Sri Matsya mahapuramu-2    Chapters   

ఏక నవత్యుత్తరశతతమో7ధ్యాయః.

శుక్లతీర్థ మాహాత్మ్యమ్‌.

మార్కణ్డయః : భార్గవేశం తతో గచ్ఛే ద్బగ్నో యత్ర జానర్దనః |

అసురైస్తు మహాయుద్దే మహాబలపరాక్రమైః 1

హుజ్కారితాస్తు దేవేన దానవాః ప్రలయం గతాః | తత్ర స్నాత్వాతు రాజేన్ద్ర సర్వాపాపైః ప్రముచ్యతే. 2

శుక్లతీర్థస్య చోత్పత్తిం శృణు పాణ్డవనన్దన | హిమవచ్ఛిఖరే రమ్యే నానాధుతు విచిత్రితే. 3

తరుణాదిత్యసజ్కా శే తప్తకాఞ్చనసప్రభే | వజ్రస్ఫటిక సోపానే చిత్రవేదిశిలాతలే. 4

జామ్బూనదమయే దివ్యే నానా పుష్పోపశోభితే | తత్రాసీనం మహాదేవం సర్వజ్ఞం ప్రభు మవ్యయమ్‌. 5

లోకానుగ్రాహకం శాన్తం గణబృన్దై స్సమాకుమల్‌ | స్కన్దనన్దిమహాకాళై ర్వీరభద్రగణాదిభిః 6

ఉమయా సహితం దేవం మార్కణ్ఢః పర్యపృచ్ఛత | దేవదేవ మహాదేవ బ్రహ్మవిష్ణ్విన్ద్రసంస్తుత. 7

సంసారబభీతోహం సుఖోపాయం బ్రవీహిమే | భగవ న్భూతభ##వ్యేశ సర్వపాప్రణాశనమ్‌ 8

తీర్థానాం పరమం తీర్థం తద్వదస్వ మహేశ్వర |

ఈశ్వరః : శృణు విప్ర మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద. 9

స్నానాయ గచ్ఛ సుభగ ఋషిసజ్ఘై స్సమావృతః | మన్వత్రికశ్యపా శ్చైవ యాజ్ఞవల్క్యోశనాజ్గిరాః. 10

యమాపస్తమ్బసంవర్తాః కాత్యాయన బృహస్పతీ | నారదో గౌతమశ్చైవ సేవన్తే దర్శకాజ్ఞిణః. 11

గజ్గాం కనఖలం పుణ్యం ప్రయాగం పుష్కరం గయామ్‌ |

కురుక్షేత్రం యథా పుణ్యం రాహుగ్రస్తే దివాకారే. 12

దివా వా యది వా రాత్రౌ శుక్లతీర్థం మహాఫలమ్‌ | దర్శనా త్స్పర్శనాచ్చైవ స్నానా ద్దానా త్తపోజపాత్‌.

హోమాచ్చైవోపవాసాచ్చ శుక్లతీర్థం మహాఫలమ్‌ | శుక్లతీర్థం మహాపుణ్యం నర్మదాయాం వ్యవస్ఠితమ్‌. 14

నూట తొంబది ఒకటవ అధ్యాయము.

శుక తీర్థ మాహాత్మ్యము.

మార్కండేయుడిట్లు చెప్పెను: తరువాత భార్గవేశ తీర్థము; అచ్చట విష్ణువు మహాబల పరాక్రములగు దానవులతోడి యుద్దమున వారి చేతితో ఓడెను. పిమ్మట అతని హుంకారముచే వారు నశించిరి; అందు స్నానమాడినచో సర్వ పాప ముక్తుడగును; ఇక శుక్ల తీర్థోత్పత్తి తెలిపెదను వినుము. నానా గైరిక ధాతువులతో విచిత్ర రూపమును బాల సూర్యసమానమును కాచిన బంగారు వన్నె కలదియు వజ్రస్ఫటికమణి సోపానములు కలదియు చిత్ర శిలాతలములతో కట్టిన యరుగులు కలదియు బంగారుతో చేయబడినదియు నానా పుష్పోప శోభితమునునగు హిమవత్పర్వత శిఖరమునందు సర్వజ్ఞుడును ప్రభుడును అవ్యయుడును లోకానుగ్రహ కర్తయు శాంతుడును స్కందనంది మహాకాళ వీరభద్రాది ప్రమథ గణపతులతోను ఉమతోనుకూడి కొలువు తీరినవాడునగు మహాదేవుని మార్కండేయు డిట్లడిగెను: దేవదేవా! మహాదేవా! బ్రహ్మ విష్ణ్వింద్రాదులచే స్తుతించబడువాడా! భగవన్‌ ! భూతభవిష్యద్వర్తమాన ప్రభూ! మహేశ్వరా! సంసార భీతుడనయిన నాకు సర్వపాప నాశనమునకు సుఖోపాయమగు ఉత్తమ తీర్థమేదియో తెలుపుము. అనగా ఈశ్వరుడిట్లనె: విప్రా! మహాప్రాజ్ఞాః సర్వశాస్త్ర విశారదా! సుందరుడా ! (నాకు ప్రియమగువాడా!) మనువు అత్రి కశ్యపుడు అంగిరుడు యాజ్ఞవల్క్యుడు శుక్రుడు యముడు అపస్తంబుడు సంవర్తుడు కాత్యాయనుడు బృహస్పతి నారదుడు గౌతముడు ఇట్టి ధార్మికులందరును సేవించునదియు నర్మదా నదియందిలిదియు నగు శుక్ల తీర్థమునకు ఋషి సంఘములతో కూడిపోయి సేవింపుము; ఇది గంగా కనఖల ప్రయాగ పున్కరగయా కురుక్షేత్రములవలెనే పుణ్య ప్రదము; సూర్యగ్రహణ సమయమందును పగలుకాని రాత్రికాని ఎపుడయినను దానిని దర్శించినను న్పృశించినను అందు స్నానమాడినను దాన జపతపములు హోమము ఉపవాసము చేసినను మహా పుణ్య ఫలమబ్బును.

చాణక్యో నామ రాజర్షి స్సిద్ధం తత్ర సమాగతః | ఏతత్ఞేత్రం సముత్పన్న యోజనం వృత్తసంస్థితమ్‌. 15

శుక్లతీర్థం మహాపుణ్యం సర్వపాపప్రణాశనమ్‌ | పాదపాగ్రేణ దృష్టేన బ్రహ్మమత్యాం వ్యపోహతి. 16

*జలస్య దృష్టిమాత్రేణ భ్రూణహత్యాం వ్యపోహతి | అహం తత్ర ఋషిశ్రేష్ఠ తిష్ఠామి హ్యుమాయా సహ.

*జగతీదర్శనాచ్చైవ.

.వైశాఖే మాఘమాసేతు కృష్ణపక్షే చతుర్దశీ | కైలాసాచ్చాపి నిష్క్రమ్య తత్ర సన్నిహితో హ్యహమ్‌. 18

దైత్యదానవగన్ధర్వా స్సిద్ధవిద్యాధరా స్తథా | గణాశ్చాప్సరసో నాగా స్సర్వే దేవా స్సమాగతాః. 19

గగనస్థాస్తు తిష్ఠన్తి విమానైస్సార్వకామికైః | శుక్లతీర్థంతు రాజేన్ద్ర హ్యాగతా ధర్మాకాజ్ఞిణః. 20

రజకేన యథా వస్త్రం శుక్లం భవతి వారిణా | ఆజన్మసఞ్చితం పాపం శుక్లంతీర్థం వ్యపోహతి. 21

స్నానం దానం మహాపుణ్యం మార్కణ్డ ఋషిసత్తమ | శుక్లతీర్థా త్పరం తీర్థం న భవిష్యతి భూతలే. 22

పూర్వే వయసి కర్మాణి కృత్వా పాపాని మానవః | అహోరాత్రోపవాసేన శుక్లతీర్థం వ్యపోహతి. 23

తపసా బ్రహ్మచర్యేణ యజ్ఞైర్దానేనవా పునః | దేవార్చనేన యా తుష్టి ర్న సా క్రతుశ##తైరపి. 24

అచట చాణక్యుడను రాజర్షి సిద్ధి పొందెను; యోజన వైశాల్యముతో వృత్తముగా ఈ తీర్థ క్షేత్రమున్నది; ఇది సర్వపాప నాశకమును మహాపుణ్య ప్రదమును. ఇందలి చెట్టుకొన చూచినను బ్రహ్మహత్య తొలగును; దీని జలమును చూచినంతనే భ్రూణ హత్యాపాపము తొలగును; వైశాఖ మాఘ కృష్ణ చతుర్దశులందు కైలాసమునుండి వచ్చి నేనచట ఉమతోకూడి సన్నిహితుడనై యుందును; అపుడు దైత్యదానవ గంధర్వసిద్ధ విద్యాధరాప్పరో నాగులందరును సర్వకామ భోగ ప్రదములగు కామ గమన విమానములపై గగనమున నిలుతురు; ఆ తీర్థము తన కడకు వచ్చిన ధర్మికుల ఆ జన్మనంచిత పాపములను రజకుడు వస్త్రపు మురికిని కడిగి దానిని శుక్ల మొనర్చినట్లు శుద్ద పరుచును; ఇంతకు మించిన తీర్థము ఇది వరకు లేదు; ఇక ముందుండదు; మానవుడు బాల్యమున చేసిన పాపములన్నియు ఇందు ఒక అహోరాత్రమున వసించినంతనే నశించును; ఇందు తపమో బ్రహ్మచర్యమో యజ్ఞమో దానమో దేవార్చనమో చేయుటచే కలుగు భగవత్ప్రీతి వేరొకచోట వందల కొలదిగా యజ్ఞములు చేసినను కలుగదు;

పుణ్య కార్తికమాసేతు కృష్ణపక్షే చతుర్దశీ | ఘృతేన స్నాపయే ద్దేవ ముపోష్య పరమేశ్వరమ్‌. 25

ఏకవింశకులోపేతో న చ్యవే దైశ్వరా త్పదాత్‌ | శుక్లతీర్థం మహాపుణ్య మృషిసిద్ధై ర్ని షేవితమ్‌. 26

తత్ర స్నాత్వా నరో రాజ న్న పునర్జన్మభా గ్భవేత్‌ |

స్నాత్వా వై శుక్లతీర్థేతు హ్యర్చయే ద్వృభధ్వషజమ్‌. 27

కపాలపూరణం కృత్వా తుష్యత్యత్ర మహేశ్వరః | అర్ధనరీశ్వరం దేవం పటస్థం యో లిఖాపయేత్‌. 28

శజ్ఖతూర్యనినాదైశ్చ బ్రహ్మఘోషైశ్చ సద్ద్విజైః | జాగరం కారయేత్తత్ర నృత్యగీతాది మజ్గళైః. 29

ప్రభాతే శుక్లతీర్థేతు స్నానం వై దేవతార్చనమ్‌ | ఆచార్యా న్భోజయే త్పశ్చా చ్ఛివవ్రతపరా ఞ్చుచీ9. 30

దక్షిణాం చ యథాశక్త్యా విత్తశాఠ్యం న కారయేత్‌ | ప్రదక్షిణం తతః కృత్వా శ##నై ర్దేవాన్తికం వ్రజేత్‌.

ఏవం వై కురుతే యస్తు తస్య పుణ్యఫలం శృణు | దివ్యం విమానం చారూఢ స్త్సూయమానో7ప్సరోగణౖః.

శివతుల్యబలోపేత స్తిష్ఠత్యాబూతసవ్ల్పువమ్‌ | శుక్లతీర్థేతు యా నారీ దదాతి కనకం శుభమ్‌. 33

ఘృతేన స్నాపయే ద్దేవం కుమారం చాపి పూజయేత్‌ |

ఏవం యా కురుతే భక్త్యా తస్యాః పుణ్యఫలం శృణు. 34

మోదతే దేవలోకస్థా యావదన్ద్రా శ్చతుర్దశ | పౌర్ణమాస్యాం చతుర్దశ్యాం సజ్ర్కౌన్తౌ విషువే తథా. 35

స్నాత్వాతు సోపవాసస్స న్విజితాత్మా సమాహితః | దానం దద్యా ద్యథాశక్త్యా ప్రీయేతాం హరిశజ్కరౌ. 36

శుక్లతీర్థప్రభావేన సర్వం భవతి చాక్షయమ్‌ | అనాథం దుర్గతం విప్రం నాథవన్త మథాపివా . 37

ఉద్వాహయతి యస్తీర్థే తసయ పుణ్యఫలం శృణు | యావత్తద్రోమసజ్ఖ్యాచ తత్ప్రసూతికూలేషుచ. 38

. వైశాఖే చైత్రమాసే తు.

తావద్వర్ష సహస్రాణి శివలోకే మహీయతే. 38u

ఇతి శ్రీమత్య్స మహాపురాణ నర్మదామాహాత్మ్యే శుక్లతీర్థమహిమానువర్ణనం నామ ఏకనవత్యుత్తర శతతమోధ్యాయః.

పుణ్యకరమగు కార్తిక కృష్ణ చతుర్దశి నాడు ఆ తీర్థమందుపవసించి పరమేశ్వరునకు నేతితో అభిషేకము జరిపినచో అతని ఇరువది యొక తరములవారు శివలోక ప్రాప్తులగుదురు; మహా పుణ్య ప్రదమును ఋషి సిద్ధ నిషేవితమునగు ఈ తీర్థమున స్నానముచే పునర్జన్మ ముండదు; ఇచట వృషభ ధ్వజునర్చించి అచటనున్న బ్రహ్మకపాలమును పుష్పాదులతో నింపినచో శివుడు సంతుష్టుడగును; వస్త్రముపై అర్ధనారీశ్వరమూర్తిని లిఖింపచేసి అర్చించవలెను; శంఖ తూర్యధ్వనులతోను బ్రాహ్మణుల వేద ధ్వనులతోను నృత్య గీతాది మంగళములతోను జాగరణము చేయవలయును; ప్రభాతమున ఆ తీర్థమున స్నానమాడి దేవతా పూజలు జరిపి శివవ్రత పరులు శుచులునగు ఆచార్యులను భుజింపజేసి యథాశక్తిగ వారికి దక్షిణలనిచ్చి వారిని ప్రదక్షిణించవలెను. తరువాత దేవుని దర్శింప పోవలెను; ఇట్లు చేసినవారు దివ్య విమానమారోహించి అప్సరోగణములు స్తుతించుచుండ శివలోకమేగి శివునితో సమానముగ ఆయా బలగములతో కూడి కల్పాంతము వరకు అందు సుఖింతురు. శుక్త తీర్థమునందు సువర్ణ దానముచేసి శివునకు నేతియభిషేకము జరిపించి కుమారస్వామి నర్చించిన స్త్రీ పదునలుగు రింద్రులున్నంత కాలము స్వర్గమున సుఖించును; పూర్ణిమ చతుర్దశి సంక్రాంతి విషువములు- వీటియందు ఇచట స్నానమాడి ఉపవసించి జిత మనస్కుడై శ్రద్ధాయుక్తుడై యథాశక్తిగ దానము చేసినచో హరి శంకరులకు ప్రీతి కలుగును. శుక్ల తీర్థ ప్రభావమున ఆ పుణ్యఫలము అక్షయమగును; దరిద్రుడును అనాధుడో సనాధుడోయగు విప్రునకిచట పెండ్లి జరిపించినచో ఆ విప్రుని శరీరమందును అతిని వంశము వారి శరీరములందును కల రోమములన్ని వేల సంవత్సరములు శివలోకమందు సుఖించును.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున నర్మదా మాహాత్మ్యమున శుక్తతీర్థ మహిమాను వర్ణనమను నూటతొంబది ఒకటవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters