Sri Matsya mahapuramu-2    Chapters   

ద్విషష్ట్యుత్తరశతతమో7ధ్యాయః.

హిరణ్యకశిపువధాదికథనమ్‌.

సూతః: ఖరాః ఖరముఖాశ్చైవ మరరాశీవిషాననాఃl ఈహామృగముఖాశ్చాన్యే వారాహముఖసంస్థితాః. 1

బాలసూర్యముఖ్యాశ్చాన్యే ధూమకేతుముఖాస్తథా l అర్దచన్ద్రాభవక్త్రాంశ్చ అగ్నిదీప్తముఖాస్తథా . 2%ి

హంసకుక్కుటవక్త్రాశ్చ వ్యాదితాస్యా భయావహఃl సింహాస్యా లేలిహానాశచ కాకగృధ్రముఖాస్తథా. 3

విద్యుజ్జిహ్వాశ్చ క్రశీర్షా స్తథోల్కాముఖసంస్థితాః l*కపోతకముఖాశ్చాన్యే దానవా బలగర్వితాః. 4

కైలాసవపుషస్తస్య శరీరే శరవృష్టయఃl అవధ్యస్య మృగేన్ద్రస్య న వ్యథాశ్చక్రుద్దా నిశ్వసన్త ఇవోరగాః. 6

తేదానవశరా ఘోరా దావేన్ద్రసమీరితాః l విలయం జగ్మురాకాశే ఖద్యోతా ఇవ పర్వతే. 7

తతశ్చ క్రాణి దివ్యాని దైత్యాః క్రోదసమన్వితాఃl మృగేన్ద్రాయా సృజన్నాశు జ్వలుతాని సమన్తతః. 8

తైరాసీద్గగనం చక్రై స్సమ్పతద్భి రితస్తతఃl యుగాన్తే సమ్ప్రకాశద్భి శ్చన్ద్రాదిత్యగ్రహైరివ. 9

తాని సర్వాణి చక్రాణి మృగేన్ద్రే ణ మహాత్మనా l గ్రస్తాన్యుదీర్ణాని తదా పావకార్చిస్సమానిచ. 10

తాని చక్రాతి వదనం విశమానాని భాన్తివైl మేఘోదరదరీష్వేవ చన్ద్రసూర్యగ్రహా ఇవ . 11

హిరణ్యకశిపుర్దైత్యో భూయః ప్రాసప్య జదూర్జితామ్‌ l శక్తిం ప్రజ్వలితాం రౌద్రాం ధౌతాంశస్త్రతటిత్ప్రభామ్‌. 12

తామపతన్తీముత్ప్రేక్ష్య మృగేన్ద్ర శ్శక్తిముత్తమామ్‌ l హుజ్కారేణౖవ రౌద్రేణ బభఞ్జ భగవాంస్తదా. 13

రరాజ భగ్నాసా శక్తి ర్మృగేన్ద్రేణ మహితలే l సవిస్పులిజ్గా జ్వలితా మహోల్కేవ దివ శ్చ్యుతా. 14

నారాచపజ్త్కి స్సింహస్య ప్రాప్తా రేజేవిదూరతః l నీలోత్పలపలాశానాం మాలేవోజ్జ్వలదర్శనా. 15

నూట అరువది రెండవ అధ్యాయము.

హిరణ్యకశిపు వధాది కథనము.

సూతుడు ఋషులకింకను ఇట్లు చెప్పసాగెను. గాడిదలు పాములు మొనళ్ళు ఈహా మృగములువరాహములుహంసలు కోళ్ళు సింహములు కాకులు గ్రద్దలు పాపవురములు-ఈ ప్రాణుల మోములవంటి బాలసూర్యుడు ధూమకేతువు అర్ధ చంద్రుడు ప్రజ్వలించు అగ్ని మెరుపులు చక్రములు కొరవులు-నీటిని పోలిన మొగములు కలిగి నోరులు తెరచుకొని భయంకరులై నాలుకలు కోయుచు బలగర్వితులుగు దానవులకు కైలాస సదృశ శరీరము కలిగి అవధ్యుడగు అ మృగేంద్రునిపై యుద్ధమందు కురియించిన బాణ వర్షములు అతనికి ఏమియు వ్యథ కలిగించలేదు. దాన వేశ్వరులపుడింకను మరికొనీ ఘోర బాణముల నామృగేంద్రునిపైత సర్పములవలె బుసకొట్టుచు క్రుద్దులయి ప్రయోగించిరి. కాని దానవేంద్రులు ప్రయోగించిన ఆఘోర శరములన్నియు పర్వతమునందు మెరపులువలె అ నృసింకహ శరీరమున లయమందెను. అంతట దైత్యులు క్రోధ సమన్వితులయి జ్వలించు చక్రములను అన్ని వైపులనుండి శీఘ్రముగా అతనిపై నిసరిరి. అనీ వైపులనుండి పడుచున్న చక్రములతో అకాశము ప్రళయకాలమున మిగుల ప్రకాశించు చంద్రాదిత్యాది గ్రహములతోవలె వెలుగుచు కనబడెను. అగ్ని జ్వాలలవలె చెలరేగు ఆ చక్రములనన్నిటిని మహాత్ముడా మృగేంద్రుడుమ్రింగెను . అవి అతని నోటిలోనికి పోవుచు మేఘవు నడుచు అనుగుహలలో చొరు చంద్ర సూర్యాదులవలె నుండెను. మరల హిరణ్య కశిపు దైత్యుడు చాల పెద్దదియై ప్రజ్వలించుచు భయంకరమై శుద్ద మొనర్చబడి తనయందలి ఆయుధములనుండి వెలువడు మెరపుల కాంతులతో వ్యాప్తమయిన శక్తిని ప్రయోగించెను. తనపైకి వచ్చిపడుచున్న ఉత్తమ శక్తిని మృగేంద్ర భగవానుడు భయంకర హుంకారముతో విరచెను. అది విరిగి నేలపయి బడుచు నిప్పురవ్వలతో ఆంతరిక్షమునుండి రాలిపడు మహోక్కవలె కనబడెను. (రాక్షసులు ప్రయోగించు) శరపంక్తి నృసింహునికి దూరమందే నిలిచి ప్రకాశించు రూపముకల నల్ల కలువ వూరేకుల దండలవలె కనబడెను.

___________________________________________________________________________

స గర్జిత్వా యథాన్యాయం విక్రమ్యచ యథాసుఖమ్‌ l తత్సై న్యముత్సాదితవాం స్తృణా గ్రానీ మారుతః. 16

తతోశ్మవర్షం దైత్యేన్ద్రా వ్యసృజన్త నభోగతాః l నగమాత్రైశ్శిలాఖణ్డౖర్ణిరిశృజ్గై ర్మహాప్రభైః. 17

తదశ్మవర్షం సింహస్య మహస్మూర్ద్ని నిపాతితమ్‌ l దిశో దశ వికీర్ణం వై ఖద్యోతప్రకరా ఇవ. 18

తదాశ్మౌఘైర్దైత్యగణాః పునస్సింహమరిన్దమమ్‌ l ఛాదయాంచ క్రిరేమేఘా ధారాభిరివ పర్వతమ్‌ . 19

న తం స ఞ్చలయామాసుర్దైత్యౌఘా దేవసత్తమమ్‌ lభీమవేగో7చల శ్రేష్ఠం సముద్రఇవ మన్దరమ్‌. 20

తతోశ్మవర్షే పతితే జలవర్షమనస్తరమ్‌ lధారాభిరక్షమాత్రాభిఃప్రాదురాసీత్సమన్తతః. 21

సభసః ప్రచ్యుతా ధారా స్తిగ్మవేగా స్సమన్తతః l ఆవవ్రే సతతం వ్యోమ దిశశ్చ విధిశస్తథా. 22

ధారా దివిచ సర్వత్ర వసుధాయాం చ సర్వశః l నస్పృశన్తిస్మ తాదేవం నిపతన్తో7నిశం భువి. 23

బాహ్యతో వవృఘర్వర్షం నోవరిష్టాచ్చ తాస్తదా l మృగేన్ద్ర ప్రతిరూపసగ స్థితస్య యుధి మాయయా. 24

హతేశ్మవర్షే తుములే జలవర్షే విశోషితే l సో7సృజద్దానవో మాయామగ్ని వాయుసమీరితామ. 25

మహేన్ద్రస్తోరుదైస్సార్ధం సహస్రాక్షో మహాద్యుతిః l మహతా తోయవర్షేణ శ్తమరూమాస పావకమ్‌. 26

తస్యాం ప్రతిహతాయాంతు మాయాయాం రుధి దానవః l అసృజద్ఝోరసజ్కాశం తమస్తీవ్రం సమన్తతః.

తమసా సంవృతే లోకే దైత్యేష్వాత్తాయుధేషు చ l స్వతేజసా పరివృతో దివాకర ఇవాబభౌ. 28

త్రిశాఖాం భ్రుకుటీం చాసగ దదృశుర్దానవా రణ l లలాటస్థాం త్రిశులాజ్కాం గజ్గాం త్రవథగామివ. 29

తతస్సర్వాసు మాయాసు హతాసు దితినన్దనాః l హిరణ్యకశిపుం దైతగం వివర్ణాశ్శరణం యయుః. 30

అ దేవుడు యథా న్యాయముగా (లోకమందలి అన్ని సింహములవలె) గర్జించి యథా సుఖముగా (లోక సాదారణ సింహమువలె) విక్రమించి గాలి గడ్డికొనలను వలె ఆ సేనను నశింపజేసెను. అంతట దైత్యేంద్రులు అకాశమందుండి మహాకాంతిగల కొండలంతటి శిలా ఖండములతో గిరి శృంగములతో రాల వాన కురియించిరి. అది ఆ దేవుని తలపయి పడియు మిణుగురు పురువుల గుంపులవలె పది దిక్కులకు చెదరెను. మరల వారు శత్రు నాశకుడగు అతనిని మేఘములు జలధారలతో కొండనువలె రాలరాసులతో కప్పిరి. అయినను భయంకర వేగముగల సముద్రము పర్వత శ్రేష్ఠమగు మందరమును కదల్చలేనట్లే వారా దేవుని చలింపచేయలేకపోయిరి. ఇట్లది వ్యర్థమయి పడిపోగా జలవర్షము ఇరునంత లావగు ధారలతో అన్ని వైపులనుండి పడసాగెను. ఆకాశమునుండి తీవ్రవేగము గలిగి అన్ని వైపుల నుండి పడుజలధారలతో అకాశము దిక్కులు విదిక్కులు అంతరిక్షము ద్యులోకము భూమి-అంతరు క్రమ్మబడెను. కాని అవి అ దేవుని తాకనైన తాకకుండెను. అధారలుయుద్దమున మృగేంద్ర రూపమున నిలిచిన అతనికి వెలువపలనే కాని మీద పడకుండెను ఇట్లు రాల వాన అణగగా నీటివాన ఎండగా అ దానవుడు అగ్నివాయువులను చెలరేపుచు మాయను పన్నెను. సహస్ర నేత్రుడగు మహేంద్రుడా యగ్నిని మేపుములతో కూడ కురించిన మహాజల వర్షముతో చల్లార్చెను. అదియు శమించగా ఆ దానవుడు అన్ని వైపులనుండి ఘోరమయి క్రమ్ము తీవ్రాంధకారమును సృజించెను. ఇట్లు క్రమ్మిన చీకటి నడుమ దానవు లాయుధములుపట్టి చుట్టు నిలువగా భగవానుడ సూర్యుడువలె తన తేజముచే చుట్టబడి ప్రకాశించెను. మరియు దానవు లా దేవుని లలాటమున త్రిశూలపు గురుతులతో మూడుగా చీలిన కనుబొమ ముడిరేక త్రిపథగయగు (మూడు త్రోవల ప్రవహించు) గంగవలె కనబడెను. ఇట్లు తమ మాయలన్నియు పాతములుకాగ దైత్యులువివర్ణుయి హిరణ్యకశిపుని శరణువేడిరి.

హిరణ్యకశిపో ర్వినాశసమయే నానావిధోత్పాతప్రాదుర్భావః.

సచ ప్రజల్వితః క్రోధాత్ప్రదహన్నివ తేజసాl తస్మిన్న్రు ద్దేతు దైత్యే న్ద్రే తమోభుతమభూజ్జగత్‌. 31

అవహః ప్రవహశ్చైవ వివహోథ హ్యు దావహః l పరావహస్సంవహశ్చ మహాబలపరాక్రమాః. 32

తథా సరివహశ్శ్రీమా నుత్పాతభుయశంసినః l ఇత్యేతే క్షుభితా స్సప్త మరుతో గగనేచరాః. 33

యే గ్రహా స్సర్వలోకస్య క్షయే ప్రాదుర్భవల్తివై l తే సర్వే గగనే దృష్టా వ్యచరన్త యథాసుఖమ. 34

అన్యంప గతే చాప్యచర న్మార్గం నిశి నిశాచరః l సగ్రహైశ్చ సనక్షత్రై స్తారాపతిర రిదన్దముః. 35

వివర్ణతాంచ భగవాన్గతో దివి దివాకరః l కృష్ణం కబద్దుంచ తథా లక్ష్యతే సుమహద్దివి. 36

అము ఞ్చచ్చార్చిషాం బృన్దం భుమివృత్తిర్విభావసుః l గగనస్థశ్చ భగవా నభీక్‌ష్ణం పరిలక్ష్యతే. 37

సప్త ధూమ్రనిభా ఘోరా స్సార్యాదివ సముద్థితాః l సోమస్య గగనస్థస్య గ్రహాస్తిష్ఠన్తి శృజ్గగాః. 38

వామేతు దక్షణ చైవస్థతౌ శుక్రబ్రహస్పతీ l శ##నైశ్చరో లోహితాజ్గో జ్వలనాగ్ని సమద్యుతి. 39

సమం సమధిరోహన్త స్సర్వే తే గగనేచరాః l శృజ్గాణి శనకైర్ఝోరా యుగాన్తవర్తినో గ్రహాః. 40

చన్ద్రమాశ్చ సనక్షత్రై ర్గ్రహైస్సహ తమోనుదః l చరాచరవినాశాయ రోహిణీం నాబఢ్యనన్దత.41

గృహీతో రాహుణా చన్ద్ర ఉల్పాభిరభిహన్యతే l ఉల్కాః ప్ప్రజ్వలితాశ్చన్ద్రే విచరన్తి యథా సుఖమ్‌. 42

దేవానామపి యో దేవస్సో7ప్యవర్షత శోణితమ్‌ l అపతన్గగనాదుల్కా విధ్యుద్రూపా మహాస్వనాః. 43

అకాలేచ ద్రువసాస్సర్వే పుష్ప్యన్తి చ ఫలన్తిచ l లతాశ్చ సఫలాస్సర్వా యేచాపూ ర్దైత్యనాశనమ్‌. 44

హిరణ్యకశిపుని మృతిని సూచించు ఉత్పాతములు.

అ హిరణ్యకశిపుడును తన తేజస్సుతో మిగుల దహించువాడు వలె క్రోధముతో ప్రజ్వలించసాగెను. దానితో జగత్తు తమస్సుతో నిండెను. అవహము ప్రవహము వివహము ఉదావహము పరావవహము సంవహము పరివహము అను శ్రీమంతములను మహాబల పరాక్రమములను అగు గగన సంచారులగు ఈ సప్త వాయువులును ఉత్పాత భయమును సూచించుచు క్షోభిల్లెను. సర్వలోక క్షయ(ప్రళయ) కాలమున ప్రాదుర్భవించు గ్రహములు గగనమున తమ ఇచ్చకు వచ్చినట్లు తిరుగుచు కనబడెను. శత్రు నాశకుడు తారాపతి నిశాకరుడు నగు చంద్రుడ తన సహజ మార్గమున విడిచి గ్రహనక్షత్రములతో కూడి మరియొకమార్గమున సంచరింపసాగెను. పగలు సూర్య భగవాను వివర్ణుడయ్యెను. అంతరిక్షమున నల్లని పెద్ద మొండెము కనబడెను . అగ్ని భగవానుడు భుమిపై ఉండియు అచట జ్వాలలతో వెలుగక మాటిమాటికి ఆకాశమున మండుచు కనబడెను. అంతరిక్షమున పొగ వన్నెతో వెలుగు సప్త సూర్యులు ఉదయించి కనబడిరి. అంతరిక్షమున వెలుగు చంద్రుని కొమ్ములపై (పూర్ణమ కాని తిధులందు) గ్రహములు-ఎడమ కొమ్మన శుక్రుడు కుడి కొమ్మున బృహస్పతి ఎడును శనియు కుడి కొమ్మున అంగారకుడును ఈ ఇద్దరును మండు అగ్నివలె నుండి కనబడిరి. యుగాంతమున మాత్రమే ఇట్లు కనబడవలసిన అ గ్రహములు మెల్లగ ఇట్లు చంద్రశృంగములపై నిలిచ కనబడెను. గ్రహములతోనక్షత్రములతో కూడి రోహిణీ సహితుడై లోకపు చీకట్లు పోగొట్టువలసిన చంద్రుడు రోహిణిని మెచ్చక ఆమెకు దూరమయ్యెను. ఇది చరాచరలోకనాశ సూచకము. చంద్రుని రాహువు (పూర్ణిమ కాకయే ) మ్రింగెను. ఉల్కలు చంద్రుని క్రమ్మెను. అవి ప్రజ్వలించుచు తమ ఇచ్చ వచ్చిన కక్ష్యలలో చంద్రుని ఆశ్రయించి తిరుగసాగెను. దేవతలకు దేవుడు (రాజు) అగు ఇంద్రుడు నెత్తుటి వాన కురియించెను. గగనమునుండి మహాధ్వనులతో మెరపువంటి ఉల్కలు పడెను. వృక్షము లకాలమందు పూచెను; ఫలించెను. (పండ్లు పండని) తీగలు ఫలించెను. ఇవన్నియ ఇట్లు దైత్యనాశమును సూచించెను.

ఫలైః ఫలాన్య జాయన్త పుషై#్పః పుష్పం తథైవచ l ఉన్మీలన్తి నిమీలన్తి హసన్తిచ రుదన్తిచ. 45

విక్రొశన్తచ గమ్భీరం ధూమయనే జలన్తిచ l ప్రతిమాస్సర్వదేవానాం కథయన్తో మహద్భయమ.. 46

అరణ్యౖ స్సహ సంసృష్టా గ్రామ్యాశచ మృగపక్షిణః l చుక్రుంశుర్బైరవం తత్ర మృగా యుద్ధ ఉపస్థితే. 47

నద్యశ్చ ప్రతికూలాశచ వహన్తి కలుపోదకాః l న ప్రకాశన్తిచ దిశో రక్తరేణుసమాకులాః. 48

వానస్పత్యా నపూజ్యన్తే పూజనార్హః కథంచనl వాయువేగేన హన్యన్తే భజ్యన్తే ప్రణమన్తిచ. 49

యదాచ సర్వభూతానాం ఛాయా న పరివర్తతే l అపరాహ్ణగతే సూర్యే లోకానాం యుగ సంక్షయే. 50

తదా హిరణ్య కశిపోర్దైత్యస్యోపరి వేశ్మనః l భాణ్డాగారాయుధాగారే వివిష్టమభవన్మధు. 51

అసురాణాం వినాశయ సురాణాం విజయాయచ l (దృ) వశ్యన్తే వివిధోత్పాతా ఘారాఘోర నిదర్శనాః 52

ఏత చాన్యేచ బహవో ఘోరోత్పాతా స్సముత్థితాః l దైత్యేన్ద్ర్కస్య వినాశాయ దృశ్యన్తే కాలనింటితాః .53

మేదిన్యాం కమ్పమానాయాం దైత్యేన్ద్రేణ మహాత్మనా l మహీధారా నాగగణా నిపేతురమితౌజసః 54

విషజ్వాలాకులైర్వక్త్రై ర్విము ఞ్చన్తో హుతాశనమ్‌ l చతుశ్శీర్షాః ప ఞ్చశీర్షా స్సప్తశ్శీర్షాశ్చ పన్నగాః. 55

వాసుకిస్తక్షకశ్చైవ కర్కోటక ధన ఞ్జ¸° l ఏలాముఖః కాలియశ్చ మహాపద్మశ్చ వీర్యవా9. 56

సహస్రశీర్షో నాగోవై హేమాతాలధ్వజః ప్రభుః l శేషో7నన్తో మహాభాగో దుష్ప్రకమ్ప్యః ప్రకమ్పితః. 57

దీప్తాన్యన్తర్జలస్థాని పృథివీచారణానిచ l తాదా దైత్యేన్ద్రకోపేన కమ్పితాని సమన్తతః. 58

నాగాస్తేజోపరాశ్చాపి పాతాళతలచారిణః l పాతాళే సహసా చక్రుర్దుష్ప్రకమ్ప్యః ప్రకమ్మితాః. 59

పండ్లనుండి పండ్లు పూలనుండి పూలు వచ్చుచుండెను. సర్వ దేవతా ప్రతిమలును కన్నులు తెరచును మూయును నవ్వును ఎడ్చును గంభీరమగా అరచును పోగులు గ్రక్కుచు మండును-ఇట్లవి మహాభయమును సూచించసాగెను. గ్రామములందుండు మృగపక్షులు అరణ్య మృగపక్షులతో కలిసి తిరుగసాగెను. యుద్ద సూచకములయి మృగములు భయంకర ధ్వనులు చేసెను. నదులు మలిన జలములతో ఎదురు ప్రవహించసాగెను. దిక్కులును నెత్తుటితో ధూళితో మలినములై కాంతిహీనములయ్యెను. పూజా ర్హములగు వసస్పతులు (పూయక కాయు చెట్టు) వానన్పత్యములు (పూచి కాయు చెట్లు) పూజల నందుకొనకుండెను. (పూజించపోరున వేళకు ) అవి వాయువేగ వశమున వంగుటయో విరుగుటయో నమస్కరిరుచున్నట్లు నేలకు వాలుటయో జరుగుచుండెను. ఏ ప్రాణులకును నీడయే కానరాక రవి మధ్యాహ్నము దాటి అపరాహ్ణమును ప్రవెశించు సమయమున హిరణ్యకశిపుని భవనము మీదను వాని భాండాగారా యుధాగారములందున తేనెతుట్టెలు పట్టెను. ఇట్లు ఇవియు ఇంకను అనేకములును దైత్యనాశమును దేవజయమును సూచించునవియగు ఘోరోత్పాతములు కాల నిర్మితములై కనబడెను. మహాత్ముడగు దైత్యేంద్రుడు కోపముతో భుమిని కంపింపజేయుచుండ నాలుగు ఐదు ఏడు తలలు కల నాగులను వాసుకి తక్షకుడు కర్కోటక ధనంజయులు ఏలాముఖకాళియ మహాపద్ములును విషజ్వాలలతో కలత పొంది తమ నోళ్లనుండి అగ్నిని క్రక్కసాగిరి. సహన శిరస్కుడు బంగరు తాటిచెట్టు ధ్వజముగా కలవాడు మహాసమర్థుడు మహాభాగుడు అనంతుడు అగు శేషుడు దేనికిని ఎన్నడును కంపింపనివాడు కూడ కంపించెను. నేటి నడుమను సంచరించుచు ప్రకాశించు అన్ని ప్రాణ్ణులును అపుడా దైత్యేంద్ర కోపకంపితము లయ్యెను. పాతాళతల సంచారులు మేలగు తేజస్సుగల పాతాళమందలి నాగములను అవి ఎంతగా కంపించచేయ నలవి కాని వయ్యును కంపితములుగా చేయబడెను.

హిరణ్యకశపుర్దైత్యస్తదా నంస్పృష్టవాన్మహీమl సన్దఎ్టోష్ఠపుటః క్రోధాద్వారాహ ఇవ పూర్వజః. 60

నదీం భాగీరథీం చైవ కౌశికీం సరయూమపి l యమునామథ కావేరీం కృష్ణవేణీంచ నిమ్నగామ్‌. 61

తుజ్గవేణీం మహావేగాం నదీం గోదావరీమపి l చర్మణ్వతీంచ సిన్ధుంచ తథా నదనదీపతిమ్‌. 62

మేఖల ప్రభవాం చైవ శోణం మణినిభోదకమ్‌ l నర్మదాం శుబతోయరాచ తథా వేత్రవతీం నదీమ్‌. 63

గోమతీం గోకులాకీర్ణాం తథా పూర్ణాం సరస్వతీమ్‌ l మహీం కాళమహీం చైవ తమసాం పుష్పవాహినీమ్‌. 64

జమ్బూద్వీపం రత్నవన్తం సర్వరత్నోపశోభితమ్‌l సువర్ణపుటకంచైవ సువర్ణకరమణ్డితమ్‌. 65

మహానదంచ లౌహిత్యం శైలకాననశోభితమ్‌ lపత్తనం కోషకారాణాం ఋషీవీరజనాకరమ్‌. 66

మగధాంశ్చ మహాగ్రామ నన్ద్రా నజ్గాం స్తథైవచl కురుసాళ్వాన్విదేహాంశ్చ మాళవాన్కా శికోసలా9. 67

భవనం వైనతేయస్య దైత్యేన్ద్రేణా భికమ్పితమ్‌ కైలాసశిఖరాకారం యత్కృతం విశ్వకర్మణా. 68

రక్తతోయో మహాభీమో లౌపిపాత్యో నామ సాగరః l ఉదయశ్చ మహాశైల ఉత్థిత శ్శతయోజనమ్‌. 69

సువర్ణవేదికశ్శ్రీమా న్మేఘపజ్త్కినిషేవితః l భ్రాజమనోర్కసదృశై ర్జాతరూపమయై ర్ద్రుమైః. 70

సాలైస్తాలైస్తమాలైశచ కర్ణికారైంశ్చ పుష్పపితైః l అయోముఖశ్చ విఖ్యాతః పర్వతో ధాతుమణ్డితః. 71

తమాలవనగన్దశ్చ పర్వతో మయ శ్శుభః l సురాష్ప్రాశ్చ సబాహ్లీకా శ్శూద్రాభీరా స్తథైవచ. 72

పాణ్డ్యాః కళిజ్గా వజ్గాశ్చ భోజాశ్చ తామ్రలిప్తకాః l తథైవ పుణ్డ్రపౌణ్డ్రాశ్చ వాసశూలా స్తథైవచ. 73

క్షోభితాస్తేన దైత్యే సదేవాశ్చా ప్సరోగణాః l అగస్త్యభవనంచైవ యదగమ్మం కృతం పురా. 74

సిద్దచారణసజ్ఝైశ్చ వికీర్ణంచ మనోరమమ్‌ l విచిత్రనానావిహగః సుపుష్పతమహాద్రుమః. 74

జాతరూపమయై శ్శృజ్గైశ్చ రప్సరోగణనాదితః l గిరిః పుష్పితకశ్చైవ లక్ష్మీ వాన్ప్రియదర్శనః. 76

ఉత్థిత స్సాగరం భిత్త్వా విశ్రామ శ్చన్ద్రసూర్యయోః l రరాజ యోమహాశృజ్గైర్గగనం విలిఖన్నివ. 77

చన్ద్రసూర్యాంశుసజ్కాశై స్సాగరామఖుసమావృతః l విద్యున్నామార్చత శ్శ్రీమా నాయత శ్శతయోజనమ్‌.

విద్యుతాం యత్ర సజ్ఝాతా నిపాత్యన్తే సగోత్తమే l ఋషిభిః పర్వతశ్చైవ శ్రీమాన్వృషభసంజ్ఞితః. 79

కుఞ్జరః పర్వతశ్శ్రీమాన్యత్రాగస్త్యగృహం శుభుమ్‌ l విశాలక్ష్యాదుర్షర్షో సర్పణామాలయః పురీ. 80

తథా భోగవతీ చాపి దైత్యేన్ద్రా భిప్కమ్పితా l మహాసనగిరిశ్చెవ పారియాత్చశ్చ పర్వతః 81

చక్రవాంశ్చ గిరిశ్రేష్ఠో వారాహశ్చైవ పర్వతః ప్రగ్జ్యోతిషపురంచాపి జాతరూపమయం శుభుమ్‌ . 82

యస్మిన్వసతి దుష్టాత్మా నరకో నామ దానవ ః l విపశాలక్షశ్చ దుర్దర్షో మేఘగమ్భీరనిస్వనః . 83

షష్టస్తత్ర సహస్రాణి పర్వతానాం విశామ్పతే l తరుణాదిత్యసజ్కాశో మేరుశ్చైవ మహాగిరిః. 84

యక్షరాక్షసగన్దర్వైర్నిత్యం సేవితకన్దరః l హేమగర్భో మహాశైలస్తథా మేఘసఖోగిరిః. 85

కైలాసశ్చైవ శైలేన్ద్రో దావేన్ద్రేణ కమ్పితః l

హిరణ్యకశిపు దైత్యుడు అపుడు కోపముతో పెదవుల పుటమును కొరుకుచు తన అన్నయు యజ్ఞ పరాహుని చేతిలో మరణించువాడునగు హిరణ్యాక్షుడువలె భుమిని స్పృశించుచునే భూమినేకాక భాగీరథీ కౌశికీనరయూ యమునా కావేరీ కృష్ణవేణీ తుంగవేణీ గోదావరీ చర్మణ్వతీసింధు నదులను మేకలమున పుట్టిన శుభ జలముగల నర్మదను మణివంటి నీరుగల శోణమును గోవుల మందలతో నించిన గోమతిని పూర్ణాసర్వస్వతీ మహీకాలమహీ నదులను పూవులతో కూడి ప్రవహించు సరయూనది సర్వ రత్నముతో ప్రకాశించు జంబూ ద్వీపమును బంగరు గనులతో అలంకృతమగు సువర్ణపుటక దేశమును మహానదముతో శైల వనములతో శోభించు లౌపిత్య దేశమును ఋషులకు వీరులకు గనియగు దేశమును కోశకారుల పట్టణమును మగధ మహాగ్రామాం (రాష్ట్రాం) ధ్రాంగ కురు సాళ్వవిదేహమాళవ కౌశికోసల దేశములను కూడ తాకినట్లయి అన్నియు కంపించెను. కైలాస శిఖరాకారమును విశ్వకర్మచే స్వయముగా నిర్మితమును అగు వైనతేయ (గడుడ) భవనమును ఎర్రని నీరు కలిగి మహాభయంకరమగు లౌహిత్యమను సముద్రమును శతయోజనోన్నతమును బంగరు వేదికలు కలదియు మేఘ పంక్తులకు ఆశ్రయమును సూర్యునివలె ప్రకాశించు బంగరు సాలతాలతమాల పుష్పిత కర్ణికార వృక్షములతో అలంకృతమును అగు ఉదయ పర్వతమును గైరిక ధాదువులతో అలకృతమగు అయోముఖమను (పై భాగమునందు ఇనుప ధాతు శిలలుకల) పర్వతమును చీకటి చెట్ల అడవుల వాసనలతొ నిండిన శుభుమగు మలయ పర్వతమును సురాష్ట్ర బాప్లికాభీరపాండ్య కళింగ వంగ భోజ తామ్రలిప్తపుండ్ర పౌండవానశూలదేశములును దేవతలు నప్సరసలును ఆ దైత్యునిచే కంపింపజేయబడెను. పూర్వమే ఎల్లరకు చేరరానిదిగా నిర్మించబడినదియు సిద్ధచారణ సంఘములతో వ్యాప్తమును మనొరమమును అగు అగస్త్యభవనమును విచిత్ర నానాపక్షులు పూచిన పెద్ద చెట్లు స్వర్ణమయి శిఖరములు సముద్రమునే చీల్చుకొని పైకి లేచినట్లుండి చంద్రసూర్యులకు విశ్రామ స్థానమై చంద్రసూర్య కిరణసదృశుములగు మహశృంగములతో అకాశమును ఒరయుచున్నదో అనునట్లుండుచు సముద్రజలముతో చుట్టబడి శతయోజనోన్నతమయి ఋషులు పడవేయు (ప్రసరింపజేయు) మెరపుల గుములుగల వైద్యుతమను మహాపర్వతమును శ్రీమంతమగు వృషభ పర్వతమును శుభమగు అగస్త్య గృహముగలదై విశాల కక్ష్యలు గలిగి ఎవరికి ఎదిరించనలవికాని కుంజర పర్వతమును సర్పముల కావాసమగుభోగవతీపురియు మహాసన గిరియ పారియాత్ర పర్వతమును గిరిశ్రేష్ఠమగు పర్వతములును లేత చక్రవంతమును వారాహ పర్వతమును సువర్ణమయమగుచు ఎదిరించనలవికాని వాడు మేఘదుష్టాత్ముడు విశానేత్రుడుగంభీర ధ్వని కలవాడునగు నరకుడు వసించు పశుభ ప్రాగ్జ్యోతిష పురమును అచ్చటి అరువది వేల సూర్యునివలె ప్రకాశించునది యక్షరాక్షస గంధర్మలు ఎల్లప్పుడు సేవించు (అశ్రయించియుండు) నదియ తన నడుమ బంగరు కలదియు మేఘములకు విత్రమును అగు మేరు పర్వతమును శైలేంద్రమగు కైలాసమును ఆ దానవేంద్రునిచే కంపింపజేయబడెను.

హేమపుష్కరసంఛన్నం తేన వైఖానసం సరః. 86

కమ్పితం మానసం చైవ హంసకారణ్డవాకులమ్‌ l త్రిశృజ్గః పర్వతశ్చైవ కుమారీచ సరిద్వరా. 87

తుషారచయస ఞ్చన్నో మన్దరశ్చాపి పర్వతః l ఉశీరబిన్దుశ్చగిరిర్‌ భద్రప్రస్థస్తథాద్రిరాట్‌. 88

ప్రజాపతిగిరిశ్చైవ తథా పుష్క రపర్వతః l దేవాభ్రపర్వత శ్చైవ తథావై వాలుకాగిరిః. 89

క్రౌ ఞ్చస్సప్తర్షిశైలశ్చ ధుమవర్ణశచ పర్వతః l ·సోద్యానాః పర్వతాశ్చైవ దేశా జపదాస్తద.%ా. 90

నదీస్స సాగరాస్సర్వా స్సో7కమ్పయత దానవఃl కపిలశ్చ మహీపుత్త్రో వ్యాఘ్రవాంశ్చైవ కమ్పితః. 91

ఖేచరాశ్చ సతీపుత్త్రఃపాతాళతలవాసినః l గణస్తథాపరో రౌద్రోమేఘనామాజ్కుశాయుథః. 92

ఊర్ద్వగో భీమవేగశ్చ సర్వ ఏవాభికమ్పితాఃl

_______________________________________________

·ఏతేచాన్యేచగిరయోదేశా.

బంగరు (వన్నె) నీటితో కప్పబడిన వైఖానస సరస్సు హంసకారండవ (జల) పక్షులతో కలతనోందుచుండు మానస సరస్సు త్రిశృంగమను పర్వతమును కుమారీనది మంచురాశితో కప్పబడియుండు మందర పర్వతము ఉశీరబిందు భద్రప్రస్థ పర్వతములు ప్రజాపతి పుష్కర దేవాభ్రవాలుకా పర్వతములు క్రౌంచ-సప్తర్షి- ధూమవర్ణ- పర్వతములు మరియు అయా ఉధ్యానములు పర్వతములు దేశములు జనపదములు నదులు సముద్రములు మహీపుత్త్రుడగు కపిలుడు వ్యాఘ్రపండుతడు ఖేచరులు (గగన సంచారి దేవజాతులు) సతీపుత్తులు (సత్‌ లోక నివాసులు ) పాతాళ తల నివాసులగువారు వారు రౌద్రము అను నామముగల దేవగణము అంకుశమాయుధముగా గల మేఘ నాముడు భయంకర వేగముగల ఊర్ద్వగుడు -ఈ అందరును హిరణగకశిపునిచే కంపింపజేయబడిరి.

గదీ శూలీ కరాళశ్చ హిరణ్యకశిపుస్తదా. 93

జీమూతగణసజ్కాశో జీమూతగణనిస్వనః l జీమూతగణనిర్ఝోషో జీమూతగణవేగవా9. 94

దేవారిర్దితిజోవీరో నాసింహం సముపాద్రవత్‌ l సముత్ల్పుత్య తతస్తీక్‌ష్ణైర్మ గేన్ద్రేణ మహానఖైః. 95

తదోజ్కారసహాయేన విదార్య నిహతోయుధి l మహీచ కాలశ్చ శశీ సభశచ గ్రహాశ్చ సూర్యశ్చ దిశశ్చ సర్వాః. 96

నద్యశ్చ శైలాశ్చ మహార్ణవాశచ గతాః ప్రసాదం దితిపుత్త్రనాశాత్‌ l తతశ్చ ముదితా దేవా ఋషయశ్చ తపోధానాః. 97

తుష్టుపుర్నామభిర్దవ్యై రాదిదేవం సనాతనమ్‌ l యత్త్వయా విహితం దేవ నారసింహమిదం వపుః. 98

ఏత దేవార్చ యిష్యన్తి పంపాపరవిదో జనాః l

అపుడు హిరణ్యకశిపుడు గదా శూలములు దాల్చి భయంకరుడై మేఘముల గణమువలె ప్రకాశించుచు అట్లే ధ్వనిచేయుచు అట్లే వేగము కలిగి దేవశత్రుడగు అ దైత్యవీరుడు నృసింహుని మీదకు పరుగెత్తుకొనుచు వచ్చెను. అంతట మృగేంద్ర రూపుడగు హరి ఓంకారమాత్ర సహాయుడై వానిమీదకు దుమికి వాడియగు పెద్దగోళ్ళతో పోరివానినిచీల్చ చంపెను. అ దైత్యుని నాశముతో భుమికాలము చంద్రుడు అకసము గ్రహములు రవి సకల దిశలు నదులు పర్వతములు మహా సముద్రములు నైర్మల్యము నందెను. అంతట దేవతలు ఋషులు మునులు సనా(దా) తనుడగు (శాశ్వతుడగు) ఆ దేవదేవుని దివ్యనామములతో స్తుతించిరి. దేవా ! నీవు ఏ ఈనారసింహ రూపమును ధరించితివో-దానినే పరాపరతత్త్వమెరిగినవారు అర్చన చేయుదురు. అని పొగడిరి.

హిర్యణకశిపువధానన్తరం బ్రహ్మాదీదేవకృనృసింహస్తుతిః

బ్రహ్మా: భవాన్బ్రహ్మాచ రుద్రశచ మహేన్ద్రో దేవసత్తమః. 99

భవాన్కర్తావికర్తాచ లోకానాం ప్రభవో7వ్యయః l పరంచ సిద్ధంచ పరంచ దేవం పరంచ మన్త్రం పరమం హవిశ్చ. 100

వరంచ ధర్మం పరమంచ విశ్వం త్వామాహురగ్య్రం పురుషంపురాణమ్‌ l పరంచ సత్యం పంమం తపశ్చ పరం పవిత్రం పరమంచ మార్గమ్‌. 101

పరంచ యజ్ఞం పరమంచ హోత్రం త్వామాహురగ్య్రం పురుషం పురాణమ్‌ l పరం శరీరం పరమంచ బ్రహ్మపరంచ యోగం పరమాంచ వాణీమ్‌. 102

పరం రహస్యం పరమాం గతించ త్వామాహురగ్ర్యంపురుషం పురాణమ్‌ l పరం పరస్యాపి పరం పదం యత్‌. 103

పరం పరస్యాపి పరంచ హృద్యం త్వామాహుర గ్య్రం పురుషం పురాణమ్‌ l ఏవం పరసగాపి పరం పదం యత్పరం పరస్యాపి పరంచ పదేవమ్‌. 104

పరం పరస్యాపి పరంచ భూతం త్వామాహురగ్య్రం పురుషం పురాణమ్‌ l పరం పరస్యాపి వరం నిదానం పరం పరస్యాపి వరం పవిత్రమ్‌. 105

పరం పరస్యాపి పరం దాన్తం త్వామాహుర గ్య్రం పురుషం పురాణమ్‌ lఏముక్త్వాతుభవాన్త్సర్వలోకపితామహః . 106

స్తుత్వా నారాయణం దేవం బ్రహ్మలోకం గతః ప్రభుః l తతో నదత్సు తూర్యేషు నృత్యన్తీష్వప్సరస్సుచ.

క్షీరోదస్యోత్తరం కూలం జగామ హరిరీశ్వరఃlనారసింహం వపుర్దేవస్థ్సాపయిత్వా సుదీప్తిమత్‌. 108

పౌరాణం రూపమాస్థాయు ప్రయ¸° గరుడధ్వజః l అష్టచక్రేణ యానేన భూతయుక్తేస భాస్వతా. 109 ll

అవ్యక్త పకృతిర్దేన స్స్వస్థానం గతవాన్ప్రభుః.

ఇతి శ్రీమత్స్యమహాపురాణ హిరణ్యకశిపూపాఖ్యానో నరసింహకృత హిరణ్య

కశిపు వధాది కథనం నామ ద్విషష్ట్యుత్తర శతతమో7ధ్యాయః.

బ్రహ్మ ఆ నరసింహు నిట్లు స్తుతించెను: బ్రహ్మరుద్రుడు దేవసత్తముడగు మహేంద్రుడు లోకములకు కర్తయు వికర్తయు( పరిణామము నొందించువాడు- లయము నొందించువాడు) కారణభుతుడును నయియుండియు తాను ఏ మార్పును లేకయుండు తత్త్వము నీవే. వరుడు (ఉత్కృష్టుడు) అగు సిద్ధుడు పరదేవుడు పరమంత్రము పరమ హవిస్సు (దేవతల నుద్దేశించి అగ్నిలో అర్పించు ద్రవ్యము) పరమ ధర్మము పరమ పరమ విశ్వము పంను సత్యము పరమ తవము పరమ పవిత్రము పరము మార్గము (మోక్ష సాధనము ) పరమ యజ్ఞము పరమహోత్రము (హోమ పాధనము) పరమ శరీరము పరమ బ్రహ్మము పరమ యోగము పరమ వాణి (వాక్కు) పరమ రహస్యము పరమ గతి (మోక్షము) పరమము కంటెపరమమగు రహస్యము పరమ పరమపదము (స్థానము) పరమ పరమహృద్యము (ప్రీతికంమగు తత్త్వము (పరమ పరమదేవుడు పరమ పరమభూతము పరమ పరమ నిదానము (అది కారణము) పరమ పరమ పవిత్రము పరమపరమ దాంతము (అన్నిటిని అణుచునది) నీవేయని తత్త్వవేత్తలు చెప్పుచున్నారు. ఇట్లు నారాయణ దేవశని స్తుతించి సర్వలోక పితామహుడు భగవానుడు ప్రభువునగు బ్రహ తన లోకమున కేగెను. తూర్యములు మ్రెయుచుండ అప్పరసలు నృత్య మొననర్చుచుండ ఈశ్వరుడగుహరి క్షీరసాగరపు ఉత్తర తీరమున కేగెను. గరుడధ్వజుడగు ఆ దేవు డచ్చట ప్రకాశించుచున్న నారసింహ శరీరమును ఉంచి తన ఎప్పటి రూపము ధరించి అష్ట చక్రములు కలదియు భూతము (పంచ తన్మాత్ర) లతో కూడి నదియు ప్రకాశించునదియు అగు వాహనముతో అవ్యక్త తత్త్వమునకు (మారూశబలమునకు ) కూడ మూలప్రకృతియగు (సర్వసాక్షిభుత శుద్ధ చైతన్య) రూపముతో ఆ ప్రభువు స్వస్థాటనమునకు ఏగెను.

ఇది శ్రీ మత్స్య మహా పూరాణమును హిరణ్యకశిపూపాఖ్యానమున నరసింహుడు హిరణ్యకశిపుని విధించుటయను.

నూట అరువది రెండవ అధ్యాయము.

హిరణ్యకశిపూ పాఖ్యానము ముగిసినది

Sri Matsya mahapuramu-2    Chapters