Sri Matsya mahapuramu-2    Chapters   

అశీత్యుత్తరశతతమోధ్యాయః.

సనత్కుమారాయ నన్దీశ్వరోపదిష్టం అవిముక్తమాహాత్మ్యమ్‌.

సూతః : అథ పుణ్యోద్బవాం స్నిగ్ధాం కథాం పాపప్రణాశనీమ్‌ |

శృణ్వంతు మునయ స్సర్వే శుచిశ్రద్ధా సమాహితాః 1

గణవ్వరపతిం దివ్యం రుద్రతుల్యపరాక్రమమ్‌ | సనత్కుమారో భగవా నపృచ్ఛ న్ననిన్దికేశ్వరమ్‌. 2

ననత్కుమారః : బ్రూహి గుహ్యం యథాతత్త్వం యత్ర నిత్యం భవ స్థ్సితః |

మహాత్మ్యం సర్వభూతానాం పరమాత్మా మహేశ్వరః. 3

ఘోరరూపం సమాస్థాయ దుష్కరం దేవదానవైః | ఆభూతసవ్ల్పువం యావ త్థ్సాణుభూతో మహేశ్వరః. 4

నన్దికేశ్వరః : పురా దేవేన యత్ర్పోక్తం పురాణం పుణ్యముత్తమమ్‌ |

తత్సర్వంచ ప్రవక్ష్యామి నమస్కృత్య మహేశ్వరమ్‌. 5

యతో దేవేన తుష్టేన ఉమాయాః ప్రియకామ్యయా | కథితం భువి విఖ్యాతం యత్ర నిత్యం భవ స్థ్సితః. 6

రుద్రస్యార్ధాసనగతా మేరుశృజ్గే యశస్వినీ | మహాదేవం తతో దేవి ప్రణతా పరివృచ్ఛతి 7

నూట ఎనుబదవ అధ్యాయము.

నందీశ్వరుడు సనత్కుమారునకు అవిముక్త మాహాత్మ్యము తెలుపుట.

సూతుడు ఋషులకు ఇంకను ఇట్లు చెప్పెను : సర్వ మునులారా! శుచియగు శ్రద్ధతో సమాహిత మనస్కులయి పావనాశకమును పుణ్య సంపాదకమును ప్రీతికరమును నగు కథ వినుడు. భగవానుడగు సనత్కుమారుడు గణశ్వరులకును అధిపతియు రుద్ర సమాన పరాక్రముడును దివ్యుడు నగు నందికేశ్రుని ఇట్లు ప్రశ్నించెను: సర్వభూతములకు అంతర్యామియు లోకకారణుడును అగు మహేశ్వరుడు దేవదానవులకును ధరించ సాధ్యముకాని ఘోరరూపము ధరించి స్థాణు (స్థిర-కూటస్థ) రూపుడయి సర్వభూత ప్రళయకాలము వరకును ఎచట నిరంతరము వసించునో ఆ స్దానపు రహస్యమగు మహాత్మ్యమును తెలుపుము. అన నందికేశ్వరు డిట్లనెను: పూర్వము మహాదేవుడే చెప్పినదియు ప్రాచీనమును పుణ్యకరమును నగు ఆ విషయమంతయు మహేశ్వరుని నమస్కరించి చెప్పుదును. ఏలయన ఉమ విషయమున తుష్టుడై శివుడు ఆమెకు ప్రీతి కలిగించగోరి భవుడు నిత్యమును ఉండు విఖ్యాత స్థానపు మహాత్మ్యమును తానే చెప్పియుండెను. పూర్వము మేరుపర్వత శృంగమున రుద్రుని అరాసనమందుండి కీర్తిశాలిని యగు దేవి మహాదేవుని నమస్కరించి ఇట్లడిగెను.

దేవీ: భగవన్దేవదేవేశ చన్ద్రార్దకృత శేఖర | ధర్మం ప్రబ్రూహి మర్త్యానాం భువి చై వోర్ధ్వరేతసామ్‌. 8

ఇష్టం ద త్తం హుతం జప్తం తప స్తప్తం కృతంచ యత్‌|

ధ్యానాధ్యయనసమ్పన్నం కథం భవతిచాక్షయమ్‌. 9

జన్మాన్తరసహస్నేణ యత్పావం పూర్వసఞ్చితమ్‌ | కథం తయమాయాతి తన్మమాచక్ష్వ శజ్కర. 10

యస్మిన్నవస్థితో భక్త్యా తుష్యసే పరమేశ్వర | వ్రతాని నియామాశ్చైవ మాచారో ధర్మ ఏవచ. 11

సర్వసిద్దికరం యత్ర హ్యక్షయ్యగతిదాయకమ్‌ | వక్తుమర్హసి తత్సర్వం పరం కౌతూహలం హి మే. 12

దేవదేవః : శృణు దేవి ప్రవక్ష్యామి గుహ్యానాం గుహ్యముత్తమమ్‌ |

సర్వక్షేత్రషు విఖ్యాత మవిముక్తం ప్రియం మమ.13

అష్టషష్టిపురాప్రోక్త స్థానానాం స్థాన ముత్తమమ్‌ |

యత్ర సాక్షాత్స్వయం రుద్రః కృత్తివాసా స్స్వయం స్థితః. 14

తత్ర సన్నిహితో నిత్య మవిముక్తే నిర న్తరమ్‌ | తతేత్రం న మయా ముక్త మవిముక్తం తత స్స్మృతమ్‌. అవిముక్తే పరా సిద్దిరవిముక్తే పరా గతిః |

ఇష్టం దత్తం హుతం జప్తం తప స్తప్తం కృతంచ యత్‌. 16

ధ్యానమధ్యయనం దానం సర్వం భవతి చాక్షయమ్‌ | జన్మాన్తరసహస్రేణ యత్సాపం పూర్వఞ్చితమ్‌.

అవిముక్తే ప్రవిష్టస్య తత్సర్వం వ్రజతి క్షయమ్‌ | అవిముక్తాగ్నినా దగ్ధ మగ్నౌ తూలమివాహితమ్‌. 18

బ్రాహ్మణాః క్షత్త్రియా వైశ్యా శ్శూద్రావై వర్ణసజ్కరాః |

స్త్రీయో వ్లుెచ్ఛాశ్చ యే చాన్యే సజ్కీర్ణాః పాపయోనయః. 19

కీటాః పిపీలికాశ్చైవ యేచాన్యే మృగపక్షిణః | కాలేన నిధనం ప్రాప్తా హ్యవిముక్తే శృణుష్వ మే. 20

భగవన్‌ ! దేవదేవేశా! చంద్రార్ధమౌళీ! బ్రహ్మచర్యమున ఊర్ధ్వరేతస్కులగు మానవు లాచరింపదగు ధర్మమును యజ్ఞదాన హవన జపతపః ప్రభృతి కర్మానుష్ఠానములును ధ్యానాధ్యయనములును ఎట్లు అక్షయమగును? వేయి జన్మాంతరములందు సంచితమగు పాపమయినను నశించు ఉపాయ మేమి? శంకారా! నాకు తెలుపుము; ఏ స్థానమందుండినచో నీవు ఆభక్తుల భ క్తకి తుష్టుడ వగుదువు? వ్రతములు నియమములు ఆచారము ధర్మము ఎచట నాచరించిచో సర్వసిద్ధికరమయి అక్షయ పుణ్యగతి నిచ్చును? అది యంతయు తెలుప వేడుచున్నాను. నా కది విన పరమకుతూహలముగ నున్నది. అన దేవదేవు డిట్లనెను: దేవీ! చెప్పెద వినుము; అది రహస్యములో ఉత్తమ రహస్యము; సర్వక్షేత్రములందును విఖ్యాతమగు 'అవిముక్తము' 'వారాణసి' నాకు ప్రియము; పూర్వులు చెప్పిన ఆరువది ఎనిమిది పుణ్యస్థానములలో ఇది ఉత్తమము; ఇచ్చట గజచర్మధారియగు రుద్రుడు తానై సాక్షాత్తుగ ఉండును. ఈ అవిముక్తమం దతుడు నిరంరతము సన్నిహితుడు; ఈ క్షేత్రము నాచే అవిముక్తము (విడువబడనిది) కావున దీని కీ నామ మేర్పడినది; ఇది పరమసిద్ధిని పరమగతిని ఇచ్చును; ఇచట అనుష్ఠించిన యజ్ఞ దానహవన జపతపో ధ్యానాధ్యయనములు అన్నియు అక్షయ పుణ్యప్రదము లగును; దీనిని ప్రవేశించినంతనే జన్మాంతర సహస్ర సంచితమగు పాపమును నశించును; అవిముక్త క్షేత్రాగ్నితో ఆవి నిప్పులో వేసిన దూదివలె బూది యగును. బ్రహ్మక్షత్త్రియ వైశ్య శ్రూదులును సంకీర్ణ జాతులవారును స్త్రీలును వ్లుెచ్ఛులును వేరగు సంకరజాతివారును పాపజన్ములును కీటపిపీలికా మృగపక్షులును తమ కాలము వచ్చి ఇందు మరణించి ఏమగుదురో తెలిపెద వినుము.

చన్ద్రార్దమౌళినస్సర్వే లలాటాక్షా వృషధ్వజాః | శివే మమ పురే దేవి జాయన్తే తత్ర మానవాః. 21

అకామె వా సకామో వా తిర్యగ్యోనిగతోపి వా | అవిముక్తే త్యజే త్ప్రాణా న్మమ లోకే మహీయతే. 22

అవిముక్తం యదా గచ్ఛే త్కదాచి త్కాలపర్యయాత్‌ | అశ్మనా చరణౌ బద్ధ్వా తత్రైవ నిధంనం వ్రజేత్‌. 23

అవిముక్తం తతో దేవి న నిర్గచ్ఛేత్తతః పునః | సోపి మత్పద మాప్నోతి నాత్ర కార్య విచారణా. 24

వస్త్రప్రదం రుద్రకోటిం సిద్ధేశ్వర మహాలయమ్‌ | గోకర్ణం భద్రకర్ణంచ సువర్ణాక్షం తథై వచ. 25

అమరంచ మహాకాలం తథా కాయావరోహమ్‌ | ఏతాని హి పవిత్రాణి సాన్నిధ్యాత్‌ సంధ్యయోర్ద్వయోః.

కాలఞ్జరవనం చైవ శజ్కుకర్ణస్థలేశ్వరమ్‌ | ఏతానిచ పవిత్రాణి సాన్నిధ్యాద్ధి మమ ప్రియే. 27

అవిమక్తే వరారోహే త్రిసన్ధ్యం నాత్ర సంశయః |

హరిశ్చన్ద్రం పరం గుహ్యం గుహ్య మామ్రాతకేశ్వరమ్‌. 28

జలేశ్వరం పరం గుహ్యంగుహ్యం శ్రీపర్వతం తథా| మహాలయం వరం గుహ్యం యమం చణ్డశ్వరం తథా. 29

గుహ్యాతి గుహ్యం కేదారం మహాభైరవ మేవచ| అష్టా వేతాని స్థానాని సాన్ని ధ్యాద్ధి మమప్రియే. 30

అవిమక్తే వరారేహే త్రిసన్ద్యం నాత్ర సంశయః | యాని స్థానాని శ్రూయన్తే త్రిషు లోకేషు సువ్రతే. 31

అవిముక్తస్యా పాదేషు నిత్యం సన్నిహితాని వై | అథోత్తరాం కథాం దివ్యా మవిముక్తస్య శోభ##నే . 32

స్కన్దో వక్ష్యతి మాహాత్మ్యం యదుక్త మీశ్వరేణ తు | ఋషీణాం భావితాత్మనాం త చ్ఛృణుష్వ నరేశ్వర.

ఇతి మత్సమహాపురాణ నన్దికేశ్వరుసనత్కుమార సంవాదే అవి

ముక్తమాహాత్మ్యే అశీత్యుత్తరశతతమోధ్యాయః.

అందురును చంద్రార్ధ శిరస్కులు లలాట నేత్రులు వృషభ ధ్వజులు అయి శుభకరమగు నా పురమునందు జనింతురు; నిష్కాములుగాని సకాములుగాని (తెలిసికాని తెలియక కాని) మానవులే కాక తిర్యక్‌ (పశుపక్ష్యాది) ప్రాణులును అవిముక్తమున మరణించినచో నా లోకమున పూజితులై సుఖింంతురు. అవిముక్త క్షేత్ర మేగినవారు అచటినుండి బయటికి రాక కాళ్లకు రాలు కట్టుకొనియైన కదలకుండి తమ కాలము రాగా మరణించినచో వారును నా స్ఠాన మందుదురు; అందు సందియము లేదు. వస్త్రప్రదము- రుర్రకోటి-సిద్దేశ్వరము-మహాలయము-గోకర్ణము-భద్రకర్ణము-సువర్ణాక్షము-అమరము-మహాకాలము-కాయావరోహము. ఈ క్షేత్రములందు ప్రాతః సాయంసంధ్యలందు నాసాన్నిధ్యముండును; కావున అవి పవిత్రములు; కాలంజరవనము శంకు కర్ణము స్థలేశ్వరము-ఇవియు; వరారోహ! (పరమసుందరీ!) పరమ గుహ్యములగు హరిశ్చంద్రము ఆమ్రాతకేశ్వరము ఇవియు జలేశ్వరము శ్రీ పర్వతము మహాలయము యమము చండేశ్వరము గుహ్యాతిగుహ్యములగు కేదారమహాభైరవములు అవిముక్తము ఈ ఎనిమిదియు త్రిసంధ్యములందును నా సన్నధిచే పవిత్రము; త్రితోక ప్రసిద్ధములగు స్థానములన్నియు అవిముక్త క్షేత్ర పాదములందు నిత్యమును సన్నిధానము చేసియుండును; ఈశ్వర ప్రోక్తమేయగు అవిముక్త క్షేత్రపు అనంతర కథా వృత్తాంతమును దాని మాహాత్మ్యమును స్కందుడు భావితాత్ములగు ఋషులకు చెప్పినదానిని చెప్పెదను-మనురాజా: వినుము. అని మత్స్యుడు చెప్పనని సూతుడు ఋషులతో చెప్పెను.

ఇతి శ్రీమత్స్యమహాపురాణమున నందికేశ్వర సనత్కుమార సంవాద రూపమగు అవిముక్తక్షేత్ర మాహాత్మ్యమను నూట ఎనుబదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters