Sri Matsya mahapuramu-2    Chapters   

నవత్యుత్తరశతతమో7ధ్యాయః.

నర్మదామాహాత్మ్యే శూలభేద తీర్థాది మహిమానువర్ణనమ్‌.

మార్కణ్డయః : తదాప్రభృతి బ్రహ్మాద్యా ఋషయశ్చ తపోధనాః |

సేవన్తే నర్మదాం రాజ న్రాగక్రోధవివర్జితాః. 1

యుధిష్ఠిరః : యస్మి న్నిపతితం దృష్టం శూలం దేవస్య భూతలే |

తస్య పుణ్యం సమాఖ్యాహి యథావ న్మునిసత్తమ. 2

మార్కణ్డయః : శూలభేదేతి విఖ్యాతం తీర్థం పుణ్యతమం మహత్‌ |

తత్ర స్నాత్వార్చయే ద్దేవం గోసహస్రఫలం లభేత్‌. 3

త్రిరాత్రం కారయేద్యస్తు తస్మిం స్తీర్థే నరాధిప | అర్చయిత్వా మహాదేవం పునర్జన్మ నవిద్యతే. 4

భీమేశ్వరం తతో గచ్ఛే న్నారదేవశ్వర ముత్తమమ్‌ | ఆదిత్యేశం మహాపుణ్యం *స్మృతం కిల్బిషనాశనమ్‌. 5

నన్దకేశం పరిక్రమ్య పర్యాప్తం జన్మనః ఫలమ్‌ | వారుణశం తతః పశ్యే త్స్వతన్త్రేశ్వరమేవచ. 6

సర్వతీర్థఫలం తస్య పఞ్చాయతనదర్శనాత్‌ | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర యుద్ధం వై యత్ర సాధితమ్‌. 7

కోటితీర్థంతు విఖ్యాత మసురా యత్ర యేర్దితాః | యత్ర తే నిహతా రాజ న్దానవా బలదర్పితాః. 8

తేషాం శిరాంస్యగృహ్ణన్త సర్వే దేవా స్సమాగతాః | తైస్తు సంస్థాపితో దేవ శ్శూలపాణి ర్మహేశ్వరః. 9

కోటిర్వినిహతా తత్ర తేన కోటీశ్వర స్సృతః | దర్శనాత్తస్య తీర్థస్య సదేహ స్స్వర్గ మారుహేత్‌. 10

తదా త్విన్ద్రేణ క్షుద్రత్వా ద్వజ్ర కీలేన యన్త్రితమ్‌ | తదాప్రభృతి లోకానం స్వర్గమార్గో నివారితః. 11

+సఘృతం శ్రీఫలం దద్యా త్కృత్వా చాన్తే ప్రదక్షిణమ్‌ | పర్వతం సహదీపందు శిరసా చైవ ధారయేత్‌.

సర్వకామసునమ్పూర్ణో రాజా భవతి పాణ్డవ | మృతో రుద్రత్వ మాప్నోతి తతోసౌ జాయతే పునః. 13

*తథా ఘృతమధుస్రవమ్‌. +సఘృతం శ్రీఫలం జగ్ధ్వా.

స్వర్గాదేత్య భ##వే ద్రాజా రాజ్యం కృత్వా దివం వ్రజేత్‌ |

మహాదేవం తతః పశ్య త్త్రయోదశ్యాంతు మానవః. 14

స్నాతమాత్రో నరస్తత్ర సర్వయజ్ఞఫలం లభేత్‌ |

నూట తొంబదవ అధ్యాయము.

శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనము.

మార్కండేయుడిట్లు చెప్పును; ధర్మరాజా : అది మొదలుకొని బ్రహ్మాది దేవతలును తపోధనులను రాగక్రోధాది దోషరహితులై నర్మదను సేవింతురు; అనగా ముని సత్తమా ! ఏ ప్రదేశమునందు మహాదేవుని శూలము పడినదిగా కనబడునో ఆ ప్రదేశపు మహాత్మ్యము ఉన్నదియున్నట్లు చెప్పుమని ధర్మరాజుడడుగ ముని మరల ఇట్లు చెప్పెను: అది శూల భేదమను పుణ్యతమ మహా తీర్థము; అందు స్నానమాడి శివునర్చించినచో గోసహస్రదాన ఫలము లభించును; అచట త్రిరాత్ర దీక్షతో మహా దేవునర్చించినచో పునర్జన్మముండదు. తరువాత వరుసగా భీమేశ్వర నారదేశ్వరాదిత్యేశ్వర నంది కేశ్వరువారుణశ్వర తీర్థములు కలవు: అందు స్నానమాడుట మహా పాతక నాశకము; తరువాత స్వతంత్రేశ్వరము; అందు స్నానమాడి అచటనున్న పంచాయతన (ఆది త్యాంబికా విష్ణుగణనాధ మహేశ్వర) మూర్తులదర్శించినచో సర్వ తీర్థ యత్రా ఫలమబ్బును; తరువాత కోటి తీర్థము; అచ్చట పూర్వము దేవదానవ యుద్దము జరిగెను; అందు బలదర్పితులగు దానవుల అనేకుల శిరస్సులను దేవతలు ఖండించి అచట శూలపాణియగు మహే(కోటి)శ్వరుని ప్రతిష్ఠించిరి. అచట కోటి మంది దానవులు వినిహతులగుటచే అదికోటి తీర్థమనబడెను. దాని దర్శన మాత్రముననే మనవులు స్వర్గమారోహించు చుండుట చూచి క్షుద్రబుద్ధిగల ఇంద్రుడు ఆ మార్గమును వజ్రముతో కీలించి ఆటంక పరచెను; నాటినుండి మానవులకు దీనివలన లభించు స్వర్గపు మార్గము నివారింపబడెను; అచట నేయి మారేడుపండు దానమొనర్చి పర్వతమున ప్రదక్షిణించి పర్వతముపై దీపము వెలిగించి దానితో కూడా కోండను శిరస్సునందు నిలుపుకొనవలయును; దానిచే సర్వకామ పూర్తి యగును; తుదకు రుద్రలోక ప్రాప్తియగును; తరువాత స్వర్గము (రుద్రలోకము) నుండి మరలి భూలోకమున రాజైపుట్టి రాజ్యమేలి మరల స్వర్గమారోహించును: తరువాత మహాదేవ తీర్థము అందు త్రయోదశినాడు స్నామడినంత మాత్రముననే సర్వయజ్ఞ ఫలము లభించును.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర తీర్థం పరమశోభనమ్‌. 15

నరాణాం పాపనాశాయ హ్యగస్త్యేశ్వర ముత్తమమ్‌ |

తత్ర స్నాత్వ నరో రాజ న్ముచ్యతే బ్రహ్మహత్యయా. 16

కార్తికస్య తు మానస్య కృష్ణపక్షే చతుర్దశీ | ఘృతేన స్నాపయేద్దేవం సమాధిస్థో జితేన్త్రియః. 17

ఏకవింశకులోపేతో న చ్యవే దైశ్వరా త్పురాత్‌ | ధేనుం చోపానహచ్ఛత్రం దద్యాచ్ఛ ఘృతకమ్బళమ్‌. 18

భోజనం చైవ విప్రాణాం సర్వం కోటిగుణం భ##వేత్‌ | తతో గచ్ఛేచ్చ రాజేన్ద్ర బలకేశ్వర ముత్తమమ్‌. 19

తత్ర స్నాత్వా నరో రాజ న్త్సింహాసనపతి ర్భవేత్‌ | నర్మదాదక్షిణ కూలే తీర్థం శక్రస్య విశ్రుతమ్‌. 20

ఉషోష్కయ రజనీమేకాం స్నానం తత్ర సమాచరేత్‌ |

స్నానం కృత్వా యథాన్యాయ మర్చయిత్వా జనార్దనమ్‌. 21

గోసహస్రఫలం తస్య విష్ణులోకం స గచ్ఛతి | ఋషితీర్థం తతో గచ్ఛే త్సర్వపాపహరం నృణామ్‌. 22

స్నాతమాత్రో నరస్తత్ర శివలోకే మహీయతే | నారదస్యతు తత్రైవ తీర్థం పరమశోభనమ్‌ 23

స్నాతమాత్రో నరస్తత్ర గోసహస్రఫలం లభేత్‌ | దేవతీర్థం తతో గచ్ఛేద్బ్రహ్మణా నిర్మితంపురా. 24

తత్ర స్నాత్వా నరో రాజ న్బ్రహ్మలోకే మహీయతే | అమరకణ్టకం గచ్ఛే దమరై స్థ్సాపితం పురా. 25

స్నాతమాత్రో నర స్తత్ర రుద్రలోకే మహీయతే | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర తురాసజ్గమ ముత్తమమ్‌. 26

తత్పఞ్చాయతనం దృష్ట్వా ముచ్యతే బ్రహ్మహత్యయా |

ఋణతీర్థం తతో గచ్ఛే దృణభ్యోముచ్యతే ధ్రువమ్‌. 27

వటేశ్వరం తతో దృష్ట్వా పర్యాప్తం జన్మనః ఫలమ్‌ | భీమేశ్వరం తతో గచ్ఛే త్సర్వావ్యాధివినాశనమ్‌. 28

స్నాతమాత్రో నరో రాజ న్త్సర్వదుఃఖై ప్రముచ్యతే |

తరువాత పరమ శోభనమగు రాజేంద్ర తీర్థము: తరువాత నరులకు పాపనాశకమగు అగస్వ్యేశ్వరము: అందు స్నానముచే బ్రహ్మహత్యా దోషనివృత్తి యగును; కార్తిక కృష్ణ చతుర్దశినాడు అట చిత్త సమాధితో జితేంద్రియుడై శివుని నేతితో అభిషేకించినచో అతడు తన ఇరువదియొక తరములవారిలో కూడా శివపురవాసియగును; అట చేసిన ధేనూపానత్‌ (చెప్పులు) ఛత్త్ర ఘృత కంబళ విప్రాన్న దానములు అన్నియు ఇతరత్రకంటె కోటి గుణము ఫలము నిచ్చును; తరువాత ఉత్తమమగు బలాకేశ్వరము; అందు స్నానముచే నరుడు సింమాసనాధిపతి యగును; ఇవియన్నియు నర్మదకు ఉత్తర తీరమందలి తీర్థములు); నర్మదా దక్షిణ తీరమున శక్రతీర్థము; అచట ఒక రాత్రి (దినమంతయు) ఉపవసించి స్నానమాడి జనార్దనుసర్చించినచో గోపహస్ర దానఫలమునంది తుదకు విష్ణులోక ప్రాప్తుడగును; తరువాత నరులకు సర్వపాపహరమగు ఋషితీర్థము: అందు స్నానమాడిన మాత్రమున శివలోకప్రాప్తి యగును; తరువాత పరమ శోభనమగు నారదతీర్థము; అందు స్నానమాడుటచే గోనహస్రదాన ఫలమబ్బును; తరువాత దేవతీర్థము అది పూర్వము స్వయముగా బ్రహ్మచే నిర్మితము: అందు స్నానమాడినచో బ్రహ్మలోక ప్రాప్తియగును: తరువాత అమరకంటక తీర్థము: అది దేవతలే నిర్మించినది: దానియందు స్నానముచే రుద్రలోక ప్రాప్తియగును: తరువాత తురా సంగమ తీర్థము: అందలి పంచాయతనమూర్తి దర్శనముచే బ్రహ్మహత్యాదోష నివృత్తియగును: తరువాత వటేశ్వర తీర్థము: దాని దర్శన మాత్రమున జన్మ సాఫల్యమగును: తరువాత వటేశ్వరము: అది సర్వ వ్యాధి నాశకము: అందు స్నానముచే సర్వ దుఃఖ మోచనమగును:

తతో గచ్ఛేత్తు రాజేన్ద్రరావణశ్వర ముత్తమమ్‌. 29

తత్ర స్నాత్వానరో రాజన్త్సర్వపాపైః ప్రముచ్యతే | తతో గచ్చేత్తు రాజేన్ద్ర సదీసజ్గమ ముత్తమమ్‌. 30

సోమతీర్థం తతో గచ్ఛేచ్చన్ద్రక్షేత్ర మనుత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్భక్త్యా పరమయా యుతః.

త్ఞణా ద్దివ్యదేహస్థ శ్శివవన్మోదతే చిరమ్‌ | షష్టివర్షసహస్రాణి శివలోకే మమీయతే. 32

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర పిజ్గళేశ్వర ముత్తమమ్‌ | అహోరాత్రోపవాసేన త్రిరాత్రఫలం మాప్నుయాత్‌. 33

తస్మింస్తీర్థేతు రాజేన్ద్ర కపిలాం యః ప్రయచ్ఛతి | యావన్తి తస్యా రోమాణి తత్రసూతికులేషుచ. 34

తావద్వర్షసహస్రాణి రుద్రలోకే మహీయతే | యస్తు ప్రాణపరిత్యాగం తత్ర కుర్యాన్నరాధిప. 35

అక్షయం మోదతే కాలం యావచ్ఛన్ద్రదివాకరౌ | నర్మదాతటమాశ్రిత్య తిష్ఠేయు ర్యత్ర మానవాః. 36

తే మృతా స్స్వర్గ మాయాన్తి సన్త స్సుకృతినో యథా |

సురేశ్వరం తతో గచ్ఛే న్నామ్నా కర్కోటకేశ్వరమ్‌. 37

గజ్గావతరతే తత్ర దినే పుణ్యన సంశయః | నన్దితీర్థం తతో గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్‌. 38

తుష్యతే తస్య నన్దీశ స్సోమలోకే మహీయతే | తతోద్వీపేశ్వరం గచ్ఛే ద్వ్యాసతీర్థం తపోవనమ్‌. 39

నివర్తితా పురా తత్ర వ్యాసభీతా మహానదీ | హుజ్కారితా తు వ్యాసేన దక్షిణన తతో గతా 40

ప్రదక్షినంతయః కుర్యా త్తస్మింస్తీర్థే నరాధిప | స్వర్గే స మోదతే కాలం యావచ్చన్ద్రదివాకరౌ. 41

వ్యాసస్తత్ర భ##వేత్ప్రీతో వాఞ్చితం లభేత్‌ ఫలమ్‌ | సూత్రేణ వేష్టయిత్వాతు దిపో దేయ స్సవేదికః. 42

క్రీడతే హ్యక్షయం కాలం యథా రుద్ర స్తథైవ సః |

తరువాత రావణశ్వర తీర్థము; అందు స్నానము సర్వపాప మోచకము; తరువాత నదీ సంగమ తీర్థము; తరువాత సోమతీర్థము; ఇది ఉత్తమమగు చంద్రక్షేత్రము; అందు పరమభక్తితో స్నానమాడినవారు తత్‌క్షణమే దివ్య శరీరము నంది అరువదివేల సంవత్సరములు శివుని లోకమందుండి శివుని వలెనే సుఖింతురు; తరువాత పింగళేశ్వర తీర్థము; అచట ఒక అహోరాత్రము ఉపవసించినచో త్రిరాత్రోపవాస ఫలము లభించును; అచట కపిలా గోదానము చేసినచో దాని శరీరమందు కల రోమములన్నివేల సంవత్సరములు రుద్రలోకమున సుఖించును; అచ్చట ప్రాణత్యాగమొనర్చినచో చంద్రసూర్యులున్నంత అనంతకాలము అక్షయ సుఖములందును నర్మదా తీరమంతే నివసించు మానవులు పుణ్యమాచరించినవారు వలెనే మరణానంతరము స్వర్గమందుదురు; తరువాత సురేశ్వర తీర్థము; తరువాత కర్కోటకేశ్వర తీర్థము; అందు పుణ్యదినమున గంగానది దిగివచ్చును; తరువాత నంది తీర్థము అందు స్నానమాడినవారు నందీశ్వరును అనుగ్రహమున సోమలోక ప్రాప్తులగుదురు; తరువాత ద్వీపేశ్వర తీర్థము; తరువాత వ్యాసతీర్థము; అది తపోవనము; అచట వ్యాసుని హుంకారమునకు భయపడి ఆ మహానది దక్షణమునకు మరలెను; దానిని ప్రదక్షిణించినచో చంద్రసూర్యు లున్నంతకాలము స్వర్గమందు సుఖింతురు; వ్యాసానుగ్రహమున వాంచితార్థ ప్రాప్తియగును; వేదికపయి దీపమునుంచి దానికి దారములు చుట్టి దానమిచ్చినచో రుద్రుడువలె అక్షయకాలము సుఖించును.

తతో గచ్ఛత్తు రాజేన్ద్ర ఏరణ్డీతీర్థ ముత్తమమ్‌. 43

సజ్గమేతు నరస్స్నాత్వా ముచ్యతే సర్వకిల్బిషైః | ఐరణ్డీ త్రిషు లోకేషు విఖ్యాతా పాపనాశినీ. 44

అథవా)చా)೭೭శ్వయుజే మాసి శుక్లపక్షస్య చాష్టమీ | వుచిర్బూత్వా నరస్స్నాత్వా సోపవాసపరాయణః. 45

బ్రాహ్మణం భోజయేదేకం కోటి ర్భవతి భోజితా | ఐరణ్డీసజ్గమే స్నాత్నా భక్తిభావనురఞ్జితః 46

మృత్తికాం శిరసి స్థాప్య అవగాహ్యచ వైజలమ్‌ | నర్మదోదకసమ్మిశ్రం ముచ్యతే సర్వకిల్భిషైః. 47

ప్రదక్షిణంతు యఃకుర్యాత్తస్మిం స్తీర్థే నరాధిప | ప్రదక్షిణీకృతా తేన సప్తద్వీపా వసున్దరా. 48

తత స్సువర్ణసలిలే స్నాత్వా దత్వాతు కాఞ్చనమ్‌ | కాఞ్చనేన విమానేన రుద్రలోకే మహీయతే. 49

తత స్స్వర్గాచ్చ్యుతః కాలా ద్రాజా భవతి వీర్యవా9 | తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర హీక్షునద్యాస్తు సజ్గమమ్‌.

త్రైలోక్యవిశ్రుతం దివ్యం తత్ర సన్నిహిత శ్శివః |

తత్ర స్నాత్వా నరో రాజ న్గాణపత్య మవాప్నుయాత్‌. 51

స్కన్దతీర్థం తతో గచ్ఛే త్సర్వపాపప్రణాశనమ్‌ | తత్ర గత్వాతు రాజేన్ద్ర తతస్స్నానం సమాచ రేత్‌. 52

ఆజన్మసఞ్చితం పాపం స్నానమాత్రా ద్వ్యపోహతి | Oతత ఆజ్గిరసం గచ్ఛేత్స్నానం సమాచ రేత్‌. 52

గోసహస్రఫలం తస్య రుద్రలోకే మహీయతే | గణతీర్థం తతో గచ్ఛేత్సర్వపాపప్రణాశనమ్‌ 54

తత్ర గత్వాతు రాజేన్ద్రస్నానం తత్ర సమాచరేత్‌ | గోసహస్రఫలం తస్య శివలోకే మహీయతే. 55

సప్తజన్మకృతైః పాపై ర్ముచ్యతే నాత్ర సంశయః | వటేశ్వరం తతో గచ్ఛే త్సర్వతీర్థ మనుత్తమమ్‌. 56

తత్ర స్నాత్వా నరో రాజ న్గోసహస్రఫలం లభేత్‌ |

తరువాత ఐరండీ (ఉపనదీ) నర్మదా సంగమ తీర్థము; ఇది ఉత్తమము; ఇందు స్నానమాడినచో సర్వపాపముక్తి యగును; త్రిలోక విఖ్యాతమును పాపనాశకమునగు ఇందు ఆశ్వయుజ శుక్లాష్టిమినాడు స్నానమాడి శుచియై ఉపవాసము చేసి ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినను కోటిమందిని భుజింపజేసినట్లగును; భక్తిభావముతో ఐరండీ నర్మదా సంగ

Oలిజ్గసారంతతోగచ్ఛేత్‌.

మము నందు శిరస్సున మృత్తిక ఉంచుకొని స్నానమాడి ఆ సంగమ తీర్థ ప్రదక్షిణము చేసినచో సమస్త భూప్రదక్షిణ ఫలము లభించును; తరువాత సువర్ణ తీర్థము; అందు స్నానమాడి సువర్ణ దానము చేసినచో కాంచన విమానమునపై రుద్రలోకమేగును; అందు సుఖించును; తరువాత స్వర్గమునుండి జారినను వీర్యశాలియగు రాజగును; తరువాత ఇక్షునదీ నర్మదా సంగమ తీర్థము; అది త్రిలోక విఖ్యాతమగునది; శివుడచట సదా సన్నిహితుడై యుండును; అందు స్నానమాడిన వారు గణాధిపతిత్వమందుదురు; తరువాత స్కంద తీర్థము; అది సర్వపాప ప్రణాశకము; అచటికేగి యందు స్నానమాడిన మాత్రమున ఆజన్మ సంచిత పాపము నశించును; తరువాత ఆంగిరస తీర్థము; అందు స్నానమాడినచో సహస్ర గోదాన ఫలమంది రుద్రలోక ప్రాప్తుడగును తరువాత సర్వపాప ప్రణాశనమగు గణతీర్థము; అందు స్నానమాడినవారు సహస్ర గోదాన ఫలమంది శివలోకమున సుఖింతురు. సప్త జన్మకృత పాపములనుండి ముక్తులగుదురు; తరువాత వటేశ్వర తీర్థము; ఇందు స్నానము కూడా పైదానివలెనే ఫలప్రదము.

సజ్గమేశం తతో గచ్ఛే త్సర్వదేవనమస్కృతమ్‌. 57

స్నాతమాత్రో నర స్తత్ర చేన్ద్రత్వం లభ##తే ద్రువమ్‌ | కోటితీర్థం తతో గచ్ఛే త్సర్వపాపహరం పరమ్‌. 58

తత్ర స్నాత్వా నరో రాజ్యం లభ##తే నాత్ర సంశయః |

తత్ర తీర్థం సమాసాద్య దానం దద్యాచ్చ యో నరః. 59

తస్య తీర్ధ ప్రభావేన సర్వం కోటిగుణం భ##వేత్‌ | అథ నారీ భ##వే త్కాచి త్స్నానం తత్ర సమాచరేత్‌. 60

గౌరీతుల్యాభ##వేత్సాపి త్విన్ద్రప్రత్నీ న సంశయః | అజ్గారేశం తతో గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్‌.

స్నాతమాత్రో నర స్తత్ర రుద్రలోకే మహీయతే | అజ్గారకచతుర్థ్యాంతు స్నానం తత్ర స మాచరేత్‌. 62

అక్షయం మోదతే కాల మవిశజ్కితమానసః | అయోనిసజ్గమే స్నాత్వా న పశ్యేద్యోనిసజ్కటమ్‌. 63

పాణ్డవేశంతు తత్రైవ స్నానం తత్ర సమాచరేత్‌ | అక్షయం మోదతే కాల మవధ్యస్తు సురైరపి. 64

విష్ణులోకం తతో గత్వా క్రీడతే భోగసంయుతః | తత్ర భుక్త్వా మహాభాగో న్మర్త్య రాజోభిజాయతే. 65

కఠేశ్వరం తతోగచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్‌ | ఉత్తరాయణసమ్ర్పాప్తో యదిచ్ఛే త్తస్య తద్భవేత్‌. 66

చన్ద్రభాగాం తతో గచ్ఛేత్స్నానం తత్ర సమాచరేత్‌ | స్నాతమాత్రో నర స్తత్ర సోమలోకే మహియతే.

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర తీర్థం శక్రస్య విశ్రుతమ్‌ | పూజితం దేవరాజేన దేవైరపి సమస్కృతమ్‌. 68

తత్ర స్నాత్వా నరో రాజ న్దానం దత్వాతు కాఞ్చనమ్‌ |

అథవా నీలవర్ణాభం వృషభం య స్సముత్సృజేత్‌. 69

వృషభస్యతు రోమాణి తత్ర్పసూతికులేషు చ | తావద్వర్షసహస్రాణి నరో హరపురే వసేత్‌. 70

తత స్వ్సర్గా త్పరిభ్రష్టో రాజా భవతి వీర్యవీ9 | అశ్వానాం శ్వేతవర్ణానాం సహస్రాణం నరాధిప. 71

స్వామీ భవతి మర్త్యేషు తస్య తీర్థప్రభావతః |

తరువాత సర్వదేవ నమస్కృతమగు సంగమేశ తీర్థము; అందు స్నానముచే ఇంద్రత్వము ప్రాప్తించును. తరువాత సర్వపాపహరమును ఉత్తమమునునగు కోటి తీర్థము: అందు స్నానముచే రాజ్య ప్రాప్తియగును; అందు చేసిన దానము కోటిగుణిత ఫలమునిచ్చును; అందు స్నానమాడిన స్త్రీ గౌరి వంటిదియగును: ఇంద్రపత్నియగును: తరువాత అంగారక తీర్థము; అందు స్నానమాడినచో రుద్రలోక ప్రాప్తియు అంగారక చతుర్థీ దినమున స్నామునచే అనంతకాలము సుఖమును కలుగును; అయోని (ఉపనదీ) నర్మదానదీ సంగమమున స్నానమాడిన వారికి యోని సంకటము (పునర్జన్మము) రాదు; తరువాత పాండవేశ తీర్థము: అందు స్నానముచే అక్షయకాల సుఖమును సురలచే కూడా అవధ్యత్వమును విష్ణులోక సుఖమును సుఖానంతరము మర్త్యలోకమున రాజై పుట్టుటయు కలుగును; కఠేశ్వర తీర్థమందు త్తరాయణమున స్నానమాడినవారికి సంకల్పతారథములు సిద్ధించును: తరువాత చంద్రభాగా తీర్థము; అందు స్నానమాత్రము చంద్రలోక ప్రాప్తియగును. తరువాత ప్రసిద్దమగు శక్ర తీర్థము. అది ఇంద్రుడును దేవతలును సనమస్కరించునది. అందు స్నానమాడి సువర్ణదానము చేయుట పుణ్యప్రదము. అందు నీల వృషోత్సర్గము చేసినచో ఆ వృషభమునకును దాని సంతతికిని శరీరములందుకల రోమములన్ని సహస్ర వర్షములు శివపురమున వసించి భోగానంతరము వీర్యవంతుడగు రాజగును. వేయి తెల్లని గుర్రములకు అధిపతియగును.

తతో కచ్ఛేత్తు రాజేన్ద్ర బ్రహ్మావర్త మనుత్తమమ్‌. 72

తత్ర స్నాతత్వా నరో హాజం స్తర్పయే త్పితృదేవతాః | ఉపోష్య రజనీ మేకాం దత్వా యథావిధి.

కన్యాగతే యదాదిత్యే అక్షయం సతతం భ##వేత్‌ | తతో గచ్ఛేత్తు హాజేన్ద్ర కపిలాతీర్థ ముత్తమమ్‌. 74

తత్ర స్నాత్వా నరో రాజ న్కపిలాం యః ప్రయచ్ఛతి |

సమ్పూర్ణాం పృథివీం దత్వా యత్ఫలం తదవాప్నుయాత్‌. 75

నర్మదేశం పరం తీర్థం న భూతం న భవిష్యతి | తత్ర స్నాత్వా నరో రాజ న్నశ్వమేధఫలం లభేత్‌. 76

నర్మదాదక్షిణ కూలే సజ్గమేశ్వర ముత్తమమ్‌ | తత్ర స్నాత్వా నరో రాజ న్త్సర్వయజ్ఞఫలం లభేత్‌. 77

తత స్సర్వగతో హాజా పృథివ్యా మభిజాయతే | సర్వలక్షణ సమ్పూర్ణ స్సర్వవ్యాధినిరవర్జితః. 78

నార్మదే చోతేతరే కూలే తీర్థం పరమశోభనమ్‌ | ఆదిత్యాయతనం రమ్య మీశ్వరేణతు భాషితమ్‌. 79

తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర దానం దత్వాతు శక్తితః | తస్య తీర్థప్రభావేన దత్తం భవతి చాక్షయమ్‌. 80

దరిద్రా వ్యాధితా యేచ యేచ దుష్కృతకర్మణః | ముచ్చన్తే సర్వపాపేభ్యో రవిలోకం ప్రయాన్తితే. 81

మాఘమాసేతు సమ్ప్రాప్తే శుక్లపక్షస్య సప్తమీ | వసే దాయతనే యస్తు నిరాహారో జితేన్ద్రియః. 82

న జరావ్యాధితో మూకో న చాన్దో బధిర స్తథా | సుభగో రూపసమ్పన్న స్త్స్రీణాం భవతి వల్లభః. 83

ఏవం తీర్థం మహాపుణ్యం మార్కణ్డయేన భషితమ్‌ | యే న జానన్తి రాజేన్ద్ర వఞ్చితాస్తే న సంశయః.

గార్గేశ్వరం తతో గచ్ఛే త్స్నానం తత్ర సమాచరేత్‌ |

స్నాతమాత్రో నర స్తత్రస్వర్గలోక మవాప్నుయాత్‌. 85

మోదతే స్వర్గలోకస్ధో యావదిన్ద్రా యావదిన్ద్రా శ్చతుర్దశ | సమీపత స్థ్సితం తస్య నాగేశ్వర తపోవనమ్‌. 86

తత్ర స్నాత్వా తు రాజేన్ద్ర నాగలోక మవాప్నుయాత్‌ | చతుర్భి ర్నాగకన్యాభిః క్రీడతే కాలమక్షయమ్‌. 87

కుబేరభవనం గచ్ఛే త్కుబేరో యత్ర సంస్థితః |

తరువాత బ్రహ్మావర్త తీర్థము; రవి కన్యారాశియందుండగా ఇందు స్నానమాడి ఒక యహోరాత్రము ఉపవసించి యథావిధిగా పతరులకు పిండదానము చేసి తర్పణమిచ్చినచో అక్షయ ఫలము లభించును. తరువాత కపిలా తీర్థము. అందు స్నానమాడి కపిలా గోదానము చేసినచో సంపూర్ణముగా భుమియంతయు దానము చేసినట్లగును; తరువాత నర్మదేశ తీర్థము; దానివంటిది ఇదివరకులేదు; ఇకముందు ఉండదు. అందు స్నానముచే అశ్వమేధ ఫలము లభించును. తరువాత సంగమేశ్వర తీర్థము; అందు స్నానమాడుటచే సర్వయజ్ఞ ఫలము లభించును. ఆ ఫల భోగానంతరము భూలోకమందు సర్వలక్షణ సంపూర్ణుడు ఏ వ్యాధియు లేనివాడునగు హాజై పుట్టును: తరువాత నర్మదో త్తర తీరమున ఆదిత్యాయతన తీర్థము; దీనికి ఈ పేరు ఈశ్వరుడే పెట్టెను. దీనియందు స్నానమాడి యధాశక్తిగ చేసిన దానమును ఆ తీర్థ ప్రభావముచే అక్షయమగును: దరిద్రులును వ్యాధిగ్రస్తులును దుష్కృతమాచరించినవారును దీని స్నానముచే సర్వపాప ముక్తులయి రవి లోక ప్రాప్తులగురురు. మాఘ శుక్ల సప్తమినాడు ఈ తీర్థమున నిరాహారులును జితేంద్రియులునై యుండినవారికి ముసలి తనము వ్యాధి మూగితనము గ్రుడ్డితనము చెవుడు కలుగవు ; వారు రూప సంపన్నులు స్త్రీలకు ప్రీతిపాత్రులునగుదురు; మార్కండేయుడిట్లు వచించిన ఈ తీర్థ మహిమనెరిగి దీనిని సేవింపనివారి జీవతము వంచితము (వ్యర్థమయినట్లే). తరువాత గార్గేశ్వర తీర్థము. దానియందు స్నాన మాత్రమున పదునలుగురింద్రులంతకాలము స్వర్గలోక సుఖము కలుగును; దాని దగ్గరనే నాగేశ్వర తపోవనమను తీర్థము గలదు; అందు స్నానముచే నాగలోక ప్రాప్తుడై నలుగురు నాగకన్యలతో విహరించి సుఖించును కుబేరలోక ప్రాప్తుడునగును.

కాలేశ్వరం పరం తీర్థం కుబేరో యత్రచోషితః. 88

తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర సర్వసమ్పద మాప్నుయాత్‌ |

తతః పశ్చిమతో గచ్ఛే న్మారుతాలయ ముత్తమమ్‌. 89

తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర శుచిర్భూత్వా సమాహిత ః |

కాఞ్చనం చ తతో దద్యా ద్యథాశక్త్యాతు బుద్దిమాన్‌. 90

పుష్పకేన విమానేన వాయులోకం స గచ్ఛతి | యమతీర్థం తతో గచ్ఛే న్మాఘమాసే యుధిష్ఠిర. 91

కృష్ణపక్షే చతుర్దశ్యా స్నామం తత్ర సమాచరేత్‌ |

నక్తం భోజ్యం తతః కూర్యాన్న పశ్యే ద్యోనిజ్కటమ్‌. 92

తతో గచ్ఛేత్తు రాజేన్ద్ర అహల్యాతీర్థ ముత్తమమ్‌ | స్నాతమాత్రో నర స్తత్ర హ్యప్సరోభిః ప్రమోదతే. 93

అహ్యల్యాచ తప స్తప్త్వా తత్ర ముక్తి ముపాగతా | చైత్రమాసేతు సమ్ప్రాప్తే శుక్లపక్షే చతుర్దశీ. 94

కామదేవదినే తస్మి న్నహల్యాం యస్తు పూజయేత్‌ |

యత్ర యత్ర నరోత్పన్నో (న) వర స్తత్ర ప్రియో భ##వేత్‌. 95

స్త్రీవల్లభో భ##వే చ్ఛ్రీమా న్కామదేవ ఇవాపరః | అయోధ్యంతు సమాసాద్య తీర్థం రామస్య విశ్రుతమ్‌. 96

స్నాతమాత్రో నర స్తత్ర సర్వపాపైః ప్రముచ్చతే |

సోమతీర్థం తతో గచ్ఛే త్స్నానం తత్ర సమాచరేత్‌. 97

స్నాతమాత్రో నర స్తత్ర సర్వపాపైః ప్రముచ్చతే | సోమగ్రహేతు రాజేన్ద్ర పాపక్షయకరం నృణామ్‌. 98

త్రైలోక్య విశ్రుతం రాజ న్థ్సోమతీర్థం మహాఫలమ్‌ | యస్తు చాన్ద్రాయణం కుర్యా త్తస్మిం స్తీర్థే నరాధిప.

సర్వపాపవిశుద్దాత్మా సోమలోకం స గచ్ఛతి | అగ్నిప్రవేశే7థ జలే అథవాపి హ్యనశ##కే. 100

సోమతీర్థే మృతో యస్తు నాసౌ మర్త్యే7భిజాయతే | శుభతీర్థం తతోగచ్ఛేత్స్ననం తత్ర సమాచరేత్‌. 101

స్నాతమాత్రో నర స్తత్ర గోలోకేషు మహీయతే | తతో గచ్ఛేచ్చ రాజేన్ద్ర విష్ణుతీర్థ మనుత్తమమ్‌. 102

యోధనీపుర మాఖ్యాతం విష్ణుస్థాన మనుత్తమమ్‌ | అసురా యోధితా స్తత్ర వాసుదేవేన కోటిశః. 103

తత్ర తీర్థం సముత్పన్నం విష్ణుః ప్రీతో భ##వేదిహా | అహోరాత్రోపవాసేన బ్రహ్మహత్యాం వ్యపోహతి. 104

తరువాత కబేర స్థానమగు కాలేశ్వర తీర్థము; అందు స్నానమాడినచో సర్వ సంపదలు కలుగును; తరువాత పశ్చిమమున మారుతాలయ తీర్థము; దానియందు స్నానమాడి శుచియయి సమాహిత చిత్తముతో యథాశ క్తిగ సువర్ణదానము చేసినచో పుష్పక విమానముపై వాయులోకమునకేగును; తరువాత యమ తీర్థము; అందు మాఘ కృష్ణ చతుర్దశినాడు స్నానమాడి నక్త వ్రతము చేసినచో యోని సంకటము కలుగదు; తరువాత ఉత్తమమగు అహల్యా తీర్థము; అందు స్నానమాడినచో అప్సరసలతో సుఖము కలుగును; అహల్యా యచట తపమాచరించి ముక్తినందెను; చైత్ర శుక్ల చరుర్దశి కామదేవతిథి; ఆనాడు అహల్యము పూజించినవాడు తాను పుట్టినచోటనెల్ల ఎల్లరకు ఇష్టుడగును; రెండవ మన్మథుడువలె స్త్రీలకు ప్రీతిపాత్రుడగును అయోధ్యయను (ఒక) గ్రామమునకు దగ్గరగా రామతీర్థమను తీర్థము కలదు; దానియందు స్నానముచే సర్వపాప ముక్తియగును; తరువాత సోమతీర్థము; చంద్రగ్రహణ సమయమున అందు స్నానమాడినంతనే సర్వపాపముక్తియగును; ఇది త్రిలోక విశ్రుతమగు మహాఫలప్రద తీర్థము; ఇందు చాంద్రాయణ వ్రతమాచరించినచో సర్వపాపముక్తుడై సోమలోకమేగును. ఇందు అగ్ని ప్రవేశముచే గాని జలప్రవేశము గాని అనాహార వ్రతముచేగాని ప్రాణత్యాగ మొనర్చినచో మరల మర్త్య లోకమున జన్మించరు. తరువాత శుభతీర్థము; దానియందు స్నానముచే గోలోక ప్రాప్తి యగును; తరువాత మహోత్తమమగు విష్ణుతీర్థము; దీనికే యోధనీపురమరియు పేరు. ఇందు వాసుదేవుడు కొట్టకొలదిగా అసురులతో యుద్దము చేసెను; ఇందుచే ఇది విష్ణు స్థానమగు తీర్థమయ్యెను; ఇందు ఒక అహోరాత్రముపవాసముండినంతనే విష్ణువుడ ప్రీతడయి బ్రహ్మహత్యాదోషమును కూడా పోగొట్టును.

తతో గచ్ఛేత్తురజేన్ద్ర తాపసేశ్వర ముత్తమమ్‌ | హరిణీ వ్యాధసన్ద్రస్తా పతితా యత్ర సా మృగీ. 105

జలే ప్రక్షిప్తగాత్రా తు అన్తిరక్షం గతా చసా | వ్యాధో విస్మితచిత్తస్తు పరం విస్మయ మాగతః. 106

తేన తాపేశ్వరం తీర్థం న భూతం న భవిష్యతి | తతో గచ్ఛేత్తురాజేన్ద్ర బ్రహ్మతీర్థ మనుత్తమమ్‌. 107

అమోహక మిత ఖ్యాతం పితౄంశ్చైవాత్ర తర్పయేత్‌ |

పౌర్ణమాస్యా మమాయాంతు శ్రాద్ధం కుర్యా ద్యథావిధి. 108

తత్ర స్నాత్వా నరో రాజ న్పితృపిణ్డంతు దాపయేత్‌ | గజరూపా శిలా తత్ర తొయమధ్యే ప్రతిష్ఠితా. 109

తస్యాంతు దాపయేత్పిణ్డం వైశాఖ్యాంతు విశేషతః | తృప్యన్తి పితరస్తత్ర యావత్తిష్ఠతి మేదినీ. 110

తతో గచ్ఛేచ్చ రాజేన్ద్ర సిద్దేశ్వర మనుత్తమమ్‌ | తత్ర స్నాత్వా సరో రాజ న్గణపత్యన్తికం వ్రజేత్‌. 111

తతోగచ్ఛేత్తు రాజేన్ద్ర లిజ్గో యత్ర జనార్దనః | తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర విష్ణులోకే మహీయతే. 112

నర్మదాదక్షిణ కూలే తీర్థం పరమశోభనమ్‌ | కామదేవ స్స్వయం తత్ర తపోతప్యత వై మహత్‌. 113

దివ్యం వర్షసమస్రంతు శజ్కరం పర్యుపాసత | సమాధిభజ్గదగ్ధాస్తు శజ్కరేణ మహాత్మనా 114

శ్వేతపర్వా యమశ్చైవ హుతాశ శ్శక్లపర్వణి | ఏతే దగ్ధాస్తు తేసర్వే కుసుమేశ్వర మాస్థితాః. 115

తరువాత తాపసేశ్వర తీర్థము ; వ్యాధునివలన భయపడి ఒక ఆడులేడి ఈ తీర్థజలమందుపడి అంతరిక్షమునకు పోయెను. అది చూచి చిత్తమందా వ్యాధుడాశ్చర్యపడెను; ఇట్టి మహిమకల దీ తాపసేవ్వర తీర్థము; ఇట్టిది ఇదివరకు లేదు. ఇక ముందుండదు; తరువాత అమోహకమను ప్రఖ్యాతిగల బ్రహ్మతీర్థము. ఇది చాల ఉత్తమము; దీనియందు పూర్ణిమా మావాస్యలందు స్నానమాడి యథావిధిగా పితృ శ్రాధ్ధమాచరించి పిండదాన తర్పణములు చేయవలయును; అచ్చట జలమధ్యమున గజరూపమగు శిలప్రతిష్ఠితమయియున్నది; వైశాఖ పూర్ణిమామావాస్యలందు ఇటపితరులకు పిండములు ఇచ్చినచో పితరులకు భూమి (సృష్టి) ఉన్నంతవరకు తృప్తి కలుగును. తరువాత సిద్దేశ్వర తీర్థము. అది చాల ఉత్తమమయినది; ఇందు స్నానమాడినచో గణపతి సాంనిద్యము లభించును. తరువాత లింగతీర్థము; అందు విష్ణువు లింగరూపుడుగా నున్నాడు; దాని యందు స్నానమాడినవాడరు విష్ణులోక ప్రాప్తులుగుదురు. నర్మదా దక్షిణ తీరమందు పరమ శుభకరమగు కుసుమేశ్వరమును తీర్థము కలదు. పూర్వమొకప్పుడు కామదేవుడు (మన్మథుడు) సహస్ర దివ్య వర్షముల కాలము అచ్చట దివ్యమగు మహాతపమాచరించి శంకరుని ఉపాసించెను. కాని ఇతనిచే తనకు సమాధి భంగమయ్యనని కోపించి మహాత్ముడగు శంకురుడు అతనినేకాక అతనితోపాటు శ్వేతపర్వన్‌ (వాయువు) యముడు హుతాశుడు (అగ్ని-వీరిని)కూడా శుక్లపక్షపు పర్వదినమున పూర్ణిమనాడు దహించెను; (వీరిని తాపమందిచెను) వారట్లు దగ్థులయి కూడా (తాపమందుచునే) ఈ కుసుమేశ్వర తీర్థము నాశ్రయించియుండిరి.

దివ్యవర్షసహస్రేణ తుష్ట స్తేషాం మహేశ్వరః | ఉమయా సహితో రుద్ర స్తేషాం తుష్టో వరప్రదః. 116

విమోచయిత్వా తాన్త్సర్వా న్మర్మదాతట మాస్తితః | తస్య తీర్థప్రభావేన పున ర్దేవత్వ మాగతాః. 117

త్వత్ప్రసాదా న్మహాదేవ తీర్థం భవతుచోత్తమమ్‌ | అర్ధయోజనవిస్తీర్ణ తీర్థం దిక్షు సమన్తతః. 118

తస్మింస్తీర్థే నరస్స్నాత్వా చోపవాసవరాయణః | కుసుమాయుధరూపేణ రుద్రలోకే మహీయతే. 119

వైశ్వానరో యమశ్చైవ కామదేవ స్తథా మరుత్‌ | తప స్తప్త్వాతు రాజేన్త్ర పరాం సిద్ధి మవాప్నుయుః. 120

అజ్కోలస్య సమీపేతు నాతిదూరేతు తస్యవై | స్నానం దానంచ తత్రైవ భోజనం పిణ్డపాతనమ్‌. 121

అగ్ని ప్రవేశేథ జలే అథవా చాప్యనాశ##కే | అనివృత్తా గతిస్తస్య మృతస్యాముత్ర జాయతే. 122

త్ర్యమ్భకేనతు తోయేన యశ్చరుం శ్రపయేన్నరః | అజ్కోల్లమూలు దత్వాతు పిణ్డం చైవ యథావిధి. 123

పితర స్తస్యతుష్యన్తి యావచ్చన్ద్రదివాకరౌ | ఉత్తరే త్వయనే ప్రాప్తే ఘృతస్నానం కరోతి యః.

పురుషో వాస్త్రీయోఎ వాపి వసే చ్ఛివపురే శుచిః | సిద్ధేశ్వరస్య దేవస్య ప్రాతః పూజా ప్రకల్పయేత్‌. 125

శుభాం గతి మావాప్నోతి శివలోకే మహీయతే | యదావతీర్ణః కాలేన రూపవా న్త్సుభగో భ##వేత్‌. 126

మర్త్యే భవతి రాజసౌ అసముద్రాన్తగోచరే | క్షేత్రపాలం న పశ్యేద్యో దణ్డపాణిం మహాబలమ్‌. 127

వృథా తస్య భ##వేద్యాత్రా హ్యదృష్ట్వా కర్ణకుణ్డలమ్‌ | ఏత త్తీర్థఫలం జ్ఞాత్వా సర్వదేవా స్సమాగతాః. 128

ముఞ్చన్తి పుష్పవృష్టింతు స్తువన్తి కుసుమేశ్వరమ్‌.

ఇతి శ్రీమత్స్య మహాపురాణ నర్మదామాహాత్మ్యే శూలభేదతీర్థాది మహిమానువర్ణనం నామ నవత్యుత్తరశతతమోధ్యాయః.

వారు అట్లు ఉండగా సహస్ర దివ్య వర్షముల తరువాత రుద్రుడు సంతుష్టుడయి వారికి వరము నీయదలచి ఉమతో కూడి వచ్చెను; శివుడు వారినందరను తాపమునుండి విడిపించి నర్మదా తటమందు అనుగ్రహించెను. ఆతీర్థ ప్రభావమున మరల వారందరు దేవత్వమందిరి. మహాదేవా! నీ ప్రభావమున ఈ ప్రదేశోత్తమము తీర్థమగుగాక యని వారు శివుని వేడి ఆ వరములను కూడా పోందిరి. అది అర్ధయోజన విస్తీర్ణమయి అన్ని దిక్కులందును వ్యాపించి యున్నది; ఇందు స్నానమాడి ఉపవసించినవారు కుసుమాయుధ (మన్మథ) రూపులయి రుద్రలోక సుఖములందుదురు; ఇట్లు మన్మథ వాయు యమాగ్నులు తపస్సిద్దింనదున ప్రదేశము ఈ తీర్థము! దీనికి దగ్గరలో ఉన్న అంకోల వృక్షపు (ఊడుగు చెట్టు) మొదట స్నాన దానములును అచటి త్య్రబంక తీర్థ జలముతో శ్రవణము (పాకము) చేసిన చరువతో బ్రాహ్మణ భోజన పిండ ప్రాదనములును జరిపినచో పితరులకు రవిచంద్రులున్నంత వరకు తృప్తి కలుగును. ఉత్తరాయనమందు ఇచట భగవానునకు ఘృతాభిషేకము జరిపినచో శికలోక ప్రాప్తియగును; ఇచట సిద్ధేశ్వరునకు ప్రాతఃకాల పూజ జరిపినవారు శుభగతినంది శివలోక సుఖములందుదురు: ఆ పుణ్యము ముగిసిన తరువాత భూమికి దిగివచ్చినను రూపవంతుడును స్త్రీలకు ప్రీతిపాత్రుడునునయి సర్వ సముద్రాంతర్గతమగు భూమి కధిపతియగును; ఇచట గల క్షేత్రపాలుని మహాబలుడునగు దంపాణిని కర్ణకుండలుని దర్శింపనివాని యాత్ర వ్యర్థమగును: ఈ కుసుమేశ్వర తీర్థ మాహాత్మ్య ఫలముల నెరిగి సర్వదేవతలు నిటకు వచ్చుచుందురు; దీనిపయి పూలవాన కురియుచుందురు; దీనిని స్తుతించుచుందురు.

ఇది శ్రీమత్య్సమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున శూల భేదాది తీర్థ మహిమాను వర్ణనమను నూట తొంబదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters