Sri Matsya mahapuramu-2    Chapters   

త్రయోదశోత్తరద్విదశతతమో7ధ్యాయః.

సావిత్య్రుపాఖ్యానే సత్యవత్సహిత సావిత్య్రాః స్వాశ్రమగమన కథనమ్‌.

మత్స్యః: సావిత్రీ తు తత స్సాధ్వీ జగామ వరవర్ణినీ |

వథా యథా77 గతేనైవ యత్రాసీ త్సత్యవా న్మృతః. 1

సా సమాసాద్య భర్తారంత స్యోత్సఙ్గగతం శిరః | కృత్వా వివేశ తన్వఙ్గీ లమ్భమానే దివాకరే. 2

సత్యవానపి నిర్ముక్తో ధర్మరాజా చ్ఛనైశ్శనైః | ఉన్మీలయతి ననేత్రాభ్యాం ప్రాస్ఫురచ్చ నరాధిప. 3

తతః ప్రత్యాగత ప్రాణః ప్రియాం వచన మబ్రవీత్‌ |

క్వాసౌ ప్రయాతః పురుషో యో మా మేవం వికర్షతి. 4

జానాసి చ వరారోహే కశ్చాసౌ పురుష శ్శుభే | వనే 7స్మిం శ్చారుసర్వాఙ్గి సుప్తస్య చ దినం గతమ్‌. 5

ఉపవాసపరిశ్రాన్తా కర్శితా భవతీ మయా | అస్మద్దుర్హృదయేనాద్య పితరౌ దుఃఖితౌ తథా. 6

ద్రష్టుమిచ్ఛామ్యహం సుభ్రు గమనే త్వరితా భవ |

సావిత్రీ : ఆదిత్యే7స్త మనుప్రాప్తే యదితే రుచితం ప్రభో. 7

ఆశ్రమం చ ప్రయాస్యావ శ్శ్వశురౌ హీననచక్షుషౌ | యథావృత్తం చ తత్రైవ ప్రవక్ష్యామి తవాశ్రమే. 8

సత్యవత్సహితసావిత్య్రాస్స్వాశ్రమగమనమ్‌.

ఏతావదుక్త్వా థభర్తారం సహ భర్త్రా తదా య¸° | సమాసాద్యా77శ్రమం చైవ సహ భర్త్రా నృపాత్మజా.

ఏతస్మిన్నేవ కాలేతు లబ్ధచక్షు ర్మహీరతిః | ద్యుమత్సేనన స్సభార్యస్తు పర్యతప్యత భార్గవ. 10

ప్రియపుత్త్ర మపశ్యన్వై స్నుషాం చై వాథ కర్శితామ్‌ | ఆశ్వాస్యమానస్తు తథా నన తు రాజా తపోధనైః.

దదర్శ పుత్త్ర మాయాన్తం స్నుషయా సహ కాననాత్‌ | సావిత్రీచ వరారోహా సహ సత్యవతా తదా. 12

వవన్దే తత్ర రాజానం సభార్యం నృపనన్దనమ్‌ | పరిష్వక్త స్తథా పిత్రా సత్యవా న్నృపనన్దననః. 13

ఆభివాద్య తత స్సర్వా న్వనే తస్మిం స్తపోధనా9 | ఉవాస తత్ర తాం రాత్రి మృషిభి స్సహ ధర్మవిత్‌.

రెండు వందల పదుమూడవ అధ్యాయము.

సావిత్రీ సత్యవంతులు తమ యాశ్రమమున కేగుట.

మత్స్య నారాయణుడు మనువుతో ఇట్లు చెప్పెను: అనంతరము పతివ్రతయు ఉత్తమ స్త్రీయు అగు సావిత్రి సత్యవంతుడు మరణించినన చోటికి తానువచ్చినన త్రోవననే పోయెను; సుందరాంగియగు ఆమె సూర్యాస్తమయ సమయమునకు తన భర్తనుచేరి అతని తనన తొడపై నుంచుకొని కూర్చుండెను; ధర్మరాజు నుండి విడుదల పొందిన సత్యవంతుడును మెల్లమెల్లగా కన్నులు తెరవసాగెను; కదలసాగెను; మనురాజా! అనంతరమతడు ప్రాణములు మరల రాగా తన ప్రియురాలితో ఇట్లనెను: ఇంతకుమునుపు నన్ను పట్టిలాగు చుండిన ఆ పురుషుడెచ్చటికి పోయెను? శుభవగు వరారోహా! ఆ పురుషుడెవరో నీకు తెలియునా? మనోహరాంగీ! ఈ అడవిలో నిద్రించుచుండగనే పగలు గడచినది; నా మూలమున నీవు ఉపవాసముతో కృశాంగివయితివి; మనమీద బెంగతో మన తల్లిదండ్రులు దుఃఖించుచుందురు; వారిని త్వరగా చూడవలెనని యున్నది; త్వరగాపోవుదము; అన సావిత్రి ఇట్లనెను; ప్రభూ! మీ ఇష్టము ఎట్లో అట్లే చేయుదము; ఆదిత్యుడస్తమించు వేళకులోగానే ఆశ్రమమునకు పోవుదము; తల్లిదండ్రులును కన్నులు లేనివారుగదా! జరిగినదంతయు అక్కడనే - ఆ శమమునందే - చెప్పెదను; ఇంతమాత్రము చెప్పి ఆమె తన భర్తతో కూడి వెంటనే వెడలెను; అతనితో కూడియే ఆశ్రమమునకు చేరెను కూడ; అంతకు లోపలనే ఆ రాజు ద్యుమత్సేనుడును అతని భార్యయును కనులు వచ్చి యోభార్గవా! మనూ! తన అనుగు కొడుకును చిక్కియున్న కోడలును ఇంకను రాలేదేయని పరితపించుచుండిరి; అచటి తపోధనులు వారిని ఓదార్చుచుండిరి; అంతలోనే తమ కోడలితో కూడివచ్చుచున్న కుమారుడు వారికి కనబడెను; ఉత్తమస్త్రీయగు సావిత్రి తన పతియగు సత్యవంతునితో కూడి రాజానందకరుడగు ద్యుమత్సేన రాజును అతని భార్యను నమస్కరించెను; సత్యవంతుడు తండ్రిచే కౌగిలించు కొనబడెను; ధర్మవిదుడుగు ఆ రాజకుమారుడు ఆ వనమందలి తపోధనులను అందరను నమస్కరించి ఆ రాత్రియంతయు ఆ ఋషులతోకూడ గడపెను.

సావిత్ర్యపి జగాగాథ యథావృత్త మనిన్దితా | వ్రతం సమాపయామాస తస్యామేవ తదా నిశి. 15

తతస్తు రాత్రి యామాన్తే ససైన్య స్తస్య భూపతేః ఆజగామ జన స్సర్వో రాజ్యార్థాయ నిమస్త్రణ. 16

విజ్ఞావయామాస తథా తత్ర ప్రకృతిశాసనమ్‌ | విచక్షుషస్తే నృపతే యేనన రాజ్యం పురా హృతమ్‌. 17

అమాత్యై స్సహితో రాజా భవానేవపురే నృపః | ఏత చ్ఛ్రుత్వా య¸° రాజా బలేన చతురఙ్గిణా. 18

లేభే చ సకలం రాజ్యం ధర్మరాజా న్మహాత్మనః | భ్రాతౄణాం చ శతం లేభే సావిత్య్రపి వరాఙ్గనా. 19

మత్స్యః : ఏవం పతివ్రతా సాధ్వీ పితృపక్షం నృపాత్మజా | ఉజ్జహార వరారోహా భర్తృపక్ష న్తథైవచ. 20

మోక్ష (చ)యామాస భర్తారం మృత్యుపాశవశం గతమ్‌ |

తస్మా త్సాధ్వ్య స్త్సియః పూజ్యా స్సతతం దేవవ న్నరైః. 21

తాసాం రాజ న్ప్రసాదేన ధార్యతే వై జగత్త్రయమ్‌ |

తాసాం హి వాక్యం భవతీహ సత్యం ఫలన్తి కామా స్సకలా హ్యభీష్టాః. 22

తస్మా త్సదా తాః పరిపూజనీయాః కామా న్త్సమగ్రా నభికామయానైః. 22u

ఇతి శ్రీమత్స్య మహాపురాణ సావిత్య్రుపాఖ్యాననే సత్యవత్సహిత సావిత్య్రా స్స్వాశ్రమగమనాది

కథననం నామ త్రయోదశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

తరువాత ఉత్తమ స్త్రీయగు సావిత్రియు జరిగినదంతయు అచటి వారికి చెప్పెను; ఆ రాత్రియందే ఆమె ఉపవాసవ్రత నమాప్తిని కూడచేసెను; ఆ రాత్రి కడపటి జాము ముగియు వేళకు ఆ ద్యుమత్సేనుని పరిజనమంతయు సైన్యమును వెంటగొని ఆ రాజును రాజ్యపాలనమునకై రమ్మని పిలువ వచ్చెను; ప్రకృతి (ప్రజా) జనమగుతమ్ము పాలించుమనియు వారు ద్యుమత్సేనుని ప్రార్థించిరి; వారిట్లనిరి; రాజా! కన్నులులేని నీ రాజ్యమును ఎవడు అవహరించెనో ఆరాజును నీ మంత్రులు చంపివేసిరి; ఆ పురమునందు ఇప్పుడు నీవే రాజపు; అనగా విని ఆద్యుమత్సేనరాజు చతురంగ బలముతో పోయి మహాత్ముడగు ధర్మరాజు ననుగ్రహమున తన సకల రాజ్యమును పొందెను; ఉత్తమాంగయగు సావిత్రియు నూరుగురు తమ్ములు కలదయ్యెను; పతివ్రతియు ఋజువర్తనయు వరారోహయునగు ఆ రాజ పుత్త్రి ఇట్లు తన పితృపక్షమును పతిపక్షమును కూడ ఉద్ధరించెను; మృత్యుపాశవశగతుడైన భర్తను విడిపించుకొనెను; కావున మానవులు పతివ్రతలను దేవతలనువలె పూజించవలెను; రాజా! వారి యనుగ్రహముననే ఈ జగత్త్రయమునను నిలుపబడు చున్నది; ఈ లోకమందు వారేది పలికినన నది సత్యమై జరుగును! సకల కామ సిద్ధియు కావలెనని కోరుకొనువారు సదా వారిని పూజించుచుండవలయును.

ఇది శ్రీ మత్స్యమహాపురాణమున సావిత్య్రు పాఖ్యామున సావిత్రీ సత్యవంతులు స్వాశ్రమమునకు మరలి పోవుటయను రెండు వందల పదుమూడవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters