Siva Maha Puranam-4    Chapters   

అథ షడ్వింశో%ధ్యాయః

రాజప్రాసాదములో శివుని పూజించే విధానము

ఉపమన్యురువాచ |

బ్రహ్మఘ్నో వా సురాపో వా స్తేయీ వా గురుతల్పగః | మాతృహా పితృహా వాపి వీరహా భ్రుణహాపి వా || 1

సంపూజ్యామంత్రకం భక్త్యా శివం పరమకారణమ్‌ | తైసై#్తః పాపైః ప్రముచ్యేత వర్షైర్ద్వాదశభిః క్రమాత్‌ || 2

తస్మాత్సర్వప్రయత్నేన పతితో%పి యజేచ్ఛివమ్‌ | భక్తశ్చేన్నాపరః కశ్చిద్భిక్షాహారో జితేంద్రియః || 3

కృత్వాపి సుమహత్పాపం భక్త్యా పంచాక్షరేణ తు | పూజయేద్యది దేవేశం తస్మాత్పాపాత్ర్పముచ్యతే || 4

అబ్భక్షా వాయుభక్షాశ్చ యే చాన్యే వ్రతకర్శితాః | తేషామేతైర్ర్వతైర్నాస్తి శివలోకసమాగమః || 5

భక్త్యా పంచాక్షరేణౖవ యశ్శివం సకృదర్చయేత్‌ | సోపి గచ్ఛేచ్ఛివస్థానం శివమంత్రస్య గౌరవాత్‌ || 6

తస్మాత్తపాంసి యజ్ఞాశ్చ సర్వే సర్వస్వదక్షిణాః || శివమూర్త్యర్చనసై#్యతే కోట్యం శేనాపి నో సమాః || 7

బద్ధో వాప్యథ ముక్తో వా పశ్చాత్పంచాక్షరేణ చేత్‌ | పూజయన్ముచ్యతే భక్తో నాత్ర కార్యా విచారణా || 8

అరుద్రో వా సరుద్రో వా సూక్తేన శివమర్చయేత్‌ | యస్సకృత్పతితో వాపి మూఢో వా ముచ్యతే నరః || 9

షడక్షరేణ వా దేవం సూక్తమంత్రేణ పూజయేత్‌ | శివభక్తో జితక్రోధో హ్యలబ్ధో లబ్ధ ఏవ చ || 10

ఉపమన్యువు ఇట్లు పలికెను -

బ్రహ్మహత్యను చేసినవాడు గాని, మద్యపానమును చేసినవాడు గాని, చోరీని చేసిన వాడుగాని, గురుభార్యాసంగమమును చేసినవాడు గాని, తల్లిదండ్రులను హింసించినవాడు గాని, వీరపురుషుని అన్యాయముగా సంహరించినవాడు గాని, శిశుహంతకుడు గాని (1), సర్వకారణకారణుడగు శివుని, మంత్రము లేకున్ననూ, పన్నెండు సంవత్సరములు వరుసగా భక్తితో చక్కగా పూజించినచో, అయా పాపములనుండి విముక్తుడగును (2). కావున, పతితుడు కూడా సర్వప్రయత్నమును చేసి, భిక్షాహారమును భుజిస్తూ ఇంద్రియములను జయించి శివుని పూజించవలెను. భక్తుడు మాత్రమే ఇట్లు చేయగలడు. భక్తుడు కానివాడు ఇట్లు చేయలేడు (3). మహాపాపమును చేసిన మానవుడైననూ పంచాక్షరమంత్రముతో భక్తి పూర్వకముగా దేవదేవుడగు శివుని పూజించినచో, ఆ పాపమునుండి విముక్తుడగును (4). నీటిని మాత్రమే త్రాగి, లేదా వాయువును మాత్రమే భుజించి తపస్సు చేయువారు, ఈ విధమగు వ్రతములచే శరీరములను కృశింపజేయు ఇతరులు ఈ వ్రతములచే శివలోకమును పొందలేరు (5). ఎవడైతే భక్తితో పంచాక్షరమంత్రమును జపించి ఒక్కసారి శివుని పూజించునో, వాడు కూడ శివమంత్రముయొక్క మహిమచే శివస్థానమును పొందును (6). కావున, తపస్సులు, సర్వసంపదను దక్షిణగా ఇచ్చే అన్ని యజ్ఞములు కూడ శివమూర్తియొక్క పూజలోని కోటి వంతుతో నైననూ సమానము కావు (7). బద్ధుడు గాని, ముక్తుడు గాని పంచాక్షరమంత్రముతో పూజించు భక్తుడు ముక్తుడగుననుటలో సందేహము లేదు (8). రుద్ర సూక్తమును ఉపదేశము పొందినవాడు గాని, పొందని వాడు గాని, పతితుడు గాని, మూర్ఖుడు గాని, ఏ మానవుడైతే ఒక్కసారి రుద్రసూక్తముతో శివుని పూజించునో, వాడు ముక్తిని పొందును (9). శివభక్తుడు మంత్రోపదేశమును పొందినా, పొందకపోయినా, కోపమును జయించి, శివుని ఆరు అక్షరముల మంత్రముతో గాని, రుద్రసూక్తముతో గాని పూజించవలెను (10).

అలబ్దాల్లబ్ధ ఏవాత్ర విశిష్టో నాత్ర సంశయః | స బ్రహ్మాంగేన వా తేన సహంసేన విముచ్యతే || 11

తస్మాన్నిత్యం శివం భక్త్యా సూక్తమంత్రేణ పూజయేత్‌ | ఏకకాలం ద్వికాలం వా త్రికాలం నిత్యమేవ వా || 12

యే%ర్చయంతి మహాదేవం విజ్ఞేయాస్తే మహేశ్వరాః | జ్ఞానేనాత్మ సహాయేన నార్చితో భగవాన్‌ శివః || 13

స చిరం సంసరత్యస్మిన్‌ సంసారే దుఃఖసాగరే | దుర్లభం ప్రాప్య మానుష్యం మూఢో నార్చయతే శివమ్‌ || 14

నిష్పలం తస్య తజ్జన్మ మోక్షాయ న భ##వేద్యతః | దుర్లభం ప్రాప్య మానుష్యం యే%ర్చయంతే పినాకినమ్‌ || 15

తేషాం హి సఫలం జన్మ కృతార్థాస్తే నరోత్తమాః | భవభక్తిపరా యే చ భవప్రణత చేతసః || 16

భవసంస్మరణోద్యుక్తా న తే దుఃఖస్య భాగినః | భవనాని మనోజ్ఞాని విభ్రమాభరణాః స్త్రియః || 17

ధనం చాతృప్తిపర్యంతం శివపూజావిధేః ఫలమ్‌ | యే వాంఛంతి మహాభోగాన్‌ రాజ్యం చ త్రిదశాలయే || 18

తే వాంఛంతి సదా కాలం హరస్య చరణాంబుజమ్‌ | సౌభాగ్యం కాంతిమద్రూపం సత్త్వం త్యాగార్ద్రభావత్‌ || 19

శౌర్యం వై జగతి ఖ్యాతిశ్శివామర్చయతో భ##వేత్‌ | తస్మాత్సర్యం పరిత్యజ్య శివైకాహితమానసః || 20

శివపూజావిధిం కుర్యాద్యదీచ్ఛేచ్ఛివమాత్మనః | త్వరితం జీవితం యాతి త్వరిత యాతి ¸°వనమ్‌ || 21

మంత్రోపదేశమును పొందకపోవుటకంటె పొందుటయే శ్రేష్ఠమనుటలో సందేహము లేదు. హంసమంత్రముతో కూడినది. వేదమునకు అంగమైనది అగు శివమంత్రముయొక్క ప్రభావముచే సాధకుడు ముక్తిని పొందును (11). కావున, ప్రతి దినము ఒకసారి , రెండు సార్లు, మూడు సార్లు లేదా నిరంతరముగా శివుని భక్తితో రుద్రసూక్తమును పఠిస్తూ పూజించవలెను (12). మహాదేవుని అర్చించువారు మహేశ్వరస్వరూపులేనని తెలియవలెను. ఎవడైతే అంతఃకరణమును శుద్ధిఏసి తనకు సహాయపడే జ్ఞానమును పొంది శివభగవానుని పూజించడో (13), అట్టి వ్యక్తి దుఃఖసముద్రమనదగిన ఈ సంసారములో చిరకాలము తిరుగాడును. మూర్ఖుడగు ఏ మానవుడు దుర్లభమగు మానవజన్మను పొందియు శివుని పూజించడో (14), మోక్షమునకు సహాయపడని వాని ఆ జన్మ వ్యర్థము. ఎవరైతే దుర్లభమగు మనుష్యజన్మను పొంది, పినాకధారియగు శివుని పూజించెదరో (15), కృతార్థులగు అట్టి మానవశ్రేష్ఠుల జన్మ సఫలము. ఎవరైతే శివభక్తిపరాయణులో, శివునియందువినయభావముతో నిండిన మనస్సును కలిగియుందురో (16), శివుని ధ్యానించుటకు సంసిద్ధముగా నుండే మనస్సును కలిగియుందురో, వారు దుఃఖమును పొందరు. సుందరమగు భవనములు, హావభావములే ఆభరణములుగా గల స్త్రీలు (17), తృప్తి కలిగే వరకు ధనము అనునవి శివుని పూజించుట వలన లభించే ఫలములు. ఎవరైతే దేవలోకములో గొప్ప భోగములను, రాజ్యమును, కోరుకొనెదరో (18), వారు సర్వకాలములలో శివుని పాదపద్మములను కోరెదరు. సౌభాగ్యము, ప్రకాశించే రూపము, బలము, త్యాగము, దయ (19), శౌర్యము కీర్తి అనునవి ఈ జగత్తులో శివుని పూజించువానికి కలుగును. కావున, తమకు మంగళము కావాలని కోరే జనులు సర్వమును విడిచి పెట్టి, శివునియందు మాత్రమే ఏకాగ్రము చేయబడిన మనస్సు గలవారై శివుని పూజను నిర్వర్తించవలెను. జీవితము తొందరగా గడిచి పోవును. ¸°వనము శీఘ్రముగా కరిగిపోవును (20,21).

త్వరితం వ్యాధిరభ్యేతి తస్మాత్పూజ్యః పినాకధృక్‌ | యావన్నాయాతి మరణం యావన్నాక్రమతే జరా || 22

యావన్నేంద్రియవైకల్యం తావత్పూజయ శంకరమ్‌ | న శివార్చనతుల్యో%స్తి ధర్మో%న్యో భువనత్రయే || 23

ఇతి విజ్ఞాయ యత్నేన పూజనీయస్సదాశివః | ద్వారయాగం జవనికాం పరివారబలిక్రియామ్‌ || 24

నిత్యోత్సవం చ కుర్వీత ప్రాసాదే యది పూజయేత్‌ | హవిర్నివేదనాదూర్ధ్వం స్వయం చానుచరో%పి వా || 25

ప్రాసాదపరివారేభ్యో బలిం దద్యాద్యథాక్రమమ్‌ | నిర్గమ్య సహ వాదిత్రైస్తదాశాభిముఖః స్థితః || 26

పుష్పం ధూపం చ దీపం చ దద్యాదన్నం జలైస్సహ | తతో ధ్యాయన్మహాపీఠే తిష్ఠన్‌ బలిముదఙ్ముఖః || 27

తతో నివేదితం దేవే యత్తదన్నాదికం పురా | తత్సర్వం సావ శేషం వా చండాయ వినివేదయేత్‌ || 28

వ్యాధి తొందరగా రావచ్చును. కావున, పినాకధారియగు శివుని పూజించవలెను. మరణము వచ్చే లోపులో, ముసలితనము ఆక్రమించే లోపులో (22), ఇంద్రియములు పటుత్వము తగ్గే లోపులో శంకరుని పూజించుము. ముల్లోకములలో శివార్చనతో సమానమగు ధర్మము మరియొకటి లేదు (23). ఈ సత్యమును తెలుసుకొని సదాశివుని ప్రయత్నపూర్వకముగా పూజించవలెను. శివుని రాజప్రాసాదములో పూజించే పక్షములో ద్వారయాగము, తెర లోపల పూజ, శివపరివారమునకు ఆహారమును ఇచ్చే క్రియ (24) మరియు నిత్యోత్పవము అను కర్మలను కూడ చేయవలెను. హవిస్సును నివేదన చేసిన తరువాత పూజను చేసిన వ్యక్తి స్వయముగా గాని, లేదా అతని అనుచరుడు గాని (25), ప్రాసాదములోని పరిచారకుల కుటుంబములకు వరుసను అతిక్రమించకుండగా ఆహారమునీయవలెను. మేళతాళములతో బయటకు వచ్చి, శివుని దిక్కు (ఉత్తరము) వైపునకు తిరిగి నిలబడి (26), పుష్పమును, ధూపమును, దీపమును, నీటితో సహా అన్నమును సమర్పించవలెను. తరవాత మహాపీఠమునందు ఉత్తరముఖముగా నిలబడి ధ్యానిస్తూ ఆహారమును సమర్పించవలెను. (27). ముందుగా శివునకు ఏయే అన్నము మొదలగు పదార్థములు నివేదన చేయబడినవో, వాటిని అన్నింటిని గాని, లేదా మిగిలిన పదార్థములను గాని తరువాత చండీశ్వరునకు నివేదించవలెను (28). హుత్వా చ విధివత్పశ్చాత్పూజాశేషం సమాపయేత్‌ | కృత్వా ప్రయోగం విధి వద్యావన్మంత్రజపం తతః || 29

నిత్యోత్సవం ప్రకుర్వీత యథోక్తం శివశాసనే | విపులే తైజసే పాత్రే రక్తపద్మోపశోభితే || 30

అస్త్రం పాశుపతం దివ్యం తత్రావాహ్య సమర్చయేత్‌ | శిరస్యారోప్య తత్పాత్రం ద్విజస్యాలంకృతస్య చ || 31

న్యస్తాస్త్రవపుషా తేన దీప్తయష్టిధరస్యచ | ప్రాసాదపరివారేభ్యో బహిర్మంగలనిస్స్వనైః || 32

నృత్యగేయాదిభిశ్చైవ సహ దీపధ్వజాదిభిః | ప్రదక్షిణత్రయం కృత్వా న ద్రుతం చావిలంబితమ్‌ || 33

మహాపీఠం సమావృత్య త్రిః ప్రదక్షిణయోగతః | పునః ప్రవిష్టో ద్వారస్థో యజమానః కృతాంజలిః |

ఆదాయాభ్యంతరం నీత్వా హ్యస్త్రముద్వాసయేత్తతః || 34

ప్రదక్షిణాదికం కృత్వా యథాపూర్వోదితం క్రమాత్‌ | ఆదాయ చాష్టపుప్పాణి పూజామథ సమాపయేత్‌ || 35

ఇతి శ్రీ శివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే ప్రాసాదే శివపూజావిధివర్ణనం నామ షడ్వింశో%ధ్యాయః (26).

తరువాత యథావిధిగా హోమమును చేసి, మిగిలిన పూజను పూర్తి చేయవలెను. తరువాత యథావిధిగా మంత్రజపము వరకు పూజాప్రయోగమును చేసి (29), శివశాస్త్రములో చెప్పిన విధముగా నిత్యోత్సవమును చేయవలెను. విశాలమైనది, ఎర్రని పద్మముతో శోభిల్లునది అగు బంగరు పాత్రలో (30) దివ్యమగు పాశుపతాస్త్రమును ఆవాహన చేసి, చక్కగా పూజించవలెను. అలంకరించుకొని, మండే కాగడాను పట్టుకున్న ఒక బ్రాహ్మణుని తలపై ఆ అస్త్రపాత్రను పెట్టవలెను. అపుడు ప్రాసాదములో పరివారముతో సహా వారందరు మేళతాళములతో, నాట్యములను చేయుచూ, పాటలు పాడుతూ, దీపములు, పతాకలు మొదలగు వాటిని పట్టుకొని బయటకు వచ్చి, కంగారు పడకుండగా సావధానముగా ప్రాసాదమునకు మూడు ప్రదక్షిణములను చేసి (31-33), మహాపీఠమునకు మూడుసార్లు ప్రదక్షిణమును చేసి, మరల భవనము లోనికి ప్రవేశించ వలెను. యజమానుడు చేతులను జోడించి ద్వారము వద్ద నిలబడి లోపలికి ఆ పాత్రను తీసుకొని మరల తీసుకువెళ్లి, తరువాత అస్త్రమునకు ఉద్వాసన చెప్పవలెను (35). తరువాత ప్రదక్షిణము మొదలగు వాటిని పూర్వము చెప్పిన విధముగనే క్రమము తప్పకుండగా చేసి, ఎనిమిది పుష్పములను తీసుకొని సమర్పించి పూజను ముగించవలెను (35).

శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో రాజప్రాసాదమునందు శివపూజను చేసే విధిని వర్ణించే ఇరువది ఆరవ అధ్యాయము ముగిసినది (26).

Siva Maha Puranam-4    Chapters