Sri Matsya Mahapuranam-2    Chapters   

త్రింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

రాజధర్మాః- అగ్ని వైకృతశాన్తిః.

గర్గః అగ్ని రాదీప్యతే యత్ర రాష్ట్రే భృశ మనిన్దనః| న దీప్యతే చేన్దనవాం స్తద్రాష్ట్రం పీడ్యతే నృపైః. 1

*ప్రజ్వలే చ్చామ్బూనా సేకా త్తదార్ద్రం వాపి కిఞ్చిన| ప్రాకారం తోరణం ద్వారం నృపవేశ్మ సురాలయమ్‌. 2

ఏతాని యత్ర దీప్యన్తే తత్ర రాజభయం భ##వేత్‌| విద్యుతా వా ప్రదహ్యాన్తే తత్రాపి నృపతే ర్భయమ్‌. 3

అనైశాని తమాంసి స్యుర్వినా పాంసురజాంసి చ| ధూమ శ్చానగ్నిజో యత్ర తత్ర విన్ద్యా న్మహ ద్భయమ్‌. 4

తడి ద్వినాభ్రం గగనే నైశేవా ఋక్షవర్జితే| దివా నతారే గగనే తథైవ భయ మాదిశేత్‌. 5

గ్రహనక్షత్రవైకృత్యే తారావికృతదర్శన్‌| పురవాహనయానేషు చతుష్పా న్మృగపక్షిషు. 6

స్వభావాద్వాపి హీయతే ధేనువత్సాదికం చ యత్‌| ఆయుధేషు చ దీప్తేషు ధూమాయస్తు తథైవ చ. 7

నిర్గమత్సు చ కోశాచ్చ సఙ్గ్రామ స్తుములో భ##వేత్‌| వినా7గ్నిం విస్ఫులిఙ్గాశ్చ దృశ్యన్తే యత్ర కర్హిచిత్‌. 8

అనారోప్యాభిపూర్యన్తే ధసూంషి వికృతాని చ| వికారాశ్చాయుధానాం చ తత్ర సఙ్గ్రామ మాదిశేత్‌. 9

త్రిరాత్రో పోషిత స్తత్ర పురోధా స్సుసమాహితః| సమిద్భిః క్షీరవృక్షాణాం నర్షపైశ్చ ఘృతేనచ. 10

హోమం కుర్యా దగ్నిమన్రై ర్బ్రహ్మణాంశ్చైవ భోజయేత్‌| దద్యా త్సువర్ణం చ తథా ద్విజేభ్యో గాశ్చైవ వస్త్రాణితథా భువం చ. 11

*ప్రజ్వలే దప్సు మాంసం వా

ఏవం కృతే పాప ముపైతి నాసం యదగ్ని వైకృత్యభవం ద్విజేన్ద్ర.

ఇతి శ్రీమత్స్య పురాణ రాజధర్మే అగ్నివైకృత్యశాన్తికథనం

నామ ఏకోనత్రింశదుత్తరద్విశతతమో7ధ్యాయః.

రెండు వందల ముప్పదవ అధ్యాయము.

అగ్నివైకృతశాంతి.

గర్గుడు అత్రితో ఇట్లు చెప్పెను: ఏ రాష్ట్రమునందు ఇంధనములు లేకయే అగ్ని మండునో ఇంధనములుండియు అగ్ని జ్వలించదో ఆ రాష్ట్రమున శత్రు రాజులచే పీడ కలుగును ;నీటితో తడిపిన వస్తువులును వచ్చి వస్తువులును మండుటయు మెరుపుల నుండి నిప్పింటుకొని వస్తువులు కాలుటయు జరిగినతో రాష్ట్రపు రాజునకు భయము గలుగును ;రాత్రి కాకయే ధూళి రేగకయే చీకట్లు క్రమ్ముట అగ్ని లేకయే పొగ క్రమ్ముట జరిగినచో మహాభయము కలుగును ;ఆకాశమున మేఘము లేకయే మెరుపులు కనబడుట రాత్రి గగనమున నక్షత్రములు కనబడుకుండుట పగలు ఆకాశమున నక్షత్రములు కనబడుట జరిగినను భయము కలుగును; గ్రహ నక్షత్ర తారలయందు పుర వాహనయాన చతుష్పాత్‌ మృగపక్షులందును స్వభావ విరుద్ధమలగు వైకృతములు కనబడినను ఆవులు దూడలు మొదలగునవి అస్వాభావికముగ ప్రవర్తించినను ఆయుధములు మండినను పొగలు క్రమ్మినను ఒరలనుండి తమంతతాము వెలికివచ్చినను యుద్ధము సంభవించును ;అగ్ని లేకయే నిప్పురవ్వలు రేగినను ఎక్కుపెట్టకయే తమంతతామే ధనువులు పూరింపబడినను ఇట్టి వికృతములింకము ధనువుల యందును ఆయుధములందును కనబడినను యుద్ధమగును.

ఇట్టి సందర్భములలో పురోహితుడు మూడునాళ్ళుపవసించి సుసమాహితుడై పాలుగల వృక్షముల సమిధలతోను ఆవలతోను నేతితోను అగ్ని దేవతాక మంత్రములతో హోమము చేయవలెను ;బ్రహ్మణులకు భోజనమును గోభూసువర్ణ వస్త్రదానమును జరుపవలయును ;ఇట్లు చేయుటచే అగ్ని వైకృతోపద్రవము శాంతించును.

ఇది శ్రీ మత్స్య మహాపురాణమున రాజధ్మమున అగ్నివైకృత శాంతి కథనమను

రెండు వందల ముప్పదియవ అధ్యాయము.

Sri Matsya Mahapuranam-2    Chapters