Sri Scanda Mahapuranamu-I    Chapters    

శ్రీస్కంద మహాపురాణము

ఆంధ్రానువాద సహితము

ప్రథమ భాగము

అనువాదకులు:

డా|| పెన్నా మధుసూదన్‌ ఎం.ఎ.పి.హెచ్‌.డి.(సంస్కృతము)

ప్రకాశకులు:

శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ఠ్‌

గురుకృప

1-10-140/1 అశోక్‌ నగర్‌, హైదరాబాద్‌-500 020.

సర్వసాములు ప్రకాశకులని

ప్రథమ ముద్రణము: 1997

ప్రతులు:1000

మూల్యము: రూ: 100/-

ఇంటింట దేవతామందిరములందు పూజింపవలసినవి ఆడపడుచులు అత్తవారింటికి వెళ్లునపుడు సారె పెట్టవలసినవి ఆ చంద్రార్కము మనుమల మునిమనుమల ఆయురారోగ్య భాగ్య సౌభాగ్య సమృద్దికి ధర్మము దనము భోగము మోక్షమునుకోరి చదివి చదివించి విని వినిపింపవలసినవి వేద వేదాంత రహస్య సుబోధకములైనవి వ్యాసప్రోక్త అష్టాదశ (18) మహాపురాణములు, వానిని సంస్కృతమూల సరళాంధ్రానువాద పరిశోధనలతో శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ఠు ముద్రించి అందించుచున్నది.

ప్రతులకు: శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతి ట్రస్ఠ్‌

గురుకృప,

1-10-140/1,అశోక్‌నగర్‌,

హైదరాబాద్‌-500 020

ముద్రణ:

శ్రీ దత్తసాయి గ్రాఫిక్స్‌

శ్రీ వాణి 1-8-702/105,

నల్లకుంట, హైదరాబాద్‌-44

ఫోన్‌:7633275

శ్రీ:

ఉపోద్ఘాతము

అష్ఠాదశ మహాపురాణాలలో అతివిస్తృత ప్రమాణమైనది స్కందమహాపురాణము దాదాపు ఎనబైయొక్కవేల (81,000)శ్లోకాలు ఉండడంచేత దీనిని ఏకాశీతి సాహస్రీ సంహితా'' అని ఆయా అధ్యాయాంతాలలో పేర్కొనడం జరిగింది,

స్కంద పురాణంలో ఏడు ఖండాలు ఉన్నాయి. మొదటి మాహేశ్వరఖండం, ఈ ఖండంలో కేదారఖండం, కౌమారికాఖండం, అరుణాచలమాహాత్మ్యం పూర్వార్థం, అరుణాచలమాత్మ్యం ఉత్తరార్థం అని నాలుగు విభాగాలున్నాయి. రెండవది వైష్ణవఖండం, దీనిలో వేంకటాచలమాహాత్మ్యం,పురుషోత్తమ (జగన్నాథ) క్షేత్రమాహాత్మ్యం, బదరికాశ్రమమాహాత్మ్యం, కార్తికమాసమాహాత్మ్యం, మార్గశీర్షమాహాత్మ్యం,భాగవతమాహాత్మ్యం,వైశాఖమాసమాహాత్మ్యం, అయోధ్యామాహాత్మ్యం, అనే ఎనిమిది విభాగాలున్నాయి. మూడవది బ్రాహ్మఖండం.దీనిలో సేతుమాహాత్మ్యం, ధర్మారణ్యఖండం, బ్రాహ్మణోత్తరఖండం, అనే మూడు విభాగాలున్నాయి.నాల్గవది కాశీఖండం, దీనిలో పూర్వార్థం, ఉత్తరార్ధం అని రెండు విభాగాలున్నాయి. ఐదవది ఆవన్త్యఖండం దీనిలో అవన్త్యక్షేత్రమాహాత్మ్యం, అవన్తిలోని ఎనభైనాలుగు భాగాలు మాహాత్మ్యం రేవాఖండం అని మూడు విభాగాలున్నాయి, ఆరవది నాగరఖండం. ఏడవది ప్రభాసఖండం. దీనిలో ప్రభాసక్షేత్రమాహాత్మ్యం, వస్త్రాపథక్షేత్రమాహాత్మ్యం, ఆర్బుదఖండం, ద్వారకామాహాత్మ్యం అనే నాలుగు విభాగాలున్యాయి, ఈ విధంగా భారతదేశంలోని వివిధక్షేత్రాల మాహాత్మ్యాలతో, తత్తద్దేవతావిభూతి వర్ణనలతో, అనేకమైన ఆఖ్యానోపాఖ్యానాలతో, వివిధ ధర్మోపదేశాలతో, తత్తత్సంప్రదాయ ప్రతిపాదనలతో భరితమైన ఈ స్కందపురాణానికి భారతదేశఖండత్వాన్ని చాటే ఒక మహాపురాణంగా ప్రత్యేకత ఉంది,

శ్రీ వేంకటేశ్వరార్ష భారతీ ట్రస్ఠ్‌ ద్వారా ఇప్పటికే కొన్ని పురాణాలు ఆంధ్రానువాదంతో ప్రకటింపబడి ఉన్నాయి. ఈ స్కాందపురాణం పద్నాలుగు సంపుటాలలో ప్రకటించవలెనని ట్రస్టువారి సంకల్పం వాటిలో (మాహేశ్వరఖండంలో కేదారఖండం, కౌమారిఖండంలో 26 అధ్యాయాలు) డా.పి. మధుసూదన్‌ గారి ఆంధ్రానువాదంతో ముద్రించి ఆస్తికుల కరకమలాలలో ఉంచుతున్నందుకు సంతోషిస్తున్నాము. చక్కని ఆంధ్రానువాదం సమకూర్చిన డా|| మధుసూదన్‌గారికి మా కృతజ్ఞతలు తెలుపుతున్నాం, పండితుల సహాయంతో మిగిలిన స్కందపురాణ సంపుటాలు ,ఇతర పురాణాలుకూడా అనతిచిరకాలంలో భారతీయ సంస్కృతి ప్రియులకు అందజేయగలమని ఆశిస్తున్నాము.

శ్రీ మదీశ్వరనామ సంవత్సర

విజయదశమి

11.10.1997 శ్రీ వేంకటేశ్వర ఆర్షభారతీట్రస్టు

 

శ్రీ స్కంద మహాపురాణము

విషయాసుక్రమణిక

మాహేశ్వరఖండము (కేదారఖండము)

Sri Scanda Mahapuranamu-I    Chapters