Sri Matsya mahapuramu-2    Chapters   

దశో త్తర ద్విశతతమోద్యాయః.

సావిత్య్రుపాఖ్యానే - సావిత్రీయమ సంవాదే - సావిత్య్రై యమదత్త

ద్వితీయ వరలాభః.

సావిత్రీః కుతః క్లేశః కుతో దుఃఖం సద్భి స్సహ సమాగమే |

సతాం తస్మా న్న మే గ్లాని స్త్వత్సమీపే సురోత్తమః. 1

సాధూనాం వాప్యసాధూనాం సన్త ఏవ సదా గతిః| నైవాసతాం నైవ సతా మసన్తో నైవ చాత్మనః. 2

విషాగ్నిశత్రుశ##స్త్రేభ్యోన తథా జాయతే భయమ్‌| అకారణం జగద్వైరిఖలేభ్యో జాయతే యథా. 3

నన్తః ప్రాణా న్పరిత్యక్త్వా పరార్థం కుర్వతే యథా | తథాసన్తోపి సన్త్యజ్య పరపీడాసు తత్పరాః. 4

త్యజత్యసూ నయం లోక స్తృణవ ద్యస్య కారణాత్‌ | పరోపఘాతశ క్తా స్తం పరలోకం తథాసతః 5

నికాయేషు నికాయేషు తథా బ్రహ్మా జగద్గురుః | అసతా ముపఘాతాయ రాజా న కృతవా న్త్స్వయమ్‌. 6

నరా న్పరీక్షయే ద్రాజా సాధూ న్త్సమ్మానయే త్సదా| నిగ్రహం చాసతాం కుర్యా త్స లోకే లోకజిత్తమః. 7

రక్షణార్థా యథా ధాన్యం వర్ధయన్తే తథా ప్రజాః| నిగ్రహేణాసతాం రాజా సతాం చ పరిపాలనాత్‌. 8

ఏతావదేవ కర్తవ్యం రాజ్ఞా స్వర్గమభీప్సునా| రాజకృత్యం హి లోకేషు నాస్త్యన్య జ్జగతాం పతే. 9

అసతాం నిగ్రహాదేల సతాంచ పరిపాలనాత్‌ | రాజభి శ్చాప్యశాస్తానా మసతాం శాసితా భవా&.10

తేన త్వ మధికో దేవో దేవేభ్యః ప్రతిభాసియే | జగద్విధ్యార్యతే సద్భి స్సతా మగ్ర్య స్తతా భవా&.11

తేన త్వా మనుయాన్త్యా మే క్లమో నామ న విద్యతే |

యమః తుష్టోస్మి తే విశాలాక్షి వచనై ర్ధర్మసఙ్గతైః. 12

వినా సత్యవతః ప్రాణా న్వరం వరయ మా చిరమ్‌|

సావిత్రీః సహోదరాణాం భ్రాతృణాం కామయామి శతం విభో. 13

అనపత్యః పితా ప్రీతిం పుత్త్రలాభా త్ప్రయాతు మే |

రెండు వందల పదవ అధ్యాయము.

సావిత్రీ యమ సంవాదము- సావిత్రికి ద్వితీయ వరప్రాప్తి.

సావిత్రి యమునితో ఇట్లనెను: సత్పురుషులు సజ్జనులతో సమాగమము లభించిన తరులాత క్లేశము ఎక్కడిది? దుఃఖము ఎక్కడిది? సత్పురుషులు సదాసజ్జనులకును అసజ్జనులకును గతి యగుదురు; కాని అసజ్జనులు మాత్రము సజ్జనులకుగాని అసజ్జనులకుగాని కడకు తనకేకాని గతి (ఉపకారకులు) కారు; అకారణముగనే లోకమునకు అపకారము చేయు (శత్రువులగు) ఖలుల వలన భయముండునట్లు విషము వలనకాని అగ్ని వలనకాని శత్రువుల వలనకాని శస్త్రముల (ఆయుధముల) వలనకాని భయముండదు; సజ్జనులు తమ ప్రాణముల వదలియైనను పరార్థమును (పరోపకారము- అర్థము ప్రయోజనమును) చేయుదులో అట్లే అసజ్జనులకు తమ ప్రాణములు పోగొట్టుకొని యైనను పరపీడ కలిగించుటలో ఆసక్తులయి యుందురు; సజ్జన లోకము (సమూహము) పరలోక (సుఖసాధన)మునకై ప్రాణములనైన గడ్డిపోచవలె వదలు కొన సిద్ధమగునో దానిని పరాపకార సమర్థులగు అసజ్జనులు తృణమువలెనే వదులుదురు; ఆయా జనసమూహము లందున్న అసజ్జములను దండించుటకై బ్రహ్మతానై రాజును ఏర్పరచి సృష్టించెను; రాజు నరులను పరీక్షించవలయును; అసజ్జనులను నిగ్రహించ(దండించ) వలయును; లోకమందు ఇట్టివాడే లోక త్రయ (సుఖములను)మును జయించు వారందరలో ఉత్తముడు; ప్రజలు తమ రక్షణమును బీజరక్షణమును లోకరక్షణమును చేసికొనుటకై ఎట్లు ధాన్యమును పరీక్షించి మంచి దాని నుంచుకొని చెడుదానిని వదలి ఆ మంచి ధాన్యమును మరల పైరువేసి వృద్ధి పరుతురో అట్లే రాజు కూడ సజ్జనులకు పరిపాలించుచు అసజ్జనులను నిగ్రహించుచు ప్రజలను వర్ధిల్ల చేయవలయును. స్వర్గమును పొందుగోరు రాజు చేయ దగినది ఇంత మాత్రమే; జగత్తులకు పతి అగు ధర్మరాజా! లోకములందు రాజు చేయదగిన కృత్యము ఇంతకంటే ఇతరము ఏదియులేదు; ఇట్లు అసజ్జన నిగ్రహముతోను సజ్జన పరిపాలనముతోను రాజు శాసింపలేని అసజ్జను లను కూడ శాసించు వాడవు నీవు; ఆ హేతువుచే దేవులందరకంటె నీవు అధికుడవగు దేవుడవు అని నాకు తోచుచున్నది; లోకము సరిగా నడుచునట్లు చేయుచు దానిని సరియగు వ్యవస్థయందు నిలుపువారు సజ్జనులే; అట్టి సజ్జనులలో శ్రేష్ఠుడవు నీవు; ఆ హేతుతవుచే నేను నీ వెంట (ఎంతదూరము) వచ్చుచున్నను క్లమము (శ్రమము) లేదు; అనవిని యముడు "విశాలాక్షీ! ధర్మసంబద్ధములగు నీ వచనములు విని నీ విషయమున తుష్టుడనయితిని; సత్యవంతుని ప్రాణములను తప్ప మరే దయిన వరమును శీఘ్రమే కోరుకొనుము;" అన సావిత్రి "విభూ! నాకు నూరుమంది సహోదరులగు (నా తల్లి కడుపుననే జన్మించిన) భ్రాతలు వరముగా (కోరుకొనుచున్నాను;) ఇమ్ము; ఇంతవరకును (పుత్త్రులు లేమిచే ) అనపత్యుడుగానున్న మా తండ్రి పుత్త్ర లాభము వలన ప్రీతినందునట్లనుగ్రహించుము;" అనెను.

తా మువాచ యమో గచ్ఛ యథాగత మనిన్దితే. 14

ఔర్ద్వ దైహిక కార్యేషు యత్నం భర్తు స్సమాచర | నానుగస్తు మయం శక్య స్త్వయా లోకాన్తరం గతః. 15

పతివ్రతాసి తేన త్వం ముహూర్తం మమ యాస్యసి | గురుశుశ్రూషమాద్భద్రే తథా సత్యవతో మహత్‌. 16

పుణ్యం సమార్జితం యేన నయామ్యేన మహం స్వయమ్‌| ఏతావదేవ కర్తవ్యం పురుషేణ

విజానతా. 17

మాతుః పితుశ్చ శుశ్రూషా గురోశ్చ వరవర్ణిని | గురు త్రితయ మేతత్తు సదా సత్యవతాం మతే. 18

పూజితం విజిత స్స్వర్గ స్త్వయానేన చిరం శుభే | తపసా బ్రహ్మచర్యేణ గురుశుశ్రూషయా శుబే. 19

పురషా స్స్వర్గ మాయాన్తి హ్యాగ్ని శుశ్రూషయా తథా |

ఆచార్యశ్చ పితాచైవ మాతా భ్రాతా చ పూర్వజః. 20

న చైతే హ్యవమన్తవ్యా బ్రాహ్మణన విశేషతః | ఆచార్యో బ్రాహ్మణో మూర్తిః పితా మూర్తిః ప్రజాపతేః.21

మాతా పృథివ్యా మూర్తిస్తు భ్రాతా వై మూర్తి రాత్మనః |

జన్మనా పితరౌ క్లేశం సహే తే సమ్బవే నృణామ్‌. 22

న తయోర్నిష్కృతి శ్శక్యా కర్తుం వర్ష శతారపి |

తయో ర్నిత్యం ప్రియం కుర్యా దాచార్యస్య చ సర్వదా. 23

తేష్వేవ త్రిషు తుష్టేషు తప స్సర్వం సమాప్యతే | తేషాం త్రయాణాం శుశ్రూషా పరమం తప ఉచ్యతే. 24

న తై రసభ్యనుజ్ఞాతో ధర్మ మన్యం సమాచరేత్‌ | త ఏవ హి త్రయో లోకా స్త ఏవ త్రయ ఆశ్రమాః. 25

త ఏవ చ త్రయో వేదా స్త ఏవ చ త్రయోగ్నయః|

పితా వై గార్హపత్యోగ్ని ర్మాతా గ్ని ర్దక్షిణ స్స్మృతః. 26

గురు రాహవనీయస్తు సాగ్ని త్రేతా గరీయసీ | త్రిష్వేతేష్వ ప్రమాద్యేషు త్రీన్లోకా న్జయతే గృహీ. 27

దీప్యమాన స్స్వవపుషా దేవవ ద్దివి మోదతే |

యమః కృతేన కామేన నివర్త భ##ద్రే భవిష్యతీదం సకలం త్వయోక్తమ్‌. 28

మమోపరోధ స్తవ క్లమ స్స్యా త్తథాధునా తేన తవ బ్రవీమి. 28.u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ సావిత్య్రుపాఖ్యానే సావిత్రీ యమసంవాదే సావిత్య్రై యమదత్త ద్వీతీయ వరలాభో నామ దశోత్తర ద్విశతతమోధ్యాయఃé.

అంతట యముడామెతో నిట్లనెను: అనిందితా! ( నిర్మల స్వభావా!) నీవు వచ్చిన త్రోవను పొమ్ము; నీభర్తకు జరుపవలసి ఔర్ధ్వ దైహిక కార్యముల విషయములలో యత్నము చేయుము; అంతేకాని లోకాంతర గతుడగు ఇతనిని నీవు వెంటనంటజాలవు; భద్రా! నీవు నీ గురువులకు (అత్త ఇంటి పెద్దలగు అత్తమామలకు) ను ముఖ్యగురుడెయగు సత్యవంతునకు చేసిన శుశ్రూష చేత నీవు మహాపుణ్యమును సమార్జించితివి; ఆ హేతువుచేతనే (నాదూతలను పంపక) నేను స్వయముగా వచ్చి ఇతనిని తీసికొనిపోవుచున్నాను. వరవర్ణినీ! విజ్ఞానవంతుడు అగు పురుషుడు అచరించవలసిన కర్తవ్యము తల్లిని తండ్రిని గురుని శుశ్రూషించుట అనునది మాత్రమే; వనమందుండియు నిరంతరమును సత్యవంతుడు ఈ మువ్వురును పూజించెను; సంతోషపరచెను; శుభరూపా! ఇట్లు ఇతడు చిరకాలము అనుభవించదగినంత స్వర్గమును జయించినవాడయినాడు; శుభా! తపముచే బ్రహ్మచర్యముచే గురు(పెద్దల) శుశ్రూష చే

అగ్ని శుశ్రూష చే పురుషులు స్వర్గ సుఖ ప్రాప్తులగుదురు; ఎవరేకాని -విశేషించి-

విప్రుడు ఆచార్యుని తన తండ్రిని తల్లిని అన్నను అవమానించ (అలక్ష్యపరచ) రాదు; ఆచార్యుడు బ్రహ్మరూపుడు; తండ్రి ప్రజాపతిరూపుడు; తల్లి పృథివీ రూప; అన్న స్వయముగ (తమ్ముడు) తన రూపమే); మానవులు జన్మించుటలో వారి తల్లిదండ్రులు పుట్టుకతోనే మహాక్లేశమనుభవింతురు; నూరేండ్లు కయినను వారి ఋణము తీర్చుకొనుట శక్యముకాదు; కావు న వారికిని ఆచార్యునకును సర్వదా ప్రీతి కలిగించవలయును; ఈ మువ్వురును సంతుష్టులయినచో సర్వ తపస్సులును సమాప్తములగును; ఈ మువ్వురు మూడు (పృథివ్యంతరిద్యు) లోకములు; మూడు (బ్రహ్మచర్య గార్హస్థ్య వానప్రస్థ) ఆశ్రమములు; మూడు (ఋగ్యజుస్సామ) వేదములు; మూడు (దక్షిణార్హపత్యా హవనీయ) అగ్నులు; తండ్రి గార్హపత్యాగ్ని ; తల్లి దక్షిణాగ్ని; గరుడాహవనీయాగ్ని; ఈ అగ్నిత్రయము అన్నికికంటేను గొప్పది; ఈ మూడిటి విషయమున గృహస్థుడు పొరపడరాదు; అట్లున్నన వాడు పైజెప్పినన లోకత్రయ(సుఖ) మును జయించును; ప్రకాశించు(తేజోమయగు) తన శరీరముతో కూడి దేవునివలెనే ద్యు(స్వర్గ)లోకమున సుఖించును; భద్రా! కల్యాణీ! నీ కోరికలు నెరవేరినవి; కావున నీవు మరలుము; నీవనిన ఈ విషయమంతయు జరుగును; ఇంకను నీవు నన్న న్ననున రించుటచే నాకు ఆటంకమును నీకు శ్రమమును అగును; అందుచే ఈ మాట ఇట్లు చెప్పుచున్నాను.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్య్రు పాఖ్యానము సావిత్రీ యమ సంవాదమున యమనివలన సావిత్రీకి ద్వితీయ వరలాభమునను రెండు వందల పదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters