Sri Matsya mahapuramu-2    Chapters   

పంచసప్తత్యుత్తరశతతమోధ్యాయః.

కాలనేమి కృత సమరసన్నాహ వర్ణనమ్‌.

శ్రీమత్స్యః: ఏవమస్త్వితి సంహృష్ట శ్శక్ర స్త్రి దశవర్దనః l సన్దిదేశాగ్రత స్సోమం యుద్దాయ శిశిరాయుదమ్‌. 1

______________________________________________________________________________

*174 అ; శ్లో. 66.

(సాధ్యో) యదిహ కర్మణా

యత్‌- ఇహ-కర్మన్‌- అ (తృతీయా ప్రత్యయః)

యత్‌ ఇహ కర్మ (త్వయా-కృతం ) తేన ఇత్యర్థః-

యత్‌- ఇతి సర్వనామ్నేబలేన తత్‌

శబ్దస్యాక్షేపః- తృతీయాయాః తేన తచ్ఛబ్దేన

సహానుషంగశ్చ- ఆర్షో7యం విలక్షణః ప్రయోగః.

ఇచట- ''యత్‌=; కర్మ=కృత్యము; [త్వయా -కృతం= నీచేత చేయబడినదో; (అధ్యాహారము)] [తేన- కర్మణా= అకృత్యముచేత; (అ -అను తృతీయ ప్రత్యయమే ఇంతటి అధ్యాహారమును చేయించును). అహం-సాధ్యః= నేను సిద్ది పొందింపబడిన వాడను అయినాను. అని ఆర్థము.

గచ్ఛ సోమ సహాయత్వం కురు పాశధరస్య వై l అసురాణాం వినాశాయ జయార్థంచ దివౌకసామ్‌. 2

త్వమస్తః పరివీర్య శ్చ జ్యోతిషాం చేశ్వరేశ్వరః l త్వన్మయం సర్వలోకేషు రసం వేదవిదోవిదుః. 3

క్షయవృద్దీ తవ వ్యక్తే సాగరస్యేవ మణ్డలే l పరివర్తస్యహోరాత్ర కాలం జగతి యోజయ9. 4

లోగచ్ఛాయామరుం లక్ష్మ తవాజ్గే శశవిభ్రమమ్‌ l న విదు స్సోమదేవా7 పియేచ నక్షత్రయోనయః. 5

త్వమాదిత్యపథాదూర్ద్వం జ్యోతిషాం చోపరి స్థితః l తమః ప్రోత్సార్య సపాసా భాసయస్యఖిలం జగత్‌. 6

శ్వేత భాను ర్హిమతను ర్జ్యోతిషామధిపశ్శశీ l అధికృత్కాలయోగాత్మా ఇష్టో యజ్ఞశ్చ సో7వ్యయః. 7

ఓషధీశః క్రియాయోని ర్హరశేఖరధృక్తథా l శీతాంశు రమృతాధార శ్చవల శ్శ్వేతవాహనః. 8

త్వం కాన్తిః కాన్తవపుషాం త్వం సోమ స్సోమపాయినామ్‌ l సౌమ్యస్త్వం సర్వభూతానాం తిమిరఘ్న స్త్వమృక్షరాట్‌. 9

తద్గచ్చ త్వం మహాసైన్యం వరుణన వరూథినా l శమయత్వా సురీం మాయాం యయా దహ్యామ సంయుగే. 10

సోమః : యన్మాంపదసి యద్దార్థే దేవరాజ! వరప్రద! ఏవం వర్షామి శిశిరం దైత్యమాయాపకర్షణమ. 11

ఏతా న్మచ్ఛీతనిర్దగ్దా న్పశ్యస్వ హిమవేష్టతా9 l విమాయా న్విమదాంశ్చైవ పశ్య దైత్యా న్మహావావే. 12

నూటడెబ్బది యైదవ అధ్యాయము.

కాలనేమికృత సమరసన్నాహ వర్ణనము.

దేవతలకు శుభకరుడగు ఇంద్రుడు వరుణుని మాటకు సంతోషముతో సరేయని మంచు ఆయుధముగాగల చంద్రుని ముందుగ యుద్దమునకు పొమ్మని సందేశమంపెను. '' సోమా! నీవు వెళ్లి వరుణునకు సాయపడుము. అసుర వినాశమును దేవజయమును కలిగించుము. నీవు లోపలను వెలుపలను కూడ శక్తికలవాడవు; జ్యోతిస్సులకు పరమేశ్వరుడవు. లోకములందలి రసద్రవ్యమంతయు చంద్రమయమని వేదవేత్తలందురు. నీమూలమున సముద్రమునకు న్నట్లే నీ మండలమునందును క్షయవృద్దులుకలవు. కాలమును జగత్తునకన్వయింప జేయుచు అహోరాత్రముల నేర్పరచు చున్నావు. ప్రపంచపు నీడతో ఏర్పడిన గుర్తు నీయందు కుందేటివలె విలాసముచూపుచున్నది. నక్షత్రములకును మూలభూత (నక్షత్రాధి దేవత ) లగు దేవతలకు కూడ నీమహిమ తెలియదు. నీవు (నీ కాంతి మహిమ) అదిత్య పథమునకును నక్షత్రపథమునకును కూడ పైగానున్నావు. (నున్నది.) నీవు నీశక్తి తో చీకటిని పోగొట్టుచు అఖిల జగత్తు ప్రకాశింపజేయుదువు. నీకిరణములు తెల్లనివి; నీకాంతి హిమమయము; నీవు జ్యోతిస్సుల కథిపతివి; ప్రాణుల కథికశుభము కూర్తువు; కాలపువ్యవస్థయే నీ రూపము; యజ్ఞమందారాధింపబడువాడవును యజ్ఞమును నీవే; అవ్యయుడవు; అమృతమునకు నీవు ఆశ్రయమవు; చపలుడవు; (ఏవనినైనను చేయవలెనును కొనగానే అపని చేయుటకు త్వరపడు వాడవు);మనోహర శరీరుల శరీరకాంతి నీవే; సోమపానముచేయు యజమానులకును యాజ్ఞికులకును సోమమునీవే; సర్వభూతముల యందును సౌమ్యతగలవాడవు; చీకటులనశింప చేయువాడవు; నక్షత్రరాజపు; ఇట్టివాడవు కావున నీవు కవచధారియైన వీరుడగు వరుణనితో కూడి మహాసేనలోనికి పోమ్ము;; మమ్ములను దహింపజేయ అసురమాయను అణచి వేయుము;'' అనగా చంద్రుడింద్రునితో నిట్లనెను 'వరప్రదుడవగు దేవరాజా! నీవు స్వయముగా నన్ను యుద్ధమునకై ప్రేరించు చున్నావు కావున నీవనుట్లే దైత్యమాయను తగ్గించు మంచును వర్షింతును. ఈ దైత్యులందరును నా మంచుచే కాల్చబడి చుట్టివేయబడి మహాయుద్దమందు మాయారహితులు మదహీనులునగుదురు; చూడుము.'

తథా హిమకరోత్సృష్టా శ్శైశిరా హివవృష్టయఃl వేష్టయన్తిసట తాన్ఝో రా9 దైత్యా న్మేఘగణా ఇప. 13

తౌ పాశశీతాంశుధరౌ వరుణన్దూమహాబలౌ| జఘ్నతు ర్హిమపాతైశ్చ పాశపాతైశ్చ దానవా9.14

ద్వావమ్బునాధౌ సమరే తౌ పాశహిమయోధినౌl మృథే చేరతు రమ్బెభిః క్షుబ్దావివ మహార్ణవౌ. 15

తాభ్యా మాప్లావితం సైన్యం తద్దానవ మదృశ్యతl జగత్సవర్తకామ్బెదైః ప్రవిష్టైరివ సంవృతమ్‌. 16

తావుద్యతామ్బునాధౌ తు శశజ్కవరుణా బుభౌ l శమరూమాసతు ర్మాయాం దేవౌ దైత్యేన్ద్ర నిర్మితామ్‌.

éశీతాంశుజాలనిర్దగ్దాః పాశైశ్చ స్పన్దితా రణl నశకు శ్చలితుం దైత్యా విశిరస్కా ఇవాద్రయః. 18

శీతాంశునిహతా స్తే తు దైత్యా స్తోయహిమార్దితాః l హిమప్లావితసర్వాఙ్గా నిరూష్మాణ ఇవాగ్నయః. 19

తేషాంతు దివి దైత్యానాం విపరీత ప్రభాణి వైl విమానాని విచిత్రాణి ప్రపతన్త్యుత్పతన్తిచ. 20

తాన్పాశహస్తగ్రథితా ఞ్చదితా ఞ్చి తారశ్మిభిః l మయో దదర్శ మాయావీ దానవా న్దివి దానవః. 21

సశైలజాలవితితాం ఖడ్గచర్మావసిహాసినీమ్‌l పాపదపోత్క టకూటా గ్రాం కన్దరాకీర్ణకానామ్‌. 22

సింహవ్యాఘ్రగణావకీర్ణాం నదద్బి ర్గ జయూథపైః l ఈ హామృగగణాకీర్ణాం పవనాఘూర్ణిత ద్రుమామ్‌. 23

నిర్మితాం స్వేన యత్నేన కూజితాం దివి కామగామ్‌ l ప్రథితాం పార్వతీం మాయాం ససృజే స సమన్తతః.

అట్లు పలికినహిమకరుడు ప్రయోగించిన మంచువానలు మేఘగణములువలె అ ఘోరదైత్యులనుచుట్టుకొనసాగెను. పాశధరుడగువరుణడునుచల్లనికిరణములు దాల్చిన చంద్రుడును- ఈమహాబలులిద్దరును పాశపాతములతోను హిమపాతములతోను దానవులను చావగొట్టుచుండిరి. ఇద్దరును జలాధిపతులే; వారికి పాశమును హిమమును అయుధములు; కనుకనే వారు యుద్దమునందు కల్లోలితమయిన మహాసముద్రమువలె పొరలుచున్న నీటితో కూడి యుద్దమున సంచరించుండిరి. వారిచే ముంచివేయబడిన ఆ దానవసేన జగత్ప్రళయ వేఘములు తమ సేనయందు ప్రవేశించగా వాటిచే తాము చుట్టబడిరేమోరునునట్లుండిరి. ఇట్లు జలాధిపతులగు చంద్రవరుణులు పరాక్రమించి మయదైత్యుడు నిర్మించిన మాయను శమింపజేసిరి. చంద్రుని శీతల కిరణములతో నిర్దగ్దులయియు వరుణుని పాశములతో బంధించబడియు దైత్యు రణమన కదలలేక శిఖరములులేని కొండలవలె ఉండిపోయిరి. చల్లని కిరణములతోను నీటితోను మంచు తోను బాగుగ దెబ్బతిని బాధనందుచు మంచుతో ముంచబడిన సర్వావయవములుకల వారగుచు వారు వేడిమి పోయిన అగ్నులో యనునట్లుండిరి. ఇట్లయిన ఆదైత్యుల విమానములు అంతరిక్షమునందు పైకిని క్రిందికిని ఎగిరెగిరిపడుచు లేచుచుండెను. మాయావియగు మయునకు తమ వారందరును పాశముతో కట్టివేయబడుటయు శీతలకిరణములతో కప్పివేయబడుటయు కనడెను . అంతట వాడు అన్ని వైపులనుండియు పర్వతమయ మాయను సృజించెను. దానితో పర్వత సమూహములు వ్యాపించెను. ఖడ్గములు పలకలు (డాలులు) అసి (ఒక విధమగు ఖడ్గముల) సమూహము బిగ్గరగనవ్వుచున్నవో యనునట్లుండెను. అంతులేనన్ని చెట్లతో నిండిన శిఖరాగ్రములును కందరములందు వ్యాప్తమయిన అడవులు సింహవ్యాఘ్రగణములు ఘీంకరించు ఏనుగుమందను వాటి నాయక గజములను ఈమహామృగగణములను ఆపర్వతము లందంతటనుండెను. వాయు వశమున అందలి చెట్లు మ్రోతలతో క్రిందికి ప్రక్కలకు పైకి పొరలుచున్నట్లుండెను. ఆ పర్వతమాయ తన సంకల్పానుసారమంతరిక్షమున అంతట సంచరించుచుండునట్లువాడు నిర్మించెను.

సాసిశ##బ్దై శ్శిలావర్షైస్సమ్పతద్బిశ్చ దానవా నభ్యజీవయత్‌. 25

నైశాకరీ వారుణీచ మాయే న్తర్దధతుస్తతః l అశ్మభిశ్చాయసగణౖః కిరన్దేవగణా న్రణ. 26

సాశ్మయన్త్రాయుధఘనా ఉపమర్దనసఙ్కటా l అభవద్ఝోరసఞ్చార్యా వృథివీ పర్వతైరివ. 27

ఆశ్మనా ప్రహతా దేవా శ్శిలాభిశ్చ సముద్గరైః l న నిరుద్దో ద్రుమగణౖ ర్దేవో7 దృశ్యత కశ్చన. 28

తదపధ్వస్తధనుషం భగ్న ప్రహరణావిలమ్‌ l విష్ర్పయత్నం సురానీకం వర్జయిత్వా గదాధరమ్‌. 29

సహి యుద్దగత శ్శ్రీమా నీశానఃస్మ వ్యకమ్పతl సహిష్ణుత్వా జ్జగత్స్వా మీ న చుక్రోధ గదాధరః. 30

కాలజ్ఞః కాలమేఘభ స్సమీక్ష న్కాల మాహవే l దేవాసుర విమర్దంతు ద్రష్టుకామ స్తదా హరిః. 31

తతోభగవాతా దృష్టో రణ పావకమారుతౌ l చోదిలౌ విష్ణువాక్యేన తౌ మాయాం వ్యపకర్షతామ్‌. 32

తాభ్యా ముద్గతవేగాభ్యాం ప్రవృద్దాభ్యాం మహాహవే l దగ్దాసా పార్వతీ మాయా భస్మీభూతా ననాశహ. 33

సో7నిలో7నలసంయుక్త స్సోనల శ్చాని లాకులః l దైత్యసేనాం దదహతు ర్యుగాన్తేష్వవ మూర్చితౌ. 34

పార్వతమాయ ఖడ్గముల కదలికలతోను శిలా వర్షములతోను వృక్షపాతములతోను దేవ సంఘములను చంపుచు దానవులను జీవింపజేయుచుండెను. రాలతోను ఇనుప అయుధముల గనులతోను దేవగణములను క్రమ్మివేయు చుండచంద్రవరుణమాయ లంతర్థానమందెను. రాలతోను యంత్రములతో ప్రయోగించు అయుధములతోను దట్టమయి త్రొక్కులాటలతో ఇరుకైన ఆయుద్ధభుమి పర్వతములతో నిండినదో యనునట్లయి సంచరించుటకే వీలుకాక పోయెను. దేవతలుచిన్న రాలతోను పెద్ద బండలతోను ముద్గరాయుధములతోను దెబ్బలు తినుచుండిరి . వృకములచే అడ్డగించబడనివాడు దేవతలలో ఒక్కడును లేకండెను. ఒక్క గదాధరుడు (విష్ణువు) తప్ప దేవతలందరును ధనువులు విడిచిన వారో ఆయుధములు విరిగినందున దుఃఖముచే కాంతిహీనులో అయిపోయిరి. వారు ఏ ప్రయత్నమును చేయజాలకయుండిరి. శ్రీమంతుడును జగదధిపతియు అగు గధాధరుడు మాత్రము యుద్దరంగమందే చలించక నిలిచియుండెను. కోపించనయినలేదు. ఏలయన అతడు ఈశానుడు(సర్వశక్తిశాలి )సహన శక్తిశూలి; కాలతత్త్వమునెరిగినవాడు; కావున అపుడు నల్లని మేఘమువలె ప్రకాశించు అ హరి యుద్దమందే తగిన సమయమునకు ఎదురు చూచుచు దేవాసురుల దొమ్మియుద్ధమును చూచుచు కొంత తడపు ఉండిపోయెను. అంతలో అతనికి అగ్నివాయువులు కనబడగా వారు నారాయణునిచే ప్రేరింపబడి మయ మాయను నశింపజేయ నారంభించిరి. వారు ఇద్దరును అమహాయుద్దమున మహావేగమున వృద్దినంది ఆ పర్వతమాయను దహించి భస్మమొనర్చి నశింపజేసిరి. వారిద్ధరును పరస్పర సహాయముతో ప్రళయ కాలమందు వలె వ్యాపించి ఆ దైత్యసేనను కాల్చివేసిరి.

వాయుఃప్రధావిత స్తత్ర పశ్చాదగ్నిస్తు మారుతమ్‌ lచేరతుర్దానవానికే క్రీడన్తా వనిలానలౌ. 35

భస్మావయవభూతేషు ప్రవతత్సూత్పతత్సుచ l దానవానాం విమానేషు నిపతత్సు సమన్తతః. 36

వాతస్కన్దాపవిద్దేషు కృతకర్మణి పావకే l మాయాబన్దనివృత్తేషు స్తూయమానే గదాధరే. 37

నిష్ప్రాయత్నేషు దైత్యేషు తైలోక్యే ముక్తబన్దనే l సమ్ప్రహృష్టేషు దేవేషు సాధుసాధ్విత సర్వశః. 38

జయే దశశతాక్షస్య దైత్యానాంచపరాజయే l దిక్షు సర్వాసు శుద్దాసు ప్రవృత్తే ధర్మవిస్తరే. 39

అపావృత్తే చన్ద్రమసి స్వస్థానస్థే దివాకరే l ప్రకృతిస్థేషు లోకేషు త్రిషు చారిత్రబన్దషు. 40

యజమానేషు భూతేషు ప్రశాన్తేఘచ పాప్మసు l అభిన్నబన్దనే మృత్యౌ హూయమనే హుతాశ##నే. 41

యజ్ఞశోభిషు దేశేషు స్వర్గార్థం దర్శయత్సుచ l లోకపాలేషు సర్వేషు దిక్షు సంయానవర్తిషు. 42

భావే తపసి సిద్దానా మభావే పాపకర్మణామ్‌ l దేవపక్షే ప్రముదితే దైతగపక్షే విషిదతి. 43

త్రిపాదవిగ్రహే దర్మే అధర్మే పాదవిగ్రహే l అపావృతే మహాద్వారే వర్తమానే చ సత్పథే. 44

లోకే ప్రవృత్తే ధర్మేషు స్వధర్మే ష్వాశ్రమేఘచ l ప్రజారక్షణయుక్తేషు భ్రాజమానేషు రాజుసు. 45

ప్రశాన్తకల్మషే లోకే శాన్తే తమపి దానవే l అగ్ని మారుతయో స్తస్మి న్వృత్తే సఙ్గ్రామకర్మణి. 46

తన్మయా విపులాలోకా స్తాభ్యాం కృతజయ క్రియాః l పూర్వదేవభయం శ్రుత్వా మారుతాగ్ని కృతంమహత్‌. 47

కాలనేమీతివిఖ్యాతో దానవ ః ప్రత్యదృశ్యతl భాస్కరాకారముగుట స్సూర్టితాభరణాజ్గదః. 48

మొదట వాయువు అ సేనలో ఒక చోటికి పోవును; అంతట అగ్నియుపోయి అచట క్రమ్మును; ఇట్లు వారియవురు అటలాడుచున్నట్లా దానవ సేనయందు సంచిరించిరి. ఇందుచే దానవ విమానములుభస్మ రేణువులయి ఎగురుచు పడుచులేచుచుండెను. కొన్ని విమానములు ముక్కలే అంతటను పడుచుండెను. కొన్ని వాతస్కంపధము (గాలిపొర) లలోనికి ఎగురగొట్టబడెను. అగ్ని తన పని తాను చేసెను. దేవతలు మాయాభందముక్తులైరి. గదాధరుడుస్తుతులందు కొనుచుండెను. దైత్యులు ప్రయత్నహీనులయిరి. త్రిలోకములునుబంధ ముక్తినందెను. దేవతలందరును బాగుబాగనుచు సంతోషించుచుండిరి. ఇంద్రుడు జయించెను; దైత్యులోడిరి. దిక్కులెల్ల నిర్మలములయ్యెను. ధర్మము విస్తరమంది లోకమున ప్రవర్తిల్లెను. చంద్రుడు మరల తన స్థానమునకు మరలి వచ్చెను. దివాకరుడు స్వస్థానమున నిలిచెను. మూడు లోకములును సత్ప్రవర్తనము కలిగి తమతమ స్వభా సిద్ధ ధర్మములందుండెను. సర్వప్రాణులును యజ్ఞములాచరించ (దేవతల నారాధించ) సాగెను. పాపములణగెను. మృత్యువు అదుపులో నుండెను. అగ్నియందుహోమములు సాగుచుండెను. దేవతలు యజ్ఞ (భాగ) ములతో శోభిల్లుచుండిరి. వారు యజ్ఞ ఫలములను (జనులకు) అందజేయుచుండిరి. లోకపాలురందరును తమతమ అదిపత్యముగల దిక్కులందు తగిన విధమున వర్తిల్లుచుండిరి. తపఃసిద్దులు లభించుచుండెను: పాపకర్మములెచ్చటను లేకపోయెను. దేవపక్ష మానందించెను. దైత్యపక్షము దుఃఖించెను. మూడుపాళ్ళు ధర్మము ఒకపాలు అధర్మము ఉండెను ధర్మచరణమహాద్వారము తెరచుకొనెను. సన్మార్గము నడచుచుండెను. లోకమునందు అయా ధర్మములు జరుగుచుండెను. బ్రహ్మచర్యాద్యాశ్రమములందున్న జనులు తమతమ అశ్రమ ధర్మములందు నిలిచియుండిరి. రాజులు ప్రజా రక్షణ తత్పరులయి ప్రకాశించుచుండిరి. లోకమున కల్మషము ప్రశాంతమయ్యెను. దానవుల తమోగుణ మణగెను.

ఇట్లు అగ్ని వాయువులు జరిపిన యుద్ధ కృత్యము ముగిసెను. లోక విస్తారమంతయు అగ్ని వాయు మయము లయ్యెను. ఈ విజయకార్యము వారు నెరవేర్చినదేకదా! (అందుచే అన్ని లోకములయందును అందరును వారినే కీర్తించుచుండిరి.)

ఇట్లు అగ్ని వాయువులు దానవులకు మహా భయము కలిగించిరని విని కాలనేమియను ప్రసిద్ధ దానవుడు తన రూపమందరకు కనబడజేసెను. వాని కిరీటము రవివలె ప్రకాశించుచుండెను. వాని అభరణములును భుజ కీర్తులును మ్రోతలను ఈనుచుండెను.

మన్దరాద్రిప్రతీకాశో మహారజతసంవృతః l శతప్రహరణోదగ్ర శ్శతబాహు శ్శతాననః . 49

శతశీర్షస్థ్సిత శ్శ్రీమా ఞ్చతశృజ్గ ఇవాచలః l కోపే మహతి సంవృద్దోనిధాఘఇవ పావకః. 50

ధూమ్రకేశో హరిశ్మశ్రు స్సన్దష్టౌష్ఠపుటాననః l తైలోక్యాన్తరవిస్తారి ధారయ న్విపులం వపుః. 51

బాహుభి స్తులయ న్వ్యోమ క్షిప న్పద్భ్యాంమహీధరా9

ఈరయ న్ముఖనిశ్వాసై ర్వృష్టి మన్తో వలాహకా9. 52

తిర్యగాయతరక్తాక్షం మన్దరోదగ్రవర్బమ్‌ l దిధక్షన్తమివాయాన్తం సర్వా న్దేవగణా న్మృథే. 53

తర్జయన్తం సురగణా ఞ్చాదయన్తం దిశో దశ l సంవర్తకాలే తృషితం దృష్టం మృత్యుమివోత్థితమ. 45

సుతలేనోచ్ఛ్రయవతా విపులాఙ్గులిపర్వణా l లమ్బాభరణపూర్ణేన కి ఞ్చిచ్చాలిత వర్ష్మణా. 55

ఉచ్ఛ్రితేనా గ్రహస్తేన దక్షిణన వపుష్మతా l దానవా న్దేవనిహతా నుత్తిష్ఠధ్వమిత బ్రువ9. 56

తం కాలనేమిం సమరే ద్విషతాం కాలచేష్టతమ్‌ l వీక్షన్తేస్మ సురా స్సర్వే భయవిత స్తలోచనాః 57

తం వీక్షన్తిస్మ భూతాని క్రమన్తం కాలనేమినమ్‌ l త్రివిక్రమం విక్రమంతం నారాయణ మివాపరమ్‌. 58

సోత్యుచ్ఛ్రితగపురః పాదం మారుతాఘూర్ణితామ్బరః l ప్రకామ మసురో యుద్దే త్రాసయామాస దేవతాః. 59

సమయేనాసురేన్ద్రేణ పరిష్వక్త స్తతో రణ l కాలనేమి ర్బభౌ దైతగ స్సవిష్ణురివ మన్దరః. 60

అథ వివ్యథిరే దేవా స్సర్వే శక్రపురోగమాః l కాలనేమిం సమాయాన్తం దృష్ట్వా కాలమివాపరమ్‌. 61

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవదానవసజ్గ్రామే కాలనేమికృత సమరసన్నాహ

వర్ణనం నామ పఞ్చసప్తత్యుత్తర శతతమో7ధ్యాయః

వాడు మందర (మంథ) పర్వతమువలె వెలుగుచుండెను. బంగారుతో కప్పబడెనో యనునట్లు బంగరు అభరణములు దాల్చియుండెను. నూర ఆయుధములు దాల్చి భయంకరుడై యుండెను. నూర తలలతో శోభిల్లుచు శతశృంగ పర్వతమువలె వాడుండెను. వేసగి కాలపు అగ్నివలె మహా కోపముతో నుండెను పొగరంగు తలవెంట్రుకలు పచ్చని మీసములు కలిగి పెదవులు త్రైలోక్యాంతర్బాగమంతయు విస్తరిల్లి నండునంత పెద్ద శరీరము కలిగి ఉండెను. భుజములతో ఆకాశమును కదల్చుచుండెను. అడుగులతో కొండలను విసరి నెట్టుచుండెను. శ్వాసవాయువులతో వర్షించు (నీటితో నిండిన బరువగు) మబ్బులను కూడ చెదరగొట్టుచుండెను. అడ్డముగా ఉండి పొడవైన ఎర్రని కన్నులును సుందరమయి యుండియు తీవ్రము భయంకరమునైన వర్చస్సును కలిగియుండెను. సర్వదేవ గణములను యుద్దమున కాల్చివేయదలచియున్నాడేమో అనునట్లుండెను . దేవ గణములను బెదరించుచుండెను. దశదిశలను కప్పివేయుచుండెను. ప్రళయకాలమునందు దప్పిగొని ఆవేశముతో లేచి వచ్చుచు ఉండిన-మూర్తీభవించిన- మృత్యువేమో అనునట్లుండెను. చక్కని అరచేయి కలిగి ఎత్తయి విపులములగు వ్రేళ్ళ కణుపులు కలిగి వ్రేలాడుచున్న ఆభరణములతో నిండి కొంచెముగ కదలించబడుచున్న వస్త్రధారణము (చొక్కావంటి దుస్తులు) కలిగి పైకి ఎత్తి ఉంచబడిన సుందరమగు కూడి ముంజేతితో అదివరకు జరిగిన యుద్ధమున దేవతల చేతిలో మరణించిన దానవులను 'లేచి రండు.' అని పిలుచుచు ప్రోత్సాహించుచుండెను. యుద్దమున శత్రువుల విషయమున యమునివలె ప్రవర్తించి భయము గొలుపుచు నాశము కలిగించు అకాలనేమిని దేవతలందరునుభయత్రస్త నేత్రులయి చూడసాగిరి. తన అడుగులతో విక్రమించుచున్న రెండవ నారాయణుడో యనునట్లుండి ముందునకు అడుగులు వేయుచున్న కాలనేమిని సర్వభూతములను చూచుచుండెను. మిగుల సైకెత్తుచున్న ముందటి అడుగుతో చెలరేగిన గాలితో అకాశమునే ఘూర్ణల్లజేయుచు అకాలనేమి అసురుడు యుద్దరంగమునందున్న దేవతలను మిగుల భయపెట్టెను. అనంతరము అసుర శ్రేష్ఠుడగుమయుడు తను అలింగనము చేసికొనగా అ కాలనేమి విష్ణువుతో కూడిన ముందర (మరథ) ప్వతమువలె ప్రకాశించుచుండెను. అట్లు రెండవ కాలయముడువలె తమ వయిపునకు వచ్చుచున్న కాలనేమినిచూచి ఇంద్రాది దేవతలు చాల వ్యథ చెందిరి.

ఇది శ్రీమత్స్య మహాపురాణమున దేవదానవ సంగ్రామమున కాలనేమి దానవుడు యుద్ద నన్నద్ధుడగుట యను నూట డెబ్బది ఐదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters