Sri Matsya mahapuramu-2    Chapters   

ద్వ్యశీత్యుత్తర శతతయోధ్యయః.

ఈశ్వరకృతబ్రహ్మశిరశ్చేదాదికథనమ్‌.

దేవీః హిమవన్తం గిరం త్యక్త్వా మన్దరం గన్దమాదనమ్‌ |

కైలాసం నిషధం చైవ మేరువృష్ఠం మహాద్యుతిమ్‌ 1

రమ్యం త్రిశిఖరం చైవ మానసంచ మహాగిరిమ్‌ | దేవోద్యానాని రమ్యాణి నన్దనం వనమేవయచ. 2

స్వర్గస్థానాని పుణ్యాని తీర్థన్యాయతనాని చ | తాని సర్వాణి సన్త్యజ్య అవిముక్తే రతిః కథమ్‌. 3

కిమత్ర సుమహత్పుణ్యం పరం గుహ్యం వదస్వ మే | యేన త్వం రమేసే నిత్యం భూతసఙ్ఘ గణౖ ర్యుతః

దేవదేవః : అత్యద్భుత మిమం ప్రశ్నం యత్త్వం పృఛ్ఛసి భామిని |

తత్సర్వం సమ్ప్రవక్ష్యామి తన్మే నిగదత శ్శృణు. 6

వారాణస్యాం నదీ పుణ్యా సిద్దగన్దర్వ సేవితా | ప్రవిష్టా త్రిపథా గఙ్గా తస్మిన్షేత్రే మమ ప్రియే. 7

మమైవ ప్రీతిరతులా కృత్తివాసేవ సున్దరి | సర్వేషాం చైవ స్థానానాం తత్థ్సానంతు యథాధికమ్‌. 8

తేన కార్యేణ సుశ్రోణి తస్మింస్థానే రతిర్మమ | తస్మిన్లిజ్గేచ సాన్నిధ్యం మమ దేవి సురేశ్వరి. 9

క్షేత్రస్య చ ప్రవక్ష్యామి గుణ న్గుణవతాం వరే |

యాఞ్ఛ్రత్వా సర్వపా పేభ్యో ముచ్యతే నాత్ర సంశయః. 10

యది పాపోథవా షణ్డో యద్యప్యర్థాతిగో నరః | ముచ్యతే సర్వపా పేభ్యో హ్యవిముక్తం వ్రజేద్యది. 11

ప్రళ##యే సర్వభూతానాం నష్టే స్థావరజఙ్గమే | *నాహం త్యాజామి తత్థ్సానం మమ ప్రియతరం శుభే. 12

యత్ర దేవ స్సగన్దర్వా స్సయక్షోరగరాక్షసా | వక్త్రం మమ మహాభాగే ప్రవిశన్తి యుగక్షయే. 13

తేషాం సాక్షాదాహం పుజాం ప్రతిగృహ్ణామి పార్వతి |

సర్వగుహ్యోత్తరం స్థానం మమ ప్రియతరం శుభమ్‌. 14

నూట ఎనుబది రెండవ అధ్యాయము.

ఈశ్వరకృత బ్రహ్మ శిరశ్ఛేదాది వృత్తాంతములు.

(ఈశ్వరుడు కపాలియయిన కథ)

దేవి మహాదేవుని ఇట్లడిగెను: హిమవంతము మందరము గంధమాదనము కైలాసము నిషేధము మహాకాంతి గల మేరువృష్ఠము రమ్మమగు త్రికూటము మానస మహాపర్వతము అను ఈ పర్వతములను రమ్యములగు నందనాది దేవోద్యానములను పుణ్యములగు తీర్థస్థానములను తీర్థక్షేత్రములను అన్నిటిని వదలి మీకు ఈ అవిముక్త క్షేత్రమందాసక్తి ఏల? ఇచట సుమహా పుణ్యమేమి కలదు? ఆ పరమ రహస్యము నాకు తెల్పుడు. ఏల మీరు సదా భూత గణములతో కూడి ఇట విహరింతురు? ఈ క్షేత్రమునకు కల శ్రేష్ఠత ఏమి? ఇచటనుండు వారెవరు? వారియందు మీయను గ్రహమెట్టిది? శంకరా! అదియంతయు తెలుపుడు. అన దేవదేవుడిట్లు చెప్పెను: భామినీ ! నీవడిగినదిది అత్యద్భుతమగు ప్రశ్నము; అదియంతయు చెప్పెదను వినము; నాప్రియా! ఈ పుణ్యక్షేత్రమగు వారాణసియందు సిద్ధ గంధర్వ సేవిత త్రిపథగ (మూడు త్రోవలపోవు) పుణ్యనది గంగ ప్రవేశించినది; అందేచే సుందరీ! నాకు గజచర్మ వస్త్రమునందువలెనే దీని యందును ప్రీతియధికము; ఇట్లు సర్వస్థానములందుత్తమము కావున ఈ స్థానమునందు నాకు రతి ( ఆనందము) అధికము; సురేశ్వరీ! ఇందుచేతనే ఇచటి లింగమునందును నేను సన్నిధి చేసి ఉందును. గుణవతులలో శ్రేష్ఠఅగు దేవీ! ఈ క్షేత్ర గుణములను చెప్పెదను వినుము; వీనిని విన్నచో సర్వపాప ముక్తలగుట నిస్సంశయము; పాపుడు కాని పాషండుడు (వేద బాహ్యుడు) కాని ధర్మార్థము లతిక్రమించిన వాడు కాని అవిముక్త యాత్ర చేసినచో సర్వపపాముక్తడగును; శుభ రూపా! సర్వభూత ప్రళయమయి స్థావర చర ప్రాణులును పదార్థములును నశించిపడు కూడా నేను నాకు ప్రియతరమగు అ స్థానమును నేను విడువను; యుగక్షయ (ప్రళయ) కాలమున దేవగంధర్వ యక్షోరగ రాక్షసులును నానోరు ప్రేవశించుదురు; అపుడును నేను ఇట వారి పూజను సాక్షాత్తుగా ప్రతిగ్రహించుచుందును. ఇది సర్వ రహస్యములలోఉత్తమమును నాకు ప్రియతరమునునగు స్థానము.

ధన్యాఃప్రవిష్టా స్సుశ్రోణి మమ భక్తా ద్విజాతయః | మద్భక్తిపరమానిత్యం యే మద్భక్తాస్తు తే నరాః 15

తస్మి న్ప్రాణా న్పరిత్యజ్య గచ్ఛన్తి పరామాం గతిమ్‌ | సదా యజతి రుద్రేణ సదా దానం ప్రయచ్ఛతి 16

సదా తపస్వీ భవతి అవిమక్తస్థితో నరః | యో మాం పూజయతే నిత్యం తస్య తుష్యామ్యహం ప్రియే 17

సర్వదానాని యో దద్యాత్సర్వజ్ఞై ర్యజే న్నరః | సర్తతీర్థాభిషిక్తశ్చ న ప్రపద్యేత మామిహ 18

అవిముక్తం సదా దేవి యే వజన్తి సునిశ్చితాః | తే తిష్ఠన్తీహ సుశ్రోణి మద్భక్తాశ్చ త్రివిష్టపే. 19

మత్ర్పసాదా త్తతో దేవి దీప్యన్తి శుభోలోచనే | దుర్ధర్షా దుర్ధరాశ్చైవ భవన్తి విగతజ్వరాః 20

అవిముక్తం శుభం ప్రాప్య మద్భక్తాః కృతనివ్చయాః | నిర్ధూతపాపవిమలా భతన్తి విగతజ్వారాః 21

పార్వతీ: దక్షయజ్ఞ స్త్వయా దేవ మత్ప్రియార్థం నిఘాదితః |

అవిముక్తాగుణానాం తు న తృప్తి రిహ జాయతే 22

ఈశ్వరః : క్రోధేన దక్షయజ్ఞస్తు త్వత్ప్రియార్థే వినాశితః | మమ ప్రియే మహాభాగే నాశితోయం వరాననే. 23

అవిముక్తే యజన్తే యే మద్భక్తాః కృతనిశ్చయాః | న తేషాం పునరావృత్తిః కల్పకోటిశ##తై రపి 24

దేవీ: దుర్లభాస్తు గుణా దేవ అవిముక్తేతు కీర్తితాః | సర్వా స్తాన్మమ తత్త్వేన కథయస్వ మహేశ్వర.

కౌతూహలం మహాదేవ! హృది స్వం మమ వర్తతే | తత్సర్వం మమ తత్త్వేన ఆఖ్యాహి పరమేశ్వర. 26

ఈశ్వరః : అక్షయా హ్యమరాశ్చైవ హ్యదేహాశ్చ భవన్తి తే |

మత్ప్రసాదా ద్వరారోహే మామేవ ప్రవిశన్తి వై. 27

బ్రూహి బ్రూహి విశాలాక్షి కిమన్యఛ్చ్రోతుమిచ్ఛసి |

సుశ్రోణి (మంచి పిరుదల గల సుందరీ!) ధన్యులు నా భక్తులగు త్రైవర్ణికులు నా భక్తియే ప్రాధనముగాగల ఇతర నరులను అచట ప్రవేశింతురు: అచట మరణించి పరమగతినందుదురు; అవిముక్తమందుండు నరుడుసదా రుద్రము (నమక చమకముల) తో నన్నారాధించినవాడే; సదా దానమొనర్చినవాడే; సదా తవస్వియే; (అట్టి వానికే ఈ క్షేత్రము లభించునని యర్థము) నన్ను నిరతము పూజించువాని విషయమున నేను తృప్తుడనగుదును; సర్వదానము లాచరించినవాడు సర్వయజ్ఞములతో దేవతల నారాధించినవాడు సర్వతీర్థ స్నానమాచరించినవాడు ఇటకు వచ్చి నన్ను శరణంద గలుగును; దేవీ! సునిశ్చయముతో ఈ అవిముక్త యాత్ర చేయువారును ఇట నివసించువారును వరమును నాయనుగ్రహమున స్వర్గమును వసించి ప్రకాశింతురు; శుభలోచనా! అట్టివారు ఎవరికి తిరస్కరించను భరించను అలవికానివారై సంతాపరహితడై అవిముక్త శుభ##క్షేత్రము చేరి కృతనిశ్చయులై నాకు భక్తలయి పాపములను దులుపుకొని విమలులగుదురు; అనగా దేవి మరల ఇట్లనెను: దేవా! ఒకప్పుడు నాప్రీతికై దక్ష ద్వంసమొనర్చితిరి; అట్లే ఇపుడు ఇపుడు అవిముక్త క్షేత్రగుణములను ఇంకను తెలిపి నాకు తృప్తి కలిగింపుడు. అవి ఎంత విన్నను తృప్తి కల్గుటలేదు. అన ఈశ్వరుడిట్లనెను: దేవీ! నేను నీప్రీతితో క్రుద్ధుడనై దక్షయజ్ఞ వినాశమొనర్చితిని. (అట్లే ఇపుడీ అవిక్త క్షేత్ర గుణముల తెలిపి నీకు ప్రీతి కలిగింతును. మేలగు ముఖము కలదానా ! కృతనిశ్చయులై మద్భక్తులై అవిముక్తమందుండువారు శతకోటి కల్పముల తరువాత కూడ పునర్జన్మమునందరు; అన దేవి ఇట్ల పలికెను: దేవా ! అవిముక్త క్షేత్రమందు ఇతరత్ర దుర్లభములగు గుణములున్నవని కీర్తించితిరి. మహేశ్వరా! వాటినన్నిటిని వాటి తత్త్వముతో కూడా తెలుపుడు; మహాదేవా ! నా హృదయమందీ విషయమున చాల కూతూహలము కలదు; అన ఈశ్వరుడనెను: వరారోహా! అవిముక్తవాసులు నా ప్రసాదమున అక్షయులు అమరులు అదేహులు అయి నన్ను ప్రవేశింతురు; విశాలాక్షీ! మరి ఇంకేమి వినగోరుదువు?

