Sri Matsya mahapuramu-2    Chapters   

సప్తోత్తరద్విశతతమోధ్యాయః.

సావిత్య్రుపాఖ్యానప్రారమ్భః.

సూతః: తత స్స రాజా దేవేశం పప్రచ్ఛామిత విక్రమః |

పతి వ్రతానాం మాహాత్మ్యం తత్సమ్బద్ధాం కథాం మపి. 1

మనుః : పతివ్రతానాం కా శ్రేష్ఠా కయా మృత్యుః పరాజితః |

నామఙ్కీర్తనం కస్యాః కీర్తనీయం సదా నరైః. 2

సర్వపాపక్షయకర మిదానీం కథయస్వ మే |

మత్స్యః: వైలోమ్యం ధర్మరాజోపి నాచరత్యథ యోషితామ్‌. 3

పతివ్రతానాం ధర్మజ్ఞ పూజ్యా స్తస్యామి తా స్సదా| అత్ర తే వర్ణయిష్యామి కథాం పాపప్రణాశనీమ్‌. 4

యథా విమోక్షిణో భర్తా మృత్యుపాశా ద్యత స్త్స్రియా | మద్రేషు శాకలో రాజా బభూవాశ్వపతిః పురా. 5

అపుత్త్ర స్తప్యమానోసౌ పుత్త్రార్థీ సర్వకామదామ్‌| ఆరాధయతి సావిత్రీం రక్షితాం సద్ధ్విజోత్తమైః. 6

సిద్దార్థకై ర్హూయమానాం సావిత్రీం ప్రత్యహం ద్విజైః| శతసఖ్ఖ్యైశ్చతుర్థ్యాం తు దశమాసగతే దీనే. 7

కాలేతు దర్శయామాస స్వాం తనుం మనుజేశ్వరమ్‌ |

సావిత్రీ :రాజ న్భక్తోసి మే నిత్యం దాస్యామి త్వాం సుతాం సదా. 8

తాం దత్తాం మత్ప్రసాదేన పుత్త్రీం ప్రాప్స్యసి శోభనామ్‌ | ఏతావదుక్త్వా సా రాజ్ఞః ప్రణతసై#్యకపార్థివ. 9

జగామాదర్శనం దేవీ యథావై నృప చఞ్చలా| మాలతీ నామ తస్యాసీ ద్రాజ్ఞః పత్నీ పతివ్రతా. 10

సుషువే తనయాం సా చ సావిత్రీమివ రూపతః| సావిత్య్రా ప్రీతయా దత్త తద్రూపసదృశీ తథా. 11

సావిత్రీ చ భవత్వేషా జగాద నృపతి ర్ద్విజా& | తమాశ్రావ్య ద్విజశ్రేష్టా స్సావిత్రీతి నృపోత్తమ. 12

రెండు వందల ఏడవ అధ్యాయము.

సావిత్ర్యుపాఖ్యానము - సావిత్రీ సత్యవంతునితో వనమునకు పోవుట.

సూతుడు ఋషులకు ఇట్లు చెప్పెను: అనంతరము అమిత విక్రముడగు మనురాజు పతివ్రతల మాహాత్య్మమును తత్సంబంధినియగు కథను తెలుపుమని దేవేశుడగు మత్స్యుని ఇట్లడిగెను: పతివ్రతలతో శ్రేష్ఠ ఎవరు? ఏ పతివ్రత మృత్యువును జయించెను? ఏ పతివ్రతా నామమును నరులు సదా కీర్తించదగును? సర్వ పాపక్షయకరమగు ఈ విషయమును నాకు తెలుపుము. అనగా మత్స్యుడు ఇట్లు చెప్పెను; ధర్మరాజు కూడ పతివ్రతలగు స్త్రీలకు ప్రతికూలమాచరించడు; ధర్మజ్ఞా! అతనికి కూడ వారు పూజ్యులే; ఈ విషయమున నీకు పాప ప్రణాశనమును స్త్రీ తన భర్తను మృత్యు పాశము నుండి విడిపించిన తీరును తెలుపునదియునగు కథు తెలుపుదును; పూర్వము మద్రదేశములందు శాకల వంశమున అశ్వపతియను రాజుండెను; అతడు అపుత్త్రుడై సంతాపమందుచు పుత్త్రార్థియై సర్వకామ ప్రదాయినియు ద్విజులచే రక్షించ (ఆరాధించ) బడునదియునగు సావిత్రి నారాధించెను; నూరుమంది ద్విజులు పది మాసములపాటు తెల్లని ఆవలతో ఆమె నుద్ధేశించియజించిన తరువాత ఒక చతుర్థీ తిథినాడు ఆమె రాజునకు సాక్షాత్కరించెను; రాజన్‌! నీవు నిరంతరముగా నాకు భక్తుడవయియుంటివి; నీకు ఉత్తమయగు పుత్త్రిని ఇత్తును; ఇట్లు నా ప్రసాదముచే ఈయబడిన శోభనయగు పుత్త్రిని నీవు పొందగలవు; ప్రణతుడగు ఆ రాజుతో ఈ మాత్రము చెప్పి ఓ మను చక్రవర్తీ! ఆ దేవి మెరుపువలె అదృశ్య అయ్యెను; ఆ రాజునకు మాలతియను పతివ్రతయగు పత్ని యుండెను! ఆమె రూపమున సావిత్రీ దేవిని పోలు సుతను కనెను; సావిత్రిచే ప్రీతితో ఈయబడిన సుత ఆమెవలె రూపవతి యగుట ఉచితమేకదా! అందుచే ఈమె పేరు సావిత్రి అగుగాకయని నృపతి విప్రులతో ననెను; వారును ఆమె పేరు సావిత్రియని అంగీరించిరి.

