Siva Maha Puranam-4    Chapters   

అథ పంచదశో%ధ్యాయః

శివుని ఉపాసనామూర్తుల నిరూపణము

ఈశ్వరఉవాచ |

అతఃపరం ప్రవక్ష్యామి సృష్టిపద్ధతిముత్తమామ్‌ | సదాశివాన్మహేశాదిచతుష్కస్య వరాననే || 1

సదాశివస్సమష్టిస్స్యాదాకాశాధిపతిః ప్రభుః | అసై#్యవ వ్యష్టితాపన్నం మహేశాదిచతుష్టయమ్‌ || 2

సదాశివసహస్రాంశాన్మ హేశస్య సముద్భవః | పురుషాననరూపత్వాద్వాయోరధిపతిశ్చ సః || 3

మాయాశక్తియుతో వామే సకలశ్చ క్రియాధికః | అసై#్యవ వ్యష్టిరూపం స్యాదీశ్వరాదిచతుష్టయమ్‌ || 4

ఈశో విశ్వేశ్వరః పశ్చాత్పరమేశస్తతః పరమ్‌ | సర్వేశ్వర ఇతీదంతు తిరోధాచక్రముత్తమమ్‌ || 5

తిరోభావో ద్విధా భిన్న ఏకో రుద్రాదిగోచరః | అన్యశ్చ దేహభావేన పశువర్గస్య సంతతేః || 6

భోగానురంజనపరః కర్మసామ్యక్షణావధి | కర్మసామ్యే స ఏకస్స్యాదనుగ్రహమయోవిభుః || 7

తత్ర సర్వేశ్వరా యాస్తే దేవతాః పరికీర్తితాః | పరబ్రహ్మాత్మకాస్సాక్షాన్నిర్వికల్పా నిరామయాః || 8

తిరోభావాత్మకం చక్రం భ##వేచ్ఛాంతికలామయమ్‌ | మహేశ్వరాధిష్ఠితం చ పదమేతదనుత్తమమ్‌ || 9

ఏతదేవ పదం ప్రాప్యం మహేశపదసేవినామ్‌ | మాహేశ్వరాణాం సాలోక్యక్రమాదేవ విముక్తిదమ్‌ || 10

ఈశ్వరుడిట్లు పలికెను -

ఓ సుందరీ! ఈ పైన సదాశివుని నుండి మహేశ్వరుడు మొదలగు నలుగురు బ్రహ్మలు పుట్టిన ఉత్తమమగు పద్ధతిని చెప్పెదను (1). సర్వసమర్థుడు, ఆకాశమునకు అధిపతి యగు సదాశివుడు సమష్టి యగుచున్నాడు. మహేశ్వరుడు (ఈశానుడు) మొదలైన నలుగురు ఆయన యొక్క వ్యష్టిరూపములు మాత్రమే (2). సదాశివుని వెయ్యవ అంశమునుండి మహేశుడు పుట్టినాడు. ఆయన ముఖము పురుషుని ముఖమును పోలియుండుటచే ఆయన వాయువునకు అధిపతి అయినాడు (3). సగుణస్వరూపుడు, క్రియాశక్తిప్రధానుడు అగు ఆయనకు ఎడమ భాగమునందు మాయాశక్తి గలదు. ఈశ్వరుడు మొదలగు నలుగురు ఆయనయొక్క వ్యష్టిస్వరూపులే (4). ఈశుడు, విశ్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు అను నలుగురు కలిసి ఉత్తమమగు తిరోధాన (జగత్తు తన కారణములో విలీనమగుట) చక్రము అగును (5). ఈ తిరోధానము రెండు రకములుగా నున్నది. ఒకటి రుద్రుడు మొదలగు వారియందు, రెండవది సదాశివుని సంతానము అగు ప్రాణిసమూహముయొక్క దేహభావమునందు గోచరించును (6). కర్మసామ్యము (కర్మకు కారణములగు సత్త్వరజస్తమోగుణముల సమానత్వము) కలిగే క్షణము (ప్రళయము) వరకు ప్రాణులచే భోగములను అనుభవింపజేయుటయందు ఆసక్తి కలిగియున్న మహేశుడు ఆ కర్మసామ్యకాలము రాగానే ఒక్కడు మాత్రమే మిగిలియుండును. సర్వవ్యాపకుడగు ఆయన అనుగ్రహస్వరూపుడు (7). పైన పేర్కొనబడిన సద్యోజాతాది దేవతలు అయిదుగురు సర్వేశ్వరులు, సాక్షాత్తుగా పరబ్రహ్మస్వరూపులు, భేదము లేనివారు, మరియు వినాశము లేనివారు (8). శాంతి కళతో నిండియున్న తిరోభావచక్రము మహేశ్వరునిచే అధిష్ఠింపబడి యుండుటచే, సర్వశ్రేష్ఠమైన ధామము అగుచున్నది (9). మహేశ్వరుని పాదములను సేవించువారు పొందదగిన ధామము ఇదియే. ఇదియే మహేశ్వరభక్తులకు సాలోక్యము (శివునితో సమానమైన ఆకారము కలిగియుండుట) ఇత్యాది క్రమములో ముక్తిని ఇచ్చును(10).

మహేశ్వరసహస్రాంశాద్రుద్రమూర్తిరజాయత |అఘేరవదనాకారస్తేజస్తత్త్వాధిపశ్చ సః || 11

గౌరీశక్తియుతో వామే సర్వసంహారకృత్ర్ప భుః | అసై#్యవ వ్యష్టిరూపం స్యాచ్ఛివాద్యథ చతుష్టయమ్‌ || 12

శివో హరో మృఢభవౌ విదితం చక్రమద్భుతమ్‌ | సంహారాఖ్యం మహాదివ్యం పరమం హి మునిశ్వర || 13

స సంహారస్త్రి ధా ప్రోక్తో బుధైర్నిత్యాదిభేదతః | నిత్యో జీవసుషుప్తాఖ్యో విధేర్నైమిత్తికస్మ్సృతః || 14

విలయస్తస్య తు మహానితి వేదనిదర్శితః| జీవానాం జన్మదుఃఖాదిశాంతానాముషితాత్మనామ్‌ || 15

విశ్రాంత్యర్థం మునిశ్రేష్ఠ కర్మణాం పాకహేతవే | సంహారః కల్పితస్త్రే ధా రుద్రేణామితతేజసా || 16

రుద్రసై#్యవ తు కృత్యానాం త్రయమేతదుదాహృతమ్‌ | సంహృతావపి సృష్ట్యాదికృత్యానాం పంచకం విభోః || 17

మునే తత్ర భవాద్యాస్తే దేవతాః పరికీర్తితాః | పరబ్రహ్మస్వరూపాశ్చ లోకానుగ్రహకారకాః || 18

సంహారాఖ్యమిదం చక్రం విద్యారూపకలామయమ్‌ | అధిష్ఠితం చ రుద్రేణ పదమేతన్నిరామయమ్‌ || 19

ఏతదేవ పదం ప్రాప్య రుద్రారాధనకాంక్షిణామ్‌ | రుద్రాణాం తద్ధి సాలోక్యక్రమాత్సాయుజ్యదం మునే || 20

మహేశ్వరుని వెయ్యవ అంశమునుండి అఘోర (శాంతమైన) ముఖము మరియు ఆకారము కలిగి అగ్నితత్త్వమునకు అధిపతియైన రుద్రస్వరూపము జన్మించెను (11). సర్వమును సంహరించే రుద్రప్రభుని ఎడమ భాగమునందు గౌరీశక్తి గలదు. శివుడు, హరుడు, భవుడు, మృడుడు అను నలుగురు వ్యష్టిరూపమగుచున్నారు. ఓ మహర్షీ! అద్భుతము, మహాప్రకాశము గలది, సర్వశ్రేష్ఠమైనది అగు ఈ చక్రమునకు సంహారచక్రము అని పేరు (12,13). నిత్యము ఇత్యాది భేదములచే ఆ సంహారము మూడు విధములుగా నున్నదని పండితులు చెప్పుచున్నారు. జీవులు పొందే నిద్రావస్థ నిత్యసంహారము. బ్రహ్మగారు నిద్రించినప్పుడు అది నైమిత్తికసంహారము అని చెప్పబడును (14). బ్రహ్మయొక్క లయము మహాసంహారమగునని వేదములు వర్ణించుచున్నవి. ఓ మహర్షీ! తాపమును పొందియున్న అంతఃకరణములు గల జీవులు జన్మ, దుఃఖము మొదలైన వాటినుండి సంహారమును కల్పించినాడు (15,16). రుద్రుడు మాత్రమే చేసే ఈ మూడు కార్యములను, మరియు పరమేశ్వరుడు చెసే సృష్టి మొదలైన ఐదు కార్యములను నేను చెప్పితిని (17). ఓ మునీ! పైన పేర్కొనబడిన భవుడు మొదలైన దేవతలు పరబ్రహ్మస్వరూపులు మరియు లోకానుగ్రహమును చేయువారు (18). విద్యాకళతో నిండియున్నదై రుద్రునిచే అధిష్ఠింపబడియుండే ఈ సంహారచక్రము దుఃఖసంపర్కము లేనిది (19). ఓమునీ! రుద్రుని ఆరాధనయందు ఆసక్తి గలవారు ఈ రుద్రపదమును పొంది సాలోక్యము ఇత్యాది క్రమములో సాయుజ్యము (రుద్రునితో కలిసియుండుట) ను పొందెదరు (20).

రుద్రమూర్తేస్సహస్రాంశాద్విష్ణో శ్చైవాభవజ్జనిః | స వామదేవచక్రాత్మా వారితత్త్వైకనాయకః || 21

రమాశక్తియుతో వామే సర్వరక్షాకరో మహాన్‌ | చతుర్భుజో%రవిందాక్షశ్శ్యామశ్శంఖాదిచిహ్నభృత్‌ || 22

అసై#్యవ వాసుదేవాదిచతుష్కం వ్యష్టితాం గతమ్‌ | ఉపాసనారతానాం వైవైష్ణవానాం విముక్తిదమ్‌ || 23

వాసుదేవో%నిరుద్ధశ్చ తతస్సంకర్షణః పరః | ప్రద్యుమ్నశ్చేతి విఖ్యాతం స్థితిచక్రమనుత్తమమ్‌ || 24

స్థితిస్సృష్టస్య జగతస్తత్కర్త్రా సహ పాలనమ్‌ | ఆరబ్ధకర్మభోగాంతం జీవానాం ఫలభోగినామ్‌ || 25

విష్ణోరేవేదమాఖ్యాతం కృత్యం రక్షావిధాయినః | స్థితావపి తు సృష్ట్యాదికృత్యానాం పంచకం విభోః || 26

తత్ర ప్రద్యుమ్నముఖ్యాస్తే దేవతాః పరికీర్తితాః | నిర్వికల్పా నిరాతంకా ముక్తానందకరాస్సదా || 27

స్థితిచక్రమిదం బ్రహ్మన్‌ ప్రతిష్ఠారూపముత్తమమ్‌ | జనార్దనాధిష్ఠితం చ పరమం పదముచ్యతే || 28

ఏతదేవ పదం ప్రాప్యం విష్ణుపాదాబ్జసేవినామ్‌ | వైష్ణవానాం చక్రమిదం సాలోక్యాదిపదప్రదమ్‌ || 29

విష్ణోరేవ సహస్రాంశాత్సంబభూవ పితామహః | సద్యోజాతముఖాత్మా యఃపృథివీతత్త్వనాయకః || 30

రుద్రస్వరూపముయొక్క వెయ్యవ అంశమునుండి వామదేవచక్రస్వరూపుడు, జలతత్త్వమునకు అధినాయకుడు అగు విష్ణువు పుట్టెను (21). సర్వులను రక్షించువాడు, గొప్పవాడు, నాలుగు చేతులు గలవాడు, పద్మమువంటి కన్నులు గలవాడు, నల్లని వాడు, శంఖము మొదలగు చిహ్నములను ధరించువాడు అగు విష్ణువునకు ఎడమభాగములో లక్ష్మీశక్తి గలదు (22). వాసుదేవుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, మరియు ప్రద్యుమ్నుడు అను నలుగురు విష్ణువు యొక్క వ్యష్టిస్వరూపము అగుచున్నారు. వీరు విష్ణువును ఉపాసించుటయందు శ్రద్ధ గల భక్తులకు మోక్షమునిచ్చెదరు. ఈ సర్వోత్తమమగు సమూహమునకు స్థితిచక్రమని ప్రసిద్ధి (23,24). సృష్టించబడిన జగత్తునకు స్థితిని కల్పించుట, ఫలమును భోగించే జీవులు తమ ప్రారబ్ధకర్మను అనుభవించుట పూర్తి యగునంత వరకు జగత్కర్తయగు బ్రహ్మతో సహా జగత్తును పాలించుట (25) అనునవి జగద్రక్షణ అనే పనిని చేసే విష్ణువుయొక్క కార్యములు అగుచున్నవి. పరమేశ్వరుడు చేసే సృష్టి మొదలైన అయిదు కార్యములలో స్థితిలోని వ్యవస్థను కూడ నీకు ఈ విధముగా చెప్పితిని (26). దానిలో చెప్పబడిన ప్రద్యుమ్నుడు మొదలైన దేవతలు కూడ భేదములు, మరియు దుఃఖ దోషములు లేనివారనియు, ముక్త పురుషులకు సర్వదా ఆనందమునిచ్చువారనియు కీర్తించబడినది (27). ఓ బ్రాహ్మాణా! జగత్తుయొక్క ప్రతిష్ఠ అనే రూపములోనున్న ఈ స్థితిచక్రము ఉత్తమమైనది. జనార్దనునిచే అధిష్ఠింపబడియున్న ఈ చక్రమును వేదము పరమపదమని వర్ణించుచున్నది (28). విష్ణువుయొక్క పాదపద్మములను సేవించువారలు పొందే ధానము ఇదియే. ఇది వారికి సాలోక్యము మొదలైన గమ్యములనిచ్చును (29). విష్ణువుయొక్క వెయ్యవ అంశమునుండి సద్యోజాతముఖస్వురూపుడు, పృథివీతత్త్వమునకు అధినాయకుడు అగు బ్రహ్మపుట్టినాడు (30).

వాగ్దేవీసహితో వామే సృష్టికర్తా జగత్ర్ప భుః | చతుర్ముఖో రక్తవర్ణో రజోరూపస్వరూపవాన్‌ || 31

హిరణ్యగర్భాద్యసై#్యవ వ్యష్టిరూపం చతుష్ణయమ్‌ | హిరణ్యగర్భో%థ విరాట్‌ పురుషః కాల ఏవ చ || 32

సృష్టిచక్రమిదం బ్రహ్మపుత్రాదిఋషి సేవితమ్‌ | సర్వకామార్థదం బ్రహ్మన్‌ పరివారసుఖప్రదమ్‌ || 33

సృష్టిస్తు సంహృతస్యాస్య జీవస్య ప్రకృతౌ బహిః | ఆనీయ క్రమభోగార్థం సాధనాంగఫలైస్సహ || 34

సంయోజనమితీదం తు కృత్యం పైతామహం విదుః | జగత్సృష్టిక్రియావిజ్ఞా యావద్వ్యూహం సుఖావహమ్‌ || 35

జగత్సృష్టావపి మునే కృత్యానాం పంచకం విభోః | అస్తికాలోదయస్తత్ర దేవతాః పరికీర్తితాః || 36

నివృత్తిరూపమాఖ్యాతం సృష్టిచక్రమిదం బుధైః | పితామహాధిష్ఠితం చ పదమేతద్ధి శోభనమ్‌ || 37

ఏతదేవ పదం ప్రాప్య బ్రహ్మార్పితధియాం నృణామ్‌ | పైతామహానామేతద్ధి సాలోక్యాదివిముక్తిదమ్‌ || 38

అస్మిన్నపి చతుష్కే తు చక్రాణాం ప్రణవో భ##వేత్‌ | మహేశాదిక్రమాదేవ గౌణ్యావృత్త్యా స వాచకః || 39

ఇదం ఖలు జగచ్చక్రం శ్రుతివిశ్రుతవైభవమ్‌ | పంచారం చక్రమితి హస్తౌతి శ్రుతిరిదం మునే || 40

ఏకమేవ జగచ్చక్రం శంభోశ్శక్తినిజృంభితమ్‌ | సృష్ట్యాదిపంచావయవం పంచారమితి కథ్యతే || 41

