Siva Maha Puranam-4
Chapters
అథ త్రయోదశో%ధ్యాయః పంచాక్షర జప విధి దేవ్యువాచ | కలౌ కలుషితే కాలే దుర్జయే దురతిక్రమే | అపుణ్యతమసాచ్ఛన్నే లోకే ధర్మపరాఙ్ముఖే ||
1 క్షీణ వర్ణాశ్రమాచారే సంకటే సముపస్థితే | సర్వాధికారే సందిగ్ధే%నిశ్చితే వాపి పర్యయే ||
2 తదోపదేశే విహతే గురుశిష్యక్రమే గతే | కేనోపాయేన ముచ్యంతే భక్తాస్తవ మహేశ్వర ||
3 దేవి ఇట్లు పలికెను - జయింప శక్యము కానిది, అతిక్రమింప శక్యము కానిది అగు కలికాలములో పాపము అనే చీకటిచే కప్పివేయబడి యున్న మానవుడు ధర్మమునందు విముఖుడు అగును (1). వర్ణములకు మరియు ఆశ్రమములకు సంబంధించిన ఆచారములు సన్నగిల్లి, ధర్మసంకటము సంప్రాప్తమగును. అందరి అధికారము సందేహములో పడును; లేదా, నిశ్చయించ శక్యము కాని విపరీతస్థితిలో పడును (2). ఆ సమయములో గురుశిష్యపరంపర నష్టమై ధర్మోపదేశమునకు ఆటంకము ఏర్పడును. ఓ మహేశ్వరా! ఆ సమయములో నీ భక్తులు ఏ ఉపాయముచే మోక్షమును పొందెదరు? (3) ఈశ్వర ఉవాచ | ఆశ్రిత్య పరమాం విద్యాం హృద్యాం పంచాక్షరీం మమ | భక్త్యా చ భావితాత్మానో ముచ్యంతే కలిజా నరాః ||
4 మనోవాక్కాయజైర్దో షైర్వక్తుం స్మర్తుమగోచరైః | దూషితానాం కృతఘ్నానాం నిందకానాం ఛలాత్మనామ్ ||
5 లుబ్ధానాం వక్రమనసామపి మత్ర్పవణాత్మనామ్ | మమ పంచాక్షరీ విద్యా సంసారభయతారిణీ || 6 మయైవమసకృద్దేవి ప్రతిజ్ఞాతం ధరాతలే | పతితో%పి విముచ్యేత మద్భక్తో విద్యయానయా || 7 ఈశ్వరుడిట్లు పలికెను - కలియందు జన్మించు మానవులు సర్వోత్కృష్టమైనది, మనోహరమైనది అగు నా పంచాక్షరీ విద్యను ఆశ్రయించి, భక్తిచే సంస్కరించబడిన అంతఃకరణములు గలవారై మోక్షమును పొందెదరు (4). మనోవాక్కాయములనుండి పుట్టిన దోషములతో చెప్పుటకు ఊహించుటకు కూడా అందని దోషములతో కూడినవారు, చేసిన ఉపకారమును మరచువారు, ఇతరులను నిందించువారు, మోసబుద్ధి గలవారు (5), లోభులు, వక్రబుద్ధి గలవారు అగు వ్యక్తులైననూ నాయందు లగ్నమైన మనస్సు గలవారైనచో, వారిని నా పంచాక్షరీ విద్య సంసారభయమునుండి తరింపజేయును (6). ఓ దేవీ! ఈ విధముగా నేను పలుపర్యాయములుప్రతిజ్ఞను చేసి యున్నాను. భూలోకములో పతితుడైన మానవుడైననూ నా భక్తుడైనచో, ఈ విద్యచే మోక్షమును పొందును (7). దేవ్యువాచ | కర్మాయోగ్యో భ##వేన్మర్త్యః పతితో యది సర్వథా | కర్మాయోగ్యేన యత్కర్మ కృతం చ నరకాయ హి | తతః కథం విముచ్యేత పతితో విద్యయా%నయా || 8 దే వి ఇట్లు పలికెను - అన్ని విధములుగా పతితుడై పోయిన మనిషి కర్మకు అనర్హుడగును. కర్మకు యోగ్యత లేనివాడు ఏ కర్మను చేసిననూ, అది వానికి నరకమును మాత్రమే కలిగించును. ఇట్టి స్థితిలో పతితుడైన వ్యక్తి ఈ విద్యచే మోక్షమును పొందుట ఎట్లు పొసగును? (8) ఈశ్వర ఉవాచ | తథ్యమేతత్త్వయా ప్రోక్తం తథా హి శృణు సుందరి | రహస్యమితి మత్వైతద్గోపితం యన్మయా పురా || 9 సమంత్రకం మాం పతితః పూజయేద్యది మోహితః | నారకీ స్యాన్న సందేహో మమ పంచాక్షరం వినా || 10 అబ్భక్షా వాయుభక్షాశ్చ యే చాన్యే వ్రతకర్శితాః | తేషామేతైర్ర్వతైర్నాస్తి మమ లోకసమాగమః || 11 భక్త్యా పంచాక్షరేణౖవ యో హి మాం సకృదర్చయేత్ | సో%పి గచ్ఛేన్మమ స్థానం మంత్రస్యాసై#్యవ గౌరవాత్ || 12 తస్మాత్తపాంసి యజ్ఞాశ్చ వ్రతాని నియమాస్తథా | పంచాక్షరార్చనసై#్యతే కోట్యంశేనాపి నో సమాః || 13 బద్ధో వాప్యథ ముక్తో వా పాశాత్పంచాక్షరేణ యః | పూజయేన్మాం స ముచ్యేత నాత్ర కార్యా విచారణా || 14 అరుద్రో వా సరుద్రో వా సకృత్పంచాక్షరేణ యః | పూజయేత్పతితో వాపి మూఢో వా ముచ్యతే నరః || 15 షడక్షరేణ వా దేవి తథా పంచాక్షరేణ వా | స బ్రహ్మాంగేన మాం భక్త్యా పూజయేద్యది ముచ్యతే || 16 పతితో%పతితో వాపి మంత్రేణానేన పూజయేత్ | మమ భక్తో జితక్రోధో సలబ్ధో%లబ్ధ ఏవ వా || 17 అలబ్ధాల్లబ్ధ ఏవేహ కోటికోటిగుణాధికః | తస్మాల్లబ్ధ్వైవ మాం దేవి మంత్రేణానేన పూజయేత్ || 18 లబ్ధ్వా సంపూజయేద్యస్తు మైత్ర్యాదిగుణసంయుతః | బ్రహ్మచర్యరతో భక్త్యా మత్సాదృశ్యమవాప్నుయాత్ || 19 ఈశ్వరుడిట్లు పలికెను - ఓ సుందరీ! నీవు చెప్పినది వాస్తవమే. అయిననూ వినుము ఈ విషయము రహస్యమని తలచి పూర్వములో నేను దీనిని దాచి యుంచితిని (9). పతితుడైన వ్యక్తి మోహమునకు వశుడై పంచాక్షరమంత్రము కాకుండా నన్ను ఇతరములగు మంత్రములతో పూజించినచో, వాడు నరకమును పొందుననుటలో సందేహము లేదు (10). ఎవరైతే గాలిని భక్షించి, లేదా నీటిని మాత్రమే త్రాగి కేవలమగు తపస్సును చేయుదురో, ఎవరైతే తమ శరీరమును వ్రతములతో కృశింప జేయుదురో, వారు ఈ వ్రతములచే నా లోకమును పొందజాలరు (11). ఎవడైతే నన్ను భక్తిపూర్వకముగా పంచాక్షరమంత్రముతో ఒకే సారి పూజించునో, వాడు కూడ ఈ మంత్రముయొక్క ప్రభావము చేతనే నా స్థానమును పొందును (12). కావున, తపస్సులు, యజ్ఞములు, వ్రతములు మరియు నియమములు పంచాక్షరమంత్రపూర్వకముగా చేసే పూజయొక్క కోటి వంతుతో నైననూ సరి దూగవు (13). బద్ధుడు గాని, ముక్తుడు గాని ఎవడైతే నన్ను పంచాక్షరమంత్రముతో పూజించునో, వాడు సంసారబంధము నుండి ముక్తుడగుననుటలో సందేహము లేదు (14). పతితుడు గాని, మూఢుడు గాని ఏ మానవుడైతే నన్ను రుద్రమంత్రము (రుద్రాధ్యాయము)తో కలిపి గాని, అది లేకుండగా గాని పంచాక్షరమంత్రముతో ఒక్కసారి పూజించునో, వాడు ముక్తిని పొందును (15). ఓ దేవీ! ఆరు (ఓంకారముతో కలిపి) అక్షరముల మంత్రముతో గాని, ఈశానుడు మొదలగు పంచబ్రహ్మలు అంగముగా గల పంచాక్షరమంత్రముతో గాని, నన్ను భక్తిపూర్వకముగా పూజించు మానవుడు ముక్తిని పొందును (16). పతితుడు, లేదా పతితుడు కానివాడు అగు నా భక్తుడు కోపమును జయించినవాడై, గురువు నుండి స్వీకరించి గాని, స్వీకరించకుండగా గాని, ఈ మంత్రముతో నన్ను పూజించవలెను (17). ఈ మంత్రమును గురువునుండి స్వీకరించినచో, స్వీకరించని దాని కంటె అది కోటి కోటి రెట్లు అధికమగు ఫలమును ఇచ్చును. ఓ దేవీ! కావున, సాధకుడు ఈ మంత్రమును గురువునుండి స్వీకరించియే నన్ను పూజించవలెను (18). ఎవడైతే మైత్రి (స్నేహభావము) మొదలగు గుణములు గలవాడై ఈ మంత్రమును గురువునుండి స్వీకరించి బ్రహ్మచర్యము నందు నిష్ఠను కలిగి భక్తితో చక్కగా పూజించునో, అట్టివాడు నా సాయుజ్యమును పొందును (19). కిమత్ర బహునోక్తేన భక్తాస్సర్వే%ధికారిణః | మమ పంచాక్షరే మంత్రే తస్మాచ్ఛ్రేష్ఠతరో హి సః || 20 పంచాక్షరప్రభావేణ లోకవేదమహర్షయః | తిష్ఠంతి శాశ్వతా ధర్మా దేవాస్సర్వమిదం జగత్ || 21 ప్రలయే సమనుప్రాప్తే నష్ఠే స్థావరజంగమే | సర్వం ప్రకృతిమాపన్నం తన్న సంలయమేష్యతి || 22 ఏకో%హం సంస్థితో దేవి న ద్వితీయో%స్తి కుత్రచిత్ | తదా వేదాశ్చ శాస్త్రాణి సర్వే పంచాక్షరే స్థితాః || 23 తే నాశం నైవ సంప్రాప్తా మచ్ఛక్త్యా హ్యనుపాలితాః | తతస్సృష్టిరభూన్మత్తః ప్రకృత్యాత్మప్రభేదతః || 24 గుణమూర్త్యాత్మనాం చైవ తతోవాంతరసంహృతిః | తదా నారాయణశ్శేతే దేవో మాయామయీం తనుమ్ || 25 ఆస్థాయ భోగిపర్యంకశయనే తోయమధ్యగః | తన్నాభిపంకజాజ్జాతః పంచవక్త్రః పితామహః || 26 సిసృక్షమాణో లోకాంస్త్రీన్న శక్తో హ్యసహాయవాన్ | మునీన్ దశ ససర్జాదౌ మానసానమితౌజసః || 27 తేషాం సిద్ధివివృద్ధ్యర్థం మాం ప్రోవాచ పితామహః | మత్పుత్రాణాం మహాదేవ శక్తిందేహి మహేశ్వర || 28 ఇత్యేవం ప్రార్థితస్తేన పంచవక్త్రధరో హ్యహమ్ | పంచాక్షరాణి క్రమశః ప్రోక్తవాన్ పద్మయోనయే || 29 ఇన్ని మాటలేల? భక్తులందరు నా పంచాక్షరమంత్రమునందు అధికారులే. కావున, అది ఇతరమంత్రముల కంటె శ్రేష్ఠమైనది (20). లోకములు, వేదములు, మహర్షులు, శాశ్వతములగు ధర్మములు, దేవతలు, ఈ సకలజగత్తు పంచాక్షరమంత్రప్రభావముచే మాత్రమే స్థితిని కలిగియున్నవి (21). ప్రళయము వచ్చి చరాచరజగత్తు అంతయు వినాశమును పొంది ప్రకృతిలో విలీనమగును. ఆ ప్రకృతి విలీనము కాదు (22). ఓ దేవీ! అప్పుడు నేను ఒక్కడిని మాత్రమే మిగిలి యుందును. ఎక్కడైననూ రెండవ వాడు లేడు. అపుడు వేదములు, శాస్త్రములు అన్నియు పంచాక్షరమంత్రమునందు ప్రతిష్ఠితములై యుండును (23). ప్రళయము తరువాత నా శక్తిచే పాలించబడిన ఆ వేదశాస్త్రములు నాశమును పొందనే పొందవు. తరువాత పురుషప్రకృతిభేదముతో కూడిన సృష్టి నానుండి ఉదయించెను (24). తరువాత గుణభేదము గల త్రిమూర్తులు, మూర్త్యాత్మలు అగు ఈశానాది పంచబ్రహ్మలు అవాంతరప్రళయములో విలీనమగుదురు. అపుడు నారాయణదేవుడు మాయామయమగు దేహమును దాల్చి నీటి మధ్యలో నున్నవాడై ఆదిశేషుడు అనే పాన్పుపై నిద్రించును. ఆయన నాభియందలి పద్మమునుండి అయిదు ముఖములు గల బ్రహ్మ పుట్టును (25,26). ఆయనకు మూడు లోకములను సృష్టించ వలెననే కోరిక ఉన్ననూ, సహాయకుడు లేకుండుటచే ఆయన ఆ పనిని చేయలేక పోయెను. ఆయన ముందుగా అనంతమగు తేజస్సు గల పదిమంది మునులను మానసపుత్రులుగా సృష్టించెను (27). ఆ పితామహుడు వారి సిద్ధి వర్ధిల్లుట కొరకై నాతో ఇట్లు చెప్పెను: ఓ మహాదేవా! మహేశ్వరా! నా పుత్రులకు శక్తిని ఇమ్ము (28). ఆయన ఇట్లు ప్రార్థించగా, నేను అయిదు మోములను ధరించి, వరుసగా అయిదు అక్షరములను బ్రహ్మకు చెప్పితిని (29). స పంచవదనైస్తాని గృహ్ణంల్లోకపితామహః | వాచ్యవాచకభావేన జ్ఞాతవాన్మాం మహేశ్వరమ్ || 30 జ్ఞాత్వా ప్రయోగం వివిధం సిద్ధమంత్రః ప్రజాపతిః | పుత్రేభ్యః ప్రదదౌ మంత్రం మంత్రార్థం చ యథాతథమ్ || 31 తే చ లబ్ధ్వా మంత్రరత్నం సాక్షాల్లోకపితామహాత్ | తదాజ్ఞప్తేన మార్గేణ మదారాధనకాంక్షిణః || 32 మేరోస్తు శిఖరే రమ్యే ముంజవాన్నామ పర్వతః | మత్ర్పియస్సతతం శ్రీమాన్మద్భక్తై రక్షితస్సదా || 33 తస్యాభ్యాశే తపస్తీవ్రం లోకం స్రష్టుం సముత్సుకాః | దివ్యం వర్షసహస్రం తు వాయుభక్షాస్సమాచరన్ || 34 తేషాం భక్తిమహం దృష్ట్వా సద్యః ప్రత్యక్షతామియామ్ | ఋషిం ఛందశ్చ కీలం చ బీజం శక్తిం చ దైవతమ్ || 35 న్యాసం షడంగం దిగ్బంధం వినియోగమశేషతః | ప్రోక్తవానహమార్యాణాం జగత్సృష్టివివృద్ధయే || 36 తతస్తే మంత్రమాహాత్మ్యాదృషయస్తపసేధితాః | సృష్టిం వితన్వతే సమ్యక్ సదేవాసురమానుషీమ్ || 37 అస్యాః పరమవిద్యాయాస్స్వరూపమధునోచ్యతే | ఆదౌ నమః ప్రయోక్తవ్యం శివాయ తు తతః పరమ్ || 38 సైషా పంచాక్షరీ విద్యా సర్వశ్రుతిశిరోగతా | శబ్దజాతస్య సర్వస్య బీజభూతా సనాతనీ || 39 లోకములకు పితామహుడగు ఆ బ్రహ్మ అయిదు మోములతో ఆ అక్షరములను స్వీకరిస్తూ, వాటికి నాకు మధ్య గల వాచ్య వాచకభావముచే నన్ను మహేశ్వరునిగా తెలుసుకొనెను (30). ఆ ప్రజాపతి మంత్రము యొక్క వివిధ ప్రయోగములను తెలుసుకొని మంత్రసిద్ధిని పొంది, మంత్రమును దాని అర్థమును యథాతథముగా తన పుత్రులకు ఇచ్చెను (31). వారు ఆ శ్రేష్ఠమగు మంత్రమును సాక్షాత్తుగా లోకములకు పితామహుడగు బ్రహ్మవద్ద నుండి పొంది, ఆయన ఆజ్ఞాపించిన మార్గముననుసరించి నన్ను ఆరాధించ వలెననే కోరికను కలిగి యుండిరి (32). మేరుపు యొక్క సుందరమగు శిఖరమునందు ముంజవాన్ అను పర్వతము గలదు. నాకు సర్వదా ప్రియమైన శోభాయుతమగు ఆ పర్వతమును నా భక్తులు సర్వదా రక్షించుచుందురు (33). లోకమును సృష్టించుటయందు గొప్ప ఉత్సాహము గల ఆ బ్రహ్మ పుత్రులు దానికి దగ్గరలో వేయ సంవత్సరములు వాయువును మాత్రమే భక్షిస్తూ తీవ్రమగు తపస్సును చేసిరి (34). నేను పూజ్యులగు ఆ బ్రహ్మపుత్రుల భక్తిని చూసి వెంటనే ప్రత్యక్షమై జగత్తు యొక్క సృష్టి వర్ధిల్లుట కొరకై, ఋషి, ఛందస్సు, కీలకము, బీజము, శక్తి, దేవత, షడంగన్యాసము, దిగ్బంధము, వినియోగము అనే మంత్రాంగములను అన్నింటినీ వారికి చెప్పితిని (35,36). తరువాత వారు మంత్రము యొక్క మాహాత్మ్యము వలన తపస్సుచే వర్ధిల్లి దేవతలు, రాక్షసులు మరియు మానవులతో కూడిన సృష్టిని చక్కగా చేసిరి (37). ఈ పరమవిద్య యొక్క స్వరూపమును ఇప్పుడు చెప్పుచున్నాను. ముందుగా నమః అని పలికి, తరువాత శివాయ అని పలుకవలెను (38). శబ్దసముదాయమునకు అంతకూ బీజభూతము మరియు సనాతనము అగు ఈ పంచాక్షరీమంత్రోపాసనము ఉపనిషత్తులన్నింటియందు గలదు (39). ప్రథమం మన్ముఖోద్గీర్ణా సా మమైవాస్తి వాచికా | తప్తచామీకరప్రఖ్యా పీనోన్నతపయోధరా || 40 చతుర్భుజా త్రినయనా బాలేందుకృతశేఖరా | పద్మోత్పలకరా సౌమ్యా వరదాభయపాణికా || 41 సర్వలక్షణసంపన్నా సర్వాభరణభూషితా | సితపద్మాసనాసీనా నీలకుంచితమూర్ధజా || 42 అస్యాః పంచవిధా వర్ణాః ప్రస్ఫురద్రశ్మిమండలాః | పీతః కృష్ణస్తథా ధూమ్రస్స్వర్ణాభో రక్త ఏవ చ || 43 పృథక్ ప్రయోజ్యా యద్యేతే బిందునాదవిభూషితాః | అర్థచంద్రనిభో బిందుర్నాదో దీపశిఖాకృతిః || 44 బీజం ద్వితీయం బీజేషు మంత్రస్యాస్య వరాననే | దీర్ఘపూర్వం తురీయస్య పంచమం శక్తిమాదిశేత్ || 45 వామదేవో నామ ఋషిః పంక్తిశ్ఛంద ఉదాహృతమ్ | దేవతా శివ ఏవాహం మంత్రస్యాస్య వరాననే || 46 గౌతమో%త్రిర్వరారోహే విశ్వామిత్రస్తథాంగిరాః | భరద్వాజశ్చ వర్ణానాం క్రమశశ్చర్షయస్స్మృతాః || 47 గాయత్ర్యనుష్టుప్ త్రిష్టుప్ చ ఛందాంసి బృహతీ విరాట్ | ఇంద్రో రుద్రో హరిర్ర్బహ్మా స్కందస్తేషాం చ దేవతాః || 48 మమ పంచముఖాన్యాహుః స్థానే తేషాం వరాననే | పూర్వాదేశ్చోర్ధ్వపర్వంతం నకారాది యథాక్రమమ్ || 49 మున్ముందుగా నా ముఖమునుండి పుట్టిన ఆ మంత్రము నన్ను మాత్రమే బోధించుచున్నది. పుటము పెట్టిన బంగారము వలె ప్రకాశించునది, పీనోన్నతస్తనములు గలది (40). నాలుగు భుజములు మూడు కన్నులు గలది, చంద్రవంకను శిరోభూషణముగా ధరించినది, పద్మమును కలువను చేతిలో పట్టుకున్నది, ప్రసన్నమగు ముఖము గలది, చేతులలో వరదముద్రను అభయముద్రను దాల్చినది (41), సకలలక్షణములతో ఒప్పారుచున్నది, సకలాభరణములతో అలంకరింపబడి యున్నది, తెల్లని పద్మము అనే ఆసనమునందు కూర్చున్నది, నల్లని గిరజాల కేశములు గలది అగు దేవత రూపములో ఈ మంత్రమును ధ్యానించవలెను (42). ప్రకాశించే కాంతులను విరజిమ్మే మండలములు గల అయిదు రకముల రంగులు ఈ దేవీమూర్తికి గలవు. అవి ఆకుపచ్చ, నలుపు, బూడిద రంగు, పసుపుపచ్చ మరియు ఎరుపు అనునవి (43). ఈ రంగులను వేర్వేరుగా ప్రయోగించే పక్షములో వాటిని బిందువు మరియు నాదముతో అలంకరించ వలెను. బిందువు అర్ధ చంద్రుని, నాదము దీపజ్వాలను పోలియుండును (44). ఓ సుందరమగు ముఖము గలదానా! ఈ అక్షరములలో రెండవ అక్షరము బీజమనియు, దీర్ఘస్వరము గల నాల్గవ అక్షరము కీలకమనియు, అయిదవ అక్షరము శక్తి అనియు తెలియు వలెను (45). ఓ సుందరమగు ముఖము గలదానా! దీనికి వామదేవుడు ఋషి, ఛందస్సు పంక్తి అని చెప్పబడినది. ఈ మంత్రమునకు దేవత శివుడనగు నేనే (46). ఓ సుందరీ! ఈ ఆయిదు అక్షరములకు క్రమముగా గౌతముడు, అత్రి, విశ్వామిత్రుడు, అంగిరసుడు, భరద్వాజుడు అను వారు ఋషులని చెప్పబడినది (47). వాటికి గాయత్రి, అనుష్టుప్, త్రిష్టుప్, బృహతి, విరాట్ అనునవి ఛందస్సులు; ఇంద్రుడు, రుద్రుడు, హరి, బ్రహ్మ, స్కందుడు దేవతలు (48). ఓ సుందరమగు ముఖము గలదానా! నకారముతో మొదలిడి క్రమముగా ఆ అయిదు వర్ణములకు తూర్పుతో మొదలిడి పైవరకు గల నా అయిదు ముఖములు స్థానములు (49). ఉదాత్తః ప్రథమో వర్ణశ్చతుర్థశ్చ ద్వితీయకః | పంచమస్స్వరితశ్చైవ తృతీయో నిహతస్స్మృతః || 50 మూలవిద్యా శివం శైవం సూత్రం పంచాక్షరం తథా | నామాన్యస్య విజానీయాచ్ఛైవం మే హృదయం మహత్ || 51 నకారశ్శిర ఉచ్యేత మకారస్తు శిఖోచ్యతే | శికారః కవచం తద్వద్వకారో నేత్రముచ్యతే || 52 యకారో% స్త్రం నమస్స్వాహా వషట్ హుం వౌషడిత్యపి | ఫడిత్యపి చ వర్ణానామంతే%ంగత్వం యదా తదా || 53 తవాపి మూలమంత్రో%యం కించిద్భేదసమన్వయాత్ | తత్రాపి పంచమో వర్ణో ద్వాదశస్వరభూషితః || 54 తస్మాదనేన మంత్రేణ మనోవాక్కాయభేదతః | ఆవయోరర్చనం కుర్యజ్జపహోమాదికం తథా || 55 యథాప్రజ్ఞం యథాకాలం యథాశాస్త్రం యథామతి | యథాశక్తి యథాసంపద్యథాయోగం యథారతి || 56 యదా కదాపి వా భక్త్యా యత్ర కుత్రాపి వా కృతా || యేన కేనాపి వా దేవి పూజా ముక్తిం నయిష్యతే || 57 మయ్యాసక్తేన మనసా యత్కృతం మమ సుందరి | మత్ర్పియం చ శివం చైవ క్రమేణాప్యక్రమేణ వా || 58 తథాపి మమ భక్తాయే నాత్యంతవివశాః పునః | తేషాం సర్వేషు శాస్త్రేషు మయైవ నియమః కృతః || 59 తత్రాదౌ సంప్రవక్ష్యామి మంత్రసంగ్రహణం శుభమ్ | యం వినా నిష్ఫలం జాప్యం యేన వా సఫలం భ##వేత్ || 60 ఇతి శ్రీశివమహాపురాణ వాయవీయసంహితాయాం ఉత్తరఖండే పంచాక్షర మాహాత్మ్యవర్ణనం నామ త్రయోదశో%ధ్యాయః (13). మొదటి, రెండవ, నాల్గవ అక్షరములు ఉదాత్తములనియు, మూడవది అనుదాత్తమనియు, అయిదవది స్వరితమనియు చెప్పబడినది (50). ఈ మంత్రమునకు మూలవిద్య, శివము (మంగళము), శైవము (శివునకు సంబంధించినది), సూత్రము, పంచాక్షరము అను పేర్లు గలవు. శైవమనబడే ఓంకారము నాయొక్క విశాలమగు హృదయమని తెలియవలెను (51). నకారము శిరస్సు; మకారము శిఖ; శికారము కవచము; వకారము నేత్రము (52). యకారము అస్త్రము. ఈ విధముగా షడంగన్యాసము చెప్పబడినది. ఈ అక్షరములకు అంతమునందు నమః, స్వాహా, వషట్, హుమ్, వౌషట్, ఫట్ అను పదములను చేర్చి అంగన్యాసమును చేయవలెను (53). దానిలోని అయిదవ అక్షరము (య) నకు పన్నెండవ అచ్చును జోడించినచో (యై), ఈ కొద్ది భేదముతో నీ మూలమంత్రము (నమశ్శివాయై) కూడ ఇదియే యగుచున్నది (54). కావున, సాధకుడు ఈ మంత్రమును జపము చేసి (మానసపూజ), దీనినే పారాయణ చేసి (వాక్కుతో చేసే పూజ), దీనితోనే హోమమును చేసి, ఈ విధముగా మనలనిద్దరినీ అర్చించవలెను (55). ఓ దేవీ! ఏ మానవుడైననూ ఏ స్థానమునందైననూ తన ప్రజ్ఞకు, బుద్ధికి, శక్తికి, సంపదకు, యోగ్యతకు, ప్రీతికి అనురూపముగా, తనకు ఉన్న సమయములో శాస్త్రవిధిని అతిక్రమించ కుండగా, భక్తితో పూజించినచో, అది వానికి ముక్తిని ఈయగలదు (56,57). ఓ సుందరీ! సాధకుడు పూజను క్రమబద్ధముగా చేసినా, క్రమరహితముగా చేసినా, నాయందు లగ్నమైన మనస్సుతో చేసినచో, అది నాకు ప్రీతికరమై, వానికి మంగళమునీయగలదు (58). అయినప్పటికీ, నా భక్తులు కేవలము అస్వతంత్రులు కాదు, సర్వశాస్త్రములలో వారికి నేనే నియమములను ఏర్పాటు చేసి యున్నాను (59). ఆ సందర్భములో నేను ముందుగా మంత్రమును స్వీకరించే శుభవిధిని గురించి చెప్పెదను. ఈ విధి లేనిచో జపము వ్యర్థము. దీని వలన జపము సఫలమగును (60). శ్రీశివమహాపురాణములోని వాయవీయసంహితయందు ఉత్తరఖండలో పంచాక్షర జపవిధిని వర్ణించే పదమూడవ అధ్యాయము ముగిసినది (13).