దృష్ట్వా తాం ¸°వనోపేతాం దదౌ సత్యవతే పితా| నారదస్తు తతః ప్రాహ రాజానం దీప్తతేజనమ్‌. 13

క్షీణాయు స్సతు వర్షేణ భవిష్యతి నృపాతృజః| సకృత్కన్యా ప్రదీయేత చిన్తయిత్వా నరాధిప. 14

తథాపి ప్రదదౌ కన్యాం ద్యుమత్సేనాత్మజే శుభే| సావిత్య్రపి చ భర్తార మాసాద్య నృపమన్దిరే. 15

నారదస్య తు వాక్యేన దూయమానా పతివ్రతా | శుశ్రూషాం పరమాం చక్రే భర్తృశ్వశురయో ర్వనే. 16

రాజ్యభ్రష్ట స్సభార్యస్తు నష్టచక్షు ర్నరాధిపః | న తుతోష సమాసాద్య రాజపుత్త్రీం సదా స్నుషామ్‌. 17

చతుర్థేహని మర్తవ్యం తథా సత్యవ్రతా ద్విజాః| శ్వశురేణాభ్యనుజ్ఞాతా తదా రాజసుతాపి సా.18

చక్రే త్రిరాత్రం ధర్మజ్ఞా ప్రాప్తే తస్మిం స్తదా దినే | చారుపుష్పఫలాహార స్సత్యవాంస్తు య¸° వనమ్‌. 19

శ్వశురేణాభ్యనుజ్ఞాతా యాచనాభఙ్గభీరుణా| సావిత్య్రపి జగామార్తా సహ భర్త్రా మహద్వనమ్‌. 20

చేతసా దూయమానేన గూహమానా మహద్భయమ్‌ | వనే పప్రచ్ఛ భర్తారం ద్రుమచ్ఛాయాశ్రితం తదా. 21

ఆశ్వాసయామాస స రాజపుత్త్రీ క్లాన్తాం వనే పఙ్కజపత్రనేత్రామ్‌ |

సన్దర్శనే నాథ ద్రుమద్విజానాం తథా మృగాణాం విపినే నృవీరః. 22

ఇతి శ్రీమత్స్య మహాపురాణ సావిత్య్రుపాఖ్యానే సావిత్రీ సహితసత్యవతో

వనప్రాస్థానికో నామ సప్తోత్తరద్విశతతమోధ్యాయః.

ఆమె ¸°వనవతి యగుటచూచి తండ్రి ఆమెను సత్యవంతునకిచ్చెను; తరువాత నారదుడు దీ ప్తజేతస్కుడగు ఆ రాజుతో ఈ నృప పుత్త్రుడు ఇక సంవత్సరములో క్షీణాయుడు (మృతుడు) అగును; రాజా !కన్యను బాగుగా ఆలోచించియే (వరునకు) ఈయవలెను అనెను; అయినను అనరాధిపుడు శుభుడు అని ఆద్యుమత్సేన పుత్త్రునకు (సత్యవంతునకు) తన కన్యనిచ్చెను; సావిత్రియును తనభర్త దగ్గరకుపోయి ఆద్యుమత్సేన రాజగృహమున (నగరమందు కాదు) వనమందే. తాను నారద వచనములతో మనస్సునందు బాధపడుచుండియు -అత్తమామలకు శుశ్రూష చేయుచుండెను; నరాధిపుడగు ద్యుమత్సేనుడు రాజ్యభ్రష్టుడును కండ్లులేని వాడునునై రాజపుత్త్రియగు ఈ కోడలిని పొందియు సంతుష్టుడు కాకపోయెను; (ఈమెయు తమతో పాటు క్లేశపడుచున్నందులకతడు బాధనందుచుండెను;) ఋషులారా! ఇక నాలుగవ వాడు సత్యవంతుడు మరణించుననగా ఆ రాజపుత్త్రి సావిత్రి ధర్మజ్ఞ కావున మూడహోరాత్రములు ఉపవసించెను; ఇక ఆ (నాలుగవ) దినమున ఆమె మోనోహరములగు పూలుదాల్చి ఫలములు తిని వనమునకు పోయెను; అడిగినది కాదనినచో ఆమె ఏమనుకొనునో యని భయపడు మామగారి అనుమతితో సావిత్రి ఆర్త అయియు తన మనస్సుందలి మహభయమును బయలుపడనీయక బాధనందు మనస్సుతోనే భర్తతో కలిసి మహా వనమునకు పోయెను; వనమందామె వృక్షచ్ఛాయ నాశ్రయించి కూర్చున్న భర్తను (మీకు ఎట్లున్నదని) అడిగెను; నృవీరుడను అతడును వనమందుండి శ్రమనందిన పంకజ పత్త్ర నేత్రయగు ఆ రాజపుత్త్రిని ఆమెకు వనమందలి వృక్షములను చూపుచు ఓదార్చెను; (మనస్సునకుల్లాసము కలిగించెను.)

ఇది శ్రీమత్స్యమహాపురాణము సావిత్య్రుపాఖ్యానము సావిత్రితో కూడి సత్యవంతుడు

వనముకేగుటయను రెండువందల ఏడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters