Sri Matsya mahapuramu-2    Chapters   

చతుర్దశోత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః.

మనుః : రాజ్ఞో7భిషిక్తమాత్రస్య కిన్ను కృత్యతమం భ##వేత్‌ |

ఏతత్సర్వం సమాచక్ష్వ సమ్యగ్వేత్తి యతో భవా9. 1

మత్స్యః : అభిషేకార్ద్రశిరసా రాజ్ఞా రాజ్యావలోకినా | సహాయవరణం కార్యం తత్ర రాజ్యం ప్రతిష్ఠితమ్‌. 2

యదప్యల్పతరం కర్మ తద ప్యేకేన దుష్కరమ్‌ | పురుషేణాసహాయేన కింను రాజ్యం మహోదయమ్‌. 3

తస్మా త్సహాయా న్వరయే త్కులీనా న్నృపతి స్స్వయమ్‌ |

శూరా న్కులీనజాతీయా న్బలయుక్తా ఞ్ఛ్రియా7న్వితా9. 4

రూపసత్త్వగుణోపేతా న్త్సజ్జనా న్‌క్షమయా7న్వితా9 |

క్లేశక్షమా న్మహోత్సాహా న్ధర్మజ్ఞాంశ్చ ప్రియంవదా9. 5

హితోపదేశకా న్రాజ్ఞ స్స్వామిభక్తా న్యశో7ర్థినః | ఏవం విధా న్త్సహాయాంస్తు శుభకర్మసు యోజయేత్‌. 6

గుణహీనానపి తథా విజ్ఞాయ సృపతి స్స్వయమ్‌ | కర్మ స్వేష నియుఞ్జీత యథాయోగ్యేషు భాగతః. 7

సేనానీప్రతీహారౌ.

కులీనన శ్శీలసమ్పన్న శ్చతుర్వేదవిశారదః | హస్తిశిక్షాశ్వశిక్షాసు కుశల శ్ల్మక్‌ష్ణభాషితా. 8

నిమిత్తే శకునజ్ఞానే వేత్తాచైవ చికిత్సితే | కృతజ్ఞః కర్మణాం శూర స్తథా క్లేశసహో ఋజుః. 9

ప్యూహత త్త్వవిధానజ్ఞః ఫల్గుసారవిశేషవిత్‌ | రాజ్ఞా సేనాపతిః కార్యో బ్రాహ్మణః క్షత్త్రియో7పి వా. 10

ప్రాంశు స్సురూపో దక్షశ్చ ప్రియవాదీ నచోద్ధతః | చిత్తగ్రాహశ్చ సర్వేషాం ప్రతీహారో విధీయతే. 11

రెండు వందల పదునాలుగవ అధ్యాయము.

రాజ ధర్మములు. రాజు ఎన్నుకొనవలసిన అధికారుల లక్షణములు-

రాజు ప్రజాపాలనలో తాను నడుచుకొనవలసిన రీతి.

[(గమనిక : ఈ రాజ ధర్మా7ధ్యాయములలో 1. "శాస్త్రజ్ఞుడు-త త్త్వజ్ఞుడు అనగా ఆయా శాస్త్రముల విషయమును చదివి బుద్ధి యందు బాగుగా కుదురుపరచుకొనినవాడు; 2. విధానజ్ఞుడు అనగా దానిని ఆచరించ గలవాడు; (1. శాస్త్రము-Knowledge in Theory 2. విధానము-Capability in practice).]

మ.పు. 115

పట్టాభిషేకమందిన ప్రతియొక్క రాజునకును ముఖ్యతమ కృత్యమేమి? నీవింతయు ఎరిగిననవాడవు కావున తెలుప వేడుచున్నాననిన మనువుతో మత్స్యుడిట్లు చెప్పెను: రాజు అభిషేకముతో తలతడి ఆరకుండగ నున్నప్పటినుండియు రాజ్యమును చూచుకొనుటకై తగిన సహాయులను ఎన్నుకొనవలయును; ఏలయన వారియందే రాజ్యము నిలిచియున్నది; చాల చిన్న పనియును ఒకడే చేయజాలడనిన మహోదయమగు రాజ్యము మాట చెప్పవలసినదేమి? కావున రాజు తానే కులీనులు కులీన జాతీయులు శూరులు బలయుక్తులు సంపద(ముఖశ్రీ)గలవారు రూపము సత్త్వము(నిబ్బరము) గుణములు కలవారు సజ్జనులు క్షమాపరులు క్లేశము నోర్చువారు మహోత్సాహులు ధర్మజ్ఞులు ప్రియంవదులు రాజునందు స్వామి భక్తులై హితము నుపదేశించువారు తమకును రాజునకును కీర్తి కోరువారునగు సహాయుల నెన్నుకొని వారిని ఆయా మంచి పనులందు నియోగించవలెను. రాజు స్వయముగా పరీక్షించి చూచి ఈ చెప్పినన్ని గుణములులేని గుణహీనులైనను గ్రహించి వారిని తగిన పనులయందు భాగక్రమమున నియోగించవచ్చును; (ఇది రాజ సహాయుల సామాన్య లక్షణము;) కూలీనుడు శీల సంపన్నుడు చతుర్వేద విశారదుడు హస్తి శిక్షా7శ్వ శిక్షలయందు కుశలుడు మృదుభాషి శుభాశుభములగు నిమిత్తము లను షతునములను ఆయా చికిత్సా విధానములను ఎరిగినవాడు కృతజ్ఞుడు కార్యశూరుడు క్లేశసహుడు ఋజు స్వభావుడు వ్యూహముల తత్త్వమును వ్యూహ విధానమునను ఎరిగినవాడు తేలికయైన విషయమేదో బరువగు విషయమేదో ఎరిగినవాడు అగు బ్రాహ్మణునికాని క్షత్త్రియునికాని సేనాపతిగా నియోగించవలెను; పొడగరి సురూపుడు దక్షుడు ప్రియవాది పొగరు లేనివాడు సర్వుల మనస్సులకు నచ్చువాడు-అందర మనస్సులలోని భావములను గ్రహించగలవాడు అగు వానిని ప్రతీ హారునిగా (ద్వారాధికారిగా) నియమించుకొనవలెను. దూత (రాయబారి) చెప్పిన విషయము చెప్పినట్లు ఇతరులకు అందించువాడు దేశభాషా విశారదుడు శక్తి కలవాడు క్లేశసహుడు మాటకారి దేశకాల విభాగముల నెరిగినవాడు దేశ కాలముల గుర్తించి వ్రవర్తించగలవాడు (ఏ దేశమందే కాలమందెట్లు వర్తించవలయునో తెలిసియుండుట మొదటిది-దానిని ఆచరణయందుంచి ప్రవర్తించుట రెండవది); రాజ హితము కోరువాడు రాజనీతి విషయములను తగిన సమయమందు తగినట్లు మాటలాడువాడునయి యుండవలయును.

దూతాదిలక్షణమ్‌.

యథోక్తవాదీ దూత స్స్యా ద్దేశ భాషావిశారదః | శక్తః క్లేశసహో వాగ్మీ దేశకాలవిభాగవిత్‌. 12

విజ్ఞాతదేశ కాలశ్చ హితో య స్స్యా న్మహీక్షితః | వక్తా నయస్య యః కాలే స దూతో నృపతే ర్భవేత్‌. 13

ప్రాంశవో వ్యాయతా శ్శూరా దృఢభక్తా నిరాకులాః | రాజ్ఞా తు రక్షిణః కార్యా స్సదాక్లేశ సహా హితాః. 14

అననాహార్యో నృశంసశ్చ దృఢభక్తిశ్చ పార్థివే | తామ్భూలధారీ భవతి నారీ వా7ప్యథ తద్గుణా. 15

షాడ్గుణ్యవిధితత్త్వజ్ఞో దేశభాషావిశారదః | సన్ధివిగ్రహకః కార్యో రాజ్ఞా నయవిశారదః. 16

ఆయవ్యయజ్ఞో లోకజ్ఞో దేశోత్పత్తి విశారదః | కృతాకృతజ్ఞో భృత్యాననాం జ్ఞేయ స్స్యా ద్దేశరక్షితా. 17

సురూప స్తరుణః ప్రాంశు ర్దృఢభక్తిః కులోద్భవః | శూరః క్లేశ సహశ్చైవ ఖడ్గధారీ ప్రకీర్తితః. 18

శూరశ్చ బలయుక్తశ్చ గజాశ్వరథకోవిదః | ధనుర్ధారీ భ##వేద్రాజ్ఞ న్సర్వక్లేశసహ శ్శుచిః. 19

నిమిత్తశకుననజ్ఞానీ హయశిక్షా విశారదః | హయాయుర్వేదతత్త్వజ్ఞో భువో భాగవిశేషవిత్‌. 20

బలాబలజ్ఞో రథిన స్థ్సిరదృష్టిః ప్రియంవదః | శూరశ్చ కృతవిద్యశ్చ సారథిః పరికీర్తితః. 21

అననాహార్య శ్శుచి ర్దక్ష శ్చికిత్సితవిదాం వరః | సూపశాస్త్రవిధానజ్ఞ స్సూదాధ్యక్షః ప్రశస్యతే. 22

సూదశాస్త్రవిధానజ్ఞాః పరాభేద్యాః కులోద్భవాః | సర్వే మహానసే కార్యాః కృత్తకేశనఖా జనాః. 23

సమ శ్శత్రౌచ మిత్రేచ ధర్మశాస్త్ర విశారదః | విప్రముఖ్యః కులీనశ్చ ధర్మాధికరణ భ##వేత్‌. 24

కార్యా స్తథావిధా స్తత్ర ద్విజముఖ్యా స్సభాసదః |

పొడగరులు పొడవు బాహువులవారు శూరులు దృఢభక్తులు దేనికిని కలతపడనివారు క్లేశనహులు హితకరులునై రాజ రక్షకులుండవలెను; తమ్మిపడిగ పట్టువారు (తాంబూల కరండధారులు) స్త్రీలుకాని పురుషులుకాని కావచ్చును; వారు అననాహార్యులు (ఆహార్యము-వేషధారణము) ఎక్కువ ఆకర్షణీయము ఆడంబరద్యోతకము అగు వేషము ధరించనివారు క్రూరతలేనివారు రాజునందు దృఢభక్తులు అయియుండవలెదు; సంధి-విగ్రహము యానము-ఆసనము-ద్వైధము-ఆశ్రయము అను షాడ్గుణ్యపు తత్త్వమును దాని ఆచరణ విధానమును ఎరిగినవాడు దేశభాషా విశారదుడు రాజనీతి విశారదుడునయి 'నంధి విగ్రహకుడు' (విదేశ వ్యవహారముల చూచుమంత్రి) ఉండవలెను; రాజు కడనుండు ఖడ్గధారి రాజ భృత్యులలో ఏది ఎవరు చేసిరో చేయుదురో చేయవలెనో ఎవరు తమ కర్తవ్యమును ఆచరించనివారో గమనించగలవాడు దేశరక్షణాసక్తుడు సురూపుడు తరుణుడు ప్రాంశుడు (పొడగరి) దృఢభక్తుడు సత్కులోద్భవుడు శూరుడు క్లేశసహుడుననయియుండ వలెను; రాజుకడనుండు ధనుర్ధారి శుచి (కపటము లేనివాడు) అయియుండవలయును; రాజసారథి నిమిత్తములందు (ఉత్పాతములు మొదలగువానియందు శకునములందు) ఎరుకగలవాడు హయ శిక్షా విశారదుడు హయాయుర్వేద తత్త్వజ్ఞుడు భూభాగములు ఎచ్చట ఎట్టివిగా నున్నవో ఎచ్చట ఏయే ప్రదేశములున్నవో ఎరిగినవాడు రథి(కుని) బలాబలముల నెరిగిన వాడు స్థిరదృష్టి కలవాడు ప్రియంవదుడు శూరుడు (యుద్ధ) విద్యయందారితేరినవాడు నయియుండవలయునను: సూదమునకు (వంటశాలకు వంటపనులకు) అధ్యక్షుడు ఆడంబరపు వేషము ధరించనివాడు (శరీరమున చిత్తమున) శుచి దక్షుడు చికిత్సా విధానమున నెరిగినవాడు సూద (పాక) శాస్త్రమును దానిని చేయుటను ఎరిగినవాడు అయియుండవలెను. మహాననమందు(వంటశాలయందు) ఉంéడు పనివారు సూద (పాక) శాస్త్రమును దాని విధానమును ఎరిగివారు ఇతరులకు (అంతర్బహిశ్శత్రువులు మొదలగువారి భేదోపాయములచే) భేదింపనలవికాని వారు గోళ్ళను జుట్టును కత్తిరించుకొని యుండువారు నయియుండవలెను; ధర్మాధికృతుడు (Judge) శత్రుమిత్రులయందు నముడు ధర్మశాస్త్రము (Law) నందు పండితుడు కులీనుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడునయియుండవలెను; ఇట్టి ద్విజముఖ్యులే అతనికి సహాయులగు సభాగదులుగా నుండవలయును.

లేఖకలక్షణమ్‌.

లేఖకః కథితో రాజ్ఞ స్సర్వాధికరణషు వై | శీర్షోపేతా న్త్సుసమ్పూర్ణా న్త్సమశ్రేణిగతా న్త్సమా9. 26

అక్షరా న్విలిఖేద్యస్తు లేఖక స్స వర స్స్మృతః | ఉపాయవాక్యశుశల స్సర్వశాస్త్రవిశారదః. 27

బహ్వర్థవక్తా చాల్పేన లేఖక స్స్యా న్నృపోత్తమ | వాక్యాభిప్రాయతత్త్వజ్ఞో దేశకాలవిభాగవిత్‌. 28

ఆనాహార్యో భ##వే చ్ఛక్తో లేఖక స్స్యా న్నృపోత్తమ | పురుషాన్తరతత్త్వజ్ఞాః ప్రాంశవశ్చా ప్యలోలుపాః. 29

ధర్మాధికారిణః కార్యా జనాదానకరా నరాః | ఏవంవిధా స్తథా కార్యా రాజ్ఞా దౌవారికా జనాః. 30

ధనాధ్యక్షాదిలక్షణమ్‌.

లోహవస్త్రాజినాదీనాం రత్నానాం చ విధానవిత్‌ | విజ్ఞాతా ఫల్గుసారాణా మనాహార్య శ్శుచిస్మితః. 31

నిపుణ శ్చాప్రమత్తశ్చ ధనాధ్యక్షః ప్రకీర్తితః | ఆయద్వారేషు సర్వేషు ధనాధ్యక్షుసమా నరాః. 32

వ్యయద్వారేషు సర్వేషు కర్తవ్యాః పృథివీక్షితా | పరమ్పరాగతో య స్స్యా దష్టాఙ్గేసు చికిత్సితే. 33

అనాహార్య స్స వైద్య స్స్యా ద్ధర్మాత్మా చ కులోత్థితః |

ప్రాణాచార్య స్స విజ్ఞేయో వచనం తస్య భూభుజా. 34

రాజ న్రాజ్ఞా సదా కార్యం యథా కార్యం పృథగ్జనైః | హస్తిశిక్షావిధానజ్ఞో వనజాతివిశారదః. 35

క్లేశక్షమ స్తథా రాజ్ఞో గజాధ్యక్షః ప్రశస్యతే| ఏతైరేవ గుణౖర్యుక్త స్స్వాసనశ్చ విశిష్యతే. 36

గజారోహో నరేన్ద్రస్య సర్వకర్మసు శస్యతే|

రాజునకు అన్ని అధికరణముల ( Departments)యందును లేఖకులుండవలయును; తలకట్టులు కలవి నిండయినవి సరియగు వరునలయుందుడునవి సమపరిమాణము కలవి అగు అక్షరములు వ్రాయువాడు ఉపాయములు నెరుగుటయందు అవగాహనము చేసికొనుటయందు నేర్పరియు సర్వశాస్త్ర విశారదుడును కొలది వాక్యములతోనే విస్తృతార్థమును చెప్పగలవాడు వాక్యాభిప్రాయ తత్త్వము నెరిగినవాడు దేశకాల విభాగమను (ఏ కాలమందేది చేయవలెనో మాటాడవలెనో) నెరిగినవాడు వేషాడంబరము లేనివాడు (Simple in dress)శక్తి (బుద్ధిస్పరణము) కలవాడు అయి యుండవలయును ;పురుషుల (ఆయా వ్యక్తుల) స్వభావములందలి భేదమును గురుతింపగలవారు పొగడరులు ధనాశా రహితులు జనులను తమవైపునకు త్రిప్పుకొనగలవారు ధర్మాధ్యక్షుడు లోహములు వస్త్రములు చర్మములు రత్నములు మొదలగువానికి తత్త్వమును విధానమును(ఆయా వస్తువుల స్వరూప లక్షణములును ఏది ఎట్లున్నదో మంచిదో మంచిది కాదో తెలియుట త్త్వమును ఎరుగుట- ఆయా వస్తువులలో ఏది ఏ పనికి వచ్చుననో ఎట్లు దేనిని వినియోగించుకొనవచ్చునో ఎరుగుట విధాన జ్ఞానము) ఎరిగినవాడు కొంచెపుది ఏదియో గొప్పది ఏదియో ఎరిగినవాడు వేషాడంబరము లేనివాడు నిర్మలమగు నవ్వు కలవాడు నిపుణుడు ఏమరుపాటులేనివాడు ధనాధ్యక్షుడుగ నుండవలయును ;ఆయ ద్వారము (ఆదా యపు సాధనములగు శాఖ) లన్నిటిననియందును వ్యయ ద్వారముల(శాఖల) యందును ధనాధ్యక్షునితో సములగువారేయుండ వలయును ;శల్యము శాలాక్యము కాయ చికిత్స భూత విద్య కౌమార భృత్య %్‌గదతంత్రము రసాయన త్తంరము వాజీకరణ తంత్రము- లేదా- కాయము బాలము గ్రహము ఊర్ద్వాంగకము శల్యము దంష్ట్రం-జర- వృషము అను ఎనిమిది వైద్యాంగముల యందును చికిత్సా ప్రక్రియయందును నిపుణుడు వంశ పరంపరాక్రమమున వచ్చి వాడు వేషమున నిరా డంబరుడు ధర్మ మనస్కుడు ఉత్తమ వంశమున పుట్టినవాడు రాజ వైద్యుడుగా నియోగింపబడవలెను. అతడు రాజునకు ప్రాణాచార్యుడు ;కావున భూ భర్తయగు రాజు ఎల్లప్పుడు అతడు చెప్పిన మాటను సాధారణ జనులు పాటించినట్లే పాటించి ఆచరించవలయును ;గజ శిక్షా విధానము బాగుగ నెరిగినవాడు క్లేశమును ఓర్చుకొనువాడు వనగజ జాతులను బాగుగ నెరిగినవాడు గజాధ్యక్షుడు గా నుండవలెను ;ఇవే గుణములతో కూడిన వాడును అందునకు ముఖ్యముగా మూలవ్యాధి మొదలగునవి లేక బాగుగా కూర్చుండగలవాడు రాజ గజాగోహుడుగ (మావటివాడుగ) నుండవలయును ;ఇట్టివాడు సర్వకర్మల యందును ప్రశస్తుడు.

హయశిక్షా విధానజ్ఞో7శ్వ చికిత్సతపారగః. 37

అశ్వాధ్యక్షో మహీభర్తు స్స్యాసనశ్చ ప్రశస్యతే| అనాహార్యశ్చ శూరశ్చ వాగ్మీ ప్రాజ్ఞః కులోత్థితః. 38

దుర్గాధ్యక్ష స్స్మృతో రాజ్ఞ ఉద్యుక్త స్సర్వకర్మసు| వాస్తు విద్యావిధానజ్ఞో మఘుహస్తో జితక్లమః. 39

దర్శీచ దీర్ఘశూరశ్చ స్థపతిః పరికీర్తితః| యన్త్రముక్తే పాణిముక్తే విముక్తే ముక్త ధారితే. 40

అస్త్రా చార్యో నిరుద్వేగః కుశలశ్చ విశిష్యతే| వృద్ధః కులోద్గత స్సూక్తః పితృపైతామహ శ్శుచిః. 41

రాజ్ఞా మన్తః పురాద్యక్షో వినీతశ్చ తథేష్యతే| ఏవం సప్తాధికారేషు పురుషా స్సప్తతే పురే. 42

పరీక్ష్య చాధికార్యా స్స్యూ రాజ్ఞా కర్వేషు కర్మసు| స్థాపనాజాతితత్తవజ్ఞస్సతతం ప్రతిజాగృతః. 43

రాజ్ఞ స్స్యా దాయుధాగారే దక్షః కర్మసు చోద్యతః| కార్మాణ్య పరిమేయాని రాజ్ఞో నృపకులోద్వహ. 44

ఉత్తమాధమమధ్యాని బుద్ధ్వ కర్మాణి పార్థివః| ఉత్తమాధమమధ్యేషు పురేషు నియోజయేత్‌. 45

నరకర్మ విపర్యాసా ద్రాజా వ్యసన మాప్నుయాతే| నియోగం పోరుషం భక్తిం శ్రుతం శౌర్యం కులం నయమ్‌.46

జ్ఞాత్వా వృత్తి ర్విధాతవ్యా పురుషాణాం మహీక్షితా | పురుషాన్తర విజ్ఞాన తత్త్వ సారనిబన్ధనాత్‌. 47

హయశిక్షను హయచికిత్సను తుదముట్టినెరిగిన వాడును స్వాననుడు (మూల వ్యాధి మొదలగునవి లేక ఎంత సేపయిన బాగుగ కూర్చుండగలవాడు) రాజునకు అశ్వాధ్యక్షుడుగ నుండవలయును; నిరాడంబర వేషుడు శూరుడు మాట నేర్పరి ప్రాజ్ఞుడు - కూలీ నుడు సర్వకాలములందును సదా పూనికతో నుండువాడు దుర్గాధ్యక్షుడుగా నుండవలయునను ;వాస్తు విద్య ను వాస్తు విధానమును బాగుగ నెరిగినవాడు లఘుహస్తుడు (శీఘ్రముగా పనులు చేయగలవాడు) శ్రమ కోర్చు వాడు దూరదర్శియు శూరుడునగువాడు రాజుననకు వడ్లంగిగా నుండవలయును; యంత్రములతో విడుచునవి చేతితో విడుచుననవి ధనస్సు నుండి విడిచువి విడిచి మరల గ్రహించి పట్టుకొనుకనవి అగు ఆయుధములందు కశలుడు ఉద్వేగము లేనివాడు పాజనకు అస్త్రాచార్యుడు ఉండవలయును; వృద్ధుడు కులీనుడు చక్కని మాటలాడువాడు పితృ పితామహాది వంశక్రమాగతుడు మశ్శరీరములందు శుచియగువాడును వినయము (మం చి నడువడి) కలవాడు అంతఃపురాధ్యక్షుడుగా నుండవలయును ;రాజు ఈ విధముగా (ఈ చెప్పిన వానిలో ప్రదానములగు) ఏడధికారములందును ఏడుమంది రాజ పురుషులను చక్కగా పరీక్షించి పురమందు అచరించవలసిన సర్వ కర్మముల నిర్వహణములందును నియోగించవలెను ;వీరుకాక - రాజు అయుధాగారాధ్యక్షునిగా ఆయా యాయుధములను అముర్చు విధపు తత్త్వమును బాగుగ నెరిగిననవాడు నిరంతరము మెలకులతో నుండువాడు సర్వకర్మములందును సదా పూనికతో నుండువాడు అగు వానిని నియోగించవలయును ;నృపకులోద్వహుడవగు మనూ! రాజునకు గల కార్యములు అపరిమితములు ;అవి ఉత్తమములు మద్యమములు అధములునగు పురుషులయందు నిలుపవలయును ;నరులుచేయు కర్మల వ్యత్యాసము వలన రాజు వ్యసనమును-(కీడును) పొందును ;వారివారి అధికారమును- దానిని వారునిర్వహించు తీరును వారిపౌరుషమును వారాపనుల నిర్వహించుటలో చూపుపూనికను వారి రాజభక్తినని శాస్త్రజ్ఞానమును శోర్యమును కులమును రాజనీతిజ్ఞానమును ఎరిగియే రాజు రాజ పురుషులను నియోగము (అయా అధికారములందు నిలుపుట) చేయవలసియుండును ;ఇది చేయుటలో రాజు ఆయా పురుషుల అంతర (చిత్తములందలి) విజ్ఞాన (అనుభవ పూర్వక విషయ పరిజ్ఞాన) సారమును తత్త్వ (విషయ పరిజ్ఞాన) జ్ఞాన సారమును ఎంతటివియో ఎరిగి వానిని ఆధారముగా తీసికొకనవలెను.

రాజ్ఞో మన్త్రిభిస్సహ మన్త్రణక్రమః.

బహుభిర్మన్త్రయే త్కామం రాజా మన్త్రం పృథక్పృథక్‌| మన్త్రిణామపి నో కుర్యామన్త్రీ మన్త్ర ప్రకాశనమ్‌. 48

క్వచి న్న కస్య విశ్వాసో భవతీహ సదానృణామ్‌| నిశ్చయస్తు సదా మన్త్రే కార్య ఏకేన సూరిణా. 49

భ##వేద్వా నిశ్చయావాప్తిః పరబుద్ధ్యుపజీవనాత్‌| ఏకసై#్యవ మహీభర్తు ర్భుయః కార్యో వినిస్చయః. 50

బ్రాహ్మణా న్పర్యుపాసీత త్రయీశాస్త్రసునిశ్చితా&. నాననచ్ఛాస్త్రవతో మూడాం స్తేహి లోకస్య కణ్టకాః. 51

వృద్ధా & హి నిత్యం సేవేత విప్రా న్వేదవిద శ్శుచీ& | తేభ్యో హి శిక్షే ద్వినయె వినీతాత్మాహి నిత్యశః. 52

సమగ్రాం వశగాం కుర్యా త్పృథివీం నాత్ర సంశయః| బహవో 7వినయా ద్భ్రష్టా రాజాన స్పపరిచ్ఛదాః. 53

ధనానని చైవ రాజ్యాని వినయాత్ప్రతిపేదిరే

రాజ్ఞో విద్యాగ్రహణవిధిః

త్రైవిధ్యేభ్య స్త్రయీం విద్యాం దణ్డనీతించ శాశ్వతమ్‌. 54

అన్వీక్షకీం చాత్మ విద్యాం వార్తారమ్భాంస్ఛ లోకతః| ఇన్ద్రియాణాం జయే యోగం సమా తిష్ఠే ద్దివానిశమ్‌. 55

జితేన్ద్రియో హి శక్నోతి వశే స్థావయితుం ప్రజాః| యజేత రాజా క్రతుభి ర్బహుభి ర్భూరిదక్షిణౖః. 56

ధర్మార్ధ మేవ విప్రేభ్యో దద్దయా ద్భోగా న్ధనాని చ| సాంవత్సరిక మాపై#్తశ్చ రాష్ట్రా దాహారయే ద్బలిమ్‌. 57

స్యాత్స్యాధ్యాయపరో లోకే వర్తేత పితృబన్ధువత్‌| ఆవృత్తానాం గురుకులా ద్ద్విజానాం పూజకో భ##వేత్‌. 58

నృపాణా మక్షయో హ్యేష విధి ర్బ్రాహ్మో7 భిదీయతే| తతస్తే మానవా మిత్రా హరన్తి న వినశ్యతి. 59

తస్మా ద్రాజ్ఞా విధాతవ్యో బ్రాహ్మ వై క్షయో విధిః| సమోత్తమాధమై రాజా హ్యాహుయ పాలయే త్ప్రజాః. 60

రాజు తన ఇష్టము వచ్చినంత మందితో మంత్రణము చేయవచ్చును ;కాని

మంత్రాలోచన పరుడగు రాజెప్పుడు మంత్రులకు కూడ ఇతర మంత్రులు చెప్పిన

మంత్రణమును బయలు పరచగూడదు; రాజు ఏ మానవులను నమ్మరాదు ;అయా మంత్రులు చెప్పిన మంత్రణములపై నిశ్చయము మాత్రము తానే వివేచనపరుడై చేయవలెను ;ఇతరుల బుద్ధినుండు పుష్టి పొందినే కాని తాను నిశ్చయము చేసికొనలేడనుట నిజమే ;కాని - రాజైనవాడు ఇతరులు చెప్పిన దానిమీద కూడ తన బుద్ధితోనే నిశ్చయము చేసికొనవలెను ;వేదశాస్త్రములను బాగుగ చేర్చి వాటియందు దృఢపాండితిగల బ్రాహ్మణులను రాజు సేవించవలెను ;అనచ్ఛాస్త్రములను చదివిన మూఢులను సేవించరాదు ;వారు లోకమునకు అపకారులు ;వేదవేదత్తలు నిర్మల మనస్కులునగు విప్రులనే సేవించవలెను; తాను వినయసంపన్నుడై వారినుండి ఇంకను వినయ (సత్ప్రవర్తనమును ఎడతెగక శిక్షణ పొందుచుండవలెను; దీనిచే రాజు పృథివీ నంతటిని తన వశము చేసికొనగలుగును; చాల మంది రాజులు అవియము వలన తాము తమ పరివారముతో కూడ భ్రష్టులయిరి ;వినయము వలన ధనములను రాజ్యములను పొందిరి.

రాజు వేదత్రయము నందును తదంగ శాస్త్రములందును పండితులగు వారినుండి వేదశాస్త్రాది విద్యలను శాశ్వతము( సార్వకాలికము) అగు దండనీతిని తర్కశాస్త్రమును ఆత్మ విద్యను నేరుపవలెను; వాణిజ్యము కళలు మొదలగు వానిని లోకపు నడువడిక నుండి తెలిసికొనవలెను; ఇంద్రియ జయమునకై యోగమును నిరంతరమభ్యసించవలెను; ఏలయన జితేంద్రియుడే ప్రజలు తన అదుపులో ఉంచుకొనగలుగును . ధర్మసాధనకై రాజు బహుదక్షిణలతో కూడ క్రతువులతో దేవతల నారాధించవలయును; విప్రులకు ధనభోగములు నీయవలెను; ఆప్తుల ద్వారము ఏటేట రాష్ట్రము నందలి ప్రజల నుండి రావలసిన పన్నులను సేకరించుకొనవలెను; స్వాధ్యాయపరుడై ఎప్పుడును వేదశాస్త్రాదుల నధ్యయనము చేయుచు ఉండవలెను. జనులకు తాను తండ్రివలె బంధువులవలె నడుచుకొనవలెను; గురుకులమునుండి విద్యముగించి వచ్చిన స్నాతకులగు విప్రుల పూజించ(ఆదరించ)వలెను. ఇది రాజులకై బ్రహ్మ (ప్రజాపతి) ఏర్పరచిన అక్షయ(శాశ్వత) విధానము ;అని శాస్త్రమున చెప్పబడుచున్నది ;ఈ విధమగు ప్రక్రియలచే సంపాదించిన అక్షయనిధిని దొంగలు కాని శత్రులుకాని హరించజాలరు; అది తంతట తాను నశించునదియు కాదు ;కావున రాజు ఈ బ్రాహ్మమగు అక్షయ విధానమును పాటించి నడుపవలెను ;అపుడపుడు రాజు ప్రజల యందలి ఉత్తములు సాదారణులు అధములు అను మూడు వర్గములకు చెందిన ప్రజలలోముఖ్యులను తన కడకు పిలిపించుకొని (వారిననువర్తించుచు) ప్రజలను పాలించవలెను.

రాజ్ఞాః కృపణాదిరక్షణవిధిః

న నివర్తేత సఙ్గ్రామా తాక్షత్రవ్రత మనుస్మర& |సఙ్గ్రామే ష్వనివర్తిత్వం ప్రజానాం పరిపాలనమ్‌. 61

శుశ్రూషా బ్రాహ్మణానాంచ రాజ్ఞాం నిః శ్రేయసం వరమ్‌| కృపణానాధవృద్ధానాం విధావానాం చ పాలనమ్‌. 62

యోగక్షేమం చ వృత్తించ తథైవ పరికల్పయేత్‌| వర్ణాశ్రమవ్యవస్థానం తథా కార్యం విశేషతః. 63

స్వధర్మప్రచ్యుతా న్రాజా స్వే ధర్మే స్థాపయే త్సదా|

ఆశ్రమేషు యథా కార్య మన్నం తేలంచ భాజనమ్‌. 64

స్యయమేవాయే ద్రాజా సత్కృతా న్నావమానయేత్‌| తావసే సర్వకార్యాణి రాజ్య మాత్మాన మేవచ. 65

నివేదయే త్ప్రయత్నేన దేవవ చ్చిర మర్చయేత్‌| ద్వే ప్రజ్ఞే వేదితవ్యేచ ఋజ్వీ వక్రాచ మానవైః. 66

వక్రాం జ్ఞాత్వాన సేవేత ప్రతిభాధేత చాగతమ్‌| సాత్త్వికం భావ మాస్థాయ ఋజ్వీంచ పరిపాలయేత్‌.67

నాత్మచ్ఛిద్రం పరో విన్ద్యా ద్విన్ద్యా చ్చిద్రం పరస్యతు| గూహేత్కూర్మ ఇవాఙ్గాని రక్షే ద్వివరమాత్మనః. 68

న విశ్వసే దవిశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్‌| విశ్వాసా ద్భయముత్పన్నం మూలాన్యపి నికృన్తతి. 69

విశ్వాసయోచ్ఛావ్యపరం తత్త్వభూతేన హేతునా| బకవ చ్చిన్తయే దర్థా న్త్సింహవచ్చ పరాక్రమేత్‌. 70

వృకవచ్ఛాపి లుమ్పేత శ్యేనవచ్చ నిపాతయేత్‌| దృఢప్రహారీచ భ##వే త్తథా సూకరవ న్ననృపః. 71

చిత్రాకారశ్చ శిఖిన ద్దృఢభక్త స్తథా శ్వవత్‌| భ##వేచ్చ మధురాభాషీ సకోకిలవతన్నృపః. 72

క్షత్రియ వ్రతధర్మమును జ్ఞప్తియందుంచుకొని యుద్ధములందువెనుదిరుగకుండవలెను ; సంగ్రామములందుమరల కుండుట ప్రజలను సరిగా పాలించుట బ్రాహ్మణులను సేవించుట ఇవి రాడులకు పరమ నిః శ్రేయన (పరలోకసుఖ) సాధములు; దీనులు అనాధులు వృద్ధులు విధవలు- వీరిని కనుపెట్టి చూచుచు పాలించుటతో పాటు వారి యోగక్షేమము లకు జీవనమునకు ఏర్పాటు చేయవలెను ;రాజెప్పుడును స్వధర్మము తప్పి నడుచు వారిని దానియందు నిలుపవలెను; ముని ఋష్యాద్యా శ్రమములందలి వారికై అన్నముకు వస్త్రమునకు పాత్రలకు ఏర్పాటు చేయవలెను; వారిని సత్కార పూర్వకముగా రాజ్యములోనికి (నగరమునకు) పిలుచుకొనివచ్చి సత్కరించవలెను; వారిని సత్కరించవలెనే కాని లోక తస్కారము పొందుచుండు అట్టి పెద్దనెన్నడు నవమానించరాదు ;వారికి తాను చేయు (పరిపాలన సంబంధి) సర్వ కార్యములను (నేనిది ఇట్లు తేయుచుంటిని) నివేదించవలెను ;రాజ్యమును తను తన పరివారాదికమును కూడ (ఇది యంతయు తమ అధీనమేయని ) యత్నపరుడై నివేదించవలెను ;దేవతలనువలె వారి నర్చించవలెను; మను సంప్రదాయముననుసరించి రాజులు ఋజ్వీ (వంకరలేనిది) వక్రా (వంకరయగునది) అనురెండు ప్రజ్ఞలను (వర్తన విదానము లను ఆలోచనా నరణులను) తెలిసికొనవలెను ;కాని తాను మాత్రము ఋజ్వీ ప్రజ్ఞనే పాటించవలెను ;తాను మాత్రము సాత్త్వికము భావము నవలంభించి ఋజ్వీ ప్రజ్ఞనే ఆచరణములోనికి తీసికొనవలెను; తన ఛిద్రము (లోపము)ను ఇతరులకు తెలియనీయక పరచ్ఛిద్రమును తెలిసికొనుచు తన అవయవములను కప్పుకొనునట్లును (తప్పులను సవరించుకొనుచు) ఉండవలయును ;తను నమ్మని వానినని తాను నమ్మరాదు ;నమ్మిన వానిని కూడ మితిమీర నమ్మరాదు ;దానివలన కలుగు భయము(కీడు) వేళ్ళను కూడ నరకును (సమూలముగా నాశము కలిగించును;) వాస్తవములగు హేతువులతో ఇతరులను తాను నమ్మించవలెను ;కొంగవలె (కపట ధ్యానముతో నిశ్చ చిత్తముతో) రాజకీయ విషయములాలోచించవలయును; సింహమువలె పరాక్రమింపవలెను; తోడేలువలె దోచవలెను ;డేగవలె శత్రువులను పడగొట్టవలెను ;అడవి పందివలె గట్టి దెబ్బ కొట్టవలెను ;నెమలివలె పలువన్నెల రూపములు (వేషములోకాదు తన ప్రవర్తనములో) తాల్చవలెను ;కుక్కవలె అస్వమువలె దృఢభక్తితో నుండవలెను ;కోకిల వలె తీయగా పలుకవలెను.

రాజ్ఞో7పరీక్షితా 7న్భోజనాది నిషేధః.

కాకశఙ్కీ భ##వే న్నిత్య మజ్ఞాతవసతిం వసేత్‌| న పరీక్షితపూర్వం తు బోజనం శయనం వ్రజేత్‌. 73

వస్త్రం పుష్ప మలఙ్కారం యచ్చాన్యం మనుజోత్తమ| నన గచ్ఛేజ్జనసమాభదం న చాజ్ఞాతం జలాశయమ్‌. 74

నాపరీక్షిత పూర్వం తు పురుషై రాప్తకారిభిః| నారోహే త్కుఞ్జరం బాలం నాదాన్తం తురగం తథా.75

నా విజ్ఞాతాం స్త్రియం గచ్చే న్నైవ దేవోత్సవే వసేత్‌| నరేన్ద్ర లక్ష్మ్యా ధర్మజ్ఞ

స్త్రాతా7శ్రాంతో భ##వే న్నృపః.76

భృత్యాశ్చైవ తథా పుష్టా స్సతతం ప్రతిమానితాః| రాజ్ఞా సహాయాః కర్తవ్యాః పృథివీం జేతు మిచ్ఛతా.

రాజ్ఞస్తత్తత్కర్మసు యోగ్య పురుష నియోగక్రమః.77

యథార్హం చాప్యసుభృతో రాజా కర్మసు యోజయేత్‌| ధర్మిష్ఠా న్దర్మకారేషు సూరా న్త్సఙ్గ్రామకర్మసు. 78

నిపుణా నర్థకృత్యేషు సర్వత్ర చ తథా శుచీ & | స్త్రీషు షణ్దా న్ని యుఞ్జీ తీక్షణాన్దారుణకర్మసు. 79

ధర్మే చార్థేచ కామేచ న( భ) యేచ రవినన్దన | రాజా యథార్హం కుర్వీత ఉపధాభిః పరీక్షణమ్‌. 80

సమానితోపదా న్భృత్యా న్కుర్యా చ్ఛస్తవనేచరా& | తత్పదాన్వేషణాయత్తాం స్తదధ్యక్షాంస్తు కారయేత్‌. 81

ఏవమాదీని కర్మాణి నృపైః కార్యాణి పార్థివ | సర్వథా నేష్యతే రాజ్ఞ స్తీక్షోణపకరణక్రమః 82

అపరిచితులను త్వరగ నమ్మక కాకివలె సదాశంకతోనే ఇతరులను చూడవలెను ; ;ముందుగా ఆప్తులతో పరీక్షించక ఆహారమును తినరాదు; వస్త్రా7లంకార పుష్పాదికము ప్రయోగించరాదు ;జనసమ్మర్ధములోనికి పోరాదు; ఎరుగని నీటి తావులకు పోరాదు ;అశిక్షితమగు చిన్నవయసు ఏనుగునెక్కరాదు ;అట్టి గుర్రమునెక్కరాదు; ఎరుగని స్త్రీని కలియరాదు; దేవతోత్సవములందు నిలువరాదు; రాజు లక్ష్మీ రక్షకుడును శ్రమను లెక్కచేయనివాడును కావలయును; పృథివిని జయించుగోరు రాజు తన భృత్యులను సరిగా పోషించుచు సంమానించుచు తనకు సహాయములుగా నుంచుకొన వలయును ;*అర్హతానుసారము రాజు ఆయా పనులయందు భృత్యులను నియోగించ(పనియందుంచుకొన) వలయును. ధర్మకార్యములందు ధర్మిష్టులను యుద్ధకర్మలందు వీరులను ధనాది విశషయములందు అర్థవిషయ నిపుణులను స్త్రీల (రక్షణాదికముల) యందు నపుంసకులను దారుణకృత్యములందు తీక్షుణలను నియమించవలెను; చిత్త నిర్మలత్మము ఇందరకు అందరకు నుండవలసిన సాదారణ లక్షణము; ధర్మము అర్థము కామము భయము అను నాలుగు* ఉపధల యందు పరీక్షించిన తరువాతనే వారిని భృత్యులనుగా నియమించవలెను; ఆయా కానుకలనుతెచ్చి ఇచ్చుచుండు వనచరులను (అడవిజాతుల వారిని) రాజు అడవికి సంబంధించిన పనులకై కొలుపు నందుంచుకొని వారిలో ఎవరే యే స్థానములందు బాగుగ వెదకుచు ఆయా స్థానవిషయములను గమనించి కుపెట్టి చూచుచుందురో అట్టి పూనికగల వారిని ఆ పనులకు అధ్యుక్షులనుగా నియమించవలెను; రాజుకు ఈ మొదలగు పనులను సరిగా చేయవలెను ;ఏమయినను రాజు తీక్షోణపకరణము మునకు పూనరాదు.

పాపసాధ్యాని కర్మాణి యాని రాజ్ఞో నృపోత్తమ| సన్తస్తాని న కుర్వన్తి తస్మాన్తి తస్మాత్తాన్నాశ్రయే న్నృపః. 83

నేష్యేతే పృథివీశానాం తీక్షోణపరణక్రియా | యస్మి న్కర్మణి యస్య స్యా ద్విశేషేణ చ కౌశలమ్‌. 84

తస్మిన్కర్మణి తం రాజా పరీక్ష్య వినియోజయేత్‌ | పితృపైతామహాన్భృత్యా న్త్సర్వకర్మసు యోజయేత్‌. 85

వినా దాయాదకృత్యేమ తత్ర తే హి సమాగతాః| నియఞ్జిత మహాభాగ తస్య తే హితకారిణః.| 86

పర రాజగృహా త్ప్రాప్తాన్‌ జనసఙ్గ్రహాకామ్యయా | దుష్టాన్వా వ్యథవా7 దుష్టా న్నాశ్రయీత ప్రయత్నతః. 87

దుష్టం విజ్ఞాయ విశ్వాసం న కుర్యా త్తత్ర భూమిపః| వృత్తిం తస్యాపి వర్తేత జనసఙ్గ్రహకామ్యయా. 88

*మత్స్య- 214 అ; శ్లో 76. అసుభృతః- అసు- జీవికా- వేతనము అనునర్థముతో వాడినట్లు తోచును;

ధర్మే చార్థేచ కామేచ భ(న) యే చ రవినంద| రాజా యథార్హంకుర్వీతఉపధాభిః పరీక్షణమ్‌.

*214అ; 80 శ్లో ఉపధాభిః- రాజు తన కొలువునకు తీసికొనదలచిన వారిని వీటితో

పరీక్షించవలెను. ఇవి నాలుగు.

రాజా దేశాన్తరప్రాప్తం పురుషం పూజయే ద్భృశమ్‌| మమాయం దేశమ్ప్రాప్తో నావమానేన చిన్త యేత్‌. 89

కామం భృత్యార్జనం రాజా నైవ కుర్యా న్నృపోత్తమ| చ వా7 సంవిభక్తాం స్తా న్భృత్యా న్కుర్యా త్కథాఞ్చన. 90

శత్రవవో7గ్ని ర్విషం సర్పో నిస్త్రింశ ఇతి చిన్తయేత్‌| భృత్వా మనుజసార్దూల రుషితాశ్చ తథైకతః. 91

పాపాచరణముతో సాధింపదగు పనులను సత్పురుషులు ఆచరించరు. కావున రాజులు అట్టివాని నవలంభించ రాదు ;రాజులకు తీక్షోణపకరణ క్రియ తగదు ;అనుమాటయే ఇదియే అర్థము; ఏ పనియందెవరికి మిక్కిలి నేర్పుగలదో వారిని వానియందు పరీక్షించి నియోగించవలెను ;జ్ఞాతిసంబద్ధములగు పనులయందు కాక మిగిలిన ప్రతిపని యందును పితృపితామాహక్రమాగతులగు భృత్యులను నియమించుట మంచిది ;ఏలయన వీరు సదా రాజహితకరులుగా నుందురు ; దాయాదులు (రాజ సోదరులును రాజకుటుంబముతో సన్నిహితులగు ఇతర దాయాదులును) చేయవలసిన కొన్ని పనుల యందు మాత్రము వారే- దాయాదులే - బాగుగ ఇమిడి పోవుదురు ;వానిని ఇతరులు ఆచరించుట సముచితముగాదు ;జనులను తన వైపునకు త్రిప్పుకొని తనలోనికి చేర్చుకొను కోరిక యున్నను పరరాజ గృహము నుండి వచ్చి వారిని మాత్రము- వారు దుష్టులైననను అదుష్టులైనను- ఆశ్రయుంచరాదు ; వారిని విడుచుటకే యత్నించవలయును ;వారిలో దుష్టని గుర్తించవలెను; అట్టి వానిని రాజు నమ్మకుండవలెను ;అట్టివానిని కూడ రాజు

జీవనవృత్తి నేర్పాటు చేసి జనులకు తన వైపున నుంచుకొన యత్నించవలెను; అంతేకాదు

;దేశాంతరము నుండి వచ్చిన వానినని రాజు మిక్కిలి గౌరవించవలెను ;వీడు గతిలేక నా దేశమునకు వచ్చినాడు లెమ్మను అవమాన దృష్టితో ఆలోచించరాదు ;రాజెన్నడును అధిక సంఖ్యలో భృత్యులను నియమించుకొనరాదు ;వారిలో బాగుగ పలిచేసిన వారిని బహుమానించకుండరాదు ;ఏలయన రాజునకు శత్రువులు -అగ్ని- విషము-ఖడ్గము (మొదలగు ఆయుధములు) సర్పములు -ఇవన్నియును ఒక ఎత్తు; కోపించిన భృత్యులు

ఒక ఎత్తు;( కావున వారినికోపింపజేయరాదు.)

రాజ్ఞశ్చార నియోగక్రమః

తేషాం చారేణ చారిత్రం రాజా విజ్ఞాయ నిత్యశః| గుణినాం పూజనం కుర్యా నన్నిర్గుణానాం చ శాసనమ్‌. 92

కథితా స్సతతం రాజ న్రాజాన శ్చారచక్షుషః| స్వకే దేశే వరే దేశే జ్ఞానశీలా న్విచక్షణా &.93

అనాహార్యా న్ల్కేశసహా న్నియఞ్జిచ సదా చరా& | జనస్యావిదితా న్త్సౌమ్యాం స్తతా జ్ఞాతా న్పరస్పరమ్‌. 94

వణికో మన్త్రకుశలా న్త్సాంత్సరచికిత్సకా &| తతా ప్రవ్రజితాకారం శ్చారా న్రాజా

నియోజయేత్‌. 95

నైకస్య రాజా శ్రద్ధద్యా చ్చారస్యాపి సుభాషితమ్‌| ద్వయోస్సమ్బన్ధమాజ్ఞాయ శ్రద్ధధ్యా న్నృపతి(స్స) స్తదా. 96

పరస్పరస్యావిదితౌ యది స్యాతాం చ తా పుభౌ| తస్మా ద్రాజా ప్రయత్నేన గుఢాం స్చారా స్ప్రయోజయేత్‌. 97

రాజ్ఞశ్చ మూల మేతావ ద్యా రాజ్ఞ శ్చారదృష్టితా | చరణా మపి యత్నేన రాజ్ఞా కార్యం పరీక్షణమ్‌. 98

రాగాపరాగౌ భృత్యానాం జనస్య చ గుణాగుణమ్‌| సర్వం రాజ్ఞాం చరాయత్తం తేషు యత్నపరో భ##వేత్‌. 99

కర్మణా కేన మే లోకే జన స్సర్వో7ను రజ్యతే| విరజ్యతే కేన తథా విజ్ఞేయం తన్మహీక్షితా. 100

అననురాగకరం లోకే తచ్చ కార్యం మహీక్షితా| విరాగజనసంసర్గో వర్జనీయః ప్రయత్నతః. 101

జారానురాగ ప్రభవా హి లక్ష్మ్యో రాజ్ఞాం మతా భాస్కరవంశచన్ద్ర| తస్మాత్ర్పయత్నే నరేన్ద్రముఖ్యైః కార్యో 7నురాగో భువి మానవేషు. 102

ఇతి శ్రీమత్స్య మహాపురాణ రాజధర్మే రాజ్ఞస్సహాయసమ్పత్త్యాది కథనం నామ చతుర్దశోత్తర ద్విశతతమోధ్యాయః

రాజు సర్వదా చారుల ద్వారమున భృత్యుల నడువడిని గురైరిగి వారిలో సద్గుణులను గౌరవించుచు గుణహీనులను శాసించుచు ఉండవలయును; మనురాజా! రాజులు చారచక్షులు( తారులే కన్నులుగా కలవారు;)అని శాస్త్రములందు చెప్పబడినది; తన దేశమునందును పరదేశమునందును జ్ఞానశీలురు విచక్షుణులు నిరాడంబర వేషులు క్లేశనహులునగు చరు లను నియోగించవలయును; వారు జనులకు తెలియబడక సౌమ్యులై పరస్పరములు మాత్రము తెలిసియుండవలెను ;వణిజు లను నియోగించవలెను; గూఢచారుడొక్కడే చెప్పినది సుభాషితమేయైనను (విశ్వసనీయమే యైనను) నమ్మరాదు ;ఇరువురు మాటలలోని పరస్పర సంబంధము వానిలోని ఐకమత్యము ను ఎరిగి అది సరిపోయిన వారి మాటలను నమ్మవలెను ;అట్టి వారిరువును పరస్పరమెరుగనివారైనను సరియే; కావున రాజు ప్రయత్నములో చారులను గూఢులనుగా చూచి నియోగించవలెను ;ఏమయిననను రాజులు చారులే తమ కన్నులుగా నుండుట రాజునకు క్షేమమూలము ;ఈ చరులను కూడ రాజు యత్న పూర్వకముగా పరీక్షించవలెను ;భృత్యులు కాని రాజ్యజనులు (ప్రజలు) కాని రాజునందు రక్తులో విరక్తులో వారు సద్గుణులో దుర్గుణులో తెలియుట మొదలగునవి చారాధీనము కావున వారి విషయమున రాజు ఎచ్చరిక కలిగియుండవలెను ;రాజ్యమందలి జనులును భృత్యులును నా విషయమందు ఏ హేతువుచే రక్తులగుచున్నారు? ఏ హేతువుచే విరక్తులగుచున్నారు? అనునది రాజులెరుగుచుండవలెను ;అనురాగకరమగు పనులు చేయుచుండవలెను ;విరక్తులగు జనులతోడి సంబంధమును ప్రయత్నముతో విడువవలయును ;భాస్కర వంశచంద్రా మనూ! రాజులకు లక్ష్ములు జనులకు తనయందు గల యనురాగము వలే సిద్ధించును. కావున నరేంద్ర ముఖ్యులు హృదయములలో తనయందనురాగము కలుగజేసికొన యత్నించవలెను.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజ ధర్మ ములందు సహాయ సంపత్త్యాది కథనమను

రెండు వందల పదునాలుగవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters