Sri Matsya mahapuramu-2    Chapters   

షట్‌ షష్ట్యు త్తరశతతమో7ధ్యాయః.

నారాయణమార్కండేయ సంవాదః.

శ్రీమత్స్యః:ఏవమేకార్ణవీభూతే శేతే లోకే మహాద్యుతిః l ప్రచ్ఛాద్య సలిలేనోర్వీం హంసో నారాయణస్తదా.

మహతో రజసోమధ్యే మహార్ణవసరస్సువై l విరజస్కం మహాబాహమక్షయం బ్రహ్మయద్విదుః. 2

ఆత్మరూవప్రకాశేన తమసా సంవృతః ప్రభుఃl మనస్సాత్వికమదాయ తత్ర తతత్సత్యమాసతే. 3

యాథాతధ్యం పరంజ్ఞానం యథా యద్బ్రహ్మణో మతమ్‌ l రహస్యారణ్యకోద్దిష్టే యథోపనిషది శ్రుతమ్‌

పురుషం బ్రహ్మ ఇత్యేతద్యత్పరం పరికీర్తితమ్‌ l యత్రాన్యః న స్యాత్స ఏవ పురుషోత్తమః. 5

యేచ యజ్ఞకృతో విప్రా యే ఋత్విజ ఇతి స్మృతాః l అస్మాదేవ పురా భూతా యజ్ఞేజ్యాః శ్శ్రూయతాం తథా. 6

బ్రహ్మాణం ప్రథమం వక్త్రదుద్గాతారంచ సామగమ్‌ l హోతారమపిచాధ్వర్యుం బాహుభ్యామసృజత్ప్రభుః

బ్రహ్మణో బ్రాహ్మణాచ్ఛంసింం ప్రస్తోతారంచ సర్వశః తౌమైత్రావరుణౌ పృష్ఠాత్ప్రతి ప్రస్థాతారమేవచ. 8

ఉదరాత్ప్రతిహర్తారం పోతారం చైవ పార్థివ l అచ్చావాకమథోరుభ్యాం నేష్టారంచైవ పార్దివ. 9

పాణిభ్యామథ చాగ్నీధ్రం సుబ్రహ్మణ్యం తు జానుతః l గ్రామస్తుతంతు పాదాభ్యమున్నే తారంచ యాజషమ్‌. 10

ఏవమేవైష భగవాన్షోడశైవ జగత్పతిః l ప్రవర్తౄన్త్సర్వయజ్ఞానా మృత్విజో7సృజదుత్తమా9. 11

తదేష వై వేదమయః పురుషో యజ్ఞసంజ్ఞితః l వేదా శ్చైతన్మయా స్సర్వే సాజ్గోపనిషదః క్రియాః. 12

నూట అరువది యారవ అధ్యాయము.

నారాయణ మార్కండేయ సంవాదము.

మహాద్యుతియు (మహా ప్రకాశుడును) హంసరూపుడు (సంసార రూపానాది ప్రవాహమయి సదా ప్రవర్తిల్లు చుండువాడు) అగు నారాయణుడు పృథివిని నీటితో కప్పివేసి ఇట్లు ఏకార్ణవీ భూతమగు లోకమునందు మహారజోగుణరాశి మధ్యమున మహార్ణవ సరస్సుల (జలముల) యందు శయనించును. అతనినే రజోగుణ రహితుడు మహాబాహుడు (అధిక శక్తిశాలి) నాశరహితుడు అగు పరమాత్ముడని తత్త్వవేత్తలందురు. ఆ ప్రభువు అపుడు ఆతట (స్వ) స్వరూపమయి స్వయంసిద్ధమగు ప్రకాశముతోను తమో గుణాత్మకమగు అవరణముతో కూడ కప్పబడియుండును. సత్త్వగుణమయమగు మనస్సును సాధనముగా గ్రహించి (న వారు మాత్రమే) ఆ సత్య తత్త్వము నుపాసించగలరు. బ్రహ్మతత్త్వమునకు సంబంధించిన రుథాతథా పరమజ్ఞానము అరణ్యక రహసగము అనబడు ఉపనిషత్నందు (ఉపనిషత్‌ అనగా రహస్యమని యర్థము ) ప్రతిపాదించపబడినది; ఆ తత్త్వమునకే పురుషుడనియు బ్రహ్మమనియు పేరులు ; అతని కంటె ఇతరులగు పురుషులు లేరు కావున అతడే పురుషోత్తముడు; యుజ్ఞము నిర్వహించు *ఋత్విజులును విప్రులును యజ్ఞములను ఇతరములగు దేవతారాధనలు (ఇజ్యలు) ఆ పురుషోత్తము నుండియే జనించెను.

______________________________________________________________________________

*ప్రజాపతి దేహమున వీరి ఉనికిని ఈ విధముగా చూపవచ్చును.:

ప్రజాపతి దేహవయవములుగా షోడశ (16) ర్త్విజులు.

________________________________________________________________________

అవయవములు ఋత్విజులు

_______________________________________________________________________

వక్త్రము- 1. బ్రహ్మ 2.ఉద్గాత

బాహువులు- 3.హోత 4.అధ్వర్యువు

హృదయము- 5.బ్రాహ్మణాచ్ఛంసి 6. ప్రస్తోత

పృష్ఠ (పార్శ్వ)ము 7.మైత్రావరుణుడు 8. ప్రతిప్రస్థాత

ఉదరము- 9.పోత 10.ప్రతిహర్త

ఊరువులు- 11.అచ్చావాకుడు 12.నేష్ట

పాణులు-జానువులు 13.అగ్నీద్రుడు 14.సుబ్రహ్మణ్ముడు

పాదములు 15.గ్రావస్తుత్‌ 16.ఉన్నేత

_______________________________________________________________________

ప్రదానులు 1.బ్రహ్మ 2.ఉద్గాత 3.హోత 4.అద్వర్యుపు

_________________________________________________________________________

సహయులు 5. బ్రాహ్మణాచ్ఛంసి 6.ప్రస్తోత 7.మైత్రావరుణుడు 8.ప్రతిప్రస్థాతా

9.పోత 10. ప్రతిహర్తా 11. అచ్చావాకుడు 12. నేష్టా

13.ఆగ్నీద్రుడు 14.సుబ్రహ్మణ్యుడు 15.గ్రావస్తుత్‌ 16.ఉన్నేతా

ఓం నమో యజ్ఞేశ్వరాయ

అగ్నిష్టోమ యజ్ఞ భూతల స్వరూపము

(ఇట్టివి షోడశ ఋత్వజులతొ నిర్వహింపబడు యజ్ఞములు)

*అతడు తననుండి పదునారు మంది ఋత్విజులను జనింపజేసినవ క్రమము: ముఖమునుండి బ్రహ్మను సామవేదజ్ఞుడగు ఉద్గాతను- భాహువులనుండి హోతమ అధ్వర్యుని బ్రహ్మ (హృదయము నుండి) బ్రాహ్మణాచ్ఛంసిన- ప్రస్తోతను వీపునుండి మైత్రావరుణుని ప్రతి ప్రస్థాతను - ఉదరమునుండి పోతను ప్రతిహర్తను- తొడలనుండి అచ్చావాకుని నేష్టను- ముంజేతులనుండి అగ్నీధ్రుని - మోకాళ్ళనుండి సుబ్రహ్మణ్యుని-పాదములనుండి గ్రావస్తుత్ను -ఉన్నేతను -ఇట్లు సర్వయజ్ఞ ప్రవర్తకులగు ఋత్విజులను సృజరిచెను. ఈ హేతువుననే ఈ పరమ పురుషునకు వేదమయుడనియు యజ్ఞ పురుషుడనియు నామము. వేదములును వేదాంగములును ఉపనిషత్తులును యాగాది క్రియలును ఈ భగవన్మయములే.

నారాయణవక్త్రా న్మార్కణ్డయవినిర్గమః పునః ప్రవేశశ్చ.

స్వపిత్యేకార్ణవే తోయే యదాశ్చర్య మభూత్పూరాl శ్రూయతాం తద్యథా విప్రా మార్కణ్డయః కుతుహలాత్‌. 13

గీర్ణో భగవత స్తసగ కుక్షావేవ మహామునిః l బహువర్షసహస్రాయుస్తసై#్యవ ఘనతేజసా. 14

అటం స్తీర్థ ప్రసజ్గేన పృథివీం తీర్థగోచరః l ఆశ్రమాణిచ పుత్యాని దేవతాయతనానిచ. 15

దేశా న్రాష్ట్రాతి చిత్రాణి పురాణి వివిధానిచ lజపహోమపరశ్శాన్త స్తపోఘోరం సమాస్థితః. 16

మార్కణ్డయస్తతస్తసగ శ##నైర్వక్త్రద్వినిస్సృతః l నిష్క్రమన్తంచ ఆత్మానం జానీతే దేవమాయయా. 17

నిష్క్రమ్య చాస్య వదనాదేకార్ణవమథో జగత్‌ l సర్వత స్తవసా చ్ఛన్నం మార్కణ్డయో7న్వవైక్షత.18

తస్యోత్పన్నం భయం తీవ్రం సంశయశ్చాత్మజీవితే l దేవదర్శనసన్తుష్టో విస్మయం పరమం గతః. 19

సో7చిన్తయజ్జలా న్తః స్థో మార్కణ్డయశ్చ శజ్కితః l కింను స్మాన్మమ చిత్తే7యం మోహస్స్వప్నోను భూయతే. 20

వ్యక్త మన్యతమా భావస్తేషాం సమ్భావితోమమ l నహీదృశం జగత్కేశమయుక్తం సత్యమర్హతి. 21

నష్టచన్ద్రార్కపవనే నష్టపర్వతభూతలే l కతమస్స్యాదయం లోక ఇతి చిన్తామవస్థిద. 22

దదర్శ చాపి పురుషం స్వపన్తం పర్వతోపమమ్‌ l సలిలేర్దమధోమగ్నం జీంమూతమివ సాగరే. 23

తపన్తమిప తేదోభిర్గోయుక్తమివ భాస్కరమ్‌ l శర్వర్యాం జాగ్రతమివ భాసన్తం స్వేన తేజసా. 24

దేవం ద్రష్టుమిహాయాతః కోభవానితి విస్మయాత్‌ l తథైవచ మునిః కుక్షిం పునరేవ ప్రవేశితః. 25

స ప్రవిశ్య శ##నైః కుక్షిం మార్కణ్డయస్సవిస్మితః l తథైవచ పునర్బూయో విజానన్త్స్వప్నదర్శనమ్‌. 26

______________________________________________________________________________

*ఈపదునారుమరది ఋత్విజులలో బ్రహ్మ-ఉద్గాత హోత-అధ్వర్యువు-అను నలుగురును ప్రధానులు; మిగిలిన పండ్రెండు మందిలో బ్రాహ్మణాచ్ఛంసి -పోతా- అగ్నీధ్రుడు- అను మువ్వుడను బ్రహ్మకును- ప్రస్తోతా- ప్రతిహర్తా. సుబ్రహ్మణ్యుడు 6 అను ముగ్గురును ఉద్గాతకును- మైత్రావరుణుడు- అచ్చావాకుడు- గ్రావస్తుత్‌- అను మూవురును హోతకుని- ప్రతిప్రస్థాత-నేష్ట- ఉన్నేత- అను త్రయమును అధ్వర్యుయనకును యజ్ఞ నిర్వహణము సహాయులుగా నుందురు. (అశ్వలాయన శ్రౌత సూత్రములు -పూర్వషట్క- చతుర్థాద్యాయారంభము) స్నాతకుడు (గురుకులమున వేద విద్యా ధ్యయనము చేసి విద్యా సమాప్తి వ్రతస్నాన మొనర్చిన యాతడు కాని -బ్రాహ్మచారి (గురుకులమున వేద విద్యాధ్యయనము చేసి విద్యా సమాప్తి వ్రతస్త్నాన మొనంచిన యాతడు కాని - బ్రహ్మచారి (గురుకులమున వేద విద్యాధ్యయన మొనర్చునవాడు కాని ఉపకుర్వాణ బ్రహ్మచారి ) కాని మరెవ్వరైన దీక్షితుడు (అదివరకే యజ్ఞ మాచరించిన పవిత్ర జన్ముడు.) కాని ఉన్నేతకు దీక్ష ఇచ్చును. ఉన్నేత-నేష్టకు- అగ్నీ ధ్రునకు - సుబ్రహ్మణ్యునకు- గ్రావస్తుత్కు - దీక్ష ఇచ్చను . నేష్ట- ప్రతిప్రస్థాతకు- పోతకు ప్రతిహర్తకు- అచ్చావాకునకు దీక్ష ఇచ్చును ; ప్రతి ప్రస్థాత-అధ్వర్యునకు- బ్రహ్మణాచ్ఛంసికి-ప్రస్తోతకు-మైత్రావరుణనకు దీక్ష ఇచ్చును. అధ్వర్యువు - గృహపతికి (యజమానునకు) - బ్రహ్మకు - ఉద్గాతకు- హోతకు - దీక్ష ఇచ్చును. (శతపథ బ్రాహ్మణము - మధ్యమకాండము-

స తథైవ యథా పూర్వం స ధరామటతే పూరా l పుణ్యతీర్థజలోపేతాం వివిధాన్యా శ్రమాణి చ. 27

క్రతుభిర్యజమానాంశ్చ సమాప్తవరదక్షిణౖఃl అపశ్య ద్దేవకుక్షిస్థా న్యాజకా ఞ్చతశో ద్విజా9. 28

సద్వృత్త మాశ్రితా న్త్సర్వా న్వర్ణా న్బ్రా హ్మణపూర్వకా 9 l

చతుర శ్చాశ్రమా న్త్సమ్య గ్యథోద్దిష్టా న్మయా తవ. 29

పూర్వ మొక ప్రళయ సమయుమున ఏకార్ణవ జలమున ఈ పురుషోత్తముడు నిద్రించుచుండ జరిగిన యాశ్చర్య కుతూహలకర విషయమును తెలిపెదను వినుడు. బహు సహస్ర వత్సరాయువుగల మార్కండేయ మహాముని ఆ భగవానునిచే ప్రళయ సమయమున మ్రింగబడి ఆతని కుక్షియందు ఆ దేవుని తేజస్సులోనే వ్యాప్తుడై యుండెను. అచటనే తీర్థయాత్రా ప్రసంగమున పృథివియందు సంచరించుచు పుణ్యములగు తీర్థములందు ఆశ్రమములందు దేవాలయములందు దేశములందు రాష్ట్రములందు విచిత్రములగు వివిధ పురములందు సంచరించుచు జపహోమపరుడును శాంతుడునునై ఘోర తపస్సాచరించిను అతడు మెల్లగా అతని నోటినుండి వెలికి వచ్చుచు ఇది ఈ భగవానుని మాయవలననే జరుగుచున్నదని గుర్తించెను. వెలికి వచ్చిన తరువాత అతడు జకగమంతయు ఏకార్ణవమయి అంధకారావృతమయి యుండుట చూచెను. అతనికి తీవ్ర భయమును తన జీవితము విషయమున (బ్రదుకుదునా లేదాయను) సంశయమును కలిగెను. అతడు భగవద్దర్శనముచే సంతుష్టు డయ్యెను; మిగుల ఆశ్చర్యమును కూడ పొందెను. అత డట్లు జలమధ్యమం దుండియే భయముతో నా చిత్తమునం దిదియేమయిన మోహము కలిగెనా స్వప్నము ననుభవించుచున్నావా? అనుకొనెను. ఒకవేళ అ జగత్పదార్థములు ఒక విధముగా నుండగా మరియొక విధముగా నున్న వని (నశించకయున్నను నశించినవని) నేనే పొరపడుచున్నానేమో! ఏలయన జగత్తునకు ఇంతటి క్లేశము (నాశము) సంభవించుట యుక్తము కాదు గదా! చంద్ర రవి వాయువులును పర్వతములును భూతలమును నశించిన తరువాత ఈ లోకము ఏ లోకమని భావించవచ్చును? అని చింత నందుచుండగనే అతనికి పర్వతమంత పురుషుడు నిద్రించుచు కనబడెను. అతడు మేఘమువలె సముద్రమునందు మునిగిన సగము శరీరముతో నుండెను. తన తేజస్సులతో వేడిమి నిచ్చుచు కిరణయుక్తుడగు భాస్కరుడువలె నత డుండెను. స్వతేజస్సులతో వెలుగుచు రాత్రియందు కూడ మేల్కాంచినవాడువలె నుండెను. (జగమంతయు చీకటితో నిండి రాత్రివలె నుండెను. ఆ మహాపురుషుడు మాత్రము మేల్కాంచి యుండెను. ) ''నేను భగవానుని దర్శించుటకు వచ్చితిని; మరి నీ వెవ్వడవు?'' అని మార్కండేయు డా పురుషునితో అనుచుండగనే మరల మార్కండేయుడు భగవానుని కుక్షియందు ప్రవేశింపజేయబడెను. మార్కండేయ డట్లు మెల్లగ కుక్షియందు ప్రవేశించి మిగుల విస్మయపడుచు ఇదియంతయు స్వప్నదర్శనమని భావించుచు మరల ఎప్పటివలె భూ సంచారము చేయుచు ఆ దేవుని కుక్షియందు పుణ్యతీర్థ జలములను వివిధాశ్రమములను సమగ్రములును శ్రేష్ఠములును నగు దక్షిణలతో యజనము చేయుచున్న యజమానులను వారిచే యజింపజేయబడుచున్న యాజకులను వందలకొలది మంది బ్రాహ్మణులను చూచెను. వారేకాక బ్రహ్మణాది వర్ణములవారు సద్వర్తనులయి నేను (మత్స్యడు) నీకు తెలిపిన ఆయా వర్ణాశ్రమ ధర్మములను లెస్సగ ఆచరించుచు అతనికి కనబడిరి.

ఏవం వర్షశతం సాగ్రం మార్కణ్డయ స్య ధీమతః l చరతః పృథివీం సర్వాం న కుక్ష్యన్త స్సమీక్షితః. 30

తతః కదాచి ధథ వై పున ర్వక్త్రా ద్వినిస్సృతః l సుప్తం న్యగ్రోధశాఖాయాం బాల మేకం నిరైక్షతః. 31

తథైవై కార్ణవజలే నీహారేణావృతామ్బరే l అవ్యక్తః క్రీడతే లోకే సర్వభూతవివర్జితే .32

స ముని ర్విస్మయావిష్టః కౌతూహలసమన్వితః l బాలమాదిత్యసజ్కాశం నాశక్నో దభివీక్షితమ్‌. 33

నారాయణమార్కణ్డయసంవాదః.

సో7చిన్తయ త్తదైకాన్తే స్థిత్వా సలిలసన్నిధౌ l పూర్వదృష్ట మిదం మేనే శజ్కితో దేవమాయయా. 34

అగాద సలిలే తస్మి న్మార్కణ్డయ స్సువిసటితః l ప్లవం స్తథా ర్తి మగమ ద్బయా త్సస్త్రస్తలోచనః. 35

తసై#్మ సభగవానాహ స్వాగతం బాలయోగవా9 l బభా షే మేఘతుల్యేన స్వనేన పురుషోత్తమః. 36

మాభైర్వత్స నభేతవ్య మిత ఆయాహి మే7న్తికమ్‌ l మార్కణ్డయముని స్త్వాహ బాలంతం శ్రమపీడితః 37

మార్కణ్డయః కో మాం నామ్నా కీర్తయతే తపః పిరిభవన్మమ l

దివ్యం వర్షసహస్రాఖ్యం ధర్షయన్నివ మే వయః. 38

నహ్యేష వ స్సమాచారో దేవేష్వపి మమోచితః l మాం బ్రహ్మాపిచ దేవేశో దీర్ఝాయురితి భాషతే. 39

కస్తమో ఘోరమాసాద్య మమేతి త్యక్తజీవితః l మార్కణ్డయేతి మాముక్త్వా మృత్యుమీక్షితుమర్హతి. 40

సూతః: ఏవమాభాష్య తం క్రోధాన్మార్కణ్డయో మహామునిః l

తథైవ భగవాన్భూయో భాషతే మధుసూదనః. 41

ఇట్లా ధీమంతుడగు మార్కండేయుడు సంపూర్ణముగ నురేండ్లు పృథవీ సంచారము చేసినను భగవానుని కుక్షికి కొన మాత్రము దొరుకలేదు; కాని అట్లు సంచరించుచునే ఒకానొకప్పు డతడు ఆ కుక్షినుండి వెలికి వచ్చెను. అతని కీ మారు మర్రికొమ్మపై నిద్రించుచున్న బాలు డొకడు కనబడెను. అత డట్లే ఏకార్ణవ జలమున మంచుతో కప్పబడిన అంతరిక్షము నడుము ఏ ప్రాణియును లేని లోకమున అవ్యక్తరూపుడై క్రీడించుచుండెను. ఆ మువి విన్మయా విష్టుడును కుతూహలవంతుడును నయ్యెను . కాని సూర్య సమానుడగు ఆ బాలుని మాత్రము సమగ్రముగా పరిశీలించి చూడజాలక పోయెను. అత డపుడు ఏకాంతమందు జల - సన్నిధియందు (స్థానమందు) నిలిచియుండి ఎంతయో ఆలోచించెను. ఇది ఏమని ఆలోంచించుచునే ఇది నే నిదివరకు చూచినదేయని అత డనుకొనెను. ఆ దేవుని మాయతో భయపడెను. మిగుల ఆశ్చర్యముతో అతడు అ అగాధ నలిలమందు తేలుచు ఈ దులాడుచు మిగుల శ్రమ చెందుచు భయగ్రస్త లోచను డయ్యెను భగవానుడగు ఆ యోగి బాలుడు అతనికి స్వాగతము పలికెను. ఆ పురుషోత్తముడు మేఘ సమాన ధ్వనితో ''నాయనా! మార్కండేయా! భయపడకుము. నా దగ్గరకు రమ్ము.'' అనెను. ''నా తపమునకు పరాభవము కలిగించుచు దివ్యవర్ష సహస్రముల పరిమాణముగల నా వయస్సును ఆలక్ష్యము చేయుచు నన్ను పేరుతో పిలుచుచున్న ఈత డెవ్వడు? ఈ నీ తక్కువపరచు నడుపడి దేవతలయందు కూడ నేను అలవాటుగా చూచియుండలేదు. దేవేశుడగు బ్రహ్మకూడ నన్ను 'దీర్ఝాయూ!' అని పలుకరించును. ఇట్టి నన్ను తాను ఘోరాంధకారమందుడియు జీవిత త్యాగమునకును సిద్ధపడి మార్కేండేయా! అని నన్ను పిలిచి మృత్యుపును దర్శింపగోరుచున్న ఈత డెవ్వడు?'' అని మార్కండేయ మహాముని పలికినంత భగవానుడును మధుసూదనుడు నగు బాలుడు మరల అట్లే మేఘ గంభీరధ్వనితో ఇట్లు పలికెను:

శ్రీభగవా9: అహం తే జనకో వత్స హృషీకేశో మహాగురుః l

ఆయుః ప్రదాత పౌరాణః కిం మాం త్వం నోపసర్పపి. 42

మాం పుత్త్రకామః ప్రథమం పితా తే7జ్గిరసో మునిః l పూర్వమారాధయామాస తపస్తీ వ్రం సమాశ్రిత. 43

స తప్త్యా దీర్ఝతపసా త్వాం వృణో దమితౌజసమ్‌ l ఉక్తవానహ మాత్మస్థం మహర్షి మమితౌజసమ్‌. 44

కస్సముత్సహతే చాన్యో యో న భూతాత్మకాత్మజః l ద్రష్టు మేకార్ణవగతం క్రీడంతం యోగమాయయా. 45

తతః ప్రహృష్టహృదయో విస్మయోత్పుల్లలోచనః l మూర్ద్ని బద్దాఞ్జలిపుటో మార్కణ్డయో మహాతపాః 46

నామగోత్రే తతః ప్రోచ్య దీర్షాయు ర్లోకపూజితః l తసై#్మ భగవతే భక్త్యా నమస్కార మథాకరోత్‌. 47

మార్కణ్డయః : ఇచ్ఛేయం తత్త్వతో మాయా మిమాం జ్ఞాతుం తవానఘ l

యదేకార్ణవమధ్యస్థ శ్శేషే త్వం బాలరుపవా9. 48

కింసంజ్ఞశ్చైవ భగవన్లోకే సంజ్ఞాయసే ప్రభో l తర్కయే త్వాం మహాత్మానం కోహ్యన్య స్థ్సాతుమర్హతి. 49

నాయనా! నేను నీ తండ్రిని; హృషీకేశుడను; (హృషీకములకు- విషయేంద్రయములకు- ఈశుడను) మహాగురు డను (గురువులకును గురుడను.) నీకు (నులోకమందలి ప్రాణులకును) ఆయువును ఇచ్చువాడను; పూరాణ (ప్రాచీనతమ) తత్త్వమను నేను; నీవు నా కడకు రాకున్నావేల? మొదట పూర్వకాలమున నీ తండ్రియగు ఆంగిరన (అంగిరో వంశజుడగు) మృకండుముని పుత్త్రుల కోరి తీవం తప మాశ్రయించి తత్సాధనమున నన్ను మెప్పించెను; అమిత శక్తివంతుడవగు నీవు కుమారుడుగా కావలెనని వర మడిగెను. ఆత్మనిష్ఠుడు అమితౌజ: శాలియగు ఆతని కోరికకు నేను సరే యంటిని. సర్వ భూతాత్ముడగు అట్టి మహర్షి కుమారుడు కాక మరెవ్వరు ఏకార్ణవగతుడయి యోగమాయతో క్రీడించు నన్ను చూడగలడు? అనగా దీర్ఝాయుష్కుడు లోకపూజితుడు మహ తపస్కుడగు మార్కండేయుడు హర్ష పూర్ణ హృదయముతో ఆశ్చర్యమున విప్పారిన కన్నులతో తలపై నిలిపిన దోసిలితో తన పేరును గోత్రమును పేర్కోని నారాయణుని నమస్కరించెను. పూజ్య భగవన్‌ ! నీవు బాలరూపుడవై ఏకార్ణవమందున్న హేతువును నీ మాయకు గల వాస్తవ రూపమును తెలియగోరు చున్నాను. ప్రభూ ! భగవన్‌ ! నీవు ఏ సంజ్ఞ (నామము) తో లోకమున వ్యవహరింపబడుదువు? నీవు మహాత్ముడ (పరమాత్ముడ ) వని యూహించుచున్నాను. కానిచో మరి ఎవ్వరు ఈ ఏకార్ణవ జలమున ఉండగలరు? అనెను.

శ్రీ భగవా9 : అహం నారాయణో బ్రహ్మన్త్సర్వభూ స్సర్వనాశనః l

అహం సహస్రశీర్షాఖ్యై(ద్యై) ర్య ః పదై రభిసంజ్ఞితః. 50

ఆదిత్య వర్ణః పురుషో మఖే బ్రహ్మమయో మఖః l అహమగ్ని ర్హవ్యవహో యాదసాం పతి రవ్యయః 51

అహమిన్ద్రపదే శక్రో వర్షాణాం పరివత్సరః l అహం యోగీ యుగాదిశచ యుగాన్తో వర్షమేవచ. 52

అహం సర్వాణి రత్నాని దైవతాన్యఖిలానిచ l భుజజ్గానా మహం శేషస్తార్యో వై సర్వపక్షిణామ్‌. 53

కృతా న్త స్సర్వభూతానాం విశ్వేషాం కాలసన్నిభః l అహం ధర్మస్తపశ్చాహం సర్వాశ్రమనివాసినామ్‌. 54

అహంచైవ సరిద్దివ్యా క్షీరోదశచ మహార్ణవ ః l యత్సత్యం చైవ పరమ మహ మేకః ప్రజాపతిః. 55

అహం సాజ్ఖ్యమహం యోగో7వ్యహం తత్పరమం పదమ్‌ l

అహమిజ్యా క్రియావాపి హ్యహం విద్యాధివస్స్మృతః. 56

అహం జ్యోతిరహం వాయు రహం భుమి రహం నభః l అహమాపస్సముద్రాశ్చ నక్షత్రాతి దిశో దశ. 57

బ్రాహ్మణ శ్రేష్ఠా ! నారాయణుడు *సర్వకారణుడు సర్వపోషకుడు- సర్వ స్థితికర్త సర్వనాశకుడు సహస్ర శీర్షాది వదములతో వ్యవహరింపబడువాడు ఆదిత్యవర్ణుడగు పురుషుడు యజ్ఞమం దారాధింపబడు బ్రహ్మ (వేద) మయ పురుషుడు యజ్ఞము హవిస్సును వహించు అగ్ని జలచర ప్రాణులు కధిపతియగు సముద్రాధి దేవత (వరుణుడు) అవ్యయ ( ఏ మార్పును లేని) తత్త్వము ఇంద్రుని నామములలో శక్రపదముచే వ్యవహరింపబడు తత్త్వము వర్షములలో పరివత్సరము (అనెడు వర్షము) యోగి యుగాది యుగాంతము వర్షము సర్వ రత్నములు సర్వ దేవతలు సర్పములలో శేషుడు సర్వ పక్షులలో గరుత్మంతుడు సర్వ భూతములందు కాల సమానుడగు యముడు ఆయా ఆశ్రమ ధర్మములందుండు వారి ధర్మ తపస్సులు దేవనదియగు గంగ క్షీర సాగరము పరమ సత్యము ప్రథమ ప్రజాపతి సాంఖ్యము యోగము పరమ పదము దేవతారాధన (ఇజ్యా) క్రియ విద్యాధిపతి అగ్ని వాయు పృథివ్యాకాశ జలములను పంచభూతములు సముద్రములు నక్షత్రములు దశ దిశలు నేనే.

అహం వర్ష మహం సోమః పర్జన్యో7హ మహం *విభుః క్షీరోదే సాగరేవాహం సముద్రే బడబాముఖః. 58

______________________________________________________________________________

* శ్లో.50 సర్వభూః: సర్వం భవతి అస్మాత్‌- ఈ విశ్వమంతయును ఈతని నుండియే కలుగును; కావున సృష్టికర్త; సర్వం - భవతి అస్మిన్‌ అనేన; ఈ విశ్వమంతయును ఈతని చేతనే ఈతనియందే నిలిచియుండును; కావున 'స్థితి' కర్త

ఇట్లు ఈ రెండు అర్థములును ఇచటి 'సర్వభూః' అనెడు పదమునుండియే లభించును.

* రవిః

అహం సంవర్తకో భూత్వా పిబంస్తోమ మహం హవి ఃl అహం పురాణః పరమం తథైవాహం పరాయణమ్‌.

అహం భుతసగ భవ్యస్య వర్తమానస్య సర్వతః l యత్కిఞ్చిత్పశ్యసే వివ్ర యచ్చ్రుణోషి న కి ఞ్చన. 60

యచ్చానుభవసే లోకే తత్సర్వం మామనుస్మర l

విశ్వం సృష్టం మయా పూర్వం సృజే చాద్యాపి పశ్యమామ్‌. 61

యుగే యుగే చ స్రక్ష్యామి మార్కణ్డయాఖిలం జగత్‌ l తదేతదఖిలం సర్వం మార్కణ్డయావధారయ. 62

శశ్రుఘః పరధర్మేప్సుః కుక్షౌ చర సుఖం మమ l మమ బ్రహ్మా శరీరస్థో దేవాశ్చ ఋషిభిస్సహ. 63

వ్యక్తమవ్యక్తయోగం మా మవగచ్ఛాసురద్విషమ్‌ l అహమేకాక్షరో మన్త్రస్యా (శ్చా) క్షరశ్చైవ తారకమ్‌. 64

పరస్త్రివర్గా దోజ్కార స్త్రివర్గార్థనిదర్శనః l ఏవ మాదిపూరాణో7సౌ వదన్నేవ మహామతిః. 65

వక్త్రమావృతవానాశు మార్కణ్డయం మహామునిమ్‌ l తతో భగవవతః కుక్షిం ప్రవిష్టో మునిసత్తమః. 66

స తస్మిన్ముఖ మేకాన్తే శుశ్రూఘ ర్హంస మవ్యయమ్‌. 67

అయం స యో వివిధతనుం పరిశ్రితో మహార్ణవే వ్యపగతచంద్ర భాస్కరే l

శ##నై శ్చర న్ప్రభురపి హంససంజ్ఞితో7సృజజ్జగద్విహరతి కాలపర్యయే. 67u

ఇతి శ్రీమత్స్యమహాపురాణ నారాయణనాభిపద్మోద్భవకథనే నారాయణ

మార్కణ్డయసంవాదో నామ షట్షష్ట్యుత్తర శతతమో7ధ్యాయః.

వర్షము సోముడు (ఓషధులకు పుష్టి నిచ్చు దేవత) పర్జన్యుడు (మేఘాధిష్ఠానదేవత) రవి క్షీర సాగరము సముద్రమందలి బడబాగ్ని సంవర్తకాగ్ని అయి ప్రళయమున జలము హవిస్సును త్రావు అగ్ని - పూరాత (అతి ప్రాచీన తత్త్వము పరాయణము (ఎల్ల భూతములకును చివరి గమ్యము) భూత భవిష్యద్‌ వర్తమానములకు అదికారణము- విప్రా! నీవు చూచునది వినునది అనుభవించునది అంతయు నేనే అని తెలియుము. పూర్వము సృజించునది ఇపుడు సృజింపబడనున్నది అంతయు నేనే. యుగయుగమునందును నేనే అఖిల జగమును సృజింతును. నీవును నా కుక్షియందు సుఖముగా సంచరించుచు నేను వ్యవస్థ చేసిన ధర్మములను ఎరుగుచు ఉండుము. బ్రహ్మయు దేవతలతో ఋషులతోకూడి నా శరీరమందే యున్నాడు. అవ్యక్తము అగు తత్త్వములును అసుర నాశకుడును ఏకాక్షర మంత్రమగు అకారము త్య్రక్షరమగు తారక (సంసారమునుండి తరింపజేయు ప్రణవ) మంత్రము నేనే; ధార్మర్థకామము లనెడు మూడు పురుషార్థములను (వేదరూపమున) నిరూపించుచు ఈ త్రివర్గముకంటె ఆవల నున్న తత్త్వమును నిరూపించు ఓంకారమును నేను; అని ఈ మెదలగునవి చెప్పుచునే మహామతిశాలియు పూరాణుడునగు ఈశ్వరుడు నారాయాణుడు మార్కండేయ మహామునిని తన నోటిలోనికి తెచ్చుకొనెను. అంతట అ మునిసత్తముడును భగవానుని కుక్షియందు ప్రవేశించి ఏకాంతమున అవ్యయుడు హంసరూపుడును అగు భగవానుని సేవించుచుండెను. వివిధ తనువుల ధరించి లోకముల ప్రవర్తింపజేసి చంద్ర సూర్యలును లేని మహైకార్ణవమును ఈ వివిధ రూపములతో మెల్లగా సంచరించుచు మరల కాలము వచ్చినపుడు తత్పరిణామానుసారము జగములను సృజించుచు విహరించు హంసరూప భగవానుని స్వరూపము ఇది .

ఇది శ్రీమత్స్య మహాపురాణమున నారాయణ మార్కండేయ సంవాదమను

నూట అరువది ఆరవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters