Sri Matsya mahapuramu-2    Chapters   

వింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- దైవపూరుషకార తారతమ్య విచారః.

మనుః దై వే పురుషకారేచ కిం జ్యాయ స్తద్బ్రవీహి మే |

ఆత్ర మే సంశయో దేవ చ్ఛేత్తు మర్హస్య శేషతః. 1

శ్రీమత్స్యః: స్వమేవ కర్మ దైవాఖ్యం విద్ధి దేహా న్తరార్జితమ్‌ |

తస్మా త్పౌరుష మేవేహ శ్రేష్ఠ మాహుం ర్మనీషిణః. 2

ప్రతికూలం తథా దైవం పౌరుషేణ విహన్యతే | మఙ్గళాచారయుక్తానాం నిత్య ముత్థానశాలినామ్‌. 3

యేషాం పూర్వకృతం కర్మ సాత్త్వికం మనుజోత్తమః |

పౌరుషేణ వినా తేషాం కేషాంచి ద్దృశ్యతే ఫలమ్‌. 4

కర్మణా ప్రాప్యతే లోకే రాజసస్య తథా ఫలమ్‌ | కృచ్ఛ్రేణ కర్మాణా విద్ధి తామసస్య తథా ఫలమ్‌. 5

పౌరుషేణాప్యతే రాజ న్ప్రార్థితవ్యం ఫలం నరైః | దైవమేవ విజానన్తి నరాః పౌరుషవర్జితాః. 6

తస్మా త్త్రికాలసంయుక్తం దైవంతు సఫలం భ##వేత్‌ | పౌరుషం దైవసమ్పత్త్యా కాలే ఫలతి పార్థివః. 7

దైవం పురుషకారశ్చ కాలశ్చ మనుజోత్తమ | త్రయం మేత న్మనుషస్య పిణ్డితం స్యా త్పలావహమ్‌. 8

కృషివృష్టిసమాయోగాద్‌ దృశ్యన్తే ఫలసిద్ధియః | తాశ్చ కాలే ప్రదృశ్యన్తే నై వాకాలే కథఞ్చన. 9

తస్మా త్సదైవ కర్తవ్యం సధర్మం పౌరుషం నృభిః | విపత్తావపి యస్యేహ పరలోకే ఫలం ధ్రువమ్‌. 10

నాలసాః ప్రాప్నువన్త్యర్థ్యా న్న దైవపరాయణాః | తస్మా త్సర్వప్రయత్నేన ఆచరే ద్దర్మముత్తమమ్‌. 11

త్యక్త్వా7లసా న్దైవపరా న్మనుష్యా నుత్థానయుక్తా న్పురుషా& హి లక్ష్మీః |

అన్విష్య యత్నా ద్వృణుయా న్నృపేన్ద్ర తస్మా త్సదోత్థానవతా హి భావ్యమ్‌. 12

ఇతి శ్రీమత్స్య మహాపురాణ రాజధర్మే దైవపురుషకార తారతమ్యవిచారో నామ

వింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ఇరువది అధ్యాయము.

దైవ- పురుష కారముల తారతమ్య విచారము.

"దైవ పురుషకారములలో ఏది మేలైనదో నాకు తెలుపుము; దేవా! ఈ విషయము నాకు కలిగిన సంశయము చేదింప వేడుచున్నాను;" అనిన మనువుతో మత్స్యుడిట్లనెను; దేహాంతరార్జితమగు స్వకర్మఫలము దైవమనబడునని ఎరుగుము. కనుక ఇందు మానుషమే (పౌరుషము- పురుషకారము) గొప్పదని మనీషులందరు ఇంతేకాదు; ప్రతి కూలదైవమును పౌరుషముతో విహతమగును; పురుషకారము సరిగనున్నచో దురదృష్టము కూడ అదృష్టముగా మారి ఫలము నిచ్చును. శుభము నాచరించు వారును నిత్యమును ప్రయత్నపరులునునగు కొందరకు ఈ జన్మమందు పౌరుషము (పురుషయత్నము) లేకయే ఫలము కనబడుచున్నదనినచో వారి పూర్వజన్మ కృతకర్మము సాత్త్వికమయి ఫలమునిచ్చినది. అని అర్థము; పురుషకార (కర్మ)ముతో ఫలము కనబడువారి పూర్వజన్మ కృతకర్మము (దైవము) రజోగుణ ప్రధానమయి యుండును; ఎంతో శ్రమతో చేసిన పురుషకారముతో ఫలము కలిగినవారి పూర్వజన్మ కృతకర్మము తామసము (తమోగుణప్రధానము) అయియుండును; రాజా! నరులు తమ ప్రార్థిత ఫలమును పురుషకారముతోనే పొందుదురు; అయినను పౌరుష (పురుకార- పురుషయత్న) రహితులగువారు(సోమరులు) దైవమును మాత్రమే గొప్పదిగా ఎరుగుదురు( భావింతురు). కావున ఇట్లు త్రికాల (కృతపురుషకార) సంయుక్తమగు దైవము మాత్రమే సఫలమగును; పురషకారము దైవసంపత్తితో కూడినడై ఫలించును ; మనుజోత్తమా! దైవమును పురషకారమును కాలమును- మూడును కలిసియే మనుష్యునకు ఫలము కలిగించును; కృషియు వర్షమును కలిసినచో ఫల(పంటల) సిద్ధులు కనబడుచున్నవి; అవియును కాలమునందే కాని అకాలమందెప్పుడును కావుకదా! కావున మానవులెప్పుడు ను ధర్మయుక్తమగు పురుషకారము నాచరించుచుండవలయును. ఆపదలయందును ఇంట్లుండు వానికి ఇహపరములు రెండును నిశ్చయముగా ఫలము చేకూర్చును; అలసులును దైవపరాయణులను ఫలము నందజాలరు. కావున కర్వ (ప్రతి యొక విధమగు) యత్నముతో ధర్మమాచరించవలయును. నృపేంద్రా! లక్ష్మి అలసులను దైవపరులను విడిచి ఉత్థాన (నింరతర ప్రయత్న) పరులను మాత్రము వెదకి యత్న పూర్వకముగా వరించును; కావున సదా ఉత్థాన (నిరంతరోద్యోగ- నతత యత్న) పరుడు కావలయును . దైవము= అదృష్టము.

ఇది శ్రీమత్స్యమహాపురాణమున రాజధర్మమున దైవపురుషకార తారతమ్య విచారము అను రెండు వందల ఇరువదవ అధ్యాయము.

Sri Matsya mahapuramu-2    Chapters