దేవీ : అవిముక్తే మహాక్షేత్రే అహో పుణ్య మహో గుణః. 28

న తృప్తి మధిగచ్ఛామి బ్రూహి దేవష పునర్గుణా|

ఈశ్వరః : మహేశ్వరి వరారోహే శృణు తాంస్తు మమ ప్రియే. 29

అవిముక్తే గుణా యే తు తథాన్యానపి తాఞ్ఛృణు | శాకపర్ణాశినో దాన్తా స్పమ్ప్రక్షాళ్యా మరీచిపాః .30

దన్తోలూఖలినశ్చాన్యే అశ్మకుట్టా స్తథాపరే | మాసి మాసి కుశాగ్రేణ జలమాస్వాదయన్తివై. 31

వృక్షమూలనికేతాశ్చ శిలాశయ్యా స్తథా పరే | ఆదిత్యవపుష స్సర్వే జితక్రోధా జితేన్ద్రియాః. 32

ఏవం బహువిధై ర్ధర్మై రన్యత్ర చరితవ్రతాః | త్రికాలమపి భుఞనా యేవిముక్త నివాసినః 33

తపశ్చరన్తి వాన్యత్ర కళాం నార్హన్తి షోడశీమ్‌ | యేవిముక్తే వసన్తీహ స్వర్గే ప్రతివసన్తి తే. 34

మత్సమః పురుషో నాస్తి త్వత్సమా నాస్తి యోషితామ్‌ | అవిముక్తసమం క్షేత్రం నభూతం న భవిష్యతి. 35

అవిముక్తే పరో యోగో హ్యవిముక్తే పరాగతిః | అవిముక్తే పరో మోక్షః క్షేత్రంనైవాస్తి తాదృశమ్‌. 36

పరం గహ్యం ప్రవక్ష్యామి తత్త్వేన వరవర్ణిని | అవిముక్తే మహాక్షేత్రే యదుక్తం హి మయా పురా. 37

జన్మాన్తరశ##త్తై ర్దేవి యోగోయం యది లభ్యతే | మోక్షః శతసహస్రేణ జన్మనా లభ్యతే నవా. 38

అవిముక్తే వసే ద్దేవి మద్భక్తః కృతనిశ్చయః | ఏకేన జన్మనా దేవి!యోగం మోక్షం ప్రవిన్దతి. 39

పృథివ్యా మీదృశం క్షేత్రం న భూతం న భవిష్యతి |

చతుర్మూర్తి స్సదా ధర్మస్‌ తస్మి న్త్సన్నిహితః ప్రియే. 41

చతుర్ణామపి వర్ణానాం గతిస్తు పరమయా స్మృతా |

దేవీః శ్రుతా గుణా స్తే క్షేత్రస్య ఇహచాన్యత్ర యే ప్రభో 42

వదస్వభువి విప్రేన్ద్రాః కం వా యజ్ఞై ర్యజన్తి తే |

దేవి యనెను: దేవా ! అవిముక్తమహాక్షేత్రమం దద్భుతమగు పుణ్యమును గుణములును గలవు; అవి ఎంత విన్నను నాకు తృప్తి కలుగుట లేదు; దేవా! అవి ఇంకను తెలుపుడు. అన ఈశ్వరుడు డిట్లు వచియించెను: మహేశ్వరీ! వరారోహా! నా ప్రియా! అవిముక్త క్షేత్రగుణములు చెప్పెద వినుము; శాకములు ఆకులు తినువారు ఇంద్రియ నిగ్రహము కలవారు నిరత స్నాతులు సూర్యకిరణముల త్రావి జీవించువారు దంతములు రోలుగా చేసికొని ధాన్యములు నమలితిని జీవించువారు రాతిపై ధ్యానము లరగదీసి తిని బ్రదుకువారు నెలకొక మారే దర్భాగ్రమునకు వచ్చినంత నీరు ఆహారముగా గ్రహించి జీవించువారు చెట్ల మొదళ్లే నవాసముగా రాళ్లే పడకగా నుండువారు రవితేజస్కులు జితక్రోధులు జితేంద్రియులునడు ఇట్టి బహువిధ ధర్మములు పాటించి ఇతరత్ర వ్రతము లాచరించుచు తప మొనర్చువారు కూడా మూడు వేళల భుజించుచునే అవిముక్తమందు వసించువారి పదారవ పాలునకు సరిపోలరు; అవిముక్తవాసులు స్వర్గవాసులే; నా వంటి పురుషుడును నీవంటి స్త్రీయు అవిముక్తమువంటి క్షేత్రమును ఇదివరకు లేవు; ఇకముందుండవు; ఇచట పరమయోగము పరమ గలి పరమ మోక్షము లభించును; కావుననే ఇట్టి క్షేత్రము మరిలేదు; వరవర్ణనీ! మహా రహస్యము తెలిపెదను; నూరు అవిముక్తమును ప్రవేశించి అచట వసించువారు ఒక జన్మముతోనే యోగసిద్ధినంది పరమ దుర్లభమగు మోక్ష మందగలరు; వృథివియందు దీనికి సాటియగు క్షేత్రము మరిలేదు; ప్రియా! ఇచట ధర్మము సదా నాలుగు పాదముల సన్నిధినంది నడుచును; క్షేత్రము నాలుగు వర్ణముల వారికిని పరమ గమ్యము; అన దేవి ఇట్లనెను; ప్రభూ! నేను నీ వలన ఈ క్షేత్ర గుణములను ఇతరత్ర కల గుణములను తెలిసికొంటిని; విప్రేంద్రులు (ద్విజులు) యజ్ఞములు చేయునపుడు వారిచే ఆరాధింపబడు దేవత ఎవరు?

ఈశ్వరః : దృష్ట్యా చైవతు మన్త్రేణ మావేవ హి యజన్తి యే 43

న తేషాం భయమ స్తీహ భవం రుద్రంవ్రజన్తి తే | సమన్త్రోమన్త్రకో దేవి! ద్వివిధదో విధి రుచ్యతే. 44

సాజ్ఖ్యం చై వాథ యోగశ్చ ద్వివిధో యోగఉచ్యతే | సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వ మాస్థితః 45

సర్వథా వర్తమానోపి యో గీ మయివర్తతే | ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో నరః 46

తస్యాహం న ప్రణశ్యామి సవా(చ) మే న ప్రణశ్యతి | నిర్గుణ స్సగుణశ్చాపి యోగశ్చ కథితో భువి. 47

సగుణశ్చైవ విజ్ఞేయో నిర్గుణో మనసః పరః | ఏత త్తే కథితం దేవి యన్మాం త్వం పరిపృచ్ఛసి. 48

దేవీ : యా భక్తి స్త్రివిధా ప్రోక్తా భక్తానాం బహుధా త్వయా|

తా మహం శ్రోతు మిచ్ఛామి తత్త్వేన కథయస్వ మే . 49

ఈశ్వరః : శృణు దేవి మహాభాగే భక్తనాం భక్తివత్సలే |

ప్రాప్య సాజ్ఞ్యం చ యోగం చ దుఃఖాన్తం చ నిగచ్ఛతి. 50

సదా యస్సేవతే భిక్షాం తతో భవతి రఞ్జతః | రఞ్జనా త్తన్మయో భూత్వా లీయతే స తు భక్తిమా೯. 51

శాస్త్రాణాం చ వరారోహే బహు కారణదర్శినః | న మాం వశ్యన్తి తే దేవి జ్ఞానవాక్యవివాదినః 52

వరార్ధ(ర్థ)జ్ఞానతృప్తా యే యుక్తాః పశ్యన్తి యోగినః | విద్యయా విదితాత్మానో యోగస్యాపి ద్విజాతయః. 53

ప్రత్యాహారేణ శుద్ధాత్మా నాన్యథా చిన్తయేచ్చ తత్‌|

తుష్టిం చ పరమాం ప్రాప్య యోగం మోక్షం పరంతథా. 54

త్రిభుర్గుణౖ స్సమాయుక్తో జ్ఞానవా న్పశ్యతీహ మామ్‌ | ఏత త్తే కథితం దేవి కిమన్య చ్ఛ్రోతు మిచ్ఛసి. 55

భూయాశ్చాపి వరారోహే కథమామీహ సువ్రతే | గుహ్యం పవిత్ర మథవా యచ్చాపి హృది వర్తతే. 56

తత్సర్వం కథయిష్యామి శృణుషై#్వకమనాః ప్రియే |

దేవితో ఈశ్వరుడిట్లు పలికెను: భావనతోను మంత్రముతోను నన్నే ఎవరు యజింతు(ఆరాధింతు)రో వారకీ లోకములందు భయము లేదు; వారు భవుడు (లోకాకరణుడు) రుద్రడు (జ్ఞానావరోధమును తొలగించువాడు) అగు నన్నే పొందుదురు; దేవీ ! యజ్ఞవిధి సమంత్రకము అమంత్రకము నని రెండు విదములు; యోగమును-సాంఖ్యము యోగము నని రెండు విధముల; సర్వభూతములం దంతర్యామినై యున్న నన్ను ఏకత్వ భావన నాశ్రయించి సేవించు యోగి సర్వవిధముల లోకసంగముతో నుండియు నా యందున్నవాడే; ఏ నరుడు తనతో సమానముగా అన్ని భూతములను భావించి చూచునో అతనికి నేను కాని నా కతడు కాని లేకపోవుట యుండదు. యోగము నిర్గుణము సగుణము ననని రెండు విదములు, సగుణ యోగము విజ్ఞాన (అనుభవ) గోచర మగును; నిర్గుణ యోగము మనస్సున కతీతము; దేవి! నీ వడిగినది ఇట్లు నీకు తెలిపినాను. అన దేవి ఇట్లడిగెను: భక్తులనుష్ఠించు భక్తి త్రివిధములని మీరు చాల మారులు చెప్పి యుంటిరి; దాని వాస్తరూపము తెలియగోరుచున్నాను; నాకు తెలుపుము; అన ఈశ్వరుడు డిట్లనెను; భక్తుల భక్తియందు వాత్సల్యముగల మహాభాగా! దేవీ! వినుము; సాంఖ్యమును కాని యోగము కాని ఆశ్రయించినవాడు దుఃఖాంతమును పొందును; ఎవడు సదా బిక్షా సేవనముతో జీవించునో అతడు భక్తితో రంజితుడై దానిదే భగవత్తన్మయత్తమునంది ఆ భక్తి మంతుడు భగవంతునిలో తల్లీను డగును, వరారోహే! దేవి! శాస్త్రముల బహుకారణ(హేతువాద)ములను చూడగలగిన పరమార్ధ జ్ఞానమునంది తృప్తులగు యోగులును విద్య(తాత్త్విక జ్ఞానము)చే ఆత్మ(పరమాత్మ)తత్త్వము నెరగి యోగ తత్త్వము నెరగిన ద్విజులు మాత్రమే నన్ను దర్శింతురు; ప్రత్యాహారము (విషయ సుఖములనుండి ఇంద్రియములను ఉపసంహరించుట)చే చిత్తమును శుద్ధ మొనర్చుకొనవలెను; మరేదియు ఆలోచింపక తత్త్వమునే ధ్యానించవలయును; గుణత్రయ సమాయోగమున తత్త్వ మెరగిన జ్ఞానవంతుడు మాత్రమే నన్ను దర్శించును; దేవీ! నీ వడిగిన దిది నీకు చెప్పితిని; మరి ఏమి వినగోరుదవు? వరారోహ! సువ్రతా! ఇంకను మరల మరల ఎన్నిమారు లయినను చెప్పెదను; గుహ్యమును పవిత్రమును నగు ఏది విన కుతూహలము నీ హృదియందున్నను అది ఎల్ల చెప్పెదను; ప్రియా! ఏక మనస్కవై వినుము.

దేవీ: త్వద్రూపం కీదృశం దేవ ముక్తాః పశ్యన్తి యోగినః. 57

ఏషమేసంశయో దేవ నమస్తే సురసత్తమ |

శ్రీభగవా : అమూర్తం చైవ మూర్తంచ జ్యోతీరూపంహి తత్స్మృతమ్‌. 58

తస్యోపలబ్ధి మన్విచ్ఛ న్యత్నః కార్యో విజానతా | గుణౖర్వియుక్తో భూతాత్మా ఏవం వక్తుం న శక్యతే. 59

శక్యతే యది వక్తుం వై దేవై ర్వర్షశ##తై రపి | దేవీ! కింప్రమాణంతు తతేత్రంసమన్తా త్సర్వతోదిశమ్‌. 60

యత్ర నిత్యం స్థితో దేవో కృత్తివాసా గణౖ స్సహ |

ఈశ్వరః : ద్వియోజనంతు యతేత్రం పూర్వపశ్చిమతస్థ్సితమ్‌. 61

అర్ధయోజనవిస్తీర్ణం తతేత్రం దక్షిణోత్తరమ్‌ | వారాణసీ నదీ యా చ యావచ్ఛక్లనదీ తు వై. 62

బీష్మచణ్డిక మారభ్యపర్వతేశ్వర మన్తికే| గణా యత్రచ తిష్ఠన్తి తథా విఘ్నవినాయకాః 63

కూశ్మాండోగజతుండశ్చ జయన్తశ్చ మదోత్కటాః | సింహవ్యాఘ్రముఖాః కేచి ద్వికటాః కుబ్జవామనాః. 64

యత్ర నన్దీ మహాకాళ శ్చణ్డఘణ్టో మహేశ్వరః | దణ్డచణ్డశ్వరశ్చైవ గణ్టాకర్ణో మహాబలః. 65

ఏతే చాన్యేచ బహవో గణా రుద్రా స్తథేశ్వరాః | మహోదరా మహాకాయా వజ్రశక్తిధరా స్తథా. 66

రక్షన్తి సతతం దేవి హ్యవిముక్తం తపోధానాః | ద్వారే ద్వారే చ తిష్ఠన్తి శూలముద్గరపాణయః. 67

స్వర్ణశృజ్గీం రూప్యఖురాం చలద్ఘణ్టాం పయస్వినీమ్‌ | వారాణాస్యాం తు యో దద్యా త్త్రివర్ణాం కఞ్జలోచనే.

గాం దత్వా తు వరారోహే బ్రాహ్మణ వేదపారగే | ఆసప్తమం కులం తేన పావితం నాత్ర సంశయః. 69

అన దేవి ఇట్లెనెను: దేవా! ముముక్షువులగు యోగులు దర్శించు నీ రూప మొట్టిది? ఇది నా సంశయము; సురనత్తమా! నీకు సమస్కారము; నా కిది తెలుపుము; అన భగవాను డిట్లనెనె; అది వాస్తవమున జ్యోతీరూపమయినది; అది మూర్తము (సాకరము) అమూర్తము) నిరాకారము) అని రెండు విదములు; ఆ పరమాత్మానుభవము పొందగోరు విజ్ఞాన వంతుడు అందులకై యత్నించవలయును; నిర్గుణుడు భూతాత్మ (సర్వ భూతాంతర్యామియగు పరమాత్మ) తత్త్వము ఇట్టిదిని చెప్ప శక్యము కాదు; దేవతలకు కూడా దివ్య వర్ష శతముల కయినను సాద్యమో కాదో చెప్పజాలము. అన విని దేవి ఇట్లనెనె: కృత్తివాసుడు (గజ చర్మధారి) యగు ఈశ్వరుడు ప్రమథ గణములతో నిత్యము నివసించు ఆ అవిముక్త క్షేత్రము అన్ని దిశలయందును వ్యాపించిన విస్తార ప్రమాణము ఎంత? అన ఈశ్వరు డిట్లనెను: ఆ క్షేత్రపు తూర్ప పడమరల పొడువు రెండు యోజనములు; ఉత్తర దక్షిణముల వెడల్పు అర్ధ యోజనము; వారాణసీనది శుక్లనది పరవ్త శ్రేష్ఠమగు భీష్మ చండికము అనువాని సమీపముగా ఈ క్షేత్రము వ్యాపించి యున్నది. దీనియందు విఘ్న వినాయకులను ప్రమథ గణపతులునుఉన్నారు; వారు కూశ్మాండుడు గజతుండుడు జయంతుడు మొదలగువారు; వారెల్లరును అధిక మదశాలురు; సింహవ్యాఘ్రముఖులు, వికటరూపులు; మరుగుజ్జువారు; పొట్టివారు; వీరిలో నంది-మహాకాళుడు-చండఘంటుటు మహేశ్వరుడు దండచండేశ్రుడు మహాబలుడగు ఘంటాకర్ణుడు-వీరుకాక మరియు ఇతరుల అనేకులు గణములగువారగు రుద్రులు ఈశ్లరులు ఉన్నారు; వారందరు పెద్ద పొట్లలు పెద్ద దేహములు కలిగి వజ్రము శక్తి ఆయుధముల దాల్చిన వారు; ఈ తపోధనుల శూలముద్ద రాయుధపాణులయి ప్రతిద్వారమందు నలిచి అవిముక్త క్షేత్రమును రక్షించుచుందురు.

బంగరు కొమ్ములు వెండి గిట్లు కంఠమున కదలియాడు గంటల మూడు వన్నెలు కల పాడియావును వరాణసియందు వేదపారగుడగు బ్రాహ్మణునకు దాన మిచ్చినచో పద్మలోచనా! వరారోహా! అదాత తన వంశమందలి ఏడు తరములవారిని పవిత్రుల జేయును. నిస్సంశయము.

యో దద్యాద్ర్బాహ్మణ కిఞ్చి త్తస్మినేత్రే వరాననే | కాఞ్చనం రజతం వస్త్ర మన్నాద్యం బహువిస్తరమ్‌. 72

అక్షయ్యం చావ్యయం తస్య దానం స్యాదేవ సువ్రతే | శృణు తత్త్వేన తీర్థస్య విభూతిం వ్యష్టి మేవ చ. 71

యత్రస్నాత్వా మహాభాగే భవన్తి నిరుజా నరః | దశానా మశ్వమేధానాం ఫలం యాన్తి చ మానవాః. 72

తదవాప్నోతి ధర్మాత్మా తత్ర స్నాత్వా వరాననే | స్వల్పమల్పంచ యో దద్యా ద్బ్రాహ్మణ వేదపారగే.

శుభాం గతి మవాప్నోతి అగ్ని వచ్చైవ దీప్యతే | వారాణస్యాంతు జాహ్మ వ్యాః సంగమే లోకవిశ్రుతే. 74

దత్వాన్నం చ విధానేన న స భూయోపి జాయతే | ఏతత్తే కథితం దేవి! తీర్థస్య ఫల ముత్తమమ్‌. 75

ఉమే తే సమ్ప్రవక్ష్యామి నిశ్చయం శృణు సువ్రతే | ఏకరాత్రోపవాసం తు కృత్వా విప్రాంస్తు తర్పయేత్‌. 76

సౌత్రమణస్తు యజ్ఞస్యం ఫలం ప్రాప్నోతి మానవః | ఏకాహారస్తు యస్తిష్ఠే న్మాసం తత్ర వరాననే. 77

యావజ్జీవకృతం పాపం సహసా తస్య నశ్యతి | అగ్ని ప్రవేశం యే కుర్యు రవిముక్తే విధానతః. 78

ప్రవిశన్తి ముఖం తే మే నిస్సన్దిగ్ధం వరాననే | దశ సౌవర్ణికం పుష్పం యో7విముక్తే ప్రయచ్ఛతి. 79

అగ్నిహోత్రఫలం ధూపగన్ధదానేన తచ్ఛృణు | భూమిదానేన తత్తుల్యం గన్ధదానఫలం స్మృతమ్‌. 80

సంమార్జనే పఞ్చశతం సహస్ర ముపలేపనే | మాలా శతసహస్రంతు అనన్తం గీతవాద్యతః. 81

ఎవడా క్షేత్రమున బ్రాహ్మణునకు బంగారము వెండి వస్త్రములు అన్నము మొదలగునవి దానము చేయునో వాని ఆ దానము అక్షయము అవ్యయము అగును; ఆ తీర్థపు మహాత్మ్యమును సమృద్దిని వాస్తవమును తెలిపెదను వినము; అచట స్నాన మాడిన మానవులకు రోగబాధా నివృత్తియు దశాశ్వ మేధఫలమును లభించును. వేదపారగుడగు విప్రున కచట ఏ కొంచెము దాన మిచ్చినను దాత శుభగతి నందును; అగ్నివలె ప్రకాశించును; వరణా ఆసియను నదులు జాహ్నివి(గంగ)తో సంగమించు చోట యథావిధానముగ అన్నదానము చేసిన వానికి పునర్జన్మ ముండదు. దేవీ! నీ కిది ఇట్లు ఆ తీర్థపు ఉత్తమఫలము తెలిపితిని; సువ్రతవగు ఉమా! మరియొక నిశ్చయమును తెలిపెదను వినుము; అచట ఒక రేయింబవలు ఉపవాసమునుండి బ్రాహ్మణులను (అన్నాదికముతో) సంతృప్తి పరచినచో సౌత్రామణి యజ్ఞఫలము నందును; వరాననా! అచట మాసమాత్రము ఏకభుక్త వ్రతము చేసినచో వెంటనే యావజ్జీవము చేసిన పాపమంతయు నశించును; అవిముక్త క్షేత్రమున యథావిధానమగ అగ్ని ప్రవేశము చేసినచో వారు నా ముఖమందు ప్రవేశించిన ఫలమును నిస్సంశయ ముగ నుందుదురు; పది బంగారు పూవులను (లేదా పదినవరసుల బంగారు పూవులను) దానము చేసిన వారికి నిత్యాగ్ని హోత్రఫల మబ్బును; అచట ధూప-గంధ-దానముచే భూదాన ఫలము లభించును; అచట గుడియందు కనపూడ్చుటచే ఐదు నూర్ల దానముల ఫలము-అలుకుటచే వేయి దానముల ఫలము మాల అర్పించినగో లక్ష దానముల ఫలము పొందును; గీతవాద్యముల జరిపించినచో అనంతఫలము లభించును.

దేవీ : అత్యద్భుత మిదం దేవ యథా మే త్రత్ప కీర్తితమ్‌ |

రహస్యం శ్రోతు మిచ్ఛామి యదర్థం త్వం న ముఞ్చసి. 82

ఈశ్వరకృతబ్రహ్మపఞ్ఛమశిరశ్ఛేదనకథనమ్‌.

ఈశ్వరః : అసి త్పూర్వం వరారోహే బ్రహ్మణస్తు శిరోవరమ్‌ |

యథేదం శృణు సుశ్రోణి తప్తకాఞ్ఛన సుప్రభమ్‌. 83

జ్వలస్తం పఞ్ఛమం శీర్షం జాతం తస్య మమాత్మనః | న ఏవ మబ్రవీద్దేవి జన్మ జానామి తే హ్యహమ్‌. 84

తతః క్రోధపరీతేన సంరక్తనయేనేన చ | వామాజ్గుష్ఠనఖాగ్రేన ఛిన్నం తస్య శిరో మయా. 85

బ్రహ్మా: యస్మా దనపరాధస్య శిరశ్ఛిన్నం త్వయా మమ|

తస్మా చ్ఛపసమాయుక్తః కపాలీ త్వం భవిష్యసి. 86

బ్రహ్మకుత్యాకులో భూత్వా చర తీర్థాని భూతలే | తతోహం గతవాన్దేవి హిమవన్తం శిలోచ్చయమ్‌. 87

తత్రనారాయణ శ్శ్రీమా న్మహాభిక్షాం ప్రయాచితః | తతస్తేన స్వకం పార్వ్శం నఖాగ్రేణ విదారితమ్‌. 88

మహతీ సవ్రతో ధారా తస్యరక్తస్య నిస్సృతా | ప్రయాతా సాతివిస్తీర్ణా యోజనార్థశతం తదా. 89

న సమ్పూర్ణం కపాలంతు ఘోర మద్భతదర్శనమ్‌ | దివ్యం వర్షసహస్రంతు సాపిధారా ప్రవాహితా.

ప్రపోవాచ భగవా న్విష్ణుః కపాలం కుతు ఈదృశమ్‌ | ఆశ్చర్య భూతం దేవేశ సంశయం మయి వర్తతే. 91

కుతశ్చ శమ్భో దేవేశ సర్వం మే బ్రూహి పృచ్ఛతః |

దేవి దేవునితో ఇట్లనెనె: దేవా నీవు చెప్పిన దిది అత్యద్భుతమగు విషయము; నీ వీ క్షేత్రమును విడువకుండుట లోని రహస్య హేతువును తెలుపుము; అనగా ఈశ్వరు డిట్లు తెలుపసాగెను; వరారోహా! సుశ్రోణి! ఈ విషయము ఎట్టిదో తెలిపెద వినము; మహాత్ముడగు బ్రహ్మకు పూర్వము ఐదవ శిరస్సు జనించెను; అది చా శ్రేష్ఠమయినది కాచిన బంగారువలె మంచి కాంతితో జ్వలించునది; ఇట్లుండగా దేవి! అతడు నాతో నీ పుట్టుక నే నెరుగుద ననెను; అంతట నేను క్రోధవ్యాప్తడయి రక్తనేత్రుడనయి నా ఎడమచేతి బొటనవ్రేలి గోటి కొనతో అతని తల త్రెంచితిని; అంతట బ్రహ్మ ''అనపరాధుడునగు నా తల త్రుంచితివి కనుక నీవు శాపయుక్తడవయి కపాధారి వగుదువు; బ్రహ్మహత్యోదోషాకులడవయి భూతమందలి తీర్థముంలదు తిరుగుచుండము;'' అనెను; దేవీ ! నే నంతట హిమవత్సర్వతమునకు పోతిని; అచట నేను నారాయణుని మహాభిక్ష కోరితిని; అతడు తన పార్శ్వమును చీల్చగా మహారక్త ధార స్రవించసాగెను; అది ఏబది యోజనముల పొడవయ్యెను; అంతటి దానితో కూడ నాకపాలము నిండలేదు. ఆశ్చర్యకరమయి కనబడు ఆ ఘోర రక్తధార దివ్య సంవత్సర సహస్రముల పాటు ప్రవహించుచునే ఉండెను; అది చూచి విష్ణు భగవానుడు నాతో ''దేవేశా! శంకరా! శంభూ! ఇటువంటి ఈ కపాలము ఎచ్చటినుండి లభించెను; ఇది అశ్చర్యకరమయినది; నా కిది తెలిసి సంశయము నివారింపము;'' అనెను.

ఈశ్వరః : శ్రూయాతా మస్య దివ్యస్య కపాలస్య తు సమ్భవః 92

శతం వర్షసహస్రాణాం తపస్తప్త్వా సుదారుణమ్‌ |

బ్రహ్మసృజ ద్వపు ర్దివ్య మద్భతం లోమహర్షణమ్‌. 93

తపసశ్చ ప్రభావేన దివ్య కాఞ్చనసుప్రభమ్‌ | జ్వలత్తత్పఞమం శీర్షం జాతం తస్య మమాత్మనః. 94

నికృత్తం తన్మయా దేవ తదిదం పశ్య దుర్జయమ్‌ | యత్రయత్రవగచ్ఛామి కపాలం తత్రగచ్ఛతి. 95

ఏకముక్త స్తో దేవః ప్రోవాచ పరుషోత్తమః |

నారాయణః : గచ్ఛ గచ్ఛ స్వకం స్థానం బ్రహ్మణ స్త్వం ప్రియం కురు. 96

తస్మిం స్త్యజసిభద్రం తే కపాలం తస్య తేజసా | తత స్సర్వాణి తీర్థాని గుహ్యాన్యాయతనానిచ. 97

అపస్థిత స్స్వకే స్థానే శాపశ్చ విగతో మమ | విష్ణుప్రసానా త్సుశ్రోణి కపాలం తత్సహన్రధా . 99

స్ఫుటితం బహుధా జాతం స్వప్నలబ్ధం ధనం యథా |

బ్రహ్మహత్యాపహంతీర్థం క్షేత్ర మేత న్మయా కృతమ్‌. 100

శ్మశాన మేత ద్భద్రం మే(తే)దేవానాం పరవర్ణిని | కాలో భూత్వా జగత్సర్వం సంహరామి సృజా మిచ.

దేవేశి! సర్వగుహ్యానాం స్థానం ప్రియతమం మమ | మద్భక్తా స్తత్ర గచ్ఛన్తి విష్ణుభక్తా స్తథైవచ. 102

యే భక్తా భాస్కరే దేవి లోకనాధే దివాకరే | అత్రస్థో య స్త్యజే ద్దేహం మామేవ ప్రవిశత్యసౌ. 103

దేవీ : అత్యద్భత మిదం దేవ యదుక్తం పద్మయోనినా |

త్రిపురాన్తకరస్థానం గుహ్య మేత న్మహాద్యుతే. 104

సన్నిధానాత్తు తే సర్వే కాలాం నార్హన్తి షోడశీమ్‌ | యత్ర తిష్ఠతి దేవేశో యత్ర తిష్ఠతి శజ్కరః. 105

గజ్గాతీర్థసహస్రాణాం తుల్యా భవతి వా నవా | త్వమేవ భక్తి ర్దేవేశ త్వమేవ గతి రుత్తమా. 016

బ్రహ్మాదీనాంతు సర్వేషాం గతిరక్తా సనాతనీ | శ్రావ్యమేత ద్ద్విజాతీనాం భక్తనా మనుకమప్పయా. 107

ఇతి శ్రీమత్స్యమహాపురాణ దేవీదేవసంవాదే అవిముక్తమహాత్మ్యే ఈశ్వర కృత బ్రహ్మశిరశ్ఛేదాదికథనం నామ ద్వ్యశీత్యుత్తరశతతమోధ్యాయః.

అతనితో నేను ఇట్లంటిని? ''ఈ దివ్య కపాలపు ఉత్పత్తిని తెలిపెద వినుము; లక్షల దివ్య వర్షములపాటు బ్రహ్మ సుదారుణ తపమాచరించి దివ్యమును అద్భుతమును గగుర్పాటు కలిగించునదియు దివ్య సువర్ణ కాంతిమంతమును అగు దేహమును సంపాదించుకొనెను; ఆ మహాత్మునకపుడే ఐదవతలయు మొలిచెను: దేవా! నేనది త్రుంచితిని; ఇది చూడుము-జయింపనలవి కాక నేను పోయిన చోటికెల్ల నావెంట వచ్చచున్నది;'' అనగా పురుషోత్తమ దేవుడిట్లనెను; ''నీవు బ్రహ్మకు ప్రీతి కలిగించు పని చేయవలయును; నీవు పోయిన ఏచోట అది నిన్ను విడుచునో అది నీవు నీ స్వస్థానముగా చేసికొనుము; అది తన తేజస్సుతో తానే నీకు శుభము కలిగించును;'' అనెను. నేనంతట పరమ రహస్యములగు తీర్థముల క్షేత్రములు అన్నియు తిరుగసాగితిని; కాని పృథుశ్రోణీ! ఏమియు మేలు కలుగలేదు; అంతట నేను మహాశయా ! ఈ అవిముక్తమునకు వచ్చి నా స్వస్థానమున నిలిచితని; విష్ణు కృపవలన నా శాపము తీరెను; ఆ కపాలము వేయిగా చీలి స్వప్నమున లభించిన ధనమువలె అదృశ్యమయ్యెను; అంతట నేనిది బ్రహ్మహత్యా నివారక క్షేత్రముగా నిర్ణయించితిరి; వరవర్ణినీ ! ఇతి సర్వ రహస్య స్థానములందును నాకు ప్రియతమ మైనదిఫ నాయందును విష్ణునదును దివాకరుడు (పగళ్ళ నేర్పరచువాడు) లోక నాథుడు అగు భాస్కరుని యందును భక్తిగల ఉపాసకులు అచ్చటికి పోవుదురు; ఇచట దేహత్యాగమొనర్చినవాడు నన్ను ప్రవేశించును; అనగా దేవి దేవునితో ఇట్లనెను; దేవా ! పద్మయోని (పద్ము జన్మస్థానములగాగల బ్రహ్మయును ఆ పద్మమునకు జన్మకారణుడగు నారాయణుడును) చెప్పిన ఈ విషయములును వాని ననుసరించి జరిగిన ఈ ఘటనలును అత్యద్భుతముగా నున్నవి; మహాతేజశ్శాలీ! త్రిపురాంతకరా ! నీవు ఇచట నిత్య సన్నిహతుడగుటవలన ఇతర క్షేత్రములన్నియు కలిసిననను దీని పదునారవ వంతునకును సరిపోలవు; దేవేశుడగు శంకరుడుండు ఈ స్థానమునందు కల గంగతో తీర్థ సహస్రములను సరిపోలునో పోలవో చెప్పజాలము; దేవేశా! ఇట్టి నీవే ఉత్తమభక్తి రూపుడవు; ఉత్తగతివి; బ్రహ్మాది దేవతకును నీవే సనాతన (శాశ్వత) మగు ఉత్తమగతివి; ఇదియంతయు భక్తలగు ద్విజులయంది అనుకంపతో వారిక వినిపంచవలయును.

ఇది శ్రీ మత్య్స మహాపురాణమున దేవీదేవ సంవాద రూపమగు అవిముక్తి క్షేత్రమాహాత్మ్యమున యోతత్త్వో పదేశము ఈశ్వరకృత బ్రహ్మశిరశ్ఛేదాది కథనమునను నూట ఎనుబది రెండ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters