Sri Matsya mahapuramu-2    Chapters   

ఏక షష్ట్యుత్తరంశతతమో7ధ్యాయః.

నృసింహోపరి హిరణ్యకప్వాదికృతాస్త్రవర్షణమ్‌.

సూతః:తతో దృష్ట్వా మహాభాగం కాల చక్రమివాగతమ్‌ l నరసింహవపుశ్చన్నంభస్మచ్ఛన్నమివాలనమ్‌ . 1

హిరణ్యకశిపోః పుత్త్రః ప్రహ్లాదో నామ వీర్యవా 9lదివ్యేన చక్షుషా సింహిమపశ్యద్దేవమాగతమ్‌. 2

తం దృష్ట్వా రుక్మశైలాభ మపూర్వాం తనుమాస్థితమ్‌ l విస్మితా దానవా స్సర్వే హిరణ్యకశిపుశ్చ సః. 3

ప్రహ్ణాదకృతసింహమహిమానువర్ణనమ్‌.

ప్రహ్లాదః: మహారాజ మహాబాహోదైత్యానా మాదిసమ్భవl న శ్రుతం నైవ నో దృష్టం నారసింహమిదం వపుః. 4

అవ్యక్తప్రభవం దివ్యం కిమదం రూపమాగతమ్‌ l దైత్యాన్తకరణం ఘోరం శంసతీవ మనోమమ. 5

అస్య దేవాశ్శరీరస్థా స్సాగరా స్సరితశ్చయాః l హిమవాన్పారియాత్రశ్చ యే చాన్యే కులపర్వతాః. 6

చన్ద్రమాస్సహనక్షత్రై రాదితగా శ్చాశ్విభిస్సహl ధనదో వరుణశ్చైవ యమశ్శక్ర శ్శచీపతిః. 7

మరుతో దేవగన్దర్వా ఋషయశ్చ తపోధనాఃl నాగా యక్షాః పిశాచాశ్చ రాక్షసా భీమవిక్రమాః. 8

బ్రహ్మా దేవః పశుపతిర్లలాటస్థా భ్రమన్తివై l స్థావరాణిచ సర్వాణి జజ్గమాని తథైవచ. 9

భవాంస్తు సహితోస్మాభి స్సర్వైర్దైత్యగణౖ ర్వృతః l విమానశతసజ్కీర్ణా తథైవ భవతస్సభా. 10

సర్వం త్రిభువనం రాజన్లోకధర్మశ్చ శాశ్వతాఃl దృశ్యన్తే నరసింహే7 స్మిం స్తథేదవ మఖిలం జగత్‌. 11

ప్రజాపతిశ్చాత్ర మనుర్మహాత్మా గ్రహాశ్చ యోగాశచ మహీ నభశ్చl ఉత్పాతకాలశ్చ ధృతిస్మ్సృతిశ్చ రతిశ్చ సత్యంచ దమస్తవశ్చ. 12

సనత్కు మారశ్చ మహానుభావో విశ్వేచ దేవా ఋషియశ్చ సర్వే l క్రోధశ్చ కామశ్చ తథైవ హర్షో ధర్మశ్చ మోహః పితరశ్చ సర్వే. 13

నూట అరువది యొకటవ అధ్యాయము.

ప్రహ్లాద కృత నరసింహస్తుతి- హిరణ్యకశివుడు ఆ దేవునిపై అస్త్రములు వర్షించుట.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను: కాలచక్రమువలె (కాలుడు ప్రయోగించిన చక్రాయుధము. కాలా త్మకమగు చక్రము-అను రెండర్థములును ఇచట అన్వయించును.) వచ్చిన ఆ మహాభాగుని నరసింహుని చూచి హిరణ్య కశిపు పుత్త్రుడు వీర్యవరతుడునగు ప్రహ్లాదుడు అనునాతడు- ఈ వచ్చిన యాతడు నిపురుకప్పిన నిప్పువలె నరిసింహ శరీరము కప్పుకొనిన పురుషోత్తమ దేవుడేయని తన దివ్య (జ్ఞాన) నేత్రముతో చూచి ఎరిగెను. బంగరు కొండవంటి ఆ పూర్వ శరీరము దాల్చియున్న ఆ నృసింహుని చూచి దానవులందరును హిరణ్యకశివుడు కూడ ఆశ్చర్యపడిరి.

అపుడు హిరణ్యకశిపునితో ప్రహ్లాదుడిట్లనెను: మహారాజా! మహాబాహూ! దైత్యులలో మొదటి జనించినవాడా! ఇట్టి నారసింహ రూపము ఇదివరకు వినినదియు కనినదియుకాదు; అవ్యక్త పతత్త్వము (మాయతో అనుబద్ధమగు పరమాత్మతత్త్వము -దీనినే మాయా శబలమందురు.) నకు కూడ ప్రాదుర్బావ కారణమగు (కారణ కారణమగు) పరమాత్మ రూపమే ఇట్లు వచ్చినదేమో! ఈ ఘోర రూపము దైత్యనాశకరమేమో యని నామనస్సు చెప్పుచున్నట్లున్నది. ఈ దేవుని శరీరమున సాగరములు నదులు హిమవత్పారియాత్రాది కులపర్వతములు చంద్రుడు నక్షత్రములు అదిత్యులు అశ్వినులు కుభేర వరుణ యమ శచీపతి మరుత్తులు దేవతలు గంధర్మలు మునులు ఋషులు నాగయక్ష పిశాచులు భయంకర విక్రములగు రాక్షసులు బ్రహ్మరుద్రులు ఈతని లలాటమున తిరుగుచున్నారు. స్థిరచర ప్రాణులు పదార్థములు నేను మొదలగు ఈ దైత్యగణములతో కూడ నీవు నూరులకొలది విమానములతో నిండిన ఈ నీ సభ సర్వ తరిభువనము శాశ్వతములగు లోక ధర్మములు అభిల జగమును ఈ నరసింహునియందు కనబడుచున్నవి. మహాత్ములకు ప్రజాపతులు మనువులు గ్రహములు యోగములు భూమ్మంతరిక్షములు ఉత్పాత సమయము ధృతి (నిబ్బరము) స్మృతి రతి (అసక్తి- ఆనందము) సత్యదమ తపస్సులు మహానుభావుడగు సనత్కుమారుడు (ననత్‌-సదా; ఎల్లపుడు; కుమారుడుగానే ఉండు నివృత్తి మార్గ ప్రవృత్తుడయిన మహాయోగి) విశ్వదేవులు సర్వ ఋషులు కామక్రోధ ధర్మ హర్ష మోహములు సర్వపితరులు అందరు ఈ నృసింహునిరుందు కనబడుచున్నారు.

సూతః: ప్రహ్లాదసగ వచశ్శ్రుత్వా హిరణ్యకశిపుః ప్రభుః l ఉవాచ దానవాన్త్సర్వా స్త్సగణాంశ్చ గణాధిపా9. 14

మృగేన్ద్రోగృహ్యతామేష అపూర్వం సత్త్వమాస్థితః l యది వా సంశరుః కశ్చిద్బధ్యతాం వనగోచరః. 15

తేదానవగణాస్సర్వే మృగేన్ద్రం భీమవిక్రమమ్‌ l పరిక్షిపన్తో ముదితా స్త్రాసయామాసు రోజసా. 16

సింహనాదాన్‌ విముచ్చాథ నరసింహో మహాబలః l బభ ఞ్జ తాం సభాం సర్వాం వ్యాదితాసగ ఇవాన్తకః. 17

నృసింహోపరి హిరణ్య కశిప్వాదికృతనానాశస్త్రా స్త్రవర్షణమ్‌.

సభాయాం భజ్యమానాయాం హిరణ్యకశిపు స్స్వయమ్‌ l చిక్షేపాస్త్రాణి సింహస్య రోషాద్వ్యాకులలోచనః. 18

ప్రహ్లాదుని మాటవిని ప్రభువగు హిరణ్యకశిపుడు దానవ *గణములతో గణాధిపతులతో అందరతో '' ఎన్నడును ఎరుగని సత్త్వము (ప్రాతి) ఇదేదియో సింహమువలె కనబడునది వచ్చినది; దీనిని పట్టుకొనుడు; మీకేదయిన సంశయము ఉన్నాదా? ఇది వనమృగమ్‌ ; మరేదియుకాదు; బంధించుడు.'' అనెను. ఆ గణ దానవులందరును భయంకర విక్రమము గల అ మృగేంద్రుని చుట్టు ముట్టుచు సంతోషముతో తమ శక్తికొలది భయపెట్టసాగిరి. అంతట మహాబలుడగు నరసింహుడు యముడువలె నోరు తెరచి సింహనాదములు చేయుచు ఆ సంభనంతటిని విరుగగొట్టెను. అది చూచి హిరణ్య కశివుడు రోషవ్యాకులనేత్రుడయి తానే అ సింహముర్తిపై అస్త్రములను విసరసాగెను.

సర్వాస్త్రణామథ జ్యేష్ఠం దణ్డమస్త్రం సుదారుణమ్‌ l కాలచక్రం తథా ఘోరం విష్ణుచక్రం తథాపరమ్‌. 19

పైతామహం తథాత్యుగ్రం త్రైలొక్య దహనం మహత్‌ l విచిత్రామశనించైవ శుష్కార్ద్రం (చా) వాశనిద్వయమ్‌.

రౌద్రం తథోగ్రం శూలంచ కాలంచ ముసలం తథాl మె%ాహనం శోషణంచైవ సన్తాపనవిలాపనమ్‌. 21

వాయవ్యమథనం చైవ కాపాలమథ కైకరమ్‌ lతథా7ప్రతిహతాం శక్తిం క్రౌఞ్చమస్త్రం తథైవచ. 22

అస్త్రం బ్రహ్మశిరశ్చైవ సోమాస్త్రం శైశిరం తథా l కమ్పనం పశాతనంచైవ త్వాష్ట్రంచైవ సుభైరవమ్‌. 23

కాలముద్గరమక్షోభ్యం తపనంచ మహాబలమ్‌ l సంవర్తనం మోహనంచ పతథా మారూధరం పరమ్‌. 24

గాన్ధర్వమస్త్రం దయిత మచిరత్నంచ చన్దనమ్‌ l ప్రస్వాపనం ప్రమథనం వారుణం చాస్త్రముత్తమమ్‌. 25

అస్త్రం పాశుపతం చైవ యస్మాప్రతిహతా గతిః l అస్త్రం హయశిరశ్చైవ బ్రాహ్మమస్త్రం తథైవచ. 26

నారాయణాస్త్రమైన్ద్రంచ సార్పమస్త్రం తథాద్బుతమ్‌ l పైశాచమస్త్రమజితం శోషదం శామనం తథా. 27

మహాబలం భావనంచ ప్రస్థాపనవికమ్పనే l ఏతాన్యస్త్రాతి దివ్యాని హిరణగ కశిపుస్తదా. 28

అసృజన్న రసింహస్య దీప్తస్యాగ్నే రివాహుతిమ్‌ l ఏతన్యస్త్రాణి దివ్యాని హిరణ్యకశిపుస్తదా.

అసృజన్నరసింహసగ దీప్తస్యాగ్నే రివాహుతిమ్‌ l అసై#్త్రః ప్రజ్వలితై స్సింహ మావృణో దసురోత్తమః. 29

వివస్వా9 ఘర్మసమయే హిమవన్త మివాంశుభిః l

_____________________________________________________________________________

ఒక్కొక్క పెద్దనుబట్టి ఏర్పడిన వర్గములు గణములు; ఆవర్గపు పెద్దలు గణాధిపతులు; వైప్రచిత్తులు మొదలగు వారు గణ దానవులు; విప్రచిత్తి మొదలగువారు గణాధిపతులు.

అస్త్రములన్నిటిలో పెద్దది (గొప్పది)యు మహాదారుణమునగు దండాస్త్రము ఘోరమగు కాలచక్రము విష్ణు చక్రము ఉగ్రమును త్రిలోక దాహకమునగు పైతామహము విచిత్రాశని శుష్కాశని అర్ద్రాశని ఉగ్రమగు రౌద్రము శూలము కాలము ముసలము మోహనము శోషణము సంతాపనము (తాపముకలిగించునది) విలాపనము (ఏడ్పించునది. కన్నుల వెంట నీరు కారునట్లు చేయునది.) వాయవ్యము మథనము కపాలము కైకరము(కేకర సంబంధి) అపత్రిహత మగు (ఎదురులేని) శక్తి క్రౌంచము బ్రహ్మశిరము సోమము శైశిరము (శిశిరము-మంచు- నకు సంబంధించినది) కంపనము (వణకించునది) శాతనము (చెక్కునది) మహాభయంకరమగు త్వాష్ట్రము అక్షోభ్యమగు (కలత పరచనలవికాని) కాల ముద్గరము మపా%ాబలమగుతపనము నంవర్తనము మోహము మాయాధరము ప్రీతికరమగు గాంధర్ము సూతనమగు చందనము (అహ్లాదకరము) ప్రస్వాపనము (నిదురింపజేయునది) ప్రమథనము వారుణము ఎదుయలేని నడకగల పాశుపతము హయశిరము బ్రాహ్మము నారాయణము ఐంద్రము అద్బుతమగు సార్పము ఓటమి నెరుగని పైశాచము శోషదము శామనము మహాబలముకల భావనము ప్రస్వాపనము వికంపనము- అను ఈ దివ్యాస్త్రములను హిరణ్యకశివుడు ప్రజ్వలించు అగ్నిపై అహుతినివలె నరసింహునిపయి ప్రయోగించెను. వేనవియందు సూర్యుడు తన కిరణములతో హిమవంతునివలె ఆ సురోత్తముడు ప్రజ్వరిల్లు అస్త్రములతో నరసింహుని క్రమ్మివేసెను.

సహ్యమర్షానిలోద్దూతో దైత్యానాం సైన్యసాగరః. 30

క్షణన ప్లావయామాస మైనాకామివ సాగరఃl ప్రాసైః పాశైశ్చ ఖడ్గైశ్చ గదభి ర్మనలై స్తథా. 31

వజ్రై రశనిభిశ్చైవ సాగ్నిభిశచమహాద్రుమైః l ముద్గరైర్బిణ్డివాలైశ్చ శిలోలూఖలపర్వతైః. 32

శతఘ్నీభిశ్చ దీప్తాభి ర్దణ్డౖరపి సుదారుణౖ తేదానవాః పాశగృహీతహస్తా %ుహేన్ద్రవ జ్రాశనితుల్యవేగాః.

సమన్తతో7భ్యుద్యతబాహుకాయా స్థ్సితా స్త్రీశీర్షాఇవ నాగపోతాఃl సువర్ణమాలాకులభుషితాజ్గా శ్చీనాంశుకాభోగవివర్తతాజ్గాః 34

ముక్తావలీదామవిభూషితాజ్గా హంసాఇవభాన్తి విశాలపక్షాఃl తేషాంతు వాయుప్రతిమౌజసాం వై కేయూరమౌళివలయోత్కటానామ్‌. 35

తాన్యు త్తమాజ్గాన్యభితా%ో విభాన్తి ప్రభాతసూర్యాంశుసమప్రభాణి l క్షిపద్బిరుగ్రైర్జ్వలితైర్మహాబలై ర్మహాస్త్రపూగే%ొ%ు సమావృతో బభౌ. 36

గిరిర్యథా సన్తతవర్తిభిర్ఝనైః కృతాన్దకారాన్తరనక్దరోద్రుమైఃl

తైర్హన్యమానోపి మహాస్త్రజాలై ర్మహాబలై ర్దైత్యగణౖ స్సమేతైః. 37

నాకమ్పతాజా భగవాన్పతాపాత్‌ స్థితః ప్రకృత్యా హిమవానివాచల ఃl సన్త్రాసితాస్తే నరంసింహరూపిణా దితేస్సుతాః పావకతుల్యతేజసా. 38

భయాద్విచేలుః పవనోద్దతా యథా మహోర్మయ స్సాగర వారిసమ్బవాః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ హిరణ్య కశిపూపాఖ్యానే నృసింహోపరి హిరణ్య

కశిప్వాదికృతాస్త్రవర్షకథనం నామ ఏకషష్ట్యుత్తర శతతమో7ధ్యాయః.

కోపమనెడు వాయువు చెలరేపగా దైత్యసేన యనెడి సాగరము క్షణములోనే సముద్రము మైనాకునివలె ప్రానపాశ ఖడ్గ గదా మునల వజ్రాశనులతో అగ్ని సహతములై మండు మహావృక్షములతో ముద్గర భిండివాల శిలలతో రోళ్ళ (నెడు ఆయుధములతో పర్వతములతో మండుచుండు శతఘ్నులతోమహాభయుంకర దండములతో ఆ నరసింహదేవుని ముంచివేసెను. ఆదానవులు హస్తములందు పాశములు గ్రహించి మహేంద్ర వజ్రములతో ఆశనులతో సమానవేగము (తీవ్రత) కలిగి పైకెత్తిన బాహువులతో ఉన్నత శరీరములతో మూడు తలల నాగకుమారులవలె నర సింహుని చుట్టు నిలిచిరి. బంగరు మాలలతో కల్లోలితముగా అలంకరించుకొన్న అవయవములతో విశాలములగు పట్టు వస్త్రములతో చుట్టబడిన శరీరములతో ముతైపుగుత్తుల సరులతో అలంకరింపబడిన దేహములతోవిశాలములగు రెక్కలు గల హంసలవాలె వారుండిరి. వాయు సమ సామర్థ్యము కలిగి భుజకీర్తులతో శిరోవలయ (కిరీట) ములతో హద్దుమీరి(న అందము గలిగి) యున్న ఆ దానవ శిరములు ప్రభాత రవి కిరణ నమ తేజస్సులతో అన్ని వైపులను కనబడుచుండెను. ఉగ్రులై జ్వలించుచు తనపై శస్తా స్త్రములు విసరు ఆ మహాబలులు ప్రయోగించు మహాస్త్ర సమూహములను బాణములును తను క్రమ్మగా ఎడతెగక తనపయినున్న దట్టములగు చెట్లతో చీకట్లు క్రమ్మిన కందరములు నడుమభాగముగల పర్వతమువలె నరసింహుడుండెను. మహా బలులగు దైత్యగణముల వారందరు కూడి మహాస్త్ర జాలములతో కొట్టుచున్నను ఆ భగవానుడా యుద్ధమున హిమాచలమువలె తన స్వభావమందు (ఉన్నవాడున్నట్లు) నిలిచెనేకాని ఏమాత్రమును కంపించలేదు. (కాని) ఆ దితిసుతులు అగ్ని సమాన తేజస్కుడు నరసింహ రూపుడనగు ఆ దేవునిచే సంతాపితులయియు భయమందియు సాగర జలములతో ఏర్పడిన పెద్ద ఆలల పెనుగాలిచేవలె మిక్కిలిగ చలించిరి.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున హిరణ్య కశిపూపాఖ్యానమున హిరణ్యకశిపు ప్రభృతులు

నరసింహునిపై శస్త్రాస్త్రములు వర్షించుటయను నూట ఆరువది ఒకటవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters