Sri Matsya mahapuramu-2    Chapters   

ఏకోత్తరద్విశతతమోధ్యాయః.

అగ స్త్యవంశాను కీర్తినమ్‌.

మత్స్యః అతః పర మగస్త్యస్య వక్ష్యే వంశోద్భవా న్ద్విజా& |

అగస్త్యశ్చ కరమ్భశ్చ కౌసల్యః కరట స్తథా. 1

సుమేధసో మయోభువ స్తథా గాన్దారకాయణాః | పౌలస్త్యాః పౌలహాశ్చైవ క్రతువంశభవా స్తథా. 2

ఆర్షేయాభిమతాశ్చైషాం సర్వేషాం ప్రవరాశ్శుభాః| అగస్త్యశ్చ మహేన్ద్రశ్చ ఋషిశ్చైవ

మయోభువః. 3

పరస్పర మవైవాహ్యా ఋషయః పరికీర్తితాః పౌర్ణమాసాః పురాణాశ్చ ఆర్షేయాః పరికీర్తితాః. 4

అగస్త్యః పౌర్ణమాసశ్చ పారణశ్చ మహాతపాః |

పరస్పర మవైవాహ్యాః పౌర్ణమాసాస్తు పారణౖః. 5

ఏవ ముక్తో ఋషీణాం తు వంశ ఉత్తమ పౌరుష ః| అతః పరం ప్రవక్ష్యామి కిం భవా నద్య కథ్యతామ్‌. 6

మనుః పులహస్య పలస్త్యస్య క్రతోశ్చైవ మహాత్మనః |

అగ స్త్యస్య తథాప్యేవం కథం వంశ స్త దుచ్యతామ్‌. 7

మత్స్యః క్రతుః ఖల్వనపత్యోభూ ద్రాజ న్వైవస్వతే న్తరే |

ఇధ్మవాహం స పుత్త్రత్యే జగ్రాహ ఋషిసత్తమః. 8

అగస్త్య పుత్త్రం ధర్మజ్ఞ మాగస్త్యాః క్రతవస్తతః| పులహస్య తథా పుత్త్రా స్త్రయశ్చ

పృథివీపతే. 9

తేషాం జన్మచ వక్ష్యామి హ్యుత్తరత్ర యథావిధి| పులహస్తు వ్రజాం దృష్ట్వా నాతిప్రీతిమనా స్స్వకామ్‌. 10

అగస్త్యజం దృఢాస్యంతు పుత్త్రేత్వే కృతవాం స్తతః| పౌలహాస్చ తథా రాజ న్నాగస్త్యాః పరికీర్తితాః. 11

పులస్త్యాన్వయసమ్భూతా న్దృష్ట్వా రక్షస్సముద్భవా& |

ఆగస్త్యస్యం సుతం ధీమా న్పుత్త్రత్వే వృతవాం స్తతః. 12

పౌలస్త్యాశ్చ తథా రాజ న్నగస్త్యాః పరికీర్తితాః |

సగోత్రద్వా దిమే సర్వే పరస్పర మనన్వయాః. 13

ఏతే తవోక్తాః ప్రవరా ద్విజానాం మహానుభావా నృప వంశకారాః |

యేషాం తు నామ్నా పరికీర్తితేన పాపం సమగ్రం పురుషో జహాతి. 14

ఇతి శ్రీ మత్స్యమహాపురాణ గోత్రప్రవరాముకీర్తినే అగస్త్యగోత్రప్రవర

వివిరణం నామ ఏకోత్తరద్విశతతమోధ్యాయః.

రెండు వందల ఒకటవ అధ్యాయము

అగస్త్యగోత్ర ప్రవరాను కీర్తనము.

మత్స్య జనార్ధనుడు వై వస్వతమనువునకు ఇట్లు చెప్పెను: అగస్త్యుడు కరంభుడు కౌసల్యుడు కరటుడు సుమేధసులు మయోభువులు గాంధారకాయణులు పౌలస్త్యులు పౌలహులు క్రమవంశభవులు- ఈ ఋషులు (గోత్రముల వారల)కు అగస్త్యుడు మహేంద్రుడు మయోభువుడు అనువారు ప్రవరఋషులు :వీరు తమలో తాము వివాహాసంబంధములు చేసి కొనరాదు.

పౌర్ణమాసులు పురాణులు అను ఋషుల (గోత్రముల వారల)కు అగస్తుడు పౌర్ణమాసుడు పారణుడు అను ముగ్గురు ప్రవరఋషులు; వీరు తమలో తాము వివాహనంబంధములు చేసికొనరాదు.

ఇట్లు చెప్పి మత్స్యనారాయణుడు నీకింతవరకును ఉత్తమ పురుషులతో ఏర్పడిన ఋషుల వంశమును తెలిపితిని; ఇకమీదట మరి ఇంకేమి చెప్పుదునన మనువు- పులస్త్య "పులహక్రతువుల వంశములకు కూడ అగస్త్య వంశమను పేరేల వచ్చెనో తెలుపుము. "అనెను. మత్స్యుడిట్లు చెప్పెను:

వైవస్వతమన్వంతరమున క్రతుప్రజాపతి అనవత్యుడై అగస్త్య పుతత్త్రుడును ధర్మజ్ఞుడనగు ఇధ్మవాహుని తన కుమారినిగా గ్రహించెను. ఇందుచే క్రతు సంతతి వారును అగస్త్యులయిరి.

పులహుని పుత్త్రులు ముగ్గురు; వారి విషయమున ఇకముందు చెప్పెదను. ఏమయినను వారి విషయము పులహునకు మన న్తృప్తి కలుగక అగస్త్యుని కుమారుడగు దృఢాస్యుని తన కుమారునిగా తీసికొనెను. అందుచే ఈ పుల హుని సంతతి వారును ఆగస్త్యులయిరి.

పులస్త్యుడు వంశమువారు రక్షోజాతి యగుట చూచి అగస్త్యుని కుమారుని (ఒకనిని) తన కుమారునిగా చేసి కొనెను. అంతటి నుండి పులస్త్యుని సంతతివారును ఆగస్త్యులయిరి.

ఇట్లు వీరందరును నగోత్రులు కావున వీరు తమలో తాము వివాహసంబంధములు చేసికొనరాదు.

మహానుభావులును గోత్రకారులునునగు విప్రఋషులు పేర్కొంటిని; వీరి నామములు స్మరించినను పాపముక్తి యగును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున అగన్త్యగోత్ర ప్రవరాను కీర్తనము- గోత్రప్రవరాను

కీర్తన సమాప్తియను రెండువందల ఒకటవ అధ్యాయము

Sri Matsya mahapuramu-2    Chapters