Sri Matsya mahapuramu-2    Chapters   

త్రిషష్ట్యు త్తరశతతమో7ధ్యాయ

పాద్మకల్ప వృత్తాంతారంభః.

మనుకృతనారాయణనాభిపద్మోద్బవాది ప్రశ్నాః.

ఋషయః: కథితప నరసింహస్య మాహాత్మ్యం విస్తరేణచ l పునస్తసై#్యవ మాహాత్మ్యమన్యద్విస్తరతోవద.1

పద్మరూపమభుదేత త్కథప హేమమరుం జగత్‌ l కథంచ వైష్ణవీ సృష్టిః పద్మమధ్యే7 భవత్పురా. 2

సూతః: శుత్ర్వాచ నరసింహస్య మాహాత్మ్యం రవినన్దనః l విస్మయోత్ఫుల్లనయనః పునః పప్రచ్ఛ కేశమ్‌.

మనుః: కథం పాద్మే మహాకల్పే7భవత్పద్మమయం జగత్‌ l జలార్ణవగతస్యేహ నాభౌ జాతం జనార్దన.

ప్రభావాత్పద్మనాభస్య స్వపతస్సాగరామ్భసి l పుష్కరేషు కథం భూతా దేవా స్సర్షిగణాః పూరా. 5

ఏత దాఖ్యాహి నిఖిలం యోగం యోగవిదామ్పతే l శృణ్వతస్తస్య మే కీర్తిర్న తృప్తిరుపజాయతే. 6

కియతా చైవ కాలేన శేతేవే పురుషోత్తమః l కియస్తం వైస్వపితిచ కో7స్య కాలస్య సమ్భవః. 7

కియతావా7థకాలేన హ్యుత్తిష్ఠతి మహాయశాః l కధం చోత్థాయ భగవా స్త్ససర్జ నిఖిలం జగత్‌ . 8

కథమేకార్ణవే శూన్యే నష్టే స్థావరజజ్గమే l దగ్దదేవాసురనరే ప్రణష్టోరగరాక్షసే. 10

నష్టానిలానలే లోకే నష్టాకాశమహీతలే l కేవలం గవ్వారీభూతే మహాభుతవిపర్యయే. 11

విభుర్మహాభుతపతిర్మహాతేజా మహాకృతిః l ఆస్తే సురవర శ్రేష్ఠో విథమాస్థాయ యోగవా9. 12

శృణు యాం పరమా భక్త్యా బ్రహ్మన్మేతదశేషతః l వక్తుమర్హసి ధర్మజ్ఞ యశో నారాయణాత్మకమ్‌. 13

శ్రధ్ధయా చోపవిష్టానాం భగవస్వక్తుమర్హసిl

నూట అరువది మూడవ అధ్యాయము.

పాద్మకల్ప వృత్తాంతారంభము.

మనువు నారాయణ నాభిపద్మోద్భవమును గూర్చి ప్రశ్నించుట.

ఋషులు సూతు నిట్లడిగిరి: నరసింహ రూపుడగు నారాయణని మాహాత్మ్యమును విస్తరముగ చెప్పితివి. మరలను అదేవునిచే మరియొక మాహాత్మ్యమును విస్తరించి చెప్పుము. విష్ణు నాభినుండి పద్మరూపమెట్లేర్పడెను? హేమపద్మ మయమగు జగ మెట్లు ఏర్పడెను. ? విష్ణువు ఆ పద్మ మధ్యమునుండి సృష్టినె ట్లారంభించి సాగించెను? అనగా సూతు డిట్లనెను: నరసింహుని మాహాత్మ్యమును విని వైవస్వతుడు విస్మరుమున కన్నులు వికసింప మత్స్యరూప కేశపుని మరల నిటడిగెను: పూర్వము పాద్మమహాకల్పమున జలార్ణవమందు జలమున నిద్రించుచుండిన పద్మనాభుని ప్రభావమున అతని నాభియందుండి పద్మమయ (పద్మపు పరిణామ) మగు జగత్తు ఎట్లేర్పడెను? పూర్వము ఆదికాలమందు దేవతలును ఋషిగణములును పుష్కరముల (జలముల-పపద్మముల) యందుండి ఎట్లు కలిగిరి? దేవా ! జనార్దనా! నీవు యోగవేత్తలకు అధిపతివి. కావున ఈ యోగ (ప్రవృత్తి ప్రవర్తిల్లన క్రమ) మునంతను నాకు తెలుపుము. అతని గుణ కీర్తనము వినుచుండగా నాకు ఎంతకును తృప్తియే కలుగుట లేదు పురుషోత్తముడు (సముద్ర జలములందు) ఎంతకాలము పండుకొనును? ఎంతకాలము నిద్రించును? ఈ కాలసృష్టి ఎట్లు? ఎంతకాలమున కతడు మేలుకొంచి లేచును? తరువాత ఈ నిఖిల జగత్తును ఎట్లు సృష్టించెను? మొదట నుండిన (ఆది) ప్రజాపతు లెందరు?సనాతనమగు (అనాది ప్రవాహ రూపమగు) చిత్రలొకమును అత డెట్లు నిర్మించెను? ఈజగము ఏకార్ణవము శూన్యము అయి స్థావర జగంగమ ప్రాణులు పదార్థములు నశించి దేవాసుర నరనాగ రాక్షసులెల్ల నశించి అకాశము వాయువు అగ్ని పృథివి నశించి (పంచభూతములలొ నీరొకటి మాత్రము మిగిలియుండగా) మహాభూత(సూక్ష్మ)ములు కూడ లేక కేవలము గహ్వరము (మహాశూన్యము) కాగా విభువు(సర్వవ్యాపి) మహాభూతలములకు కూడ అధినాధుడు మహాతేజస్కుడు (స్వరుం ప్రకాశుడు) మహాకారవంతుడు దేవశ్రేష్ఠుడు అగు నారాయణుడు యోగప్రక్రియ నాశ్రయించి యోగవంతుడై (యోగము- అన్నియు లయమందిన ఏకైక తత్త్వముగా నుండుట అని ఇచట అర్థము) ఎట్లుండెను? ధర్మజ్ఞుడవును పరబ్రహ్మరూపుడవు నగు దేవా ! పరమభక్తితో అదియంతయు వినగొరుచున్నాను. కావున నా కదియంతయు చెప్ప వేడుచున్నాను. శ్రద్ధతో కూర్చుండియున్న మాకందరకునుభగవన్‌ ! నారాయణాత్మక మగు భగవత్కీర్తిని ప్రతిపాదింపుడు. అనెను.

శ్రీమత్స్యః: నారాయణస్య యశస శ్శ్రవణ యా తవ స్పృహా. 14

తద్వంశ్యాన్వయభూతస్య న్యాయ్యం రవికులర్షభl శృణుష్వాదిపూరాణషు వేదేభ్యశ్చ యథా శ్రుతమ్‌. 15

బ్రాహ్మణానాం చ వదనాచ్ఛ్రుత్వావై సుమహాత్మనామl యథా చ తపసా దృష్ట్వా బృహస్పతిసమద్యుతిః. 16

పరాశరసుత శ్శ్రీమాన్గురుర్ద్వైపాయనో7బ్రవీత్‌ l తత్తే7హం కథయిష్యామి యథాశక్తిర్యథాశ్రుతిః. 17

యద్విజ్ఞాతుం మయాశకృమృషిమాత్రేణ సత్తమాః l కథం సముద్సహేజ్ఞాతుం పరం నారారుణాత్మకమ్‌. 18

విశ్వాయనోయం బ్రహ్మాపి న వేదయతి తత్త్వతః l తత్కర్మ విశ్వవేదానాం తద్రహస్యం మహర్షిణామ్‌. 19

తమీడ్యం సర్వయజ్ఞానాం తత్తత్త్వం సర్వదర్శినామ్‌ l తదాధ్యాత్మవతాం చిన్త్యం నరకం చ వికర్మిణామ్‌.

దేవానామధిదైవం యదధియజ్ఞం చ సంజ్ఞితమ్‌ l తద్బూతమవిభూతం చ తత్పరం పరమర్షణామ్‌. 21

స యజ్ఞ వేదనిర్దష్టస్తత్తపః కవయో విధుః l సకర్తా కారకో బుద్ధిర్దర్మః క్షేత్రజ్ఞ ఏవచ. 22

ప్రణవః పురుషశ్శాస్తా ఏకశ్చేతి విభావ్యతే l ప్రాణః ప ఞ్చవిధశ్చైవ ధ్రువమక్షర ఏవచ. 23

కాలఃపాకశ్చ పక్తాచ ద్రష్టా స్వాధీన ఏవ చ l ఉచ్యతే వివిథైర్బావై స్సఏవాయం న తత్పరః. 24

సఏవ భగవాన్త్సర్వం కరోతి వికరోతిచ l సో7స్మాన్కారయతే సంవమన్యేపి వ్యాకులీకృతాః. 25

యజామహే తమేవాద్యం తమేవేచ్ఛామ నిర్వృతాః l యోవక్తా యచ్చ వక్తవ్యం యచ్చాహం యద్బ్రవీమివః. 26

శ్రూయతే యచ్చవై శ్రావ్యం యచ్చాన్యత్పరిజల్ప్యతే l యత్కథాంశ్చైవ వర్తన్తే శ్రుతయో వాథ తత్పరాః. 27

విశ్వం విశ్వపతిర్యశ్చ సతు నారాయణస్స్మృతః l యత్సత్యం యదమృత మక్షరం పరం య ద్యద్బూతం పరమమిదంచ యద్బవిష్యమ్‌. 28

యత్కిఞ్చిచ్చరమచరం రుదస్తి చాన్యత్తత్సర్వం పురుషవరః ప్రభుఃపురాణః.

ఇతి శ్రీమత్స్యమహాపూరాణ మత్స్యమనుసంవాదే నారాయణనాభిపద్మోద్బవ

ప్రశ్నాదికథనం నామ త్రిషష్ట్యుత్తరశతతమో7ద్యాయః.

నారాయణుని యశమును వినవలెనని నీకు కోరిక గలుగుట ఓరవికులశ్రేష్ఠా! అ నారాయణాంశభూతుడగు రామునకు మూల పురుషుడవగు నీకు సముచితమే. వేదములనుండి గ్రహింపబడి అది పురాణములయందు (ఈ అది పురాణములనునవి ఈనాడు మనకు లభించుచున్న పురాణములకంటె విలక్షణమయి వేదములవలె వైదిక శబ్దరూపములతో వైదిక ఛందములతో నున్న వాజ్మయములు. వీనిని అపస్తంబాది మునులు తమ ధర్మసూత్రములయం దచటచట ఉదాహరించినారు.) వినబడుచున్న విధమున తెలిపెదను; వినుము; అని మత్స్యడు మనువునకు చెప్పిన విధమన ఋషులారా! నేను(సూతుడను) మీకు చెప్పెదను. ఈ అది పురాణములయందలి విషయములను బృహస్పతి సమ విజ్ఞాన తేదముగలపరాశర సుతుడా మాగురుడు నగు ద్వైపాయనుడు తపముచే దర్శించి(బ్రాహ్మణులకు తెలుపగా) అ బ్రాహ్మణుల నోటినుండి వినినది వినినట్లు నాశక్తికొలది ఋషిమాత్రుడనగు నాకుతెలియ శక్యమయినంత మాత్రము మీకు తెలిపెదను. విశ్వములకు ఆశ్రయుగడు బ్రహ్మయును ఏ తత్త్వమును వాస్తవరూపమున తెలుపజాలడో అట్టి నారారూణాత్మక పరతత్త్వమును ఎవరు ఎరుగగలరు? ఆనారాయణ తత్త్వము సర్వవేదములచే ప్రతిపాద్యమగు (యజ్ఞాది వైదిక) కర్మానుష్ఠానము; అది మహర్షులకును ఎరుగరాని రహస్యము; సర్వయజ్ఞములందు స్తుతింపబడు తత్త్వము ; సర్వదర్శలకు వారు దర్శించు తత్త్వమది; అధ్యాత్మ (అత్మఅనగా ఇట దేహము; దేహము నాశ్రయించియుండు అయా సూక్ష్మతత్త్వములు అధ్యాత్మతత్త్వములు) తత్త్వవిచారకులు అలోచింపవలసిన తత్త్వమది; విరుద్దకర్మల నాచరించువారికి నరకమును అ తత్త్వమే; దేవతలలో అదిధై వతతత్త్వము యజ్ఞములలొని అధియజ్ఞ తత్త్వమును భూతములయందలి అధిభుతతత్త్వమును పరమర్షులకును అందరాని పరతత్త్మును వేదములచే నిర్దేశింపబడిన యజ్ఞమును తపస్సును కర్త-కారకుడు(కర్మప్రేరకుడు-కర్మసాధనములు) బుద్ధి-ధర్మము-క్షేత్రజ్ఞుడు (దేహమునందుండు చేతనతత్త్వము) (భగవదుపాసన సాధనమగు) ప్రణవము (ఉపాస్యుడగు) పురుషుడు(అంతర్యామియై) శాసించువాడు-ఇవన్నియు ఒక్కటియే యని భావన చేయబడు తత్త్వమును (ప్రాణపానవ్యానోదాన సమానములను) పంచవిధ ప్రాణములను ధ్రువమగు అక్షరతత్త్వము కాలమును (కాలవశమున కలుగు ) పరిపాకమును పరిపాకము నొందించువాడును వీటికి ద్రష్ట (సాక్షి) యగు వాడును స్వాదీనుడు (స్వతతంత్రుడును) వివిథ భావము (రూపము) లతో ఉన్నాటు చెప్పబడువాడును అతడే ; అతనికంటె పరుడు-(గొప్పవాడు) ఎవరును లేరు; ఆ భగవానుడే సర్వమును సృష్టించును; పరిణమింపజేయును; మనచే చేయించును; అన్యులను (తన్నుపాసించనివారిని) వ్యాకుల పరచును; అద్యుడగు అ నారాయణునే యజించుచున్నాము; అతనినే (పొంద)కోరుచున్నాము; అతని వలన ఆనందము నందగోరుచున్నాము; వినబడునదియు వినదగినదియు పరిజల్పనము చేయబడునదియ( అసంబద్ధముగా అనావశగకముగా మాటలాడుగ పరిజల్పనము) చెప్పువాడును చెప్పబడునదియ చెప్పదగినదియు నేను మీకేది చెప్పుచున్నానో అదియు ఎవరిని కూర్చిన మాటలు జరుగుచున్నవో-అతడును శ్రుతులు యత్పరములై (ఎవనిని తెలుపుచు) ఉన్నచో అతడును విశ్వమును విశ్వ రక్షకుడును సత్యమును అమృతతత్త్వమును అక్షర (నశించని) తత్త్వమును పరమతత్త్వమును భూతము (గడచినది) ఈ పదమును (వర్తమానము-ఇపుడు జరుగుచున్నది)భవిష్యమును చరమును (చలించునది) అచరమును (కదలని వస్తువు) ఈ చెప్పిన దేదియుకాక మిగిలినది ప్రతియొక్కటియు పురుషశ్రేష్ఠుడు ప్రభువు పురాణుడు (ఈ విశ్వము అను పురమునందు చైతన్యరూపుడై శ్వాసించువాడు-పుర-+అన-పురాణ)ను ఆ నారాయణుడే.

ఇది శ్రీమత్స్య మహాపూరాణమున నారాయణ నాభి పద్మోద్బవ ప్రశ్నాది ప్రతిపాదనమను నూట అరువది మూడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters