Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోనస ప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

మధుకైటభాసురోత్పత్తిః.

శ్రీమత్స్యః: విష్ణౌ స్వపతి సమ్బూతో మధుర్నామ మహాసురః l

తేనైవచ సహోద్భూతో వ్యాసురో నామకైటభః. 1

తౌరజస్తమసౌ విఫ°్న సమ్బూతౌ తామసౌ గణౌ l ఏకార్ణవే జగత్సర్వం క్షోభయన్తౌ మహాబలౌ. 2

దివ్యరక్తా మ్బరధరౌ శ్వేతదీప్తోగ్రధంష్ట్రిణౌ l కిరీటకుణ్డలోదగ్రౌ కేయూరవలయోజ్జ్వలౌ. 3

మహావిక్రమతాపమ్రాక్షౌ పీనోరస్కౌ మహాభుజౌ l మహాగిరేస్సంహననౌ జజ్గమావివపర్వతౌ. 4

నవమేఘప్రతీకాశా వాదిత్య ప్రతిభానవౌ l విద్యుదాభౌ గదోగ్రాభ్యాం కరాభ్యా మతిభీషణౌ. 5

తౌ పాదయోస్తు విన్యాసా దుత్షిపన్తా వివార్ణవమ్‌ l కమ్పయన్తా వివ హరిం శయానం మధుసూదనమ్‌. 6

తౌ తత్ర విచరన్తౌ స్మ పుష్కరే విశ్వతోముఖే l యోగినాం శ్రేష్ఠ మాసాద్య దీప్తం దదృశతు స్తదా. 7

నారాయణసమాజ్ఞాతం- సృజస్త మఖిలాః ప్రజా ః l దైవతానిచ విశ్వాని మానసా నసురా నృషీ 9. 8

చతుర్ముఖమధుకై టభసంవాదః.

తతస్తా పూచతు స్తత్ర బ్రహ్మాణ మసురోత్తమౌ l దీప్తౌ యుగపత్సజ్క్రుద్దౌ రోషవ్యాకులితేక్షణౌ. 9

కస్త్వం పుష్కరమధ్యస్థ స్సితోష్ణీష శ్చతుర్ముఖః l ఆధాయ నియమం మోహా త్తదాస్సే విగతజ్వరః . 10

ఏహ్యాగచ్ఛావయో ర్యుద్ధం దేహి త్వం కమలోద్భవ l ఆవాభ్యాం పరమీశాభ్యా మశ క్త స్త్వమిహార్ణవే. 11

తత్ర కశ్చోద్భవ స్తుభ్యం కేన వా త్వం నియోజితః l కస్స్రష్టా కేశ్చ తే గోప్తా కేన నామ్నా విధీయసే.

బ్రహ్మాః ఏక ఇత్యుచ్యతే లోకై రవిచిన్త్యః సహస్రదృక్‌ l తత్సంయోగేన భవతో ః కర్మ నామావగచ్ఛతమ్‌.

నూట అరువది తొమ్మిదవ అధ్యాయము.

మధుకై టభుల ఉత్పత్తి - వారి వధముచే సృష్టి విఘ్న నివారణము.

శ్రీమత్స్యుడు మనువున కిట్లు చెప్పెనని సూతుడు ఋషుల కిట్లు చెప్పసాగెను శ్రీ మహావిష్ణువు ఏకార్ణవ జలమున నిద్రించుచుండ మధుకైటభులను మహాసురులు జనించిరి. *వారిద్దరును రజ స్తమోగుణప్రధానులయి తామసగణములలోని వారుగా (రజస్తమోగుణములందలి దోషములుగా) జనించి (ముందు భగవానుడు జరుపనున్న ) సృష్టికి విఘ్న భూతులుగా నుండిరి. వా రేకార్ణవ జలరూపమున నున్న జగత్తు నంతటిని తమ మహాబలముతో క్షోభింపజేయుచుండిరి. ప్రకాశించు ర క్తవస్త్రములను ధరించి తెల్లగ ప్రకాశించు కోరలు కలిగి కిరీటకేయూర (భుజకీర్తి) వలయ (చేతికంకణ)ములతో ప్రకాశించుచు మహావిక్రములు రక్తనేత్రులు పీనవక్షులు మహాభుజులునై మహాగిరివంటి దృభశరీర నిర్మాణము కలిగి సంచరించు పంప్వతములవంటివారయి తొలుకరి మేఘములవలెను మెరపులవలెను మెరయుచు గదలతో భయంకరములగు కరములతో మరింత భీషణులుగా నుండిరి. వారు తమ పాదవిన్యాసములతో అర్ణవమును ఎగురగొట్టుచున్నా రేమో - శయనించిన వాడును మధుని (కైటభుని) చంపనున్న హరిని కూడ కంపింపజేయుచున్నారేమో - అనునట్లు సర్వతోముఖముగా నున్న ఆ ప్రళయార్ణవపుష్కరము (పద్మమను వ్యవహారముకల జలము ) నందు విచరించుచు పోయిపోయి ప్రకాశించుచుండు తమకు దగ్గరలో ఎదుట నున్న యోగిశ్రేష్ఠుని చూచిరి. అతడు నారాయణుని లెస్సయగు ఆజ్ఞతో సకల ప్రజలను- అనగా సకల దేవతలను మానస ఋషులను అసురులను- సృష్టించబోవుచుండెను అచ్చట ఆ అసురోత్తములు ఇద్దరును ఒకేమారుగా మిగుల క్రుద్ధులును రోషముతో కలవరపడు కన్నులు కలవారును నియమము పూని అప్పటికి ఏ సంతాపమును లేకయున్న నీవెరపు? రమ్ము!రమ్ము! కమలోద్భవుడా! మాకు యుద్ద మిమ్ము! మిగుల ఈశుల(సమర్థుల) మగు మా కంటె నీవసమర్థుడవు; ఇట్టి నీకు జన్మకారణు డెవరు? ఎవరు నిన్ను (ఈ పనికై ) నియోగించినారు? నిన్ను సృష్టించినవా రెవ్వరు? రక్షించువా రెవ్వరు? ఏపేరున వ్యవహరింపబడుదువు? అనగా ''(అందరను సృష్టించువాడును రక్షించువాడును) ఒక్కడే

* [భగవానుడు జరుపు సృష్టి స్థితిలయములలో సృష్టికి రజోగుణమును స్థితికి సత్త్వగుణమును లయములకు తమో గుణమును హేతువులైనను అవి శుద్ధరూపముననుండక మాలిన్యమును పొందినచో ఆయాప్రక్రియలలో విఘ్నమేర్పడును. మధుకైటభులు అట్టి రజస్తమో మాలిన్యరూపులు.]

యనియు అతడు ఇట్టివాడని ఊహింపరానివాడును వేయి కన్నులుకలవాడును (అన్నిటిని చూచు శుద్దసాక్షి చైతన్య స్వరూపుడు) అనియు లోకములచే చెప్పబడుచున్నాడు కదా! ఆతడే నన్ను సృజించువాడు రక్షించువాడు ఈ పనికి నియోగించినవాడు కూడ; మరి అది కాదని వేరుగా ప్రశ్నించు మీ రిరువురును ఎవరో తెలుపుడు .'' అని బ్రహ్మ పలికెను.

మధుకైటభౌ: నావయోః పరమం లోకే కిఞ్చిదస్తి మహాముచే l

ఆవాభ్యాం ఛాద్యతే విశ్వం తమసా రజసా చ వై. 14

రజస్తమోమయా వావా మృషీణా మవలమ్బితౌ l ఛాద్యమానౌ ధర్మశీలౌ దుస్తరౌ సర్వదేహినామ్‌. 15

ఆవాభ్యముహ్య తే లోకో దుష్కరాభ్యాం యుగేయుగే l ఆవామర్థశ్చ కామశ్చ యజ్ఞ స్స్వర్గం పరిగ్రహః. 16

సుఖం యత్ర ముదా యుక్తం యత్ర శ్రీః కీర్తరేవచ l యేషాం యత్కాజ్షితం చైవ తత్తదావాం విచిన్తయ.

బ్రహ్మా: యత్నా ద్యోగవతో దృష్ట్యా యోగః పూర్వం మయార్జితః l

తం సమాదాయ గుణవత్సత్త్వం చాస్మి సమాశ్రితః. 18

యః పరో యోగమతిమా న్యోగాఖ్యః సత్త్వఏవ చ l రజస స్తమసశ్చైవ యస్స్రష్టావిశ్వసమ్బవః. 19

తతో భూతాని జాయన్తే సాత్త్వకానితరాణిచ l స ఏవ హి యువాం నాశే వశీ దేవో హనిష్యతి. 20

మధుకైటభు లిట్లనిరి: మహామునీ! లోకమున మమ్ముల మించిన దేదియులేదు. మేము రజస్తమో గుణములతొ విశ్వమును కాప్పివేయుదుము. మేము రజస్తమోమయులము; ఋషులకును అవలంబనము మేమే; ఐనను మేము మరుగుపడి యుందుము; ధర్మశీలురము; ప్రాణు లెవ్వరునుమమ్ము దాటిపోలేరు; ఎవరును ఏమియు చేయనలవికాని మేమే ప్రతియుగమందును లోకమును నడపుచుందుము; మానవాదులు కోరు అర్థము కామము యజ్ఞము స్వర్గము సంతోషప్రదమగు సుఖమ శ్రీకీర్తులు ఇవి అన్నియు మేమేయని ఎరుగుము. అన వివి బ్రహ్మ ఇట్లనెను: నేను నా యత్నము వలనను యోగతత్తత్వజ్ఞుడగు హరి కరుణాదృష్టితోను ఇంతకుముందే యోగ (ఫల)మును సమార్జించియుంటిని. గుణవంతమగు ఆ ఫలము నాధారముగా చేసికొని నేను సత్త్వగుణ మాశ్రయించియున్నాను. (కనుక రజస్తమో రూపులగు మీకు నేను యుద్ధ మీయదగను; ఎవరు అందరకంటె అన్నిటికంటె పరుడో యోగతత్త్వ జ్ఞానవంతుడో యోగమను పేరుకలవాడో సత్త్వరూపుడో రజస్తమములకు జనకుడో విశ్వసృష్ట్యాది హేతువో అతని నుండియే సాత్త్వకములును ఇతరములును (రజస్తమో గుణప్రధానములును) అగు భూతములన్నియు జనించును. సర్వగుణ వశకర్తయగు ఆ దేవుడే మీ నాశమునకు సమర్థుడు; కావున మిమ్మతడు చంపును అనెను.

సూతః: స్వపపన్నేవ తతశ్శ్రీమా న్బహుయోజనవిస్తృతమ్‌ l

బాహుం నారాయణో బ్రహ్మ కృతవానాత్మమాయయా. 21

కృష్యమాణౌ తత స్తేన హరిణా బాహుశాలినా l చేరతుస్తౌ విగళితౌ శకునావివ పీవరౌ. 22

తత స్తా వాహతు ర్గత్వా తతో దేవం సనాతనమ్‌ l పద్మనాభం హృషీకేశం ప్రణిపత్యచ తావుభౌ. 23

మధుకైటభౌ: జానీవస్త్వాం విశ్వయోనిం త్వామేకం పురుషోత్తమమ్‌ l

త్వమావాం పా (జ) హి హేత్వర్థమిదం నౌ శుద్ధికారణమ్‌. 24

అమోఘదర్శన స్సత్యం యతస్త్వాం విద్య శాశ్వతమ్‌ l తతస్త్వా మాగతా వావా మభితః ప్రసమీక్షితుమ్‌. 25

తదిచ్చామో వరం దేవ త్వయా దత్త మరిన్దమ l అమోఘదర్శనో7సి త్వం నమస్తే సమితిఞ్జయ. 26

శ్రీభగవా9: కిమర్థ మద్బుతం బ్రూత వరం హ్యసురస్తతమౌ l

త్తాయుష్కో పునర్బూయో రహో జీవితు మిచ్ఛథః. 27

మధుకైటభౌ: యస్మిన్న కశ్చి న్మృతవా న్దేవ తస్మి న్ప్రభో వధమ్‌ l

తమిచ్ఛావో వధం చైవ త్వత్తోనో7స్తు మహావ్రత. 28

శ్రీభగవా9: బాఢం యువాం తు ప్రవరౌ భవిష్యత్కాలసమ్భవే l

భవిష్యతో న సన్దేహ స్సత్యమేవ బ్రవీమి వామ్‌. 29

సూతః: వరం ప్రదాయాథా మహాసురాభ్యాం సనాతనో విశ్వవర స్సురోత్తమః l

రజస్తమోవర్గభవాయనౌ యమౌ మమన్థ తావూరుతలేన వై ప్రభుః. 30

ఇతి శ్రీమత్స్య మహాపురాణ నారాయణపనాభిద్మోద్బవ ప్రాదుర్బావ

కథనే శ్రీ విష్ణుకృత మధుకైటభాసుర వధో నామ

ఏకోనసప్తత్యుత్తరశతతమో7ధ్యాయః.

అంతలో పరబ్రహ్మరూపుడు శ్రీమంతుడు (పూజ్యుడు)నగు నారాయణుడు స్వమాయతో తన బాహువులను బహుయోజన దీర్ఝములుగా చేసేను. బాహుశాలియగు ఆ హరి లాగుచుండ వారు బలిసిన పక్షులవలె జరిపొవుచునే సంచరించుచు దగ్గరకు వచ్చిరి. సనాతనుడు పద్మనాభుడు హృషీకేశుడనగు అ దేవుని సమీపించి వారాతిని నమస్కరించి ఇట్లనిరి: విశ్వజన్మ కారణుడగు పురుషోత్తముడు నీవొక్కడవేయని మేమెరుగుదము; నీవు మమ్ము రక్షించుము (చంపుము); ఇది స హేతుకము; దీనివలన మేము శుద్దులమగుదుము; నీవు సత్యముగా వ్యర్థముకాని దర్శనము కలవాడవు; శాశ్వతుడవు అని ఎరిగి నిన్ను సమగ్రముగ దర్శింపగోరి నీయొద్దకు వచ్చినాము; శత్రునాశకా! అమోఘధర్శనా! యుద్దవిజేతా! నీకు వందనము; నీవు మాకు వరమీయ ప్రార్థించున్నాము; అనగా భగవానుడు ''ఈ అద్బుతమేమోయీ! నన్ను వరమేల అడుగుచున్నారు? నా వలన ఆయువు వరముగా పొంది మరల రహస్యముగా బ్రదుకగోరుచున్నారు గదాః అనెను. మధుకైటభులును ప్రభూః దేవా! మహావ్రతా! (ఉత్తమ కర్మలాచరించువాడాః) ఇదివరకెవరును మరణించియుండనిచోట మమ్ము చంపుము . ఇదియే మాకు నీవిచ్చు వరము. అనిరి . ''సరే! ముందొక కాలమున మీరు గొప్పవారగుదురు. నందియములేదు; నేనీచెప్పునది సత్యమే యగును. అని హరి వారికి వరము ఇచ్చి అంతట సనాతనుడును విశ్వశ్రేష్ఠుడును సురోత్తముడును ప్రభుడును అగు నారాయణడు ఈ రజస్తమోగుణ జాతులయి వానికి ఆశ్రయములయిన ఆ కవల(జంట)ను తన తొడలపై నలుగగొట్టెను.''

ఇది శ్రీమత్స్యమహాపూరాణమున మధుకైటభవధముచే పద్మనాభూడు బ్రహ్మకు సృష్టియందు

విఘ్నమును నివారించుటయను నూట అరువది తొమ్మిదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters