Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోననవత్యుత్తరశతతమోధ్యాయః.

నర్మదామాహాత్మ్యే యంత్రేశ్వర తీర్థాది మహిమాను వర్ణనమ్‌.

మార్కణ్ణయః : నార్మదే చోత్తరే కూలే తీర్థం యోజనవిస్తృతమ్‌ |

యన్త్రేవ్వరేతి విఖ్యాతం సర్వపాపహరం పరమ్‌. 1

తత్ర స్నాత్వా నరో రాజ న్దైవతై స్సహ మోదతే | పఞ్చవర్షసహస్రాణి క్రీడతే కామరూపధృక్‌. 2

గర్జనంచ తతో గచ్ఛేద్యత్ర మేఘ స్తథోత్థితః | ఇన్ద్రజిన్నామ సమ్ర్పాస్త స్తస్య తీర్థప్రభావతః. 3

మేఘనాదం తతో గచ్ఛే ద్యత్ర మేఘానుగర్జితమ్‌ | మేఘనాదో గణస్తత్ర గణసమ్పన్నతాం గతః. 4

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర తీర్థ మామ్రాతకేశ్వరమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్గో సహస్రఫలం లబేత్‌. 5

నార్మదే చోత్తరే కూలే ధారాతీర్థ మనుత్తమమ్‌ | తస్మిం స్తీర్థే నరస్స్నాత్వా తర్పయే త్పితృదేవతాః. 6

కామా న్త్సర్వా నవాప్నోతి మనసా యే విచిన్తితా ః | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర బ్రహ్మావర్త మితి స్మృతమ్‌. 7

తత్ర స్నిహితో బ్రహ్మా నిత్యపమేద యుధిష్ఠిర | తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర బ్రహ్మలోకే మహియతే. 8

Oతతో గాణశ్వరం గచ్ఛే న్నియతో నియతాసనః | సర్వాపాపవిశుద్ధాత్మా రుద్రలోకం స గచ్ఛతి. 9

తతో గచ్ఛేచ్చ రాజేన్ద్ర కపిలాతీర్థ ముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో +రాజ న్త్సర్వదానఫలం లభేత్‌. 10

Oతతో గాలేశ్వరం. +రాజ న్కపిలాదాన మాప్నుయాత్‌.

కరఞ్జతీర్థం గచ్ఛేత్తు దేవర్షిగణ సేవితమ్‌ | తత్ర స్నాత్వా నరో. రాజ న్రుద్రలోక మవాప్నుయాత్‌. 11

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర కుణ్డలేశ్వర ముత్తమమ్‌ | తత్ర సన్నిహితో రుద్ర స్తిష్ఠతే హ్యుమయా సహ. 12

తత్ర స్నాత్వా తు రాజేన్ద్ర హ్యవధ్య స్త్రిదశైరపి | పిప్పలేశం తతో గచ్ఛే త్సర్వపాపప్రణాశనమ్‌. 13

తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర రుద్రలోకే మహీయతే | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర విమలేశ్వర ముత్తమమ్‌. 14

తత్ర దేవశిలా రమ్యా చేశ్వరేణ నివేశితా | తత్ర ప్రాణా నృరిత్యజ్య రుద్రలోక మావాప్నుయాత్‌. 15

తతః పుష్కరిణీం గచ్ఛేత్తత్ర స్నానం సమాచరేత్‌ | స్నాతమాత్రో నరస్తత్ర హీన్ద్రస్యార్ధాసనం లభేత్‌.

నూట డెబ్బది తొమ్మిదవ యధ్యాయము.

మం (యం) త్రేశ్వరాది తీర్థ మహిమాను వర్ణనము.

మార్కండేయుడు ఇట్లు చెప్పెను: నర్మదానది ఉత్తరపుటొడ్డున యోజన విస్తారముగల మం (యం) త్రేశ్వరమను సర్వపాప హరమగు గొప్ప తీర్థము గలదు; దానియందు స్నానమాడినవారు ఐదువేల ఏండ్లు కామరూప ధరులై దేవతలతో కూడి విహరించుచు సుఖింతురు; తరువాత గర్జనమను తీర్థము; దానియందు స్నానమాడిన మేఘ మొకటి దాని ప్రభావమున ఇంద్రజిత్తనునామమునంది ఉన్నతి పొందెను. తరువాత మేఘ గర్జనమువలె ధ్వనించు మేఘనాద తీర్థము; దాని యందు స్నానమాడి మేఘనాదుడను గణ ప్రమథుడు గణాధిపతియయ్యెను; తరువాత ఆమ్రాత కేశ్వర తీర్థము; దాని యందు స్నానమాడినచో గోసహస్ర దాన ఫలము కలుగును; తరువాత ధరాతీర్ధము; అది సర్వోత్తమము దానియందు స్నానమాడి పితరులకు తర్పణము చేసినచో సర్వచింతిత కామసద్ధి యగును; తరువాత బ్రహ్మ సదాసన్ని హితుడయి యుండు బ్రహ్మావర్త తీర్తము; దానియందు స్నానము బ్రహ్మలోక ప్రాప్తినిచ్చును తరువాత గణశ్వర తీర్థము; అటకేగి నియతు డై నియతమగు ఆసనమున కూర్చుండినచో సర్వపాప విశుద్ధాత్ముడై రుద్రలోక మేగును తారువాత ఉత్తమమగు కిపిలా తీర్థము; దానియందు స్నానముచే సర్వదాన ఫలము సిద్ధించును; తరువాత దేవర్షి గణ సేవితమగు కరంజ తీర్థము; దానియందు స్నానముచే రుద్రలోక ప్రాప్తి; తరువాత కుండలేశ్వర తీర్థము; అది యుత్తమము; అందు రుద్రుడు ఉమతో సదా సన్నిధిచేసి యుండును; అందు స్నానమాడినవాడు దేవతలకును అవధ్యుడగును; తరువాత సర్వపాప నాశకమగు పిప్పలేశ తీర్థము; దాని యందు స్నానముచే రుద్రలోక ప్రాప్తి; తరువాత ఉత్తమమగు విమలేశ్వర తీర్థము; అందు ఈశ్వరుడు నిలిపిన రమ్యమగు దేవశిల యొకటి గలదు; అచట ప్రాణత్యాగమునే రుద్రలోక ప్రాప్తి; తరువాత పుష్కరిణీ తీర్థము; అందు స్నానమాడినవాడు ఇంద్రుని అర్ధాసనమునకు అధికారి యగును.

నర్మదా సరితాం శ్రేష్ఠా రుద్రదేహా ద్వినిస్సృతా | తారయే త్సర్వబూతాని స్థావరాణి చరాణిచ. 17

సర్వదేవాధిదేవేన త్వీశ్వరేణ మహాత్మనా | కథితా ఋషిసజ్ఘేభ్యో హ్యస్మాకంచ విశేసతః 18

మునిభి స్సంస్తుతా హ్యేషా నర్మదా ప్రవరా నదీ | రుద్రదేహా ద్వినష్క్రాన్తా లోకానాం హితకామ్యయా.

సర్వపాపహరా నిత్యం సర్వదేవనమస్కృతా | సంస్తుతా దేవగన్ధర్వై రప్సరోభి స్తథైవచ 20

నమః పుణ్యజలేహ్యాద్యే నమ స్సాగరగామిని | నమస్తే పాపశమని నమో దేవి వరాననే. 21

నమోస్తు తే ఋషిగణసజ్ఘ సేవితే సమోస్తు తే శజ్కరదేహనిస్సృతే |

నమోస్తు తే ధర్మభృతాం వరాననే నమోస్తు తే సర్వపవిత్రపావని. 22

యశ్చేదం పఠతే స్తోత్రం నిత్యం శుద్ధమనా నరః | బ్రాహ్మణో వేదమాప్నోతి క్షత్త్రియో విజయీ భ##వేత్‌.

వైశ్యస్తు లభ##తే లాభం శూద్రశ్చైవ శుభాం గతిమ్‌ | అర్థార్థీ లభేత్‌ హ్యర్థం స్మరణాదేవ నిత్యశః. 24

. రాజ న్గోలోకం సమవాప్నుయాత్‌.

నర్మదాం సేవతే నిత్యం స్వయం దేవో మహేశ్వరః | తేన పుణ్యా నదీ జ్ఞేయా బ్రహ్మహత్యాపహారిణీ. 25

ఇతి శ్రీమత్య్స మహాపురాణ నర్మదామాహాత్మ్యే యన్త్రేశ్వర తీర్థాది మహిమానువర్ణనం నామ ఏకోననవత్యుత్తర శతతమోధ్యాయః.

నర్మద సాక్షాత్‌ రుద్ర దేహమునుండి వెలువడిన నదీ శ్రేష్ఠ; అది స్థిరచర భూతములనన్నిటిని తరింపజేయగలది; అని సర్వదేవాధి దేవుడు మహాత్ముడునగు ఈశ్వరుడు ఋషులకును విశేషించా మాకును చెప్పియుండెను; నదీశ్రేష్టయగు ఈ నర్మద మునులచే స్తుతింబడునది; లోకములకు హితము చేయుటకై రుద్ర దేహమునుండి వెలువడినది; ఇది సర్వపాప హరము; సర్వదేవ సమస్కృతము; దేవతాగంధర్వాప్సరోనుతులను అందు కొనునది; పుణ్యజలా! ఆద్యా! సాగరగామినీ! పాపనాశనీ! సుందర ముఖీ! దేవి ! ఋషిగణ సేవితా! శంకర దేహనిర్గతా! ధర్మపోషకులలో మేలగుదాన సర్వ పవిత్ర వస్తువులను కూడా పావనము చేయుదానా! నర్మదా ! నీకు సమస్కారము. అను ఈ స్తోత్రమును నిత్యమును శుద్ధ మనస్కుడై పఠించినచో బ్రాహ్మణులకు వేద విద్యయు క్షత్త్రియునకు విజయమును వైశ్యునకు ధన లాభమును శూద్రునకు సద్గతియు కలుగును. ధనార్థికి ధనమును లభించును: మహేశ్వర దేవుడే స్వయముగ దీనిని సదా సేవించునన్నచో ఇది బ్రహ్మహత్యా దోషమునుకూడ పోగొట్టగలదని వేరుగా చెప్ప పని లేదు.

ఇతి శ్రీ మత్స్మ మహా పురాణమున నర్మదా మాహాత్మ్యమును మం (యం) త్రేశ్వరాది తీర్థ మహిమాను వర్ణనమను నూట ఎనుబది తొమ్మిదవ యధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters