Sri Matsya Mahapuranam-2    Chapters   

అష్టావింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- అద్భుతానాం ఫలం తచ్ఛాన్తిశ్చ.

మనుః : అద్భుతానాం ఫలం దేవ శమనం చ తథా వద| యథా వేత్స్యా మ్యహం సమ్యక్ప్రబ్రూహి వదతాం వర. 1

మత్స్యః : అత్ర తే కీర్తయిష్యామి యదువాచ మహాతపాః| అత్రయే వృద్ధగర్గస్తు సర్వధర్మభృతాం వరః. 2

సరస్వత్యాం సమాసీనం గర్గం స్రోతసి పార్థివ | పప్రచ్ఛాత్రి ర్మహాతేజా గర్గం మునిజనప్రియమ్‌. 3

అత్రిః నశ్యతాం పూర్వరూపాణి జనానాం కథయస్వమే| నగరాణాం చ తథా రాజ్ఞాంత్వం హి సర్వవిదుత్తమః. 4

గర్గః పురుషాపచారా న్నియత మపరజ్యన్తి దేవతాః| తతో 7పరాగాద్దేవానా ముపసర్గః ప్రవర్తతే. 5

దివ్యాన్తరిక్షభౌమంచ త్రివిధం పరికీర్తితమ్‌| గ్రహరక్ష వైకృతం దివ్యమాంతరిక్షం నిబోధ మే. 6

ఉల్కాపాతో దిశో దాహః పరివేష స్తథైవ చ | గన్ధర్వనగరం చైవ వృష్టిశ్చ వికృతా చ యా. 7

ఏవమాదీని లోకే7 స్మి న్నాన్తరిక్షం చ నిర్దిశేత్‌| చరస్థిరభవం బౌమంభూకమ్ప మపి భూగతమ్‌. 8

జలాశయానాం వికృతం భౌమం తదపి కీర్తితమ్‌| భౌమేచాల్పఫలం జ్ఞేయం చిరిణౖవ విపచ్యతే. 9

అభ్రజం మధ్యఫలదం శాన్త్యా చైవోపశామ్యతి| అద్భుతేతు సముత్రన్నే యది వృష్టి శ్శివా భ##వేత్‌. 10

సప్తాహాభ్యన్తరే జ్ఞేయ మద్భుతం నిష్ఫలం భ##వేత్‌| అద్భుతస్య వికార్య వినాశాన్త్యానదృశ్యతే. 11

త్రిభి ర్వర్షై స్సమా జ్ఞేయం సుమహ ద్బయకారకమ్‌| రాజ్ఞ శ్శరీరే లోకస్య పురేద్వారే పురోహితే. 12

పాక మాయాతి పుత్త్రేషు తథా వై కోశవాహనే|

రెండు వందల ఇరువది ఎనిమిదవ అధ్యాయము.

దేవా! అద్భుతములు కనబడినచో వాలని వలన కలుగు ఫలమును వానికి జరుపవలసిన శాంతిని నాకు బాగుగా తెలియునట్లు లెస్సగా ప్రవచింపుము. ఏలయన -నీవు అయా విషయములను బాగుగు చెప్పగలవారిలో ఉత్తముడవు; అనిన మనువునకు మత్స్యరూపుడగు జనార్ధనుడిట్లు చెప్పెను. ఈ విషయమున సర్వధర్మ తత్త్వవేత్తలలో ఉత్తముడగు మహాతపస్వి వృద్ధగర్గుడు అత్రికి చెప్పిన దానినే నీకు తెవిపెదను: మనురాజా! పూర్వము సరస్వతీ నదీ ప్రవాహ (తీర) మున లెస్సగా కూర్చుండిన ముని జనప్రియుడగు గర్గుని మహాతేస్వియగు అత్రి ఇట్లడిగెను: సర్వజ్ఞోత్తముడవగు గర్గా! జనులోనగరములో రాజులో నశించుటకు పూర్వ రూపములు (నాశము సూచించు నిమిత్తములు) ఏవియో నాకు చెప్పుము; అన గర్గుడిట్లనెను: జనుల అపచారముచే దేవతలా గ్రహింతురు; దానిచే ఉపద్రవములు జరుగును; నిమిత్తములు దివ్యములు అంతరిక్షములు భౌమములునని మూడు విధములు; గ్రహ నక్షత్రములయందు కనబడు వికృతి దివ్యము (ద్యులోకసంబంధి;)ఉల్కలు పడుట దిక్కులు మండునట్లు కనబడుట గంధర్వ నగరములు (పట్టణములవంటివి మేఘ(మండలమున కనబడుట) వికృతములగు వానలు ఈ మొదలగునవి అంతరిక్షములు; భూమిపై నుండు చరస్థిర ప్రాణి పదార్థ జాతమందు కనబడు వికారములు భౌమములు; భూకంపములు జలాశయములు వికారము కూడ భౌమమే; భౌమాద్భుతముల వలన కలుగు ఫలమల్పము; అదియు శాంతులచే శమించును; ఇదికాక దివ్యాద్భుతములు కనబడిన ఏడు దినములకు లోగా శుభకరమగు (వికృతులులేని) వాల కురిసినచో ఆ అద్భుతము దుష్ఫలితము నీయజాలదు; దివ్యాద్భుతములకు శాంతి జరుపనిదే దాని దుషల్శము శమించదు; దానిచే అది కనబడిన మూడు సంవత్సరములకులోగా రాజుకో పురద్వారమందో రాజ పురోహితునకో రాజపుత్త్రులకో కోశమునకో వాహనములకో హాని సంభవించును.

ఋతుస్వబావా ద్రాజేన్ద్ర భవన్త్యద్భుతంసంజ్ఞితాః. 13

శుభావహాస్తే విజ్ఞేయా స్తాంశ్చ మే గదత శ్శృణు | వజ్రాశని మహీకమ్పనన్ద్యానిర్ఘాతనిస్స్వనాః. 14

పరివేషో రజోధూమో రక్తార్కా స్తమయోదయాః| ద్రుమేభ్యో భవతి స్నేహోబహుశస్సుఫలాద్రుమాః. 15

గోపక్షి మధువృద్ధిశ్చ శుభాని మధుమాధువే | తథోల్కాపాతకలుషం కపిలార్కే న్ధుమణ్డలమ్‌. 16

అనగ్ని జ్వలనం స్ఫోటో ధూమరేణ్వనిలాహతమ్‌| పద్మరక్తారుణా సన్ధ్యానభః క్షుభార్ణవోపమమ్‌. 17

సరితాం చామ్బుసంశోషం దృష్ట్వా గ్రీష్మే శుభం వదేత్‌| శక్రాయుధం పరీవేషవిద్యుదుల్కాధిరోహణమ్‌. 18

కమ్పోద్వర్తన వైకృత్యం హసనం దారుణం క్షితేః| నద్యో(ద్యు) దపానసరసాం విధూనతరణప్లవాః. 19

శృఙ్గిణాంచ వరాహాణాం వర్షాసు శుభ మిష్యతే| శీతానిలతుషారత్వం నర్ద(ర్త) నం మృగపక్షిణామ్‌.20

రక్షోభూతపిశాచానాం దర్శనం వాగమానుషీ| దిశో ధూమాన్ద కారాశ్చ సనభోవనపర్వతాః. 21

ఉచ్చై స్సూర్యోదయాస్తౌచ హేమన్తే శోభనాః| స్స్మృతాః| దేవ గన్ధర్వ స్త్రీరూప విమానద్భుతదర్శనమ్‌. 22

గ్రహనక్షత్రతారాణాం దర్శనం వాగమానుషీ| గీతవాదిత్రనిర్ఘోషో వనపర్వత సానుషు. 23

సస్యవృద్ధీ రసోథ్పత్తి శ్శరత్కావే శుభావహాః| హిమపాతానిలోత్పాత విరూపాద్భుత దర్శన మ్‌. 24

కృష్ణాఞ్జనాభమాకాశం తారోల్కాపాతపిఞ్జరమ్‌| చిత్రగర్భోద్భవః స్త్రీషు గో 7జాశ్వ మృగపక్షిషు. 25

పత్రాఙ్కురలతానాంచ వికారా శ్శిశిరే శుభాః| ఋతుస్వబావేన వినా 7ద్భుతస్య జాతస్య దృష్టస్య చ శీఘ్రమేవ. 26

కుర్యా చ్ఛుభాం శాన్తి మనన్తరంచ శుభాం యథోక్తాం వసుధా7దిపేన. 26u

ఇతి శ్రీ మత్స్య మహాపురాణ గర్గాత్రిసంవాదే అద్భుతశాన్త్యాది కథనం నామ

అష్టావింశత్యుత్తర ద్విశతతమో7ధ్యాయః.

ఋతు స్వభావముననుసరించి కనబడుట అద్భుతములు కొన్ని కలవు; అందు శుభములయినవి తెలిపెదను; వినుము; వసంత ఋతువున పిడుగులు పడుట భూకంపములు సంధ్యలయందలి ఉరుములు పరివేషములు ధూళి ధూమ వ్యాప్తి అర్కోదయాస్తమయములు ఎర్రగ నుండుట చెట్లనుండి నూనెలు జిగురులు కారుట చెట్లు అధికముగ కాయుట పండ్లు పండుట- గోపక్షి మధు (తేనె) వృద్ధి- ఇవి శుబావహములు; గ్రీష్మ ర్తువున ఉల్కాపాతములు రవి చంద్ర మండలములు కపిల వర్ణములగుట అగ్ని లేక మంటలు -భూమి బ్రద్దలగుట (చీలుట) గాలి ధూళి దుమారము సంధ్యాకాంతులు తారలు పూరేకులు కాంతితో కనబడుట ఆకాశము కల్లోలిత సముద్రమువలె కనబడుట జలాశయములయందలి నీరు ఎండుట- ఇవి శుభావహములు; వర్షర్తువునందు ఇంద్ర ధనుస్సులు పరివేషములు మెరుపులు ఉల్కలు అధికమగుట కొమ్ములు గల ప్రాణు లును పందులును వణకుటయు ఒడలు పొరలించుకొనుటయు ఉత్సాహముతో ధ్వనులు చేయుటయు భూమి ఉబ్బుట- పెల్లలు విరిగుట నదులందును బావులందును చెలమలందును చెరువులందును సరస్సులందును నీరు అధికముగా కదలి యాడుటయు వస్తువులు నీటిపై తేలియాడుటయు కొట్టుకొనిపోవుచుండుటయు శుభములు; హేమంతర్తవునందు చల్లని గాలులు మంచు అధికముగుట మృగములు పక్షులు గట్టిగ ధ్వనితేయుట రక్షోభూత పిశాచములు కనబడుట అమానుష వాక్కు వినబడుట దిక్కులును అకాశవన పర్వతములును ధూమాంధకార వ్యాప్తములగుట వన పర్వతాములాకాశముతో కలిసినట్లు కనబడుట సూర్యోదయాస్తమయములు ఎక్కువ భేదముతో వ్యత్సాయసముతో కనబడుట- ఇవి శుభావహాములు; శరదృతువునందు దేవస్త్రీ గంధర్వ రూపములును విమానములనును మొదలగు అద్భుదములాకాశమున కనబడుట గ్రహ నక్షత్ర తారలధికముగా కనబడుట అమానుష వాక్కు వినబడుట వనములందును పరర్వత సానువులందును గీతవాదిత్ర

*కృష్ణశ్వేతంతథాపీతం ధూసరధ్వాన్తలోహితమ్‌.

ధ్వనులు వినబడుట సస్య వృద్ధి రసోత్పత్తి- ఇవి శుభకరములు; శిశిర ఋతువునందు హిమపాతముతో పెనుగాలులు వికృత రూపములు కనబడుట అకాశము వలె నల్లనై కనబడుట పంజర వర్ణముతో ఉల్కలు తారలు రాలుట మానవ స్త్రీలయందును గోవులు మేకలు అశ్వములు జింకలు పక్షులు- వీనియందును విచిత్ర గర్భోత్పత్తి పత్రాంకుర లతలయందు వింత మార్పులు శుభకరములు; ఇట్టి ఋతు స్వభావమునకు విరుద్ధములగు అద్భుతములు కనబడినచో వెంటనే శీఘ్రముగా రాజు వీని అశుభ ఫలమును శమింపజేయు శాంతిని జరిపించవలయును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధర్మమున శుభాద్భుత దర్శన కథనమును అద్భుత ఫల తచ్చాంతియునను రెండు వందల ఇరువది ఎనిమిదివ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters