువారు స్త్రీలు వధింపబడనాదని ధర్మమును గూర్చి ఆలోచించువారు అందురు కనుక! ధర్మమును తెలిసిన బ్రాహ్మణుడా! ఇది విజ్ఞుల ధర్మవాదమని తెలియుము(42) శరణుజొచ్చినవారిని శిష్టులు పాలించెదరు మేము నిన్ను వరణుగోరితిమి. నీవు సముడవు గాన క్షమించవలెను (43) అని కోరిగా ధర్మాత్ముడగు ఆ విప్రుడు శుభము చేయగోరి, సూర్యచంద్రులతో సమానమగు కాంతి గలవాడై ప్రసన్నుడాయెను.(44) అతడిట్లనెను మీ చరితముచే నేను మనసులో నొందితిని ఏమి చెడునడత! ఏమి మోహము! పాపము కొరకు ప్రవర్తించుటే కదా! (45) తల పై నున్న మృత్యువును చూచినట్లువుతే జనులకు ఆహారము కూడా రుచించదు. ఇక పాపమునెట్లు చేసెదరు? (46) అన్ని జన్మలలోనూ పొంద శక్యముగాని మనుష్య జన్మనుకొందరు, స్త్రీలపట్ల మోహముతో తృణముతో చూచెదరు.(47)

తాన్వయం సమపృచ్చామో జనిర్వ: కిం నిమిత్తత: కో వా లాభో విచార్యైతాన్మనసా సహ ప్రోచ్చతామ్‌ ||48

న చైతా: పరినిందామో జనిర్యాభ్య: ప్రవర్తతే | కేవలం తాన్వినిందామో యే చ తాసు నిరర్గళా:||49

యత: పద్మభువా సృష్టం మిధునం విశ్వవృద్దయే | తత్తథా పరిపాల్యం వై నాత్ర దోషోస్తి కశ్చన ||50

యా బాంధవై: ప్రదత్తా స్యాద్వహిద్విజసమాగమే| గార్హస్థ్యపాలనం ధన్యం తయా సాకం హి సర్వదమ్‌ ||51

యథా ప్రకృతిపుంయోగో యత్నేనాపి పరస్పరమ్‌ | సాధ్యమానో గుణాయ స్యాదగుణాయాప్యసాధిత:||52

ఏవం యత్నాత్సధ్యమానం స్వకం గార్హస్థ్యముత్తమమ్‌ | గుణాయ మహతే భూయాదగుణాయాప్యసాధితమ్‌|| 53

పురా పంచముఖే ద్వాస్థ ఏకాదశభ##టైర్యుత: | సాకం నార్యా బహ్వపత్య: స కథం స్యాదచేతన:||54

యశ్చ స్త్రియా సమాయోగ: పంచయజ్ఞాదికర్మభి :| విశ్వోపకృతయే సృష్టా మూడైర్హా సాధ్యతే న్యథా||55

అహో శ్రుణుధ్వం నో చేద్వ:శశ్రూషా జాయతేzశుభా| తథాపి బాహుముద్దృత్య రోరూయామ: శ్రుణోతి క:||56

షడ్డాతుసారం తద్వీర్యం సమానం పరిహాయ చ | వినిక్షేపే కుయోనౌ తు తస్యేదం ప్రోక్తవాన్‌ యమ:57

వారిని నేనడుగుచున్నానను మీ జన్మ ఎందులకు? లాభ##మేమిటో ఆలోచించి మనసుతో ,తెలియజేయుడు (48) ఎవరినుండి జన్మ కలిగెనో వారిని నిందించము కానీ వారియందు అదుపులేకుండా ప్రవర్తించు మగవారినే మేము నిందించుచుంటిమి (49) బ్రహ్మ విశ్వవృద్దికై జంటను సృష్టించినందున దానిపట్లే పరిపాలించవలెను దోషమేదీ లేదు(50) అగ్ని బ్రాహ్మణుల సమక్షమున బంధువులచే నివ్వబడిన స్త్రీతో గార్హస్థ్యమును పాలించుట ధన్వము, అది అన్నింటినీ ప్రసాదించునది. (51) ఎట్లైతే ప్రకృతి పురుష సంయోగము ప్రయత్నముచే సాధింపబడినచో గుణమును కలిగించునో సాధింపబడనిచో దోషమును కలిగించును (52) ఇట్లు ప్రయత్న పూర్వకముగా సాధింపబడు ఉత్తమ గృహస్థ జీవితము గొప్ప గుణమును కలిగించును. సాధింపబడనిచో దోషమునే కలిగించును కూడా (53) పూర్వము పంచముఖమున, పదుకొండు మంది భటులతో కూడి స్త్రీతో , అధికసంతానము గల వాడచేతనుడెట్లగును? (54) పంచయజ్ఞము మొదలైన కర్మలతో స్త్రీతో కలియుట యున్నది విశ్వమునకుపరించుటకై సృజింప బడినది. ఆహా! మూఢులు దానినెట్లు ఇతరరీతిలో సాధించెదరు కదా!(55) అహో! వినుడు లేనిచో మీకు అశుభమును వినుటకు కోరిక కలుగును అయిననూ, చేతులెత్తి అరిచిననూ వినువాడెవడు? (56) ఆరు ధాతువుల సారము అగు ఆ వీర్యమును తగిన మానమున వదలి,చెడుయోనియందు వుంచువాడి నుద్దేశించి యముడిట్లనెను(57)

ప్రథమం చౌషధీద్రోగ్ధా ఆత్మద్రోగ్దా తత: పున: పితృద్రోగ్దా విశ్వదోగ్గా యాత్యంధం శాశ్వతీ సమా:||58

మనుష్యం పితరో దేవా మునయో మానవాస్తథా| భూతాని చోపజీవంతి తదర్థం నియతో భ##వేత్‌||59

వచసా మనసా చైవ జిహ్వయా కరశ్రోత్రకై: | దాంతమాహుర్షి సత్తీర్థం కాకతీర్థమత: పరమ్‌ ||60

కాకప్రాయే నరే యస్మిన్‌ రమంతే తామసా జనా: | హంసోzయమితి దేవానాం కోర్థస్తేన విచింత్యతామ్‌ ||61

ఏవం విధం హివిశ్వస్య నిర్మాణం స్మరతో హృది | అపి కృతే త్రికోక్యాశ్చ కథం పాపే రమేన్మన:||62

తదిదం చాన్యమర్త్యానాం శాస్త్రదృష్టమహా స్త్రియ: | యమలోకే మయా దృష్టం ముహ్యే ప్రత్యక్షత : కథమ్‌ ||63

భవతీషు చ క: కోపో యే యదర్థే హి నిర్మితా !| తే తమర్థే ప్రకుర్వంతి సత్యమస్తుభ##మేవ చ||64

శతం సహస్రం విశ్వం చ సర్వమక్షయవాచకమ్‌ | పరిమాణం శతం త్వేవ నైతదక్షయ్యవాచకమ్‌ ||65

యదా చ వో గ్రాహభూతా గృహ్హతీ: పురషాంజలే | ఉత్కర్హతి జలాత్కశ్చిత్‌ స్థలే స్వం రూపం ప్రతిపత్స్యథ||66

అనృతం నోక్తపూర్వం మే హసతాపి కదాచన| కల్యాణస్య సుపృక్తస్య శుద్దిస్తద్ద్వారా హి వ:|| 67

వాడు మొదట ఓషదులకు ద్రోహముచేయువాడు . తరువాత ఆత్మద్రోహమును తరువాత పితృదేవతలకు, తరువాత విశ్వమునకు ద్రోహము చేయువాడు అట్టివాడు అనేక సంవత్సరాలు అంధలోకముల జేరును (58) మానవుని ,పితృదేవతలు, దేవతలు,మునులు, మానవులు, ప్రాణులు ఆశ్రయించియుండినందున, నియమముతో నుండవలెను(59) వాక్కుచే , మనస్సుచే,నాలుకచే, చేతులచే, చెవులచేనిగ్రహము పాలించువాడిని సత్తీర్థము అందరు. అట్లు కానివాడు చెడుతీర్థమే(60) అట్టి కాకివంటి నరుని యందు కొందరు తామసజనులు హంస ఇతనని ఆనందింతురు దానిచేనేమి లాభము? ఆలోచించుడు (61) ఇట్టి విశ్వనిర్మాణమును మనసులో స్మరించువాడు ముల్లోకముల కొరకైనా పాపము నందెట్లానందించును?(62) ఇది ఇతర నరులకు శాస్త్రములచే చూడదగినది. ఆహా స్త్రీలనేమందుము? యమలోకమును స్వయముగా చూచియూ మోహమునెట్లు పొందెను? (63) మీయందు మాత్రము కోపమేమి? ఎవరికై నిర్మించబడితిరో వారు వారి ప్రయోజనమునేనిర్వహించెదరు. ఇది నిజము నిర్ధోషము (64) నూరు. వెయ్యిచ విశ్వము,సర్వమనునది అక్షయమును చెప్పును పరిమాణము నూరే ఇది అక్షయమను సూచించదు (65) మీరు మొసళ్ళై నీటిలో పురుషులను పట్టునపుడు మిమ్ము పైకి లేపువాడు వచ్చిన మీ రూపమును పొందెదరు నేను నవ్వుటకైననూ అసత్యమునాడలేదు అట్టి కల్యాణకారి, చక్కనిదగు వాక్కుచే మీకు శుద్ది కలుగును(67)

నార్యువాచ-

తతోభివాద్య తం విప్రం కృత్యా చైవ ప్రదక్షిణమ్‌||68

అచింతయామాపసృత్య తస్మాద్దేశాత్సుదు:ఖితా|| క్వ నునామ వయం సర్వా: కాలేనాల్పేన తం నరమ్‌ ||69

సమాగచ్చేమ యో న: స్వం రూపమాపాదయేత్పున: తా వయం చింతయిత్వేహ ముహూర్తాదివ భారత||70

దృష్టవత్యో మహాభాగం దేవర్షిమథ నారదమ్‌ | సర్వా హృష్టా: స్మతం దృష్ట్యా దేవర్షిమమితద్యుతిమ్‌ ||71

అభివాద్య చ తం పార్థ స్థితా: స్మో వ్యథితాననా: | స నోపృచ్చద్దు:ఖమూలముక్తవత్యో వయం చ తమ్‌ |||72

శ్రుత్వా తచ్చ యథాతత్వమిదం వచనమబ్రవీత్‌ | దక్షిణ సాగరేనూపే పంచ తీర్థాని సంతి వై||73

పుణ్యని రమణీయాని తాని గచ్చత మా చిరమ్‌ | తత్రస్థా : పురుషవ్యాఘ్ర: పాండవో వో ధనంజయ:||74

మోక్షయిష్యతి శుద్దాత్మా దు:ఖాదస్మాన్న సంశయ: | తస్య సర్వా వయం వీర శ్రుత్వా వాక్యమిహాగతా:||75

త్వమిదం సత్యవచనం కర్తుమర్హసి పాండవ| త్వద్విధానాం హి సాదునాం జన్మదీనోపకారకమ్‌||76

శ్రుత్వేతి వచనం తస్యా: సస్నౌ తీర్థేష్వనుక్రమాత్‌ | గ్రాహభూతాశ్చోజ్జహారయథాపూర్వా : స పాండవ:||77

అనగా అపుడు ఆ అప్సరసలు ఆ విప్రునికి నమస్కరించి, ప్రదక్షిణము చేసి దు:ఖముతో ఆ ప్రదేశమునుండి వైదొలిగిరి. తక్కువ కాలములో ఎక్కడ మనమా నరుని కలిసెదము? ఎప్పుడు మనరూపమును పొందెదము? అని ఒక క్షణము ఆలోచించితిమి (70)అర్జునా! అపుడు మేము అక్కడ దేవర్షియగు నారదుని చూచితిమి ఆ తేజస్వియగు నారదుని చూచి సంతోషించిన మేము (71) అతనికి నమస్కరించి , బాధపడుచున్నవారమై నిలిచితిమి. అపుడు దేవర్షి దు:ఖమునకు కారణమేమని అడుగగా మేమతనికి తెలిపితిమి(72) అది విని అతను యథార్థముగా నిట్లు పలికెను దక్షిణ సముద్రతీరమున ఐదు తీర్థములు వన్నవి (73)అవి పుణ్యమునిచ్చునని అందమైనవి త్వరగా అక్కడకు వెళ్ళడు. మీరక్కడుండగా పాండవుడగు అర్జునుడు మిమ్ము ఈ దు:ఖమునుండి విముక్తులను జేయును(74) సందేహము లేదు. అనగా విని ఇక్కడకు వచ్చితిమి (75)వీరుడా! నీవీ పలుకును సత్యముగ చేయవలెను నీవంటి సాధువుల జన్మ దీనులనుపకరించుటకే కదా! (76) ఆ స్త్రీయట్లు పలుకగా విని, క్రమముగా ఇతర తీర్థములలో స్నానమాడెను అక్కడున్న మొసళ్ళు పట్టుకొనగా , అర్జునుడు పూర్వమువలెనే వానిని పై కెత్తెను.(77)తత: ప్రణమ్య తా వీరం ప్రోచ్యమానా జయాశిష: గంతుం కృతాభిలాషాశ్చ ప్రాహ పార్థో ధనంజయ:||78

ఏష మే హృది సందేహ: సుదృఢ: పరివర్తతే | కస్మాద్వో నారదమునిరనుజజ్ఞే ప్రవాసితుమ్‌ ||79

సర్వ: కోప్యతిహీనోపి స్వపూజ్యస్యార్థసాధక: స్వపూజ్యతీర్థేష్వావాసం ప్రోక్తవాన్నారద: కథమ్‌ ||80

తథైవ నవదుర్గాను సతీష్వతిబలాసు చ| సిద్దేశే సిద్దగణపే చాపి వోత్ర స్థితి కథమ్‌ ||81

ఏకైక ఏషాం శక్తో హి ఆపి దేవాన్నివారితుమ్‌ | తీర్థసంరోధకారిణ్య: సర్వా నావారయత్‌ కథమ్‌ ||82

ఇతి చింతయతే మహ్యం భృశం దోలాయతే మన: మహన్మే కౌతుకం జాతం సత్యం వా వక్తమర్హథ|-|83

అప్సరస ఊచు:-

యోగ్యం పృచ్చసి కౌంతేయా పున: పశ్యోత్తరాం దిశమ్‌ ||84

ఏష స్వవిపై#్రరభిసంవృత్తోర్చ్యో ముని: సమాయాతి తథేతి నారద:|

సర్వం హి పృష్టం తవ వై స వక్తా ప్రోచ్యైవమాకాశతలం గతాస్తా:|| 85

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కౌమారికాఖండే పార్థేన పంచాప్సర: సముద్దరణం నామ ప్రథమోధ్యాయ:

అంతట ఆ స్త్రీలు వీరుడగు అర్జునునికి నమస్కరించి, జయము కలుగవలెనని ఆశీర్వదించుచూ, వెళ్ళగోరగా అర్జునుడిట్లనెను (78) నాకు మనసులో గట్టి సందేహమొకటున్నది, నారదముని మీరిక్కడ నివసించుటకు అనుమతినెట్లిచ్చెను?(79) అతిహీనుడైనా ప్రతి ఒక్కడూ తనకు పూజ్యమగు దాని ప్రయోజనమునే సాధించగోరును, మరి నారదుడు తనకు పూజ్యమగు ఈ తీర్థముల యందు మీ నివాసము నెట్లునుమతించెను? (80) అట్లే , అతిబలవంతములగు (అమితబలమైన) నవదుర్గలు,సిద్దగణపతి ఇక్కడనుండగా మొసళ్ళవలె మీరిక్కడెట్లుండిరి? (81) మునులు,ఋషులందరూ ఒక్కొక్కడూ దేవతలనైనా నివారించుటకు తగినవాడు తీర్థములకు ఆటంకము కలిగించు మిమ్ములనెట్లు వారించలేదు ? (82) ఇది ఆలోచించుచుండగా నామనస్సు ఊగిసలాడుచున్నది నాకు గొప్ప కుతూహలమున్నది సత్యమైన బదులివ్వండి.(83) అనగా అప్సరసలు ఇట్లనిరి అర్జునా! సరిగానే అడుగుచుంటివి కానీ ఉత్తరదిక్కున చూడుము (84) ఇతర విప్రులతో గూడి పూజ నీయుడగు నారదుడిటే వచ్చుచున్నాడు నీవడిగిన దానినంతా చెప్పగలవాడతను అని పలికి నింగికెగసిరి(85)

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున

అర్జునుడు అయిదుగురు అప్సరసలను ఉద్దరించుట యను మొదటి అధ్యాయము.

ద్వితీయోధ్యాయ:

సూత ఉవాచ-

తతో ద్విజై: పరివృతం నారదం దేవపూజితమ్‌ | అభిగమ్యోపజగ్రాహ సర్వానథ

స పాండవ:||1

తతస్తం నారద: ప్రాహ జయారాతిధనంజయ | ధర్మే భవతి తే బుద్ధిర్ధేవేషు బ్రాహ్మణషు చ||2

కచ్చిదేతాం మహాయాత్రాంవీర ద్వాదశవార్షికీమ్‌ | ఆచరన్‌ ఖిద్యసే నైవమథ వా కుప్యసే న చ||3

మునీనామపి చేతాంసి తీర్థయాత్రాసు పాండవ| ఖిద్వంతి పరికుప్యంతి శ్రేయసాం విఘ్నమూలత:||4

కచ్చిన్నైతేన దోషేణ సమాశ్లిష్టోసి పాండవ | అత్ర చాంగిరసా గీతాం గాథామేతాం హి శుశ్రుమ||5

యస్య హస్తౌ చ పాదౌ చ మనశ్చైవ సుసంయుతమ్‌ | నిర్వికారా: క్రియా:సర్వా స తీర్థఫలమశ్నుతే ||6

తదిదం హృది ధార్యం తేకిం వా త్వం తాత మన్యసే| భ్రాతాయుధిష్ఠిరో యస్య సఖా యస్య స కేశవ:||7

పునరేతత్సముచితం యద్విపై#్ర: శిక్షణం నృణామ్‌ | వయం హి ధర్మగురవ: స్థాపితాస్తేన విష్ణునా||8

విష్ణునా చాత్ర శ్రుణుమో గీతాం గాథాం ద్విజాన్ర్పతి|| 9

రెండవ అధ్యాయము

సూతుడు చెప్పసాగెను అంతట అర్జునుడు బ్రాహ్మణులతో కూడివున్న దేవర్షి దేవపూజితుడగు నారదుని సమీపించి వారందరికీ నమస్కరించెను (1) అపుడు నారదుడిట్లనెను ధర్మమునందు నీకు బుద్దిగలదుబ్రాహ్మణులందునూ దేవతల యందునూ మతి గలదు.(2) వీరుడా! ఈ పన్నెండు సంవత్సరాల మహాయాత్రలో నీవు ఖేదమును గానీ, కోపమును గానీ పొందలేదా? (3) అర్జునా! తీర్థయాత్రల యందు మునులైననూ విఘ్నములవలన ,ఖేదమునొందెదరు, కోపించెదరు(4) నీవేదోషమును పొందితివా యేమి? ఈ విషయమున అంగీరసుడు చెప్పిన గాథను వింటిమి.(5) ఎవని చేతులు, కాళ్ళు,మనస్సు నిగ్రహమున నుండునో ,క్రియలలో వికారముండదో వికారముండదో అతను తీరముల ఫలమును పొందును .(6) ఇది నీ మనసున నుండవలెను.నాయనా! నీవేమనుకొందువు? నీకు సోదరుడు ధర్మరాజు , మిత్రుడు శ్రీ కృష్ణుడు(7) ఇది ఉచితమే విప్రులు పాలకులకు శిక్షణ గరిపెదరుకదా! మేము విష్ణువు స్థాపించిన ధర్మగురువులము, ద్విజుల పట్ల విష్ణువు పలికిన గాథనొక దానిని ఇట్లు వినుచున్నాము.(9)

యస్వామలామృతయశ: శ్రవణావగాహ: సద్య : పునాతి జగదాశ్వపచాద్వికుంఠ:|

సోహం భవద్భిరుపలబ్ద సుతీర్థ కీర్తిశ్చిద్యాం స్వబాహుమపి య: ప్రతికులవర్తీ||

10

ప్రియం చ పార్థ తే బ్రూమో యేషాం కుశలకాముక: | సర్వే కుశలినస్తేచ యాదవా: పాండవస్తథా ||11

అధునా భీమసేనేన కురూణాముపతాపక: శాసనాత్‌ ధృతరాష్ట్రస్య వీరవర్మా నృపోహత:12

సహి రాజ్ఞామజేయోభూద్యథాపూర్వం బలిర్బలీ | కంటకం కంటకేనేవ ధృతరాష్ట్రో జిగాయ తమ్‌ ||13

ఇత్యాదినారదప్రోక్తాం వాచమాకర్ఱ్య పాల్గున: అతీవ ముదిత: ప్రాహ తేషామకుశలం కుత:||14

యే బ్రాహ్మణమతే నిత్యం యే చ బ్రాహ్మణపూజకా :| అహం చ శక్త్యా నియతస్తీర్థాని విచరన్నను||15

ఆగతస్తీర్థమేతద్ది ప్రమోదోతీవ మే హృది| తీర్థనాం దర్శనం ధన్యమవగాహస్తతోధిక:||16

మాహాత్మ్యశ్రవణం తస్మాదౌర్వోపి మునిరబ్రవీత్‌ | తదహం శ్రోతుమిచ్చామి తీర్థస్యాస్య గుణాన్మునే ||17

ఏతేనైవ శ్రావ్యమేతద్యత్త్వయాంగీకృతం మునే త్వం హి| త్రిలోకీం విచరన్వేత్సి సర్వాం హి సారతామ్‌ 18

తదేతత్సర్వతీర్థేభ్యోధికం మన్యే త్వదాహృతమ్‌ || 19

ఎవరి నిర్మలము, నిత్యమును కీర్తిని వినుట చండాలునితో సహా జగత్తునంతా వెంటనే పవిత్రము చేయునో అతనే విష్ణువు అట్టి నేను మీచే నివ్వబడిన తీర్థకీర్తిని గలవాడను- నాకు ప్రతికూలమాచరించునట్లైన నా బాహువును కూడా ఛేదించెదను(10) అర్జునా! నీవు మా కుశలమును కోరెదవు అట్టి నీకు ప్రియమగు దానిని చెప్పెదము, యాదవులు, పాండవులు కుశలమే (11) ఇపుడు ధృతరాష్ట్రుని శాసనముచే కురుజనులకు తాపమును కలుగజేయు వీరవర్ముడను రాజును భీమసేనుడు వధించెను.(12)పూర్వము బలవంతుడగు బలి ఎట్లు జయింపవీలుగానివాడుగా నుండెనో, ఆ రాజు అట్లుండెను . ధృతరాష్ట్రుడు ముల్లును ముల్లుతో తీసినట్లు అతనిని జయించెను(13) అని నారదుడనగా విని అర్జునుడు మిగుల సంతసించి వారికి కుశలమెట్లుండదు, (14) నిత్యము బ్రాహ్మణులకిష్టులై వారిని పూజించువారు నేనేమో నియమముగా తీర్థములయందు పర్యటించుచూ (15) ఇక్కడకు వచ్చితిని. నాకు అమిత ఆనందముగా నున్నది. తీర్థములను చూచుట ధన్యము, దానికంటే స్నానమాడుట ఇంకనూ ధన్యము (16) మాహాత్మ్యశ్రవణము అంతకంటేనూ అధికమని ఔర్వుడను మని బలికెను. కనుక ఈ తీర్థముయొక్క గుణముల వినగోరుచుంటిని (17) నీవు ముల్లోకముల యందు తిరుగుచూ అన్నింటి సారమును తెలియుదువు గాన నీవు అంగీకరించినట్లే మాహ్మాత్మ్యమును వినిపించుము. నీవు గొనివచ్చినది అన్ని తీరములకంటేనూ అధికమనుకొందును.(18)

నారద ఉవాచ-

ఉచితం తవ పార్థైతద్యత్పృచ్చసి గుణిన్గుణాన్‌ | గుణినామేవ యజ్యంతే శ్రోతుం ధర్మోద్భవా గుణా:||19

సాధూనాం ధర్మశ్రవణౖ: కీర్తనైర్యాతి చాన్యహమ్‌||20

పాపానామసదాలా పై రాయుర్యాతి మథాన్వహమ్‌ | తదహం కీర్తయిష్యామి తీర్థస్యాస్య గుణాన్‌ బహున్‌ ||21

యథా శ్రుత్వా విజానాసి యుక్తమంగీకృతం మయా| పురాహం విచరన్పార్థ త్రిలోకీం కపిలానుగ:|22

గతవాన్‌ బ్రహ్మణో లోకం తత్రావశ్యం పితామహమ్‌ | స హి రాజర్షిదేవర్షి మూర్తా మూర్తై సుసంవృత:||23

విభాతి విమలో బ్రహ్మా నక్షత్రైరుడురాడివ| తమహం ప్రణిపత్యాథ చక్షుషా కృతస్వాగత:||24

ఉపవిష్ట: ప్రముదిత: కపిలేన సహైవ చ| ఏతస్మిన్నంతరే తత్ర వార్తికా: సముపాగతా:||25

ప్రహీయంతే హితే నిత్యం జగద్ధ్రష్టుం హి బ్రహ్మణా | కృతప్రణామానథ తాన్సమాసీనాన్‌ పితామహ:||26

చక్షుషామృతకల్పేన ప్లావయన్నివ చాబ్రవీత్‌ | కుత్ర కుత్ర విచీర్ణం వో దృష్టం శ్రుతమథాపి వా||27

కించిదేవాద్భుతం బ్రూత శ్రవణాద్యేన పుణ్యతా| ఏవముక్తే భగవాతా తేషాం య: ప్రవరో మత:||28

సుశ్రవా నామ బ్రహ్మాణం ప్రణిపత్యేదమూచివాన్‌ ||

అని అర్జునుడనగా నారదుడిట్లు చెప్పెను అర్జునా ! నీవు గుణవంతుడవు గాన గుణములను గూర్చి ప్రశ్నించుట యుక్తమే. ధర్మము వలన గుణములను గుణవంతులు వినుటయే యుక్తము కదా ! సాధువులకు ప్రతి దినమూ ధర్మమును వినుట, స్మరించుట చేతనే కాలము గడిచిపోవును (20) పాపులు చెడు మాట్లడుటచే ఎట్లు ప్రతిదినమూ గడిపెదరో సాధువులు ధర్మముచే నట్లుగడిపెదరు, ఈ తీర్థముయొక్క పెక్కు గుణములను కీర్తించెదనను (21) విని, విశేషముగా తెలిసికొనెదవననుట యుక్తమని నేనంగీకరించెదను. పూర్వము నేను కపిలుననుసరించుచూ ముల్లోకములలో పర్యటించుచూ బ్రహ్మ లోకమును చేరి అక్కడ పితామహుని చూచితిని అతను రాజర్షి దేవర్షి,మూర్త, అమూర్త, శక్తులతో కూడియుండెను.(23) నక్షత్రములతో చంద్రునివలె,విమలుడగు బ్రహ్మ వారితో విశేషముగా ప్రకాశించుచుండగా నేనతనికి నమస్కరించితిని. చూపుతోనే స్వాగతమును బ్రహ్మ నాకు పలుకగా సంతోషముతో కపిలునితో కలిసి కూర్చుంటిని ఇంతలో అక్కడకు వార్తికుల వచ్చిరి. (24,25) ప్రతిదినము జగత్తును చూచివచ్చుటకు బ్రహ్మ వారిని పంపును వారు వచ్చి నమస్కరించి కూర్చొనగా బ్రహ్మ(26) అమృతము వంటి తన చూపుతో ముంచెత్తూ ఇట్లనెను మీరెక్కడెక్కడ చరించి, ఏమేమి చూసితిరి? వింటిరి? (27) దేనిని వినుటచే పుణ్యము కలుగునో అట్టి అద్భుతమును గూర్చి తెలియుజేయుడు అని బ్రహ్మయనగా ఆ వార్తికులలో శ్రేష్టుడగు సుశ్రవుడు వాడు బ్రహ్మను నమస్కరించి ఇట్లనెను.(28)

ప్రభోరగ్నేచ విజ్ఞప్తిర్యథా దీపో రవేస్తథా||29

తథాపి ఖలు వాచ్యం మే పరార్థం ప్రేరితేన వై | ముని: కాత్యాయనో నామ శ్రుత్వా ధర్మాన్పునర్భహున్‌||30

సారజిజ్ఞాసయా తస్థావేకాంగుష్ఠశతం సమా! తత: ప్రోవాచ తం దివ్వా వాణీ కాత్యాయన శ్రుణ||31

పుణ్య సరస్వతీ తీరే పృచ్చ సారస్వతం మునిమ్‌ | స తే సారం ధర్మసాధ్యం దర్మజ్ఞోభివదిష్యతి ||32

ఇతి శ్రుత్వా మునివరో మునిశ్రేష్ఠముపేత్య తమ్‌| ప్రణమ్య శిరసా భౌమౌ పప్రచ్చేదం హృద్ధి స్థితమ్‌ ||33

సత్యం కేచిత్‌ ప్రశంసంతి తప: శౌచం తథాపరే | సాంఖ్యం కేచిత్‌ ప్రశంసంతి యోగమన్యే ప్రచక్షతే||34

క్షమాం కేచిత్‌ ప్రశంసంతి తథైవ భృశమార్జవమ్‌ | కేచిన్మౌనం ప్రశంసంతి కేచిదాహు : పరం శ్రుతమ్‌ ||35

సమ్యగ్జానం ప్రశంసంతి కేచిద్వైరాగ్యముత్తమమ్‌ | అగ్నిష్టోమాదికర్మాణి తథా కేచిత్పరం విదు:||36

ఆత్మజ్ఞానం పరం కేచిత్సమలోష్టాశ్మకాంచనమ్‌ | ఇత్థం వ్యవసితే లోకే కృత్యాకృత్యవిధా3జనా:||37

వ్యామోహమివ గచ్చంతి కిం శ్రేయ ఇతి వాదిన:| యదేతేషు పరం కృత్యమను ష్ఠేయం మహాత్మభి:||38

వక్తుమర్హసి ధర్మజ్ఞ మమ సర్వార్థసాథకమ్‌||39

ప్రభువు ఎదుట విన్నవించుటయున్న సూర్యునికి దీపము పెట్టువంటిదే(29) అయిననూ ,ఇతరులకై పంపబడిన నేను విన్నవించవలసినదే కాత్యాయనుడను ముని అనేక ధర్మములను వినియుండెను.(30) వాని సారమును తెలియగోరి ఏకాంగుష్ఠుడై(ఒంటి వేలి పై నిలిచి) నూరు సంవత్సరములుండగా దివ్యమగు వాక్కు అతనితో నిట్లు పలికెను కాత్యాయనా! వినుము.(31)పుణ్యమగు సారస్వతీనదీతీరమున సారస్వతముని యనువానినడుగుము.ధర్మము తెలిసిన అతడు ధర్మముచే సాధించు దానినంతా నీకు తప్పక తెలియజేయును(32) అనగా విని కాత్యాయనుడు సారస్వతమునిని చేరెను. నమస్కరించి తన మనసులో నున్న దానినిట్లు చెప్పెను (33) ధర్మజ్ఞుడా! కొందరు సత్యమును, కొందరు తపస్సు , కొందరు శౌచమును, మరికొందరు సాంఖ్యమును, ఇతరులు యోగమునుప్రశంసించుదురు.(34) కొందరు ఓర్పును, కొందరు ఋజుతను, కొందరు మౌనమును ప్రశంసించెదరు., కొందరు యథార్థజ్ఞానమును పొగడగా, మరి కొందరు వైరాగ్యముత్తమమని పొగిడెదరు. కొందరు అగ్నిష్టోమము మొదలగు కర్మలను పరమన, ఆత్మజ్ఞానమే పరమని కొందరందురు. ఇట్లు లోకము వుండగా విధి, నిషేదముల విధానమున ఏది మేలని వ్యామోహమునొందుచుండిరి. వీనన్నింటిలో మహాత్ములు దేనిని పాటించవలెను? అన్ని ప్రయోజనముల సాధించు దానినితెలియజేయుము,(37,38,39)

సారస్వత ఉవాచ-

యన్మాం సరస్వతీ ప్రాహ సారం వక్ష్యామి తచ్చృణు! ఛాయాకారం జగత్సర్వముత్పత్తిక్షయధర్మి చ||వారంగనానేత్రభంగస్తద్వద్భంగురమేవ తత్‌||40

ధనాయుర్యౌవనం భోగాన్జలచంద్రవదస్ధిరాన్‌ | ఋద్ద్యా సమ్యక్పరామృశ్య స్థాణుదానం సమాశ్రయేత్‌ ||41

దానవాన్‌ పురుష: పాపం నాలం కర్తుమితి శ్రుతి:| స్థాణుభక్తో జన్మమృత్యూ నాప్నోతీతి శ్రుతిస్తథా||42

సావర్ణినా చ గాధే ద్వే కీర్తితే శ్రుణు యే పురా | వృషో హి భగవాన్థర్మో వృషభో యస్య వాహనమ్‌||43

పూజ్యతే స మహాదేవ: స ధర్మ: పర ఉచ్చతే| దు:ఖావర్తే తమోఘేరే ధర్మాధర్మజలే తథా||44

క్రోధపంకే మదగ్రాహే లోభబుద్బుదసంకటే | మానగంభీరపాతాళే సత్త్వయానవిభూషితే||45

మజ్జంతం తారయత్యేకో హర: సంసారసాగరాత్‌ | దానం వృత్తం వ్రతం వాచ: కీర్తిధర్మౌ తథాయుప:46

పరోపకరణం కాయాదసారాత్‌ సారముద్దరేత్‌ | ధర్మే రాగ: శ్రుతౌ చింతా దానే వ్యసనముత్తమమ్‌|| 47

ఇంద్రియార్థేషు వైరాగ్యం సంప్రాప్తం జన్మన: ఫలమ్‌ |దేశేస్మిన్భారతే జన్మ ప్రాప్య మానుష్యమధృవమ్‌ | న కుర్యాదాత్మన: శ్రేయస్తేనాత్మా వంచితశ్చిరమ్‌||49

తత్సంప్రాప్య తథా కుర్యాన్న గచ్చేన్నరకం యథా| సర్వస్య మూలం మానుష్యం తథా సర్వార్థ సాధకమ్‌ ||50

సారస్వతుడిట్లు చెప్పెను. నాకు సరస్వతి చెప్పిన దాని సారమును చెప్పెద వినుము. ఈ జగత్తంతా నీడవలె ఉత్పత్తి నాశనములే ధర్మముగా గలది. వేశ్యాస్త్రీల నేత్ర భంగమువలె (కనువిరుపుల) క్షణభంగురమైనది.(40) ధనము, ఆయువు, ¸°వనం, భోగములు నీటియందు చంద్రునివలె అస్థిరమైనవని బుద్దితో చక్కగా విచారించి స్థాణుదానమునాశ్రయించవలెను.(41) దానము చేయువాడు పాపము నొందడనీ, స్థాణుభక్తుడు జన్మను మృత్యువునూ పొందడనీ శ్రుతి.(42) సావర్ణి మునుపు చెప్పిన రెండు కథలను వినుము. వృషుడనగా భగవాన్‌ ధర్ముడు వృషభమతని వాహనము (43) పూజింపబడు ఆ మహదేవుడు ధర్మము , దు:ఖమను సుడిగుండముతో , తమస్సుతో భీకరమై, ధర్మాదర్మములే జలముగా , క్రోధమే బురదగా ,మదనే మొసలిగా,లోభ##మే బుడగలుగా . అభిమానమే పాతాళముగా , జలచరములతో నున్న సంసారము మునిగిన వానిని తరింపజేయువాడు హరుడొకడే, దానము, వృత్తము, వ్రతము వాక్కుచే, ఆయుస్సుకీర్తి, ధర్మములు పరోపకారము ఇవి సారములేని శరీరమునుండిసారము తెచ్చునవి. (46) ధర్మమునందాసక్తి,వేదార్థచింతన, దానముచేయు వ్యసనము, ఇంద్రియముల విషయముల యందు వైరాగ్యము వీనిచే జన్మనఫలమగును. ఈ భారతదేశమున అధృవమగు మనుష్యజన్మను పొంది ఆత్మశ్రేయస్సుకై పాటుపడనివానిచే ఆత్మయే వంచింపబడినట్లు అగును. (48)దేవాసురులందరిలో మనుష్యజన్మ దుర్లభము (49) అది పొంది,నరకము పొందని విధమున ఆచరించవలెను. అన్నింటికీ మూలము అన్నింటినీ సాధించునది మనుష్యజన్మ.(50)

యది లాభే న యత్నస్తే మూలం రక్ష ప్రయత్నత: మహతా పుణ్యమూల్వేన క్రీయతే కాయనౌస్త్వయా||51

గంతుం దు:ఖోదధే: పారం తర యావన్న భిద్యతే| అవికారిశరీరత్వం దుష్ర్పాప్యం ప్రాప్య వై తత:||52

నాపక్రామతి సంసారాదాత్మహా స నరాధమ: తపస్తప్యన్తి యతయో జహ్వతే చాత్ర యజ్విన:||దానాని చాత్ర దీయంతే పరలోకార్థయాదరాత్‌ ||53

కాత్యాయన ఉవాచ-

దానస్య తపసో వాపి భగవన్కిం చ దుష్కరమ్‌ | కిం వా మహత్పలం ప్రేత్య సారస్వత బ్రవీహి తత్‌ ||54

సారస్వత ఉవాచ-

న దానాద్దుష్కరతరం పృథివ్యామస్తి కించన | మునే ప్రత్యక్షమేవైతత్‌ దృశ్యతే లోకసాక్షికమ్‌ ||55

పరిత్యజ్య ప్రియాన్‌ ప్రాణాన్‌ ధనార్థే హి మహాభయమ్‌ | ప్రవిశంతి మహాలోభాత్‌ సము మ్రటవీం వనమ్‌ ||56

సేవామన్యే ప్రపద్యంతే శ్వవృత్తిరితి యా స్మృతా | హింసాప్రాయాం బహుక్లేశాం కృషిం చైవ తథా పరే||57

తస్య దు:ఖార్జితస్యేహ ప్రాణభ్యోపి గరీయస:| ఆయాసశతలబ్దస్య పరిత్యాగ:

సుదుష్కర:||58

యద్దదాతి యదశ్నాతి తదేవ ధనినో ధనమ్‌ | అన్యే మృతస్య క్రీడంతి దారైరపి ధనైరపి||59

లాభముకై నీవు యత్నించకున్నట్లైన మూలమునైనా యత్నముతో రక్షించుము. గొప్ప పుణ్యమూల్యముతో ఈ దేహమను నౌకను నీవు కొంటివి. (51) అది పగిలిపోకముందే దు:ఖసముద్రము యొక్క తీరమును చేరుటకు యత్నించుము. పొందవీలుగాని ఈ అవికారి శరీరమును పొంది సంసారమునుండి తొలగనివాడు ఆత్మద్రోహి ,నరాధముడు,(52) ఈ పరలోకముకొరకే ఆదరముతో యతులు తపమాచరింతురు, యాజ్ఞికులు యజ్ఞముల చేయుదురు, దానులు దానములనిత్తురు(53) అనగా కాత్యాయనుడిట్లనెను సారస్వతా!: భగవాన్‌ ! దానము, తపస్సు వీనిలో ఏది ఆచరించుటకు కష్టము? మరణించిన వెనుక గొప్ప ఫలమిచ్చునది ఏది? తెలియజేయుము (54) అని అడుగగా సారస్వతుడిట్లు చెప్పెను భూమి పై దానముకంటే దుష్కరమేది లేదు. ఓ మునీ! లోకమే సాక్షిగా ప్రత్యక్షముగా కనిపించుచున్నది ఇది.(55) ప్రియమైన ప్రాణములను వదిలి, ధనముకొరకు భయంకరమైన సముద్రమును, అడవిని, వనమును లోభముతో ప్రవేశించెదరు.(56) అట్లే శునకవృత్తి యనబడు సేవను కొందరాశ్రయింతురు. మరికొందరు హింస అధికముగా ఉండి, క్లేశములనేకముగా నున్న కృషిని ఆశ్రయింతురు. (56,57) అట్లు అనేక దు:ఖములను సహించి పొందిన ప్రాణముల కంటే అధికమైన దనమును, అనేక ఆయాసములతో పొందినదానిని వదిలివేయుట చేయలేనిది.(58)

దేనిని దానమిచ్చునో, తాననుభవించునో అదే ధనవంతుని ధనము, ఇతరులు, మరణించినవారి భార్యలతో, ధనముతో క్రీడింతురు. (59)

అహన్యహని యాచంతమహం మన్యే గురుం యథా | మార్జనం దర్పణస్యేవ య: కరోతి దినే దినే ||60

దీయమానం హి నాపైతి భూయ ఏవాభివర్ధతే | కూప ఉత్సిచ్యమానో హి భ##వేచ్చుద్దో బహుదక:||61

ఏకజన్మ సుఖస్యార్థే సహప్రాణి విలాపయేత్‌ | ప్రాజ్ఞో జన్మసహస్రేషు సంచినోత్యేకజన్మని ||62

మూర్ఖో హి న దదాత్యర్థానిహ దారిద్య్ర శంకయా| ప్రాజ్ఞస్తు విసృజత్యర్థానముత్ర తస్య శంకయా ||63

కిం ధనేన కరిష్యంతి దేహినో భంగురాశ్రయా: | యదర్థం ధనమిచ్చంతి తచ్చరీరమశాశ్వతమ్‌ ||64

అక్షరద్వయమభ్యస్తం నాస్తి నాస్తీతి యత్పురా| తదిదం దేహి దేహితి విపరీతముపస్థితమ్‌ ||65

బోధయంతి చ యావంతో దేహితి కృపణం జనా: అవస్థేయమదానస్య మా భూదేవం భవానపి||66

దాతురేవోపకారాయ వదత్యర్థీతి దేహి మే | యస్మాద్దాతా ప్రయాత్యూర్ధ్వ మథస్తిష్ఠేత్‌ ప్రతిగ్రహీ ||67

దరిద్రా వ్యాధితా మూర్థా: పరప్రేష్యకరా: సదా అదత్తదానాజ్జాయంతే దు:ఖసై#్యవ హి భాజనా:||68

ధనవంతమదాతారం దరిద్రం వాతపస్వినమ్‌ | ఉభావంభసి మోక్తవ్యౌ కంఠే బద్ద్వా మహాశిలామ్‌ ||69

ప్రతిదినమూ నన్ను యాచించువానిని నేను గురువుగా తలచెదను. అతను ప్రతి దినమూ అద్దమును తుడిచినట్లు మలినమును తుడివేయును (60) దానమివ్వబడిన ఎన్నడూ తరగదు పైగా మరల వృద్ది నొందును. నీరు తోడిన బావి నీరు శుద్దముగా, అధికముగానే వుండును కదా! (61) ఒక జన్మయందు సుఖము కొరకు అనేక జన్మలను వ్యర్థము జేయరాదు. ప్రాజ్ఞుడు వేయి జన్మలతో పొందినదానినొక జన్మయందే కూర్చుకొనుము (62) దరిద్రుడనవుదునేమోనని మూర్ఖుడు దానమివ్వడు. అదే శంకచే విజ్ఞుడు దానమిచ్చును (63) చపలమగు ధనమును గల జీవులు దానితో ఏమి చేయుదురు; ఏ శరీరము కొరకు ధనాన్ని కోరెదరో ఆ శరీరమే ఆశాశ్వతముకదా! (64) పూర్వము లేదు, లేదు అని రెండక్షరాలనభ్యసించినందునే (దానమివ్వనందునే) ఇప్పుడు విపరీతముగా ఇవ్వు, ఇవ్వు, అనుచూ బోధించెదరు. దానిచే దానమివ్వక నీవు నూ ఇట్లేకారాదన్న బోధను తెలియవలెను (66)దాతకు ఉపకారము చేయుటకు ఇవ్వు అని యాచకుడనును. దానిచే దాత పై లోకమునకు వెళ్ళగా యాచకుడు క్రిందనే నుండును.(67) దు:ఖమునకు నెలవైన దరిద్రులు వ్యాధితులు, మూర్ఖులు, సేవకులు ఎల్లప్పుడూ దానమివ్వనందునే అట్లు దు:ఖమునకు నెలవైరి. (68) దానమివ్వని ధనికుని ,తలస్సాచరించని దరిద్రుని మెడలో పెద్దబండను కట్టి నీటిలో పడవేయవలెను.(69)

శ##తేషు జాయతే శూర: సహస్రేషు చ పండిత:| వక్తా శతసహస్రేషు దాతా జాయేత వా నవా ||70

గోభిర్విపై#్రశ్చ వేదైశ్చ సతీభి: సత్యవాదిభి: అలుబ్దైర్దానశీలైశ్చ సప్తభిర్ధార్యతే మహీ ||71

శిబిరౌశీనరోగాని సుతం చ ప్రియమౌరసమ్‌ | బ్రాహ్మణార్థముపాకృత్య నాకపృష్ఠమితో గత:||72

ప్రతర్ధన : కాశిపతి : ప్రదాయ నయనే స్వకే : బ్రాహ్మణాయాతులాం కీర్తిమిహ చాముత్ర చాశ్నుతే||73

నిమీ రాష్ట్రం చ వైదేహో జామదగ్న్యో వసుంధరామ్‌ | బ్రాహ్మణభ్యో దదౌ చాపి గయశ్చోర్వీం సపత్తనామ్‌ ||74

అవర్షతి చ పర్జన్యే సర్వభూతనివాసకృత్‌ వసిష్టో జీవయామాస ప్రజాపతిరివ ప్రజా:||75

బ్రహ్మదత్తశ్చ పాంచాల్యో రాజా బుద్దిమతాం వర:| నిధిం శంఖం ద్విజాగ్ర్యేభ్యో దత్త్వా స్వర్గమవాప్తవాన్‌ ||76

సహస్రజిచ్చ రాజర్షి: ప్రాణానిష్టాన్‌ మహాయశా: | బ్రాహ్మణార్ధే పరిత్యజ్య గతో లోకాననుత్తమాన్‌ ||77

ఏతే చాన్యే చ బహువ: స్థాణోర్దానేన భక్తిత: | రుద్రలోకం గతా నిత్యం శాంతాత్మానో జితేంద్రియా :||78

ఏషాం ప్రతిష్ఠితా కీర్తిర్యావత్‌ స్థాస్యతి మేదినీ | ఇతి సంచింత్య సారార్థీ స్థాణుదానపరో భవ||79

నూటికొక శూరుడు , వేయిమందిలో నొక పండితుడు , వందవేలలోనొక వక్త జన్మించును. అసలు దాత పుట్టునా లేదా? (70) ఈ పృథివిని ధరించువాడు ఏడుగురు వారు గోవులు , విప్రులు, వేదములు, పతివ్రతలు, సత్యవాదులు, లోభములేనివారు, దానశీలురు,(71) ఔశీనరుడైన శిభి తన అవయవములనను ప్రియమైన స్వంత పుత్రుని బ్రాహ్మణుని కొరకు త్యాగం చేసి ఇక్కడనుండి స్వర్గమునకే గెను (72) కాశీరాజు ప్రతర్ధనుడు బ్రాహ్మణునికి తన రెండు కళ్ళనూ దానమిచ్చి సాటిలేని కీర్తిని ఇహపరలోకముల యందనుభవించుచున్నాడు (73) విదేహరాజగు నిమి, రాష్ట్రమును, పరశురాముడు భూమిని, గయుడు పట్టణాలతో పురమును బ్రాహ్మణులకు దానమిచ్చిరి.(74)వర్షము కురియునపుడు వసిష్టుడు ప్రజాపతి ప్రజలను సృజించునట్లు అన్ని ప్రాణులకు నివాసమునేర్పరిచి ప్రాణదానము చేసెను.(75 ) బుద్దిమంతుడు పాంచాలరాజుగు బ్రహ్మదత్తుడు అమితనిధిని బ్రాహ్మణులకు దానమిచ్చి స్వర్గమును పొందెను .(76) రాజర్షియగు సహస్రజిత్‌ తనకిష్టమగు ప్రాణములనే బ్రాహ్మణులకై విడిచి ఉత్తమలోకములను పొందెను (77) ఇట్లే ఇతరులనేకులు భక్తితో స్థాణుదానము చేయుటచే ప్రశాంతచిత్తలు .జితేంద్రియులై రుద్రలోకమున నిత్యము వున్నారు (78) భూమి వున్నంతకాలమూ వారి కీర్తి స్థిరముగా నుండునని తలచి సారముకోరినవాడవై స్థాణుదానమును చేయుము.(79)

సోపి మోహం పరిత్యజ్య తథా కాత్యాయనోభవత్‌||80

నారద ఉవాచ-

ఏవం సుశ్రవసా ప్రోక్తాం కథామాకర్ణ్య పద్మభూ: | హర్షాశ్రసంయుతో తీవ ప్రశశంస ముహుర్ముహ:81

సాధు తే వ్యాహృతం వత్స ఏవమేతన్న చాన్యథా | సత్యం సారస్వత: ప్రాహ సత్యా చైవం తథా శ్రుతి:||82

దానం యజ్ఞానాం వరూధం దక్షిణా లోకే దాతారం | సర్వభూతాన్యుపజీవంతి దానేనారాతీనపానుదంత దానేన ద్విషంతో

మిత్రా భవంతి దానే సర్వం ప్రతిష్టితం తస్మాద్దానం పరమం వదంతీతి||83

సంసారసాగరే ఘోరే ధర్మాధర్మోర్మిసంకులే దానం తత్ర నిషేవేత తచ్చ నౌరివ నిర్మితమ్‌ ||84

ఇతి సంచింత్య చ మయా పుష్కరే స్థాపితా ద్విజా: | గంగాయమునయోర్మధ్యే మధ్యదేశే ద్విజా : కృతే ||85

స్థాపితా : శ్రీ హరిభ్యాం తు శ్రీ గౌర్యా వేదవిత్తమా :| రుద్రేణ నాగరాశ్చైవ పార్వత్యా శక్తిపూర్భవా:||86

శ్రీమాలే చ తథా లక్ష్యా హ్యేవమాదిసురోత్తమై: | నానాగ్రహారా: సందత్తా లోకోద్దరణకాంక్షయా||87

న హి దానఫలే కాంక్షా కాచిన్నోస్తి సురోత్తమా :| సాధుసంరక్షణార్థం హి దానం న: పరికీర్తితమ్‌|| 88

అపుడు కాత్యాయనుడు కూడా మోహమును విడచిన వాడాయెను.(80) నారదుడుచెప్పసాగెను. ఇట్లు సుశ్రవసుడు చెప్పిన కథను విని పద్మభవుడు ఆనంద భాష్పములతో మరల మరల మిగుల ప్రశంసించెను (81) వత్సా! నీవు బాగుగా చెప్పితివి.ఇది నిజము తప్ప వేరే కాదు. సారస్వతుడన్నది అట్లే శ్రుతి సత్యమే. (82) దానమే యజ్ఞముల కవచము అన్ని ప్రాణులూ లోకమున దాతనే ఆశ్రయించును. దానముయచే శత్రువులను తొలగించి వేయును. ద్వేషించు వారుకూడా దానముచేత మిత్రులగుదురు. అని శ్రుతి (83) ధర్మాధర్మములు అను అలలుగల ఈ ఘోర సంసార సాగరమున నౌకవలె నిర్మించబడిన దానమును సేవించవలెను (84) ఇది బాగుగా ఆలోచించి నేను పుష్కరమున బ్రాహ్మణులను స్ధాపించితిని అట్లే గంగాయమునల మధ్య మధ్యదేశమున లక్ష్మీనారాయణులుబ్రాహ్మణులు స్థాపించిరి. రుద్రుడు నాగరులను , పార్వతి శక్తిపూర్భవులను, లక్ష్మీ శ్రీమాలయందు బ్రాహ్మణోత్తములను నిలిపిరి. ఇట్లు వీరు అనేక అగ్రహారములను లోకమునుద్దరించు కోరికతో పొందిరి (87) దేవోత్తములారా! మాకు దానఫలమునందు కాంక్షలేదు. సాధువుల సంరక్షించుట కొరకు మాకు దానమిచ్చుటకు యని చెప్పబడినది. (88)

బ్రాహ్మణాశ్చ కృతస్థానా నానాధర్మోపదేశ##నై: | సముద్దరంతి వర్ణాంస్త్రీంస్తత: పూజ్యతమా ద్విజా:||89

దానం చతుర్విధం దానముత్సర్గ: కల్పితం తథా | సంశ్రుతం చేతి వివిధం తత్ర్కమాత్పరికీర్తితమ్‌ ||90

వాపీకూపతడాగానాం వృక్షవిద్యాసురౌకసామ్‌ | మఠప్రపాగృహక్షేత్ర దానముత్సర్గ ఇత్యసౌ||91

ఉపజీవన్నిమాన్యశ్చ పుణ్యం కోపి చరేన్నర: | షష్ఠమంశం స లభ##తే యావద్యో విసృజేద్ద్విజ:||92

తదేషామేవ సర్వేషాం విప్రసంస్థాపనం పరమ్‌ | దేవసంస్థాపనం చైవ ధర్మస్తన్మూల ఏవ యత్‌ ||93

దేవతాయతనం యావద్యావచ్చ బ్రాహ్మణగృహమ్‌ | తావద్దాతు: పూర్వజానాం పుణ్యాంశశ్చోపతిష్ఠతి||94

ఏతత్‌ స్వల్పం హి వాణిజ్యం పునర్భహుఫలప్రదమ్‌ | జీర్ణోద్దారే చ ద్విగుణమేతదేవ ప్రకీర్తితమ్‌ ||95

తస్మాదిదం త్వహమపి బ్రవీమి సురసత్తమా: నాస్తి దానసమం కించిత్సత్యం సారస్వతో జగౌ ||96

తగు స్థానములనిచ్చిన, బ్రాహ్మణులు వివిధ ధర్మములునుపదేశించుట చేత మూడు వర్ణములను ఉద్దరింతురు కనుక వారు పూజ్యతములు(89) దానము నాలుగు విధములు, అవి దానము, ఉత్పర్గము , కల్పితము, సంశ్రుతము అని, క్రమముగా నది యిట్లు చెప్పబడినది(90) బావులను,నూతులను, చెరువులను,మఠములను, నీటి చెలములను ఇళ్ళను, భూములను బ్రాహ్మణులకు దానమిచ్చుట ఉత్సర్గమునబడును.(91)వీని నాశ్రయించి పుణ్యము నాచరించువాడు,ద్విజుడు విడుచు దానిషష్ఠమాంశమును (అరవవంతును) పొందును. వీటన్నింటిలో విప్రులకు నెలవు కల్పించుట దేవతలకు సెలవు కల్పించుట అనునవి ఉత్తమమైనవి. ధర్మమునకు మూలమివి(93) ఎంతకాలము దేవతా నివాసము, బ్రాహ్మణ నివాసము వుండునో అంతకాలము, దానమిచ్చిన వాని పూర్వికులకు పుణ్యముయొక్క అంశ##చేరును.(94) ఇది స్వలమైనదే నైననూ అమితమైన ఫలము నిచ్చునది. జీర్ణమగు దానిని ఉద్దరించినచో దీనికి రెండింతల ఫలమని చెప్పబడినది. (95) కనుక, దేవతాశ్రేష్టులారా! నేను కూడా చెప్పుచుంటిని సారస్వతుడు పలికినది సత్యము దానముతో సాటివచ్చునది లేదు (96)

నారద ఉవాచ-

ఇతి సారస్వతప్రోక్తాం తథా పద్మభువేరితామ్‌ | సాధు సాధ్విత్యమోదంత సురాశ్చాహం సువిస్మితా:||97

తత: సభావిసర్గాంతే సురమ్యే మేరుమూర్థని | ఉపవిశ్య శిలాపృష్ఠే అహమేతదచింతయమ్‌ ||98

సత్యమాహ విరంచిస్తు స కామర్థం తు జీవతి | యేనైకమపి తద్వృత్తం నైవ యేన కృతార్థతా||99

తదహం దానపుణ్యం హి కరిష్యామి కథం స్ఫుటమ్‌ | కౌపీనదండాత్మధనో ధనం స్వల్పం హి నాస్తి మే||100

అనర్హతే యద్దదాతి న దదాతి తథార్హతే | దేశే కాలే చ పాత్రే చ శుద్దేన మనసా తథా| న్యాయార్జితం చ యో దద్యాద్యౌవనే స తదశ్నుతే || 102

తమోవృతస్తు యో దద్యాద్భయాత్ర్కోధాత్తథైవ చ | భుంక్తే దానఫలం తద్ది గర్భస్థో నాత్ర సంశయ:||103

బాలత్వేzపి చ సోశ్నాతి యద్దత్తం దంభకారణాత్‌ | దత్తమన్యాయతో విత్తం తథా వై చార్థకారణమ్‌ ||104

వృద్దత్త్వే హి సమశ్నాతి నరో వై నాత్ర సంశయ: తస్మాద్దేశే చ కాలే చ సుపాత్రే విధినా నర:|| శుభార్జితం ప్రయుంజీత శ్రద్దయా శాఠ్వవర్జిత:||105

నారదుడు చెప్పెను ఇట్లు సారస్వతుడు,పద్మభవుడు చెప్పిన దానిని విని దేవతలు నేను విస్మయముతో బాగుబాగు అని ఆమోదించితిమి (97) అపుడు సభ ముగిసిన తరువాత అందమైన మేరు శిఖరము పై ఒక బండ పై కూర్చుని నేనిట్లు ఆలోచించితిని (98) బ్రహ్మ సత్యమును పలికెను వానిలో నొకటైననూ పాటించని వాడెందులకు జీవించుట? దానిచే కృతార్థతయేమి? (99) కనుక నేను దానపుణ్యము చేయవలెనన్న ఎట్లు? దండమే నాధనముగా గలవాడిని కొద్దిగానైనా ధనము నా వద్ద లేదు.(100) అనర్హుడికి దానమిచ్చువాడు మూఢుడు. ఈ అర్హ అనర్ష పరిజ్ఞానము చేత దానధర్మము కష్టమైనది(101) సరైన ప్రదేశమును, సమయమును, వ్యక్తిని తెలిసి స్వచ్చమైన మనస్సుతో న్యాయముగా సంపాదించిన ధనమును దానమిచ్చినవాడు దానిని ¸°వనమున పొందును.(102) తమోగుణముతో కూడి, భయముతో గానీ, కోపముతోగానీ దానమిచ్చువాడు గర్భముననే ఆ దానఫలముననుభవించును. సంశయములేదు.(103) దంభముచే నిచ్చిన, బాల్యముననే ఫలమునొందును అన్యాయముగా ధనమునిచ్చినచో లేదా ధనము కై ఇచ్చినచో వార్థక్యమున తప్పక దానిననుభవించును. కనుక, దేశకాల పాత్రలను తెలిసికొని సరైన వ్యక్తిగా విదిగా తాను న్యాయముగా సంపాదించిన దానిని శ్రద్దతో, లోభించక దానమివ్వవలెను.(105)

తదేతన్నిర్ధనత్త్వాచ్చ కథం నామ భవిష్యతి | సత్యమాహు: పురా వాక్యం పురాణమునయోzమలా :||106

నాధనస్యాస్త్యయం లోకో న పరశ్చ కథంచన| అభిశస్తం ప్రశ్యంతి దరిద్రం పార్శ్వత: స్థితమ్‌ ||107

దారిద్ర్యం పాతకం లోకే కస్తచ్చంసితుమర్హతి| పతిత: శోచ్యతే సర్వైర్నినశ్చాపి శోచ్యతే ||108

య: కృశాశ్వ: కృశధన: కృశభృత్య: కృశాతిథి: స వై ప్రోక్త: కృశో నామ న శరీరకృశ:||109

ఆర్థవాన్‌ దుష్కులీనోzపి లోకే పూజ్యతమో నర:| శశినస్తుల్యవంశో నిర్దన పరిభూయతే ||110

జ్ఞానవృద్దాస్తపోవృద్దా యే చ వృద్దా బహుశ్రుతా : తేసర్వే ధనవృద్దస్య ద్వారి తిష్ఠన్తి కింకరా:||111

యద్యప్యయం త్రిభువనే అర్థోస్మాకం పరాజ్నిహి| తథావ్యన్యప్రార్థితో హి తసై#్యవ ఫలదో భ##వేత్‌ ||112

అథ వూతత్పురా సర్వం చింతయిష్యామి సుస్ఫుటమ్‌ విలోకయామి పూర్వం తు కంచిద్యోగ్యం హి స్థానకమ్‌ ||113

ఇదంతా నిర్థనునికెట్లు కుదురును? కనుకనే స్వచ్చమగు పురాణమునులు పూర్వము సత్యముగా నిట్లనిరి (106) ఈ లోకము, పరలోకము రెండూ ధనము లేని వానికి లేనట్లే చెంత నిలిచిన దరిద్రుని అందరూ వెలివేయబడిన వానినిగా చూచెదరు (107) దరిద్రము లోకమున పాతకము దానినెవరు చెప్పగలరు ? క్రిందపడిన వానిని చూచి బాధపడినట్లు దరిద్రుని చూచి బాధపడెదరు (108) ఎవడికి అశ్వములు, ధనము, భృత్యులు, అతిథులు, తక్కువో అతనే కృశించినవాడనబడును గానీ శరీరము కృశించినవాడు కాదు,(109) చెడుకులములో పుట్టిననూ, డబ్బు కలవాడు లోకములో పూజించబడును అదే ధనము లేని వాడు చంద్రుని వంటి స్వచ్చమైన వంశములో పుట్టిననూ అవమానమును పొందును (110) జ్ఞానముచేత తపస్సు, చేత,పాండిత్యము చేత వృద్దులైన వారందరూ ధనమధికముగా నున్న వాని ఇంటి గుమ్మము వద్ద సేవకులై నిలుచుందురు.(111)ముల్లోకములలో ధనము మనకు వ్యతిరేకము కాకున్ననూ ఎవరు ప్రార్ధించిన వారికి ఫలము నిచ్చును (112) లేదా నేను పూర్వమంతా మరల ఆలోచించెదను. మంచి యోగ్యమగు స్థానమును చూచెదను.(113)

స చింతయిత్వేతి బహుప్రకారం | దేశాంశ్చ గ్రామన్నగరాణి చాశ్రమాన్‌

బవరానహం పర్యటన్నాప్తవాన్‌ హి| స్థానం హితం స్థాపయే యత్ర విప్రాన్‌ ||114

ఇతి శ్రీ స్కాంద మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కౌమారికాఖండే నారదార్జునసంవాదే దానప్రశంసావర్ణనం నామ ద్వీతీయోద్యాయ:

అని నారదుడనేక విధములుగా ఆలోచించుకొని పలు దేశములను నగరములను, ఆశ్రమములను పర్యటించి హితమైన స్థానమును చేరి అక్కడ విప్రుల స్థాపించెదననుకొనెను (114)

ఇది శ్రీ స్కాందమహుపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందు కౌమారికాఖండమున నారద .అర్జున సంభాషణమున దానము యొక్క ప్రశంసను వర్ణించుట యను రెండవ అధ్యాయము.

తృతీయోzధ్యాయ:

సూత ఉవాచ-

ఏవం స్థానాని పుణ్యాని యాని యానీహ వై భువి | నిరీక్షంస్తత్ర తత్రాహం నారదో వీరసత్తమ||1

విచరన్మేదినీం సర్వాం ప్రాప్తోహమాశ్రమం భృగో : యత్ర రేవానదీ పుణ్యా సప్తకల్పస్మరా వరా||2

మహాపుణ్యా పవిత్రా చసర్వతీర్థమయి శుభా| పునాతి కీర్తనేనైవ విశేషత:||3

తత్రావగాహనాత్‌ పార్థ ముచ్యతే జంతురంహసా| యథా సా పింగళా నాడీ దేహమధ్యే వ్యవస్థితా ||4

ఇయం బ్రహ్మాండపిండస్య స్ధానే తస్మిన్‌ ప్రకీర్తితా | తత్రాస్తే శుక్లతీర్థాఖ్యం రేవాయాం పాపనాశనమ్‌ ||5

యత్ర వై స్నానమాత్రేణ బ్రహ్మహత్యా ప్రణశ్యతి | తస్వాపి సన్నిధౌ పార్థరేవాయా ఉత్తరే తటే||6

నానావృక్షసమాకీర్ణ్యం లతాగుల్మోపశోభితమ్‌ | నానాపుష్పఫలోపేతం కదళీఖండమండితమ్‌ ||7

అనేకశ్వాపదాకీర్ణం విహగైరనునాదితమ్‌ | సుగంధపుష్పశోభాఢ్యం మయూరరవనాదితమ్‌ ||8

మూడవ అధ్యాయము

సూతుడిట్లు చెప్పెను ఇట్లు భూమి పై నున్న పుణ్యమగు స్థానములన్నింటిని బాగుగా చూచుచూ పర్యటించుచున్న నారదుడు భూమి పై తిరుగుచూ భృగుమహర్షి ఆశ్రమమునకు చేరితినని అర్జునునికి చెప్పెను. అక్కడ సప్తకల్పముల వరకు స్మరింపబడు శ్రష్టమగు రేవానదియుండెను. అది పవిత్రమైనది. అన్ని తీర్థముల కలది కీర్తనముచేతనే పవిత్రముచేయు ఆ నదిని చూచిన విశేషముగా పవిత్రులగును (3) అర్జునా! ఆ నదిలో మునిగి స్నానమాడిన వాని పాపము వెంటనే నశించును. ఎట్లైతే పింగళయను నాడీ శరీరమధ్యలో నున్నదో , ఈ రేవానది బ్రహ్మండపిండమునకు మధ్యలో నున్నదని చెప్పబడినది. అక్కడ రేవయందు పాపమును నశింపచేయు శుక్లతీర్థమనునది యున్నది.(5) అక్కడ స్నానము చేసినంత మాత్రమున బ్రహ్మహత్యయైననూ నశించును. దానికి దగ్గర రేవానది ఉత్తర తటమున వనమున భృగుమహర్షి ఆశ్రమమున్నది (6) అక్కడ అనేకవృక్షములున్నవి తీగలు పొదలు మిగుల శోభను కలిగించుచున్నవి. అనేక ఫలపుష్పములతో , అరటిచెట్లతో అలరారుచున్నది.(7)పెక్కు మృగములు తిరుగాడుచుండగా పక్షులుకలకల ధ్వనిని చేయుచుండెను. మంచి వాసననిచ్చు పూలెన్నో యుండెను. నెమళ్ళు క్రేంకారావము చేయుచుండెను.(8)

భ్రమరై: సర్వముత్సృజ్య నిలీనం రావనంయుతమ్‌ | యథా సంసారముత్స్యజ్య భ##క్తేన హరపాదయో:9

కోకిలా మదురై: స్వానైర్నాదయంతి తథా మునీన్‌ | యథా కథామృతాఖ్యానై: బ్రాహ్మణా భవభీరుకాన్‌ ||10

యత్ర వృక్షా హ్లాదయంతి ఫలై: పుషై#్పశ్చ పత్రకై: | ఛాయాభిరపి కాష్ఠైశ్చ లోకానివ హరప్రతా:||11

పుత్రపుత్రేతి వాశంతే యత్ర పుత్రప్రియా :ఖగా :| యథా శివప్రియా : శైవా నిత్యం శివశివేతి చ||12

ఏవంవిధం మునేస్తస్య భృగోరాశ్రమమండలమ్‌ | విపై#్రసై#్రవిద్యసంయుక్తై: సర్వత: సమలంకృతమ్‌ ||13

ఋగ్యజు:సామనిర్ఘాషైరాపూరితదిగన్తరమ్‌ | రుద్రభ##క్తేన ధీరేణ యథైవ భువనత్రయమ్‌ ||14

తత్రాహం పార్థ సంప్రాప్తో యత్రాస్తే మునిసత్తమ: | భృగు : పరమధర్మాత్మా తపసా ద్యోతితప్రభ:||15

ఆగచ్చంతం తు మాం దృష్ట్యా దీనం చ ముదితం తథా| అభ్యుత్థానం కృతం సర్వైర్విపై#్ర: భృగుపురోగమై:||16

కృత్వా సుస్వాగతం దత్త్వా అర్ఘాద్యం భృగునా సహ| అసనేఘాపవిష్టాస్తే మునీంద్రా గ్రాహితా మయా||17

విశ్రాంతం తు తతో జ్ఞాత్వా భృగుర్మామప్యువాచ హ ||

తుమ్మెదలు అన్నింటినీ వదలి అక్కడ, భక్తుడు సంసారమును వదలి శివుని పాదములలో చేరినట్లు పూలలో చేరినవి(9)

సంసార ము నుండి భయమునొందువారిని బ్రాహ్మణులు శివకథామృతమును చెప్పుటచే ఎట్లు ఆనందపరిచెదరో, అక్కడ చెట్లు తమ పళ్ళతో, పూలతో, నీడతో, కర్రతో లోకమును హరుని వ్రతము చేయువారివలె ఆహ్లాద పరచుచుండెను (11)పుత్రులనిష్టపడు పక్షులు కొన్ని పుత్ర, పుత్రయని అరచుచుండగా శివప్రియులగు భక్తులు నిత్యమూ శివ, శివ యనునట్లుండినది (12) ఇట్లు భృగు మహర్షి ఆశ్రమము యొక్క పరిసరములుండెను మూడు వేదములనధ్యయనము చేసిన విప్రులంతటా ఆ ప్రదేశమునలంకరించుచుండిరి.(13) ఋగ్యజ: సామవేదముల ఉచ్చారణ ధ్వనితో దిక్కులన్నీ నిండిపోయెను. దీరుడగు రుద్రుని భక్తుడు ముల్లోకముల నిండినట్లు అది యుండెను (14) అర్జునా ! ఆ మునిశ్రేష్ఠుడున్న చోటికి నేను చేరితిని. భృగువు పరమధర్మాత్ముడు. తపసుచే మిగుల శోభించువాడు(15) దీనడు ,హృష్టుడు అగు నా రాకను చూచి భృగు మొదలగు ఋషులందరూ లేచి నిలచిరి.(160) సుస్వాగతమని పలికి భృగువుతో వారు నాకు అర్ఘ్యము మొదలగు వానినిచ్చి ఆసనములపై కూర్చొనిరి.(17) వారికి బదులిచ్చిన నన్ను విశ్రాంతిని తీసుకొనినవానిగా తెలిసి భృగు మహర్షి ఇట్లనెను (18)

క్వ గంతవ్యం మునిశ్రేష్ట కస్మాదిహ సమాగత:||18

ఆగమనకారణం సర్వం సమాచక్ష్వ పరిస్పుటమ్‌ | తతస్తం చింతయావిష్టో భృగుం పార్థాహమబ్రువమ్‌ ||19

శ్రూయతామభిధాస్యామి యదర్థమహమాగత : | మయా పర్యటితా సర్వా సముద్రాంతా చ మేదినీ||20

ద్విజానాం భూమి దానార్థం మార్గమాణ: పదే పదే: | నిర్థోషాం చ పవిత్రాం చ తీర్థేష్వషిసమన్వితామ్‌ ||21

రమ్యాం మనోరమాం భూమిం న పశ్యామి కథం చన|

భృగురువాచ-

విప్రాణాం స్థాపనార్థాయ మయాపి భ్రమతా పురా||22

పృథ్వీ సాగరపర్యంతా దృష్టా సర్వా తదానఘ| మహీనామ నదీ పుణ్యా సర్వతీర్థమయీ శుభా||23

దివ్యా మనోరమా సౌమ్యా మహాపాపప్రణాశినీ | నదీరూపేణ తత్రైవ పృథ్వీ సా నాత్ర సంశయ:||24

పృథీవ్యాం యాని తీర్థాని దృష్టాదృష్టాని నారద | తాని సర్వాణి తత్రైవ నివసంతి మహీజలే||25

సా సముద్రేణ సంప్రాప్తా పుణ్యతోయా మహానదీ | సంజాతస్తత్ర దేవర్షే మహీసాగరసంగమ:||26

స్తంభాఖ్యం తత్ర తీర్థం తు త్రిషు లోకేషు విశ్రుతమ్‌ | తత్ర యే మనుజా స్నానం ప్రకుర్వంతి వివశ్చిత:||27

సర్వపాపవినిర్ముక్తా: నోపసర్పంతి వై యమమ్‌|

మునిశ్రేష్ఠా ! మీరెక్కడకు వెళ్ళవలెను? ఎక్కడి నుండి వచ్చుచుంటిరి?(18) ఇక్కడి రాకకు కారణమేమిటి? స్పష్టముగా తెలియజేయుడు అనగా నేను చింతతో గూడిన వాడనైభృగు నిట్లంటిని. (19) దేనికై నేనిక్కడకు వచ్చితినో చెప్పెదను, వినుడు, సముద్రము వరకున్న భూమినంతయూ నేను పర్యటించితిని. (20) బ్రాహ్మణులకు భూమిని దానమివ్వవలెనని వెదకుచూ తీర్థములతో గూడి దోషములులేని, పవిత్రము, రమ్యమైన భూమిని గాంచలేకుంటిని.(21) అనగా భృగునిట్లనెను పూర్వము నేను కూడా విప్రులనునిలుపుటకు భూమికై వెదుకుచూనుంటిని. (22) సముద్రము వరకున్న భూమిని మొత్తము చూచితిని. అపుడు మహి యను పుణ్యమగు నది,అన్ని తీర్థములు గలది కనపడెను (23) దివ్యము , మనోరమమూనగు ఆ నది పాపములన్నింటిని నశింపజేయునది అక్కడ నుండెను (24) భూమిపై నున్న తీర్థములన్నీ చూచినవీ, చూడనివి కూడా అక్కడే నివసించును (25) ఆ మహీయను నది పుణ్యజలముల గలిగి సముద్రముతో కలియును ఓ దేవర్షి అదే మహీసాగర సంగమము(26) అక్కడనే ముల్లోకములలో ప్రసిద్దమైన స్తంభమును తీర్థమున్నది అక్కడ స్నానమాడు విజ్ఞలగు నరుల పాపములన్నింటిని పోగొట్టుకొని యముని చేరరు.(27)

తత్రాద్భుతం హి దృష్టం మే పురా స్నాతుం గతేన వై||28

తదాహం కీర్తయిష్యామి మునే శ్రుణు మహాద్భుతమ్‌ | యావత్‌ స్నాతుం వ్రజామ్యస్మిన్మహీసాగరసంగమే ||29

తీరే స్థితం ప్రపశ్యామి మునీంద్రం పావకోపమమ్‌| ప్రాంశుం వృద్దం చాస్థిశేషం తపోలక్ష్మ్యా విభూషితమ్‌||30

భుజూవూర్ద్వౌ తత: కృత్వా ప్రరుదంతం ముహుర్ముహు:| తం తథా దు:ఖితం దృష్ట్వా దు:ఖితోథాభవమ్‌||31

సతాం లక్షణమేతద్ది యద్దృష్ట్వా దు:ఖితం జనమ్‌ | శతసంఖ్యం తస్య భ##వేత్తథాహం విలలాప హ||32

అహింసా సత్యమస్తేయం మానుష్యే సతి దుర్లభమ్‌ | తతస్తముపసంగమ్య పర్యపృచ్చమహం తదా||33

కిమర్థం రోదిషి మునే శోకే కిం కారణం తవ| సుగుహ్యమపి చేద్ర్బూహి జిజ్ఞాసా మహతీ హి మే'||34

మునిస్తతో మామవదద్‌ భృగో నిర్భాగ్యవానహమ్‌ | తేన రోదిమి మా పృచ్చ దుర్భాగ్యం చాలపేద్ది క:||35

తమహం విస్మయావిష్ట: పునరేవేదమబ్రువమ్‌ | దుర్లభం భారతే జన్మ తత్రాపి చ మనుష్యతా||36

మనుష్యత్త్వే బ్రాహ్మణం మునిత్వం తత్ర దుర్లభమ్‌ -||37

పూర్వమొక పర్యాయము అక్కడ స్నానమాడుటకు వెళ్ళిన నేనొక అద్భుతమును చూచితిని. మునివర్యా! దానిని చెప్పెదను.విననుము (28) ఆ మహీసాగర సంగము వద్ద స్నానము చేయుటకు వెళ్ళుచూ నేను(29) ఒడ్డున నిలిచిన ఒక అగ్నివంటి బ్రాహ్మణుని చూచితిని అతడు పోడవుగా బక్కగా ఎముకలగూడై మిగిలి, వృద్దుడైననూ తపోలక్ష్మిచే అలరారుచుండెను (30) అతను రెండుచేతులనెత్తి మాటిమాటికీ నేడ్చుచుండగా చూచి నేను కూడా దు:ఖింపదొడగితిని (31) దు:ఖము నొందినవానిని చూచి నూరురెట్లు అధికముగా దు:ఖము నొందుట సత్పురుషుల లక్షణము. నేను విలాపము చేయుచుంటిని (32) మనుష్యుడుగా జన్మించి అహింస ,సత్యము , అస్తేయములనాచరించుట దుర్లభము. నేనా వృద్దుని సమీపించి అడిగితిని (33) మునీ ! నీవెందులకిట్లు శోకించుచుంటివి? రహస్యమైననూ నాకు చెప్పుము. నేను తెలియగోరుచుంటిని (34) అనగా ఆ ముని నాతో నిట్లనెను. భృగుమహర్షీ నేను అభాగ్యుడను కనుక ఏడ్చుచుంటిని తన దౌర్భౌగ్యమును ఎవడు చెప్పగలుగును ? (35) అనగా విస్మయముతో నేనతని మరల అడిగితిని భారతదేశమున జన్మ దుర్లభము. అందునా మనుష్వజన్మ మరింత దుర్లభము కదా! (36) మనుష్యులలో బ్రాహ్మణుడిగా. అందునా మునిగా , అందునా తపస్సు సిద్దించుట దుర్లభము. నీవినన్నీ పొందితివి.(37)

కిమర్థం రోదిషి మునే విస్మయోత్ర మహాన్‌ మమ| ఏవం సంపృచ్చతే మహ్యమేతస్మిన్నేన చాంతరే||38

సుభద్రో నామ నామ్నా చ మునిస్తత్రాహభ్యుపాయ¸° | న హి మేరుం పరిత్యజ్య జ్ఞాత్వా తీర్థస్య సారతామ్‌||39

కృతాశ్రమ: పూజయతి సదా స్తంభేశ్వరం ముని: సోప్యేవం మామివాపృచ్చన్మునిం రోదనకారణమ్‌||40

అథాహాచమ్య స ముని : శ్రూయతాం కారణం మునీ| అహం హి దేవశర్మాఖ్యో ముని: సంయతవాంజ్మనా:||41

నివసామి కృతస్థానో గంగాసాగరసంగమే | తత్ర దర్శే తర్పయామి సదైవ చ పితృనహమ్‌ ||42

శ్రృద్దాంతే తే చ ప్రత్యక్షా హ్యాశిషో మే వదంతి చ | తదా కదాచిత్పితర: ప్రహృష్టా మామథాబ్రువన్‌ ||43

వయం సదాత్ర చాయామో దేవశర్మంస్తవాంతికే | స్థానేస్మాకం కదాచిత్త్వం న చాయాసి కుత: సుత:44

స్థానం దిదృక్షుస్తచ్చాహం న శక్తోస్మి నివేదితుమ్‌|| తత: పరమమిత్యుక్త్యా గతవాన్పితృభి: సహ||45

పితౄణాం మందిరం పుణ్యం భైమలోకసమాస్థితమ్‌ | తత్ర తత్ర స్థితశ్చాహం తేజోమండలదుర్దశాన్‌||46

దృష్ట్వాzగ్రత : పూజయాఢ్యానపృచ్చం స్వాన్పితౄనితి: కే హ్యమీ సముపాయాంతి భృశం తృప్తా భృశార్చితా:|| భృశం ప్రముదితా నైవ తథా యూయం యథా హ్యమీ||47

అయిననూ నీవెందులకు ఏడ్చుచుంటివి? నాకు విస్మయము కలుగుచున్నది అని అడుగుచుండగా నింతలోనే సుభద్రుడను ముని పేరులో రూపములో సుభద్రుడుగా నుండి అక్కడకు వచ్చెను. మేరు పర్వతమును వీడి అతను ఈ తీర్థము యొక్క గొప్పదనమును తెలిసి (39) ఆశ్రమమును దాల్చి స్తంభేశ్వరుని ఎల్లప్పుడూ పూజించును అతను కూడా నేనడిగినట్లు ఆ మునిని రోదనకారణమునడిగెను (40) అపుడాచమనము చేసి ఆ ముని కారణమునిట్లు చెప్పెను. నేను వాక్కును .మనస్సును నిగ్రహించుకొనిన దేవశర్మయను మునిని (41) గంగాసాగర సంగమము వద్ద నివాసమునేర్పరుచుకొని దర్శమున (అమావాస్యనాడు) పితృదేవతలకెల్లప్పుడు తర్పణమిడుచుంటిని (42) శ్రాద్దము చివర వారు ప్రత్యక్షమై నాకు ఆశీస్సుల పలికెడివారు ఒకనాడు పితృదేవతలు తృప్తినొంది నాతో నిట్లనిరి.(43) దేవశర్మా! మేము నీవద్దకెల్లప్పుడు వచ్చుచుంటిమి కానీ నీవు మా స్థానమునకెప్పుడు రావేమి? (44) అనగా ఆ స్థానమును చూడగోరిననూ నివేదించలేకపోతిని. అపుడు పితృదేవతలతో వారి స్థానమునకు వెళ్ళితిని.నేను తేజోమండలముచే వెలుగుచూ (46) మిగుల పూజింపబడిన వారిని చూచి నా పితృదేవతలనడిగితిని మిగుల ఆర్చింపబడి తృప్తితో , ఆనందముతో వచ్చుచున్న వీరెవరు? వీరివలె మీరు ఆనందముగా ఎందుకు లేరు?(47)

పితర ఊచు:

భద్రం తే పితర: పుణ్యా : సుభద్రస్య మహామునే: | తర్పితాస్తేన మునినా మహీసాగరసంగమే ||48

సర్వతీర్థమయీ యత్ర నిలీనా హ్యుదధౌ మహీ| తత్ర దర్శే తర్పయతి సుభద్రస్తానమూన్‌ సుత||49

ఇత్యాకర్ణ్య వచస్తేషాం లజ్జితోహం భృశం తదా| విస్మితశ్చ ప్రణమ్యైతాన్‌ పితృన్‌ స్వం స్థానమాగత:||50

యథా తథా చింతితం చ తత్ర యాస్యామ్యహం స్పుటమ్‌ | పుణ్యో యత్రాపి విఖ్యాతో మహీసాగరసంగమ:||51

కృతాశ్రమశ్చ తత్రైవ తర్పయిష్యే నిజాన్‌ పితృన్‌ | దర్శే దర్శే చాసౌ స్తుత్యనామా సుభద్రక:||52

కిం తేన నను జాతేన కులాంగారేణ పాపినా యస్మిన్‌ జీవత్యపి నిజా పితరో న్యస్పృహాకరా:||53

ఇతి సంచింత్య ముదితో రుచిం భార్యామథాబ్రువమ్‌ | రుచేత్వయా సమాయుక్తో మహీసాగరసంగమమ్‌||54

గత్వా స్థాస్యామి తత్రైవ శీఘ్రం త్వం సమ్ముఖీభవ| పతివ్రతాసి శుద్దసి కులీనాసి యశస్విని||తస్మాదేతన్మను శుభే కర్తుమర్హసి చింతితమ్‌ ||55

అనగా పితృదేవతలిట్లు బదులిచ్చిరి నాయనా! నీకు శుభమగుగాక! సుభద్రమహాముని పితృదేవతలు పుణ్యాత్ములు మహీసాగర సంగమమున అతడు వారికి తర్పణములతో తృప్తిని కలిగించెను (48) అక్కడ అన్ని తీర్థములు గల మహీనది సాగరమున కలియును అక్కడే సుభద్రుడు అమావాస్యనాడు పితృదేవతలకు తర్పణమిడును (49) అని అనగా విని మిగుల సిగ్గుపడి నేను విస్మయముతో వారికి నమస్కరించి నాస్థానమునకు వచ్చితిని. (50) వాస్తవమునాలోచించి మహీసాగరసంగమమని పేరు బడసిన చోటికే వెళ్ళెదనని నిశ్చయించుకొని నేను అక్కడ పితృదేవతలకు ఆశ్రమమున తర్పణమిడెదననుకొంటిని. ప్రతి అమావాస్యనాడు స్తుతింపదగు పేరుగల సుభద్రుడెట్లు చేయునో నేనునూ అట్లే చేసేదననుకొంటిని (52) ఎవడు జీవించియుండగా వాని పితృదేవతలు వేరొకని వంక ఆశతో చూచెదరో (వేరొక ఆశనొందరో) అట్టి కులమును నశింపజేయు పాపి జీవించిననూ ఫలమేమి? (53) అని తలచి సంతోషముతో నాభార్యయగు రుచితో నిట్లంటిని రుచీ! నీతో కలిసి మహీసాగరసంగమమునకు వెళ్ళి అక్కడే వుండగోరుచుంటిని త్వరగా సమ్ముఖురాలవు గమ్ము. నీవు పతివ్రతవు, స్వచ్చురాలవు, సద్వంశమున జన్మించినదానవు, కీర్తి గలదానవు కనుక నా ఈ ఆలోచనను అనుసరించుము.(55)

రుచిరువాచ-

హతా తస్య జనిర్నాభూత్కథం పాప దురాత్మనా ||55

శ్మశానస్తంభ యేనాహం దత్త తుభ్యం కృతం త్వయా | ఇహ కందఫలాహురైర్యత్కిం తేన న పూర్వతే ||57

నేతుమిచ్చసి మాం తత్ర యత్ర క్షారోదకం సదా| త్వమేవ తత్ర సంయాహి నందంతు తవ పూర్వజా :||58

గచ్చ వా తిష్ఠ వా వృద్ద వస వాకాకవచ్చిరమ్‌ | తథా బ్రువాన్త్యాం తస్యాం తు కర్ణావస్మి పిధాయ చ ||59

విపులం శిష్యమాదిశ్య గృహ ఏకోత్ర ఆగత: | సో హం స్నాత్వాత్ర సంతర్వపితృన్‌ శ్రద్దాపరాయణ:60

చింతాం సువిపులాం ప్రాప్తో నరకే దుష్కృతీ యథా | యది తిష్ఠామి చాత్రైవ అర్ధదేహధరో హ్యహమ్‌||61

నరో హి గృహిణీహీనో అర్ధదేహ ఇతి స్మృత:| యథాత్మనా వినా దేహే కార్యం కించిన్న సిధ్యతి||62

ఏవం గృహిణ్యా హీనో హి న స కర్మను శస్యతే | యో నర: స్త్రీషు దేహేషు అనురక్తస్యసౌ పశు:||63

అనయోర్హి ఫలం గ్రాహ్యం సారతా నాత్ర కాచన | అర్ధదేహీ చ మనుజస్త్వసంస్పృశ్య: సతాం మత:64

అనగా రుచి ఇట్లనెను పాపీ! స్మశానంలోని స్తంభమా! నన్ను నీకంటే గట్టిన దురాత్ముని జన్మ హతమెట్లు కాకున్నది ?ఇక్కడ కందమూలఫల ఆహారముచేత కూడా నీవు చేయలేని దానిని ఏమి చేసెదవు? చాలు దానిచే సరిపోదా!(57) ఇపుడు ఉప్పునీరుండే ఆ చోటికి నన్ను తీసుకొని వెళ్ళదలుచుకుంటివి నీవే అక్కడకు వెళ్ళు నీ పూర్వికులు కూడా ఆనందపడనీ.(58) వృద్దుడా! నీ ఇష్టం వెళ్తె వెళ్ళు లేదా వుండు కాకిలాగా చిరకాలమూ వసించు అనుచుండగా చెవులు మూసికొని (59) విపులుడను శిష్యునికి ఇంటినప్పగించి ఒక్కడినే ఇక్కడకు వచ్చితిని అట్టి నేనిక్కడ స్నానమాడి శ్రద్దతో పితృదేవతలకు సంతర్పణమిడి (60) నరకమున పాపి పొందినట్లు గొప్ప చింతను పొందితిని. ఇక్కడే వున్నచో సగముదేహముగల వాడనగుదును గృహిణిలేని వాడు సగము దేహము గలవాడని కదా స్మృతి ! ఆత్మ లేక దేహమున కార్యమేమి సిద్దించును ?(62) అట్లే గృహిణి లేనివాడు కర్మలాచరించుటకు ప్రశస్తుడు కాడు, కానీ స్త్రీలయందు, దేహములయందు అనురాగము చూపువాడు పశువే ? (63) రెంటి ఫలమును గ్రహించవలెను సారమేమాత్రమూ లేదు సత్పురుషులు గృహిణి లేని మనుజుని తాకరాదనుకొందురుట.(64)

ఔత్తానపాదిరస్పృశ్య ఉత్తమో హి సురై: కృత: | అథ చేత్తత్ర సంయామి స మహీసాగరస్తత:||65

యామి నా తత్కథం పాదౌ చలతో మే కథంచన| ఏతస్మిన్మే మనో విద్దం ఖిద్యతేజ్ఞానసంకటే ||66

అతోహమతి ముహ్యమి భృశం శోచామి రోధిమి: ఇతి | శ్రుత్వా వచస్తస్య భృశం రోమాంచపూరితమ్‌||67

సాధుసాధ్విత్యథోవాచ తం సుభద్రోప్యహం తథా | దండవచ్చ ప్రణమితో మహీసాగరసంగమమ్‌|68

చింతయానశ్చ మనసి ప్రతీకారం మునేరుభౌ! యో హి మానుష్యమాసాద్య జలబుద్భుదభంగురమ్‌ ||69

పరార్ధాయ భవత్యేష పురుషోన్యే పురీషకా తత: సంచింత్య ప్రాహేదం సుభద్రో మునిసత్తమమ్‌||70

మా మునే పరిఖిద్యస్వ దేవశర్మన్‌ స్థిరో భవ| అహం తే నాశయిష్యామి శోకం సూర్యస్తమో యథా||71

గమిష్వామ్యాశ్రమం త్వం చ నాత్రాపి పరిహాస్యతే | శ్రుణు తత్కారణం తుభ్యం తర్పయిష్యే పితృనహమ్‌ ||72

అప్పృశ్యుడగు ఉత్తానపాదుని దేవతలు ఉత్తమునిగా చేసిన మహీసాగర సంగమమువద్దకు (65) వెళ్ళదలిచిననూ ఎట్లు వెళ్ళగలను నా పాదములతికష్టము మీద కదులునుకదా ! వీనియందు నా మనసు దెబ్బతిని అజ్ఞానసంకటమున ఖేదము నొందుచున్నది (66) కనుక నేను మిగుల మోహమునొంది శోకమునొంది అమితముగా నేడ్చుచుంటిని అనగా ఆ రోమాంచపూరితమగు మాటను వినిరి (67) సుభద్రుడనగు నేను అపుడు బాగు బాగు అని పలికితిని మహీసాగర సంగమునకు దండమువలె నేల పై బడి నమస్కరించి ఆ ముని స్థితికై ప్రతిక్రియను మనసులో నాలిచించుచుంటిని (68) నీటి బుడగవలె క్షణికమగు జీవనము నొంది ఇతరులకై (లేదా వరముకై) పాటుపడువాడు మనిషి ఇతరులు తుచ్చులే (69) అని అలోచించి సుభద్రుడు మునిశ్రేష్టునితో నిట్లనెను (70) మునివర్యా! ఖేదమునొందకుము స్థిరముగా నుండును సూర్యుడు చీకటిని నాశనమొనర్చునట్లు నేను నీ శోకమును నశింపజేసెదను.(71) మనము ఆశ్రమమునకు వెళ్ళెదము - ఇప్పటికింకా కోల్పోయినదేదీ లేదు - కారణమును వినుము - నీకొరకై నేను పితృదేవతలకు తర్పణమిడెదను (72)

దేవశర్మోవాచ-

ఏవం తే వదమానస్య ఆయురస్తు శతం సమా:| యదశక్యం మహత్కర్మ కర్తుమిచ్చసి మత్కృతే ||73

హర్షస్థానే విషాదశ్చ పునర్మాం బాధతే శ్రుణు: అపి వాక్యం శుభం సన్తో న గృహ్ణన్తి ముధా మునే||74

కథమేతన్మహత్కర్మ కారయామి ముధా వద| పున: కించిత్ర్పవక్ష్యామి యథా మే నిష్కృతిర్భవేత్‌ ||75

శాపితోసి మయా ప్రాణౖర్యథా వచ్మి తథా కురు| అహం సదా కరిష్యామి దర్శే చోద్దిశ్య తే పితౄన్‌ ||76

శ్రాద్ధం గంగార్ణవే చాత్ర మత్పితృణం త్వమాచర| అహం చైవాపి తపస: సంచితస్యాపి జన్మనా||చతుర్భాగం ప్రదాస్యామి ఏవమేవైతదాచర||77

సుభద్ర ఉవాచ-

యద్వేవం తవ సంతోషస్త్వేవమస్తు మునీశ్వర | సాధునాం చ యథా హర్షస్తథా కార్యం విజానతా||78

భృగురువాచ-

దేవశర్మా తతో హృష్టో దత్త్వా పుణ్యం త్రివాచికమ్‌ | చతుర్థాంశం య¸° ధామ స్వం సుభద్రో పి చ స్థిత:||79

ఏవంవిధో నారదోసౌ మహీసాగరసంగము:| యమనుస్మరతో మహ్యం రోమాంచోద్యాపి వర్తతే ||80

నారద ఉవాచ-

ఇతి శ్రుత్వా ఫాల్గునాహం హర్షగద్గదయా గిరా | మృతో ఇవావోచం సాధు సాధ్వితి తం భృశమ్‌||81

యూయం వయం గమిష్యామో మహీతీరం సుశోభనమ్‌ | ఆవామీక్షావహే సర్వం స్థానకం తదనుత్తమమ్‌||82

అనగా దేవశర్మ విని ఇట్లనెను. ఇట్లు పలుకుచున్న నీవు నూరేళ్ళు జీవించు నాయనా: చేయరాని గొప్ప పనిని నీవు నాకై చేయగోరుచుంటివి (73) కానీ ఈ సంతోష స్థానమున నన్ను విషాదము కూడా బాధించుచున్నది చెప్పెద వినుము మునివర్యా! శుభ##మైన వాక్యమైననూ సత్పురుషులు వ్యర్థముగా గ్రహించరు. (74) ఇక ఈ గొప్ప కార్యమును వ్యర్థముగా నేనెట్లు చేయించెదను ? చెప్పుము నాకు నిష్కృతియగునట్లు నీకు వేరే ఉపాయమును చెప్పెదను (75) నా ప్రాణముల పైఒట్టు పెట్టుకొనుచుంటివి నేను చెప్పునట్లు చేయుము నేను నీ పితృదేవతలనుద్దేశించి మహీసాగర సంగమమున తర్పణమిచ్చెదను, (76) నీవు గంగాసాగర సంగమమున నా పితృదేవతలనుద్దేశించి తర్పణమిడుము నేనునూ నీకు నా తపస్సుచే సంపాదించిన జన్మచే నాలుగవ భాగమునిచ్చెదను ఇట్లే చేయుము (77) అనగా సుభద్రుడిట్లనెను ఇట్లు నీకు సంతోషమగుచో అట్లే చేయుము మునీశ్వరా ! విజ్ఞుడగువాడు సాధువులానందించునట్లు చేయవలెను (78) అనెనని భృగువు చెప్పసాగెను . తరువాత దేవశర్మ సంతోషముతో తన పుణ్యముయొక్క నాలుగవ భాగమును మూడుమారులు పలికి దానమిచ్చి తన ఇంటికి వెళ్ళెను సుభద్రడక్కడే వుండెను (79) నారదా ! ఇట్టిది ఈ మహీసాగర సంగమము స్మరించునపుడు నాకు ఇప్పటికీ రోమములు గగుర్పొడుచును.(80) అనగా నారదుడిట్లనెను అర్జునా! అది వినినేను ఆనందముతో గద్గదమైన గొంతుతో స్పృహలో నుండీ లేనట్లు బాగు, బాగని యంటిని.(81) మనముందరమూ అందమైన మహీతీరమునకు వెళ్ళెదము అక్కడ మనమిద్దరమూ అ ఉత్తమముగు స్థానమును చూచెదము (82)

మమ చైవం వచ: శ్రుత్వా భృగు : సహ మయా సమస్తం తు మహాపుణ్యం మహీకూలం నిరీక్షితుమ్‌||83

తద్దృష్ట్వాహమాసం రోమాంచకంచుక: | అబ్రవం మునిశార్దూలం హర్షగద్గదయా గిరా||84

త్వత్ప్రసాదాత్కరిష్యామి భృగో స్థానమనుత్తమమ్‌| స్వస్థానం గమ్యతాం బ్రహ్మన్నత: కృత్యం విచింతయే ||85

ఏవం భృగుం చాస్మి విసర్జయిత్వా | కల్లోలకోలాహులకౌతుకీ తటే|

అథోపవిశ్యేదమచింతయం తదా కిం కృత్యమాత్మానమివైకయోగీ||86

ఇతిశ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కౌమారికాఖండే నారదార్జునసంవాదే మహీసాగరసంగమతీర్థమాహాత్మ్యే తృతీయోద్యాయ:

నా మాటను విని భృగువు నాతో కలిసి ఆ మహాపుణ్యమగు మహీనది తీరమును చూచుటకు బయలుదేరెను (83) అది చూచి నేను మిక్కిలి ఆనందమును పొంది, గగుర్పాటుతో, గద్గదస్వరముతో మునిశ్రేష్టునితో నిట్లంటిని (84) భృగుమహర్షీ! నీ అనుగ్రహముచే నేను ఈ అత్యుత్తమ స్థానముగా చేసుకొనెదను. బ్రహ్మన్‌! నీవిక వెళ్ళుము. నేను విధిని గూర్చి ఆలోచించెదను (85) అని భృగుమహర్షికి వీడ్కోలు పలికి ఆ కల్లోలముతో ,కోలాహలముగా నున్న నదీతీరమున కూర్చొని ఏమి చేయవలెనని ఆలోచించసాగితిని(86)

ఇది శ్రీ స్కాందమహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమునందలి కౌమారికాఖండమున నారద అర్జున సంభాషణలో మహీసాగరసంగమమను తీర్థమాహాత్మ్యమునను మూడవ అధ్యాయము

చతుర్థోధ్యాయ:

నారద ఉవాచ-

తతస్త్యహం చింతయామి కథం స్థానమిదం భ##వేత్‌ | మయాయత్తం యతో రాజ్ఞాం భూమిరేషా సదా వశే||1

యత్త్యహం ధర్మవర్మాణం గత్వా యాచే హ మేదినీమ్‌ | అర్పయత్యేవ సచమే యాచితో నపున: పర:||2

తథాహి మునిభి: ప్రోక్తం ద్రవ్యం త్రివిధముత్తమమ్‌| శుక్లం మధ్యం చ శబలమధమం కృష్ణముచ్యతే||3

తథా వాణిజ్యకుసీదకృషియానితమేవ చ ||4

శబలం ప్రోచ్యతే సద్భిర్ద్యూతచౌర్యేణ సాహసై: వ్యాజేనోపార్జితం యచ్చ తత్‌ కృష్ణం సముదాహృతమ్‌ ||5

శుక్లవిత్తేన యో ధర్మం ప్రకుర్యాచ్చ్రద్దయాన్విత:| తీర్థం పాత్రం సమాసాద్య దేవత్యే తత్సమశ్నుతే||6

రాజసేన చ భావేనవిత్తేన శబలేన చ| ప్రదద్యాద్దానమర్థిభ్యో మానుష్యత్వే తదశ్నుతే:|'|7

తమోవృతస్తు యో దద్యాత్‌ కృష్ణవిత్తేన మానవ: | తిర్యక్త్యే తత్పలం ప్రేత్య సమశ్నాతి నరాధమ:||8

తత్తు యాచితద్రవ్య మే రాజసం హి స్పుటం భ##వేత్‌| అథ బ్రాహ్మణభావేన నృపం యాచే ప్రతిగ్రహమ్‌||9

నాలుగవ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను అటుతరువాతనేను ఈ స్థానము నా వశముననెట్లుండునని మిగుల ఆలోచించితిని ఎందుకంటే ఈ భూమి ఎల్లప్పుడూ రాజుల వశముననుండును(1) నేను ధర్మవర్మను చేరి ఈ భూమిని యాచించిన అతను తప్పక భూమిని నాకర్పించును.(2)

అయిననూ , మునులు ద్రవ్యము మువ్విధము అని చెప్పరి ఉత్తమ ధనము తెల్లది, మధ్యమధనము చిత్రము , అధమధనము నల్లనిది(3) వేదజ్ఞానము ద్వారా పొందినది, శిష్యుని నుండి పొందినది, కన్యచే పొందినది కూడా శుక్లమనబడును అట్లే వ్యాపారము, వ్యవసాయము, సేవ, యాచనల ద్వారా పొందిన ధనము చిత్రమనబడును.(4) సాహసముతో, ద్యూతములో గానీ దొంగిలించిగానీ, ఏదేని నెపముతో గానీ పొందిన ధనము కృష్ణమనబడును(5) ఉత్తమమగు శుక్లధనమును శ్రద్దతో సరియైన దేశమున సరియగు వ్యక్తికి దానమిచ్చి ధర్మమాచరించువాడు దేవత్వమును పొందును(6) రాజసభావముతో చిత్రధనమును యాచకులకు దానమిచ్చువాడు మనుష్యత్వమును పొందును(7) తమోగుణముతో అధమమగు ధనమును దానమిచ్చువాడు పరలోకమున పక్షియై దానిని పొందును(8) యాచనద్వారా పొందిన ధనము రాజసమని స్పుటముగా కనబడును కనుక ఇక బ్రాహ్మణబావముతో రాజనుండి ప్రతిగ్రహమును యాచించెదను (9)

తదప్యహో చాతికష్టం హేతునా తేన మే మతమ్‌ | ఆయం ప్రతిగ్రహో ఘోరో మధ్వాస్వాదో విషోపమ:10

ప్రతిగ్రహేణ సంయుక్తం హ్యమీవమావిశేద్ద్విజమ్‌ | తస్మాదహం నితృత్తశ్చ పాపాదస్మాత్ర్పతిగ్రహత్‌||11

తత: కేనాప్యుపాయేన ద్వయోరన్యతరేణ చ | స్వాయత్తం స్థానకం కర్మ ఏతత్సంచింతయే ముహు:||12

యథా కుభార్య: పురుషశ్చింతాంతం న ప్రపద్యతే| తథైవ విమృశంశ్చాహం చింతాంతం న లభామ్యణు:||13

ఏతస్మిన్నంతరే పార్థ స్నాతుం తత్ర సమాగతా:| బహనో మునయ: పుణ్య మహీసాగరసంగమే||14

అహం తానబ్రవం సర్వాన్‌ కుతో యూయం సమాగతా:| తే మామూచు : ప్రణమ్యాథ సౌరాష్ట్రవిషయే మునే ||15

ధర్మవర్మేతి నృపతిర్యోస్య దేశస్య భూపతి:| సతు దానస్య తత్త్వార్థీ తేపే వర్షగణాన్‌ బహూన్‌ ||16

తతస్తం ప్రాహ ఖే వాణీ శ్లోకమేకం నృప శ్రుణు|ద్విహేతు షడధిష్ఠానం షడంగం చ ద్విపాకయుక్‌||17

చతు:ప్రకారం త్రివిధం త్రినాశం దానముచ్యతే | ఇత్యేకం శ్లోకమాభాష్య ఖే వాణీ విరరామ హ||18

ఈ ప్రతిగ్రహము ఘోరమైనది విషమువంటి మధువును గ్రోలుటవంటిది(10) ప్రతిగ్రహముతో కూడిన బ్రాహ్మణుని పాపము చేరును. కనుక నేనీ ప్రతిగ్రహరూప పాపమునుండి మరలెదను (11) రెంటిలో ఏదో ఒక ఉపాయముచే నేనా స్థానమునుస్వంతము చేసుకొనెదనని మరల మరల ఆలోచించసాగితిని (12) చెడు భార్యగల పురుషుడు తన చింతకు అంతమును పొందునట్లు నేనునూ ఆలోచించుచూ నాచింతకు అంతమును కొంచమైనా పొందలేక పోతిని (13) ఇంతలో ఆ పుణ్యప్రదమైన మహీసాగర సంగమమున స్నానమాడుటకు మునులక్కడకు వచ్చిరి.(14) నేనువారిని మీరెక్కడ నుండి వచ్చితిరని అడిగితిని అపుడు వారు నాకు నమస్కరించి సౌరాష్ట్రదేశమున నుండివచ్చితిమని దానికి ధర్మవర్మయనువాడు రాజుయని చెప్పిరి(15) దానతత్త్వమునుగొరి అనేక సంవత్సరములు తపించెను (16) అంత, ఆకాశవాణి ఒక శ్లోకమును వినిపించెను . రెండు హేతువులు, ఆరు అధిష్టానములు, ఆరు లింగములు, ఆరు ఫలములు గలది (17) నాలుగు ప్రకారములను, మువ్విధములను ,మూడు నాశములనుగలిగినది దానమనబడును అని శ్లోకమును పలికి ఆకాశవాణి విరమించెను (18)శ్లోకస్యార్థం నావభాషే పృచ్చమానాపి నారద| తతో రాజా ధర్మవర్మా పటహేనాన్వఘోషయత్‌||19

యస్తు శ్లోకస్య చైవాస్య లబ్దస్య తపసా మయా| కరోతి సమ్యగ్వ్యాఖ్యానం తస్య చైతద్దదామ్యహమ్‌||20

గవాం సప్తనియుతం సువర్ణం తావదేవ తు| సప్తగ్రామాన్‌ ప్రయచ్చామి శ్లోకవ్యాఖ్యానం కరోతి య:||21

పటహేనేతి నృపతే : శ్రుత్వా రాజ్ఞో వచో మహత్‌| ఆజగ్ముర్భహుదేశీయా బ్రాహ్మణా: కోటిశో మునే ||22

పునర్దుద్బోధవిన్యాస: శ్లోకసై#్తర్విప్రపుంగవై: అఖ్యాతుం శక్యతే నైవ గుడో మూకైర్యథా మునే||23

వయం చ తత్ర యాతా: స్మో ధనలోభేన నారద| దుర్భోధత్వాన్నమస్కృత్య శ్లోకం చాత్ర సమాగతా :||24

దుర్వ్యాఖ్యేయస్త్వయం శ్లోకో ధనం లభ్యం న చైవ న: తీర్థయాత్రం కథం యామేత్యేవాచింత్యాత్ర చాగతా:||25

ఏవం ఫాల్గున తేషాం తు వచ: శ్రుత్వా మహాత్మనామ్‌| అతీవ సంప్రహృష్టోహం తాన్విసృజ్యేత్యచింతయమ్‌||26

అహో ప్రాప్త ఉపాయో మే స్థానప్రాప్తౌ నసంశయ: | శ్లోకం వ్యాఖ్యాయ నృపతేర్లప్స్యే స్థానం ధనం తథా||27

విద్యామూల్యేన నైవం చ యాచిత: స్యాత్ప్రతిగ్రహ: | సత్యమాహ పురాణర్షిర్వాసుదేవో జగద్దురు:||28

ధర్మస్య యస్య శ్రద్దా స్యాన్న చ సా నైవ పూర్యతే | పాపస్య యస్య శ్రద్దా స్యాన్న చ సాzపిన పూర్యతే||29

అడిగినప్పటికి శ్లోకమునకు అర్థమును చెప్పలేదు అంతట రాజు వాద్యఘోషతో ఇట్లు చాటింపజేసెను (19) తపస్సు ద్వారా నేను పొందిన ఈ శ్లోకమునకు సరియైన వ్యాఖ్యానమును చేయగలవానికి నేను పారితోషికమునిచ్చెదను.(20) అతనికి ఏడు వందల కోట్ల గోవులను అంతే బంగారమును, ఏడు గ్రామములనూ ఇచ్చెదను.(21) అని రాజు గొప్పగా చాటింపు చేయించగా విని అనేక దేశములనుండి అనేక మంది బ్రాహ్మణులు వచ్చిరి.(22) కాని తెలియరాని ఆ శ్లోకమును వారు మూగవారు బెల్లము రుచిని విడమరచి చెప్పజాలనట్లు వ్యాఖ్యానించలేకపోయిరి (23) నారదా! మేము కూడా దనము పట్ల లోభముతో అక్కడికి వెళ్లాము కానీ అర్థముకానందువలన ఆ శ్లోకానికో దండం పెట్టి ఇక్కడికి వచ్చేసాము (24) ఆ శ్లోకమోలాగూ అర్ధముకాదు. ధనము మాకు అభించదు తీర్థయాత్రనెట్లు చేయవలెనని తలచి ఇక్కడకు వచ్చితిమి(25) అని వారనగా విని మిగుల సంతోషమునొంది వారికి వీడ్కోలు పలికి ఇట్లాలోచించితిని (26) అహా!స్థానమును పొందుటకు నాకిపుడు ఉపాయము లభించినది. సందేహము లేదు. శ్లోకమును వ్యాఖ్యానించి స్థానమును, ధనమునూ పొందెదను (27) విద్య మూల్యముగా గ్రహించినది యాచింపబడినది కాదు ప్రతిగ్రహము కాదు. పురాణర్షి, జగద్గురువగు నిజము పలికెను (28) ధర్మమునందు యాచింపబడినది కాదు,ప్రతిగ్రహమూ కాదు, పురాణర్షిజ జగద్దురువగు వాసుదేవుడు నిజము పలికెను (28)ధర్మమునందు శ్రద్దయున్నవానికి ఆ శ్రద్ద ఎల్లప్పటికీ పూరింపబడదు అట్లే పాపమునందు శ్రద్దయున్ననూ అది పూరింపబడదు.(29)

ఏవం విచింత్వ విద్వాంస: ప్రకుర్వంతి యథారుచి! సత్యమేతద్విభోర్వాక్యం దుర్లభోzపి యథా హి మే||30

మనోరథోయం సఫల: సంభూతోంకురిత: స్పుటమ్‌ ! ఏవం చ దుర్విదం శ్లోకమహం జానామి సుస్ఫుటమ్‌||31

అమూర్తై: పితృభి: పూర్వమేష ఖ్యాతో హిమే పురా| ఏవం హర్షాన్విత: పార్థ సంచింత్యాహం తతో ముహు:||32

ప్రణమ్య తీర్థం చలితో మహీసాగరసంగమమ్‌ | వృద్దబ్రాహ్మణరూపేణ తతోzహం యాతవాన్న్పపమ్‌||33

ఇదం భణితవానస్మి శ్లోకవ్యాఖ్యాం నృప శ్రుణు| యత్తేపటహవిఖ్యాతం దానం చ ప్రగుణీకురు||34

ఏవముక్తే నృపః ప్రాహ ప్రోచురేవం హి కోటిశః | ద్విజోత్తమాః పునర్నాస్య ప్రోక్తుమర్థో హి శక్యతే || 35

కే ద్విహేతూ పడాఖ్యాతాన్యధిష్టానాని కాని చ | కాని చైవ షడంగాని కౌ ద్వౌ ప్రోక్తౌ దానసై#్యతత్‌ స్ఫుటం వద||37

స్పుటాన్‌ ప్రశ్నానిమాన్‌ సప్త యది వక్ష్యసి బ్రాహ్మణ |తతో గవాం సప్తనియుతం సువర్ణం తావదేవ తు||38

సప్త గ్రామాంశ్చ దాస్యామి నో చేద్యాస్యసి స్వం గృహమ్‌ | ఇత్యుక్తవచనం పార్థ సౌరాష్ట్రస్వామినం నృపమ్‌||39

ధర్మవర్మాణమస్త్యేవం ప్రావోచమవధారయ| శ్లోకవ్యాఖ్యాం స్పుటాం వక్ష్యే దానహేతూ చ తౌ శృణు||40

ఇట్లాలోచించి విద్వాంసులు రుచిననుసరించి ప్రవర్తింతురు. అతని వాక్యమిది సత్యము పొందలేననుకున్న నా మనోరథము అంకురించి సఫలమైనది (30) తెలియజాలని ఈ శ్లోకమును నేను స్పష్టముగా తెలియుదును (31) పూర్వ ము నా పితృదేవతలు నిరాకారులై నాకు దీనిని తెలియజెప్పరి. అని సంతోషముతో మరల మరల తలచుచూ నేను తీర్థమునకు నమస్కరించి మహీసాగర సంగమమునకు వెళ్ళితిని వృద్ద బ్రాహ్మణరూపమున రాజు వద్దకు వెళ్ళితిని (33) రాజా! ఈ శ్లోక వ్యాఖ్యను వినుము నీవు చాటించిన దానము కూడా అధికముగా చేయుచుంటిని. అది విని రాజు కోట్ల కొలదిగా ద్విజులిట్లనిరి కానీ దీని అర్థము చెప్పలేకపోయిరి (35) రెండు హేతువులు, ఆరు అధిష్టానములు, ఆరు అంగములు, రెండు ఫలములూ ఏవి?(36) నాలుగు ప్రకారములు, మూడు విధములు మూడు నాశములు దానమునకు గలవంటిమి అవేవి స్పుటముగా చెప్పుము (37) బ్రాహ్మణా! నీవు వీనికి సమాధానమివ్వగలిగిన ఏడువందల కోట్ల గోవులను అంతే బంగారమును (38) ఏడు గ్రామాలకు నీకిచ్చెదను లేనిచో నీవు ఇంటికి వెళ్ళెదవు. అని ఆ సౌరాష్ట్రరాజు అనగా విని (39)దర్మవర్మయను ఆ రాజుతో ఇట్లంటిని వినుము స్పష్టముగా శ్లోకమునకు వ్యాఖ్యానము చేసెదను ఆ రెండు హేతువులను ముందు వినుము(40)

అల్పత్వం వా బహుత్వం వా దానస్యాదయావహమ్‌| శ్రద్దా శక్తిశ్చ దానానాం వృద్ద్యక్షయకరే హితే ||41

తత్ర శ్రద్దావిషయే శ్లోకా భవంతి | కాయక్లేశైశ్చ బహుభిర్న చైవార్థస్య రాశిభి:||42

ధర్మ: సంప్రాప్యతే సూక్ష్మః శ్రద్ధా ధర్మోzద్భుతం తపః | శ్రద్ధా స్వర్గశ్చ మోక్షశ్చ శ్రద్దా సర్వమిదం జగత్‌ ||43

సర్వస్వం జీవితం చాపి దద్యాదశ్రద్దయా యది| నాప్నుయాత్‌ స ఫలం కించిచ్చద్దదానస్తతో భ##వేత్‌ ||44

శ్రద్దయా సాధ్యతే ధర్మో మహద్బిర్నార్థరాశిభి:| అకించనా హి మునయ:శ్రద్దావంతో దివం గతా!|45

త్రివిధా భవతి శ్రద్దా దేహినాం సా స్వభావజా| సాత్త్వికే రాజసీ చైవ తామసీ చేతి తాం శ్రుణు||46

యజంతే సాత్త్వికా దేవాన్‌ యక్షరాక్షాంసి రాజసాః | ప్రేతాన్భూతపిశాచాంశ్చ యజంతే తామసా జనా:||47

తస్మచ్ర్చద్దావతా పాత్రే దత్తం న్యాయార్జితం హియత్‌ | తేనైవ భగవాన్‌ రుద్ర: స్వల్పకేనాzపి తుష్యతి||48

తక్కువగానీ, ఎక్కువగానీ చేసిన దానము అభ్యుదయమును కలిగించును. శ్రద్ద మరియు శక్తి దానములకు వృద్దిని,శాశ్వతత్వమునుకలిగించును (41) శ్రద్ద విషయమున ఈ క్రింది శ్లోకములు చెప్పబడినవి కాయక్లేశములతో గానీ, ధనరాశులతోగాని సూక్ష్మమగు ధర్మము ప్రాప్తించదు శ్రద్దయే అద్బుతధర్మము. అద్బుతతపస్సు, శ్రద్దయే స్వర్గము , మోక్షము, జగత్తంతా శ్రద్దయే.(43) ఎవడైనా ఆశ్రద్దతో తనసర్వస్వమును గానీ జీవితమును గానీ దానమిచ్చిన కొంతైనా ఫలముండదు . దానిచే ఆశ్రద్ద చూపువాడే యగును ('44) గొప్పవారు శ్రద్దతో ధర్మమును సాధింతురు గానీ ధనరాశులతో కాదు, ఏమీలేదు మునులు కూడా శ్రద్దతోనే కదా స్వర్గమును పొందినది(45) ప్రాణులకు వారి స్వభావముతో శ్రద్ద మూడు విధాలుగా ఏర్పడును. సాత్త్వికము, రాజసము, తామసము అని వాని పేర్లు చెప్పద వినుము (46) సాత్త్వికులు దేవతలను పూజింతురు. రాజసులు యక్షులను, రాక్షసులను పూజింతురు, తామసులు భూతప్రేతపిశాచములను పూజింతురు. (47) కనుక శ్రద్దతో ఎవరైనా తాను న్యాయముగా సంపాదించినదానిని కొద్దిగానైనా యోగ్యునికి దానమిచ్చినచో ,శివుడు దానితో సంతోషించును.(48)

శక్తివిషయే చ శ్లోకా భవంతి కుటుంబభుక్తవసనాద్దేయం యదతిరిచ్యతే| మధ్వాస్వాదో విషం పశ్చాద్దాతుర్థర్మోన్యథా భ##వేత్‌||49

శ##క్తే పరజనే దాతా స్వజనే దు:ఖ.జీవిని| మధ్వాపానవిషాద: స ధర్మాణాం ప్రతిరూపక:||50

భృత్యానాముపరోధేన యత్కరోతి ఔర్ద్వదైహికమ్‌| తద్భవత్యసుఖోదర్కం జీవతోస్య మృతస్యచ ||51

సామాన్యం యాచితం న్యాసమాధిర్దారాశ్చ దర్శనమ్‌| అన్వాహితం చ నిక్షేప: సర్వస్వం చాన్వయే సతి||52

ఆపత్స్వసి న దేయాని నవవస్తూని పండితై: యో దదాతి స మూఢాత్మా ప్రాయశ్చిత్తీయతే నర:||53

ఇతి తే గదితౌ రాజన్‌ ద్వౌ హేతూ శ్రూయతామత: | అధిష్టానాని వక్ష్యామిషడేవ శ్రుణు తాన్యపి||54

ధర్మమర్థం చ కామం చ వ్రీడాహర్ష భయాని ఛ | అధిష్టానాని దానానాం షడేతాని ప్రచక్షతే||55

పాత్రేభ్యో దీయతే నిత్యమనపేక్ష్య ప్రయోజనమ్‌ | కేవలం ధర్మబుద్ద్యా యద్దర్మదానం తదుచ్యతే||56

ధనినం ధనలోభేన లోభయిత్వార్థమాహరేత్‌| తదర్థదానమిత్యాహు: కామదానమత: శ్రుణు||57

ప్రయోజనమపేక్ష్వైవ ప్రసంగాద్యత్ర్పదీయతే | అనర్హేషు సరాగేణ కామదానం తదుచ్యతే||58

శక్తివిషయమున కూడా శ్లోకములు గలవు కుటుంబముకొరకు , భోజనముకై, వస్త్రములకై తప్ప దాచినదంతా , మధువురుచిగల విషము వంటిది. అట్టి దానిని దానమిచ్చి అధర్మమే (49) ఇతరుడు శక్తిగల వాడై, తనవాడు దు:ఖితుడై యుండగా ఇతరులకు దానమిచ్చిననూ, దానము వలె కనబడు దానిచే మధువుతో గూడిన విషమును తినువాడగును (50) తనమీద ఆధారపడువారిని అలక్ష్యం చేసి (వారికి విఘ్నముకల్పించి) పై లోకమునకు చెందినదానిని చేసినచో అది ఇహపరలోకములలో దు:ఖమును కలిగించును(51) తనకు ఇతరులకు సమానముగా చెందువానిని, యాచించి పొందినదానిని వేరోకరు తనవద్ద వుంచిన దానిని, తాకట్టును, భార్యను, ధర్శనమును అన్వాహితమును, నిధిని,వంశము (సంతానము) వుండగా సర్వస్వమును ఈతొమ్మిదింటిని అపదలోనూ పండితులు దానమివ్వరాదు.దానమివ్వరాదు. దానమిచ్చిన మూఢుడు ప్రాయశ్చిత్తమొనరించవలెను (53) రాజా! ఇట్లునేను నీకు రెండు హేతువులను అనగా శ్రద్ద శక్తి అనువానిని చెప్పితిని ఇక ఆరు అధిష్టానముల జెప్పద వినుము (54)అను శ్రద్ద , అర్థము, కామము, వ్రీడ ధర్మదానము అనగా ధర్మబుద్దితో మాత్రేమే దానములకు అధిష్టానములు (55) ధర్మదానము అనగా ధరమబుద్ది తో మాత్రమే ఫలము నాశించక నిత్యము యోగ్యులకు దానమిచ్చుట (56)ధనలోభముతో ధనికుడు నుండి దనమును పొందుటను అర్థదానమందురు (57) అనర్హుడికైననూ అభిమానముతో ప్రయోజనమునాశించి ప్రసంగముతో దానమిచ్చుట కామదానమనబడును (58)

సంసది వ్రీడయాశ్రుత్య అర్ధిభ్య: ప్రదదాతి చ| ప్రతిదీయతే చ యద్దానం వ్రీడాదానమితి శ్రుతుమ్‌||59

దృష్ట్యా ప్రియాణిశ్రుత్వా వా హర్షవద్యత్ర్పదీయతే| హర్షదానమితి ప్రోక్తం దానం తద్దర్మచింతకై:|| 60

ఆక్రోశానర్ధహింసానాం ప్రతీకారయ యద్బవేత్‌ | ధీయతేనుపకర్తృభ్యో భయదానం తదుచ్యతే||61

ప్రోక్తాని షడధిష్ఠానాని అంగాన్యపి చ షట్‌ శృణు | దాతా ప్రతిగ్రహీతా చ శుద్దిర్దేయం చ ధర్మయుక్‌ ||62

దేశకాలౌ చ దానానమంగాన్యేతాని షడ్విదు:| అపరోగీ చ ధర్మాత్మా దిత్సురవ్యసన: శుచి:||63

అనింద్యాజీవకర్మా చ షడ్భిర్దాతా చ ప్రశస్యతే| అనృజుశ్చాశ్రద్దనోశాంతాత్మా దృష్టభీరుక:||64

అసత్యసంధో నిద్రాలుర్దాతాయం తామసోధమ: త్రిశుక్ల కృశవృత్తిశ్చ ఘృణాళు: సకలేంద్రియ:||65

విముక్తో యోనిదోషేభ్యో బ్రాహ్మణ: పాత్రముచ్యతే | సౌముఖ్యమభిసం ప్రీతిరర్ధినాం దర్శనే సదా || సత్కృతిశ్చానసూయ చ తదా శుద్దిరితి స్మృతా||66

అపరాబాధమక్లేశం స్వయత్నేనార్జితం ధనమ్‌ | స్వల్పం నా విపులం వాపి దేయమిత్యభిధీయతే|| 67

సభయందు సిగ్గుచే ప్రతిజ్ఞచేసి దానమిచ్చిననూ, గ్రహించి తిరిగి ఇచ్చిననూ వ్రీడాదానమబడును (59) తనకు ప్రియమైనవానిని చూచి గానీ, వినిగానీ హర్షమును పొంది దానమిచ్చి హర్షదానమని ధర్మజ్ఞలందురు.(60) ఆక్రోశము, అనర్థము, హింస అనువానికి ప్రతీకారమునకై ఉపకారము చేయనివానికి కూడా దానమిచ్చిన భయదానమనబడును .(61) ఇవి ఆరు అధిష్టానములు ఇక ఆరు అంగములను వినుము దాత, ప్రతిగ్రహీత, శుద్ది, దేయము, ధర్మసహితము, దేశకాలములు ఇవి దానమునకు ఆరు అంగములు, ఆరోగ్యముగలవాడు, ధర్మాత్ముడు, దానమివ్వగోరినవాడు, వ్యసనము లేనివాడు, పవిత్రుడు, పవిత్రమైన జీవనకర్మను నడుపువాడు - ప్రశస్తుడైన దాత. అట్లే కుటిలుడు, శ్రద్ధచూపనివాడు, అశాంతితో నున్నవాడు, కోపి, భయస్తుడు, అబద్దములను అడువాడు, నిద్రించు స్వభావముగలవాడు అధముడగు దాత, తామసుడు ఇక దానమును గ్రహించు వానిలో మనోవాక్కాయకర్మలచే శుద్దుడు క్షీణవృత్తిగలవాడు , దయగలవాడు , పుష్టిగల ఇంద్రియములు గలవాడు (అంగవైకల్యము లేనివాడు) యోనిదోషములు లేనివాడు ఆగు బ్రాహ్మణుడు దానమునకు పాత్రుడు (యోగ్యుడు) యాచకులను చూచుటతోడనే సుముఖతను, ప్రీతిని చూపుట, సత్కరించుట, అసూయను పొందకపోవుట శుద్దియనబడును (66) ఇతరులకు బాధకలిగించునది క్లేశములేనిది, తన కృషితో సంపాదించినది, ఏ కొద్దిగానైననూ దానమివ్వదగినదనబడును ఇది దేయము(67)

తేనాపి కిం ధర్మేణ ఉద్దిశ్య కిల కించన| దేయం తద్దర్మయుగితి శూన్యే శూన్యం ఫలం మతమ్‌||68

న్యాయేన దుర్లభం ద్రవ్యం దేశే కాలేపి వాపున:| దానార్హౌ దేశకాలౌ తౌ స్యాతాం శ్రేష్ఠా న చాన్యథా||69

షఢంగానీతి చోక్తాని ద్వా చ పాకావత: శ్రుణు| ద్వౌపాకౌ దానజౌ ప్రాహు : పరత్వాథ త్విహోచ్యతే||70

అసత్సు దీయతే కించిత్తద్దానమిహ భుజ్యతే||71

ద్వౌ పాకావితి నిర్దిష్టౌ ప్రకారాంశ్చతుర: శ్రుణు | ద్రువమాహుస్త్రికం కామ్యం నైమిత్తికమితి క్రమాత్‌|| 72

వైదికో దానమార్గోయం చతుర్థా వర్ణ్యతే ద్విజై: ప్రపారామతడాగాది సర్వకామఫలం ధ్రువమ్‌||73

తదాహుస్త్రికమిత్యాహుర్థీయతే యద్దినేదినే| అపత్యవిజయైశ్వర్యస్త్రీబాలార్థాం ప్రదీయతే||74

ఇచ్చాసంస్థం చ యద్దానం కామ్యమిత్యభిదీయతే| కాలాపేక్షం క్రియాపేక్షం గుణాపేక్షమితి స్మృతా||75

త్రిధా నైమిత్తికం ప్రోక్తం సదా హోమవివర్జితమ్‌ | ఇతి ప్రోక్తా : ప్రకారాస్తే త్రైవిధ్యమభిధీయతే||76

అష్టోత్తమాని చత్వారి మధ్యమాని విధానత:| కానీయసాని శేషాణి త్రివిధత్వమిదం విదు:||77

ధర్మమునుద్దేశించి దానమిచ్చినచో అది కొద్ది మాత్రమే అయిననూ ధర్మసహితమనబడును. ధర్మము లేనిది నిష్పలము.(68) దుర్లభమగు ద్రవ్యమును దేశకాలములందు న్యాయముగా దానమిత్తురో ఆ దేశకాలములే శ్రేష్టుములనబడును. వేరొకటి కాదు.(69) ఇవి ఆరు అంగములు. ఇక రెండు ఫలములను చెప్పెద వినుము. దానముచే కలుగ ఫలములు రెండు ఇహ, పరలోకములకు చెందినవి (70) ఉత్తములకు దానమిచ్చినచో, అది పరమున దాతను చేరును అసత్పురుషులకు దానమిచ్చినచో అది కేవలమీలోకమున అనుభవించబడును.(71) ఇవి రెండు విధముల ఫలములు,ఇకనాలుగు ప్రకారములను వినుము. ఇవి క్రమము ద్రువము , త్రికము, కామ్యము, నైమిత్తికము అనబడునవి. (72) ఈ వైదికదానమార్గమును ద్విజులు రెండు గా విభజింతురు. నీటికోలనులు. అరామములు, తటాములు, మొదలగునవి అన్ని ఫలముల నిచ్చునవి. వీనిని ద్రువముమందురు (73) ప్రతిదినము ఇవ్వబడు దానమును త్రికమందురు సంతానము కొరకు . విజయము కొరకు, ఐశ్వర్యము కొరకు, స్త్రీలకొరకు ,బాలురకొరకు ఇష్టానుసారము దానమిచ్చినది కామ్యమనబడును.(74) హోమములేని ఈనైమిత్తికము కాలాపేక్షము, క్రియాపేక్షము,గుణాపేక్షమని మూడు విధాలు, (75) ఇక వీని మూడు విధములు చెప్పెదను , మొదటి ఎనిమిది ఉత్తమములు, నాలుగు మధ్యమములు, మిగిలినది అధమములుగా చెప్పబడినవి.(76,77)

గృహప్రాసాదవిద్యా భూగోకూపప్రాణహాటకమ్‌ ఏతాన్యుత్తమదానాని ఉత్తమద్రవ్యదానత:||78

అన్నారామం చ వాసాంపి హయప్రభృతివాహనమ్‌ | దానిని మధ్యమానీతి మద్యమద్రవ్యదానత:||79

ఉపానచ్చత్రపాత్రాదిదధిమధ్వాసనాని చ ||80

దీపకాష్టోపలాదీని చరమం బహువార్షికమ్‌ | ఇతి కానీయసాన్యాహుర్దాననాశత్రయం శ్రుణు||81

యద్దత్వా తప్యతే పశ్చాదాసురం తత్‌ వృథా మతమ్‌| ఆశ్రద్దయా యద్దదాతి రాక్షసం స్యాత్‌ వృథైవ తత్‌||82

యచ్చాక్రుశ్య దదాత్యంగ దత్త్వా వాక్రోశతి ద్విజమ్‌ | పైశాచం తత్‌ వృథా దానం దాననాశాస్త్రయస్త్వమీ||83

ఇతి సప్తపదైర్బదం దానమాహాత్మ్యముత్తమమ్‌| శక్త్వా తే కీర్తితం రాజన్‌ సాధు వాసాధు వా వద|84

ధర్మవర్మోవాచ-

అద్య మే సఫలం జన్మ అద్యమే సఫలం తప:| అద్యతే కృతకృత్యోస్మి కృత: కృతిమతాం వర:|85

పఠిత్వా సకలం జన్మ బ్రహ్మచారీ యథా వృథా | బహుక్లేశాత్‌ ప్రాప్తభార్య: సా వృథాప్రియవాదినీ ||86

గృహములు, ప్రాసాదములు, విద్య, భూమి, గోవులు, కూపము, ప్రాణము, బంగారమును దానమిచ్చుట ఉత్తమదానమనబడును, ఎందుకనగా ఇవి ఉత్తమద్రవ్యములు (78) అన్నము, ఆరామము, వస్త్రములు, గుర్రములు మొదలగు వాహనములు మధ్యమ ధనము వీనిని దానమిచ్చుట మధ్యమదానమనబడును (79)పాదరక్షలు ,గొడుగు, పాత్రలు, పెరుగు, మధువు, అసనములు, దీపము, కర్రలు, రాళ్ళు మున్నగునవి ఎక్కువ కాలమునకుచెందినవి ఆధమములు. వీనిని దానమిచ్చుట అధమదానము(80,81) ఇక నాశములు మూడింటిని వినుము. దానమిచ్చిన తరువాత తపించిన అసురదానమబడును. అది వ్యర్థమగును. ఆశ్రద్దతో దానమిచ్చిన రాక్షసము . అది కూడా వృథా యగును.(82) బాధపడి దానమిచ్చిననూ, దానమిచ్చి బాధపడిననూ అది పైశాచదానము,నిష్పలమైనది ఇవి దానము నశించు మూడు విధములు (83) రాజా! నాశక్తి కొలది నీకి ఉత్తమమగు దానమాహాత్మ్యమును ఏడు పదములలో కూర్చి చెప్పితిని సరైనదా కాదా నీవే చెప్పుము.(84) అనగా ధర్మవర్మ ఇట్లనెను సజ్జనుడా! నేడే నాజన్మ సఫలమైనది , తపస్సు ఫలించినది, నేడు నీకు నేను కృతజ్ఞడనైతిని.(85) జన్మ అంతా అధ్యయం చేసికూడా బ్రహ్మచారిగానున్నచో వృథా గా మారినట్లే , ఎన్నో క్లేశముల సహించి భార్యను పొందిన తరువాత ఆమె ఆప్రియమును పలుకునదైనచో వృథా,(86)క్లేశేన కృత్వా కూపం వా స చ క్షారోదకో వా స చ క్షారోదకో వృథా| బహుక్లేశైర్జన్మ నీతం వినా ధర్మం తథా వృథృ||87

ఏవం మే యద్‌ వృథా నామ జాతం తత్సఫలం త్వయా || కృతం తస్మాన్నమస్తుభ్యం ద్విజేభ్యశ్చ నమో నమ:||88

సత్యమాహ పురా విష్ణు: కుమారాన్‌ విష్ణుసద్మని ||

నాహం తథాద్మి యజమానహవిర్వితానశ్చ్యోతద్‌ ఘృతప్లుతమదన్హు తభుజ్ముఖేన89

యద్ర్బహ్మణస్వ ముఖతశ్చరతోనుఘాసం | తుష్టస్య మయ్యవహితైర్నిజకర్మపాకై:||90

సర్వస్య ప్రభవో విప్రాస్తక్ష్కమంతాం ప్రసాదయే||91

త్వం చ కోసి న సామాన్య: ప్రణమ్యాహం ప్రసాదయే| ఆత్మానం ఖ్యాపయ మునే ప్రోక్తశ్చేత్యబ్రవం తదా||92

నారద ఉవాచ-

నారదోస్మి నృపశ్రేష్ఠ స్థానకార్థీ సమాగత: ప్రోక్తం చ దేహి మే ద్రవ్యం భూమిం చ స్థానహేతవే||93

యద్యపీయం దేవతానాం భూమిర్ద్రవ్యం చ పార్థివ| తథాపి యస్మిన్య: కాలే రాజా ప్రార్థ్య: స నిశ్చితమ్‌||94

స హీశ్వరస్యావతారో భర్తా దాతాభయస్య సః || తథైవ త్వామహం యాచే ద్రవ్యశుద్దిపరీప్సయా || పూర్వం మమాలయం దేహి దేయార్థే ప్రార్థనాపర:||95

అట్లే కష్టపడి బావిని తవ్విన తరువాత నీరు ఉప్పునీరు అయితే ఆ బావి వ్యర్థమైనట్లే , ఎన్నో క్లేశములతో సంపాదించిన జన్మకూడా ధర్మములేనిచో వృథా యగును.(87) అట్లే నా జన్మ వృథా కాబోగా, నీవు సఫలముచేసితివి, కనుక నీకు, ద్విజులకు నమస్కారము (88) పూర్వము వైకుంఠమున మహావిష్ణువు కుమారులకిట్లే చెప్పెను.(89) అగ్నియందు సమర్పింపబడి జాలువారుచున్న నేతితోమత్తిల్లిన అగ్నిదేవుని ద్వారా నేను యజమానుని హవిస్సును భుజించను పొందిన కర్మఫలములతో సంతోషించిన బ్రాహ్మణుని ముఖము చరించుదాని ననుభవించెదను (90) కనుక, నేను అశుభమతినై విప్రులయందే ఆప్రియము నొనరించితినో దానిని అన్నింటికీ సమర్థులైన మీరు క్షమించండి((91)నీవు నూ సామాన్యుడవు కాదు. ప్రసన్నుడవుగమ్మని నమస్కరించి పలుకుచుంటిని. నిన్ను తెలియపరుచుము, మునీశ్వరా! అనగా నేనిట్లంటిని (92) నారదుడిట్లు చెప్పెను. ఓ రాజా! నేను నారదుడను .స్థలమును కొరి వచ్చితిని స్థలము కై నాకు ద్రవ్యము ను, భూమిని ఇవ్వుము(93) ఈ భూమి నిజానికి దేవతల ద్రవ్యమైననూ, ఏ కాలమున ఎవరు పాలకులో వారినే ప్రార్థించవలెను (94) ఆ రాజే ఈశ్వరుని అవతారము ,భరించువాడు , అభయమునిచ్చువాడు అట్టే ద్రవ్యశుద్దిని కోరి నేను నిన్ను యాచించుచుంటిని దేయముగా నాకు ముందు నివాసమును కల్పించుమని ప్రార్ధించుచుంటిని.(95)

రోజోవాచ-

యది త్వం నారదో విప్ర రాజ్యమస్త్యఖిలం తవ| అహం హి బ్రాహ్మణానాం తే దాస్యం కర్తా న సంశయ||96

నారద ఉవాచ-

యద్యస్మాకం భవాన్‌ భక్తసత్తే కార్యం చ నో వచ:|| 97

సర్వం యత్తద్దేహి మే ద్రవ్యముక్తం | భువం చ మే సప్తగివ్యూతిమాత్రామ్‌|

భూయాత్త్వతోప్యస్య రక్షేతి సోపి మేనే త్వహం చింతయే చార్థశేషమ్‌||98

ఇతి శ్రీ స్కాందే మహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే

కౌమారికాఖండే నారదార్జునసంవాదే దానభేదప్రశంసావర్ణనం నామ చతుర్థోద్యాయ:

అనగా అపుడు రాజిట్లనెను విప్రుడా! నీవు నారదుడివే అయినచో ఈ రాజ్యమంతా నీదే నేను బ్రాహ్మణులకు, నీకు నిశ్చయముగా దాస్యము చేయగలవాడను(96) అనగా విని నారదుడనెను ''నీవు మా భక్తుడవైనచో మా మాటల ననుసరించవలెను రాజా! నేను అడిగిన ద్రవ్యమునంతా ఇచ్చి ఏడుగవ్యూతుల (28 మైళ్ళ) భూమి నిమ్ము, దానికి రక్షణను నీవే కల్పించుము, అనెను అతనట్లే అనగా నేను మిగిలిన ప్రయోజనమును గూర్చి చింతించసాగితిని.(98)

ఇది శ్రీ స్కాందమహాపురాణము మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున

నారదార్జునసంవాదమునందు దానభేదముల ప్రశస్తని వర్ణించుట అను నాల్గవ అధ్యాయము

పంచమోzధ్యాయ:

నారద ఉవాచ-

తతోహం ధర్మవర్మాణం ప్రోచ్య తిష్ఠేద్దనం త్వయి | కృత్యకాలే గమీష్యామీత్యాగమం రైవతం గిరిమ్‌||1

ఆసం ప్రముదితశ్చాహం పశ్యంస్తం గిరిసత్తమమ్‌ | ఆహ్వయానం నరాన్‌ సాధూన్‌ భూమేర్భుజమివోచ్ర్చితమ్‌||2

యస్మిన్నానావిధా వృక్షా: ప్రకాశంతే సమంతత: సాధుం గృహపతిం ప్రాప్య పుత్రభార్యాదయో యథా||3

ముదితా యత్ర సంతృప్తా వాశంతే కోకిలాదయ: | సద్గురోర్ఞానసంపన్నా యథా శిష్యగణా భువి||4

యత్ర తప్త్యా తపో మర్త్యా యథేప్సితమవాప్నుయ: | శ్రీ మహాదేవమాసాద్య భక్తో యద్వన్మనోరథమ్‌||5

తస్యాహం చ గిరే :పార్థ సమాసాద్య మాహాశిలామ్‌| శీతసౌరభ్యమందేన ప్రీణితోచింతయం హృది||6

తావన్మయా స్థానమాప్తం యదతీవ సుదుర్లభమ్‌ | ఇదానీం బ్రాహ్మణార్థేహం కుర్వే తావదుపక్రమమ్‌||7

బ్రాహ్మణాశ్చ విలోక్యా యే మే పాత్రతమా మతా:| తథాపి చాత్ర శ్రూయంతే వచాంసి శ్రుతివాదినామ్‌||8

అయిదవ అధ్యాయము

నారదుడు చెప్పసాగెను ఆ తరువాత నేను ఆ దనము నీ వద్దే వుండనిమ్ము అవసరము వచ్చినపుడు తీసుకొనెదనని ధర్మవర్మతో పలికి రైవతగిరికి వచ్చితిని.(1) భూమికి భుజమానన్నట్లు ఎత్తుగా నుండి సాధువుల నాహ్వానించు చుండిన ఆ గొప్ప పర్వతమును చూచి మిక్కిలి సంతోషించితిమి. (2) సద్బుద్దిగల గృహయజమానిని పొంది భార్యాపుత్రులు ఎల్లెడలా ప్రకాశించునట్టు ఆ పర్వతము పై అనేకరకాల వృక్షములు విలసిల్లుచుండెను.(3) సద్గురువు నుండి జ్ఞానమును పొంది శిష్యగణములు తృప్తినొందినట్లు, ఆ పర్వతముపైని కోకిలమొదలగు పక్షులు సంతృప్తిని పొంది కూయుచుండెను (4) శ్రీ మహాదేవుని చేరి భక్తుడు తన మనోరథమును పొందినట్లు ఆ పర్వతమునుచేరి అక్కడ తపమాచరించు నరులు కోరిన దానిని పొందెను.(5) పార్థా! అట్టి పర్వత శిలనొక దానిని చేరి నేను చల్లని పిల్లవాయువు నానందించుచూ ఇట్లు తలంచితిని(6) దుర్లభ##మైన స్థలమును చివరకు చేరితిని ఇక బ్రాహ్మణుని కొరకు నేను ఉపక్రమించెదను(7) ఎవరైతే అత్యుత్తములో యోగ్యతములో అట్టి బ్రాహ్మణులను నేను చూడవలెను. అయినా ఈ విషయమున శ్రుతివేత్తలిట్లందురు.(8)

న జలోత్తరణ శక్తా యద్వన్నౌ కర్ణవర్జితా | తద్వచ్రేష్ఠోస్యనాచారో విప్రో నోద్దరణక్షమ||9

బ్రాహ్మణో హ్యనదీయానస్తృణాగ్నిరివ శామ్యతి | తసై#్మ హవ్యం న దాతవ్యం న హి భస్మని హుయతే ||10

దానపాత్రమతిక్రమ్య యదపాత్రే ప్రదీయతే| తద్దత్తం గామతిక్రమ్య గర్దభస్య గవాహ్నికమ్‌||11

ఊషరే వాపితం బీజం భిన్నభాండే చగోదుహమ్‌| భస్మనీవ హుతం హవ్యం మూర్ఖే దానమశాశ్వతమ్‌||12

విధిహీనే తథా పాత్రే యో దదాతి ప్రతిగ్రహమ్‌ | న కేవలం హి తద్యాతి శేషం పుణ్యం ప్రణశ్యతి ||13

భూరాప్తా గౌస్తథా భోగా : సువర్ణం దేహమేవ చ | అశ్వశ్చక్షుస్తథా వాసో ఘృతం తేజిస్తిలా : ప్రజా:||14

ఘ్నంతి తస్మాదవిద్వాంస్తు బిభియాచ్చ ప్రగ్రహాత్‌| స్వల్పకేనాప్యవిద్వాంస్తు పంకే గౌరివ సీదతి ||15

తస్మాద్యే గూఢతపసో గూఢస్వాద్యాయ సాధకా :| స్వదారనిరతా: శాంతాస్తేషు దత్తం సదాక్షయమ్‌||16

దేశే కాల ఉపాయేన ద్రవ్యం శ్రద్దాసమన్వితమ్‌| పాత్రే ప్రదీయతే యత్తత్సకలం ధర్మలక్షణమ్‌||17

న విద్యయా కేవలయా తపసా వాపి పాత్రతా | యత్ర వృత్తమివే చోభే తద్ది పాత్రం ప్రచక్షతే||18

తెరచాపలేని నావ నీటిని దాటించనట్లే శ్రేష్టుడైననూ ఆచారము లేని విప్రుడు కూడా సంసారమునుండి దాటించలేడు.(9)అధ్యయనము లేని బ్రాహ్మణుడు గడ్డిలో నిప్పువలె త్వరగా శమించును. అట్టి వానికి హవ్యమునివ్వరాదు భస్మములో హవ్యము నర్పించరుకదా! (10) దానమునకు యోగ్యుడైన వానిని వదిలి అయోగ్యునికి దానమిచ్చినచో, అది గోవుని విడిచి గాడిదకు గోవుకి తగిన క్రియలను నిర్వహించుటవంటిది.(11) మూర్ఖునికి దానమిచ్చినచో అది చవిటి భూమిలో విత్తిన విత్తనము వలె,పగలిన కుండలో ఆవు పాలవలె, ఋడిదలో పోసిన హవ్యము వలె అశాశ్వతము (12) విధిలేనివానికి , అయోగ్యునికి దానమిచ్చినచో అది నశించడమే కాదు, మిగిలిన పుణ్యము కూడా నశించును (13) భూమి, గోవు, భోగములు ,బంగారము, దేహము, గుర్రము, కన్ను, వస్త్రము,నెయ్యి ,నిప్పు, నువ్వలు, సంగతి(14) వీనిని దానము తీసుకున్నచో నశింపజేయును. కనుక విద్వాంసుడు గాని వాడు వీనిని దానము తీసుకొనుటనుండి భయపడవలెను ఏకొద్దిగా తీసుకొన్నా బురదలో ఆవువలె మునిగిపోవును(15) కనుక, గూఢమగు తపము గలిగి, గూఢమైన స్వాధ్యాయముగలిగి తన భార్యయందే ఆసక్తిగల శాంతులకు దానమిచ్చినదే శాశ్వతము(16) దేశకాలముల నెరిగి శ్రద్దతో యోగ్యునికి దానమిచ్చినదే ధర్మము (17) కేవల విద్యతో గానీ, తపస్సుతో గాని యోగ్యులు కారు .ఎవరిలో శీలము విద్య, తపస్సు మూడు వుంటాయో వారే యోగ్యులు అనబడుదురు.(18)

తేషాం త్రయాణాం మధ్యే చ విద్యాముఖ్యో మహాగుణా:| విద్యాం వినాంధవద్వి ప్రాశ్చక్షుష్మంతో హి తే మతా:||19

తస్మాచ్చక్షుష్మతో విద్వాన్‌ దేశే దేశే పరీక్షయేత్‌| ప్రశ్నాన్‌ యే మమ వక్ష్యంతి తేభ్యో దాస్యామ్యహం తత:||20

ఇతి సంచింత్య మనసా తస్మాద్దేశాత్‌ సముత్థిత:| ఆశ్రమేషు మహర్షీణాం విచరామ్యస్మి ఫాల్గున||21

ఇమాన్‌ శ్లోకాన్‌ గాయమాన: ప్రశ్నరూపాన్‌ శృణుష్వ తాన్‌ | మాతృకాం కో విజానాతి కతిధా కీదృశాక్షరామ్‌||22

పంచపంచాద్భుతం గేహం కో విజానాతి వా ద్విజ: | బహురూపాం స్త్రీయం కర్తుమేకరూపాం చ వేత్తి క: 23

కో చిత్రకథాబంధంవేత్తిసంసారగోచర :| కో వార్ణవమహాగ్రాహం వేత్తి విద్యాపరాయణ:||24

కో వా వాష్టవిధం బ్రాహ్మణ్యం వేత్తి బ్రాహ్మణసత్తమ:| యుగానాం చ చతుర్ణాం వా కో మూలదివసాన్‌ వదేత్‌||25

చతుర్ధశమనూనాం వా మూలవాసరం వేత్తిక: | కస్మింశ్చైవ దినే ప్రాప పూర్వం వా భాస్కరో రథోమ్‌||26

ఉద్వేజయతి భూతాని కృష్ణాహిరివ వేత్తిక : కో వాస్మిన్‌ ఘోరసంసారే దక్షదక్షతమో భ##వేత్‌||27

పంథానావసి ద్వౌ కశ్చిద్వేత్తి వక్తి చ బ్రాహ్మణ : | ఇతి మే ద్వాదశ విదుర్ర్బాహ్మణోత్తమా:||28

తే మే పూజ్యతమాస్తేషామహామారాదకశ్చిరమ్‌||

ఆ మూడింటిలోనూ విద్యయే ముఖ్యమైన మహాగుణము. విద్యలేని విప్రులు కళ్ళున్న గుడ్డివారు.(19) కనుక విద్యాంసుడు ప్రతిదేశములో ఈ జ్ఞానులను పరీక్షించవలెను. ఎవరూ నా ప్రశ్నలకు సమాధానములనిత్తురో వారికే ఇచ్చెదను. (20) అని తలచి ఆప్రదేశమునుండి బయలుదేరి మహర్షుల ఆశ్రమముల యందు చరించుచూ నుంటిని.(31) ప్రశ్నరూపముననున్న ఈ శ్లోకములను గానము చేయుచుంటిని వినుము ,,మాతృక ఏమిటి? ఎన్నివిధములు? ఎట్టిఅక్షరములు గలది? (22) పది అద్భుతములతో గూడిన ఇల్లునెవరెరుగుదురు? అనేక రూపములు గలస్రీని ఒక రూపమున చేయగలవాడెవడు? (23) సంసారమున నుండి చిత్రకథాబంధమును తెలిసిన వాడెవడు? విద్యా పరాయణుడైన వాడెవడు సముద్రములోని భయంకర మొసలినెరుగును ?(24) ఏ బ్రామ్మణశ్రేష్టుడు ఎనిమిది విధములుగా నున్న బ్రాహ్మణభావమునెరుగును? నాలుగు యుగములు మూలదివసములను తెలుపువాడెవడు? (25) పదునాలుగు మనువుల మూలదినమేది ? ఉద్వేగపరుచునది ఏది? ఈ ఘోర సంసారమునఅమిత దక్షుడెవరు?(27) ఇక రెండు మార్గములను గూర్చి తెలిసి చెప్పగలవాడున్నాడా? ఈ నాపన్నెండు ప్రశ్నలకు సమాదానములను తెలిసిన బ్రాహ్మణోత్తములు నాకు అత్యంత పూజ్యులు వారికి నేను ఎల్లప్పటికీ ఆరాధకుడను.(28)

ఇత్యహం గాయామానో వై భ్రమిత: సకలాం మహీమ్‌ ||29

తే చాహుర్దు: ఖ్యాతా: ప్రశ్నాస్తే కుర్మహే నమ:| సకలాం పృథ్వీం విచింత్యాలబ్దబ్రాహ్మణ: || 30

హిమాద్రిశిఖరాసినో భూయశ్చింతామవాప్తవాన్‌| సర్వే విలోకితా విప్రా: కిమత : కర్తుముత్సహే||31

తతో మే చింతయానస్య పునర్జాతా మతిస్వియమ్‌ | అద్యాపి న గతశ్చాహం కలాపగ్రామముత్తమమ్‌||32

యస్మిన్విప్రా: సంవసంతి మూర్తానీవ తపాంసి చ | చతురశీతిసాహస్రా: శ్రుతాధ్వయనశాలిన:||33

స్థానే తస్మిన్‌ గమిష్యామీత్యుక్త్యాహం చలితస్తదా | ఖేచరో హిమమాక్రమ్య పరం పారం గతస్తత:||34

అద్రాక్షం పుణ్యభూమిస్థం గ్రామరత్నమహం మహత్‌ | శతయోజన విస్తీర్ణం నానావృక్షసమాకులమ్‌||35

యత్ర పుణ్యవతాం సంతి శతశ: ప్రవరాశ్రమా: | సర్వేషామపి జీవానాం యత్రోన్యోన్యం న దుష్టతా||36

యజ్ఞభాజాం మునీనాం యదుపకారకరం సదా| సతాం దర్మవతాం యద్వదుపకారో నశామ్యతి||37

మునీనాం యత్ర పరమం స్థానం చాప్యవినశకృత్‌ | స్వాహాన్వధావ షట్‌కారహంతకారో న నశ్యతి||38

యత్ర కృతయుగస్యార్థం బీజం పార్థావశిష్యతే | సూర్యస్య సోమవంశస్య బ్రాహ్మణానాం తథైవ చ||39

స్థానకం తత్సమాసాద్య ప్రవిష్టోహం ద్విజాశ్రమాన్‌||

ఇట్లు గానముచేయుచూ నేను భూమిపైనంతటా తిరిగితిని. (29) అందరూ నా ప్రశ్నలను విని కష్టమైనవి. నీకు నమస్కారములనిరి ఇట్లు భూమి పై నంతటా తిరిగి తగిన బ్రాహ్మణుడు దొరకక నేను హిమాలయ శిఖరము పై కూర్చుండి మరల చింతనోందితిని. అందరు విప్రుల జూచితిని ఇక నేనేమి జేయవలెను? (31) అట్లాలోచించుచుండిన నాకిట్లు తట్టినది. ఈ నాటికి నేను ఉత్తమగ్రామమైన కలాపగ్రామమునకు వెళ్ళలేదు(32) మూర్తీభవించిన తపస్సు వలెనున్న విప్రులక్కడ నివసించెదరు. ఎనభైనాలుగువేల మంది వేదాధ్యయనపరులున్న గ్రామమది (33) అక్కడికే వెళ్ళెదనని తలచి ఆకాశమున చరించువాడనై మంచును దాటి వేరొక తీరము చేరితిని.(34) అక్కడ పుణ్యభూమిన నూరు యోజనములలో అనేక వృక్షములతో విలసిల్లిన గ్రామరత్నమునుచూచితిని. (35) అక్కడ పుణ్యవంతులు శ్రేష్ఠమైన ఆశ్రమములు నూర్లకొలది గా నుండెను. జీవులన్ని పరస్పరవైరము లేకుండినవి.(36) యజ్ఞములనాచరించు మునులను ఎల్లప్పుడూ ఉపయోగపడునది సత్ఫురుషులకు , ధర్మవంతులకు ఉపకరించునది ఆ గ్రామము (37) అక్కడ మనులకు శాశ్వతస్థానముండినది స్వాహా, స్వధా,వషట్‌ ,హంత అనునని ఎల్లప్పుడూ వినబడుచుండినవి.(38) పార్థా! కృతయుగము యొక్క సగము బీజమక్కడ మిగిలినది సూర్యచంద్రవంశీయుల, బ్రాహ్మణుల స్థానమైన ఆ దేశమును చేరి ద్విజాశ్రమములను ప్రవేశించితిని.(39)

తత్ర తే వివిధాన్‌ వాదాన్‌ విదంతే ద్విజోత్తమా:||40

పరస్పరం చింతయానా వేదా మూర్థిదరా యథా| తత్ర మేధావిన: కేచిదర్థమన్యై: ప్రపూరితమ్‌||41

విచిక్షిపుర్మహాత్మానో నభోగతమివామిషమ్‌ | తత్రాహం కరముద్యమ్య ప్రోవాచం పూర్యతాం ద్విజా:||42

కాకారవై: కిమేతైర్వో యద్యస్తి జ్ఞానశాలితా| వ్యాకురుధ్వం తత: ప్రశ్చాన్‌ మమ దుర్విషహాన్‌ బహూన్‌ ||43

బ్రాహ్మణా ఊచు:-

వద బ్రాహ్మణ ప్రశ్నాన్‌ స్వాన్‌ శ్రుత్వాధాస్యామహే వయమ్‌| పరమో హ్యేష నో లాభ: ప్రశ్నాన్‌ పృచ్చతి యద్బవాన్‌||44

అహంపూర్వికయా తే వై న్యషేదంత పరస్పరమ్‌| అహం పూర్వమహం పూర్వమితి వీరా యథా రణ||45

తతస్తానబ్రవం ప్రశ్నానహం ద్వాదశ పూర్వకాన | శ్రుత్వా తే మామవోచంత లీలాయంతో మునీశ్వరా:||46

కిం తే ద్విజ బాలప్రశ్నైరమీభి : స్వల్పకైరపి| అస్మాకం యన్నిహీనం త్వం మన్యసే న బ్రవీత్వమూన్‌ ||47

తతోతివిస్మితశ్చాహం మన్యమాన: కృతార్థతామ్‌| తేషాం నిహీనం సంచింత్య ప్రోవాచం ప్రబ్రవీత్వయమ్‌||48

తత: సుతనునామా స బాలోబాలోభ్యువాచ మామ్‌ | మమ మందాయతే వాణీ ప్రశ్నై: స్వల్పైస్తవ ద్విజ||

తథాపి వచ్మి మాం యస్మాన్నిహీనం మన్యతే భవాన్‌||49

అక్కడ ద్విజోత్తములు వివిధ వాదములను చేయుచునుందురు(40) మూర్తీభవించిన వేదముల వలె పరస్పరము విషయముల చర్చించెదరు (41) మేధావులు కొందరు వేరొకరు నింపిన అర్థమును అకాశమున మాంసపు ముద్దవలెవిదిల్చివేసిరి అపుడు నేను చేత్తుతెత్తి నమస్కరించుచూ ఆ బ్రాహ్మణులతో నిట్లంటిని (42) బ్రాహ్మణులారా! పూరించుడు! ఈ కా కా,రవములతో ప్రయోజనమేమి? జ్ఞానమున్నచో నా ఈ కష్టమైన ప్రశ్నలకు సమాధానమివ్వండి(43) అనగా బ్రాహ్మణులిట్లనిరి. బ్రాహ్మణుడా! నీ ప్రశ్నలేమిటో చెప్పుము విని గ్రహించెదము. నీవు ప్రశ్నలడుగుట మాకు లాభ##మేకదా!

(44) అని వారు నేనంటే ముందని రణములో వీరులవలె ఒకరినొకరు అడ్డగించిరి (45) అప్పుడునేను పన్నెండు ప్రశ్నలనడగగా అ ద్విజులు విని తేలికగా గ్రహించి ఇట్లనిరి (46) ద్విజుడా! ఈ చిన్నపిల్లల ప్రశ్నలతో ఏమి లాభము? అయిననూ,మాలో అతి చిన్నవాడిగా ఎవరిని భావింతువో అతను సమాధానమివ్వగలడు .(47) అనగా నేను ఆశ్చర్యపడి, కృతార్థుడనైతినని సంబరపడి వారిలో చిన్నవానిని అడిగితిని. (48) అపుడు సుతనువను పేరుగల ఆ బాలుడు కాని బాలుడు (బాలురలో జ్ఞాని) నాతోఇట్లనెను ద్విజుడా! ఈ నీచిన్న ప్రశ్నలతో నా వాక్కు నెమ్మదించినది (నోరు పెకలడం లేదు) అయిననూ నన్నే చిన్నవానిగా నీవు తలచినందున చెప్పెదను.(49)

అక్షరాస్తు ద్విపంచాశన్మాతృకాయా: ప్రకీర్తితా:||50

ఓంకార : ప్రథమస్తత్ర చతుర్థశ స్వరాస్తథా | స్పర్శాశ్పైవ త్రయస్త్రింశదనుస్వారస్తథైవ చ||51

విసర్జనీయశ్చ పరో జిహ్వామూలీయ ఏవ చ | ఉపధ్మానీయ ఏవాపి ద్విపంచాశదమీ స్మృతా:||52

ఇతి తే కథితా సంఖ్యా అర్థం చైషాం శ్రుణు ద్విజ | అస్మిన్నర్థే చేతిహాసం తవ వక్ష్యామి య: పురా|| 53

మిథిలాయాం ప్రవృత్తోభూద్‌ బ్రాహ్మణస్య నివేశ##నే | మిథిలాయాం పురా పుర్యాం బ్రాహ్మణ : కౌథుమాభిధ:||54

యేన విద్యా: ప్రవఠితా వర్తంతే భువి యాద్విజ| ఏకత్రింశత్సహస్రాణి వర్షాణాం స కృతాదర:||55

క్షణమప్యనవచ్చిన్నం పఠిత్వా గేహవానభూతే| తత: కేనాపి కాలేన కౌథుమస్యాభవ్సుత:||56

జడవద్వర్తమాన : స మాతృకాం ప్రత్యపద్యత || పఠిత్వా మాతృకామాన్యన్నాధ్యేతి స కథంచన||57

తత: పితా ఖిన్నరూపీ జడం తం సమభాషత| అధీష్వ పుత్రకాధీష్వ తవ దాస్యామి మోదకాన్‌ ||58

అథాన్యసై#్మ ప్రదాస్యామి కర్ణావుత్పాటయామి తే||59

సుతనువిట్లు చెప్పెను- మాతృకలనగా యాభయిరెండు అక్షరములు.(50) వానిలో ఓంకారము మొదటిది తరువాత పదునాలుగు స్వరములు (అచ్చులు) ముప్పయిమూడు హల్లులు, అనుస్వారము(51) విసర్గ,జిహ్వామూలీయ, ఉపద్మానీయములు కలిపి యాభయిరెండు,(52) నీకు సంఖ్య చెప్పితిని. అర్థమును కూడా చెప్పెదను వినుము. పూర్వము జరిగిన దానిని ఇతిహాసమును చెప్పెదను.(53) పూర్వమితి మిథిలానగరమున బ్రాహ్మణుని ఇంట జరిగినది. పూర్వము మిథిలా నగరమున కౌథుముడను బ్రాహ్మణుడుండువాడు (54) అతను భూమిపై నున్న విద్యలనన్నింటినీ చక్కగా చదివెను. ముప్పయి ఒక్కవేల సంవత్సరాలు నిరంతరముగా చదివి గృహస్థుడాయెను. కొంతకాలమునకు అతనికి కొడుకు పుట్టేను.(56) జడుని వలె వుండుచూ ఆ బ్రాహ్మణబాలుడు మాతృకలనే నేర్చేను మాతృకలను తప్పవేరొకదానినెప్పుడూ చదవడు.(57) అపుడు తండ్రి ఖిన్నుడై ఆ జడుడగు కుమారునితో నిట్లనెను - 'కుమారా! చదువు నాయనా చదువు! చదివితే నీకు లడ్డూలనిచ్చెదను.(58) లేనిచో వానినివేరే ఎవరికైనా ఇచ్చెదను .చదవనిచో నీ చెవులు పిండెదను.(59)

పుత్ర ఉవాచ-

తాత కిం మోదకార్థాయ పఠ్యతే లోభ##హేతవే| పఠనం నామ యత్పుంసాం పరమార్థం హితత్‌ స్మృతమ్‌||60

కౌథుమ ఉవాచ-

ఏవం తే వదమానస్య ఆయుర్భవతు బ్రహ్మణ: సాధ్వీ బుద్దిరియం తేస్తు కుతో నాధ్యేష్యత: పరమ్‌||61

పుత్ర ఉవాచ-

తాతస్వరం పరిజ్ఞేయం జాతమత్రైవ వై యతః | తతఃపరం కంఠశోష కిమర్థం క్రియతే వద||62

పితోవాచ-

విచిత్రం భాషసే బాల జ్ఞాతో త్రార్థశ్చ కస్త్వయా| బ్రూహి పునర్వత్స శ్రోతుమిచ్చామి తే గిరిమ్‌||63

పుత్ర ఉవాచ-

ఏకత్రింశత్సహస్రాణి పఠిత్వాపి త్వయా పిత:| నానాతర్కాన్‌ భ్రాంతిరేవ సంధితా మనసి స్వకే||64

అయమయం చాయమితి ధర్మో యో దర్శనోదిత:| తేషు వాతాయతే చేతస్తవ తన్నాశయామి తే ||65

ఉపదేశం పఠస్యేన నైవార్థజ్ఞోసి తత్త్వత: పాఠమాత్రా హి యే విప్రా ద్విపదా :పశవో హి తే||66

తత్తే బ్రవీమి తద్వాక్యం మోహమార్తండమద్భుతమ్‌||67

అకార: కథితో బ్రహ్మ ఉకారో విష్ణురుచ్యతే | మకారశ్చ స్మృతో రుద్రస్త్రయశ్చైతే గుణా: స్మృతా:||68

అర్థమాత్రా చ యా మూర్థ్ని పరమ: స సదాశివ: ఏవమోంకారమాహాత్మ్యం శ్రుతిరేషా సనాతనీ||69

అనగా ఆ పుత్రుడిట్లనెను- నాయనా' ! లడ్డులకొరకు లోభముతో చదివెదమా? పఠనమంటే పురుషులకు పరమార్థమని గదా చెప్పబడినది(60) అనగా తండ్రి ఇట్లనను. ఆహా! ఇట్లు పలుకుచున్న నీకు బ్రహ్మ ఆయుష్షు కలుగుగాక! కానీ, అధ్యయనము చేయని నీకీ మంచి బుద్ది ఎట్లు కలిగినది? (61) అనగా పుత్రుడిట్లనెను నాయనా! తెలియవలసినది తెలిసినది ఇక కంఠశోషను ఎందుకు చేయవలెనో చెప్పుము (62) అనగా తండ్రి ఇట్లనెను బాలకా! విచిత్రముగా మాటలాడుచుంటివి నీకు తెలిసిన అర్థమేమి? చెప్పుము నీమాటలను వినగోరుచుంటిని(63) అనగా ఆ బాలకుడిట్లనెను. నాయనా! అనేక తర్కములను ముప్పయి ఒక సంవత్సరాలు చదివి కూడా నీ మనసున భ్రాంతి నిలిచినది (64) ఇది ఇట్లు అని దర్శములందు నీ మనసు ఊగిసలాడుచున్నది దానిని తొలగించెదను (65) ఉపదేశమును పఠించుచుంటివి గానీ తత్త్వమును తెలియకుంటివి. పఠించుటమాత్రమే చేయు విప్రులు రెండు కాళ్ళ పశువులే (66) ఇక నీకు మోహమును తొలగింపజేయు అద్భుతమైన వాక్యమునుచెప్పెదను వినుము.(67) అకారమనగా బ్రహ్మ ఉకారము విష్ణువు మకారమురుద్రుడు ఈ ముగ్గురు మూడుగుణాలే (68) పై నున్న అర్థమాత్ర సదాశివుడు ఇది ఓంకార మాహాత్మ్యమని సనాతన శ్రుతి చెప్పుచున్నది.(69)

ఓంకారస్య చ మాహాత్మ్యం యాథాత్మ్యేం న శక్యతే | వర్షాణామయుతేనాపి గ్రంథకోటిభిరేవ వా||70

పునర్యత్సారసర్వస్వం ప్రోక్తం తచ్చూయతాం పరమ్‌| అ: కారాంతా అకారాద్యా మనవస్తే చతుర్థశ||71

స్వాయంభువశ్చ స్వారోచిరౌత్తమౌ రైవతస్తథా | తామనశ్చాక్షుష: షష్ఠస్తథా వైవస్వతోzధునా||72

సావర్ణిబ్రహ్మసావర్ణీ రుద్రసావర్ణిరేవ చ| దక్షసావర్ణిరేవాసి ధర్మసావర్ణిరేవ చ||73

రౌచ్యో భౌత్యస్తథా చాపి మనవొపి చతుర్థశ| శ్వేత :పాండుస్తథా రక్తస్తామ్ర:పీతశ్చ కపిల:||74

కృష్ణః శ్యామస్తథా ధూమ్ర: సుపిశంగ: పిశంగక :| త్రివర్ణ :శబలో వర్ణై: కర్కంధుర ఇతి క్రమాత్‌||75

వైవస్వత: క్షకారశ్చ తాత కృష్ణ: ప్రదృశ్యతే| కకారాద్యా హకారాంతాస్త్రీంశచ్చ దేవతా:||76

కకారాద్యాష్ఠకారాంతా అదిత్యా ద్వాదశస్మతా:| ధాతా మిత్రోర్యమా శక్రో వరుణశ్చాంశురేవ చ||77

భగో వినస్వాన్‌ పూషా చ సవితా దశమస్తథా| ఏకాదశస్తథా త్వష్టా విష్ణుర్ద్వాదశ ఉచ్యతే||78

జఘన్యజ: స సర్వేషామాదిత్యానాం గుణాదిక:| డకారాద్యా బకారాంతా రుద్రాశ్చైకాదశైవ తు||79

ఓంకారము యొక్క గొప్పతనమును వాస్తవముగా తెలియజేయుట వేలకొలది సంవత్సరములచే గానీ కోటికొలది గ్రంథములతో గానీ శక్యము గాదు.(70) అయిననూ సారమనుదానినంతా చెప్పెదను వినుము. అకారము నుండి అ: వరకు పదునాలుగు మనువులు.(71) సాయంభువు ,స్వారోచి, ఔత్తమ, రైవతుడు, తామసుడు, చాక్షుషుడు, వైవస్వతమునువు ఇప్పుడుండువాడు (72) అట్లే సావర్ణి, బ్రహ్మసావర్ణి, రుద్ర సావర్ణి, దక్షసావర్ణి, అనువారు(73) రౌచ్యుడు,భౌత్యుడను పదునలుగురు మునువులు తెలుపు, పాండురము, ఎరుపు,రాగివన్నె,పసుపు, కపిలము(74) నలుపు, గాఢనలుపు, బూడిదవన్నె,ధూళివర్ణము, పిశంగకము, మువ్వన్నె, చిత్రము, అన్నిరంగుల కలయిక అనునవి క్రమముగా వీని వర్ణములు (75) వైవస్వతుడు క్షకారము వర్ణము నలుపు, కకారము మొదలు హకారము వరకు ముప్పదిమూడు దేవతలు(76) కకారము నుండి ఠ' వరకు పన్నెండుగురు ఆదిత్యులు వారు ధాత , మిత్రుడు, అర్యముడు, శక్రుడు, వరుణుడు,అంశువు(77) మరియు భగుడు, వినస్వంతుడు, పూష, సవిత అను పదవవాడు, పదకొండవవాడు విష్ణువు(78) గుణముల చేత అతనాదిత్యులందరిలో పెద్దవాడు జఘన్యుని సంతానము, డాకారము నుండి బకారము వరకు పదకొండుగురు రుద్రులు(79)

కపాలీ పింగళో భీమో విరూపాక్షో విలోహిత: | అజక : శాసన: శాస్తా శంభుశ్చండో భవస్తథా||80

భకారాద్యా :షకారాంతా అష్టౌ హి వసవో మతా:| ధ్రువో ఘెరశ్చ సోమశ్చ ఆపశ్చైవ నలోనిల:||81

ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ అష్టౌ తే వసవ: స్కృతా | తౌ హశ్చేత్యశ్వినౌ త్రయస్త్రింశదిమే స్మృతా:||82

అనుస్వారో విసర్గశ్చ జిహ్వామూలీయ ఏవ చ | ఉపధ్మానీయ ఇత్యేతే జరాయుజాస్తథాండజా:||83

స్వేదజాశ్చోద్భిజాశ్చేతి తత జీవా: ప్రకీర్తితా:| భావార్థ: కథితశ్చాయం తత్వార్థం శ్రుణు సాంప్రతమ్‌||84

యే పుమాంస్త్వమూన్‌ దేవాన్‌ సమాశ్రిత్య క్రియాపరా:| అర్థమాత్రాత్మకే నిత్యే పదే లీనాస్త ఏవ హి||85

చతుర్ణాం జీవయోనీనాం తదైవ పరిముచ్యతే | యదాభూన్మనసా వాచా కర్మణా చ యజేత్సురాన్‌||86

యస్మిన్‌ శాస్త్రే త్వమీ దేవా మానితా నైవ పాపిభి: తచ్చాస్త్రం హి న మంతవ్యం యది బ్రహ్మ స్వయం వదేత్‌||87

అమీ చ దేవా : సర్వత్ర శ్రౌతే మార్గే ప్రతిష్ఠితా:| పాషండశాస్త్రే సర్వత్ర నిషిద్దా: పాపకర్మభి:||88

తదమూన్యే వ్యతిక్రమ్య తపోదానమథో జపమ్‌ | ప్రకుర్వంతి దురాత్మానో వేపంతో మరుత: పథి||89

అహో మోహస్య మాహాత్మ్యం పశ్యతావిజితాత్మనామ్‌ | పఠంతి మాతృకాం పాపా మన్యంతే న సురానిహ|||90

కపాలి, పింగళి, భీమ, విరూపాక్ష, విలోహిత,అజక, శాసన, శాస్త, శంభు, చండ, భవ, (80) అనువారు ఏకాదశరుద్రులు. భకారమునుండి షకారము వరకు ఎనిమిది వస్తువులు వీరు ధ్రువ, ఘోర, సోమ,ఆప,నల ,అనిల, ప్రత్యూష, ప్రభాస అంటారు. ఇద్దరు అశ్వినీ దేవతలు హకారము, మొత్తము ముప్పది మూడు (82) అనుస్వారము, విసర్గ, జిహ్వామూలీయము, ఉపధ్మానీయము అనునవి జరాయుజ, అండజములు(83) స్వేదజములు, ఉద్భిజములు అను జీవములు, భావార్థమును చెప్పితిని ఇక తత్త్వార్థమును చెప్పెదను వినుము (84) ఈ దేవతలనాశ్రయించి క్రియలోనర్చు వారే అర్థరూపమగు నిత్యపదమునందు లీనమయ్యెదరు.(85)మనస్సుచే , వాక్కుచే, కర్మచే, దేవతల పూజించినపుడే నాలుగు జీవయోనులనుండి ముక్తుడగును (86) ఏ శాస్త్రమున ఈ దేవతలు పాపులచేత పూజింపబడరో దానిని బ్రహ్మస్వయముగా చెప్పిననూ శాస్త్రముగా భావించరాదు.(87) ఈ దేవతలు అంతటా శ్రౌతమార్గము ప్రతిష్టింపబడినారు.(88) ఈ దేవతలను కాదని తపస్సును,దానమును, జపమును, చేయు దురాత్ములు వాయుమార్గముననే వణకుచునుందురు (89) ఆత్మను జయించని వారు మోహము యొక్క గొప్పతనము చూడుడు. మాతృకలను మాత్రమే చదువుతారు కానీ దేవతలను అంగీకరించరు.(90)

సుతనురువాచ-

ఇతి తస్య వచ: శ్రుత్వా పితాభూదతివిస్మిత:| పప్రచ్ఛ బహున్‌ ప్రశ్నాన్‌ సోప్యవాదీత్తధా తథా||91

మయాపి తవ ప్రోక్తోయం మాతృకాప్రశ్న ఉత్తమ: | ద్వితీయం శ్రుణు తం ప్రశ్నం పంచపంచాద్భుతం గృహమ్‌||92

పంచభూతాని పంచైవ కర్మజ్ఞానేంద్రియాణి చ| పంచ పంచాపి విషయం మనోబుధ్యహమేవ చ||93

ప్రకృతి: పురుషశ్పైవ పంచవింశ : సదాశివ:| పంచపంచభిరేతైస్తు నిష్పన్నం గృహముచ్యతే||94

దేహమేతదిదం వేద తత్త్వతో యాత్యసౌ శివమ్‌| బహురూపాం స్త్రియం ప్రాహుర్బుద్దింవేదాంతవాదిన:||95

సా హి నానార్థభజనాన్నానారూపం ప్రపద్యతే | ధర్మసై#్యకస్య సంయోగాద్భహుధాప్యేకైవ సా||96

ఇతి యో వేద తత్త్వార్థం నాసౌ నరకమాప్నయూత్‌ | మునిభిర్యచ్చ న ప్రోక్తం యన్న మన్యేత దైవతాన్‌||97

వచనం తద్భుధా: ప్రాహుర్భంధం చిత్రకథం త్వితి| యచ్చ కామాన్వితం వాక్యం పంచమం వాప్యత: శ్రుణు||98

ఏకో లోభో మహాన్‌ గ్రాహో లోభాత్పాపం ప్రవర్తతే| లోభాత్‌ క్రోధ : ప్రభవతి లోభాత్కామ: ప్రవర్తతే||99

లోభాన్మోహశ్చ మాయా చ మాన: స్తంభ: పరేప్సుతా| అవిద్యాప్రజ్ఞతా చైవ సర్వం లోభాత్‌ ప్రవర్తతే||100

సుతునువు చెప్పెను అతని మాటలను విని తండ్రి మిగుల విస్మయము నొందెను. అనేక ప్రశ్నలనడుగగా ఆ బాలుడు వానికి తగిన సమాధానములనిచ్చెను. (91) నేనుకూడా నీకు మాతృకా ప్రశ్నను ఉత్తమమగు దానినిచెప్పితిని. ఇక ఐదైదుతో నున్న గృహము గూర్చిన రెండవ ప్రశ్నకు సమాధానమును వినుము (92) మహాభూతములు ఐదు, కర్మేంద్రియాలైదు,జ్ఞానేంద్రియాలూ ఐదే, ఇంద్రియవిషయాలూ ఐదు మనస్సు బుద్ది, అహంకారము, ప్రకృతి, పురుషుడు ఐదు ఇరువదియైదవవాడు సదా శివుడు ఈ ఇరవై అయిదుతో కూడినదే గృహమనబడును (94) ఈ దేహము గృహమే నిజానికిది శివుని చేరును. వేదాంతవేత్తలు బహురూపిణియగు బుద్దియే స్త్రీయందరు. (95) ఆ బుద్ది నానా విషయములను పొంది నానా రూపములను పొందును. ఒకే ధర్మముతో సంయెగమున్నందున అనేక విధములుగా నున్ననూ ఏకరూపయే(96) ఈ తత్త్వార్థమును తెలిసినవాడు నరకమును పొందడు మునులుచెప్పనిదీ ఈ అర్థము. దేవతలనంగీకరించినట్లుండు ఈ వచనమునుపండితులు బంధమని, చిత్రకథయని అందురు (97) కామాన్వితమగు ఐదవదానిని చెప్పెద వినుము.(98) లోభమొక్కటే పెద్ద మొసలి లోభమునుండియేపాపము, క్రోథము, కామములు కలుగును(99) లోభమువల్లనే మోహము ,మాయ , మానము,స్తంభము, ఇతరమును పొందు , కోరిక, అవిద్య, అజ్ఞానములనునవన్నీ కలుగును.(100)

హరణం పరవిత్తానాం పరదారాభిమర్శనమ్‌| సాహసానాం చ సర్వేషామకార్యాణాం క్రియాస్తథా||101

స లోభ: సహ మోహేన విజేతవ్యో జితాత్మనా| దంభో ద్రోహశ్చ నిందా చ పైశున్యం మత్సరస్తథా||102

భవన్త్యేతాని సర్వాణి లుబ్దానామకృతాత్మనామ్‌| సుమహాంత్యపి శాస్త్రాణి ధారయంతో బహుశ్రుతా:||103

ఛేత్తార: సంశయానాం చ లోభగ్రస్తా వ్రజంత్యధ:| లోభక్రోధప్రసక్తాశ్చ శిష్టాచారబహిష్కృతా:||104

అన్తఃక్షురా వాజ్మదురా: కూపాశ్చన్నాస్తృణౖరివ| కుర్వతే యే బహున్‌ మార్గాంస్తాన్హేతుబలాన్వితా:||105

సర్వమార్గం విలుంపంతి లోభాజ్జాతిషు నిష్టురా:| ధర్మావతంసకా: క్షుద్రా ముష్ణంతి ధ్వజినో జగత్‌ ||106

ఏతేతిపాపినో జ్ఞేయా నిత్యం లోభసమన్వితా:| జనకో యవనాశ్వశ్చ వృషాదర్భి: ప్రసేనజిత్‌||107

తస్మాత్త్యజంతి యే లోభం తేతిక్రామంతి సాగరమ్‌||108

సంసారాఖ్యమతోన్యే యే గ్రాహగ్రస్తా న సంశయ: | అథ బ్రాహ్మణభేదాంస్త్వమష్టౌ విప్రావధారయ||109

ఇతరుల ధనమును వారించుట ఇతరుల స్త్రీలను (భార్యలను) కోరుట, మొదలగు అవివేకముతో కూడిన పాపములన్నీ లోభ##మే.(101) మోహము సహా దీనిని జయించువలెను దంభము, ద్రోహము,నింద, దౌర్జన్యము,మాత్సర్యము(102) అనునవన్నీ లోభముతో నున్న పాపులకు కలుగును. గొప్ప శాస్త్రములను ధరించుచూ, పండితులై, సంశయముల చేదించువారైననూ లోభముతో నరకమున పడుదురు. లోభము , క్రోథము గలవారు, శిష్ఠాచారమును విడిచిన వారు, మనసులో కత్తులుంచుకొని వాక్కులో మాధుర్యమును చూపువారు గడ్డితో కప్పబడిన బావులవంటివారు. హేతుబలముతో ఆయా మార్గములను ఏర్పరుచువారు లోభమువలన ఆయా జాతులయందు అన్ని మార్గములను నశింపజేయును, లోభముచేత ధర్మష్ఠులైననూ క్షుద్రలై జగత్తును దోచుకొనెదరు.(106) నిత్యము లోభము గలవారు పాపిషులని తెలియవలయు జనకుడు, యవనాశ్వుడు, వృషాదర్భి, ప్రసేనజిత్తు అనువారు, లోభము లేనందుచేతనే స్వర్గమునుచేరారు అట్లే ఇతర రాజులు కూడా, కనుక లోభమును విడిచిన సంసారమును సముద్రమును దాటెదరు.(108) అట్లే ఇతరులుకూడా ఈ మొసలిచేత బడినచో లోభమును విడిచి ముక్తులయ్యెదరు ఇక విప్రుడా !బ్రాహ్మణులలో ఎనిమిది భేదములను వినుము.(109)

మాత్రశ్చ బ్రాహ్మణశ్పైవ శ్రోత్రియశ్చ తత: పరమ్‌| అనూచానస్తథా భ్రూణ ఋషికల్ప ఋషిర్ముని:||110

ఏతేహ్యష్టౌ సముద్దిష్టా బ్రాహ్మణా : ప్రథమం శ్రుతౌ| తేషాం పర: పర: శ్రేష్టో విద్యావృత్తవిశేషత:||111

బ్రాహ్మణానాం కులే జాతో జాతిమాత్రో యదా భ##వేత్‌| అనుపేత: క్రియాహీనో మాత్ర ఇత్యభిదీయతే||112

ఏకోద్దేశ్యమతిక్రమ్య వేదస్యాచారవాన్‌ ఋజు: స బ్రాహ్మణ ఇతి ప్రోక్తొ నిభృత: సత్యవాగ్‌ ఘృణి ||113

ఏకాం శాఖాం సకల్పాం చ షఢ్భిరంగైరధీత్య చ | షట్కర్మనిరతో విప్ర: శ్రోత్రియో నామ ధర్మవిత్‌||114

వేదవేదాంగతత్త్వజ్ఞ: శుద్దాత్మా పాపవర్జిత:| శ్రేష్ఠ| శ్రోత్రియవాన్‌ ప్రాజ్ఞ: శుద్దాత్మా పాపవర్జిత:||115

అనూచానగుణోపేతో యజ్ఞస్వాద్వాయయంత్రిత: భ్రూణ ఇత్యుచ్యతే శిష్టై: శేషభోజీ జితేంద్రియ:||116

వైదికం లౌకికం చైవ సర్వజ్ఞానమవాప్య య:| ఆశ్రమస్థో వశీ నిత్యమృషికల్ప ఇతి స్మృత:||117

ఊర్ధ్వరేతా భవత్యగ్ర్యో నియతాశీ న సంశయీ| శాపానుగ్రహయో : శక్త : సత్యసందో భ##వేదృషి:118

నివృత్త: సర్వతత్త్వజ్ఞ: కామక్రోధవివర్జిత:| ధ్యానస్థో నిష్క్రియో దాంతస్తుల్యమృత్కాంచనో ముని :||119

మాత్ర , బ్రాహ్మణ, శ్రోత్రియ, అనూచాన, భ్రూణ, ఋషికల్ప, ఋషి, ముని అనునవి బ్రాహ్మణభేదములు(110) ఈ ఎనిమిది భేదములలో బ్రాహ్మణులు శ్రుతియందు మొదటివారు, తరువాతి తరువాతి వారు తమ తమ విద్యచేత ,ప్రవర్తనచేత శ్రేష్టులు(111) బ్రాహ్మణ కులమునందు పుట్టి జాతిచే మాత్రమే బ్రాహ్మణుడై ఉపనయనము కానివాడు, క్రియలు లేనివాడు మాత్రుడు అనడును (112) వేదము యొక్క ఒక భాగము నెననూ పూర్తిచేసిన వాడు, ఆచారవంతుడు, చక్కని ప్రవర్తనగల వాడు, నిగ్రహము గలవాడు, సత్యము పలుకువాడు, దయగలవాడు బ్రాహ్మణుడ'నబడును (113) కల్పముతో ఏదో నొక శాఖను ఆరువేదాంగములతో అధ్యయనము చేసినవాడు , అధ్యయనము ,భోదనము,యాజనము, దానము, ప్రతిగ్రహమను ఆరు కర్మలలో నిరతుడు, ధర్మము తెలిసిన విప్రుడు శ్రోత్రియుడనబడును (114) వేదవేదాంగముల తత్త్వమును తెలిసినవాడు, నిర్మలుడు, పాపములేనివాడు , శ్రోత్రియుడైన జ్ఞాని అనూచానుడనబడును (115) ఈ అనూచాన గుణములు కలిగి యజ్ఞముల,స్వాధ్వాయమును చేయువాడు ఇంద్రియముల జయించినవాడు, శిష్టులు, మిగిల్చిన దానిని భుజించువాడు భ్రూణుడ'నబడును?(116) వైదిక, లౌకిక జ్ఞానమునంతా పొంది, నిగ్రహము గలిగి ఆశ్రమమున నుండువాడు ఋషికల్పుడు(117)ఊర్ధ్వరేతస్కుడు నియమముగా భుజించువాడు, స్థిరమైనవాడు, శాపాన్నిచ్చుటకు గానీ, అనుగ్రహించుటకు గానీ శక్తిగలవాడు సత్యసంధుడు ఋషియనబడును(118) వైరాగ్యము గలవాడు, అన్ని తత్త్వముల తెలిసినవాడు కామక్రోధములు లేనివాడు. ధ్యానముననుండు వాడు, క్రియలయందు స్పృహలేనివాడు, మట్టిపెడ్డను బంగారమును సమముగా చూచువాడు ముని.(119)

ఏవమన్వయవిద్వాభ్యాం వృత్తేన చ సముచ్చ్రితా: త్రిశుక్లానామ విప్రేంద్రా: పూజ్యన్తే సవనాదిషు||120

ఇత్యేవంవిధవిప్రత్వముక్తం శ్రుణు యుగాదయ:| నవమీ కార్తికే శుక్లా కృతాది: పరికీర్తితా||121

వైశాఖస్య తృతీయా శుక్లా త్రేతాదిరుచ్యతే మాఘే పంచదశీనామ ద్వాపరాది: స్మృతా బుదైః ||122

త్రయోదశీ నభ##స్యే చ కృష్ణా సా హి కలే: స్మృతా| యుగాదయ: స్మతా హ్యేతా దత్తస్యాక్షయకారకా:||123

ఏతాశ్చతస్రస్తిధయో యుగాద్యా హుతం చాక్షయమాశు విద్యాత్‌| యుగే యుగే వర్షశ##తేన దానం యుగాదికాలే దివసేన తత్ఫలమ్‌||124

యుగాద్యా: కథితా హ్యేతా మన్వాద్యా: శ్రుణు సాంప్రతమ్‌ | ఆశ్వయుక్‌ శుక్లనవమీ ద్వాదశీ కార్తికే తథా||125

తృతీయా చైత్రమాసస్య తథా భాద్రపదస్య చ | ఫాల్టునస్య త్వమావాస్యా పౌషసై#్యకాదశీ తథా||126

ఆషాడస్యాపి దశమీ మాఘమానస్య సప్తమీ | శ్రావణస్యాష్టమీ తథాషాడీ చ పూర్ణిమా||127

కార్తికీ ఫాల్గునీ చైత్రీ జ్యేష్ట పంచదశీ సితా| మన్వంతరాదయశ్చైతా దత్తస్యాక్షయకారకా:||128

యస్యాం తిథౌ రథం పూర్వం ప్రాప దేవో దివాకర:| సాతిథి: కథితా విపై#్రర్మాషే యా రథసప్తమీ ||129

తస్యాం దత్తం హుతం చేష్టం సర్వమేవాక్షయం మతమ్‌| సర్వదారిద్య్రశమనం భాస్కర ప్రీతయే మతమ్‌||130

ఇట్లు వంశముచేత , విద్యచేత, ప్రవర్తనచేత గొప్పవారైన బ్రాహ్మణశ్రేష్టులు త్రిశుక్లులనబడుచూ యజ్ఞములు మున్నగు వానియందు పూజింపబడుదురు. (120) ఇట్లు బ్రాహ్మణవిధములు చెప్పబడినది, ఇక యుగాదులను వినుము, కార్తిక శుద్దనవమి కృతయుగము మొదలనబడును (121) వైశాఖశుద్ద తదియ త్రేతాయుగము మొదలు మాఘమాసమున పూర్ణిమ ద్వాపరయుగము మొదలనబడును (122) శ్రావణ మాసమున కృష్ణత్రయోదశి కలియుగ ప్రారంభమనబడును. ఇవన్నీ యుగాదులు, ఇందు దానమిచ్చిన వానికి లోటుండదు (123) ఈ నాలుగు తిథులలో దానమిచ్చినా ,హవనము చేసినా అది అనంతమగును. ప్రతియుగమయున నూర్లకొలది సంవత్సరములలో దానమిచ్చినది, ఈ తిథులలో ఒక రోజు దానమిచ్చిన దానితో సమము (124) ఇట్లు యుగాదులు చెప్పితిని ఇక మన్వాదుల వినుము ఆశ్వయుజ శుద్ద నవమి, కార్తిక ద్వాదశి, చైత్రతదియ, భాద్రపదతదియ,ఫాల్గున అమావాస్యా, పుష్యమున , ఏకాదశి, ఆషాఢదశమీ, మాఘ సప్తమి, శ్రావణకృష్ణ అష్టమి, ఆషాడపూర్ణిమ, కార్తిక, పాల్గున, చైత్రమాసములయందు పూర్ణిమ, జ్యేష్ఠమున పూర్ణిమ మన్వంతరాదులనబడును వీనియందు దానమిచ్చినచో నది యనంతమగును (128) ఏ తిథిలో పూర్వ ము సూర్యుడు రథమును పొందెను అది మాఘమాసమున సప్తమి, రథసప్తమి యనబడును (129) అనాడివ్వబడిన దానము ,వ్రేల్చబడిన హవ్యము భాస్కరునికి ప్రీతికలిగించును. అన్ని దరిద్రముల పోగొట్టి అనంతముగనుండును.(130)

నిత్యోద్వేజకమాహుర్యం ఋధాస్తం శ్రుణు తత్త్వత: యశ్చ యాచనికో నిత్యం న స స్వర్గస్య భాజనమ్‌| 131

ఉద్వేజయతి భూతాని యథా చౌరాస్తథైవ స: నరకం యాతి పాపాత్మా నిత్యోద్వేగకరస్త్వసౌ||132

ఇహోపపత్తిర్మమ కేన కర్మణా క్వ చ ప్రయాతవ్యమితో మయా | విచార్య చైవం ప్రతికారకారీ బుదై: స చోక్తో ద్విజ దక్షదక్ష: 133

మాసైరష్టభిరహ్నా చపూర్వేణ వయసాయుషా | తత్కర్మ పురుష: కుర్యాద్యేనాంతే సుఖమేధతే ||134

అర్చిర్ధూమశ్చ మార్గౌ ద్వావాహుర్వేదాంతవాదిన :| అర్చిషా యాతి మోక్షం చ ధూమేనావర్తతే పున:||135

యజ్ఞై రాసాద్యతే ధూమో నైష్కర్మ్యేణార్చిరాప్యతే | ఏతయోరపరో మార్గ: పాఖంఢ ఇతి కీర్త్యతే ||136

యో దేవాన్మన్యతే నైవ దర్మాంశ్చ మనుసూచితాన్‌ | నైతౌ సయాతి పంథానౌ తత్త్వార్థోయం నిరూపిత :||137

ఇతి తే కీర్తితా ప్రశ్నా శక్త్యా బ్రాహ్మణసత్తమ | సాధు వాసాధు వా బ్రూహి ఖ్యాపయాత్మానమేవ చ ||138

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కౌమారికాఖండే కలాపగ్రామవాసిసుతనుబ్రాహ్మణన నారదప్రశ్నోత్తరకథనం నామ పంచమోద్యాయ:

నిత్యమూ ఉద్వేగమును కలిగించు వానిని గూర్చిచెప్పెద వినుము, నిత్యము యాచించువాడు స్వర్గమునకు పాత్రుడు గాడు (131) దొంగవలె అతనూ ప్రాణులనుఅందోళన కలిగించుటచే పాపాత్ముడై నరకముననుపొందును (132) బ్రాహ్మణా: ఏ కర్మచేనాకు మేలుకలుగును ? ఇక్కడినుండి నేనెక్కడకు వెళ్ళవలెను? అని విచారించి తగిన ప్రతి క్రియచేయువానిని దక్షుడని పెద్దలందరు(133) ఎనిమిది నెలలచే, ప్రొద్దునిలిచిన సమయముచే ,యవ్వనకాలముచే పురుషుడు తాను అంత్యకాలమున సుఖముగ నుండు పనినే చేయవలెను.(134) వేదాంతవేత్తలు 'అర్చి-ధూమ' మని రెండు మార్గములను గూర్చి చెప్పెదరు. అర్చిరాది మార్గముచే మోక్షమును, ధూమమార్గముచే పునరావృత్తి ని పొందెను (135) యజ్ఞములచే ధూమమార్గమును, నిష్కర్మ (ఫలాపేక్షలేని) కర్మచే అర్చిర్మార్గమును పొందెదరు. ఈ రెంటికంటే ఇతరమైనది 'పాఖండమార్గము'(136) దేవతలను గౌరవించక, మనువు సూచించిన ధర్మముల పాటించక జీవించువాడు అర్చి ధూమ మార్గముల రెంటినీ పొందడని యథార్థము సూచింపబడినది (137)బ్రాహ్మణోత్తమా! నీ ప్రశ్నలకు యథాశక్తి బదులిచ్చితిని, తప్పో,ఒప్పో, తెలిసి నీ గూర్చి తెలుపుము(138) ఇది శ్రీ స్కాందమహాపురాణము మొదటి సృష్టిఖండమున కౌమారికా కలాపగ్రామవాసియైన సుతనువను బ్రాహ్మణుడునారదుని ప్రశ్నలకు బదులిచ్చుట యను ఐదవ అధ్యాయము -5

షష్ఠోధ్యాయ:

శ్రీ నారద ఉవాచ-

ఇతి శ్రుత్వా ఫాల్గునాహం రోమాంచపులకీకృత:| స్వరూపం ప్రకటీకృత్య బ్రాహ్మణాని దమబ్రువమ్‌||1

అహో ధన్య: పితాస్మాకం యస్య సృష్టస్య పాలకా:| యుష్మద్విధా బ్రాహ్మణంద్రా : సత్యమాహ పురా హరి:||2

మత్తోప్యనంతాత్పరత: పరస్మాత్సమస్తభూతాధిపతేర్న కించిత్‌ |

తేషాం కిము స్యాదితరేణ యేషాం ద్విజేశ్వరాణాం మమ మార్గవాదినామ్‌||3

తత్సర్వధాద్య ధన్యోస్మి సంప్రాప్తం జన్మన: ఫలమ్‌ | యద్భవన్తో మయా దృష్టా: పాపోపద్రవవర్జితా:||4

తతస్తే సహసోత్థాయ శాతాతపపురోగమా:| అర్ఘ్యపాద్యాదిసత్కారై:పూజయామాసుర్మాం ద్విజా:||5

ప్రోక్తవంతశ్చ మాం పార్థ వచ: సాధుజనోచితమ్‌| ధన్యా వయం హి దేవర్షే త్వమస్మాన్యదిహాగత:||6

కుతో వాగమనం తుభ్యం గంతవ్యం వా క్వ సాంప్రతమ్‌ | అత్రాప్యాగమనే కార్యముచ్యతాం మునిసత్తమ|| 7

శ్రుత్వా ప్రీతికరం వాక్యం ద్విజానామితి పాండవ | ప్రత్యవోచం మునీంద్రాంస్తాన్‌ శ్రూయతాం ద్విజసత్తమా:||8

ఆరవ అధ్యాయము

నారదుడు ¿Áxmsörylgiƒ«sV @LêRiVƒy! @µj… „s¬s ®ƒs[ƒ«sV L][ª«sWLi¿RÁª«sVVƒ«sV F~Liµj… ƒy LRiWxmsª«sVVƒ«sV ¾»½ÖÁzms úËØx¤¦¦¦øßáVÌÁ»][ ¬sÈýÁLiÉÓÁ„s.(1)

ఆహా! మన తండ్రి ధన్యుడు అతను సృజించినదానిని మీ వంటి బ్రాహ్మణ శ్రేష్టులు పాలించుచుంటిరి. పూర్వము విష్ణువు నిజము నిట్లు చెప్పెను.(2) అనంతుడను, పరాత్పరుడను ,సమస్తప్రాణులకధిపతినైన నాకంటే మించినది లేదు. నామార్గమును పలుకు విప్రోత్తములకు ఇతరముతో పనియేమి?(3) నేనన్ని విధాలుగా ధన్యుడిని నా జన్మఫలమును పొందితిని. పాపములను ఉపద్రవములు లేని మిమ్ము చూచితిని ('4) అనగా వారు ఒక్కమారుగా లేచి శాతాతపుడు మున్నగు ద్విజులు అర్ఘ్య, పాద్య, మొదలగు సత్కారములచే నన్ను పూజించిరి(5) అర్జునా! వారు సాధువులకు తగిన మాటలను నన్నుద్దేశించి మాట్లాడిరి. దేవర్షీ! మా వద్దకు నీవు వచ్చుటచే మేము ధన్యులమైతిమి.(6) ఎక్కడినుండి రాక! ఎక్కడికిప్పుడు వెళ్ళవలెను? మునిసత్తమా! ఇక్కడకు వచ్చుటలో కారణమేమి? (7) అని వారు ప్రేమగా అడుగగా నేను వారితో నిట్లంటిని.(8)

అహం బ్రహ్మణో వాక్యాద్విప్రాణాం స్థానకం శుభమ్‌| దాతుకామో మహాతీర్థే మహీసాగరసంగమే||9

పరీక్షన్‌ బ్రాహ్మణానత్ర ప్రాప్తో యూయం పరీక్షితా:| అహం వ: స్థాపయిష్యామి చానుజానీత తద్ద్విజా:||10

ఏవముక్తో విలోక్యైవ ద్విజాంఛాతాతపోబ్రవీత్‌| దేవానామపి దుష్ప్రాప్యం సత్యం నారద భారతమ్‌||11

కిం పునశ్చాపి తత్రైవ మహీసాగరసంగమ: యత్ర స్నాతో మహాతీర్థఫలం సర్వముపాశ్నుతే||12

పునరేకో మహాన్‌ దోషా బిభీమో నితరాం యత: తత్ర చౌరా: సుబహవో నిర్‌ఘృణా: ప్రియసాహసా:||13

స్పరేషు షోడశం చైకవింశం గృహ్ణంతి నో ధనమ్‌| ధనేన తేన హీనానాం కీదృశం జన్మ నో భ##వేత్‌||14

వరం ఋభుక్షయా వాసో మా చౌరకరగా వయమ్‌|

అర్జున ఉవాచ-

అద్భుతం వర్ణ్యతే విప్ర కే హి చౌరా: ప్రకీర్తితా:||

కిం ధనం చ హరన్త్యేతే యేభ్యో బిభ్యతి బ్రాహ్మణా:|

నారద ఉవాచ-

కామక్రోధాదయశ్చారాస్తవ ఏవ ధనం తథా||16

తస్యాపహారభీతాస్తే మామూచురితి బ్రాహ్మణా: తానహం ప్రాబ్రవం పశ్చాద్విజానీత ద్విజోత్తమా:|17

నేను బ్రహ్మమాట పై విప్రులకు శుభమగు స్థానమునివ్వదలిచి మహీతీర్థమున మహీసాగరసంగమమున బ్రాహ్మణుల పరీక్షించుచూ ఇక్కడకు వచ్చితిని మిమ్ముల పరీక్షించితిని మిమ్ములనక్కడ స్థాపించెదను ద్విజులారా అందుకనుమతించుడు.(10) అనగా ద్విజులను చూచి శాతాతపుడిట్లనెను నారదా! నిజముగా భారతము దేవతలుకూడా పొందలేనిది (11) అక్కడ మహీసాగర సంగమము ఇంకనూ పవిత్రము అక్కడ స్నానము చేసిన మహాతీర్థఫలమును పొందగలరు (12) కానీ, మేము ఒక్క దొషమును చూచి భీతిల్లుచుంటిమి అక్కడ చాలామంది నిర్ణయులు,సాహస్తులైన చోరులున్నారు. (13) స్పర్శలలో పదహారవ, ఇరవయ్యవ వానితో కూడిన మా ధనమును కొల్లగొట్టెదరు (కాదయో మావసానా: స్పర్శా: అని క' నుండి మ ' వరకు స్పర్శలు అందుపదహారవ అక్షరము 'త' ఇరవయ్యవ అక్షరము 'ప' కనుక ధనమనగా ఇక్కడ తపోధనము) ఆ ధనము లేనిచో మా జన్మ ఎట్లుండును?; (14) ఆకలిగొని నివసించుటయైనా చౌర్యము కంటే మేలు (ఆ చోరుల చేతబడుట కంటే ఆకలిగొని బ్రదుకుటయైనా మేలే) అనగా అర్జునుడిట్లనెను విప్రా ! అద్భుతమును వర్ణించుచుంటివి ఆ చోరులెవరు? (15) బ్రాహ్మణులు భయపడే ధనమును దేనిని వారు కొల్లగొట్టెదరు ? అనగా నారదుడు చెప్పెను. కామము ,క్రోధము మున్నగునవి చోరులు, తపస్సే ధనము(16) ఆ తపోధనము అపహరించబడునని బ్రాహ్మణులు నాతో పలుకగా నేను వారితో నిట్లంటిని.(17)

జాగ్రతాం తు మనుష్వాణాం చౌరా: కుర్వన్తి కిం ఖలా:| భయభీతశ్చాలసశ్చ తథా చాశుచిరేవ య:||18

తేన కిం నామ సంసాధ్యం భూమిస్తం గ్రసతే నరమ్‌||19

శాతాతప ఉవాచ -

వయం చౌరభయాద్భీతాస్తే హరంతి ధనం మహత్‌ | కర్తుం తథాకథం శక్యమంగ జాగరణం తథా||20

ఖలాశ్చౌరా గతా : క్వాపి తతో నత్వాగతా వయమ్‌| తస్మాత్సర్వం సంత్యజామో భయభీతా వయం మునే ||21

ప్రతిగ్రహశ్చ వై ఘోర: పష్ఠాంశఫలదస్తథౄ| ఏవం బ్రువతి తస్మింశ్చ హారీతో నామ చాబ్రవీత్‌||22

మూఢబుద్ద్యా హి కోనామ మహీసాగరసంగమమ్‌| త్యజేచ్చ యత్ర మోక్షశ్చ స్వర్గశ్చ కరగోథ వా||23

కలాపాదిషు గ్రామేషు కో వసేత విచక్షణ:| యది వాస: స్తంభతీర్ధే క్షణార్థమపి లభ్యతే||24

భయం చ చౌరజం సర్వం కిం కరిష్యతి తత్ర న: కుమారనాథం మనసి పాలకం కుర్వతాం దృఢమ్‌||25

సాహసం చ వినా భూతిర్న కథంచన ప్రాప్యతే | తస్మాన్నారద తత్రాహమాయాస్యే తవ వాక్యత:||26

షడ్వింశతిసహస్రాణి బ్రాహ్మణా మే పరిగ్రహే | షట్కర్మనిరతా: శుద్దా లోభదంభవివర్జితా:||27

తై: సార్థమాగమిష్యామి మమేదం మతముత్తమమ్‌||

విప్రులారా తెలుసుకొనుడు! జాగ్రత వహించిన మనుషులను దుష్టులగు ఆ చోరులేమి చేయగలరు? భయభీతుడు, అలసుడు, ఆశుచియగు వాడు సాధించునదేముంది? భూమి ఆ నరుని మింగివేయును (18,19) అనగా శాతాతపుడిట్లనెను. మేమా చోరుల నుండి భయము నొందితిమి వారు మా గొప్ప ధనమును హరించెదరు అలాంటప్పుడు మేలుకొని యుండుట ఎట్లు (20) దుష్టులగు చోరులెక్కడికో వెళ్ళినందున నమస్కరించి మేమిక్కడకు వచ్చితిమి (21) ఆరవవంతు ఫలమునిచ్చు ప్రతిగ్రహము ఘోరమైనది అని పలుకుచుండుగా హారీతుడనువాడిట్లనెను (22) మోక్షము, స్వర్గము చేతిలో నుండు మహీసాగరసంగమమును మూడబుద్దితో ఎవడు విడుచును? (23) స్తంభతీర్థమున అరక్షణ మైనా వుండగలిగినచో విజ్ఞుడగు వాడెవడు కలాపాది గ్రామములలో నుండును ?(24) రక్షకుడగు కుమారనాథుని మనస్సులో స్థిరముగా నుంచుకొనిన మనను చోరులనుండి కలుగు భయమేమి యేయును?(25) సాహసము లేనిది ఐశ్వర్యము ఎట్లైననూ కలుగును కనుక నారదా! నీ మాటపై నేను అక్కడకు వెళ్ళెదను (26) నావద్ద ఇరవయ్యారు వేల బ్రాహ్మణులు షట్కర్మనిరతులు శుద్దులు లోభము, దంభములేనివారు కలరు.(27) వారితో కలిసి వచ్చెదను ఇదే నా అభిప్రాయము(28)

ఇత్యుక్తే వచనే తాంశ్చ కృత్వాహం దండమూర్థని||28

నివృత్త: సహసా పార్థ ఖేచరోతిముదాన్విత: శతయోజనమాత్రం తు హిమమార్గమతీత్యచ ||29

కేదారం సముపాయాతో యుక్తసై#్తర్ద్విజసత్తమై: ఆకాశేన సుశక్యశ్చ బిలేనాథ స దేశక:||30

అతిక్రాంతుం నాన్యథా చ తథా స్కందప్రసాదత:||31

అర్జున ఉవాచ-

క్వ కలాపం చ తద్గ్రామం కథం శక్యం బిలేన చ| కథం స్కందప్రసాద: స్యాదేతన్మే బ్రూహి నారద||32

నారద ఉవాచ-

కేదారాద్దిమసంయుక్తం యోజానానాం శతం స్మృతమ్‌| తదంతే యోజనశతం విస్తృతం తత్కలాపకమ్‌||33

తదంతే యోజనశతం వాలుకార్ణవముచ్యతే | శతయోజనమాత్ర: స భూమిస్వర్గస్తత: స్మృత:||34

బిలేన చ యథా శక్యం గంతుం తత్ర శ్రుణుష్వ తత్‌| నిరన్నం వై నిరుదకం దేవమారాధయేద్‌ గుహమ్‌|| 35

దక్షిణాయం దిశి తతో నిష్పాపం మన్వతే యదా| తదా గుహోస్య దిశతి స్వప్నే గచ్చేతి భారత||36

తతో గుహాతృశ్చిమతొ బిలమస్తి బృహత్తరమ్‌ తత్ర ప్రవిశ్య గంతవ్యం క్రమాణాం శతసప్తకమ్‌||37

తత్ర మారకతం లింగమస్తి సూర్యసమప్రభమ్‌ |తదగ్రే మృతికా చాస్తి స్వర్ణవర్ణా సునిర్మలా||38

నమస్కృత్య చ తల్లింగం గృహీత్వా మృత్తికాం చ తామ్‌ | ఆగంతవ్యం స్తంభతీర్థే సమారాధ్య కుమారకమ్‌||39

అని వారు పలుకగా వారికి నమస్కరించి ఆకాశగామినై సంతోషముగా వెనుతిరిగితిని(28) నూరు యోజన విస్తీర్ణముగల హిమ మార్గమును దాటి కేదారమును ద్విజోత్తములతో కలిసి చేరితిని. ఆ దేశమును ఆకాశముద్వారా గానీ, బిలము ద్వారా గానీ చేరవచ్చును.(30) స్కందుని ప్రసాదముచేత వేరొక విధముగా వచ్చుట కుదరదు(31) అనగా అర్జునుడిట్లడిగెను నారదా! కలాప గ్రామమెక్కడ? బిలముద్వారా చేరుట యేమిటి? స్కందుని అనుగ్రహమేమిటి? ఇదంతా నాకు విస్తరముగా తెలుపుము,(32) అనగా నారదుడు చెప్పసాగెను అర్జునా! కేదారమునకు వందయోజనముల దూరమున హిమప్రాంతము దానికి చివర నూరుయోజనముల విస్తారముగల కలాపము గలదు(33) దాని చివర నూరు యోజనముల వాలుకార్ణవమున్నది ఆ ప్రదేశము భూలోక స్వర్గమనబడును (34) ఇక బిలముద్వారా వెళ్ళుటయెట్లో చెప్పెద వినుము అన్నమూ ,నీరు విడిచి దక్షిణ దిక్కున కుమారస్వామిని ఆరాధించవలెను (35) పాపము తొలగినదను కొనినచో కుమారస్వామి స్వప్నమునకనబడి వెళ్ళుమని చెప్పును.(36)అర్జునా! అప్పుడు ఆ గుహకు పశ్చిమమున పెద్ద బిలమున్నది. దానియందు ప్రవేశించి ఏడువందల అడుగులు వెళ్ళవలెను(37)అక్కడ సూర్యుని వలె ప్రకాశించు మరకతలింగము బంగారమువలె జ్వలించు స్వచ్చమైన మట్టి యున్నవి (38) ఆ లింగమునకు నమస్కరించి మట్టిని తీసుకొని స్తంభతీర్థమున కుమారస్వామిని ఆరాధించి రావలెను(39)

కోలం వా కూపతో గ్రాహ్యం భూతాయాం నిశి తజ్జలమ్‌ | తేనోదకేన మృత్తికయా కృత్వా నేత్రద్వయాంజనమ్‌||40

ఉద్వర్తనం చ దేవాస్య కదాచిత్‌ షష్టి మే పదే | నేత్రాంజనప్రభావాచ్చ బిలం పశ్యతి శోభనమ్‌|-41

తన్మధ్యేన తతో యాతి గాత్రోద్వర్తప్రభావత:| కారీషైర్నామ చాత్యుగ్రైర్భక్ష్యతే నైవ కీటకై:||42

బిలమధ్యే చ సంపశ్యన్‌ సిద్దాన్‌ భాస్కరసన్నిభాన్‌ | యాత్యేవం యాత్యసౌ పార్థ కలాపం గ్రామముత్తమమ్‌||43

తత్ర వర్షసహస్రాణి చత్వార్యాయు: ప్రకీర్తితమ్‌ | ఫలానాం భోజనం చ స్యాత్పున: పుణ్యం చ నార్జయేత్‌||44

ఇత్యేతత్కధితం తుభ్యమతశ్చాభూచ్చృణుష్వ తత్‌| తప: సామర్థ్యత: సూక్ష్మాన్‌ దండస్యాగ్రే నిధాయ తాన్‌||45

ద్విజానహం సమాయాతో మహీసాగరసంగమమ్‌||46

తదోత్తర్య మయా ముక్తాస్తీరే పుణ్యజలాశ##యే| తతో మయా కృతం స్నానం సహ తై: ద్విజసత్తమై:||47

ని:శేషదోషదావాగ్నౌ మహీసాగరసంగమే| పితృణాం దేవతానాం చకృత్వా తర్పణసత్ర్కియా:||48

జపమానా: పరం జప్యం నివిష్టా: సంగమే వయమ్‌| భాస్కరం సమవేక్షంతశ్చింతయంతో హరిం హృది||49

తస్మింశ్పైవాంతరే పార్థ దేవా: శక్రపురోగమా:| ఆదిత్యాద్యా గ్రహా: సర్వే లోకపాలాశ్చ సంగతా:||50

దేవానాం యోనయో హ్యష్టౌ గంధర్వాప్సరసాం గణా:

బావి నుండి రాత్రి సమయమునతోలమాత్రము నీటిని గ్రహించి దానితో కలిపి రెండు కళ్ళకూ కాటుకవలె పెట్టుకొనవలెను.(40) దేహమునకు కూడా అరవైపదములు దానిని వ్రాసుకొనవలెను. ఆ కాటుక ప్రభావము చేత అందమైన బిలము చూడగలరు.(41)శరీరమునకు అలుముకొనిన కాటుక ప్రభావముచేత ఆ బిలమునుండి వెళ్ళగలరు. కారీషము లను భీకరమైన కీటకములచే భక్షింపబడురు. (42) ఆ బిలమధ్యమున సూర్యుని వలె ప్రకాశించు సిద్దులనుచూచుచూ కలాపగ్రామమునకు వెళ్ళగలడు. (43)అక్కడ నాలుగు వేల సంవత్సరములు ఆయువని చెప్పబడినది. అక్కడ ఫలములనే భుజింపవలెను. లేనిచో పుణ్యమునార్జించలేడు.(44) ఇది నీవుచెప్పితిని. ఇంకనూ ఏమి జరిగెనో చెప్పెద వినుము తపస్సు సామర్థ్యము చేత నేనా బ్రాహ్మణులను దండమునకుఎదుట సూక్ష్మముగా నున్నట్లు నిలిపి మహీసాగర సంగమమునకు వచ్చితిని. (46) అపుడు వారిని పుణ్యజలాశయ తీరమున దింపి,వారితో కలిసి స్నానముచేసితిని (47) అన్ని దోషములకు దావాగ్ని వంటి ఆ మహీసాగరసంగమమున పితరులకు, దేవతలకు తర్పణసత్ర్కియలోనర్చితివి. (48) ఇక సంగమముననే పరమమంత్రమును జపించుచూ సూర్యుని చూచుచూ మనము శ్రీహరిని ధ్యానించుచూ నుంటిమి.(49) అంతలో ఇంద్రాది దేవతలు, సూర్యుడు మొదలగు గ్రహములు అందరు లోకపాలుకులు, గంధర్వులు మొదలగువారు, అప్సరసల గణములు కలిసినవి.(50)

మహోత్సవే తతస్తస్మిన్‌ గీతవాదిత్ర ఉత్తమే||51

పాదప్రక్షాళనం కర్తుం విప్రాణాముద్యతస్త్యహమ్‌| తస్మిన్‌ కాలే చాశ్రుణవమహమాతిథ్యవాక్యతామ్‌||52

సామధ్వనిసమాయుక్తాం తృతీయస్వరనాదితామ్‌| అతీవ మనపో రమ్యాం శివభక్తిమివోత్తమామ్‌||53

విపై#్రరుత్థాయ సంపృష్ట: కస్త్వం విప్ర క్వ చాగత: కిం వా ప్రార్థయసే బ్రూహి యత్తే మనసి రోచతే|| 54

విప్ర ఉవాచ-

ముని: కపిలనామాహం నారదాయ నివేద్యతామ్‌ | ఆగత: ప్రార్థనాయైవ తచ్చృత్వాహమథాబ్రువమ్‌||55

ధన్యోహం యదిహాయాత: కపిల: త్వం మహామునే | నాస్త్యదేయం తవాస్మాభి: పాత్రం నాస్తి తవాధికమ్‌||56

కపిల ఉవాచ-

బ్రహ్మపుత్ర త్వయా దేయం యది మేత్వం శ్రుణుష్వ తత్‌| అష్టౌ విప్రసహస్రాణి మమ దేహీతి నారద||57

భూమిదానం కరిష్యామి కలాపగ్రామవాసినామ్‌| బ్రాహ్మణానామహం చైషాం తదిదం క్రియతాం విభో||58

తతో మయా ప్రతిజ్ఞాతమేవమస్తు మహామునే | త్వయాని క్రియతాం స్థానంకాపిలం కపిలోత్తమమ్‌||59

శ్రాద్దే వా ప్రాప్తకాలే వా హ్యతిథిర్విముఖీ భ##వేత్‌| యస్యాశ్రమముపాయాతస్తస్య సర్వం హి నిష్పలమ్‌||60

స గచ్చేద్‌ రౌరవాంల్లోకాన్‌ యోతిథిం నాభిపూజయేత్‌| అతిథి: పూజితో యేన స దేవై రపి పూజ్యతే||61

ఉత్తమమగు ఆ గీతవాద్యఘెషమహోత్సవమున నేను విప్రులపాదముఉ కడుగుకు ఉద్యుక్తుడనైతిని(51) అ సమయమున నేను అతిధి పిలుపును, వింటిని (52) సామధ్వనితో కూడి మంద్ర స్వరమున మిక్కిలి మనోహరముగా శివభక్తి వలె ఉత్తమముగా ఆ పిలుపు వుండెను (53) విప్రులందరూ లేచి అతనినడిగిరి ఓ విప్రా ! ఎవరు నీవు?ఎక్కడినుండి వచ్చితివి? ఏమి కోరుచుంటివి? నీ మనసు కిష్టమైనదేమో చెప్పమనగా విప్రుడిట్లు చెప్పెను.(54) నేను కపిలుడను వాడనని నారదునికి తెలియజేయండి ప్రార్థించుటకై వచ్చితిని అనగా విని నేనట్లంటిని (55) మహామునీ! ఇక్కడికే తెంచిన నీవు కపిలునివే అయినచో నేను ధన్యుడిని. మేము ఇవ్వలేనిది లేదు నీకన్న ఎక్కువ యోగ్యుడు లేడు(56) అనగా కపిలుడు ఇట్లు చెప్పెను. బ్రహ్మపుత్రా! నారదా! నీవు నా కివ్వవలసినదేమో చెప్పెద వినుము. నాకు ఎనిమిదివేల బ్రాహ్మణులనిమ్ము(57)కలాపగ్రామవాసులగు బ్రాహ్మణులకునేను భూమిని దానమిచ్చెదను. ఇది చేయుము(58)అనగా నేనునూ మాటనిచ్చితిని. అలానే కానిమ్మ మహామునీ! నీవునూ విప్రులకు ఉత్తమమైన స్థానమును కాపిలమను దానిని ఏర్పరుచుము. (59) శ్రాద్దమునగానీ , అవసరమునగానీ, వచ్చిన అతిథి విముఖుడైనచో ఆ ఆశ్రమమున అంతా నిష్పలమగును (60) అతిథిని పూజించమనివాడు రౌరవ నరకములనుపొందును. అతిథిని పూజించువాడు దేవతలచేతకూడా పూజింపబడును.(61)

దానైర్యజ్ఞైస్తతస్తస్మిన్భోజిత: కపిలో ముని: తతో మహాముని : శ్రీ మాన్‌ హారీతో హ్వయితస్తదా||62

పాదప్రక్షాళనార్ధాయ సిద్దదేవసమాగమే | హరీతశ్చ పురస్కృత్యవామపాదం తదా స్థిత:||63

తతో హాసో మహాన్‌ జజ్ఞే సిద్దాప్సర:సుపర్వాణామ్‌| విచింత్య బహుధా మనసో శోకవేగో మహానభూత్‌| సత్యాం చైవ తథా మేనే గాథాం పూర్వబుధేరితామ్‌ '||65

సర్వేష్వపి చ కార్యేషు హేతిశబ్దో విగర్హిత: కుర్వతామతికార్యాణి శిలాపాతో ధ్రువం భ##వేత్‌||66

తతోహమబ్రవం విప్రాన్యూయం మూర్ఖా భవిష్యథ | ధనధాన్యాల్పసంయుక్తా దారిద్ర్యకలిలావృతా:||67

ఏవముక్తే ప్రవాసై#్యవం హారీత: ప్రాబ్రవీదిదమ్‌| తవైవేయం మునే హానిర్యదస్మాన్‌ శపతే భావాన్‌||68

క: శాపో దీయతే తుభ్యంశాపోయమయమేవ తే| తతో విమృశ్య భూయోహమబ్రవం కిమహం ద్విజ||69

తథావిధస్య భవతో వామపాదప్రదానత:||70

హారీత ఉవాచ-

శ్రుణు తత్కారణం ధీమాన్‌ శూన్యతా మేయతో భ##వేత్‌ ||71

ఇతి చింతయతశ్చిత్తే హా దు:ఖోయం ప్రతిగ్రహ: ప్రతిగ్రహేణ విప్రాణాం బాహ్యం తేజో హి శామ్యతి ||72

మహాదానం హి గృహ్ణానో బ్రాహ్మణ: స్వం శుభం హియత్‌ | దదాతి దాతుర్థాతా చ అశుభం యచ్చ తి స్వకమ్‌||73

దానములచే ,యజ్ఞములచే కపిలమునినర్చించి భోజనము సమర్పించిన తరువాత హీరీతుడను మహాముని స్వయముగా ఆహ్వానింపబడెను.(62) సిద్దుల, దేవతల సమాగమమున పాదప్రక్షాళనము కొరకు హారీతుడు ఎదుట ఎడమపాదమునుంచినిలిచెను(63) అంతట సిద్దాప్సరసోగణములు గట్టిగా నవ్వెను అట్టి మునిని చూచి ద్విజులు గౌరవింపబడిరి. అనగా (64) అంతట నాకుకూడా మనస్సులో శోకవేగము మిక్కుటముగా కలిగెను. పూర్వపండితులు చెప్పిన కథను గూర్చి ఆలోచించెను (65) అన్ని పనులలో హేతిశబ్దము గర్హించబడినది.పనులనను మించి చేయువారికి నిశ్చయముగా శిలా పాతమే కలుగును(66) అంతట నేను విప్రునుద్దేశించి ఇట్లంటిని. మీరు మూర్ఖులయ్యెదరు. మీరు మూర్ఖులయ్యెదరు. ధనధాన్యముల తక్కువగా వుండి, దారిద్ర్యగహనమునే ఆవరించబడియుందురు (67) అనగా హీరీతుడు నవ్వి ఇట్లనెను.'మమ్ము శపించుచున్న మీకే ఈ స్థితి కలుగును(68) ఇక నీకేమి శాపమివ్వగలము ఇదే నీకు శాపము అనగా నేను ఆలోచించి మరల ఇట్లంటిని (69) ద్విజుడా! నేనేమంటిని ఎడమకాలునుంచిన మీకే కలుగును (70) అనగా హారీతుడిట్లనెను విజ్ఞుడా! ఆ కారణమును వినుము .ఇట్లు గ్రహించుట దు:ఖము కదా యని తలంచుచున్న నా మనస్సులో శూన్యము వలె ఏర్పడినది (71)ప్రతిగ్రహము చేత విప్రుల బాహ్యతేజస్సు క్షీణించును (72) మహాదానమును తీసుకుంటున్న బ్రాహ్మణుడుదాతకు తన శుభమునివవ్వగా ,దాత తన అశుభమునిచ్చును (73)

దాతా ప్రతిగ్రహీతా చ వచనం హి పరస్పరమ్‌| మన్యతేధ: కరో యస్య సోల్పబుద్ది: ప్రహీయతే||74

ఇతి చింతయతో మహ్యం శూన్యతాభూద్ది నారద| నిద్రార్తశ్చ భయార్తశ్చ కామార్త: శోకపీడిత:||75

హృతస్వశ్చాన్యచిత్తశ్చ శూన్యా హ్యేతే భవన్తి చ| తదేషు మతిమాన్‌ కోపం న కుర్వీత యది త్వయా||76

కృత: కోపస్తతస్తుభ్యం ఏవం హానిరియం మునే | తతస్తాపాన్వితశ్చాహం తాన్విప్రానబ్రువం పున:||77

ధిజ్మామస్తు చ దుర్బుద్దిమవిమృశ్యార్థకారిణమ్‌ | కుర్వతామవిమృశ్యైవ తత్కిమస్తి న యద్భువేత్‌ ||78

సహసా న క్రియాం కుర్యాత్‌ పదమేతన్మహాపదామ్‌| విమృశ్యకారిణం ధీరం వృణతే సర్వసంపద:||79

సత్యమాహ మహాబుద్దిశ్చిరకారీ పురా హి స: పురా హి బ్రాహ్మణ: కశ్చిత్‌ ప్రఖ్యాతోంగిరసాం కులే||80

చిరకారీ మహాప్రాజ్ఞో గౌతమస్యాభవత్‌ సుత: చిరేణ సర్వకార్యాణి యో విమృశ్య ప్రపద్యతే||81

చిరకార్యాభిసంపత్తేశ్చిరకారీ తథోచ్యతే | అలసగ్రహణం ప్రాప్తో దుర్మేధావీ తథోచ్యతే ||82

బుద్దిలాఘవయుక్తేన జనేనాదీర్ఘదర్శినా| వ్యభిచారేణ కస్మిన్‌ స వ్యతిక్రామ్యపరాన్‌ సుతాన్‌ ||83

పిత్రోక్త: కుపితేనాథ జహీమాం జననీమితి| స తథేతి చిరేణోక్త: స్వభావాచ్చిరకారక:||84

విమృశ్య చిరకారిత్వాచ్చింతయామాస వై చిరమ్‌ |

దాత, ప్రతిగ్రహీత (దానమిచ్చువాడు పుచ్చుకొనువాడు) ఇరువురు ఒకరినోకరు తక్కువచేయువారిన తలుచు అల్పబుద్ది గలవాడు నశించును (74) ఇట్లాలోచించిన నాకు మనసున శూన్యముగా మారెను నారదా! నిద్రగొనినవాడు , భయముగొనినవాడు, కామమునొందిన వాడు, శోకములో నున్నవాడు , తన సొత్తు కోల్పోయినవాడు , వేరొకచోట మనసు నిలిపిన వాడు వీరందరూ శూన్యమనస్కులే యగుదురు (75) వీరియందు బుద్దిమంతుడు కోపమునుచూపరాదు నీవు కోపమును నీకే హీని అనగా నేను పశ్చాత్తాపముతో ఆ విప్రులతో నిట్లంటిని. (76,77) చెడుబుద్ది గలిగి ఆలోచించక పనిచేయు నాపై నాకే రోతపుట్టుచున్నది. ఛీ! ఆలోచించక పని చేయువారికి జరగనిదేమున్నది ?;(78) నాపై ఆలోచించకనే ఒక్కమారుగా పనిచేయరాదు. ఇది అన్ని ఆపదాలకు నెలవు. ఆలోచించి పనిచేయు దీరుని అన్ని సంపదలు స్వయముగా వరించును (79) పూర్వము బుద్దిమంతుడగు చిరకారి నిజమే చెప్పెను. పూర్వము అంగిరసుల ఇంట ప్రఖ్యాతుడగు బ్రాహ్మణుడుండెను(80) అలసించి పనిచేయుడతను గౌతముని పుత్రుడు ఆలోచించే అన్ని పనులూ తొందరపడక చేయువాడు(81) తొందరపడక నెమ్మదిగా పనులు చేయుటచే అందరూ అతనిని చిరకారి అనెడివారు అలసించుటచే తెలివితక్కువ వాడనెడివారు. (82) తెలివి తక్కువవారు ,తరచి చూడని జనులట్లు అనెడివారు, ఒకమారు తండ్రి వ్యభిచారమును కారణముగా గ్రహించి ఇతరపుత్రులను వదలి, ఇతనినే తల్లిని వధించుమని కోపముతో పలికెను ఇతను ఇలాగే యన్ననూ చాలాకాలము ఆలోచించుచూ నుండెను.(83) చిరకారి కనుక తన స్వభావముచేతనే తొందరపడలేదు.(84)

పితురాజ్ఞాం కథం కుర్యాం న హన్యాం మాతరం కథమ్‌||85

కథం ధర్మచ్చలేనాస్మిన్నిమజ్ఞేయమసాధువత్‌ | పితురాజ్ఞా పరో ధర్మో మాతృరక్షణమ్‌||86

అస్వతంత్రం చ పుత్రత్వం కిం తు మాం నాత్ర పీడయేత్‌|

స్త్రీయం హత్వా మాతరం చ కో హి జాతు సుఖీ భ##వేత్‌ ||85

పితరం చాప్యవజ్ఞాయ క: ప్రతిష్టామవాప్నుయాత్‌| అనవజ్ఞా పితుర్యుక్తా యుక్తం మాతుశ్చ రక్షణమ్‌||88

క్షమాయోగ్యావుభావేతౌ నాతివర్తేత వై కథమ్‌| పితా హ్యాత్యానమాధత్తే జాయాయాం జిజ్ఞివానితి ||89

శీలచారిత్రగోత్రస్య ధారణార్థం కులస్యచ | సోహమాత్మా స్వయం పిత్రా పుత్రత్వే పరికల్పిత:||90

జాతకర్మణి యత్ర్పాహ పితా యచ్చోపకర్మణి | పర్యాప్త: స దృఢీకార: పితుర్గౌరవలిప్సయా||91

శరీరాదీని దేయాని పితా త్వేక: ప్రయచ్ఛతి | తస్మాత్పితుర్వచ: కార్యం న విచార్యం కథంచన||92

పాతకాన్యసి చూర్యంతే పితుర్వచనకారిణ: పితా స్వర్గ: పితా ధర్మ పితా పరమకం తప:||93

పితరి ప్రీతిమాపన్నే సర్వా: ప్రీణంతి దేవతాః ! ఆశిషస్తా భజంత్యేనం పురుషం ప్రాహ యా: పితా||94

నిష్కృతి సర్వపాపానాం పితా యదభినందతి | ముచ్యతే బంధనాత్పుష్పం ఫలం వృంతాత్‌ ప్రముచ్యతే||95

' నా తండ్రి ఆదేశమునెట్లు పాటించెదను? తల్లిని చంపకుండగా ఎట్లుండెదను? (85) దుర్జనుని వలే నేనునూ ఈ పనియందు ధర్మము నెపముతో ఎట్టు తగులుకొందును. తండ్రి ఆజ్ఞను పాటించుట పరమధర్మము వ్యతిరేకముగా తల్లినిరక్షించుట అధర్మము(86) పుత్రుడగుటయన స్వతంత్రమును కోల్పోవుటయే| కాని నన్నిట ఇది పీడించుటలేదు. స్త్రీని, అందునా తల్లిని చంపి ఈ లోకమున ఎవడు సుఖముగా నుండును (87) తండ్రిని లెక్కించనిచో ఎవడు ప్రతిష్ఠము పొందును ? తండ్రిని గౌరవించుట, తల్లిని రక్షించుట రెండూ యుక్తమే. (88) ఇద్దరూ క్షమయందు తగినవారు. త్రోసిపుచ్చుట యెట్లు? తండ్రి , భార్యయందు మరల జన్మించునని, ఆత్మ తానే పుత్రుడగును (భార్యయందు మరల తానుపుత్రునిగా జన్మించుటచే పుత్రుడనగా తండ్రే యని భావము) (89) శీలము, చరితము, గోత్రము, కులము, వీనిని ధరించు కొరకు తండ్రి నన్ను పుత్రునిగా పొందెను.(90) జాతకర్మయందు ఉపనయనమందు తండ్రి ఏమనెనో అదిచాలు. తండ్రి గౌరవమును పొందగోరి దానిని దృడమొనర్చవలెను.(91) ఇవ్వదగు శరీరము మున్నగు వానినన్నింటినీ తండ్రి ఒక్కడే ఇచ్చును. కనుక ఆలోచించపనిలేదు తండ్రి మాటను పాటించవలెను.(92) తండ్రి మాటననుసరించు వాని పాపములన్నీ చూర్ణమగును తండ్రియే స్వర్గము, ధర్మము, పరమతపము (93) తండ్రి ప్రీతి నొందినచో దేవతలందరూ ప్రీతినొందును. అట్టివానిని తండ్రి ఎట్లాశీర్వదించునో ఆ ఆశీస్సులు వచ్చిచేరును. (ఆశీస్సులు సత్యమగును) (94)తండ్రి అభినందించినచో అన్ని పాపములకు నిష్కృతి కలుగును అపుడు కొమ్మనుండి పండు , పూవ్వు విడిపడినట్లు బంధమునుండి విడిపడును.(95)

క్లిశ్యన్నపి సుత: స్నేహం పితా స్యేహం న ముంచతి| ఏతద్విచింత్య | తం తావత్పుత్రస్య పితృగౌరవమ్‌ ||96

పితా నాల్పతరం స్థానం చింతయిష్యామి మాతరమ్‌ | యో హ్యయం మయి సంఘాతో పాంచభౌతిక:||97

అస్య మే జననీ హేతు: పావకస్య యథారణి| మాతా దేహారణి: పుంస: సర్వస్యార్థస్య నిర్‌వృతి:||98

మాతృలాభే సనాథత్వమనాథత్వం విపర్యయే | న స శోచతి నాప్యేనం స్థావర్యమపికర్షతి ||99

శ్రియా హీనzపి యో గేహే అంబేతి ప్రతిపద్యతే పుత్రపౌత్రమాపన్నో జననీం య: సమాశ్రిత:||100

అపి వర్షశతస్యాంతే స ద్విహాయనవచ్చరేత్‌| సమర్థం వాసమర్థం వా కృశం వాప్యకృశం తథా||101

రక్షయేచ్చ సుతం మాతా నాన్య: పోష్యవిధానత:| తదాస వృద్దో భవతి తదా భవతి దు:ఖిత:||102

తదా శూన్యం జగత్తస్య యదా మాత్రా వియుజ్యతే| నాస్తి మాతృసమా ఛాయా నాస్తి పితృసమా గతి:||103

నాప్తి మాతృసమం త్రాణం నాస్తి మాతృసమా ప్రపా| కుక్షిసంధారణాద్దాత్రీ జననాజ్ఞననీ తథా||104

అంగానామ్వర్థనాదంబా వీరసూత్వే చ వీరసూ: | శిశో : శుశ్రూషణాచ్చ్వశ్రూర్మాతా స్యాన్మననాత్తథా|105

సుతుడు బాధపెట్టిననూ తండ్రి స్నేహమును విడవడు అని ఆచిరకారి పుత్రునికి తండ్రి పై వుండాల్పిన గౌరవమును గూర్చిఆలోచించెను (96) కనుక తండ్రిది తక్కువ స్థానం కాదు. ఇక తల్లని గూర్చి ఆలోచించెదను పంచభూతములకు చెంది మరణించు స్వభావముగల ఈ నా శరీర సంఘాతమునకు అగ్నికి అరణివలె నా తల్లి కారణము ఏవ్యక్తి దేహమునకైనా తల్లియే అరణి (హేతువు) అన్ని ప్రయోజనముల విశ్రాంతి(98) తల్లియున్నచో ఆధారముండును.లేనిచో అనాథనే కదా! డబ్బులేకున్ననూ ఇంట తల్లి యున్నచో ఆ వ్యక్తి శోకమును పొందడు. వానినే స్ధావరము కూడా ఆకర్షించదు. (99) సుతులు, మనుషులు వున్నవాడు కూడా తల్లిని చేరి నూరేళ్ళు వచ్చిననూ రెండేళ్ళబాలుని వలె ప్రవర్తించవచ్చు. సమర్థునిగానీ, అసమర్థుని గానీ, బలవంతుని గానీ దుర్భలుని గానీ తల్లి కొడుకును రక్షించును. వేరొకరు పోషించరు.(100,101) తల్లిని కోల్పోయిన నాటినుండే వృద్దుడగును, దు:ఖమును పొందును, అప్పుడే జగత్తు శూన్యమగును (102) తల్లితో సమానమగు నీడలేదు, తండ్రితో సాటివచ్చ గతి లేదు (103) తల్లితో సమమగు రక్షణ గానీ, నీటి చెలమగానీ లేదు. పొట్టలో ధరించుటచే ధాత్రి, జన్మనిచ్చుటచే జనని.(104) అవయవముల పెంచుటచే అంబ, వీరుని కనుటచే వీరసూ: శిశువును సాకుటచే శ్వశ్రు, వానిని గూర్చి ఆలోచించుటచేత మాత అనబడును.(105)

దేవతానాం సమావాపమేకత్వం పితరం విదు: మర్త్యానాం దేవతానాం చపూగో నాత్యేతి మాతరమ్‌||106

పతితా గురవస్త్యాజ్యా మాతా చన కథంచన| గర్భధారణపోషాభ్యాం తేన మాతా గరీయసే||107

ఏవం స కౌశికీతీరే బలిం రాజానమీక్షతీమ్‌| స్త్రీవృత్తిం చిరకాలత్వాద్దన్తుం ద్విష్ఠ: స్వమాతరమ్‌||108

విమృశ్య చిరకాలం హి చింతాంతం నాభ్యపద్యత | ఏతస్మిన్నంతరే శక్రో బ్రాహ్మణం రూపమాస్థిత:||109

గాయన్గాధాముపాయాత: పితుస్తస్యాశ్రమాంతికే | అనృతా హి స్త్రీయ: సర్వా: సూత్రకారో యదబ్రవీత్‌||110

అతస్తాభ్య: ఫలం గ్రాహం న స్యాద్దోపేక్షణ: సుదీ :| ఇతి శ్రుత్వా తమానర్చ మేధాతిథిరుదారధీ:||111

దు:ఖితశ్చింతయన్‌ ప్రాప్తో భృశమశ్రూణి వర్తయన్‌|| అహోహమీర్షయాక్షిప్తో మగ్నోహం దు:ఖసాగరే||112

హత్వా నారీం చ సాధ్వీం చ కోను మాం తారయిష్యతి | సత్వరేణ మయాజ్ఞప్తశ్చిరకారీ హ్యుదారధీ:||113

యద్యయం చిరకారీ స్యాత్స మాం త్రాయేత పాతకాత్‌ | చిరకారిక భద్రం తే భద్రం తే చిరకారిక||114

యదద్య చిరకారీ త్వం తతోసి చిరకారిక: త్రాహి మాం మాతరం చైవ తపో యచ్చార్జితం మయా||115

ఆత్మానం పాతకే విష్టం శుభాహ్వ చిరకారిక| ఏవం స దుఖిత: ప్రాప్తో గౌతమోచింతయత్తదా ||116

దేవతాసమూహములన్నీ కలసిన తండ్రియని తెలియుదురు. కానీ మానవుల ,దేవతల సమూహములన్నీ తల్లిని దాటవు (తల్లికంటే ఎక్కువ కాదు కదా!) (106) పతితులైన గురువులనైనా విడవచ్చు కానీ తల్లిని విడవరాదు, గర్భమున ధరించుటచేత, పోషించుటచేత తల్లియే ఎక్కువ(107) అని చిరకారి కౌశకి నదితీరమున, స్త్రీయగుటచే తన తల్లిని వధించుటకు ఇష్టపడకుండెను. (108) ఎంతో సేపు ఆలోచించిననూ దానికి అంతమునను పొందలేదు. ఇంతలో ఇంద్రుడు బ్రాహ్మణరూపమును దాల్చి (109) గాథలను పాడుచూ అతని తండ్రి ఆశ్రమమునకు వచ్చెను. స్త్రీలందరూ అసత్యవర్తనులేనని సూత్రకారుడనినచో వారినుండి ఫలమును గ్రహించకూడదు అని మేధాతిథి యను ఉత్తముడు వినెను(111) చిరకారి తండ్రి యగు ఆ మేధాతిథి దు:ఖముతో కన్నీళ్ళు విడుచుచూ! ఆహా! ఈర్షతో నేను ఈ దు:ఖసాగరములో పడినచో నన్నెవడు రక్షించగలడు? నేను తొందరపడి ఉత్తముడగు చిరకారిని ఆజ్ఞాపించితిని. (113) ఇకవేల అతను చిరకారియే అయినచో నన్నీ పాపమునుండి రక్షించగలడు చిరకారకా! నీవు తొందరపడకుండినచో నీకు భద్రమగుగాక! (114) చిరకారీ! ఈనాడు కూడా నీవు ఆలస్యము చేసినచో నన్ను నీ తల్లిని, నేను సంపాదించిన తపస్సును అన్నింటిని రక్షించుము. (115) చక్కని పేరుగల చిరకారీ! పాపములో పడిన నన్ను రక్షించుము, అని గౌతముడగు మేధాతిథి దు:ఖించుచూ చింతింప సాగెను.(116)

చిరకారికం దదర్శాథ పుత్రం మాతురుపాంతికే | చిరకారీ తు పితరం దృష్ట్వా పరమదు:ఖిత:||117

శస్త్రం త్యక్త్యా స్థితో మూర్ద్నా ప్రసాదాయోపచక్రమే| మేధాతిథి సుతం దృష్ట్యా శిరసా పతితం భువి||118

వత్నీం చైవ తు జీవం తీం పరామభ్యగమన్‌ ముదమ్‌ | హన్యాదితి న సా వేద శస్త్రపాణౌ స్థితే సుతే||119

బుద్దిరాసీత్సుతం దృష్ట్వా పితుశ్చరణయోర్నతమ్‌ | శస్త్రగ్రహణచాపల్యం సంవృణోతి భయాదితి||120

తత: పీత్రా చిరం స్మృత్వా చిరం చాఘ్రాయ మూర్థని | చిరం దోర్బ్యాం పరిష్వజ్య చిరం జీవేత్యుదాహృత:||121

చిరం ముదాన్విత: పుత్రం మేధాతిథిరథాబ్రవీత్‌ | చిరకారిక భద్రం తే చిరకారీ భ##వేచ్చిరమ్‌||122

చిరాయ యత్కృతం సౌమ్య చిరమస్మిన్న దు:ఖిత:| గాథా శ్చాప్యబ్రవీద్విద్వాన్‌ గౌతమో మునిసత్తమ:||123

చిరేణ మంత్రం సంధీయాచ్చిరేణ చ కృతం త్యజేత్‌ | చిరేణ విహితం మంత్రం చిరం ధారణమర్హతి||124

రోగే దర్పే చ మానే చ ద్రోహే పాపే చ కర్మణి | అప్రియే చైవ కర్తవ్యే చిరకారీ ప్రశస్యతే ||125

బంధూనాం సుహృదాం చైవ భృత్యానాం స్త్రీజనస్య చ | అవ్యక్తేష్వపరాధేషు చిరకారీ ప్రశస్యతే ||126

చిరం ధర్మాన్నిషేవేత కుర్యాచ్చాన్వేషణం చిరమ్‌| చిరమన్వాస్య విదుషశ్చిరమిష్టానుపాస్య చ||127

అతను తల్లి చందనున్న చిరకారియును పుత్రుని చూచెను. కానీ చిరకారి తండ్రిని చూచి మిక్కిలి దు:ఖమునొందెను.(117) ఆయుధమును పడవైచి తల వంచినిలిచి తండ్రిని ప్రసన్నము చేసుకొనుటకు సన్నద్దుడాయెను (118) మేధాతిథి తన పాదముల వద్ద పడిన కుమారుని, జీవించియున్న భార్యనుచూచి అమితానందమును పొందెను.ఆయుధమును చేతఋని కొడుకు నిలువగా, తనను చంపవచ్చనితల్లి తెలుసుకొనలేదు.(119) తండ్రి కాళ్ళ వద్ద పడిన కుమారుని చూచి, భయముతో , అతనికి శస్త్రమునను గ్రహించు చంచలత్వము వచ్చెనని బావించెను (120) అపుడు తండ్రి చాలాసేపు స్మరించి కుమారుని నుదురు పై ముద్దిడి చాలాసేపు కౌగిటనుంచుకొని చిరంజీవ! చిరకారీ! యనెను. (121) అమితానందమును చాలాసేపు పొందిన తండ్రి సుతునితో నిట్లనెను చిరకారికా! నీకు శుభమగుగాక! నీవు చాలాకాలము చిరకారివే కమ్మ. (122) అలసించి నీవీ పనిచేయనందున నేను చాలాకాలము దు:ఖము పొందలేదు. మునిశ్రేష్టుడు గౌతముడీ గాథలను కూడా చెప్పెను. (123) చాలా కాలము అబ్యసించి మంత్రమును సంధానించవలెను. చాలాసేపు ఆలోచించవలెను అనికూడా ) చాలాకాలము చేసినది విడువలెను.చాలాకాలము నిలిపిన మంత్రము (చేసిన ఆలోచన) చాలాకాలము నిలిచివుండును (124) రోగము, దర్పమున,మానమున, ద్రోహమున, పాపమున, అప్రియము చేయవలసిరాగా ఎవడు చాలా కాలమాలోచించిచేయునో అతనే యోగ్యుడు , శ్రేష్టుడు(125) బంధువుల,మిత్రుల, సేవకుల, స్త్రీల విషయంలో వారి అపరాధము వ్యక్తము కానపుడు ఆలోచించి పనిచేయువాడే శ్రేష్టుడు. (126) ధర్మములను చాలాకాలము సేవించవలెను. చిరకాలము అన్వేషించవలెను చిరకాలము పండితుల సేవించి , ఇష్టమైనవారి వద్దనే యుండి ధర్మమునుసేవించవలెను,(127)

చిరం వినీయ చాత్మానం చిరం యాత్యనవజ్ఞతామ్‌ | బ్రువతశ్చ పరస్యాపి వాక్యం ధర్మోపసంహితమ్‌||128

చిరం పృచ్చేచ్చ శ్రుణుయాచ్చిరం న పరిభూయతే | ధర్మే శత్రౌ శస్త్రహస్తే పాత్రే చ నికటస్థితే||129

భ##యే చ సాధుపూజాయాం చిరకారీ న శస్యతే | ఏవముక్త్యా పుత్రభార్యాసహిత: ప్రాప్య చాశ్రమమ్‌||130

తతశ్చిరముపాస్యాథ దివం యాతశ్చిరం ముని:| వయం త్వేవం బ్రువన్తోపి మోహేనైవ ప్రతారితా:||131

కలౌ చ భవతాం విప్రా మచ్చాపో నిపతిష్యతి | కేచితృధా భవిష్యంతి విప్రా: సర్వగుణౖర్యుతా:||132

పాదప్రక్షాళనం కృత్వా తతోహం ధర్మవర్మణ: | సమీపే సాక్షిణో దేవాన్‌ కృత్వా సంకల్పమాచరమ్‌||133

కాంచనైర్గోప్రదానైశ్చగృహదానైర్దనాధిభి :| భార్యాభూషణవసై#్రశ్చ కృతార్థా బ్రాహ్మణా: కృతా:||134

తత: కరం సముద్యమ్య ప్రాహేంద్రో దేవసంగమే| హరాంగరుద్దవామార్ధా యావద్దేవీ గిరే: సుతా||135

గణాధీశో వయం యావద్యావత్త్రిభువనం త్విదమ్‌ | తాపన్నంద్యాదిదం స్థానం నారదస్థాపితం సురా:||136

బ్రహ్మశాపో రుద్రశాపో విష్ణుశాపస్తథైవ చ | ద్విజశాపస్తథా భూయాదిదం స్థానం విలుంపత:||137

తతస్తథేతి తై: సర్వైర్దృష్టైస్తత్ర తథోదితమ్‌ | ఏవం మయా స్థాపితే స్థానకే స్మిన్‌

సంస్థాపయామాస స కాపిలం ముని:| స్థానే ఉభే దేవకృతే ప్రసన్నాస్తతో | యయుర్దేవతా దేవసద్మ||138

ఇతి శ్రీ స్కాందమహాపురాణ ప్రథమే మాహేశ్వరఖండే కౌమారఖండే

నారదీయస్ధానప్రతిష్టావర్ణనం నామ షష్టోధ్యాయ:

చిరకాలము తనను తాను నిగ్రహించు కొనువాడే చిరకాలము కీర్తిని పొందును . ధర్మముతో గూడిన వాక్యమును వేరొకరు చెప్పునపుడు నూ చిరకాలము ప్రశ్నించవలెను, వినవలెను అట్లైన చిరకాలము అవమానము నొందుడు పూజించుటయందు మాత్రము చిరకాలము చేయనివాడే శ్రేష్ఠుడు (129) అని పలికి మేదా తిథి భార్యతో ,పుత్రునితో ఆశ్రమమునకు వచ్చెను. (130) చిరకాలము ఉపాసించి ఆ ముని స్వర్గమును పొందెను మనము ఇట్లు చెప్పుచున్నానూ మోహనమునకు లోబడి మోసగింపబడితిమి(131)విప్రులారా! కలియుగమున నా శాపము మీ పై పడును అన్ని మంచి గుణములు గల బ్రాహ్మణులు ఎప్పుడా వుండనే వుంటారు (132) అటు తరువాత నేను ధర్మవర్మకాళ్ళు కడిగి సమీపమున నున్న దేవతలకు సాక్షులుగా చేసికొని సంకల్పించితిని (133) బంగారము, గోదానము, గృహదానము, ధనము, భార్య, భూషణములు, వస్త్రములు మున్నగువానితో బ్రాహ్మణులు కృతార్థులైరి (134) అపుడు దేవతల సంగమమున ఇంద్రుడు చేతినెత్తి ఇట్లనెను ఎంత కాలము పార్వతి శివుని శరీరములో సంగము నాశ్రయించి నుండునో , ఈ గణపతి ,మేము ముల్లోకములూ ఎంతకాలము వుండెదమో అంతకాలమునారదుడు స్థాపించిన ఈ స్ధానమానందించుగాక! (136) ఈ స్థానమునకు లోపము తెచ్చువారికి బ్రహ్మ , విష్ణు, రుద్ర, ద్విజశాపములుకలుగుగాక! (137) అనగా వారందరూ అట్లే అని అనుమతించిరి ఇట్లు నేను స్ధాపించిన ఈ స్థలమున ముని కాపిలుని స్థాపించెను. ఇట్లు ఆ రెండు స్ధానములు దేవకృతములు తరువాత ప్రసన్నులైన దేవతలు స్వర్గమునకు వెళ్ళిపోయి.(138)

ఇతి శ్రీ స్కాంద మహాపురాణమున మొదటి మాహేశ్వరఖండమున కౌమారికాఖండమున నారదుని స్థానప్రతిష్ట యొక్క వర్ణనమను అరవ అధ్యాయము

6

Sri Scanda Mahapuranamu-I    Chapters