జగత్తునకు ప్రభువు, నాలుగు ముఖములు గలవాడు, ఎర్రని దేహవర్ణము గలవాడు, రజోగుణస్వరూపుడు అగు సృష్టికర్తకు ఎడమభాగములో సరస్వతీదేవి ఉండును (31). హిరణ్యగర్భుడు, విరాట్‌, పురుషుడు, కాలుడు అను నలుగురు ఈ బ్రహ్మయొక్క వ్యష్టిరూపులు (32). ఓ బ్రాహ్మణా! బ్రహ్మయొక్క మానసపుత్రులగు ఋషులచే మరియు ఇతరులచే సేవింపబడు ఈ సృష్టిచక్రము కోరబడే సకలవస్తువులను మరియు కుటుంబసౌఖ్యమును ఇచ్చును (33). ప్రకృతియందు ఉపసంహరింపబడియున్న జీవుని క్రమముగా భోగములననుభవించుట కొరకై బయటకు తెచ్చి కర్మలు ఆనే సాధనములతో, వాటి అంగములతో మరియు ఫలములతో సంబంధమును కలిగించే ప్రక్రియకు సృష్టియని పేరు. ఈ సృష్టి పితామహుని కర్తవ్యమని జగత్తు యొక్క సృష్టిప్రక్రియను యెరింగిన మహర్షులు చెప్పుచున్నారు. ఈ జగత్తు వ్యవస్థితముగానున్నంత వరకు సుఖమును కలిగించును (34,35). ఓ మునీ! జగత్తు యొక్క సృష్టిలో పరమేశ్వరుని కృత్యములు అయిదు కలవు. ఆ సృష్టిలో వర్తమానకాల దేవత మొదలగు దేవతలు కీర్తించబడినారు (36). ఈ సృష్టి చక్రము నివృత్తి (చుట్టూ తిరుగుట) రూపమని పండితులు చెప్పుచున్నారు. పితామహునిచే అధిష్ఠించబడియున్న ఈ ధామము సుందరమైనది (37). బ్రహ్మయందు భక్తిగల మానవులు పొందదగిన ధామము ఇదియే. ఈ ధామము పితామహభక్తులకు సాలోక్యము మొదలైన ముక్తులను ఇచ్చును (38). మహేశ్వరునితో ఆరంభ##మైన ఈ నాలుగు చక్రములను కూడ గౌణీవృత్తి (ముఖ్యార్థము కానిది) చే ఓంకారము నిర్దేశించును (39). ఓ మూనీ! వేదములలో కీర్తింపబడిన వైభవము గల ఈ జగచ్చక్రమును వేదము పంచారచక్రమని స్తుతించుచున్నది (40). శంభుని శక్తియొక్క విజృంభణ మాత్రమే అనదగిన ఈ జగత్తు అనే ఒకే ఒక చక్రమునకు సృష్టి మొదలైన అయిదు ఆవయవములు ఉండుటచే, ఇది పంచార (ఐదు ఆకులు గల) చక్రమని చెప్పబడుచున్నది (41).

అలాతచక్రభ్రమివదవిచ్ఛిన్నలయోదయమ్‌ | పరతో వర్తతే యస్మాత్తస్మాచ్చక్రమితీరితమ్‌ || 42

సృష్ట్యాదిపృథుసృష్టిత్వాత్పృథుత్వేనోపదృశ్యతే | హిరణ్మయస్య దేవస్య శంభోరమితతేజసః || 43

శక్తికార్యమిదం చక్రం హిరణ్యజ్యోతిరాశ్రితమ్‌ | సలిలేనావృతమిదం సలిలం వహ్నినా%వృతమ్‌ || 44

ఆవృతో వాయునా వహ్నిరాకాశేనావృతం మహత్‌ | భూతాదినా తథాకాశో భూతాదిర్మహతా%వృత || 45

అవ్యక్తేనావృతస్తద్వస్మహానిత్యేవమాస్తికైః | బ్రహ్మాండమితి సంప్రోక్తమాచార్యైర్మునిసత్తమ || 46

ఉక్తాని సప్తావరణాన్యస్య విశ్వస్య గుప్తయే | చక్రాద్దశగుణాధిక్యం సలిలస్య విధీయతే || 47

ఉపర్యుపరి చాన్యోన్యమేవం దశగుణాధికమ్‌ | బ్రహ్మాండమితి విజ్ఞేయం తద్ద్విజైర్మునినాయక || 48

ఇమమర్థమురీకృత్య చక్రసామీప్యవర్తనాత్‌ | సలిలస్య చ తన్మధ్యే ఇతి ప్రాహ శ్రుతిస్స్వయమ్‌ || 49

అనుగ్రహతిరో భావసంహృతిస్థితిసృష్టిభిః | కరోత్యవిరతం లీలామేకశ్శక్తియుతశ్శివః || 50

బహునేహ కిముక్తేన మునే సారం వదామి తే | శివ ఏవేదమఖిలం శక్తిమానితి నిశ్చితమ్‌ || 51

ఇతి శ్రీశివమహాపురాణ కైలాససంహితాయాం ఉపాసనామూర్తివర్ణనం నామ పంచదశో%ధ్యాయ (15).

ఈ సంసారము నిప్పు కొరివిని గిర గిర త్రిప్పినప్పుడు కానవచ్చే చక్రము వలె సృష్టిలయముల మధ్యలో నిరంతరముగా తిరుగుచుండుటచే దీనికి చక్రమను పేరు వచ్చినది (42). ఈ సృష్టి అతిశయించిన విస్తారము కలదగుటచే ఆ విధముగనే పృథివీరూపములో దర్శనమిచ్చుచున్నది. ఇందు వలననే పృథు (అధిక ప్రయోజనము నిచ్చునది ) అను పేరు దానికి కలిగినది. ప్రకాశస్వరూపుడు, మహాతేజశ్శాలి అగు శంభుని శక్తినుండి ఈ జగత్తు అనే చక్రము పుట్టినది. జ్యోతిస్స్వరూపుడగు హిరణ్యగర్భునియందు ఆశ్రయమును పొందియున్న ఈ జగత్తు నీటిచే చుట్టువారబడియున్నది. ఆ నీరు అగ్నిచే చుట్టువారబడి యున్నది (43, 44). అగ్ని వాయువుచే, విస్తారమగు ఆ వాయువు ఆకాశముచే, ఆకాశము అహంకారముచే, అహంకారము మహత్తత్త్వముచే ఆవరింపబడియున్నవి (45). ఓ మహర్షీ! అదే విధముగా మహత్తత్త్వము అవ్యక్తము (ప్రకృతి) చే ఆవరింపబడియున్నదిని ఆస్తికులగు ఆచార్యులు ఈ విధముగా విశాలమగు బ్రహ్మాండమును వర్ణించియున్నారు (46). ఈ జగత్తుయొక్క రక్షణ కొరకై ఏడు ఆవరణలు ఉన్నవని చెప్పబడినది. ఈ జగచ్చక్రము కంటె నీరు పది రెట్లు అధికముగా నున్నది (47). ఓ మహర్షీ! ఇదే విధముగా పైకిపోయే కొలదీ తత్త్వములన్నియు ఒకదానికంటె మరియొకటి పది రెట్లు ఆధిక్యమును కలిగియున్నవని విద్వాంసులు తెలియవలెను (48). బ్రహ్మాండము ఈ విధముగా చక్రము వలె తిరుగుచున్నది. ఈ విషయమునంతనూ మనసులోనిడుకొనియే బ్రహ్మండచక్రము నీటికి సమీపములో, అనగా నీటియందు ఉండుటచే(?) వేదము స్వయముగా 'సలిలస్య చ తన్మధ్యే (బ్రహ్మాండము నీటికి మధ్యలో గలదు)' అని వర్ణించి యున్నది (49). సృష్టి, స్తితి, లయము (కార్యము కారణములో లయమగుట), తిరోభావము (కారణ రూపము కూడ లయమగుట), అనుగ్రహము (మరల సృష్టిని సదాశివుడు అనుగ్రహించుట) అనే కార్యములను శక్తితో కూడియున్న శివుడు ఒక్కడే నిరంతరముగా చేయుచూ, లీలను నెరపుచున్నాడు (50). ఓ మునీ! ఇన్ని మాటలేల? నీకు సారమును చెప్పెదను. ఈ సర్వజగత్తు శక్తితో కూడియున్న శివుడు మాత్రమే అని నిశ్చయించ బడినది (51).

శ్రీశివమహాపురాణములోని కైలాససంహితయందు శివుని ఉపాసనామూర్తులను నిరూపించే పదునైదవ అధ్యాయము ముగిసినది (15).

Siva Maha Puranam-4    Chapters